సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రహదారుల నిర్మాణానికి రూ.2,235 కోట్లు నిధులు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వరంగల్–ఖమ్మం జిల్లాల పరిధిలో నాలుగు లైన్ల రహదారుల నిర్మాణానికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర రహదారుల శాఖమంత్రి నితిన్‌గడ్కరీ శుక్రవారం వెల్లడించారు.
వరంగల్–ఖమ్మం (ఎన్‌హెచ్–163జీ) రహదారిపై వరంగల్ జిల్లా వెంకటాపూర్ గ్రామం నుంచి మహబూబాబాద్ జిల్లాలోని తాళ్లసేనకేశ గ్రామం వరకు 39.410 కిలోమీటర్ల మేరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి రూ.1,111.76 కోట్లు, ఈ దారికి కొనసాగింపుగా తాళ్లసేనకేశ గ్రామం నుంచి ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి మరో రూ.1,123.32 కోట్లు మంజూరు చేసినట్లు గడ్కరీ తెలిపారు. ఈ రెండు రహదారులను కలిపి 70 కిలోమీటర్ల రహదారిని ‘హైబ్రిడ్ అన్యుటీ మోడ్’లో నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment