Warangal - Khammam
-
మల్లన్నకు 14,722 ఓట్ల మెజారిటీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపొందిన తీన్మార్ మల్లన్నకు 14,722 ఓట్ల మెజారిటీ లభించింది. ఈ నెల 5 నుంచి 7వ తేదీ అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్ అనంతరం మల్లన్న గెలుపొందినట్లు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ గెలుపునకు అవసరమైన కోటా ఓట్లు (1,55,095) రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చింది.మొదటి ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి« తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 29,697 ఓట్లు లభించాయి. అయినా గెలుపునకు అవసరమైన కోటా ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. 48 మందిని ఎలిమినేట్ చేయగా.. ఈ ఎన్నికలో మొత్తంగా 52 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో తక్కువ ఓట్లు వచ్చిన 48 మంది ని ఎలిమినేట్ చేసి, వారికి పడిన మొదటి ప్రాధాన్య ఓట్లలోని రెండో ప్రాధాన్యతను లెక్కించగా వచ్చిన ఓట్లను కలుపుకోగా కాంగ్రెస్ అభ్యర్థి 1,24,899 ఓట్లకు, బీఆర్ఎస్ అభ్యర్థి 1,05,524 ఓట్లకు, బీజేపీ అభ్యర్థి 43,956 ఓట్లకు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ 30,461 ఓట్లకు చేరుకున్నారు. అయినా గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాలేదు.49వ రౌండ్లో అశోక్ ఎలిమినేషన్ గెలుపునకు అవసరమైన ఓట్లు ఎవరికీ రాకపోవడంతో 49వ రౌండ్లో స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలోని రెండో ప్రా«ధాన్య ఓట్లను లెక్కించారు. అందులో కాంగ్రెస్ అభ్యర్థికి 10,383 ఓట్లు రావడంతో ఆయన 1,36, 246 ఓట్లకు చేరుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి 10,118 ఓట్లు రావడంతో ఆయన 1,16,292 ఓటకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థికి 4,918 ఓట్లు రాగా ఆయన 48,874 ఓట్లకు చేరుకున్నారు. 50వ రౌండ్లో ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్ గెలుపునకు అవసరమైన ఓట్లు అప్పటివరకు ఎవరికీ రాకపోవడంతో 50వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన 48,874 ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. అందులో తీన్మార్ మల్లన్నకు 14,278 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 19,510 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మొత్తం 1,50, 524 ఓట్లకు చేరుకోగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఓట్లు 1,35,802 చేరుకున్నారు.అయినప్పటికీ గెలుపు కోటాకు 4,571 ఓట్లు తక్కువగానే ఉన్నాయి. మల్లన్నకు రాకేశ్‌రెడ్డి కంటే 14,722 ఓట్లు అధికంగా (మెజారిటీ) ఉన్నాయి. దీంతో రాకేశ్‌రెడ్డిని ఎలిమినేట్ చేయకుండానే, మల్లన్నకు అధిక ఓట్లు ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆమోదంతో మల్లన్న గెలిచినట్లుగా ప్రకటించారు. ఈ ఎన్నికలో 10 వేల మంది గ్రాడ్యుయేట్లు ప్రేమేందర్‌రెడ్డికి తొలి ప్రాధాన్యతను ఇచ్చి, మిగతా ప్రాధాన్యాలు ఇవ్వ లేదు. మరో 5 వేలమంది గ్రాడ్యుయేట్లు అశోక్‌కు తొలి ప్రాధాన్యాన్ని ఇచ్చి, మిగతా ప్రాధాన్యాలు ఇవ్వలేదు. -
అధికారులపై ఆరోపణలు సరికాదు
నల్లగొండ: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గట్టెకే పరి స్థితి లేక.. కౌంటింగ్ హా ల్ నుంచి ఉత్త చేతులతో పోవడం ఎందుకని, అధికారుల మీద మట్టిపోసి పోయే పనులు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. గురువారం నల్లగొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిలు ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై, జిల్లా అధికారులపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ ఎన్నికలో రూ.100 కోట్లు ఖర్చుపెట్టి గెలుపొందాలని చేసిన ప్రయత్నం..బోగస్ ఓట్లతో లబ్ధిపొందాలనే కుతంత్రం బెడిసి కొట్టడంతో ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు
నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి ఆరోపించారు. 3వ రౌండ్లో తనకు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అభ్యరి్థకి మెజారిటీ ఉందంటూ ప్రకటించారని, కౌంటింగ్‌పై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. నల్లగొండలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద రాకేష్‌రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ ఏకపక్షంగా చేస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండానే 3వ రౌండ్ లీడ్‌ను ప్రకటించారని చెప్పారు. రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. 3వ రౌండ్ ఫలితాలు అడిగితే బయటకు నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన గెలుపును అడ్డుకునే కుట్ర జరుగుతోందని, మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రౌండ్ ఫలితాలు ప్రకటించే విషయంలో కౌంటింగ్ ఏజెంట్లకు చూపించకుండా ఏకపక్షంగా ప్రకటిస్తున్నారని అన్నారు. అడిగితే అనుమానం నివృత్తి చేయడం లేదని, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తారుమారు జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు. -
ఇంకా తేలని ‘ఎమ్మెల్సీ’ ఫలితం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం రెండో ప్రాధాన్యత ఓట్లతోనే తేలనుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు (1,22,813) వచి్చనా, 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా.. గెలుపునకు సరిపడా ఓట్లు మాత్రం సాధించలేకపోయారు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు సాధించాల్సి ఉంది. దీంతో గురువారం రాత్రి 10 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. గెలుపెవరిదో? హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యతలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 18,565 మాత్రమే ఉంది. తీన్మార్ మల్లన్న గెలవాలంటే రెండో ప్రాధాన్యత ఓట్లలో 32,282 ఓట్లు సాధించాల్సి ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యతలో 1,04,248 ఓట్లు రాగా, ఆయన గెలవాలంటే 50,847 ఓట్లు రెండో ప్రాధాన్యతలో రావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు స్వంతంత్ర అభ్యర్థి అశోక్‌కు కూడా భారీగానే ఓట్లు లభించాయి. మొత్తం 52 మంది అభ్యర్థులలో ఈ నలుగురు అభ్యర్థులకు 3,00,071 ఓట్లు వచ్చాయి.మిగిలిన అభ్యర్థులందరికీ 10,118 ఓట్లు లభించాయి. ఇవన్నీ ఎలిమినేషన్లో క్రమంగా పోనున్నాయి. ఈ ఓట్లను లెక్కించినా గెలుపు టార్గెట్‌ను అభ్యర్థులు చేరుకునే అవకాశం లేదు. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు 29,697 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఆయన్ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించినా గెలుపు కష్టంగానే కనిపిస్తోంది. చివరగా బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తరువాతే ఫలితం వెల్లడి కానుంది. రెండు రోజులుగా కౌంటింగ్ ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం ఓట్లు 4,63,839 కాగా, 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు బ్యాలెట్ పత్రాలను బండిల్స్‌గా కట్టడానికే సరిపోయింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం రాత్రి 9 గంటలకు పూర్తయింది. ఆ తరువాత గెలుపునకు టార్గెట్ 1,55,096 ఓట్లుగా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత శుక్రవారం తుది ఫలితం తేలనుంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.నాలుగు హాళ్లలో 96 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో టేబుల్‌పై వేయి ఓట్ల చొప్పున గురువారం రాత్రి వరకు నాలుగు రౌండ్లలో 3,36,013 ఓట్లను లెక్కించారు. అందులో 3,10,189 ఓట్లు చెల్లినవిగా తేల్చారు. 25,824 చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఈ లెక్కింపు ఒకటో రౌండ్ ఫలితం బుధవారం రాత్రి 12:45 గంటలకు వెలువడగా, రెండో రౌండ్ ఫలితం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడైంది.మూడో రౌండ్ ఫలితం సాయంత్రం 5 గంటలకు వెల్లడించగా, 4వ రౌండ్ ఫలితం రాత్రి 9 గంటలకు వెల్లడైంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల రిటరి్నంగ్ అధికారి దాసరి హరిచందన నేతృత్వంలో సిబ్బందికి మూడు షిప్టులలో వి«ధులు కేటాయించి కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. -
స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్సులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ– ఖమ్మం– వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి 3 జిల్లాల పరిధిలో 72.44% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 78. 59% నమోదైంది. అత్యల్పంగా ఖమ్మం జిల్లా లో 67.62% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ఉద యం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జర గ్గా, 12 జిల్లాల పరిధిలోని బ్యాలెట్ బాక్సులన్నింటినీ గట్టి బందోబస్తు మధ్య నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది పోటీలో ఉన్నా రు. ప్రధాన పోటీ 3 పార్టీల అభ్యర్థుల మధ్య నే కొనసాగగా, జూన్ 5న వీరి భవితవ్యం తేలనుంది.స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత..నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పల పల్లిలో గిడ్డంగుల సంస్థ గోదాములోని స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఇక్కడ మూడంచెల భద్రత ఉంది. చుట్టుపక్కల 144 సెక్షన్ విధించడంతోపాటు పోలీసులు 24 గంటలపాటు సాయుధ రక్షణలో పహారా కాస్తూ సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లోని బ్యాలెట్ బాక్సులను మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు రాహుల్ బొజ్జా, రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన పరిశీలించారు. -
తెలంగాణకు గుడ్‌న్యూస్.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రహదారుల నిర్మాణానికి రూ.2,235 కోట్లు నిధులు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వరంగల్–ఖమ్మం జిల్లాల పరిధిలో నాలుగు లైన్ల రహదారుల నిర్మాణానికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర రహదారుల శాఖమంత్రి నితిన్‌గడ్కరీ శుక్రవారం వెల్లడించారు. వరంగల్–ఖమ్మం (ఎన్‌హెచ్–163జీ) రహదారిపై వరంగల్ జిల్లా వెంకటాపూర్ గ్రామం నుంచి మహబూబాబాద్ జిల్లాలోని తాళ్లసేనకేశ గ్రామం వరకు 39.410 కిలోమీటర్ల మేరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి రూ.1,111.76 కోట్లు, ఈ దారికి కొనసాగింపుగా తాళ్లసేనకేశ గ్రామం నుంచి ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి మరో రూ.1,123.32 కోట్లు మంజూరు చేసినట్లు గడ్కరీ తెలిపారు. ఈ రెండు రహదారులను కలిపి 70 కిలోమీటర్ల రహదారిని ‘హైబ్రిడ్ అన్యుటీ మోడ్’లో నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. -
మరో హైవే..
ఖమ్మంఅర్బన్: వాణిజ్యపరంగా దూసుకుపోతున్న ఖమ్మం నగరం చుట్టూ జాతీయ రహదారులు విస్తరిస్తున్నాయి. నగరాన్ని ఆనుకుంటూ మరో నేషనల్ హైవే వెల్లబోతోంది. ఇప్పటికే సూర్యాపేట–ఖమ్మం–అశ్వారావు పేట జాతీయ రహదారికి సంబంధించిన నిధులు మంజూరై.. భూ సేకరణ పనులు దాదాపు పూర్తికాగా.. తాజాగా వరంగల్–ఖమ్మం నగరాలను కలుపుతూ ఇంకో నేషనల్ హైవే రాబోతోంది. సూర్యాపేట–అశ్వారావుపేట రహదారికి అనుసంధానం చేసే విధంగా నిర్మించే వరంగల్–ఖమ్మం నేషనల్ హైవేకు సంబంధించి.. ఒడిశాకు చెందిన ఎస్ఎం కన్సల్టెన్సీ ఏజెన్సీ బృందం మంగళవారం ప్రాథమిక సర్వే చేసింది. ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలాల సరిహద్దున ఉన్న పొలాల్లో సర్వే కొనసాగింది. గూగుల్ మ్యాప్ అధారంగా సర్వే చేశారు. వరంగల్ నుంచి ఖమ్మం వరకు సుమారు 112 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం కోసం సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 60 కిలో మీటర్ల మేర సర్వే పూర్తయినట్లు బృందం సభ్యులు తెలిపారు. వరంగల్ నుంచి ఖమ్మం రూరల్ మండలం మీదుగా రఘునాథపాలెం, ఖమ్మం నగరాన్ని కలుపుతూ.. కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద ఉన్న ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో.. సూర్యాపేట–అశ్వారావుపేట జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మరో 10 రోజుల్లో సర్వే పూర్తవుతుందని సర్వే బృందంలోని సభ్యుడు ఒకరు తెలిపారు. రెండు నేషనల్ హైవేలు, ఔటర్ రింగురోడ్డు నిర్మాణాలు పూర్తయితే ఖమ్మం పరిసర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోనుంది. జిల్లాలోని ప్రధాన పరిశ్రమగా ఉన్న గ్రానైట్ వ్యాపారానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. మార్కెటింగ్ పరంగా ముడి సరుకుల ఎగుమతి, దిగుమతులకు అనుకూలం కానుంది. ఔటర్ రింగ్‌రోడ్డు.. సూర్యాపేట–అశ్వారావుపేట, వరంగల్–ఖమ్మం జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ.. ఖమ్మం నగరం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అధికారులు సర్వే కూడా చేశారు. సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల మేర రోడ్డు కోసం ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించినట్లు ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుతోపాటు జాతీయ రహదారుల నిర్మాణంతో ఖమ్మం చుట్టూ రవాణాపరంగా సమస్యలు తొలగనున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరనుంది. -
చికిత్స కోసం వచ్చి కన్ను‘మూసింది’
వరంగల్: రాత్రి తమతోనే నిద్రించింది.. తెల్లారేసరికి విగతజీవిగా మారింది.. తన భార్య ఈ లోకం విడిచిందని తెలుసుకున్న భర్త అమ్మ చనిపోయిందని పిల్లలకు చెప్పలేక చెప్పాడు. ఇంకా నిద్రలోనే ఉందనుకుని అమ్మా నిద్ర లేమ్మా అంటున్నవారి పిలుపు అక్కడి వారి హృదయాలను ద్రవింపజేసింది. ఈ హృదయ విదారక సంఘటన వరంగల్ రైల్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలోని మంచుకొండకు చెందిన భూక్యా జ్యోతి(32) అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స నిమిత్తం తన ఇద్దరు పిల్లలతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చింది. వైద్య పరీక్షలు పూర్తయినట్లు తెలుపడంతో భర్త రఘుపతి వరంగల్ వచ్చాడు. తమ గ్రామం వెళ్లేందుకు రాత్రి 10 గంటలకు వారంతా వరంగల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ సమయానికి రైళ్లు లేకపోవడంతో జనరల్ వెయిటింగ్ హాల్లో నిద్రించారు. తెల్లవారుజామున అందరినీ లేపేందుకు ప్రయత్నించగా జ్యోతి చనిపోయిందని తెలుసుకుని రఘుపతి బోరున విలపించాడు. అమ్మ చనిపోయిందన్న విషయం పిల్లలకు చెప్పడంతో వారు దీనంగా రోదిస్తూ అమ్మా లేమ్మా అంటూ పిలుస్తున్నారు. అక్కడున్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఈ సంఘటనతో కంట తడిపెట్టారు. వారందరి సహకారంతో జ్యోతి మృతదేహాన్ని తన గ్రామానికి తీసుకెళ్లాడు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
నిద్రలోనే తల్లి, కుమారుడు, కుమార్తె దుర్మరణం నర్సింహులపేట: వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి లారీ దూసుకెళ్లడంతో అందులో నిద్రిస్తున్న తల్లి, కుమారుడు, కుమార్తె మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం బీరిశెట్టిగూడెంలో శనివారం వేకువజామున జరిగింది. బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన బండి ఐల్‌రెడ్డి, బండి సునీత దంపతులు గ్రామ స్టేజీ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి సునీత(35), కుమారుడు రాహుల్‌రెడ్డి(15), కూతురు ప్రగతి(13) ఇంట్లో నిద్రిస్తుండగా, ఐల్‌రెడ్డి ఇంటి బయట మంచంలో నిద్రపోయాడు. శనివారం వేకువజామున సుమారు 2.45 గంటల ప్రాంతంలో వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న హర్యానాకు చెందిన లారీ అతివేగంగా వారింట్లోకి దూసుకెళ్లింది. దీంతో గోడలు కూలడంతో నిద్రలో ఉన్న సునీత, రాహుల్‌రెడ్డి, ప్రగతి అక్కడికక్కడే మృతిచెందారు. బయట పడుకున్న ఐల్‌రెడ్డిపై రేకులు పడడంతో వెంటనే నిద్రలేచాడు. అదే ఇంట్లో మంచంలో నిద్రిస్తున్న పక్కింటికి చెందిన వృద్ధురాలు పిట్సోజు శ్రీశైలమ్మపై కూడా కొన్ని మట్టిపెళ్లలు పడినా ఎలాంటి గాయూలు కాలేదు. మహబూబాబాద్ డీఎస్పీ నాగరాజు, తొర్రూరు, కురవి సీఐలు శ్రీధర్‌రావు, కరుణసాగర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఉదయాన్నే సంఘటన స్థలాన్ని సందర్శించి జరిగిన ఘటనపై పోలీసు అధికారులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. -
రెండు లారీలు ఢీకొని ఒకరి దుర్మరణం
=ముగ్గురికి గాయాలు =ప్రమాదానికి గురైన లారీలను ఢీకొన్న మరో రెండు లారీలు =ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలు నర్సింహులపేట, న్యూస్‌లైన్ : రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలైన సంఘటన మండలంలోని పెద్దనాగారం స్టేజీ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై ఎల్లావుల వెంకటప్రసాద్, స్థానికుల కథనం ప్రకారం... ఖమ్మం నుంచి వరంగల్ వైపు చేపల లోడుతో ఒక లారీ బయల్దేరగా.. వరంగల్ నుంచి ఖమ్మం వైపు ఎర్రమట్టి లోడుతో వెళుతున్న మరో లారీ వెళుతోంది. ఈ రెండు లారీలు వరంగల్-ఖమ్మం రహదారిపై పెద్దనాగారం స్టేజీ సమీపంలోని విజ్ఞాన్ హైస్కూల్‌కు ఎదురుగా సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో ఢీకొన్నారుు. ఈ ప్రమాదంలో ఎర్రమట్టి లారీలో ప్రయాణిస్తున్న క్లీనర్ నిమ్మికంటి రాకేష్(23) అక్కడికక్కడే మృతిచెందగా, డ్రైవర్ వెంకన్నకు గాయూలయ్యూయి. అలాగే చాపలలోడ్ లారీలో ప్రయూణిస్తున్న కృష్ణా జిల్లా మదనపల్లికి చెందిన డ్రైవర్ పులిగెటి రాయుడు, క్లీనర్ సాయికి తీవ్ర గాయాలయ్యూయి. మృతుడు రాకేష్ నల్లగొండ జిల్లా హూజుర్‌నగర్ వాస్తవ్యుడని తెలిసింది. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటప్రసాద్ తన సిబ్బందితో హుటాహుటిన మరిపెడ నుంచి జేసీబీని తెప్పించి రెండు లారీలను విడదీసి రాకేష్ మృతదేహాన్ని బయటికి తీశారు. అలాగే క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు. రెండు లారీలు నడిరోడ్డుపై ఢీకొనడంతో వాటిని తీయడానికి జేసీబీ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయంది. దీంతో రోడ్డు పక్క నుంచి దారి ఏర్పాటు చేసి వాహనాలను పంపించారు. ప్రమాదం జరిగిన చోటే మళ్లీ ప్రమాదం.. జేసీబీతో రోడ్డుపై ఉన్న లారీలను తీస్తున్న క్రమంలోనే తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో మంచు కురుస్తుండగా దారి కనిపించకపోవడంతో ఖమ్మం వైపు వెళుతున్న గ్రానైట్‌లోడ్ లారీ ప్రమాదానికి గురైన ఎర్రమట్టి లారీని ఢీకొంది. కొద్దిసేపటికే ఖమ్మం నుంచి వచ్చిన మరో చేపలలోడ్ లారీ ప్రమాదానికి గురైన చేపల లారీని ఢీకొంది. ఈ ఘటనల్లో డ్రైవర్, క్లీనర్లకు ఎలాంటి నష్టం జరగనప్పటికీ నాలుగు లారీలు రోడ్డుపై నిలిచిపోవడంతో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయంది. దీంతో ఎస్సై వెంకటప్రసాద్ వెంటనే మరో జేసీబీని తెప్పిం చారు. ఆయన ఆధ్వర్యంలో పీఎస్సై నాగభూషణం, హెడ్‌కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుళ్లు బుచ్చిరాజు, పాషా, సురేష్, జ్ఞానేశ్వర్ శ్రమించి రెండు జేసీబీలతో లారీలను రోడ్డు పక్కకు తరలించి ఇరువైపులా రెండు కిలోమీటర్ల దూరంలో నిలిచిన వాహనాలను పంపించారు. ఖమ్మం వెళ్లే వాహనాలను నర్సింహులపేట మీదుగా, వరంగల్ వెళ్లే వాటిని పెద్దనాగారం గ్రామం మీదుగా మళ్లించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటప్రసాద్ తెలిపారు.