కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. పాక్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో భారత్‌ ఫైటర్‌ జెట్‌లు | Fighter Jets Landing In 1st Night Landing Airstrip On Ganga Expressway In Up | Sakshi
Sakshi News home page

కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. పాక్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో భారత్‌ ఫైటర్‌ జెట్‌లు

Published Fri, May 2 2025 1:18 PM | Last Updated on Fri, May 2 2025 3:49 PM

Fighter Jets Landing In 1st Night Landing Airstrip On Ganga Expressway In Up

లక్నో: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌కు కేవలం వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ గంగా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఫైటర్‌ జెట్‌లు విన్యాసాలు చేయడం చర్చాంశనీయంగా మారింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్నయుద్ధ విమానాల్లో రాఫెల్, మిగ్-29, మిరాజ్ 2000 ఉన్నాయి. ఈ యుద్ధ విమానాల్ని రాత్రి వేళ్లల్లో ల్యాండ్‌ చేసేలా అందుబాటులోకి తెచ్చిన యూపీ షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించిన నైట్ ల్యాండింగ్ స్ట్రిప్‌పై విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి.  

3.5 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎయిర్‌స్ట్రిప్ రాత్రి సమయంలో ఫైటర్‌ జెట్‌లు ల్యాండింగ్‌లకు అనుకూలంగా ఉంటుంది.  ఇది ఎయిర్ ఫోర్స్ జెట్లు 24 గంటలూ ఆపరేషన్లకు వీలు కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రత్యామ్నాయ రన్‌వేగా ఉపయోగించగల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది.

దీంతో, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం నాలుగు ఎక్స్‌ప్రెస్‌వే ల్యాండింగ్ స్ట్రిప్‌లు అందుబాటులో ఉండగా.. షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్‌ స్ట్రిప్‌ మాత్రమే రాత్రివేళల్లో ఫైటర్‌ జెట్‌లను ల్యాండ్‌ చేసుకోవచ్చు. ఈ ఆధునిక ఎయిర్‌స్ట్రిప్ ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించబడిన భారత్‌లో తొలి రన్‌వేగా నిలిచింది. ఇది రాత్రింబవళ్ళూ మిలిటరీ ఆపరేషన్లకు అనుకూలంగా రూపొందించింది. భద్రతను నిర్ధారించేందుకు రన్‌వే ఇరుప్రక్కల 250 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

 

గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండింగ్ చేసే ఇండియన్‌ ఎయిర్స్‌ యుద్ధ విమానాల ప్రత్యేకతలు  

రాఫెల్: ఆధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్, లాంగ్-రేంజ్ మీటియర్ క్షిపణులతో నిండి ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే 100 కిలో మీటర్ల నుంచి 150 కిలోమీటర్ల శత్రు స్థావరాల్ని నేలమట్టం చేయడంలో దిట్ట

ఎస్‌యు-30 ఎంకేఐ: ఇండియా-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్-సీటర్ యుద్ధవిమానం. ఈ ఎస్‌యూ-30 ఎంకేఐ దూరంలో ఉన్న లక్ష్యాల్ని దాడులు చేయగలిగే సామర్థ్యంతో పాటు బ్రహ్మోస్ వంటి క్షిపణులను మోసుకెళ్లగలదు.

మిరాజ్ 2000: ఫ్రెంచ్ మూలాలున్న, హై-స్పీడ్ డీప్ స్ట్రైక్ మిషన్స్‌కు అనువైన యుద్ధవిమానం, ఇది అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను  వినియోగించింది.

మిగ్-29: వేగం, ఎత్తు పరంగా అత్యుత్తమ ప్రదర్శనతో పాటు రాడార్‌ల కళ్లుగప్పి శుత్రు స్థావరాల్ని నాశనం చేస్తుంది.  

ఉత్తర ప్రదేశ్ లోని  సహారన్‌పూర్ వద్ద యుద్ధ విమానాల విన్యాసాలు

జాగ్వార్: గ్రౌండ్ అటాక్, యాంటీ-షిప్ మిషన్ల కోసం రూపొందించబడిన ప్రిసిషన్ స్ట్రైక్ ఎయిర్‌క్రాఫ్ట్. దీని ప్రత్యేకతలు.. శత్రు నౌకలను గుర్తించడం, లక్ష్యంగా చేసుకోవడం, నాశనం చేస్తుంది. ఈ యాంటీ-షిప్ మిషన్లు సాధారణంగా విమానాలు, జలాంతర్గాములు, ఉపరితల నౌకలు లేదా నావికా ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఉపయోగిస్తారు.  

సి-130 జె సూపర్ హెర్కులిస్: హెవీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, స్పెషల్ ఫోర్స్ మిషన్లు, విపత్తు సహాయం,  రక్షణ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.

ఏఎన్-32: ఎత్తైన ప్రాంతాల్లో సైనికులు, సరఫరాలు తరలించేందుకు అనుకూలమైన ట్రాన్స్‌పోర్ట్ విమానం.

ఎంఐ-17 వి5 హెలికాప్టర్: సెర్చ్ అండ్ రిస్క్యూ, మెడికల్ ఎవాక్యుయేషన్, మానవతా సహాయం వంటి బహుళ పనుల కోసం ఉపయోగించే హెలికాప్టర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement