
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పహల్గాం దాడిపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్.. పాక్ బుద్ధి చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు,భద్రతా బలగాలు హైఅలెర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దులో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అందుకు పాక్ కుట్రలే కారణమని భద్రతా ఏజెన్సీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
గూఢాచార సంస్థలు (Intelligence agencies) సమాచారం మేరకు..ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు, పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ సైనికులు మొహరించినట్లు గుర్తించాయి. కాబట్టే బంగ్లాదేశ్ సరిహద్దులో మరింత అప్రమత్త అవసరమని భద్రతా ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి.
సైనిక చర్యతో పాటు బంగ్లాదేశ్‌తో పాటు ఆ దేశ రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్‌లతో పాక్ సన్నిహిత సంబంధాల్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తద్వారా భారత్‌లో అల్లర్లు సృష్టించే దిశగా కుట్రకు తెరతీసినట్లు సమాచారం. అలా భారత్‌లో వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలకు సిద్ధమైనట్లు పలు ఆధారాల్ని సేకరించాయి.
ఇటీవల బంగ్లాదేశ్‌కు సరిహద్దు ప్రాంతమైన పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్ జిల్లాల్లో వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లలో బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆ అల్లర్లలో ముగ్గురు పౌరులు మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్లీ అలజడులు జరిగే అవకాశముందని భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ విధించాయి. గూఢచార సంస్థలు అందుకు తగ్గ ఆధారాల్ని కేంద్రానికి సమర్పించాయి.
ఈ భారత్‌లో మళ్లీ అలజడులు జరిగే అవకాశముందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో సరిహద్దులుగా ఉన్న భారత్ భూభాగంగా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.