కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
నల్లగొండ: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గట్టెకే పరి స్థితి లేక.. కౌంటింగ్ హా ల్ నుంచి ఉత్త చేతులతో పోవడం ఎందుకని, అధికారుల మీద మట్టిపోసి పోయే పనులు బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. గురువారం నల్లగొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన మాట్లాడారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిలు ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై, జిల్లా అధికారులపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ ఎన్నికలో రూ.100 కోట్లు ఖర్చుపెట్టి గెలుపొందాలని చేసిన ప్రయత్నం..బోగస్ ఓట్లతో లబ్ధిపొందాలనే కుతంత్రం బెడిసి కొట్టడంతో ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment