
లక్నో/అగర్తలా: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరగనున్న ఉప ఎన్నికలు ప్రతిపక్ష ఇండియా కూటమికి తొలి పరీక్షగా నిలిచాయి. ఇండియా కూటమి కొన్ని చోట్ల ఉమ్మడిగా పోటీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల పరస్పరం పోటీపడుతున్నాయి.
యూపీలోని ఘోసి, జార్ఖండ్‌లోని డుమ్రి, త్రిపురంలోని ధన్‌పూర్, బొక్సానగర్, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ఉమ్మడిగా అభ్యర్థులను బరిలోకి దించింది. పశి్చమబెంగాల్‌లోని ధుప్‌గురి, కేరళలోని పుత్తుపల్లిల్లో ఇవే కూటమి పారీ్టలు పరస్పరం తలపడుతుండటం గమనార్హం. ధుప్‌గురిలో టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 8న ఉటుంది.