కర్ణాటకలో డిసెంబర్‌లో ఉపఎన్నికలు | By-elections in December in Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో డిసెంబర్‌లో ఉపఎన్నికలు

Published Sat, Sep 28 2019 3:45 AM | Last Updated on Sat, Sep 28 2019 3:45 AM

By-elections in December in Karnataka - Sakshi

సాక్షి బెంగళూరు: కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు మరోమారు ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్‌ 9న కౌంటింగ్‌ జరగనుంది. ఈ ప్రక్రియలో భాగంగా నవంబరు 11 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 19న నామినేషన్ల పరిశీలన, 21న నామినేషన్ల ఉపసంహరణ ఉండనుంది.

ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన నోటిఫికేషన్‌ ప్రకారం వచ్చే అక్టోబరు 21వ తేదీన 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్‌ – జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు అక్టోబరు 22న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తీర్పు వచ్చే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని అనర్హత ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు పట్టుబట్టారు. ఫలితంగా ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement