
నవంబర్ 13–20 తేదీల మధ్య ఎగ్జిట్ పోల్స్‌పై ఆంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధాన్ని అమలు చేయనుంది.
ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు పార్లమెంటరీ స్థానాలు, 48 శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికల సందర్భంగా మీడియా సంస్థలు లేదా మరే ఇతర పద్ధతిలో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది.
ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ తెలిపింది. నవంబర్ 13 నుంచి నవంబర్ 20 వరకు ఎగ్జిట్ పోల్స్‌ఫై ఆంక్షలు విధించారు.
Comments
Please login to add a commentAdd a comment