byelections
-
కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని కొందరు మాట్లాడుతున్నారని, అలాంటివేమీ రావని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘కేటీఆర్ ఏమైనా ఆత్మహత్య చేసుకుంటారా.. సిరిసిల్లకు ఉపఎన్నిక రావడానికి?’అని ఆయన వ్యాఖ్యా నించారు. ఉపఎన్నికలు వస్తాయని కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను సీఎం దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకుని రాగా పైవిధంగా స్పందించారు. అసెంబ్లీలోని కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత తన చాంబర్‌కు వెళ్తున్న సమయంలో సీఎం మీడియాతో చిట్‌చాట్ చేశారు. శాసనభ్యులకు స్పీకర్ నోటీసులు ఇచ్చారని మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకురాగా.. అదంతా ప్రొసీజర్‌లో భాగమేనని సీఎం స్పందించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు దేశానికి తెలంగాణ నుంచి రోడ్‌మ్యాప్‌ను ఇస్తున్నామని, ఈ రెండింటి విషయంలో తాము చేసిన పని ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి వీలవుతుందని అన్నారు. సభలో ప్రవేశపెట్టే ఈ కులగణన సర్వే డాక్యుమెంట్ భవిష్యత్‌లో ఎప్పుడైనా రెఫరెన్స్‌గా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, మంత్రివర్గ ఉపసంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. ఫ్రధాన ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ది లేవని, వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదని అన్నారు. కీలకమైన రెండు అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి కదా అని ప్రశ్నించారు. తాము 88 జనరల్ సీట్లలో 30 సీట్లు బీసీలకు ఇచ్చామని చెప్పారు. కోర్టు ఇచ్చిన క్రీమీలేయర్‌ను తమ ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు, బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాల మేరకు కమిషన్‌ను నియమించామని, కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం చేసినట్లు చెప్పుకుంటున్న సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఎక్కడుందో కూడా తెలియదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాము ఎన్నికల కోసం కులగణన చేయలేదని, అభివృద్ధి ఫలాలు అందించాలన్నదే తమ తాపత్రయమని సీఎం తెలిపారు. -
కూటమి కాలకేయుల సాక్షిగా.. ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి, సాక్షి, అమరావతి, నెట్వర్క్: ఆదిమ తెగల్లోనూ కానరాని అకృత్యాలు టీడీపీ కూటమి సర్కారు పాలనలో ఆవిష్కృతమయ్యాయి! పట్టపగలు.. తిరుపతి నడి రోడ్డుపై పోలీసులు, జనం సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. తాలిబన్లు.. ఐసిస్.. హమాస్ ఉగ్రమూకలను తలదన్నే రీతిలో మునిసిపల్ ఉప ఎన్నికల్లో పచ్చ ముఠాలు దాడులకు తెగబడి విధ్వంసం, భయోత్పాతం సృష్టించాయి! పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. అసలు ఒక్క సీటు కూడా గెలవని చోట్ల.. తమకు ఏమాత్రం సంఖ్యా బలం లేని చోట్ల భయపెట్టి నెగ్గేందుకు కూటమి పార్టీలు కుతంత్రాలకు దిగాయి. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి బరి తెగించాయి. బల ప్రయోగం, అక్రమాలు, అరాచకాలు, ప్రలోభాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం తెచ్చేలా వ్యవహరించాయి. మునిసిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ గుర్తులతో జరిగాయి. అలాంటిది.. ఒక పార్టీ గుర్తుపై నెగ్గిన వారిని భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి ఇంత దారుణంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంటే.. అసలు ఇక ఎన్నికలు ఎందుకు? పార్టీ గుర్తులు ఎందుకు? అని ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరికత, ఆధునిక పోకడలు ఏమాత్రం ఎరుగని ఆటవిక జాతులు.. ప్రజాస్వామ్యం అంటే పరిచయం లేని దేశాల్లో మాత్రమే కనిపించే ఘటనలు ఏడుకొండలవాడి సాక్షిగా చోటు చేసుకోవడం నివ్వెరపరుస్తోందని పేర్కొంటున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో నెగ్గేందుకు కూటమి పార్టీల గూండాలు అరాచకం సృష్టించారు. ఉప ఎన్నికలో పాల్గొనేందుకు వాహనంలో వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సు ఆపి రాడ్లతో అద్దాలు పగలగొట్టి లోపలకు చొరబడి దాడులకు తెగబడ్డారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లపై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. మహిళా కార్పొరేటర్ల ఆర్తనాదాలు ఖాకీల చెవికెక్కలేదు. కార్పొరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న కూటమి గూండాల వాహనాలకు పోలీసులు దగ్గరుండి దారిచ్చి సాగనంపడం నివ్వెరపరుస్తోంది. పోలీసుల సాక్షిగా కూటమి గూండాలు చిత్తూరు, తిరుపతిలో సృష్టించిన అరాచకం ఇదీ!! రాష్ట్రంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే వాతావరణం లేదని అధికార మదంతో టీడీపీ నేతలు సవాల్ విసరడంపై ప్రజాస్వామ్యవాదుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు నగర కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులతో ఐదు చోట్ల ఎన్నికలు వాయిదా పడటం గమనార్హం.వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సును అడ్డుకుంటున్న టీడీపీ నాయకుడు అన్నా రామచంద్రయ్య, గూండాలు అర్ధరాత్రి నుంచి అరాచకం..మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు. గత ఐదు రోజులుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేయడంతోపాటు రాత్రిపూట పోలీసులను వారి ఇళ్లకు పంపి కేసులు బనాయిస్తామంటూ బెదిరించారు. ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాలులో సోమవారం డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే కుయుక్తులతో కూటమి నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమయ్యారు. వారంతా చిత్తూరులో ఉన్నారని తెలుసుకుని ఆదివారం అర్ధరాత్రి రిసార్ట్స్‌లో చొరబడ్డారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, పులిగోరు మురళి, జేబీ శ్రీనివాసులు, అనుచరులు గదుల తలుపులు బాదుతూ వీరంగం సృష్టించారు. గదుల్లో ఉన్న మహిళలు, చిన్నారులు ఆందోళనతో భూమన అభినయరెడ్డికి సమాచారం ఇవ్వడంతో పార్టీ శ్రేణులతో కలసి అక్కడకు చేరుకున్నారు. టీడీపీ మూకలు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్పొరేటర్లంతా సోమవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో తిరుపతిలోని భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. బస్సుని అడ్డుకుని.. అద్దాలు ధ్వంసం చేసిడిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కోసం సోమవారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లంతా భూమన నివాసం నుంచి ప్రత్యేక బస్సులో ఎస్వీ యూనివర్సిటీలోని సెనెట్ హాలు వద్దకు బయలు దేరారు. దాదాపు 25 మంది కార్పొరేటర్లు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం అందులో ఉండగా వర్సిటీ సమీపంలో వారి బస్సును కూటమి గూండాలు అడ్డుకున్నారు. సుమారు 500 మంది ఒకేసారి బస్సుపైకి దూసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే రాడ్లతో అద్దాలను పగులగొట్టారు. లోపలకు చొరబడి బస్సు తలుపు తెరిచారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లు అమరనాథరెడ్డి, అనీష్‌రాయల్, మోహన్‌కృష్ణ యాదవ్, బోగం అనిల్, వెంకటేష్‌పై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో కార్పొరేటర్లను బలవంతంగా ఎక్కించారు. బస్సులో ముందు వైపు కూర్చున్న మహిళా కార్పొరేటర్లను నెట్టుకుంటూ లోపలకు చొరబడడంతో భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. కార్పొరేటర్లను కాపాడకపోగా మిగిలిన వారిపై దౌర్జన్యానికి దిగారు.ఎంపీ, సాక్షి ప్రతినిధులపై దాడికార్పొరేటర్లతో పాటు బస్సులో ఉన్న ఎంపీ గురుమూర్తిపై కూడా కూటమి గూండాలు దాడికి యత్నించారు. ఈ అరాచకాలను చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధి, ఫోటోగ్రాఫర్పై దాడి చేశారు. ఎమ్మెల్యే కుమారుడు మదన్, సునీల్ చక్రవర్తి ఫోటోగ్రాఫర్ చేతిలోని రూ.రెండు లక్షలు విలువచేసే కెమెరాను ధ్వంసం చేశారు. సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధిపై కూడా దాడికి తెగబడ్డారు. ఉదయం 10.15 గంటల నుంచి 10.45 వరకు యధేచ్ఛగా సాగిన విధ్వంసంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కోరం లేదని డూప్లికేట్ కార్పొరేటర్లతో..నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తే గెలుపు తమదేనని ధీమాతో ఉన్న కూటమి నేతలకు వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. కిడ్నాప్‌నకు గురైన కార్పొరేటర్లను ప్రవేశపెట్టే వరకు తాము ఉప ఎన్నికలో పాల్గొనబోమని మిగతావారు వర్సిటీ సెనెట్ హాలు బయటే ఆగిపోయారు. ఉప ఎన్నిక జరగాలంటే కోరం ఉండాలి. అంటే.. 50 మంది కార్పొరేటర్లలో సగం మందైనా ఉంటేగానీ ఉప ఎన్నిక ప్రారంభం కాదు. దీంతో కూటమి నేతలు మరో ఎత్తుగడ వేశారు. నలుగురు జనసేన మహిళలకు మాస్క్‌లు అమర్చి సెనెట్ హాలు లోపలకు పంపేందుకు యత్నించారు. ఈ కుట్రలను పసిగట్టిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం హాలు వద్దకు చేరుకోవడంతో ఆ యత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఉప ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి శుభం బన్సల్ ప్రకటించారు. నలుగురితో బలవంతంగా వీడియో...డిప్యూటీ మేయర్ పదవిని కైవశం చేసుకునేందుకు టీడీపీ మూకలు కిడ్నాప్ చేసిన నలుగురు కార్పొరేటర్ల చేత బలవంతంగా మాట్లాడించి ఓ వీడియోను విడుదల చేశారు. గొడవల కారణంగా తాము సురక్షిత ప్రాంతానికి చేరుకున్నామంటూ ఒకే డైలాగ్ నలుగురితో చెప్పించి వీడియో తీశారు. అది ఒకే ప్రాంతంలో చేసినట్లు తెలుస్తోంది. పక్కన ఎవరో బలవంతంగా చెప్పిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నలుగురి వీడియోలను టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్‌వర్మ తన ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం గమనార్హం. కాగా భూమన అభినయ్‌పై అక్రమ కేసు బనాయించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.అడ్డదారిలో స్టాండింగ్ కమిటీ కైవశంగుంటూరు స్టాండింగ్ కమిటీని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. 56 మంది సభ్యులకుగానూ కేవలం 11 మంది బలం మాత్రమే ఉన్న కూటమి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి తమవైపు తిప్పుకుంది. స్వయంగా ఎమ్మెల్యేలను కార్పొరేటర్ల ఇళ్లకు పంపి పచ్చ కండువా కప్పారు. సోమవారం స్టాండింగ్ కమిటీ ఎన్నిక సందర్భంగా బ్యాలెట్ పేపర్‌పై సీరియల్ నంబర్లు వేసి బెదిరింపులకు దిగి గెలుపొందారు. కాగా కార్యాలయం బయట కూటమి సభ్యులు డబ్బులు పంచుకుంటూ మీడియాకు చిక్కారు.సగం చోట్ల వాయిదా...పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు తిరుపతి నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫి కేషన్ జారీ చేసిన సగం చోట్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడడం గతంలో ఎప్పుడూ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిదా పడిన ఐదు చోట్ల మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ⇒ టీడీపీ కూటమికి బలం లేకపోయినా నూజివీడు మున్సిపాల్టీలో వైస్ చైర్మన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్లు, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులను అధికారం అండతో చేజిక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైర్మన్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్, కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ పదవిలో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది. ⇒ కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా తొమ్మిది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి లొంగదీసుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇందుకోసం మంత్రి కొలుసు పార్ధసారథి ఆదివారం రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ⇒ హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 కౌన్సిలర్లకు వైఎస్సార్సీపీ 29, టీడీపీ 6 గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ 13 మందిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను కూడా ఉపయోగించుకుని ౖచైర్మన్ పదవిని మోసపూరితంగా తమ పరం చేసుకున్నారు.⇒ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 కార్పొరేటర్లకు 54 సీట్లను వైఎస్సార్సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బెదిరింపులు, ప్రలోభాలతో వారిని తమ వైపు తిప్పుకుని ఆ పదవిని అక్రమంగా కైవశం చేసుకున్నారు. ⇒ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్ పదవులను బెదిరింపులకు గురి చేసి టీడీపీ మద్దతుదారులకు కట్టబెట్టారు. 20 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉండగా 12 మందిని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. ఫిరాయిపుదారుడిని వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి పదవి దక్కేలా చేశారు. ⇒ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో బలం లేకపోయినా రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ అక్రమంగా చేజిక్కించుకుంది. కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న టీడీపీ రెండు డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడాన్ని బట్టి ఆ పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ⇒ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేసింది. అక్కడున్న మొత్తం 33 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వారంతా మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గడువు లోపు వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఎన్నికను వాయిదా చేశారు. ⇒ కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అడ్డగోలుగా తమ పరం చేసుకునేందుకు టీడీపీ యత్నించింది. అక్కడి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే అయినా వారి తరఫు అభ్యర్థిని నామినేషన్ వేయకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా కమిషనర్ ఎన్నికను వాయిదా వేశారు.డిప్యూటీ మేయర్ ఎన్నిక నిష్పాక్షికంగా జరిగేలా చూడండి సాక్షి, అమరావతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో జిల్లా ఎస్పీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక నిష్పాక్షికంగా, ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నిక జరిగే ఎస్వీ యూనివర్సిటీ, సెనెట్ హాల్ బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ, పాలకొండపై కాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని భర్తీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నాదెండ్ల హారిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఖాళీగా ఉన్న 19 వార్డుకు ముందు ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎం.స్వర్ణకుమారి దాఖలు చేసిన వ్యాజ్యంపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
ఉప ఎన్నికలకు సిద్ధం కండి: కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం(ఫిబ్రవరి3) ఎక్స్(ట్విటర్)లో కేటీఆర్ ఒక కీలక ట్వీట్ చేశారు. ‘సుప్రీంకోర్టు గత తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన వేటు పడుతుందని,ఫిరాయింపుదారులను కాంగ్రెస్ పార్టీ కాపాడడం అసాధ్యమని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ఫిరాయింపుల ఎమ్మెల్యే వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు(KTR) వేసిన పిటిషన్ విచారణ సోమవారం వాయిదా పడింది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌తో కలిపి విచారణ జరుపుతామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో ఫిరాయింపుదారుల మీద వేటు ఖాయమని, ఉప ఎన్నికలకు సిద్ధమవండని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునివ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. -
జార్ఖండ్ తొలి దశకు సర్వం సిద్ధం
రాంచీ: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధంచేశారు. బుధవారం తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. తొలిదశ పోలింగ్ జరుగుతున్న 43 స్థానాల్లో 17 జనరల్, 20 ఎస్టీ రిజర్వ్, ఆరు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపయి సోరెన్ పోటీ చేస్తున్న సెరాయ్‌కెల్లా నియోజకవర్గంలోనూ బుధవారమే పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ నేత అజయ్‌కుమార్ జంషెడ్పూర్ ఈస్ట్ నుంచి బరిలో దిగారు.ఇక్కడ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ కోడలు పూర్ణిమా సాహూ పోటీచేస్తున్నారు. జంషెడ్‌పూర్‌లో మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సతీమణి గీత బీజేపీ తరఫున బరిలో దిగారు. ఇక్కడ కాంగ్రెస్ నేత సోనారాం సింకూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జంషెడ్పూర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ నేత, ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా పోటీచేస్తున్నారు. ఈయనపై జేడీయూ నేత సరయూరాయ్ బరిలోకి దిగారు. సరయూరాయ్ 2019లో నాటి ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌నే ఓడించడం విశేషం. రాంచీలో ఈసారి జేఎంఎం ప్రస్తుత రాజ్యసభ సభ్యులైన మహువా మాఝీని రంగంలోకి దింపింది.ఐదవ జార్ఖండ్ శాసనసభ కాలపరిమితి వచ్చే ఏడాది జనవరి ఐదో తేదీన ముగియనున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగతా 38 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలుబుధవారమే 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానానికీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. రెండుచోట్ల పోటీచేసి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఆమెపై ఎల్డీఎఫ్ నుంచి సథ్యాన్ మోకేరీ, బీజేపీ తరఫున నవ్య హరిదాస్ నిలబడ్డారు. ఇక 31 ఎమ్మెల్యే స్థానాల్లో రాజస్తాన్‌లో 7, పశ్చిమబెంగాల్లో 6, అస్సాంలో 5, బిహార్‌లో 4, కర్నాటకలో 3 మధ్యప్రదేశ్‌లో 2, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మేఘాలయాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి. -
వారం పాటు ‘ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం’
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధాన్ని అమలు చేయనుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు పార్లమెంటరీ స్థానాలు, 48 శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికల సందర్భంగా మీడియా సంస్థలు లేదా మరే ఇతర పద్ధతిలో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ తెలిపింది. నవంబర్ 13 నుంచి నవంబర్ 20 వరకు ఎగ్జిట్ పోల్స్ఫై ఆంక్షలు విధించారు. -
EC: తెలంగాణ సహా 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు..
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సీఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక, తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ కేశవరావు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి.షెడ్యూల్ ఇలా..సెప్టెంబర్ మూడో తేదీన ఉప ఎన్నికలకు పోలింగ్. అదే సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్.ఇక, నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 చివరి తేదీఅయితే, 12 రాజ్యసభ స్థానాల్లో 11 స్థానాలను ఎన్డీయే కూటమి దక్కించుకునే అవకాశమే ఉంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఒక్క స్థానం వచ్చే అవకాశముంది. కాగా, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా కేశవరావు పార్టీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల జరుగుతోంది. అనంతరం, కేకే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. Election Commission of India releases notification for the 12 vacant seats of Rajya Sabha. Elections will be held on 3rd September. The last date for withdrawal of nominations is the 26th and 27th of August. pic.twitter.com/1d3SgWivOT— ANI (@ANI) August 7, 2024 -
Bhupesh Baghel: ‘ఏడాదిలోపే మధ్యంతరం’
రాయ్‌పూర్: లోక్‌సభకు ఆరు నెలల నుంచి ఏడాదిలోపే మధ్యంతర ఎన్నికలు ఖాయమని కాంగ్రెస్ నేత భూపేశ్ బఘెల్ శుక్రవారం జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘‘బీజేపీకి చెందిన యూపీ సీఎం ఆదిత్యనాథ్, రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ పీఠాలు కదులుతున్నాయి. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేయడం ఖాయం. రోజుకు మూడుసార్లు దుస్తులు మార్చుకునే అలవాటున్న మోదీ ఇప్పుడు ఒకే డ్రెస్‌తో మూడు కార్యక్రమాలకు వెళుతున్నారు. ఏం తిన్నదీ పట్టించుకోవడం మానేశారు’’ అంటూ బఘెల్ ఎద్దేవా చేశారు. -
రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్లు కొనుగోలు చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధా నాధికారికి బీజేపీ నేత రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేసి అక్రమాలకు పాల్పడిందని ఆరో ³ంచారు. మంగళవారం ఈ మేరకు సీఈఓను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు పత్రం అంద జేశా రు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మీడియా తో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ ద్వారా డబ్బు పంపించిన అకౌంట్, పాన్ కార్డు వివరాలు అందజేసినట్టు తెలిపారు.వాటి ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆ పార్టీ గుర్తింపు రద్దుచేయాలని కోరినట్టు తెలిపారు. రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి ఆదాయపన్ను మినహాయింపు పొందిన బీఆర్ఎస్ బ్యాంక్ ఖాతా ద్వారా రూ.30 కోట్లు పలువురు నాయకులకు బదిలీ చేసి ఎన్నికల అక్రమాలకు పాల్పడిందన్నారు. డబ్బు పంచి ఓట్ల కొనుగోలుతో ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఎమ్మె ల్యేలపై చర్యలతోపాటు బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని బీజేపీ తరఫున కోరినట్టు తెలిపారు. ఏ బ్యాంక్ ఖాతా ద్వారా ప్రజల నుంచి విరాళాలు సేకరించారో, తిరిగి ఓట్లు కొనుగోలుకు ప్రయత్నించారో ఆ అకౌంట్ వివరాలు సీఈఓకు అందజేశామ న్నారు. తాను అందజేసిన వివరాలు, సమాచారాని కి అనుగుణంగా చర్యలు తీసుకోక పోతే ఢిల్లీ వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కలిసి బీఆర్ఎస్ అకౌంట్ డిటైల్స్, ఆదాయపు పన్ను మినహాయింపు పొందిన ఆ పార్టీ పాన్ కార్డు వివరాలు అందజేస్తామన్నారు. -
స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్సులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ– ఖమ్మం– వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి 3 జిల్లాల పరిధిలో 72.44% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 78. 59% నమోదైంది. అత్యల్పంగా ఖమ్మం జిల్లా లో 67.62% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ఉద యం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జర గ్గా, 12 జిల్లాల పరిధిలోని బ్యాలెట్ బాక్సులన్నింటినీ గట్టి బందోబస్తు మధ్య నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది పోటీలో ఉన్నా రు. ప్రధాన పోటీ 3 పార్టీల అభ్యర్థుల మధ్య నే కొనసాగగా, జూన్ 5న వీరి భవితవ్యం తేలనుంది.స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత..నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పల పల్లిలో గిడ్డంగుల సంస్థ గోదాములోని స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఇక్కడ మూడంచెల భద్రత ఉంది. చుట్టుపక్కల 144 సెక్షన్ విధించడంతోపాటు పోలీసులు 24 గంటలపాటు సాయుధ రక్షణలో పహారా కాస్తూ సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లోని బ్యాలెట్ బాక్సులను మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు రాహుల్ బొజ్జా, రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన పరిశీలించారు. -
నేడు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం పోలింగ్ జరగనుండగా.. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, పురపాలక కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితోపాటు ఎక్స్ అఫీషియో హోదాలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలు మొత్తం 1,439 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ అఫీషియోగా కొడంగల్‌లో ఓటు వేయనున్నారు. ఉపఎన్నికకు మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాలెట్ ద్వారా ప్రజాప్రతినిధులు ఓట్లు వేయనున్నారు. బుధవారం ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలింగ్ సెంటర్లకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. వచ్చే నెల రెండో తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నేరుగా పోలింగ్ కేంద్రాలకే.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు వచ్చిన ఉప ఎన్నిక కాగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టా త్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని పట్టు సాధించాలని బీఆర్ఎస్.. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. ఓటర్లు చేజారొద్దనే ఉద్దేశంతో ఓటర్లను ఆయా పార్టీలు గోవా, ఊటీ, కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు తరలించారు. గురువారం పోలింగ్ జరగనుండగా.. బుధవా రం తెల్లవారుజామునే క్యాంపుల నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. రాత్రికి వారిని హైదరాబాద్‌లోని రిసార్ట్స్‌కు తరలించి.. గురువారం ఉదయం నేరుగా ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ సెంటర్లకు తీసుకురానున్నారు. సంఖ్య ప్రకారం బీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణా మాల క్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరారు. గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఢిల్లీ లీడర్స్ రాకతో.. కేడర్‌లో జోష్
కె.రాహుల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనసంఘ్ (బీజేపీగా ఏర్పడడానికి ముందు) తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలుస్తూ వచ్చారు. 1982కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా తీరు, రాజకీయాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న సందర్భంలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ఓ రాజకీయశక్తిగా ఎదిగేందుకు సానుకూల పరిస్థితులున్నట్టు పార్టీ నేతలు అంచనా వేశారు. అయితే టీడీపీ ఆవిర్భావం, ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం వంటి పరిణామాలు, టీడీపీతో పొత్తు, 1995లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు సీఎం అయ్యాక, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పుచేర్పులు, టీడీపీతో పొత్తుల కొనసాగింపు వంటివి రాష్ట్రంలో బీజేపీకి నష్టం చేశాయని చెప్పొచ్చు. తర్వాత 1998 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీచేసి 4 ఎంపీ సీట్లు గెలుపొంది సత్తా చాటింది. అయితే ఆ వెంటనే 1999లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకోక తప్పలేదు. ఆ పరిస్థితి తెలంగాణ ఏర్పడేదాకా కొనసాగడం రాజకీయంగా బీజేపీకి తీరని నష్టం చేసిందని ఆ పార్టీ అగ్రనేతలే చెబుతుండడం గమనార్హం. 12 సీట్ల నుంచి ఒక్క సీటుకు.. ఉమ్మడి ఏపీలో..1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో పోటీచేసి బీజేపీ 12 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఉమ్మడి ఏపీ, ఆ తర్వాత తెలంగాణలో అవే కమలదళం గెలిచిన అత్యధిక సీట్లు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక 2014లో తొలిసారి ఐదు సీట్లు సాధించినా, 2018లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేసినప్పుడు కేవలం 8 శాతం ఓట్లతో ఒక్క స్థానానికే పరిమితమైంది. కానీ అనూహ్యంగా 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే 4 సీట్లు గెలుచుకోవడంతో పాటు ఓటింగ్ శాతాన్ని ఒక్కసారిగా 20 శాతానికి పెంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్తో నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన పోటీలో విజయం సాధించడం, ఈ రెండు ఉప ఎన్నికల మధ్య జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 48 సీట్లు (దీనికి ముందు 4 సీట్లే) గెలుపొందడంతో ఒక్కసారిగా బీజేపీపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో జరిగిన మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించడం ఖాయమని పార్టీ వర్గాలు అంచనా వేసినా, 12 వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్చేతిలో ఆయన ఓటమి చవిచూశారు. అయితే అంతకు ముందు అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పడిన 13 వేల ఓట్లు 90 వేల ఓట్లకు పెరగడం బీజేపీకి కొంత ఊరటనిచ్చింది. ఈ విధంగా ఈ అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికే పరిమితం చేయడం విశేషం. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కుందూరు జానారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముచ్చటగా మూడోసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి. మూడు వేర్వేరు గుర్తులపై జంగారెడ్డి విజయదుందుభి 1967లో భారతీయ జన సంఘ్ (బీజేఎస్) దీపం గుర్తుపై ఉమ్మడి ఏపీలో మూడుసీట్లు గెలవగా అందులో ఒక స్థానంలో తెలంగాణ నుంచి చందుపట్ల జంగారెడ్డి గెలు పొందారు. ఎమర్జెన్సీ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జాతీయ స్థాయిలో ఇందిరతో విభేదించి బయటకు వచ్చిన లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో బీజేఎస్, ఇతర పార్టీలు కలిపి జనతా పార్టీ ఏర్పడింది. 1978లో ఉమ్మడి ఏపీలో జనతా పార్టీ నాగలిపట్టిన రైతు గుర్తుపై 60 మంది గెలుపొందగా, వారి లో తెలంగాణ నుంచి జంగారెడ్డి ఉన్నారు. ఇక 1980లో బీజేపీ ఏర్పడ్డాక ఇందిరాహత్యానంతరం జరిగిన 1984 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వీచిన కాంగ్రెస్ ప్రభంజనాన్ని తట్టుకుని ఏపీలో టీడీపీ 30 సీట్లు గెలిచింది. ఆ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీ రెండే రెండు సీట్లు గెలవగా అందులో ఒకటి హన్మకొండ. ఇక్కడ కమలం గుర్తుపై పోటీ చేసిన జంగారెడ్డి నాటి కేంద్రమంత్రి పీవీ నరసింహారావును ఓడించి చరిత్ర సృష్టించారు. బండి సంజయ్ మార్పుతో.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ఏడాది మార్చిలో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న బండి సంజయ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసే దాకా పదవిలో కొనసాగుతారని అంతా భావించారు. కానీ కొన్నాళ్లకే సంజయ్‌ను మారుస్తున్నారంటూ ప్రచారం మొదలై రెండు, మూడు నెలలు కొనసాగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డిని నాలుగోసారి (ఉమ్మడి ఏపీలో రెండు సార్లు, ఈ విడత కలుసుకుని తెలంగాణలో రెండోసారి) రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. దీంతో కేడర్‌లో స్తబ్దత, కొంత అయోమయ వాతావరణం ఏర్పడింది. మోదీ సభలతో నయా జోష్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోగానే ప్రధాని మోదీ ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లలో జరిపిన పర్యటన పార్టీలో కొత్త ఉత్సాం నింపిందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు తొమ్మిదేళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రధాని వివరించడం ప్రజల్లో సానుకూలత పెరగడానికి దోహదపడిందని అంటు న్నారు. ఇక షెడ్యూల్ వెలువడిన మరుసటి రోజే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదిలాబాద్‌లో జనగర్జన సభ నిర్వహించారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా, ఎన్నికల ప్రచార గడువు ముగిసే నాటికి పది ఉమ్మడి జిల్లాల పరిధిలో మూడేసి చొప్పున మోదీ, అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ సభల విజయవంతం, వీటిలో ప్రస్తావించే అంశాలు, ఇచ్చే హామీలు పార్టీకి మరింత మేలు చేస్తాయని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. బీజేపీ విజయం ఇలా.. 1980లో పార్టీ ఏర్పడ్డాక ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 2018లో కేవలం ఒకేఒక్క సీటు టి.రాజాసింగ్ గెలుపొందగా..అంతకుముందు వరుసగా మూడుసార్లు గెలిచిన జి.కిషన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎం.రఘునందన్‌రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందారు. 1983 నుంచి వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం పెరుగుతూ... తగ్గుతూ వచ్చింది. -
ఇండియా కూటమికి తొలి సవాల్
లక్నో/అగర్తలా: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరగనున్న ఉప ఎన్నికలు ప్రతిపక్ష ఇండియా కూటమికి తొలి పరీక్షగా నిలిచాయి. ఇండియా కూటమి కొన్ని చోట్ల ఉమ్మడిగా పోటీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల పరస్పరం పోటీపడుతున్నాయి. యూపీలోని ఘోసి, జార్ఖండ్‌లోని డుమ్రి, త్రిపురంలోని ధన్పూర్, బొక్సానగర్, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ఉమ్మడిగా అభ్యర్థులను బరిలోకి దించింది. పశి్చమబెంగాల్‌లోని ధుప్గురి, కేరళలోని పుత్తుపల్లిల్లో ఇవే కూటమి పారీ్టలు పరస్పరం తలపడుతుండటం గమనార్హం. ధుప్‌గురిలో టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 8న ఉటుంది. -
‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, అమరావతి: ఎన్నికలు ఏవైనా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నగర కార్పొరేషన్ మేయర్ స్థానంతో పాటు నందిగామ మున్సిపల్ వైస్ చైర్మన్, రెండు ఎంపీపీ, మూడు వైస్ ఎంపీపీ స్థానాలకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ విజయం సాధించింది. మచిలీపట్నం నగర కార్పొరేషన్ మేయర్‌గా వైఎస్సార్సీపీకి చెందిన 43వ వార్డు మెంబర్ సీహెచ్ వెంకటేశ్వరమ్మ ఎన్నికయ్యారు. నందిగామ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ తరుఫున గెలిచిన ఒకటో వార్డు మెంబర్ పాకాలపాటి కృష్ణ ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వెల్లడించింది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం, లింగాల ఎంపీపీగా అలవాలపాటి రమాదేవి (వైఎస్సార్సీపీ), తాడిపత్రి నియోజకవర్గం, పెద్దపప్పూరు మండలాధ్యక్షుడిగా జి.వెంకటరామిరెడ్డి (వైఎస్సార్సీపీ), అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా గాలి శ్రీనివాసులు (వైఎస్సార్సీపీ), రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పి.జ్యోతి (వైఎస్సార్సీపీ), అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండల ఉపాధ్యక్షుడిగా బొలిశెట్టి గోవిందరావు (వైఎస్సార్సీపీ)లు ఎన్నికైనట్టు అధికారులు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా నలజర్ల మండలంలో పార్టీ రహితంగా జరిగిన కోఆప్షన్ సభ్యుని ఎన్నికలో సయ్యద్ మునాఫ్ గెలిచినట్లు అధికారులు వెల్లడించారు. 170 గ్రామాల్లో ఉప సర్పంచి ఎన్నిక పూర్తి.. రాష్ట్ర వ్యాప్తంగా 186 గ్రామాల్లో ఉప సర్పంచి పదవులకుగాను సోమవారం 170 గ్రామాల్లో ఎన్నిక పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం అధికారులు పేర్కొన్నారు. 11 గ్రామాల్లో ఎన్నికలు వాయిదా పడగా.. మరో చోట స్థానిక వార్డు మెంబర్ చనిపోయిన కారణంగాను, ఇంకో నాలుగు గ్రామ పంచాయతీల్లో కోరం లేక తాత్కాలికంగా ఉప సర్పంచ్ ఎన్నిక వాయిపడినట్టు అధికారులు వివరించారు. వాయిదా పడిన 11 గ్రామాల్లో మంగళవారం మరో విడత ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ఏలూరు, ప.గో.జిల్లాలో పంచాయతీ ఉపఎన్నికలు
అమరావతి: ఏలూరు, పశ్చిమ గోదావరి జిలాల్లో మొత్తం నాలుగు సర్పంచ్ స్థానాలకు 31 వార్డు స్థానాలకు నేడు పంచాయతీ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తి కాగా ఉదయం 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది గత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనంతరం ఖాళీ అయిన స్థానాల భర్తీ కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఈరోజు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఏలూరు జిల్లాలో మొతం 3 సర్పంచ్ స్థానాలకు 21 వార్డులకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానానికి 10 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలనుంచి కౌంటిం ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు రిటర్నింగ్ అధికారి. ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలంలోని అడవినెక్కలం, పెదపాడు మండలం వీరమ్మకుంట, ముదినేపల్లి మండలంలోని వణిదురు సర్పంచ్ స్థానాలకు, అలాగే 21 వార్డులకు.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇరగవరం మండలం కావలిపురం సర్పంచ్ పదవికి, 10 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియకు కూడా అని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలో మొత్తం 4 సర్పంచ్ స్థానాలు, 47 వార్డు మెంబర్లకు గాను శ్రీనివాసపురం సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. అలాగే 12 వార్డులు ఏకగ్రీవం కాగా, 12 వార్డులకు సింగిల్ నామినేషన్లు, మరో రెండు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 21 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 160 మంది సిబ్బందిని నియమించారు. ఏలూరు జిల్లాలో 11,114 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 120 మంది సిబ్బందిని నియమించారు. -
నేడు ‘స్థానిక’ ఉప ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష పద్ధతిన ఎన్నిక జరిగే పలు పదవులకు గురువారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. గతంలోనే ఎన్నికలు జరిగి రాజీనామా చేయడం, మరణించడం వంటి కారణాలతో ఖాళీ అయిన పదవులకు ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలో రెండు డిప్యూటీ మేయర్ పదవులు, పెడన మున్సిపాలిటీలో చైర్పర్సన్, మాచర్ల మున్సిపాలిటీలో ఒకటి, ధర్మవరం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు, 13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు ఉపాధ్యక్ష, మూడు కో–ఆప్షన్ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. 12 పంచాయతీల్లో 12 ఉప సర్పంచి పదవులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఉదయం 11 గంటలకు ఆయా స్థానికసంస్థల ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థలు, పదవుల వివరాలు పట్టణ ప్రాంతాల్లో.. ► మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (కృష్ణా జిల్లా)– రెండు డిప్యూటీ మేయర్ పదవులు ► పెడన మున్సిపాలిటీ (కృష్ణా)– చైర్పర్సన్ ► మాచర్ల మున్సిపాలిటీ (పల్నాడు)– వైస్ చైర్మన్ ► ధర్మవరం (శ్రీసత్యసాయి)– రెండు వైస్ చైర్మన్ పదవులు . గ్రామీణ ప్రాంతాల్లో.. ► ఎంపీపీ ఎన్నికలు జరిగే మండలాలు (4): రామకుప్పం (చిత్తూరు జిల్లా), తొండంగి (కాకినాడ), వత్సవాయి (ఎన్టీఆర్), చేజర్ల (నెల్లూరు) ► ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే మండలాలు (7): రామకుప్పం, విజయాపురం(చిత్తూరు), రాపూరు (నెల్లూరు), గాలివీడు (అన్నమయ్య), పార్వతీపురం (పార్వతీపురం మన్యం), పెదకడబూరు (కర్నూలు), రాయదుర్గం (అనంతపురం) ► కో–ఆప్షన్ మెంబర్ ఎన్నిక జరిగే మండలాలు (3): చిత్తూరు (చిత్తూరు), బి.మఠం (వైఎస్సార్), రాజంపేట (అన్నమయ్య) ► ఉపసర్పంచి ఎన్నికలు జరిగే పంచాయతీలు (12): అనకాపల్లి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో రెండేసి పంచాయతీలు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో ఒక్కొక్క పంచాయతీ -
13న స్థానిక సంస్థల ఉప ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో విడత స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా స్థానిక సంస్థల్లో రాజీనామా లేదా మరణించడం వంటి కారణాలతో ఖాళీ అయిన పదవులకు పరోక్ష పద్ధతిలో ఈ నెల 13న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శుక్రవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులతో పాటు పెడన మున్సిపాలిటీలో చైర్పర్సన్ పదవిని భర్తీ చేస్తారు. అలాగే మాచర్ల మున్సిపాలిటీలో ఒకటి, ధర్మవరం మున్సిపాలిటీల్లో రెండు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా మొత్తం 13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు ఉపాధ్యక్ష, మూడు కో– ఆప్షన్ సభ్యుల పదవులకూ ఎన్నికలు నిర్వహిస్తారు. వివిధ మండలాల్లో 12 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు కూడా ఎన్నికలు ఉంటాయని నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. ఈ నెల 13న ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటీసులను ఆయా స్థానిక సంస్థల సభ్యులకు ఈ నెల 9 కల్లా అందజేయాలని ఆదేశించారు. ఎంపీపీ ఎన్నికలు జరిగే మండలాలు (4) రామకుప్పం (చిత్తూరు), తొండంగి (కాకినాడ), వత్సవాయి (ఎన్టీఆర్), చేజెర్ల (నెల్లూరు) కో– ఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరిగే మండలాలు (3) చిత్తూరు, బి.మఠం (వైఎస్సార్), రాజంపేట (అన్నమయ్య) ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే మండలాలు (7) రామకుప్పం, విజయాపురం (చిత్తూరు), రాపూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు), గాలివీడు (అన్నమయ్య), పార్వతీపురం (మన్యం), పెదకడబూరు (కర్నూలు), రాయదుర్గం (అనంతపురం). ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలు (12) అనకాపల్లి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో రెండేసి.. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున. -
‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి నెట్వర్క్ : గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో ఏర్పడిన ఖాళీలకు గురువారం జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గత నెల 31న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు ఆయా స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ♦ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఏలూరులో ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. అనంతరం పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వహించిన కవురు శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి వరించడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠానికి ఖాళీ ఏర్పడింది. దీంతో బీసీ మహిళగా ఉన్న గంటా పద్మశ్రీను ఈ పదవి వరించింది. జిల్లా పరిషత్ ఏర్పడిన అనంతరం బీసీ మహిళగా పద్మశ్రీ మొట్టమొదటి చైర్పర్సన్ కావడం.. మహిళకు జిల్లా పరిషత్ పీఠాన్ని అందించడం పట్ల పార్టీ శ్రేణులు, ప్రజలు సైతం హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సుపరిపాలన అందిస్తానని చెప్పారు. ఇక పద్మశ్రీకి మంత్రులు తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వాసుబాబు, వెంకట్రావు, అబ్బయ్యచౌదరి, ఎమ్మెల్సీలు వంకా రవీంద్ర, కవురు శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. ♦ ఏలూరు జిల్లా నూజివీడు పురపాలక సంఘం మున్సిపల్ వైస్ చైర్మన్‌గా 22వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కొమ్ము వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవికి గత నెలలో షేక్ అమీరున్నీసాబేగం రాజీనామా చేయడంతో మళ్లీ ఎన్నిక అనివార్యమైంది. ♦ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీ ముప్పిడి సరోజని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ ప్రత్యేకాధికారి జీవీకే మల్లికార్జునరావు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ♦నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్సీపీకి చెందిన (ఎస్సీ మహిళకు రిజర్వు) బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్‌గా కోనేటి రామకష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇరువురికీ శుభాకాంక్షలు తెలిపారు. ♦ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్–1గా ముచ్చు లయయాదవ్ (వైఎస్సార్సీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1వ డివిజన్ కార్పొరేటర్ అయిన ఆమెను ప్రత్యేక సమావేశంలో సభ్యులంతా ఎన్నుకున్నారు. ♦ విజయనగరం జిల్లా ఎల్.కోట మండల పరిషత్ రెండో వైస్ ఎంపీపీగా భీమాళి ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) సభ్యుడు ముధునూరు శ్రీనివాసవర్మరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా పనిచేసిన దండేకర్‌కుమారి మరణించడంతో ఎన్నిక అనివార్యమైంది. ♦గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ రెండో వైస్ చైర్‌పర్సన్‌గా 40వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అత్తోట నాగవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ప్రకటించి, ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ♦ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చేనేత వర్గానికి చెందిన కాచర్ల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే, స్థానిక సంస్థలకు సంబంధించి బత్తలపల్లి ఎంపీపీగా అప్పరాచెరువు ఎంపీటీసీ సభ్యురాలు బగ్గిరి త్రివేణి, చెన్నేకొత్తపల్లి వైస్ ఎంపీపీ–1గా చెన్నేకొత్తపల్లి–2 ఎంపీటీసీ సభ్యురాలు పి.రాములమ్మను ఎన్నుకున్నారు. ఇక అనంతపురం జిల్లా విడపనకల్లు మండల ఉపాధ్యక్షురాలు–2గా హాంచనహాళ్ ఎంపీటీసీ రాకెట్ల పుష్పావతి ఎంపికయ్యారు. కోరం లేకపోవడంతో రాయదుర్గం వైస్ ఎంపీపీ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. అన్నిచోట్ల ఎన్నిక ఏకగ్రీవం కాగా, అందరూ వైఎస్సార్సీపీకి సంబంధించిన వారే కావడం గమనార్హం. ♦అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీపీగా జల్లా పద్మావతమ్మ ఎంపికయ్యారు. ఎంపీపీ జల్లా సుదర్శన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో గరిగుపల్లె ఎంపీటీసీ సభ్యురాలు జల్లా పద్మావతమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఎన్నికలు వాయిదా.. చిత్తూరు జిల్లాలోని మూడు మండలాల్లో ఖాళీగా ఉన్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యుల ఎంపిక గురువారం కోరంలేక వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు రామకుప్పం, చిత్తూరు రూరల్ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సంబంధిత ఎంపీటీసీ సభ్యులకు వారం ముందే సమాచారమిచ్చారు. ఇందుకు ఎంపీటీసీ సభ్యులు రాకపోవడంతో కోరంలేక ఎన్నిక వాయిదా పడింది. విజయపురం వైస్‌ఎంపీపీ స్థానానికి ఎన్నిక మొదటిసారి వాయిదా పడడంతో శుక్రవారం మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు ఎంపీపీ ఎన్నికకు నిర్ణీత సమయంలో ఎంపీటీసీ సభ్యులు ఒక్కరు కూడా హాజరుకాకపోవడంతో ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేశారు. -
టీఆర్ఎస్కు ఆయనో గోల్డెన్‌లెగ్.. ఉప ఎన్నికల్లో రికార్డులు బ్రేక్
టీఆర్ఎస్కు ఆయన వరమయ్యారు.. అడుగుపెట్టిన మూడు చోట్ల గులాబీ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. కారు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయనను నమ్మి బాధ్యతలు అప్పగించినందుకు ఏకంగా మూడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి విజయాన్ని కట్టబెట్టారు. ఓటమెరుగని నేతగా సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయనే.. మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. రాజకీయాల్లో రాణించాలంటే అంత సులువైన విషయమేమీ కాదు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై ఉంటూనే ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగాలి. ఈ క్రమంలో ఓటములు ఎదురైనా.. తట్టుకుని నిలబడాలి. ఇక, తెలంగాణలో కొద్ది నెలలుగా మునుగోడు ఉప ఎన్నికలపై రాజకీయంగా హంగామా నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలపై అధికార పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడింది. ఉప ఎన్నికల బాధత్యలను మంత్రి జగదీష్ రెడ్డికి అప్పగించారు గులాబీ బాస్ కేసీఆర్. సీఎం కేసీఆర్‌కు నమ్మినబంటుగా పేరున్న జగదీష్ రెడ్డి.. టీఆర్ఎస్ను గెలిపించేందుకు ఎప్పటికప్పుడు పాచికలను మారుస్తూనే ఉన్నారు. తనదైన మార్క్ చూపిస్తూ ప్రచారంలో దూసుకెళ్లారు. మునుగోడు ఓటర్లకు టీఆర్ఎస్ అందిస్తున్న అభివృద్ధి ఫలాలను చెబుతూనే.. నియోజకవర్గ అభివృద్ధికి హామీలు ఇచ్చారు. దీంతో, మునుగోడు ప్రజలు.. అధికార పార్టీకి భారీ విజయాన్ని అందించారు. అయితే, కొన్నేళ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో మంత్రి జగదీష్ రెడ్డే ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడులో జగదీష్ రెడ్డి.. టీఆర్ఎస్ పార్టీకి రికార్డు విజయాలను అందించారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు సైదిరెడ్డి, నోముల భరత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకున్నారు. తన మార్క్ చూపిస్తూ నల్లగొండలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేశారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇప్పటివరకు 11 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తాజాగా మునుగోడు విజయంతో 12 స్థానాల్లో గులాబీ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. -
Munugode Bypoll: పోటెత్తిన ఓటర్లు.. 92 శాతం పోలింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. 92 శాతం పోలింగ్ నమోదైనట్లు గురువారం రాత్రి 11 గంటల సమయంలో అధికారులు ప్రకటించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తొలుత మందకొడిగా సాగింది. 50 ఏళ్ల పైబడిన వారు, వృద్ధులు అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి ఓటర్లు బూత్‌లకు రావడం పెరిగింది. మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదు కాగా, 11 గంటల వరకు 25.8 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.3 శాతం ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 3 గంటల వరకు 59.92 శాతం మంది ఓట్లు వేశారు. 50 మంది సర్వీసు ఓటర్లు మినహాయిస్తే మిగతా 2,41,805 మందికి గాను 1,44,878 మంది మధ్యాహ్నం వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 77.55 శాతం పోలింగ్ నమోదైంది. 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసే సమయానికి కూడా పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడ్డారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం సహా చాలా గ్రామాల్లో రాత్రి 8 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. ఈవీఎంల మొరాయింపు చండూరు మండలం కొండాపురం గ్రామంలో పోలింగ్ ప్రారంభమైన గంట తర్వాత ఈవీఎంలలో సాంకేతిక లోపం తలెత్తింది. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో ఈవీఎంలలో సాంకేతి లోపం ఏర్పడి దాదాపు గంట పాటు మొరాయించాయి. వాటిని మార్చేసి పోలింగ్ కొనసాగించారు. నాంపల్లి మండల కేంద్రంలో, సంస్థాన్‌నారాయణపురం మండలం కేంద్రంలోని జిల్లాపరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు సరిగా పనిచేయలేదు. అల్లందేవి చెరువు గ్రామంలో ఈవీఎంలో ఎర్రర్ చూపించడంతో 20 నిమిషాల వరకు పోలింగ్ ఆగిపోయింది. కేటీఆర్ హామీతో పోలింగ్‌కు హాజరు! గట్టుప్పల్ మండలం రంగతండా, హజినతండా గ్రామస్తులు మధ్యాహ్నం వరకు ఓటు వేయలేదు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, గ్రామ పంచాయతీలుగా చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామాల్లో వసతులు కల్పిస్తామని హామీ ఇస్తేనే ఓటింగ్‌లో పాల్గొనమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. 3 గంటల ప్రాంతంలో తహసీల్దార్ వచ్చి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓ టీఆర్ఎస్ నాయకుడు..కొందరు గ్రామస్తులను మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడించారు. సమస్యలను పరిష్కరిస్తానని, తానే వచ్చి పనులకు శంకుస్థాపన చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో పోలింగ్‌లో పాల్గొన్నారు. పలుచోట్ల ఉద్రిక్తతలు పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జి చేశారు. మర్రిగూడ మండల కేంద్రంలో సిద్దిపేట జిల్లాకు చెందిన వారు ఉన్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారు వెళ్లిపోయేంతవరకు పోలింగ్‌ను ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో గొడవ ముదిరింది. పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో వరంగల్‌కు చెందిన వారు స్థానికంగా ఉన్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. మధ్యాహ్నం తర్వాత చండూరులో డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో పాటు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. రూ.14.5 లక్షలు స్వాధీనం నాంపల్లి మండలం మల్పరాజు గ్రామంలో కొందరు ఓటర్లకు డబ్బులు పంపిణీకి ప్రయత్నిస్తుండడంతో పోలీసులు, ఇతర సిబ్బంది వారి నుంచి రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చండూరు పరిధిలో రూ.1.60 లక్షలు, గట్టుప్పల్ మండలంలో రూ. 2.90 లక్షలు పట్టుకున్నారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి పలు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. చదవండి: న్యాయవ్యవస్థే కాపాడాలి.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య: సీఎం కేసీఆర్ -
ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన పోలింగ్
సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు)లో అత్యల్పంగా 31.74% పోలింగ్ నమోదైంది. బిహార్‌లోని మొకామాలో 53.45%, గోపాల్‌గంజ్‌లో 51.48%, హరియాణాలోని ఆదంపూర్‌లో 75.25%, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో 57.35%, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో 66.63% పోలింగ్ నమోదైంది. స్వల్ప ఘటనలు మినహా మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. పోటీ ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పారీ్టలకు మధ్యనే నడిచింది. అంధేరి(తూర్పు) నియోజకవర్గ శివసేన అభ్యర్థి రుతుజా లట్కే గెలవచ్చు.. శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు ఇస్తుండటంతోపాటు బీజేపీ అభ్యర్థి బరి నుంచి వైదొలిగారు. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మృతి చెందడంతో ఆయన భార్య పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగిన 7 స్థానాల్లో బీజేపీకి 3, కాంగ్రెస్‌కు 2, శివసేనకు ఒకటి, ఆర్జేడీకి చెందిన ఒక సిట్టింగ్ సీటు ఉన్నాయి. 6న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు మరింత పటిష్ఠం చేశారు. గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్‌లను పరిశీలించి ఓటర్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించారు. ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాలు (7) మహారాష్ట్ర-తూర్పు అంధేరి బిహార్-మోకమ బిహార్- గోపాల్‌గంజ్ హరియాణ-అదంపూర్ తెలంగాణ-మునుగోడు ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ఒడిశా- ధామ్‌నగర్ మహారాష్ట్రలోని తూర్పు అంధేరి అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఉద్ధవ్ ఠాక్రే, షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి కీలకంగా మారింది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం విశేషం. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే కొన్ని నెలల క్రితం మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అంధేరి తూర్పులో ఆయన భార్య రుతుజా ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. దీంతో శివసేన దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుటుంబానికి అయిదు దశాబ్దాల కంచుకోటగా ఉన్న అదంపూర్‌లో మరోసారి పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఆయన మనవడు(కుల్దీప్ బిష్ణోయ్ కొడుకు) భవ్య బిష్ణోయ్ బీజేపీ తరపున పోటీలో నిలిచారు. గత ఆగష్టులో కుల్దీప్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. హిస్సార్ నుంచి మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి జై ప్రకాశ్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించగా.. బీజేపీ నుంచి వచ్చిన సతేందర్ సింగ్‌ను ఆప్ తమ అభ్యర్థిగా నిలిపింది. ఇక బిహార్‌లో 'మహాఘట్బంధన్' ప్రభుత్వానికి ఇవి తొలి ఎన్నికలు. రాష్ట్రంలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు నెలల కిందట బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెదురుమదురు ఘటనలు.. రాజకీయ విమర్శల పర్వంతో ఈ ఏడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. నవంబర్ 6న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
రాచకొండ నుంచే మునుగోడు ‘కంట్రోల్’.. ప్రతి పోలింగ్ కేంద్రంలో..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్‌కు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. గురువారం జరిగే పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిక జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును, పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఐటీ బృందాలను కూడా నియమించామని వివరించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చౌటుప్పల్, నారాయణపూర్ మండలాలు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రెండు మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. అదనపు సీపీ జి.సుధీర్‌బాబు, డీసీపీలు నారాయణరెడ్డి, శ్రీబాల, అదనపు డీసీపీ భాస్కర్, ఏసీపీ ఉదయ్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బందోబస్తులో 2 వేల మంది.. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించినట్లు సీపీ భగవత్ తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ఒక ఎస్ఐ ఇన్చార్జిగా ఉంటారన్నారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల పరిధిలో 82 పోలింగ్ కేంద్రాలలో 122 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వివరించారు. మొబైల్ స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా విధులలో పాల్గొంటాయని చెప్పారు. 16 పోలింగ్ కేంద్రాలలో 35 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించామని, ఆయా స్టేషన్లలో బందోబస్తును మరింత పటిష్టం చేయాలని సిబ్బందికి సూచించామని వివరించారు. భారీగా నగదు, బంగారం స్వాధీనం.. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పోలీసు బృందాలు 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తుంటాయని సీపీ తెలిపారు. ఇప్పటివరకు వాహన తనిఖీలలో రూ.4 కోట్ల నగదు, వెయ్యి లీటర్ల మద్యం, 3.5 కిలోల బంగారం, 11.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకూ మద్యం దుకాణాలు మూసి ఉంటాయని, పోలింగ్ రోజున అక్రమంగా మద్యం విక్రయాలు, సరఫరా చేసిన వ్యక్తులకు జరిమానాలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు. సెల్ఫీలు దిగొద్దు.. పోలింగ్ కేంద్రాల ఆవరణలో సెల్ఫోన్లు నిషేధమని, సెల్ఫీలు దిగడంతో పాటు, ఎవరికి ఓటు వేశారో తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకూడదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని సీపీ భగవత్ హెచ్చరించారు. చదవండి: ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ..! మునుగోడులో పరిస్థితిపై కేసీఆర్ ఆరా -
అసాధ్యాలను సుసాధ్యం చేసిన మోదీ: అమిత్ షా
సిమ్లా: ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం సహా గతంలో అందరూ అసాధ్యమని భావించిన వాటిని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుసాధ్యం చేసి చూపిందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సిర్మౌర్ జిల్లాలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దవుతుందని మీలో ఎవరైనా ఊహించారా? అంటూ హాజరైన వారినుద్దేశించి ఆయన ప్రశ్నించారు. జవహర్ లాల్ నెహ్రూ తీసుకువచ్చిన ఆర్టికల్ 370ను గురించి ఎవరైనా ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు మిన్నకుండి పోతారని ఎద్దేవా చేశారు. అయోధ్యలో మందిర నిర్మాణం అసాధ్యమని కాంగ్రెస్ పెదవి విరిస్తే తాము బృహత్ రామాలయం పనులను ప్రారంభించామని చెప్పారు. ‘వంశ రాజకీయాలకు ప్రధాని మోదీ ముగింపు పలికారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌కు కర్తవ్యపథ్గా పేరు పెట్టి, సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు’అని అమిత్ షా అన్నారు. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్.. మోదీ నాయకత్వంలో ఐదో స్థానానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. -
మునుగోడులో ఇదే ట్రెండూ! బీరువాలు తెరుస్తున్న కార్యకర్తలు
ఖద్దరు బట్టల దర్పమే వేరు.. ధగ ధగా మెరుస్తూ..నిలబడి ఉండే ఖద్దరంటే అందరూ మోజు చూపిస్తారు. అయితే రాజకీయ నాయకులకు ఖద్దరు అనేది బ్రాండ్‌గా మారింది. కొందరైతే పండుగప్పుడో... ఏదైనా ఫంక్షన్‌కో ఖద్దరు ధరిస్తారు. నాయకులైతే ఎక్కువగా ఖద్దరులోనే కనిపిస్తారు. అయితే ఖద్దరు ధరించేవారికి ఉన్న డిమాండ్, విలువ ఇతరులకు ఉండదనేది వాస్తవం. ఇప్పుడు మునుగోడులోని అన్ని పార్టీల కార్యకర్తలు బీరువాలో దాచిన ఖద్దరు దుస్తులు బయటకు తీస్తున్నారట. ఒక ఉప ఎన్నిక అనేక విచిత్రాలకు వేదికవుతోంది. అనేక రాజకీయ పరిణామాలకు దారి తీస్తోంది. భవిష్యత్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో రాజకీయ పార్టీలకు మునుగోడు ఉప ఎన్నిక ఓ పాఠంగా మారబోతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీల నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఆ నేతల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం కొందరు చోటామోటా నేతలు కూడా అదే స్థాయిలో కష్టాలు పడుతున్నారు. నేతల్ని ఆకట్టుకునేందుకు ఇన్నాళ్లు బీరువాల్లో దాచుకున్న తెల్లటి ఖద్దరు బట్టల్ని బయటకు తీస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు మునుగోడు రోడ్లపై ఎక్కడ చూసిన తెల్లటి ఖద్దరు ధగధగలే కనిపిస్తున్నాయి. మునుగోడులో ఖద్దరు మెరవడానికి కూడా ఓ కారణం ఉందంటున్నారు. తెల్లటి బట్టలు వేసుకుని వెళ్తేనే లీడర్లం అని చెప్పుకోవడానికి అనువుగా ఉంటుందనే కారణం ఒకటైతే... ప్రస్తుత ఉప ఎన్నిక నేపథ్యంలో దర్పం ప్రదర్శించి నా వెనుక ఇన్ని ఓట్లు ఉన్నాయని..నేతల్ని నమ్మించాలన్నా నాలుగు రూపాయలు సంపాదించాలన్నా ఖద్దరే ముద్దు అనే ఆలోచనతో చోటా నేతలంతా ఖద్దరు బాట పట్టారు. దీంతో మునుగోడులో ఎక్కడ చూసినా ఖద్దరు బట్టలు ధరించిన వారే కనిపిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని వస్త్ర దకాణాల్లో ఇప్పుడు తెల్లని ఖద్దరు వస్త్రాలకు గిరాకీ భారీగా పెరిగింది. మునుపెన్నడు లేని విధంగా ఖద్దరు కొనుగోళ్లు బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ దొరక్కపోతే పక్క ఊళ్ళ నుంచి ఖద్దరు తెప్పించుకుంటున్నారట. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు కత్తి మీద సాములా మారింది. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎత్తులు, పై ఎత్తులతో నాయకులు సతమతమవుతుంటే.. చోటామోటా లీడర్లు మాత్రం తమకు పైసలు వచ్చే టైమొచ్చిందని సంబరపడుతున్నారు. -
మునుగోడు ఉపఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్
-
Telangana Politics: మునుగోడుకు క్యూ!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా రాకపోయినా.. మూడు ప్రధాన పార్టీలు మాత్రం ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలు మునుగోడు బాటపట్టడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే ఒకదఫా బహిరంగ సభ నిర్వహించిన కాంగ్రెస్.. శనివారం ఇంటింటి ప్రచారం మొదలుపెడుతుండగా.. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో శనివారం మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభతో టీఆర్ఎస్ సత్తా ఏమిటనే బల ప్రదర్శన చేయాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ పెద్దలు ఉన్నారు. ఇక బీజేపీ జాతీయ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం మునుగోడు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారికంగా చేరుతుండటంతోపాటు.. వివిధ పార్టీలకు చెందిన మరికొందరు నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే కేవలం ఉప ఎన్నికే అయినా తమ శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. ఇక్కడ గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించవచ్చని భావిస్తున్నాయి. ప్రచారం కోసం ముఖ్య నేతలంతా ప్రచార రంగంలోకి దిగుతున్నారు. దీనితో మునుగోడు ఉప ఎన్నిక మరింత రక్తికడుతోంది. కాంగ్రెస్‌కు సిట్టింగ్ స్థానం మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. ఇక్కడ ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది. ఎట్టిపరిస్థితుల్లో దీనిని నిలబెట్టుకోవాలని, తద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. మునుగోడులో విజయం సాధిస్తే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందని, ప్రజల్లోనూ నమ్మకం వస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా శనివారం నుంచి ఇంటింటి ప్రచార కార్యక్రమం, ఓటర్లకు పాదాభివందనం అనే వినూత్న కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపడుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమం బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. మండలాలు, గ్రామాల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ వీడకుండా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు మధుయాష్కీ, బలరాం నాయక్, మహేశ్వర్‌రెడ్డి, రేణుకా చౌదరి, దామోదర రాజనర్సింహ, దామోదర్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ తదితర నాయకులకు మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలను అప్పగించారు. బీజేపీకి, రాజగోపాల్‌రెడ్డికి ప్రతిష్టాత్మకం.. మునుగోడు బీజేపీ స్థానం కాకపోయినా.. అక్కడ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని రాజీనామా చేయించి ఉప ఎన్నిక రావడానికి కారణమైంది. ఈ క్రమంలో అటు బీజేపీకి, ఇటు రాజగోపాల్‌రెడ్డికి ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. రాజగోపాల్‌రెడ్డికి నియోజకవర్గంపై వ్యక్తిగతంగా గట్టి పట్టు ఉన్నా.. బీజేపీ జాతీయ నేతలు స్వయంగా రంగంలోకి దిగడం చూస్తుంటే ఆ పార్టీ ఈ ఎన్నికపై ఎంతగా దృష్టి పెట్టిందో స్పష్టమవుతోంది. ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన ఊపును ఇక్కడా కొనసాగించి.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనని చాటాలన్నది బీజేపీ వ్యూహం. కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజ్‌గోపాల్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరాలనే పట్టుదలతో ఆదివారం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్కు దీటుగా భారీ జన సమీకరణపై దృష్టిపెట్టారు. కాంగ్రెస్‌లోని తన అనుచరులు, ఇతర నేతలు కూడా బీజేపీలో చేరేవిధంగా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో మండలాల వారీగా ఇన్చార్జులను నియమించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శనివారమే మునుగోడు వెళ్తున్నారు. ఈటల రాజేందర్, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రమేశ్‌రాథోడ్, మనోహర్‌రెడ్డి తదితర నేతలు ఇప్పటికే మునుగోడులో తిరుగుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు చెక్ పెట్టేలా టీఆర్ఎస్ వ్యూహాలు టీఆర్ఎస్ కూడా మునుగోడులో విజయం సాధించడం ద్వారా ఒకేసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. దీంతో ప్రతిష్టాత్మకంగా పోరుకు సిద్ధమవుతోంది. బల ప్రదర్శనకు వేదికగా మలుచుకుంటోంది. 2018లో కోల్పోయిన ఈ స్థానాన్ని తిరిగి సాధించాలని చూస్తోంది. మునుగోడును కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్కే పట్టు ఉందని చూపుకోవడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయానికి మార్గం వేసుకోవడం వీలవుతుందని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ శనివారం మందీ మార్బలంతో హైదరాబాద్ నుంచి మునుగోడుకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి నాయకులను టీఆర్ఎస్లో చేర్చుకునే కార్యక్రమం జరుగుతోంది. మంత్రి జగదీశ్‌రెడ్డి పూర్తిగా మునుగోడు నియోజకవర్గానికే అంకితమయ్యారు. ఇక ఆ నియోజకవర్గంలో తలెత్తిన అసమ్మతిని సీఎం స్వయంగా చక్కబెట్టారు కూడా. కాగా మునుగోడు సభా వేదికగా టీఆర్ఎస్ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. చదవండి: అగ్గి రాజేసిన ఫీజు -
మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ వరుస సమావేశాలు
-
మునుగోడు బరిలో ఉంటాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బిజినేపల్లి: త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వెల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. మునుగోడు ప్రజలు తమ పార్టీ అభ్యర్థిని ఆదరిస్తా రన్న నమ్మకం ఉందన్నారు. అనంతరం రాబోయే అసెంబ్లీ ఎన్ని కల్లో కూడా తాము పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెడతామని వెల్లడించారు. చదవండి: బీజేపీకి తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి: రేవంత్ -
ఎస్పీ, ఆప్‌కు ఎదురుదెబ్బ! ఆజంఖాన్ అడ్డాలో వికసించిన కమలం..
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలు బద్ధలయ్యాయి. ఆజంఖాన్ అడ్డాలో కమలం వికసించింది. దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి షాక్ ఇచ్చింది. ఎస్పీ సిట్టింగ్ స్థానమైన రాంపూర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఘన్ శ్యామ్ లోధి జయకేతనం ఎగురవేశారు. 42 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ ఎమ్మెల్యేగా గెలుపొంది.. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో రాంపూర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. రాంపూర్ లోక్‌సభ స్థానం ఇప్పటివరకు ఆజంఖాన్ కంచుకోటగా ఉంది. ఇక ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాజీనామాతో ఖాళీ అయిన ఆజంగఢ్ లోక్‌సభ స్థానంలోనూ కమలం వికసించింది. బీజేపీ అభ్యర్థి దినేశ్ లాల్ యాదవ్ 8,679 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆప్‌కు ఎదురుదెబ్బ పంజాబ్‌లో అధికార ఆప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్ లోక్‌సభ స్థానంలో శిరోమణి అకాలీదళ్ నేత సిమ్రన్ జీత్ మాన్ విజయం సాధించారు. భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది. ఆప్ నేత దినేశ్ పాఠక్ 55 శాతానికి పైగా ఓట్లు దక్కించుకుని విజయఢంకా మోగించారు. కాగా.. రాజ్యసభ ఎంపీగా గెలుపొందిన రాఘవ్ చద్దా.. రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు జరిగాయి. చదవండి👉పంజాబ్‌లో ఆప్‌కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు! నాలుగింటిలో మూడు బీజేపీవే ఈశాన్య రాష్ట్రం త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో మూడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. టౌన్ బార్డోవాలీ స్థానం నుంచి పోటీ చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానమైన అగర్తలాలో కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మాన్ గెలుపొందారు. ► ఝార్ఖండ్‌లోని మందార్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శిల్పి నేహా టిర్కీ గెలుపొందారు. ► ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. చదవండి👉మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక మలుపు మోదీ, యోగి కృతజ్ఞతలు తాజా ఫలితాలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ.. బీజేపీకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆజంగఢ్, రాంపుర్ ఫలితాలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. The by-poll wins in Azamgarh and Rampur are historic. It indicates wide-scale acceptance and support for the double engine Governments at the Centre and in UP. Grateful to the people for their support. I appreciate the efforts of our Party Karyakartas. @BJP4UP — Narendra Modi (@narendramodi) June 26, 2022 ఎస్పీకి కంచుకోటలైన రాంపూర్, ఆజంగఢ్‌లో కాషాయ జెండా రెపరెపలాడటంతో పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు రుజువు చేశాయన్నారు. -
Bypoll Results 2022: ముగిసిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ
-
ఉప ఎన్నికల పోలింగ్: ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో భాగంగా గురువారం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ► అసెంబ్లీ ఉప ఎన్నికలు.. 11 గంటల వరకు పోలింగ్ శాతం.. - ఆత్మకూరు(ఏపీ)-- 24.92 శాతం - అగర్తలా(త్రిపుర)-- 34.26 శాతం - టౌన్ బార్డోవాలి(త్రిపుర)-- 35.43 శాతం - సుర్మా(త్రిపుర)-- 33.50 శాతం - జుబరాజ్‌నగర్(త్రిపుర)-- 29.14 శాతం - మందార్(జార్ఖండ్)-- 29.13 శాతం - రాజింద్ర నగర్(ఢిల్లీ)-- 14.85 శాతం #AssemblyByPolls | Till 11 am, 24.92% voter turnout recorded in Atmakur (Andhra Pradesh) 34.26% in Agartala (Tripura) 35.43% in Town Bardowali (Tripura) 33.50% in Surma (Tripura) 29.14% in Jubarajnagar (Tripura) 29.13% in Mandar (Jharkhand) 14.85% in Rajinder Nagar (Delhi) pic.twitter.com/m5y8A43NHb — ANI (@ANI) June 23, 2022 ► దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం.. అసెంబ్లీ స్థానాలు.. - ఆత్మకూరు(ఏపీ)-- 11.56 శాతం - అగర్తలా(త్రిపుర)-- 15.29 శాతం - టౌన్ బార్డోవాలి(త్రిపుర)-- 16.25 శాతం - సుర్మా(త్రిపుర)-- 13 శాతం - జుబరాజ్‌నగర్(త్రిపుర)-- 14 శాతం - మందార్(జార్ఖండ్)-- 13.49 శాతం - రాజింద్ర నగర్(ఢిల్లీ)-- 5.20 శాతం లోక్‌సభ స్థానాలు.. - సంగ్రూర్(పంజాబ్)-- 4.07 శాతం - రాంపూర్(యూపీ)-- 7.86 శాతం - ఆజాంఘర్(యూపీ)-- 9.21 శాతం. Andhra Pradesh | Voting for Atmakur assembly by-polls underway. The seat fell vacant due to the demise of sitting legislator and then industries minister Mekapati Goutham Reddy in February. pic.twitter.com/VjNKRsurzx — ANI (@ANI) June 23, 2022 ► ఢిల్లీలోని రాజీంద్రనగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Delhi | AAP Rajya Sabha MP Raghav Chadha casts his vote for Rajinder Nagar assembly by-poll. The seat fell vacant after Chadha was elected as an MP. He says, "People will vote to get corruption-free governance and everyone's right to lead a life of dignity." pic.twitter.com/qDsCPgLzbR — ANI (@ANI) June 23, 2022 ► త్రిపురలోని బోర్డోవాలీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సీఎం మాణిక్ సాహా ఓటు హక్కు వినియోగించుకున్నారు. #TripuraByPolls | CM Manik Saha casts his vote at a polling station in Town Bordowali assembly constituency. By-poll is being held on Agartala, Town Bardowali, Surma and Jubarajnagar assembly seats today. pic.twitter.com/xEvlmQZAKI — ANI (@ANI) June 23, 2022 ► ఈశాన్య రాష్ట్రం త్రిపురలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. People cast their vote for #TripuraByPoll. Visuals from National Forensic Sciences University in Agartala. Polling is being held on Agartala, Town Bardowali, Surma and Jubarajnagar assembly seats today. pic.twitter.com/Vgrzsf8Nje — ANI (@ANI) June 23, 2022 ► పంజాబ్‌లో సాంగ్రూర్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కేవల్ సింగ్ థిల్లాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. Punjab | BJP candidate for Sangrur Lok Sabha seat Kewal Singh Dhillon casts his vote as polling is underway in the constituency. The seat fell vacant after AAP's Bhagwant Mann became Punjab CM Voting for bypolls to 3 LS seats & 7 assembly seats is being held today pic.twitter.com/uyenXQbKGi — ANI (@ANI) June 23, 2022 ► ఢిల్లీలోని రాజింద్రానగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆప్ నేత రాఘవ్ చద్దా రాజ్యసభకు వెళ్లడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజేశ్ భాటీయా, ఆప్ నుంచి దుర్గేష్ పాథక్, కాంగ్రెస్ నుంచి ప్రేమ్‌లత బరిలో ఉన్నారు. Polling underway for bypoll on Delhi’s Rajinder Nagar seat, vacated after AAP’s Raghav Chadha was elected to RS. AAP has fielded Durgesh Pathak against BJP former councillor Rajesh Bhatia and Congress’s Prem Lata. Voting for bypolls to 3 LS seats & 7 assembly seats is underway pic.twitter.com/ISZ0o1DzjQ — ANI (@ANI) June 23, 2022 ► జార్ఖండ్‌లోని మందార్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు. Polling underway for byelection in Jharkhand's Mandar Assembly Constituency. Voting for bypolls to 3 Lok Sabha seats and 7 assembly seats is being held today pic.twitter.com/Gv257RRzXA — ANI (@ANI) June 23, 2022 ► దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. లోక్‌సభ స్థానాలు.. - ఉత్తర ప్రదేశ్‌లో 2 లోక్‌సభ స్థానాలు.. ఆజామ్ఘర్, రాంపూర్, - పంజాబ్‌లో లోక్‌సభ స్థానం సంగ్రూర్. అసెంబ్లీ స్థానాలు.. - త్రిపురలో 4 అసెంబ్లీ స్థానాలు.. అగర్తలా, టౌన్ బార్డౌవాలీ, సుర్మా, జబ్రాజ్‌నగర్, - ఢిల్లీలో అసెంబ్లీ స్థానం రాజీంద్ర నగర్, - జార్ఖండ్‌లో మందార్, - ఏపీలో ఆత్మకూర్. -
కాంగ్రెస్ నేతపై దాడి.. ఆరోగ్య పరిస్థితి విషమం
ఉప ఎన్నికల వేళ త్రిపురలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మాన్‌పై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. వివరాల ప్రకారం.. ఈ నెల 23వ తేదీన త్రిపురలో రాజధాని అగర్తాల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుదీప్ బర్మాన్.. ఆదివారం రాత్రి ఉజన్ అభోయ్‌నగర్‌లో తన మద్దతుదారులను కలిశారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. అనంతరం కారు, కాంగ్రెస్ పార్టీ జెండాలను ధ్వంసం చేశారు. కాగా, ఈ దాడికి అధికార బీజేపీ పార్టీనే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకునే ఇలా దాడి చేశారని విమర్శించారు. అంతకుముందు కూడా సుదీప్ రాయ్.. భద్రతా సిబ్బంది, డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా.. సుదీప్ రాయ్ బర్మాన్ ఈ ఏడాది ప్రారంభంలో బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ సర్కార్ పాలనలో ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ అధిష్టానం మంత్రి పదవి నుంచి తొలగించింది. దీంతో గత ఫిబ్రవరి నెలలో బర్మాన్ బీజేపీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరుగుతుండగా.. జూన్ 26న ఓట్ల లెక్కింపు జరగనుంది. Tripura Bypoll Violene - BJP Gundas attack Agaratala - 6 congress Candidate sudip Roy Barman. pic.twitter.com/ZiREN9gWNz — With Congress (@WithCongress) June 20, 2022 ఇది కూడా చదవండి: సైన్యంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారు: మాజీ ఆర్మీ చీఫ్ ఫైర్ -
ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ: ఎంపీ జీవీఎల్
నెల్లూరు (బారకాసు): ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు చెప్పారు. అభ్యర్థి ఎవరనేది తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. గురువారం నెల్లూరులో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేయబోతున్నాం తప్ప మరే పార్టీతోనూ పొత్తుపెట్టుకోబోమన్నారు. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందని చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే చంద్రబాబు బీజేపీ అధినాయకులతో మాట్లాడామని అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు సమాయత్తం కావాలి: సోము వీర్రాజు ఏపీలో 2024లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. గురువారం నెల్లూరులో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ చేస్తోన్న పరిపాలన, ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న సహాయ, సహకారాలను ప్రజలకు తెలియజేయాలని నేతలకు సూచించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణక్రాకకు చెందిన బిజవేముల రవీంధ్రనాథ్‌రెడ్డి బీజేపీలో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, మాధవ్, పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్‌ధర్ తదితరులు పాల్గొన్నారు. -
హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు షాక్
-
సొంత ఇలాకాలో తిరుగులేదని నిరూపించిన ఈటల
-
ఓటేసిన ఈటల దంపతులు
-
బద్వేల్ లో బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు
-
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బద్వేల్లో పోలింగ్
-
కొనసాగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్
-
కొనసాగుతున్న బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్
-
బద్వేల్ ఉపఎన్నిక పోలింగ్ కు చురుగ్గా ఏర్పాట్లు
-
హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారానికి నేటితో తెర
-
రసవత్తరంగా ‘హుజురాబాద్’ రాజకీయాలు
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉప ఎన్నిక ఎప్పుడనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ రాజకీయ పార్టీల నేతలు హల్చల్ చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ జమ్మికుంట వీణవంక మండలాల్లో పర్యటించి ఈటలపై విమర్శలు సంధించారు. ఈటల స్వప్రయోజనాల కోసమే ప్రయత్నించారే తప్ప ఏనాడు నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించడం పట్ల బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హుజురాబాద్‌లో ఏవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మిగతా నియోజకవర్గాల్లో అదేవిధంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో ఏం జరుగుతుందో అర్థం కాక నియోజకవర్గ ప్రజలు అయోమయంలో ఉన్నారు. చదవండి: హుజూరాబాద్‌లో ‘సోషల్’ వార్‌కు రెడీ.. రేవంత్‌రెడ్డి వ్యూహాత్మక అడుగులు: ఆసక్తికర భేటీ -
PCC Chief: రేవంత్‌ను కలిసిన ‘పాడి కౌశిక్’.. టికెట్టుకు కర్చీఫ్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గ్రూపు రాజకీయాల నడుమ టీపీసీసీ చీఫ్‌గా నియమితులైన మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డికి హుజూరాబాద్ ఉప ఎన్నిక తొలి పరీక్ష కాబోతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రాభవాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెస్తానని చెపుతున్న రేవంత్ హుజూరాబాద్‌లో ఏ వ్యూహాన్ని అనుసరించబోతున్నారనేది ఆసక్తిగా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడం మొదలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరేంతవరకు నడిచిన ఎపిసోడ్లో కాంగ్రెస్ కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు. ఈటల రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన పరిస్థితుల్లో టీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే హుజూరాబాద్‌లో సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థిగా ఈటల రాజేందర్, ఈటలను ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తోంది. ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు అభ్యర్థి ఎవరనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేకపోయినా, మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హుజూరాబాద్‌లో మకాం వేసి ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారు. ఈటల ద్వారా సమకూరిన బలంతో బీజేపీ కూడా పోరాటానికి సై అంటోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన పాడి కౌశిక్ రెడ్డి తిరిగి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీ తరఫున ఇప్పటివరకు పెద్దగా కార్యక్రమాలేవీ జరగలేదు. రేవంత్ రాకతో నయా జోష్..? పీసీసీ పీఠం కోసం కాంగ్రెస్‌లో చాన్నాళ్లుగా సాగిన వర్గపోరులో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఇప్పటివరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానంలో ఆయన త్వరలో బాధ్యతలు తీసుకోబోతున్నారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఎదుర్కోబోతున్న తొలి ఉప ఎన్నిక హుజూరాబాద్ కాబోతోంది. ఉప ఎన్నికలో గెలిస్తేనే సత్తా చాటినట్లవుతుందని రేవంత్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి పాడి కౌశిక్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్‌రెడ్డిని సోమవారం కలిసి అభినందనలు తెలిపారు. హుజూరాబాద్ నుంచి తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని, గెలిచే అభ్యర్థిని తానేనని చెప్పినట్లు సమాచారం. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వరుసకు సోదరుడైన కౌశిక్‌రెడ్డి విషయంలో ఇప్పటివరకు భేదాభిప్రాయాలు ఉన్నా, వాటికి ఫుల్స్టాప్ పడేలా ఈ కలయిక సాగింది. అలాగే టీఆర్ఎస్ టికెట్టు కోసం కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే వదంతులను నమ్మవద్దని కోరినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు కౌశిక్‌రెడ్డి మినహా ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎవరూ లేకపోవడం, పీసీసీ మార్పు వంటి పరిణామాలతో హుజూరాబాద్‌లో జోష్ వస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. తదనుగుణంగా వ్యూహాలను అమలు చేసే ఆలోచనతో రేవంత్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలను ఎండగట్టే వ్యూహంతో.. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన వెంటనే రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్, బీజేపీలపై దాడి ప్రారంభించారు. నాణేనికి రెండు పార్టీలు బొమ్మ బొరుసు అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈటలను టీఆర్ఎస్ కోవర్టుగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి హుజూరాబాద్‌లో రాజకీయ వేడిని పుట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అనే సంకేతాలను జనంలోకి తీసుకెళ్లడం, రెండు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టడం ద్వారా కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలనేది ఆయన ఆలోచనగా కార్యకర్తలు చెపుతున్నారు. ఉప ఎన్నిక కోసం హుజూరాబాద్‌లోనే నెలరోజులపాటు మకాం వేయనున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారని ఆయనను కలిసి వచ్చిన కౌశిక్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అదే సమయంలో పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా హుజూరాబాద్‌కు వస్తారని, మిగతా నేతలు కూడా ఉప ఎన్నిక కోసం రానున్నట్లు తెలిపారు. చదవండి: కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ‘డయానా అవార్డు’ -
దేశంలో ఉపఎన్నికలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కరోనా అదుపులోకి వచ్చి, పరిస్థితులు అనుకూలించేవరకు ఉప ఎన్నికలు నిర్వహించడం సముచితం కాదని ఈసీ నిర్ణయించింది. బెంగాల్ సహా ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కారణంగా వైరస్ సంక్రమణ ఎక్కువగా జరిగిందన్న విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా వేశారు. దాద్రా – నగర్ హవేలి, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా, హిమాచల్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గాలతో పాటు, హరియాణాలోని కల్కా, ఎల్లెనాబాద్, రాజస్తాన్‌లోని వల్లభనగర్, కర్ణాటకలోని సింగ్డి, మేఘాలయలోని రాజబాలా, మావరింగ్‌కెంగ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. మరికొన్ని ఖాళీ స్థానాలకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మార్చి 28న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. -
By Election Results 2021: బీజేపీకి షాక్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కేరళలోని మలప్పురం, తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 6న, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం పార్లమెంటరీ సీట్లకు ఏప్రిల్ 17న ఉప ఎన్నిక నిర్వహించారు. అదే విధంగా కర్ణాటకలోని బసవకళ్యాణ్, మస్కి, గుజరాత్‌లోని మోర్వా హదాఫ్, జార్ఖండ్‌లోని మధుపూర్, మధ్యప్రదేశ్‌లోని దామో, మహారాష్ట్రలోని పండేపూర్, మిజోరాంలోని సెర్చిప్, నాగాలాండ్‌లోని నొక్సెన్, తెలంగాణలోని నాగార్జున సాగర్, ఉత్తరాఖండ్‌లోని సాల్ట్ తదితర 13 అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్ జరిగింది. Time: 05:00 Pm గుజరాత్: మోర్వా అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ విజయం జార్ఖండ్: మధుపుర అసెంబ్లీ ఉపఎన్నికలో జెఎంఎం విజయం కర్ణాటక: బసవకళ్యాణ్, అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ గెలుపు కర్ణాటక: మాస్కీ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు మధ్యప్రదేశ్: దామో అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు మహారాష్ట్ర: పండరీపుర అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ గెలుపు మిజోరం: సెర్చిప్ అసెంబ్లీ ఉపఎన్నికలో మిజో పార్టీ గెలుపు రాజస్తాన్: రాజసముంద్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ గెలుపు రాజస్తాన్: సహరా అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు రాజస్తాన్: సుజాన్ఘర్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఉత్తరాఖండ్: సాల్త్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ గెలుపు Time 02:30 PM తెలంగాణ: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధించారు. బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గెలుపొందారు. Time 01:30 PM రాజస్తాన్: ►రాజ్‌సమంద్‌లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి దీప్తి మహేశ్వరి గెలుపొందారు. ►సహారా అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గాయత్రీ దేవి విజయం సాధించారు. ►ఇక సుజంగఢ్ స్థానాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మనోజ్ కుమార్ జయకేతనం ఎగురవేశారు. Time 11:11AM కన్యాకుమారి(తమిళనాడు): కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ్ వసంత్, బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్ కంటే 25,643 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. Time 11:00 AM మలప్పురం(కేరళ): ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి అబ్దుసమత్ సమదాని , సీపీఐ(మార్క్సిస్టు) అభ్యర్థి వీపీ సను కంటే 8877 ఓట్ల ముందంజలో ఉన్నారు. ►గుజరాత్: మోర్వా ఉపఎన్నికలో బీజేపీ ఆధిక్యం ►జార్ఖండ్: మధుపూర్‌లో బీజేపీ ఆధిక్యం ►కర్ణాటక: బసవకల్యాణ్, మస్కిలో బీజేపీ ఆధిక్యం ►మధ్యప్రదేశ్: దామోలో కాంగ్రెస్ ఆధిక్యం ►మహారాష్ట్ర: పండేపూర్లో ఎన్సీపీ ఆధిక్యం ►ఉత్తరాఖండ్: సాల్త్లో బీజేపీ ఆధిక్యం ►రాజస్థాన్ ఉపఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం -
ఆ నిబంధన ప్రకారం రోజూ 4 షోలకే అనుమతి
తిరుపతి: వకీల్‌సాబ్ సినిమాకు, ఎన్నికలకు సంబంధం ఏంటని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం రోజు 4 షోలకే అనుమతుందని తెలిపారు. టికెట్ రేట్లు పెంచి జనం జేబులు కొట్టాలా.. పవన్ సినిమా కోసం ప్రత్యేకంగా నిబంధనలు మార్చరని కుండ బద్దలు కొట్టారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీ అసలు ఏపీ ప్రజలకు ఏం చేసిందో తెలపాలని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారని బీజేపీ మీద మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం పాచిపోయిన లడ్డూలు పెట్టిందని పవన్ గతంలో చేసిన ఆరోపణలను మంత్రి గుర్తుచేశారు. బీజేపీ నేతలు చెప్పిన అచ్చేదిన్ ఎక్కడ వచ్చిందో చెప్పాలని పేర్నినాని ప్రశ్నించారు. 14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో మాట్లాడాలంటే వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనకు తానే భజన చేసుకుంటున్నాడని, కానీ ఇప్పటికే ప్రజలు అతడిని తరిమికొట్టారని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని పేర్నినాని ధీమా వ్యక్తం అన్నారు. చదవండి: ‘రుణమాఫి పేరుతో చంద్రబాబు రైతులను దోచుకున్నాడు’ -
నోముల భగత్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
వివాదాస్పద సినిమాలను తెరకెక్కిస్తూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు తన పబ్లిసిటీని పెంచుకుంటారు. ఓ వైపు సంచలన సినిమాలను తీస్తూ, మరోవైపు పలు రాజకీయ, సామాజిక అంశాలపై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఆయన తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ ఆభ్యర్థిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తనకు ఓటు హక్కు ఉంటే సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఆభ్యర్థి నోముల భగత్‌కే ఓటు వేస్తానని ఆర్జీవీ అన్నారు. ఈ మేరకు చిరుతపులితో నోముల భగత్ కలిసి నడిచే వీడియోను వర్మ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అదే విధంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను సింహంతో పోల్చారు. చిరుతపులిని వాకింగ్‌కు తీసుకువెళుతున్న నోముల భగత్‌ను తాను ఇష్టపడుతున్నట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నోములు భగత్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. నోముల భగత్ తండ్రి నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే. ఇక రామ్ గోపాల్‌వర్మ నేతృత్వంలో తెరకెక్కుతున్న ‘డీ కంపెనీ’ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. The candidate @BagathNomula says “VOTE FOR US, that is ME and TRS —WE WILL ROAR in NAGARJUNA SAGAR byelection and no other party can DAM us” —and me saying Not in world history I saw a candidate campaigning with a chained CHEETAH 😘😍💐💃 Hats off to #KCR and @KTRTRS pic.twitter.com/d9Tpu8ebMa — Ram Gopal Varma (@RGVzoomin) April 2, 2021 VAAMMO we know #KCR and @KTRTRS are TIGER and LION but I love this candidate @BagathNomula who is taking a CHEETAH for a walk ..If I had a VOTE I will vote for this REAL HERO on 17th by-election of Nagarjuna Sagar pic.twitter.com/sYETa51Zq0 — Ram Gopal Varma (@RGVzoomin) April 2, 2021 -
‘ప్రభుత్వ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి’
-
‘ప్రభుత్వ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి’
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనితీరు, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీని తీసుకొస్తాయి అంటూ అదిమూలపు సురేష్ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు టీడీపీని నమ్మే స్థితిలో లేరని ఈ విషయం తెలియక ఆ పార్టీ నేతలు ఇంకా గెలుస్తామనే భ్రమల్లో బతుకుతున్నారని అన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు వైస్సార్సీపీ ఎంపీలు గొర్రెలంటూ నోరూపారేసుకోవడం సరైన పద్ధతి కాదంటూ మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు సింహాలో లేక గుంటనక్కలో ఈ ఉపఎన్నికల్లో తిరుపతి ప్రజలే తమ ఓటు ద్వారా తేలుస్తారని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను కేవలం మీ స్వార్థం కోసం తాకట్టు పెట్టి ,ప్యాకేజీకి కక్కర్తి పడింది టీడీపీ ప్రభుత్వం కాదా ? అని ప్రశ్నించారు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్న సమయంలో స్కూళ్ల లో నిబంధనలు పాటించకుండా విద్యార్థుల ఆరోగ్యం తో ఆడుకుంటే ఆ స్కూళ్ల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ( చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: ‘ఫ్యాను’దే హవా ) -
దుబ్బాక... మనకు కీలకం
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని, ఈ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. నాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, వారికి కేటాయించిన గ్రామాల్లోనే ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉండి పనిచేయాలని సూచించారు. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అధ్యక్షతన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా నవంబర్ 3న జరిగే దుబ్బాక ఉపఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై గంటకు పైగా చర్చించారు. అనంతరం మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని కోరారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని ఏఐసీసీ త్వరలోనే ప్రకటిస్తుందని చెప్పారు. సీఎంను కలుస్తారు... మాకేమో అనుమతి ఇవ్వరా? తెలంగాణలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, కాంగ్రెస్ నాయకులను కలవొద్దని రాష్ట్ర గవర్నర్ కూడా నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలుస్తామని చెప్పినా కరోనా పేరుతో అనుమతించలేదని, కానీ సీఎం కేసీఆర్‌కు మాత్రం కరోనా నిబంధనలు అడ్డురాలేదని విమర్శించారు. గవర్నర్, బీజేపీ, టీఆర్ఎస్లు ఒక్కటేనని దీన్ని బట్టి అర్థమవుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తీవ్ర ఉద్యమాలు చేయాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఎ.రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు. నేడు సత్యాగ్రహ దీక్షలు: ఉత్తమ్ దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలని, అందరికీ బాధ్యతలు అప్పగిస్తామని, ఎవరి బాధ్యతలను వారు సజావుగా నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. హాథ్రస్లో దళిత యువతి అత్యాచారం, హత్య కేసులో బాధితురాలికి న్యాయం జరిగే విధంగా కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని, ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గాంధీ, అంబేడ్కర్ విగ్రహాల వద్ద సత్యాగ్రహ దీక్షలు చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించారు. గాంధీభవన్ ఎదుట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఓటరు నమోదులో క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చురుగ్గా కొనసాగించాలన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. -
దుబ్బాకలో గెలిచి తీరాలి
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలని, ఆ దిశలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నేతలు కలసికట్టుగా పనిచేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రస్తుతం రాజకీ య వాతావరణం మారిపోయిందని, దీన్ని సద్వినియోగం చేసుకుని దుబ్బాకలో కాంగ్రెస్ కొట్టే దెబ్బకు కేసీఆర్ దిమ్మ తిరగాలన్నారు. శుక్రవా రం గాంధీభవన్‌లో దుబ్బాక నియోజకవర్గానికి చెందిన గ్రామస్థాయి నేతలతో జరిగిన సమీక్షలో ఉత్తమ్ మాట్లాడుతూ.. మూడ్రోజుల్లోగా దుబ్బాకలోని అన్ని మండలాల కమిటీలు పూర్తి చేయాలని కోరారు. వారంలో అన్ని గ్రామాల్లో పార్టీ, అనుబంధ సంఘాల కమిటీలు పూర్తి చేసి ఎప్పుడు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ కేడర్ ఈ ఎన్నికల్లో తెలివిగా వ్యవహరించి అధికార టీఆర్ఎస్ను దెబ్బతీయాలని కోరారు. -
దుబ్బాకపై టీఆర్ఎస్ కన్ను
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్యత ఏర్పడింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెప్టెంబర్ మూడోవారంలో ఎన్నికల షెడ్యూలు రావచ్చని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత లేదా కుమారుడు సతీష్‌రెడ్డికి టికెట్ దక్కడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ వేదికగా అభ్యర్థి ప్రకటన? రామలింగారెడ్డి మరణంపై సంతాప తీర్మానంతో ఈ నెల ఏడో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రామలింగారెడ్డి కుటుంబసభ్యులకు టికెట్‌ను కేటాయించే పక్షంలో అసెంబ్లీ వేదికగానే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జర్నలిస్టుగా పనిచేసిన రామలింగారెడ్డి 2004, 2008లో దొమ్మాట నుంచి, 2009, 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాక నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2009 మినహా అన్ని ఎన్నికల్లోనూ రామలింగారెడ్డి గెలుపొందారు. 2018 మినహా అన్ని ఎన్నికల్లోనూ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ముత్యంరెడ్డి గత ఏడాది సెప్టెంబర్‌లో అనారోగ్యంతో మరణించారు. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీని వాస్‌రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గాన్ని చుట్టివచ్చిన హరీశ్ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గాలకు దుబ్బాక పొరుగునే ఉంది. మంత్రి హరీష్‌రావు దుబ్బాక నియోజకవర్గంలో మండలాలవారీగా విస్తృతంగా పర్యటించి కార్యకర్తలతో భేటీ అయ్యారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ, చెరువుల్లో చేపలు వదలడం వంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కేడర్ చెక్కుచెదరకుండా చూడటంతోపాటు అసంతృప్తుల బుజ్జగింపు, ఇతర పార్టీల నుంచి చేరికలు తదితరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పావులు కదుపుతున్నారు. ఉప ఎన్నికల్లో తనకు కేసీఆర్ ఎక్కడ బాధ్యత అప్పగించినా గెలిపించిన విషయాన్ని గుర్తు చేస్తూ కార్యకర్తల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. -
వచ్చే నెల 7న ‘నిజామాబాద్ ఎమ్మెల్సీ’ పోలింగ్
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ శాసన మండలిలో సుమారు ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో టీఆర్ఎస్ పక్షాన శాసన మండలికి ఎన్నికైన ఆర్.భూపతిరెడ్డి పార్టీ ఫిరాయించారనే కారణంతో గత ఏడాది జనవరి 16న మండలి చైర్మ న్ అనర్హత వేటు వేశారు. 2022, జనవరి 4 వరకు నిజామాబాద్ కోటా శాసన మండలి సభ్యుడి పదవీ కాలం ఉండటంతో ఖాళీని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 12న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23వ తేదీ నామినేషన్ల ఉప సంహరణకు గడువు కాగా, ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో ఏప్రిల్ 7వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఏప్రి ల్ 9న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. ఏప్రిల్ 13లోగా నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్లో పేర్కొంది. -
వార్ వన్‌సైడ్
-
హోరాహోరీగా హూజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారం
-
కర్ణాటకలో డిసెంబర్లో ఉపఎన్నికలు
సాక్షి బెంగళూరు: కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు మరోమారు ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్ 9న కౌంటింగ్ జరగనుంది. ఈ ప్రక్రియలో భాగంగా నవంబరు 11 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 19న నామినేషన్ల పరిశీలన, 21న నామినేషన్ల ఉపసంహరణ ఉండనుంది. ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం వచ్చే అక్టోబరు 21వ తేదీన 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ – జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు అక్టోబరు 22న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తీర్పు వచ్చే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని అనర్హత ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు పట్టుబట్టారు. ఫలితంగా ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. -
ఎన్ని పీతలు ఏకమైనా మమ్మల్నేమీ చేయలేవు
సాక్షి, హైదరాబాద్: నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి తదితరులు ఏకతాటి మీదకు రావడం పీతల కలయిక వంటిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. హుజూర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానా సైదిరెడ్డితో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్లో కూడా మీడియాతో ముచ్చటించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఎన్ని పీతలు ఏకమైనా తమను ఏమీ చేయలేవని.. గెలిచేందుకు కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ప్రస్తుత ఉప ఎన్నికను ముడిపెట్టొద్దని, అసెంబ్లీ, స్థానిక ఎన్నికల తరహాలో ప్రజలు టీఆర్ఎస్ వెంట ఉంటారన్నారు. ‘హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకలాంటిదే. ఎంత మెజార్టీ సాధిస్తామని పోలింగ్ తేదీ సమీపించినపుడు వెల్లడిస్తాం. కాంగ్రెస్‌తోనే మాకు అక్కడ పోటీ.. బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనుభవంతో తగు జాగ్రత్తలు తీసుకుంటాం.మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు’అని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గెలుపు మాకు బూస్టప్.. హుజూర్నగర్ నియోజవర్గాన్ని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదని, స్థానిక శాసనసభ్యుడి కృషి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జగదీశ్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లో తమ కార్యకర్తలను టీఆర్ఎస్ బెదిరింపులకు గురిచేస్తోందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలన్నారు. టీఆర్ఎస్ రాజకీయ గొడవలకు పూర్తి దూరంగా ఉంటుందని, 2014 తర్వాత హుజూర్నగర్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క రాజకీయ కేసు లేదన్నారు. హుజూర్‌నగర్‌లో గెలుపుతో తమకు బూస్టప్ వస్తుందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ అంశంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. సీఎంను కలిసిన సైదిరెడ్డి హుజూర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానా సైదిరెడ్డి శనివారం సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన విషయం తెలుసుకున్న సైదిరెడ్డి మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని మంత్రి జగదీశ్‌రెడ్డి నివాసానికి ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. అనంతరం మంత్రితో పాటు ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారం, సమన్వయంలో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవడంతో పాటు, అందరినీ కలుపుకొనివెళ్లి విజయం సాధించాలని సీఎం సూచించినట్లు తెలిసింది. -
వ్యూహాత్మకంగా... ఆఖర్లో ఖరారు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో పూర్తి ఆధిపత్యంతో ఉన్న టీఆర్ఎస్... ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లోనూ కచ్చితంగా గెలుపు సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీలోకి దించాలని నిర్ణయించింది. 2015లో ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.అప్పుడు నల్ల గొండ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ఫలితానికి ఆస్కారం ఇవ్వకూడదని టీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు స్థానాలను గెలుచుకోవాలని నిర్ణయించుకుంది. ఆ అవకాశాలు ఉండే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. ప్రతిపక్ష పార్టీల్లో అయోమయం కలిగించేలా.. టీఆర్ఎస్ టికెట్ కోసం ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లోని పలువురు నేతలు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావును కలిసే ప్రయత్నం చేశారు. అయితే కేటీఆర్ మాత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఆశావహులకు సమాచారం పంపించారు. కేరళ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ దగ్గరికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వెళ్లారు. కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్‌కు వచ్చాకే అభ్యర్థులపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. నామినేషన్ల గడువు 14తో ముగుస్తోంది. దానికి ఒకటిరెండు రోజుల ముందు మాత్రమే అభ్యర్థుల ప్రకటనకు అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో అయోమయం కలిగించేలా ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానంలో టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, టీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి... వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కపల్లి రవీందర్రావు, రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి... రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కొత్తగా పార్టీలో చేరిన పటోళ్ల కార్తీక్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తోంది.నల్లగొండ స్థానానికి ప్రస్తుత ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి కె.నవీన్‌రావును ప్రకటించే అంశాన్నీ పరిశీలిస్తోంది. సీఎం కేసీఆర్‌తో కేటీఆర్... దేవాలయాల సందర్శన కోసం కేరళ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ బృందంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చేరారు. కేటీఆర్ సతీసమేతంగా బుధవారం కేరళకు వెళ్లారు. సీఎం కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులతోపాటు ఎంపీ సంతోష్‌కుమార్ ఈ పర్యటనలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌తో కలసి వెళ్లిన కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్... కేరళ సీఎం పినరయ్ విజయన్‌తో భేటీ అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్నారు. -
తెలంగాణలో లోక్‌సభకు 9సార్లు ఉప ఎన్నికలు
తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. పలు స్థానాల్లో 9 పర్యాయాలు ఉప ఎన్నికలు జరిగాయి. 1960 నుంచి 1987 వరకు ఏడు స్థానాలకు ఐదు ఉప ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావం తర్వాత 2006 నుంచి 2015 వరకు నాలుగు నోటిఫికేషన్ల ద్వారా ఏడు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 1960 నుంచి 1987 వరకు ఏడు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆరుచోట్ల కాంగ్రెస్, ఒక స్థానంలో ఇతర పార్టీ అభ్యర్థి గెలిచారు. 2006 నుంచి 2015 వరకు వచ్చిన ఉప ఎన్నికల్లో ఐదుసార్లు టీఆర్ఎస్, ఒకసారి కాంగ్రెస్, మరోసారి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.- గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి– వరంగల్ కేసీఆర్ రెండుసార్లు గెలుపు ♦ 1960 ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగగా కాంగ్రెస్ అభ్యర్థి వి.కాశీరాం గెలుపొందారు. ♦ 1965 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆర్.సురేందర్‌రెడ్డి (కాంగ్రెస్) గెలిచారు. ♦ 1979లో వరంగల్, సికింద్రాబాద్, సిద్దిపేట పార్లమెంట్ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జి.మల్లికార్జున్, పి.శివశంకర్, నంది ఎల్లయ్య విజయం సాధించారు. ♦ 1983లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గొట్టె భూపతి(టీడీపీ) గెలిచారు. ♦ 1987లో సికింద్రాబాద్ నుంచి టి.మణెమ్మ (కాంగ్రెస్) గెలుపొందారు. ♦ 2006 నుంచి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగంగా తొలిసారిగా 2006లో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గెలుపొందారు. ♦ 2008లో కరీంనగర్, హన్మకొండ, వరంగల్, ఆదిలాబాద్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, చెరొక చోట టీడీపీ, కాంగ్రెస్ గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కేసీఆర్ గెలుపొందగా, హన్మకొండ నుంచి బి.వినోద్‌కుమార్ (టీఆర్ఎస్), వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు (టీడీపీ), ఆదిలాబాద్ నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (కాంగ్రెస్) విజయం సా«ధించారు. ♦ 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఎంపీలుగా గెలిచిన కేసీఆర్, కడియం శ్రీహరి.. తరువాత రాజీనామాలు చేయడంతో ఏర్పడిన ఖాళీల సందర్భంగా జరిగిన ఉప ఎన్నికలో మెదక్ నుంచి కె.ప్రభాకర్ రెడ్డి (టీఆర్ఎస్), వరంగల్ నుంచి పసునూరి దయాకర్ (టీఆర్ఎస్) విజయం సాధించారు. -
చిత్తూరు మేయర్‌గా హేమలత
చిత్తూరు అర్బన్: మేయర్ కుర్చీని రెండోమారు మహిళ అధిష్టించారు. 17 నెలలుగా ఖాళీగా ఉన్న మేయర్ పదవి ఎట్టకేలకు భర్తీ అయింది. అప్పటివరకు మేయర్‌గా ఉన్న అనురాధ హత్యకు గురవడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. బీసీ-మహిళకు రిజర్వు అయిన మేయర్ స్థానంలో పురుషుడు పాలన సాగించడంపై మహిళా కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగి చిత్తూరులో ఖాళీగా ఉన్న 33, 38వ వార్డులకు ఉప ఎన్నిక నిర్వహించింది . 33వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన దివంగత మేయర్ అనురాధ కోడలు హేమలత చేత తొలుత ఇన్చార్జ్ మేయర్ ఆర్.సుబ్రమణ్యం కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కౌన్సిల్ హాలుకు చేరుకున్న కలెక్టర్ కార్పొరేటర్ల హాజరును తనిఖీ చేసి కోరం ఉన్నట్లు ప్రకటించారు. మేయర్ పదవికి హేమలతను టీడీపీ తమ అభ్యర్థిగా ప్రకటించి విప్ జారీ చేయడంతో ఇన్చార్జి మేయర్ ప్రతిపాదించగా కార్పొరేటర్ కిరణ్ బలపరిచారు. ఎవరూ పోటీ లేకపోవడంతో హేమలత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించి ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. -
నేడు ఉప ఎన్నిక ఫలితాలు
ఆత్మకూరు: ఆత్మకూరు నగర పంచాయతీలో రెండో వార్డుకు జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఉప ఎన్నికలలో 1415 ఓట్లకు గాను 1165 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు పోలింగ్ బూత్‌లో రెండు ఏవీఎంల ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మిషన్ 10 నిమిషాలలోపే ఫలితాలు వెల్లవడుతుంది. కేవలం అరగంట లోపే ఫలితాలు వెలువడనున్నాయి. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గం ఇన్చార్జి బుడ్డా శేషారెడ్డి.. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపే లక్ష్యంగా ఇద్దరు పట్టుదలతో ఉన్నారు. -
‘తెలుగుదేశం పార్టీకి అంత దమ్ము లేదు’
-
‘తెలుగుదేశం పార్టీకి అంత దమ్ము లేదు’
శ్రీకాకుళం : రాష్ట్రంలో ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసన సభ సమావేశాలు తుతూమంత్రంగా జరపడం సరికాదని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. ప్రజల ఆవేదనను వినపించడానికి వేదికైన శాసనసభను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. పక్క రాష్ట్రాలు అయిన ఒడిశాలో 85 రోజులు, తెలంగాణలో 75 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే ఏపీలో మాత్రం ఎందుకు అన్నిరోజులు నడపలేకపోతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే టీడీపీ గెలుస్తుందనే నమ్మకం లేకే నామినేషన్లు వేసినవారిని బెదిరిస్తున్నారని ధర్మాన మండిపడ్డారు. ఇతర పార్టీల నుంచి 20మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారికి మంత్రి పదవులు ఇస్తామనడం అవమానకరమని ఆయన అన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో ఒక్క ఎన్నిక కూడా జరపలేక అధికార పార్టీ భయపడుతోందని, ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము టీడీపీకి లేదన్నారు.