
తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. పలు స్థానాల్లో 9 పర్యాయాలు ఉప ఎన్నికలు జరిగాయి. 1960 నుంచి 1987 వరకు ఏడు స్థానాలకు ఐదు ఉప ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఆవిర్భావం తర్వాత 2006 నుంచి 2015 వరకు నాలుగు నోటిఫికేషన్ల ద్వారా ఏడు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 1960 నుంచి 1987 వరకు ఏడు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆరుచోట్ల కాంగ్రెస్, ఒక స్థానంలో ఇతర పార్టీ అభ్యర్థి గెలిచారు. 2006 నుంచి 2015 వరకు వచ్చిన ఉప ఎన్నికల్లో ఐదుసార్లు టీఆర్‌ఎస్, ఒకసారి కాంగ్రెస్, మరోసారి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.- గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి– వరంగల్
కేసీఆర్ రెండుసార్లు గెలుపు
♦ 1960 ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగగా కాంగ్రెస్ అభ్యర్థి వి.కాశీరాం గెలుపొందారు.
♦ 1965 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆర్.సురేందర్‌రెడ్డి (కాంగ్రెస్) గెలిచారు.
♦ 1979లో వరంగల్, సికింద్రాబాద్, సిద్దిపేట పార్లమెంట్ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జి.మల్లికార్జున్, పి.శివశంకర్, నంది ఎల్లయ్య విజయం సాధించారు.
♦ 1983లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గొట్టె భూపతి(టీడీపీ) గెలిచారు.
♦ 1987లో సికింద్రాబాద్ నుంచి టి.మణెమ్మ (కాంగ్రెస్) గెలుపొందారు.
♦ 2006 నుంచి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగంగా తొలిసారిగా 2006లో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గెలుపొందారు.
♦ 2008లో కరీంనగర్, హన్మకొండ, వరంగల్, ఆదిలాబాద్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో రెండు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్, చెరొక చోట టీడీపీ, కాంగ్రెస్ గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కేసీఆర్ గెలుపొందగా, హన్మకొండ నుంచి బి.వినోద్‌కుమార్ (టీఆర్‌ఎస్), వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు (టీడీపీ), ఆదిలాబాద్ నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (కాంగ్రెస్) విజయం సా«ధించారు.
♦ 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఎంపీలుగా గెలిచిన కేసీఆర్, కడియం శ్రీహరి.. తరువాత రాజీనామాలు చేయడంతో ఏర్పడిన ఖాళీల సందర్భంగా జరిగిన ఉప ఎన్నికలో మెదక్ నుంచి కె.ప్రభాకర్ రెడ్డి (టీఆర్‌ఎస్), వరంగల్ నుంచి పసునూరి దయాకర్ (టీఆర్‌ఎస్) విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment