graduates mlc elections
-
అధికారులపై ఆరోపణలు సరికాదు
నల్లగొండ: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గట్టెకే పరి స్థితి లేక.. కౌంటింగ్ హా ల్ నుంచి ఉత్త చేతులతో పోవడం ఎందుకని, అధికారుల మీద మట్టిపోసి పోయే పనులు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. గురువారం నల్లగొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిలు ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై, జిల్లా అధికారులపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ ఎన్నికలో రూ.100 కోట్లు ఖర్చుపెట్టి గెలుపొందాలని చేసిన ప్రయత్నం..బోగస్ ఓట్లతో లబ్ధిపొందాలనే కుతంత్రం బెడిసి కొట్టడంతో ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
కొనసాగుతున్న కౌంటింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి 4 హాళ్లలో ఏర్పాటు చేసిన 96 టేబుళ్లపై ఉంచి 25 బ్యాలెట్ పేపర్లను ఒక బండిల్‌గా కట్టే ప్రక్రియను మొదట ప్రారంభించారు. ఆ బండిళ్లు కట్టే ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 5 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అర్ధరాత్రి దాటినా కూడా మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడికాలేదు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 4 రౌండ్ల తర్వాత మొదటి ప్రాధాన్యత ఫలితం పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 4,63,839 ఓట్లుండగా 3,36,013 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నాలుగు రౌండ్లలో ఈ లెక్కింపు పూర్తవుతుంది. నాలుగు హాళ్లలో ఏర్పాటు చేసిన 96 టేబుళ్లలో ఒక టేబుల్‌కు ఒక రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కిస్తున్నారు. అంటే ప్రతి రౌండ్లో 96 వేల చొప్పున 4వ రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు. మొదటి రౌండ్‌కు 6 గంటల సమయం: మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపునకు దాదాపు 6 గంటల సమయం పట్టింది. మిగతా మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల వరకు పూర్తయ్యే అవకాశముంది. ఓట్ల లెక్కింపు సమయంలోనే ఆయా అభ్యర్థులకు బ్యాలెట్ పేపర్లు చూపి ఏ అభ్యరి్థకి మొదటి ప్రాధాన్యత ఓటు వేశారో చూపించి, ఆ అభ్యర్థి డబ్బాలో వేస్తున్నారు. ఒక వేళ ఏదేని ఓటు చెల్లకపోతే అది ఏజెంట్లకు చూపి చెల్లని ఓట్ల డబ్బాలో వేస్తున్నారు. ఇలా ప్రతి రౌండ్లోనూ కౌంటింగ్ సందర్భంగా చెల్లిన, చెల్లని ఓట్లు లెక్కిస్తున్నారు. పూర్తయిన మొదటి రౌండ్ కౌంటింగ్ బుధవారం రాత్రి 12 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన మొదటి రౌండ్ లెక్కింపునకు ఆరు గంటల సమయం పట్టింది. అయితే మిగతా మూడు రౌండ్లకు అంత సమయం పట్టదని, వాటికి తక్కువ సమయమే పడుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి నాలుగు రౌండ్లలో జరిగే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల వరకు పూర్తయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. -
స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్సులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ– ఖమ్మం– వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి 3 జిల్లాల పరిధిలో 72.44% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 78. 59% నమోదైంది. అత్యల్పంగా ఖమ్మం జిల్లా లో 67.62% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ఉద యం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జర గ్గా, 12 జిల్లాల పరిధిలోని బ్యాలెట్ బాక్సులన్నింటినీ గట్టి బందోబస్తు మధ్య నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది పోటీలో ఉన్నా రు. ప్రధాన పోటీ 3 పార్టీల అభ్యర్థుల మధ్య నే కొనసాగగా, జూన్ 5న వీరి భవితవ్యం తేలనుంది.స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత..నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పల పల్లిలో గిడ్డంగుల సంస్థ గోదాములోని స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఇక్కడ మూడంచెల భద్రత ఉంది. చుట్టుపక్కల 144 సెక్షన్ విధించడంతోపాటు పోలీసులు 24 గంటలపాటు సాయుధ రక్షణలో పహారా కాస్తూ సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లోని బ్యాలెట్ బాక్సులను మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు రాహుల్ బొజ్జా, రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన పరిశీలించారు. -
గుడుల పేరుతో మేం ఓట్లడగలేదు: కేటీఆర్
సాక్షి,యాదాద్రి భువనగిరిజిల్లా: మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా అని ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు నెరవేరలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భువనగిరిలో ఆదివారం(మే19) జరిగిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘మోదీ గుడి కట్టినం అని ఓట్లు అడుగుతుండు. మేం కూడా గుడి నిర్మించాం. గుడి పేరుతో ఓట్లు అడగలేదు. మేము ప్రాజెక్టులు కట్టాం. అవికూడా దేవుళ్ళ పేరు మీద కట్టాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు నాట్లు వేస్తునప్పుడు రైతు బంధు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓట్లు వేస్తునప్పుడు మాత్రమే రైతులకు రైతు బంధు వేస్తున్నారు.కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇచ్చి నేనిచ్చా అని చెప్పుకోవడానికి రేవంత్‌రెడ్డికి సిగ్గుండాలి. ఒక వైపు బిట్స్ బిలాని చదువుకున్న అభ్యర్థి ఉన్నాడు. మరోవైపు బ్లాక్ మెలర్, లాబీయింగ్, పైశాచిక ఆనందం పొందే అభ్యర్థి ఉన్నాడు. ఎవరికి ఓటు వేయాలో పట్టభద్రులు తేల్చుకోవాలి’అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
ఆ రెండూ ప్రతిష్టాత్మకమే
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉపఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికలతోపాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆ తర్వాత ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండూ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కావడంతో వాటిని తిరిగి గెలుచుకోవడంపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక రాగా, ఈ నెల 13న జరిగే లోక్‌సభ పోలింగ్తోపాటు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా పోలింగ్ జరగనుంది. మరోవైపు ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో పల్లా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా పల్లా పదవీకాలం 2027 ఏప్రిల్‌లో ముగియనుంది. తాజాగా ఎన్నికల కమిషన్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9 వరకు నామినేషన్ల స్వీకరణ, ఈ నెల 27న పోలింగ్ జరుగుతుంది.లాస్య నందిత సోదరి కోసం.. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్లో తమ అభ్యర్థి నివేదిత గెలుపు కోసం బీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి ప్రచార సమన్వయ బాధ్యతలు అప్పగించగా, పార్టీ నేత రావుల శ్రీధర్‌రెడ్డి నియోజకవర్గ ప్రచార ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు మల్కాజిగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డులు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక డివిజన్ వారీగా ప్రచార బాధ్యతలు పంచుకొని పనిచేస్తున్నారు.అయితే ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ ఆశించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర ఆశావహులు గజ్జెల నాగేశ్ కేసీఆర్ బస్సు యాత్రలో ఉండగా, ఎర్రోⶠ్ల శ్రీనివాస్ సంగారెడ్డి ప్రచార సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. నివేదిత తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రచారంపై ఆ ప్రభావం పడకుండా చూడాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు ఇప్పటికే నియోజకవర్గంలో రోడ్‌షోల్లో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు.నేడు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్శాసనమండలి ఆరంభం నుంచి బీ ఆర్ఎస్ అభ్యర్థులే ‘వరంగల్– ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఈ నేప థ్యంలో ప్రస్తుతం ఈ స్థానానికి జరుగు తున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేరును అధినేత కేసీఆర్ రెండు రోజుల క్రితం ఖరారు చేశారు. రాకేశ్ రెడ్డి మంగళ వారం నల్ల గొండ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. బీఆర్ ఎస్ టికెట్ పార్టీ నేతలు ఓ.నర్సింహారెడ్డి, డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, సుందర్ రాజు తదితరులు ఆశించారు. అయినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ రెడ్డికి టికెట్ దక్కింది. ఇక్కడ గెలుపును బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమ న్వయంతో పనిచేయడం ద్వారా ప్రచారంలో పైచేయి సాధించాలని భావి స్తోంది. దీంతో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న పార్టీ అధి నేత కేసీఆర్ ఈ నెల 12న లేదా 14న మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్యనేతలతో తెలంగాణభవన్‌లో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
అది అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం కాదు
సాక్షి, అమరావతి: పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాన్ని ఏమాత్రం ప్రతిబింబించవంటూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టిపారేశారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ఓటర్లలో మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది లక్షల మంది ఓటర్లు ఒక భాగం మాత్రమేనని స్పష్టం చేశారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితాలతోనే తాము బలం పుంజుకున్నామని.. ఏదో జరిగిపోతుందని టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. శనివారం ఆయన వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పీడీఎఫ్, వామపక్షాల ఓట్లతోనే.. ♦ గతంలో పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు, పీడీఎఫ్, ఉపాధ్యాయ సంఘాల యూనియన్లు, ఇతర యూనియన్లు పోటీ చేస్తే.. వాటికి రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చేవి. ఈసారి మూడు పట్టభద్ర, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రయోగాత్మకంగా వైఎస్సార్సీపీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపాం. ♦ ఉపాధ్యాయులు వైఎస్సార్సీపీని ఆదరించి, రెండు స్థానాల్లోనూ గెలిపించారు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ఇదే ప్రథమం. ఇది వైఎస్సార్సీపీకి గొప్ప విజయం. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి పీడీఎఫ్, వామపక్షాలు ఓట్లేయించడం వల్లే ఆ పార్టీ గెలిచింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి గణనీయమైన ఓట్లు దక్కాయి. ♦ సంక్షేమాభివృద్ధి ఫలాలు దక్కిన ఓటర్లలో పట్టభద్రులు తక్కువగా ఉన్నారు. వారికి మా సందేశాన్ని పంపడంలో కొంత ఇబ్బంది ఏర్పడింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయి. వైఎస్సార్సీపీ ఓట్లు టీడీపీ అభ్యర్థి ఓట్లలో కలిపారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. 2024లో వైఎస్సార్సీపీ విజయం తథ్యం ♦ ఉమ్మడి రాష్ట్రంలో 2007లో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించిన టీడీపీ.. 2009 లో సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మళ్లీ గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ♦సీఎం జగన్ అమలుచేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. 2024లో వైఎస్సార్సీపీ విజయం తథ్యం. 2019 ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలు, తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రికార్డు విజయాలు సాధించడం ఇందుకు నిదర్శనం. ఓటుకు కోట్లు తరహాలో కుట్ర ♦ శాసనసభలో టీడీపీకి సాంకేతికంగా 23 మంది సభ్యులు ఉన్నప్పటికీ.. అందులో నలుగురు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. సంఖ్యా బలం లేకపోయినా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానానికి టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించారు. ♦ గతంలో తెలంగాణలో సంఖ్యా బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి.. నోట్ల కట్టలతో సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపులతో చంద్రబాబు పట్టుబడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే రీతిలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చంద్రబాబు కుట్రలు చేయొచ్చు. -
టీడీపీ కట్టల్లోకి వైఎస్సార్సీపీ ఓట్లు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో తీవ్ర తప్పిదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసిన ఓట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండిల్స్‌లో కలిపారు. 8వ రౌండు ఓట్ల లెక్కింపులో 19వ టేబుల్ వద్ద ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని గమనించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఓట్లను తిరిగి లెక్కించగా ఆరు ఓట్లు టీడీపీ కట్టలో కలిశాయని స్పష్టమైంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా ఎన్ని ఓట్లను ఇలా కలిపారోనన్న అనుమానం ఉందని, మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలని రిటర్నింగ్ అధికారి కేతన్‌గార్గ్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ కూడా రాశారు. ఇంతమంది కౌంటింగ్‌లో ఉన్నప్పుడే ఇలా తమ ఓట్లను టీడీపీ ఖాతాలో కలిపేయడం దారుణమన్నారు. తొలి, రెండో రౌండులో వెయ్యి ఓట్లకు పైగా మెజారిటీ వస్తే, మూడో రౌండు నుంచి 20, 30 ఇలా తూకమేసినట్టు మెజారిటీ రావడంపైనా అనుమానాలున్నాయన్నారు. కాగా, ఒకసారి కౌంటింగ్ పూర్తయి బండిల్స్‌ను కలిపేస్తే తిరిగి లెక్కించడం కుదరదని, అభ్యంతరం వ్యక్తం చేసిన ఏ బాక్స్ అయినా తిరిగి లెక్కిస్తామని రిటర్నింగ్ అధికారి చెప్పారు. -
బీసీ మహిళకు చంద్రబాబు షాక్..
సాక్షి, విశాఖపట్నం : నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మరోమారు నిరూపితమైంది. ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళా నేతకు మధ్యలోనే వెన్నుపోటు పొడిచి.. వేరే వ్యక్తికి టికెట్ ఖరారు చేయడం జిల్లా టీడీపీ నాయకులను సైతం విస్మయానికి గురిచేసింది. టికెట్ కేటాయించిన మూడు నెలలకే అభ్యరి్థని మార్చేశారు. ఆదరాబాదరాగా తొలుత అభ్యర్థిని ప్రకటన చేసి.. డబ్బులు లేవన్న కారణంతో ఆమెకు మొండిచెయ్యి చూపించారు. మహిళలకు పార్టీలో గౌరవం లేదంటూ ఇటీవలే ఆ పార్టీలో ఉన్న మహిళా నేతలు బాహాటంగా చెప్పిన విషయాలు.. తాజా నిర్ణయంతో మరోసారి నిరూపితమైంది. బీసీ మహిళకు షాక్ ఇచ్చి సామాజిక వర్గ ప్రాతిపదికపై ఎంపిక చేశారు. మార్చిలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సందడి మొదలైంది. పార్టీ పూర్తిగా పట్టుకోల్పోతున్న నేపథ్యంలో ఎన్ని కుయుక్తులైనా పన్ని.. విజయం సాధించాలని చంద్రబాబు నానా యాతన పడుతున్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న అంశంపై సుదీర్ఘ మంతనాలు, సదస్సులు నిర్వహించిన టీడీపీ.. మూడు నెలల క్రితం మహిళా నేతకు ఖరారు చేసింది. వాస్తవానికి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌తో పాటు మరికొందరు కీలక నేతల్లో ఎవరైనా ఒకరికి టికెట్‌ని కేటాయించాలని భావించారు. పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, ఈ తరుణంలో ఎన్నికల్లో నిలబడి.. డబ్బులు పోగొట్టుకోలేమంటూ దాదాపు అన్ని సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలంతా తెగేసి చెప్పారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులపై చంద్రబాబు, అచ్చెన్న, బుద్ధా వెంకన్న దృష్టిసారించారు. గతంలో భీమిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తూ.. ప్రస్తుతం జీవీఎంసీ 2వ వార్డు కార్పొరేటర్‌గా ఉన్న గాడు చిన్ని కుమారి లక్ష్మిని సంప్రదించారు. దాదాపు రూ.4 కోట్ల వరకూ ఖర్చు చేయగలమనీ.. మిగిలిన డబ్బులు పార్టీ సర్దాలని కోరడంతో టికెట్ ఖరారు చేస్తున్నట్లు బాహాటంగా ప్రకటించారు. డబ్బులు లేవంటూ పక్కన పెట్టేశారు ఇప్పటికే పార్టీ ఎన్నికల ఖర్చులంటూ రూ.లక్షల వరకూ సదరు అభ్యర్థి ద్వారా ఖర్చు చేయించారు. ఇటీవల టీడీపీ ముఖ్యనేతలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొంత మొత్తం సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పార్టీ వైఖరిపై విసుగు చెందిన సదరు మహిళా అభ్యర్థి కుటుంబం.. టీడీపీ నేతల ఫోన్లు ఎత్తడం మానేశారు. డబ్బులు సర్దుబాటు చేయలేమని అధిష్టానానికి సమాచారం పంపించారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కోట్లయినా పెట్టగలిగిన అభ్యరి్థని చూడాలని చెబితే.. ఇలాంటి వారిని ఎందుకు ఎంపిక చేశారంటూ పార్టీ ఎన్నికల పరిశీలకులపై మండిపడ్డారు. కోట్లు ఖర్చు చేసైనా ఎమ్మెల్సీ గెలవాల్సిందేననీ, అలాంటి వారికి టికెట్ కేటాయించాలని ఆదేశించారు. దీంతో మరోసారి మదింపు నిర్వహించి రావికమతం ప్రాంతానికి చెందిన డా.వేపాడ చిరంజీవరావును ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి అంటూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. డబ్బులు లేకపోవడం వల్లనే ఆమెను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రచారంలో దూసుకుపోతున్న సీతంరాజు ఈసారి రాజకీయపక్షాలు ముందుగానే ఎన్నికలపై దృష్టిసారించాయి. వైఎస్సార్సీపీ ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలపరిచిన అభ్యరి్థగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పేరును ప్రకటించింది. ఆయన ప్రతి నియోజకవర్గంలోనూ అన్ని వర్గాల ప్రతినిధులతో భేటీ అవుతూ ప్రచారం పర్వం కొనసాగిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ మాధవ్ కొనసాగుతున్నారు. పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) అభ్యరి్థగా డా.కోరెడ్ల రమాప్రభ కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీసీ మహిళకు షాకిచ్చిన బాబు టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో గాడు కుటుంబం షాక్‌కు గురైంది. కనీసం ఒక మాట చెప్పకుండా.. టికెట్‌ని వేరేవాళ్లకు కేటాయించడాన్ని అవమానకరంగా భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. టీడీపీలో మహిళలకు గౌరవం లేదన్నది మరోసారి సుస్పష్టమైందని పార్టీలోని కొందరు నేతలు విమర్శిస్తుండటం గమనార్హం. ఇప్పటికే రూ.కోటిన్నర వరకూ ఖర్చు చేయించి.. ఇప్పుడిలా మోసం చేశారంటూ గాడు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ మహిళని పార్టీ అవమానించిందంటూ జిల్లా టీడీపీ నాయకులే చెబుతున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అచ్చెన్నాయుడికి తప్ప ఉత్తరాంధ్రలోని ఏ ఒక్క టీడీపీ నేతకు కూడా తెలియకపోవడం విశేషం. బీసీ వర్గాలకు వెన్నుపోటు పొడిచి.. ఉన్నత వర్గాలకు టికెట్ కేటాయించడం వెనుక చోడవరం టీడీపీ సీనియర్ నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. -
లెక్కలు తప్పులైతే ముక్కు నేలకు రాస్తా..
భద్రాచలం: రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఉద్యోగాల లెక్కలన్నీ వాస్తవమేనని, ఆ లెక్కల్లో తప్పులున్నాయని ఆరోపణలు చేస్తున్న పార్టీలు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, టీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి సవాల్ విసిరారు. శనివారం కేకే ఫంక్షన్హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీల్లో భాగంగా కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం మేరకు నిరుద్యోగులకు లక్షకు పైగా ఉద్యోగాలు అందాయని, ఈ లెక్కలు తప్పులని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో పస లేదని స్పష్టం చేశారు. పట్టభద్రులు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెల్లం వెంకట్రావు, బోదెబోయిన బుచ్చయ్య పాల్గొన్నారు. అశ్వాపురం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పదే పదే ప్రశ్నించే గొంతుకను ఎన్నుకోవాలంటున్నారని, ప్రశ్నించడం ఎవరికైనా సాధ్యమని, సమస్యలను పరిష్కరించే గొంతుకను ఎన్నుకోవాలని ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని గౌతమీనగర్ కాలనీలోని అతిథి గృహంలో శనివారం భారజల కర్మాగారం ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో ఆయన ప్రత్యేక సమావేశమయ్యారు. ముత్తినేని సుజాత, బాణోత్ శారద, సదర్లాల్, పాడ్య కేశవరావు, మోహన్‌రావు, వెంకటరెడ్డి, డీవీ రావు, డీవీ చారి, కూరపాటి శ్రీనివాసరావు, పెదిరెడ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. చదవండి: మా మౌనం.. గోడకున్న తుపాకీ -
‘పల్లాను గెలిపిస్తే సీఎం గ్లాస్లో సోడా పోశాడు’
సాక్షి, నల్లగొండ : తెలంగాణలో రాక్షస పాలన, గడీల పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. జిల్లా కలెక్టరేట్ వద్ద బండి సంజయ్ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేధావి వర్గం బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. నీచ రాజకీయాలకు సమాధి కట్టాలన్నా.. టీఆర్ఎస్పార్టీ పార్టీ మెడలు వంచాలన్నా.. దమ్మున్న బీజేపీని గెలిపించాలని అభ్యర్థించారు. అమరవీరుల రక్తపు మడుగులో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రగతి భవన్‌కే పరిమితం అయ్యారన్నారు. ఉపాధ్యాయులను మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, వారి కోసం జైలు కెళ్లిన బీజేపీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే పీఆర్సీ వస్తుందని పేర్కొన్నారు. ఉద్యమాల పురిటిగడ్డగా నిలిచిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల్లో పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలన్నారు. జీహెచ్ఎంసీలో బీజేపీని గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ పారిపోయిందని, ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే నోటిఫికేషన్, పీఆర్సీ వస్తాయని అన్నారు. అదే పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే సీఎం ఫామ్ హౌస్‌కు వెళ్లి గ్లాస్లో సోడా పోశారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని తెలిసి మరీ పల్లాకే మళ్ళీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. చదవండి: న్యాయవాదుల హత్య : సంజయ్ కీలక వ్యాఖ్యలు -
నో క్లారిటీ: దూరంగా ఉంటే పోలా?
సాక్షి, హైదరాబాద్: రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఒకదాంట్లో పోటీకి దిగకపోవడమే మంచిదని టీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది. శాసనమండలిలో మార్చి 29న ఖాళీ అయ్యే రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. ఈ నెల 16న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, మార్చి 14న పోలింగ్ అదే నెల 17న ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే. ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’నియోజకవర్గం అభ్యర్థిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఒకటి రెండు రోజుల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసేదీ, లేనిదీ చెప్తామని పార్టీ కీలక నేతలు చెప్తున్నా, ఈ దఫా పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ భావిస్తోంది. 2007, 2009, 2015లో మూడు దఫాలు ఈ స్థానానికి ఎన్నిక జరగ్గా 2009లో టీఆర్ఎస్ పార్టీ పోటీకి దూరంగా ఉంది. 2007, 2015లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో ఓటరు నమోదు ప్రక్రియ ఆరంభ దశలో హడావుడి చేసిన టీఆర్ఎస్ ఆ తర్వాత ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’ పట్టభద్రుల నియోజకవర్గం ఊసెత్తడం లేదు. అయితే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ మినహాయించి... స్వతంత్రుడిగా పోటీ చేసే ఓ బలమైన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్లు సమాచారం. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్దతు ఇచ్చే అవకాశముందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చదవండి: ఎమ్మెల్సీ పోరు: ఓటు నమోదుకు ఇదే చివరి అవకాశం! సమీక్షలో జోరు... ఆపై తగ్గిన దూకుడు గత ఏడాది అక్టోబర్‌లో శాసనమండలి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా, ఈ ఏడాది జనవరి 22న తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. మండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ఓటరు నమోదు కీలకం కావడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇతర రాజకీయ పక్షాలు, సంస్థల కంటే ముందుగానే అప్రమత్తమైంది. ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కాకమునుపే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కూడా ఓటరు నమోదుపై సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఒక్కో డివిజన్ నుంచి కనీసం మూడు వేల మంది గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయాలని కార్పొరేటర్లకు లక్ష్యం నిర్దేశించారు. ఎమ్మెల్సీ శేరి సుభా‹Ùరెడ్డికి ఈ నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల సభ్యత్వ నమోదు పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. తర్వాతి కాలంలో ఓటరు నమోదు, మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయం వంటి అంశాల్లో టీఆర్ఎస్ దూకుడును తగ్గించింది. కాగా ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 5.17 లక్షలకు చేరింది. ఔత్సాహికుల ఆశలపై నీళ్లు ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’ పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుతం నాలుగో పర్యాయం ఎన్నిక జరుగుతుండగా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ స్థానంలో టీఆర్ఎస్ విజయం సాధించలేదు. 2007లో పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందగా, 2009లో పోటీకి దూరంగా ఉండి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు టీఆర్ఎస్ మద్దతునిచ్చింది. ఆయన గెలిచారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో జరిగిన ఎన్నికలో టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ను ఉద్యోగానికి రాజీనామా చేయించి టీఆర్ఎస్ తరపున బరిలోకి దింపినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీఎస్ఎడబ్ల్యూడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్, పీఎల్ శ్రీనివాస్, శుభప్రద్ పటేల్ తదితరులు ఆసక్తి చూపుతున్నా పోటీకి దూరంగా ఉండాలని పార్టీ భావిస్తోంది. దీంతో పార్టీ సూచించిన అభ్యరి్థకి మద్దతు ఇవ్వాలంటూ ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’జిల్లాల పరిధిలోని కీలక నేతలు సంకేతాలు ఇస్తున్నారు. -
ఎమ్మెల్సీ పోరు: ఓటు నమోదుకు ఇదే చివరి అవకాశం!
సాక్షి, హైదరాబాద్: పట్ట భద్రుల శాసన మండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఇంకా పేరు నమోదు చేసుకోలేక పోయారా? అయితే ఓటరుగా నమోదు కావడానికి మీకు మరో అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం నామినేషన్ల స్వీకరణ తుది గడువుకు 10 రోజుల ముందు వరకు ఓటర్ల నమోదు దరఖాస్తులు స్వీకరించి, సత్వరంగా వాటి ని పరిష్కరించి అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. ఈ అనుబంధ ఓటర్ల జాబితాలో చోటు సంపాదించిన వారికి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనుంది. మహబూబ్‌నగర్– రంగారెడ్డి– హైదరాబాద్ స్థానంతో పాటు వరంగల్–ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 23తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. నామినేషన్ల స్వీకరణ గడువు ముగింపునకు 10 రోజుల ముందు అంటే ఈనెల 13 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించి, అర్హులకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ‘వరంగల్’ పట్టభద్రుల మండలి స్థానం పరిధిలో మొత్తం 4,91,396 మంది, ‘మహబూబ్‌నగర్’ పట్టభద్రుల మండలి స్థానం పరిధిలో 5,17,883 మంది గత నెలలో ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో చోటు సంపాదించారు. చదవండి: పట్టభద్రులు ఓటు ఇలా నమోదు చేసుకోండి కాగా తెలంగాణలో ఖమ్మం - వరంగల్-నల్గొండ, మహబూబ్‌నగర్ - రంగారెడ్డి -హైదరాబాద్ పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా.. మార్చి 14న పోలింగ్ జరుగనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 24న నామినేషన్లను పరిశీలించన్నారు. 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. చదవండి: మేయర్ ఎన్నిక: వారు అలా.. వీరు ఇలా.. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ -
ఫిబ్రవరి తొలివారంలో ఎన్నికల షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి తొలి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, వరంగల్–ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిల పదవీ కాలం మార్చి 29తో ముగియనుండటంతో ఈ స్థానాలకు ఆలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తుది ఓటర్ల జాబితాలు సిద్ధమవ్వడం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తవడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఫిబ్రవరి తొలి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశాలున్నాయి. చదవండి: (టీఆర్ఎస్లో కొలువుల జాతర) నిర్ణయాత్మక శక్తిగా పురుష ఓటర్లు.. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల మండలి స్థానం తుది ఓటర్ల జాబితాను ఈ నెల 18న ప్రకటించగా, మహబూబ్‌నగర్– రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల స్థానం ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రకటించారు. ‘వరంగల్’పట్టభద్రుల స్థానం పరిధిలో మొత్తం 4,91,396 మంది, ‘మహబూబ్‌నగర్’ పట్టభద్రుల స్థానం పరిధిలో 5,17,883 మంది తుది ఓటర్ల జాబితాలో చోటు సంపాదించారు. ఈ రెండు స్థానాల్లో కూడా మహిళా ఓటర్లతో పోల్చితే దాదాపు రెట్టింపు సంఖ్యలో పురుష ఓటర్లు ఉండటంతో.. ఎన్నికల ఫలితాల్లో పురుష ఓటర్లు నిర్ణయాత్మకంగా మారబోతున్నారు. ‘వరంగల్’స్థానం పరిధిలో 3,23,377 పురుష ఓటర్లుండగా, కేవలం 1,67,947 మంది మహిళా ఓటర్లు మాత్రమే ఉన్నారు. మహబూబ్‌నగర్ స్థానం పరిధిలో 3,27,727 మంది పురుష ఓటర్లుండగా, 1,90,088 మంది మహిళా ఓటర్లున్నారు. దరఖాస్తుకు ఇంకా చాన్స్.. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల స్థానం, వరంగల్–ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల స్థానాల తుది ఓటర్ల జాబితాలను ప్రకటించినా ఇంకా ఓటర్ల నమోదుకు అవకాశముంది. తమ పేరు నమోదు చేసుకోలేకపోయిన వారు, తుది ఓటర్ల జాబితాలో పేరు సంపాదించలేకపోయిన వారు దరఖాస్తు చేసుకొని త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటేయడానికి అర్హత పొందవచ్చు. నామినేషన్ల స్వీకరణ చివరిరోజుకు 10 రోజుల ముందు వరకు వచ్చే ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిష్కరించి అర్హులైన వారికి ఓటు హక్కును కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయ అధికార వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
టీఆర్ఎస్లో కొలువుల జాతర
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ రాజకీయ నాయకులకు కొలువుల జాతర రానుంది. ఒకవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధిష్టానం కసరత్తు చేస్తుండగా... మరోవైపు ఏడాది కాలంలో భారీ సంఖ్యలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు వారిని ఊరిస్తున్నాయి. అధికారిక ‘హోదా’కోసం ఆరాటపడుతున్న వారంతా... ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు.పైగా మెజారిటీ (స్థానిక సంస్థల్లో, ఎమ్మెల్యేల కోటాలో) తమవైపే ఉంది కాబట్టి గెలుపు ఖాయమనే ధీమాలో ఆశలు పెంచేసుకుంటున్నారు. శాసనమండలిలోని మొత్తం 40 మంది సభ్యులకుగాను వచ్చే ఏడాది జనవరి నాలుగో తేదీలోగా సగానికి పైగా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఈ ఏడాది మార్చి 29 నాటికి పట్టభద్ర ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్.రాంచందర్‌రావు పదవీకాలం పూర్తవుతుండటంతో ఇప్పటికే ఎన్నికల సందడి ప్రారంభమైంది. వీరితో పాటు శాసనసభ్యుల కోటా నుంచి మండలికి ఎన్నికైన మరో ఆరుగురు సభ్యుల పదవీకాలం కూడా ఈ ఏడాది జూన్ 3న ముగియనుంది. శాసనసభ్యుల కోటా నుంచి పదవీ విరమణ చేయనున్న ఎమ్మెల్సీల జాబితాలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. వీరితో పాటు గవర్నర్ కోటాలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలపరిమితి కూడా ఈ ఏడాది జూన్ 16న ముగియనుంది. ఈ ఏడాది పదవీ విరమణ చేస్తున్న తొమ్మిది మంది ఎమ్మెల్సీల్లో ఎన్.రామచందర్‌రావు (బీజేపీ) మినహా మిగతా ఎనిమిది మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. కాగా శాసనమండలికి స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన 14 మందిలో 12 మంది వచ్చే ఏడాది జనవరి 4న పదవీ కాలపరిమితి పూర్తి చేసుకుంటారు. వీరిలో నిజామాబాద్ నుంచి ఎన్నికైన కల్వకుంట్ల కవితతో పాటు పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), టి.భానుప్రసాద్ (కరీంనగర్), పురాణం సతీష్ (ఆదిలాబాద్), నారదాసు లక్ష్మణ్‌రావు (కరీంనగర్), వి.భూపాల్‌రెడ్డి (మెదక్), సుంకరి రాజు (రంగారెడ్డి), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్), కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), తేరా చిన్నపరెడ్డి (నల్గొండ) ఉన్నారు. మొత్తంగా వచ్చే ఏడాది జనవరి 4వ తేదీలోగా ఖాళీ అయ్యే 21 శాసనమండలి స్థానాల్లో 20 మంది టీఆర్ఎస్ పార్టీ సభ్యులే ఉన్నారు. మళ్లీ అడుగు పెట్టేదెవరో? పట్టభద్రుల కోటాలో రెండు స్థానాలు ఈ ఏడాది మార్చి 29న ఖాళీ అవుతుండటంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజవకర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోమారు పోటీ చేయడం ఖాయమైంది. మరో పట్టభద్రుల నియోజకవర్గం ‘హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్‌నగర్’నుంచి బీజేపీకి చెందిన రాంచందర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో ఫలితాలు ఎలా వచ్చినా... వచ్చే ఏడాది జనవరిలోగా ఖాళీ అయ్యే మరో 19 శాసనమండలి స్థానాలు తిరిగి టీఆర్ఎస్ ఖాతాలోనే చేరే అవకాశముంది. అటు శాసనసభలో, ఇటు స్థానికసంస్థల్లో టీఆర్ఎస్కు పూర్తిస్థాయిలో బలం ఉండటంతో ఆయా కోటా శాసనమండలి స్థానాలకు జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే తిరిగి ఎన్నికయ్యే అవకాశముంది. అందుకే ఆశావహుల్లో పోటీనెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత శాసన మండలిలో మెజారిటీ కోసం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసలను ప్రోత్సహించడంతో వివిధ సందర్భాల్లో పలువురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరారు. వీరిలో వి.భూపాల్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, టి.భానుప్రసాద్ తదితరులకు రెండో పర్యాయం కూడా ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఈ టర్మ్ ముగిశాక వీరి భవితవ్యం ఏమిటనే ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మంత్రివర్గంలో చోటు దక్కని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొంది. ఫరీదుద్దీన్, నేతి విద్యాసాగర్, ఆకుల లలితను మండలికి మళ్లీ నామినేట్ చేసేందుకు ఎంత మేర అవకాశాలున్నాయనే అంశంపై చర్చ జరుగుతోంది. ‘చైర్మన్’గా గుత్తా కొనసాగింపు! గుత్తా సుఖేందర్‌రెడ్డి 2019 ఆగస్టులో శాసనమండలి సభ్యుడిగా ఎన్నిక కాగా, అదే ఏడాది సెప్టెంబర్‌లో మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జూన్ 3న ఎమ్మెల్సీగా ఆయన పదవీకాలం ముగియనున్న ఈ నేపథ్యంలో మరోమారు గుత్తా సభ్యత్వాన్ని పొడిగించడంతో పాటు మండలి చైర్మన్‌గా కొనసాగించే యోచనలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఆశావహులు ఎందరో... శాసనమండలిలో సగానికి పైగా స్థానాలు రెండు విడతలుగా ఖాళీ అవుతుండటంతో ఔత్సాహికుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలు, సామాజికవర్గాల సమీకరణాల్లో తమకు ఎంత మేర అవకాశముందనే లెక్కలు వేసుకుంటూ... మండలిలో చోటు కోసం ఇప్పటి నుంచే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమకాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారితో పాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నాయకులు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని కేసీఆర్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. ఔత్సాహికుల జాబితాలో మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ మాజీ ఎంపీ గుండు సుధారాణి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ విప్ కర్నె ప్రభాకర్ ఉన్నారు. వీరితో పాటు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్రావు, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, క్యామ మల్లేశ్ యాదవ్‌లు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బ్రేవరేజెస్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ తదితరులు కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు. శాసనమండలి కూర్పు ఇలా... స్థానిక సంస్థల కోటాలో ఎన్నికయ్యేవారు 14 శాసనసభ్యుల ఎన్నుకొనేవారు 14 గవర్నర్ కోటాలో నామినేటెడ్ 6 పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి 3 ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి 3 మొత్తం: 40 ప్రస్తుతం ఎవరికెంత బలం... ప్రస్తుతం శాసనమండలిలో ఎంఐఎంకు ఇద్దరు, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉపాధ్యాయుల కోటా నుంచి ఎన్నికైన ముగ్గురు సభ్యుల్లో ఎ.నర్సిరెడ్డి మినహా మిగతా ఇద్దరు టీఆర్ఎస్కు అనుబంధంగా పనిచేస్తున్నారు. దీంతో శాసనమండలిలో 40 మంది సభ్యులకు గాను 35 మందిని టీఆర్ఎస్కు చెందిన వారిగానే పరిగణించొచ్చు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయం
సాక్షి, కరీంనగర్: వరుస విజయాలతో దూసుకుపోతున్న అధికార టీఆర్ఎస్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ మద్దతుతో పోటీచేసిన సమీప ప్రత్యర్థి గ్రూప్–1 మాజీ అధికారి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌పై 39,430 ఓట్ల మెజారిటీతో జీవన్‌రెడ్డి గెలుపొందారు. పోటీలో 17 మంది నిలువగా, మొత్తం 1,15,458 ఓట్లు పోలయ్యాయి. రెండోస్థానంలో నిలిచిన చంద్రశేఖర్ గౌడ్‌కు 17268 ఓట్లు వచ్చాయి. బీజేపీ బలపరిచిన సుగుణాకర్ రావు 15077 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణిరుద్రమ 5192 ఓట్లతో సరిపెట్టుకున్నారు. 9932 ఓట్లు చెల్లని ఓట్లుగా ప్రకటించారు. జీవన్‌రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించారు. టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటల్లాంటి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో జరిగిన ఈ ఎన్నికలు మొదటి నుంచి రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. కాగా అంతకు మందు వెలువడిన వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్‌కు ఈ విజయం ఎంతో ఊరట నిచ్చింది. పూల రవీందర్‌కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా, నర్సిరెడ్డికి కాంగ్రెస్, వామపక్షలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. నర్సిరెడ్డి గతంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. -
నేడు ‘మండలి’ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికల్లో పోలైన ఓట్లను మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రులు/ ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపా ధ్యాయ నియోజకవర్గానికి శుక్రవారం పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏడుగురు, వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యా య నియోజకవర్గాల ఓట్లను కరీంనగర్ పట్టణం లోని ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్లను నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని టీఎస్‌డబ్ల్యూసీ గోదాములో లెక్కించనున్నారు. పోలింగ్‌ను బ్యాలెట్ పేపర్లతో నిర్వహించడంతో ఫలితాల వెల్లడికి ఆలస్యం కానుంది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సీఈఓ రజత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల కోసం క్లిక్చేయండి - ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాక్ -
ఎమ్మెల్సీ పట్టం ఎవరికో..?
అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన టీఆర్ఎస్ అధిష్టానం.. ఇప్పుడు పెద్దల సభపై దృష్టి పెట్టింది. పార్లమెంట్ కంటే ముందుగానే పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగవచ్చన్న సంకేతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ, పంచాయతీ ఎన్నికల ముగిసిన వెంటనే శాసనమండలి అభ్యర్థులను ప్రకటించే విధంగా ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో జరుగబోతున్న ఈ ఎన్నికల్లో ఆయన తిరిగి పోటీ చేసేదీ, లేనిదీ ఇప్పటివరకు వెల్లడికాలేదు. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ కవితలను కలిసి తమ ప్రయత్నాలు కొనసాగిస్తుండటంతో ‘మండలి’ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జరుగబోతున్న ఈ ఎన్నికల్లో పూర్వపు కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, పట్టభద్రులు ఓటుహక్కు వినియోగించుకోనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుత శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో జరుగబోతున్న ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఈసారి ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని ఇప్పటివరకు ప్రచారం జరుగుతూ వచ్చింది. గత ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి తెలంగాణ ఉద్యమ ఊపులో భారీ మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం ఆయన టీఆర్ఎస్ మద్దతుతో శాసనమండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ టికెట్ ఆశించారని ప్రచారం జరిగినా, అది ఆచరణకు రాలేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ఆ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టత లేదు. కాగా స్వామిగౌడ్, టీఎన్జీవోలు, అధిష్టానం మద్దతుతో గ్రూప్–1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు చెప్పుకుంటూ వార్తల్లోకి వచ్చారు. అంతేగాక సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ కూడా ఈ ఎన్నికల్లో రంగంలోకి దిగడం ఆసక్తికర పరిణామం. ఆయన మొట్టమొదటి శాసనమండలి 2007 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం తన ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవీ కాలాన్ని తెలంగాణ ఉద్యమం కోసం, ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ పిలుపు మేరకు ఏడాదిలోపు త్యాగం చేయగా, ఆ తర్వాత ఆయన ఏ పదవీ చేపట్టలేదు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాని కారణంగా తీవ్ర అసంతృప్తికి గురికాగా, ప్రత్యామ్నాయ అవకాశం కల్పిస్తామని ఆయనకు పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్‌రావు నచ్చజెప్పినట్లు వార్తలు వచ్చాయి. వీరితో పాటు ప్రైవేట్ విద్యా సంస్థల రాష్ట్ర సంఘం (ట్రస్మా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, టీఎన్జీవోల రాష్ట్ర సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి షామీద్, పేర్యాల దేవేందర్‌రావు తదితరులు కూడా ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమంలో వీరు పాల్గొంటున్నారు. అయితే వీరిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అవుతారన్న విషయమే ప్రాధాన్యతను సంతరించుకుంది. సామాజిక కోణాలు ప్రామాణికమే.... ప్రస్తుతం టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ఘన విజయంతో ఊపు మీద ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఆ పార్టీ యంత్రాంగం చురుగ్గా ఉంది. ఈ కారణంగా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా యంత్రాంగమంతా పని చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఆశావహులు అదే స్థాయిలో మండలి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. పాత కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ నుంచి పలువురి పేర్లు వినిపిస్తున్నా.. అధినేత కేసీఆర్ మదిలో ఎవరున్నారనేది చర్చనీయాంశం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వని కారణంగా ఒకవేళ ప్రస్తుత ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అభ్యర్థిత్వాన్ని మళ్లీ ప్రకటిస్తారా? ప్రకటిస్తే పరిస్థితి అంత సానుకూలంగా ఉంటుందా? అన్న చర్చ అప్పుడే మొదలైంది. స్వామిగౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, కరీంనగర్ మేయర సర్దార్ రవీందర్‌సింగ్, హమీద్, యాదగిరి శేఖర్‌రావు తదితరుల ప్రయత్నాలు జోరందుకున్నాయి. కాగా ఈ నియోజకవర్గం నుంచి గడిచిన మూడు పర్యాయాలు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే విజయం సాధించారు. 2007లో మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో పద్మశాలి కులానికి చెందిన జర్నలిస్టు ఆర్.సత్యనారాయణ టీఆర్ఎస్తో పాటు టీఎన్జీవోల యూనియన్, వామపక్ష ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో విజయం సాధించారు. ఆయన రాజీనామా నేపథ్యలలో 2008లో జరిగిన ఎన్నికల్లో ఎల్లావు కులానికి చెందిన న్యాయవాది లక్ష్మణ్‌రావు టీఆర్ఎస్ తరుపున గెలుపొందారు. అనంతరం 2013లో గౌడ కులానికి చెందిన స్వామిగౌడ్ టీఆర్ఎస్ తరుపున విజయం సాధించారు. ఈ ముగ్గురు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం జరుగబోవు ఎన్నికల్లో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎంపిక చేయబోవు అభ్యర్థి యొక్క సామాజికవర్గం కూడా ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉండగా... కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ నిర్ణయాన్ని బట్టి అనూహ్యమైన బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని బీజేపీ, కాంగ్రెస్, కూటమి పార్టీలు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. సంచలన నిర్ణయాలకు మారు పేరైన కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
‘మండలి’కి సై..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల శాసన మండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2019 మార్చిలో జరిగే ఎన్నికల కోసం ఓటరు నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోటీ చేయాలనుకునే ఆశావహులు నాలుగు జిల్లాల్లో ఓటరు నమోదు కేంద్రాలు, వారి సంఘాలతో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముమ్మరంగా ప్రచార కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన స్వామిగౌడ్ శాసన మండలి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పాతూరి సుధాకర్‌రెడ్డి మండలి విప్‌గా కొనసాగుతున్నారు. వీరి పదవీ కాలం మార్చి నెలతో ముగుస్తున్నందునా మండలి పోరుకు ఎన్నికల కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో మండలి ఎన్నికల కోలాహలం నెలకొంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు ఓ పక్క నడుస్తుండగానే ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటరు నమోదు కార్యక్రమంపై ఆశావహులు దృష్టి సారించారు. ఓటర్ల నమోదు పేరిట కేంద్రాలు ఏర్పాటు చేసి ఆశావహులు తాము సైతం బరిలో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. పట్టభద్రుల కోటాలో పోటాపోటీ.. వివిధ పార్టీల నుంచి ప్రయత్నాలు.. పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్.. మహాకూటమిలతో పాటు బీజేపీ తదితర పార్టీలు సైతం అభ్యర్థులను సమాయత్తం చేస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ కోటాలో జిల్లా నుంచి కరీంనగర్ నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ట్రస్మా రాష్ట్ర ప్రధాన సలహాదారు కడారి అనంతరెడ్డి, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, కిమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పేర్యాల దేవేందర్‌రావు తదితరులు పోటీ పడుతున్నారు. టీఎన్జీవోల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంఏ హమీద్, జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌తోపాటు మరికొంత మంది హైదరాబాద్ స్థాయిలో వారి వారి ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నట్లు సమాచారం. కరీంనగర్లో ఇన్చార్జి డీటీసీగా పనిచేస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ సైతం అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌తో ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో పరిధిలో ముమ్మరంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ సంగారెడ్డి సత్యనారాయణ కూడా కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఇదిలా వుంటే ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తిరిగి తానే పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ సోమవారం నిజామాబాద్ ఎంపీ కవితను జగిత్యాలలో కలిసినట్లు సమాచారం. ఇతర జిల్లాల నుంచి కూడా వివిధ పార్టీల నుంచి రోజురోజుకూ ఆశావహులు పెరుగుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం.. కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం కింద కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ఎమ్మెల్సీ భట్టాపురం మోహన్‌రెడ్డి మహాకూటమి అభ్యర్థిగా బరిలో ఉంటారని ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ఈ మేరకు ప్రచార కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి సైతం మళ్లీ బరిలో ఉండి తన అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పీఆర్టీయూ సంఘం నుంచి రాష్ట్ర నాయకుడైన పి.రఘోత్తమరెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించారు. ఎస్టీయూ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భుజంగరావు తమ అభ్యర్థిగా ఉంటారని ప్రచారం ముమ్మరం చేశారు. యుటీఎఫ్ పక్షాన జాక్టో నుంచి బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు కసరత్తు మొదలుపెట్టారు. తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) పక్షాన రాష్ట్ర నాయకులు సీహెచ్ రాములు కరీంనగర్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయా ఉపాధ్యాయ సంఘాలు పాఠశాలల్లో ఉపాధ్యాయులతో ఓటర్ల నమోదు కార్యక్రమంతో పాటు ప్రచారాన్ని సైతం నిర్వహిస్తున్నారు. ఓటర్ల నమోదు, ఎన్నికల నిబంధనలు ఇలా.. 1 నవంబర్ 2015 వరకు పదవీ విరమణ పొందిన వారు కూడా ఓటరుగా అర్హులు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల నమోదును ఆశావహుల ఇంటింటికీ తిరిగి చేయిస్తున్నారు. నమోదుకు నవంబర్ 5 చివరి తేదీ కావడంతో ముమ్మరం చేశారు. 2012 నుంచి 2018 మధ్యలో మూడు సంవత్సరాల సర్వీసును కూడా లెక్కిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓట్లు తక్కువగా ఉంటాయి. రెండో ప్రాధాన్యత ఇక్కడ కీలకం. ఎమ్మెల్సీగా గెలుపొందాలంటే పోలైన ఓట్లలో 51 శాతం ఓట్లు రావాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యతలో అభ్యర్థికి 51 శాతం రాకుంటే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. రెండో ప్రాధాన్యత కూడా గెలుపునకు దగ్గరలో లేకుంటే మూడో ప్రాధాన్యతను కూడా లెక్కిస్తారు. ఉపాధ్యాయ నియోజకవర్గంలో రెండో ప్రాధాన్యత ఓటు కూడా అత్యంత కీలకం అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉంటుంది. 2013లో అప్పటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉద్యమానికి మరింత ఊతమిచ్చింది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ మద్దతు పలికిన స్వామిగౌడ్, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పాతూరి సుధాకర్‌రెడ్డి గెలుపొందారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ముందుగా వస్తుండడంతో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికలపై పడనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టభద్రులకు ఇవీ నిబంధనలు.. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఓటు వేసే అర్హులైన ప్రతీ ఒక్కరు ఫారం–18లో దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. 31 అక్టోబర్ 2015 లోపు డిగ్రీ పూర్తి చేసుకున్న వారు ఓటు వేసేందుకు అర్హులు. ఓటు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీగా నిర్ణయించారు. ఫారం–18తో డిగ్రీ మెమో, ప్రొవిజనల్, ఆధార్‌కార్డు జిరాక్స్, కలర్ ఫొటో జతపరిచి సంబంధిత తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో అందజేయాలి. ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవాలి. -
అందరూ అక్షరాస్యులే అయినా..
అనంతపురం అర్బన్ : పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదో విచిత్రం. ఓటు హక్కు కలిగిన వారందరూ విద్యావంతులే. డిగ్రీ, డిప్లొమా కనీస విద్యార్హత కల్గినవారు. అయితే.. ఓటు ఎలా వేయాలనే దానిపై పలువురికి అవగాహన లేదనే విషయం స్పష్టంగా కన్పిస్తోంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఏకంగా 18,363 నమోదయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 1,55,711 ఓట్లు పోలయ్యాయి. రౌండ్‌కు 26 వేల చొప్పున ఆరు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతి రౌండ్లోనూ చెల్లని ఓట్లు మూడు వేల వరకు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వినియోగించుకోవాలి? ప్రాధాన్యతా క్రమంలో ఓటు ఎలా వేయాలి? ఓటు ఎలా చెల్లకుండా పోతుందనే అంశాలపై ఎన్నికల సంఘం, అధికారులు, అభ్యర్థులు విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. అయినా కూడా కొందరు అవగాహన లేకుండా ఓటు వేశారు. దీంతో భారీసంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోయాయి. మొదటి ప్రాధాన్యత (1) ఓటు తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రంలో ఇచ్చిన వైలెట్ రంగు స్కెచ్ పెన్‌తోనే అంకెలు వేయాలి. అయితే.. చాలా మంది రైట్ మార్క్ వేశారు. మరికొందరు సొంత పెన్ వాడారు. ఇలాంటి ఓట్లు ఐదు వేల వరకు ఉన్నాయి. అలాగే కొందరు తాము మొదటి ప్రాధాన్యత ఓటు వేయదల్చుకున్న అభ్యర్థుల ముందు ‘1’ అంకె వేయకుండా అభ్యర్థి వరుస సంఖ్యను అతనికి కేటాయించిన గడిలో నమోదు చేశారు. ఇలాంటివి దాదాపు రెండు వేల వరకు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే విద్యావంతులు అయ్యి ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై అవగాహన పెంచుకోలేదనే విషయం స్పష్టమైంది. నోటాకు 1,576 ఓట్లు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా (నన్ ఆఫ్ ద అబవ్) గుర్తుకు 1,576 ఓట్లు వచ్చాయి. మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో ఏ ఒక్కరూ సరైన వ్యక్తిగా తాము భావించడం లేదంటూ 1,576 మంది తమ అభిప్రాయాన్ని నోటా ద్వారా తెలియజేశారు.