బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ఆరోపణ
నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి ఆరోపించారు. 3వ రౌండ్‌లో తనకు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అభ్యరి్థకి మెజారిటీ ఉందంటూ ప్రకటించారని, కౌంటింగ్‌పై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. నల్లగొండలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద రాకేష్‌రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ ఏకపక్షంగా చేస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండానే 3వ రౌండ్ లీడ్‌ను ప్రకటించారని చెప్పారు. రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. 3వ రౌండ్ ఫలితాలు అడిగితే బయటకు నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన గెలుపును అడ్డుకునే కుట్ర జరుగుతోందని, మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రౌండ్ ఫలితాలు ప్రకటించే విషయంలో కౌంటింగ్ ఏజెంట్లకు చూపించకుండా ఏకపక్షంగా ప్రకటిస్తున్నారని అన్నారు. అడిగితే అనుమానం నివృత్తి చేయడం లేదని, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తారుమారు జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment