రాష్ట్రంలో ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసన సభ సమావేశాలు తుతూమంత్రంగా జరపడం సరికాదని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. ప్రజల ఆవేదనను వినపించడానికి వేదికైన శాసనసభను సక్రమంగా నిర్వహించాలని అన్నారు.