
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కేరళలోని మలప్పురం, తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 6న, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం పార్లమెంటరీ సీట్లకు ఏప్రిల్ 17న ఉప ఎన్నిక నిర్వహించారు. అదే విధంగా కర్ణాటకలోని బసవకళ్యాణ్, మస్కి, గుజరాత్‌లోని మోర్వా హదాఫ్, జార్ఖండ్‌లోని మధుపూర్, మధ్యప్రదేశ్‌లోని దామో, మహారాష్ట్రలోని పండేపూర్, మిజోరాంలోని సెర్చిప్, నాగాలాండ్‌లోని నొక్సెన్, తెలంగాణలోని నాగార్జున సాగర్, ఉత్తరాఖండ్‌లోని సాల్ట్ తదితర 13 అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్ జరిగింది.
Time: 05:00 Pm
గుజరాత్: మోర్వా అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ విజయం
జార్ఖండ్: మధుపుర అసెంబ్లీ ఉపఎన్నికలో జెఎంఎం విజయం
కర్ణాటక: బసవకళ్యాణ్, అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ గెలుపు
కర్ణాటక: మాస్కీ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు
మధ్యప్రదేశ్: దామో అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు
మహారాష్ట్ర: పండరీపుర అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ గెలుపు
మిజోరం: సెర్చిప్ అసెంబ్లీ ఉపఎన్నికలో మిజో పార్టీ గెలుపు
రాజస్తాన్: రాజసముంద్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ గెలుపు
రాజస్తాన్: సహరా అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు
రాజస్తాన్: సుజాన్‌ఘర్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు
ఉత్తరాఖండ్: సాల్త్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ గెలుపు
Time 02:30 PM
తెలంగాణ: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధించారు. బీజేపీ డిపాజిట్ కోల్పోయింది.
ఆంధ్రప్రదేశ్: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గెలుపొందారు.
Time 01:30 PM
రాజస్తాన్:
►రాజ్‌సమంద్‌లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి దీప్తి మహేశ్వరి గెలుపొందారు.
►సహారా అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గాయత్రీ దేవి విజయం సాధించారు.
►ఇక సుజంగఢ్ స్థానాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మనోజ్ కుమార్ జయకేతనం ఎగురవేశారు.
Time 11:11AM
కన్యాకుమారి(తమిళనాడు): కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ్ వసంత్, బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్ కంటే 25,643 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Time 11:00 AM
మలప్పురం(కేరళ): ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి అబ్దుసమత్ సమదాని , సీపీఐ(మార్క్సిస్టు) అభ్యర్థి వీపీ సను కంటే 8877 ఓట్ల ముందంజలో ఉన్నారు.
►గుజరాత్: మోర్వా ఉపఎన్నికలో బీజేపీ ఆధిక్యం
►జార్ఖండ్: మధుపూర్‌లో బీజేపీ ఆధిక్యం
►కర్ణాటక: బసవకల్యాణ్, మస్కిలో బీజేపీ ఆధిక్యం
►మధ్యప్రదేశ్: దామోలో కాంగ్రెస్ ఆధిక్యం
►మహారాష్ట్ర: పండేపూర్‌లో ఎన్సీపీ ఆధిక్యం
►ఉత్తరాఖండ్: సాల్త్‌లో బీజేపీ ఆధిక్యం
►రాజస్థాన్ ఉపఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం
Comments
Please login to add a commentAdd a comment