స్ట్రాంగ్ రూమ్ వద్ద రాహుల్ బొజ్జా, కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందనాదీప్తి
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 72.44 శాతం పోలింగ్
అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 78.59 శాతం
అత్యల్పంగా ఖమ్మంలో 67.62 శాతం పోలింగ్ నమోదు
జూన్ 5న కౌంటింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ– ఖమ్మం– వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి 3 జిల్లాల పరిధిలో 72.44% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 78. 59% నమోదైంది. అత్యల్పంగా ఖమ్మం జిల్లా లో 67.62% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ఉద యం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జర గ్గా, 12 జిల్లాల పరిధిలోని బ్యాలెట్ బాక్సులన్నింటినీ గట్టి బందోబస్తు మధ్య నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది పోటీలో ఉన్నా రు. ప్రధాన పోటీ 3 పార్టీల అభ్యర్థుల మధ్య నే కొనసాగగా, జూన్ 5న వీరి భవితవ్యం తేలనుంది.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత..
నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పల పల్లిలో గిడ్డంగుల సంస్థ గోదాములోని స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఇక్కడ మూడంచెల భద్రత ఉంది. చుట్టుపక్కల 144 సెక్షన్ విధించడంతోపాటు పోలీసులు 24 గంటలపాటు సాయుధ రక్షణలో పహారా కాస్తూ సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లోని బ్యాలెట్ బాక్సులను మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు రాహుల్ బొజ్జా, రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment