ఆత్మకూరు: ఆత్మకూరు నగర పంచాయతీలో రెండో వార్డుకు జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఉప ఎన్నికలలో 1415 ఓట్లకు గాను 1165 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు పోలింగ్ బూత్‌లో రెండు ఏవీఎంల ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మిషన్ 10 నిమిషాలలోపే ఫలితాలు వెల్లవడుతుంది. కేవలం అరగంట లోపే ఫలితాలు వెలువడనున్నాయి. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గం ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి.. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపే లక్ష్యంగా ఇద్దరు పట్టుదలతో ఉన్నారు.