national high ways
-
Nitin Gadkari: రోడ్డు బాగాలేకపోతే టోల్ వసూలు చేయొద్దు
న్యూఢిల్లీ: రహదారి సరిగ్గా లేకపోతే వాహనదారుల నుంచి టోల్ రుసుము వసూలు చేయొద్దని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ రహదారుల నిర్వహణ సంస్థలను ఆదేశించారు. శాటిలైట్ ఆధారిత టోల్ రుసుముల వసూలుపై బుధవారం ఢిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించలేనప్పుడు టోల్ చార్జి వసూలు చేయొద్దని అన్నారు. గుంతలు, బురదతో నిండిన రోడ్లపై కూడా టోల్ వసూలు చేస్తే జనం నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,000 కిలోమీటర్ల మేర రహదారులపై ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
తెలంగాణకు గుడ్‌న్యూస్.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రహదారుల నిర్మాణానికి రూ.2,235 కోట్లు నిధులు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వరంగల్–ఖమ్మం జిల్లాల పరిధిలో నాలుగు లైన్ల రహదారుల నిర్మాణానికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర రహదారుల శాఖమంత్రి నితిన్‌గడ్కరీ శుక్రవారం వెల్లడించారు. వరంగల్–ఖమ్మం (ఎన్‌హెచ్–163జీ) రహదారిపై వరంగల్ జిల్లా వెంకటాపూర్ గ్రామం నుంచి మహబూబాబాద్ జిల్లాలోని తాళ్లసేనకేశ గ్రామం వరకు 39.410 కిలోమీటర్ల మేరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి రూ.1,111.76 కోట్లు, ఈ దారికి కొనసాగింపుగా తాళ్లసేనకేశ గ్రామం నుంచి ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి మరో రూ.1,123.32 కోట్లు మంజూరు చేసినట్లు గడ్కరీ తెలిపారు. ఈ రెండు రహదారులను కలిపి 70 కిలోమీటర్ల రహదారిని ‘హైబ్రిడ్ అన్యుటీ మోడ్’లో నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. -
వాహనదారులకు షాక్.. పెరగనున్న టోల్ చార్జీలు!
హైవేలపై ప్రయాణించే వాహదారులకు టోల్ బాదుడు మరింత పెరగనుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హోచ్‌ఏఐ) ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ రేట్లను పెంచే అవకాశం ఉందని హిందీ దినపత్రిక హిందూస్థాన్ ప్రచురించింది. దీని ప్రకారం.. టోల్ రేట్లు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉంది. జాతీయ రహదారుల రుసుము నియమావళి-2008 ప్రకారం.. సాధారణంగా ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త టోల్ చార్జీ రేట్లు అమలులోకి వస్తాయి. అవసరాలను బట్టి నిర్దిష్ట టోల్ విషయమై విధాన నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు. ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. టోల్ ఫీజు పెంపు ప్రతిపాదనలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మార్చి నెల చివరి వారంలోపు పరిశీలించి ఆమోదించే అవకాశం ఉందని హిందూస్థాన్ నివేదిక పేర్కొంది. కార్లు, తేలికపాటి వాహనాలపై 5 శాతం, ఇతర భారీ వాహనాలపై 10 శాతం వరకు టోల్ చార్జీ పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులకు టోల్ ఫీజుపై రాయితీ ఇస్తూ నెలవారీ పాస్‌లు జారీ చేస్తుంటారు. ఆ పాస్ రుసుము కూడా 10 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Samsung Galaxy Z Fold 5: మడత అంటే ఇదీ.. పర్ఫెక్షన్ అంటే ఇదీ! -
వన్యప్రాణులకు అభయం.. మొదటి ఫ్లైఓవర్ ఎక్కడో తెలుసా?
పర్యావరణ పరిరక్షణ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మంత్రమిదే. వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతూ ఉండడంతో జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్నాం. అభివృద్ధి కార్యకలాపాల్లో ముందడుగు వేస్తూనే వన్యప్రాణుల్ని కాపాడడం కోసం అటవీ ప్రాంతాల నుంచి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వేలను ఎకో వంతెనలతో తీర్చిదిద్దుతున్నారు. ఆ వంతెనల కథాకమామిషు చూద్దాం.. మహారాష్ట్రలో నాగపూర్, ముంబై మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించిన బాలాసాహెబ్ ఠాక్రే సమృద్ధి మహా మార్గ్ (ఎక్స్‌ప్రెస్‌వే) మొదటి దశ ఎన్నో ప్రత్యేకతలతో నిండి ఉంది. మన దేశంలో నిర్మించిన పూర్తి స్థాయి తొలి ఎకో వంతెన ఇది. రోడ్లపై వెళ్లే వాహనాలకు అడ్డంగా వచ్చే వన్యప్రాణులకి ఎలాంటి హాని కలగకుండా ఈ ఎక్స్‌ప్రెస్ వే మార్గం పచ్చగా, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడేలా నిర్మించారు. దారిన పోయే జంతువులు, వన్యప్రాణులు నిర్భయంగా సంచరించడానికి తొమ్మిది గ్రీన్ వంతెనలు (ప్లై ఓవర్ తరహా నిర్మాణాలు), మరో 17 అండర్ పాపెస్ నిర్మించారు. మొత్తం 701 కి.మీ. పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్ తొలిదశలో 520 కి.మీ. పూర్తి చేసుకుంది. ఈ వంతెనతో ప్రయాణికులు వన్యమృగాల భయం లేకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణించవచ్చు. మరో వైపు అవి తిరగడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఈ ఎక్స్‌ప్రెస్ వే పొడవున సంచరించే చిరుత పులులు రహదారులపైకి రాకుండా ఫెన్సింగ్ నిర్మిస్తారు. మహారాష్ట్రలో 10 జిల్లాల మీదుగా సాగే ఈ వంతెన నిర్మాణం రెండో దశ కూడా పూర్తయితే నాగపూర్, ముంబైల మధ్య 16 గంటలు పట్టే ప్రయాణ సమయం 8 గంటలు పడుతుంది. ఏమిటీ వన్యప్రాణుల వంతెనలు? ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వన్యప్రాణుల రాకపోకలు సాగించడమే లక్ష్యంగా నిర్మించే వంతెనల్ని ఎకో వంతెనలు, వన్యప్రాణుల వంతెనలు అని పిలుస్తారు. అటవీ ప్రాంతాల్లో నిర్మించే హైవేలపై వాహనాలకు అడ్డంగా పడి జంతువులు ప్రాణాలు పోకుండా ఉండడం కోసం కూడా ఈ వంతెనల్ని నిర్మిస్తున్నారు. టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో ఎకో వంతెనల నిర్మాణం సాగుతోంది. ఎకో వంతెనలు ఎన్ని రకాలు ? ఈ ఎకో వంతెనలు మూడు రకాలున్నాయి. చిన్న చిన్న పాలిచ్చే జంతువుల్ని కాపాడడం కోసం ఉద్దేశించిన కల్వర్టులు. వీటికే ఆంఫిబియాన్ వంతెనలని పిలుస్తారు. ఇక రెండో రకం కానోపి బ్రిడ్జెస్. కోతులు, ఉడతలు వంటి చెట్లపై నివసించే వాటిని రక్షించడానికి సులభంగా రాకపోకలు సాగించడానికి చెక్కలతో ఈ వంతెనల్ని నిర్మిస్తారు. ఇక కాంక్రీట్‌తో నిర్మించే అండర్‌పాసెస్, ఓవర్ పాస్ టన్నెల్స్. పులులు, ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించడం కోసం వీటిని నిర్మిస్తారు. ఈ ఎకో వంతెనల నిర్మాణం సాగించడానికి ముందు ఆయా దేశాలకు చెందిన పర్యావరణ పరిరక్షకులు వాటిని నిర్మించే ప్రాంతం, సైజుని అధ్యయనం చేస్తారు. ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇచ్చిన తర్వాతే వీటి నిర్మాణం సాగుతుంది. మొదటి వంతెన ఎక్కడ ? ఫ్రాన్స్‌లో 1950 సంవత్సరంలో ఈ ఎకో వంతెనల నిర్మాణం మొదలైంది. ఆ తర్వాత స్కాట్‌ల్యాండ్, బ్రిటన్ వంటి దేశాలు వీటి నిర్మాణంపై మక్కువ చూపించాయి. మొత్తమ్మీద యూరప్ దేశాల్లో ఈ ఎకో బ్రిడ్జీల నిర్మాణం ఎక్కువగా జరుగుతోంది. వాహనాల కింద పడి ప్రమాదవశాత్తూ జంతువులు మరణిస్తూ ఉండడంతో మన దేశంలో ఉత్తరాఖండ్‌లోని కలాధుంగి–నైనిటాల్ హైవే మధ్య రామ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్లో చెట్లపై తిరుగాడే జంతువుల కోసం 90 అడుగుల పొడవైన వంతెన నిర్మించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Hyderabad: రోడ్ టెర్రర్.. ఈ ఏడాది జాతీయ రహదారులపై 1,445 ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జాతీయ రహదారులలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1,445 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 679 మంది మరణించారు. 1,411 మందికి గాయాలయ్యాయి. సైబరాబాద్ ఎన్‌హెచ్‌లలో అత్యధికంగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ 672 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 178 ఘోరమైన ప్రమాదాలు కాగా.. మొత్తం 189 మంది మృత్యువాత పడ్డారు. 640 మందికి గాయాలయ్యాయి. రాచకొండ పరిధిలోని ఎన్‌హెచ్‌లలో 642 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 162 మంది మరణించగా, 644 మంది క్షతగాత్రులయ్యారు. హైదరాబాద్ పరిధిలోని ఎన్‌హెచ్‌లలో 131 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 28 మంది మరణించారు. 127 మంది క్షతగాత్రులయ్యారు. డేంజర్ జోన్ విజయవాడ హైవే.. ఈ ఏడాది అత్యధిక రోడ్డు ప్రమాదాలు విజయవాడ జాతీయ రహదారిలోనే జరిగాయి. ఎన్‌హెచ్– 65లో 527 యాక్సిడెంట్లు జరగగా.. 131 మంది మరణించారు. 500 మందికి గాయాలయ్యాయి. ఆ తర్వాత ఎక్కువ ప్రమాదాలు వరంగల్ రోడ్డులో చోటుచేసుకున్నాయి. ఎన్‌హెచ్–163లో 356 ప్రమాదాలు జరగగా.. 92 మంది మృత్యువాత పడ్డారు. 349 మంది క్షతగాత్రులయ్యారు. మేడ్చల్ రహదారిలోని ఎన్‌హెచ్–44లో 317 ప్రమాదాలలో 90 మంది మరణించగా, 302 మందికి గాయాలయ్యాయి. శ్రీశైలం జాతీయ రహదారి 765లో 229 యాక్సిడెంట్లలో 59 మంది చనిపోగా, 249 మంది గాయాల పాలయ్యారు. రాచకొండ పరిధిలోని జగదేవ్‌పూర్ ఎన్‌హెచ్–161లో ఈ ఏడాది 16 ప్రమాదాలలో ఏడుగురు మరణించగా.. 11 మంది గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఎన్‌హెచ్– 65లో అత్యధికం హైదరాబాద్ కమిషనరేట్‌లో అత్యధిక ప్రమాదాలు ఎన్‌హెచ్– 65లో, అత్యల్పంగా ఎన్‌హెచ్–163లో చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఎన్‌హెచ్–65లో 46 రోడ్డు ప్రమాదాల్లో 15 మంది చనిపోగా, 37 మంది క్షతగాత్రులయ్యారు. ఎన్‌హెచ్–163లో 17 యాక్సిడెంట్లలో ఇద్దరు మరణించగా.. 18 మందికి గాయాలయ్యాయి. ఎన్‌హెచ్–44లో 42 ప్రమాదాల్లో 8 మంది మృత్యువాత పడ్డారు. 44 మందికి దెబ్బలు తగిలాయి. ఎన్‌హెచ్–765లో 26 ప్రమాదాలలో ముగ్గురు మరణించారు. 28 మందికి గాయాలయ్యాయి. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది దుర్మరణం సైబరాబాద్‌లో ఎన్‌హెచ్–44లో.. సైబరాబాద్‌లో అత్యధిక ప్రమాదాలు ఎన్‌హెచ్–44లో జరగగా.. అత్యల్పంగా ఎన్‌హెచ్–765లో జరిగాయి. ఎన్‌హెచ్–44లో 275 యాక్సిడెంట్లు కాగా 82 మంది చనిపోయారు. 258 మందికి గాయాలయ్యాయి. ఎన్‌హెచ్–765లో 106 ప్రమాదాలలో 35 మంది మృత్యువాత పడగా.. 105 మంది క్షతగాత్రులయ్యారు. ఎన్‌హెచ్–65లో 158 ప్రమాదాలు జరిగాయి. 42 మంది మరణించగా.. 143 మందికి గాయాలయ్యాయి. ఎన్‌హెచ్–163లో 133 ప్రమాదాలు కాగా.. 30 మంది మృత్యువాత పడగా.. 134 మంది క్షతగాత్రులయ్యారు. రాచకొండలోనూ ఎన్‌హెచ్–65లోనే.. రాచకొండలోనూ అత్యధిక ప్రమాదాలు ఎన్‌హెచ్–65లో, అత్యల్పంగా ఎన్‌హెచ్– 161లో జరిగాయి. ఎన్‌హెచ్–65లో 323 రోడ్డు ప్రమాదాలు జరగగా.. ఇందులో 67 ప్రమాదాలు ఘోరమైన ప్రమాదాలు. వీటిల్లో 74 మంది మరణించారు. 320 మంది గాయపడ్డారు. ఎన్‌హెచ్– 161లో 16 రోడ్డు ప్రమాదాలలో 7 మంది చనిపోగా.. 11 మంది గాయపడ్డారు. ఎన్‌హెచ్ 163లో ఈ ఏడాది 206 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 60 మంది మరణించారు. 197 మంది క్షతగాత్రులయ్యారు. ఎన్‌హెచ్–765లో 97 రోడ్డు ప్రమాదాలలో 21 మంది మృత్యువాత పడగా.. 116 మందికి గాయాలయ్యాయి. ప్రమాదాలకు అనేక కారణాలు.. జాతీయ రహదారులపై డ్రైవర్లు 15 నుంచి18 గంటల పాటు ఏకధాటిగా డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. చాలా మంది డ్రైవర్లకు ఎన్‌హెచ్‌లపై లైన్ డ్రైవింగ్ నిబంధనలు తెలియకపోవడమూ ఓ కారణమే. ఓవర్ టేక్ చేయడంతోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. – టి. శ్రీనివాస రావు, డీసీపీ, సైబరాబాద్ ట్రాఫిక్ -
మారనున్న రూట్రేఖలు
జాతీయ రహదారుల రూపురేఖలు మారనున్నాయి. భద్రాచలం–కుంట రహదారికి రూ.389 కోట్లు మంజూరయ్యాయి. చింతూరు–మోటు రహదారివిస్తరణ ప్రతిపాదన దశలోనే ఉంది. ఈ రెండు పూర్తయితే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. చింతూరు: జాతీయ రహదారి మరింత సౌకర్యవంతంగా మారనుంది. అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. విజయవాడ–జగ్దల్పూర్ జాతీయ రహదారి–30లో భాగంగా భద్రాచలం నుంచి కుంట వరకు 64 కిలోమీటర్లు, ఆంధ్రా, ఒడిశాలను కలుపుతూ చింతూరు నుంచి మోటు వరకు 14 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి– 326లో ఉన్నాయి. వీటిలో భద్రాచలం నుంచి మోటు వరకు ప్రస్తుత జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.389 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఇటీవల అమరావతిలో శంకుస్థాపన చేశారు. 12 మీటర్ల వెడల్పుతో విస్తరణ.. ప్రస్తుతం ఏడు మీటర్ల వెడల్పు ఉన్న భద్రాచలం–కుంట జాతీయ రహదారి 12 మీటర్ల వెడల్పున విస్తరించనున్నారు. ప్రస్తుతం ఎటపాక మండలం గుండాల నుంచి చింతూరు మండలం చిడుమూరు వరకు ఏడు మీటర్ల వెడల్పున రహదారి వుంది. నిత్యం ఈ రహదారిలో ఆంధ్రా, చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన వేలాది వాహనాల ఈ మార్గంలో వెళ్తుంటాయి. చాలాచోట్ల ప్రమాదకర మలుపులు వుండడంతో తరచూ ప్రమాదాలు చోటు ó సుకుంటున్నాయి. చింతూరు మండలం కాటుకపల్లి నుంచి చట్టి మధ్య 12, ఎటపాక మండలం గుండాల నుంచి బండిరేవు నడుమ 8 వరకు ప్రమాదకర మలుపులు వున్నాయి. ఈ రహదారి విస్తరణకు రూ. 389 కోట్లు మంజూరయ్యాయి. విస్తరణలో భాగంగా ప్రమాదకర మలుపులు ఉన్న ప్రాంతాల్లో రహదారి నేరుగా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. విస్తరించే క్రమంలో అవసరమైన చోట్ల అటవీ ప్రాంతాల్లో చెట్లు, నివాస ప్రాంతాల్లో ఇళ్లను తొలగించి వారికి పరిహారం అందించనున్నారు. రహదారి విస్తరణ పూర్తయితే ఈ మార్గంలో ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశముంది. చింతూరు–మోటు రహదారికి డీపీఆర్ ఆంధ్రా, ఒడిశాలను కలుపుతూ నిర్మించిన జాతీయ రహదారి–326 విస్తరణకు ఇటీవల అధికారులు కేంద్రానికి డీపీఆర్ పంపారు. ఆంధ్రా, ఒడిశాల నడుమ సీలేరు నదిపై గతేడాది వంతెన నిర్మించగా దానికి అనుసంధానంగా 14 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఈ రహదారి చింతూరు నుంచి మల్కనగిరి వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ రహదారి కూడా ఏడు మీటర్లు మాత్రమే ఉంది. దీనిని కూడా 12 మీటర్ల మేర విస్తరించేందుకు అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. టెండర్ల దశలో ప్రక్రియ జాతీయ రహదారి–30 లో భాగంగా భద్రాచలం–కుంట నడుమ 64 కిలోమీటర్ల మేర విస్తరణకు రూ 389 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ టెండర్ల దశలో వుంది. టెండర్లు పూర్తి కాగానే విస్తరణ పనులు ప్రారంభిస్తాం. – శ్రీనివాస్, ఏఈ, జాతీయ రహదారి -
నిత్య దిగ్బంధనాలా..?
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు జాతీయ రహదారులను దిగ్బంధిస్తుండడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రహదారుల దిగ్బంధనానికి ముగింపు ఎక్కడ అని ప్రశ్నించింది. రైతుల ఆందోళన కారణంగా జాతీయ రహదారులపై 20 నిమిషాల ప్రయాణానికి 2 గంటలు పడుతోందంటూ నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. సమస్యను న్యాయస్థానాలు, పార్లమెంట్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ జాతీయ రహదారులపై జనం రాకపోకలను అడ్డుకోవడం ద్వారా కాదని పేర్కొంది. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహకులదని స్పష్టం చేసింది. ‘ఏవైనా ఆదేశాలు జారీ చేస్తే కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి వచ్చామంటూ ఆరోపిస్తారు. చట్టాన్ని ఎలా అమలు చేయాలనేది కార్యనిర్వాహకుల బాధ్యత’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రోడ్లపై ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా రైతులను అభ్యరిస్తున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. జాతీయ రహదారులను దిగ్బంధించకుండా నిరసనకారులను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నామని హరియాణా ప్రభుత్వం వెల్లడించింది. చర్చల నిమిత్తం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, రైతులు రావడానికి నిరాకరిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు నాలుగుకు వాయిదా వేసింది. -
AP: కొత్తగా 20 జాతీయ రహదారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో 20 రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా రూపుదిద్దుకోనున్నాయి. అత్యంత రద్దీ ఉన్న కీలక రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ కృషితో ఇటీవలే రాష్ట్రంలో ఏడు రహదారులను జాతీయ రహదారులుగా కేంద్రం ప్రకటించింది. మొత్తం 485.65 కి.మీ. రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం మరో 20 రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని రెండు విడతలుగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. చదవండి: శీతాకాల అతిథులొచ్చేశాయ్! దీనిపై వైఎస్సార్సీపీ పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. దాంతో ప్రతిపాదించిన వాటిలో 688. కి.మీ. మేర 11 రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది. దీనిపై త్వరలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. మరో 9 రహదారులపైనా కేంద్రం సానుకూలం 889.06 కి.మీ. మేర మరో 9 రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దీనిపై త్వరలో అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది. చదవండి: వ్యాక్సిన్ పేరుతో నగదు బదిలీ మోసం -
రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లం‘ఘనులు’ 40 శాతం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారు 40 శాతం మంది ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తేల్చింది. గత నాలుగేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తూ ట్రాన్స్‌పోర్టు రీసెర్చి వింగ్ ఓ నివేదిక వెల్లడించింది. మన రాష్ట్రంలో ప్రమాదాలు, కారణాలు తదితర అంశాలను ఈ నివేదిక విశ్లేషించింది. ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంతో రోజుకు తొమ్మిదిమంది మృత్యువాత పడుతున్నారు. ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 36 మంది దుర్మరణం పాలవుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారీగా జరిమానాలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ జరిమానాల పెంపుతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని రవాణారంగ నిపుణులు పేర్కొంటున్నారు. -2019లో మొత్తం 21,992 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 15,303 ప్రమాదాలు డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారి వల్ల, 1,262 ప్రమాదాలు లెర్నింగ్ లైసెన్సు ఉన్నవారి వల్ల, 2,576 రోడ్డు ప్రమాదాలు అసలు డ్రైవింగ్ లైసెన్సు లేనివారి వల్ల జరిగాయి. నిబంధనల ఉల్లంఘనల కారణంగా 2,851 ప్రమాదాలు జరిగాయి. - ట్రాఫిక్ ఉల్లంఘనలపై రాష్ట్రంలో రోజూ 80 నుంచి 120 వరకు కేసులు నమోదవుతున్నాయి. - డ్రైవింగ్ లైసెన్సు ఉండి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి పునశ్చరణ తరగతులు నిర్వహించడంపై రవాణా, పోలీస్‌శాఖలు ఆలోచిస్తున్నాయి. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే.. - గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలు: 21,992 - ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య: 7,984 - తీవ్రంగా గాయపడినవారి సంఖ్య: 24,619 - మృత్యువాత పడిన ద్విచక్రవాహనదారుల సంఖ్య: 3,287 - వీరిలో మహిళల సంఖ్య: 399 - హెల్మెట్ ధరించనివారి సంఖ్య: 1,861 - పిలియన్ రైడర్స్ (వెనుక కూర్చున్న వారు) సంఖ్య: 775 - సీటు బెల్టు ధరించని కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నవారి సంఖ్య: 711 - ఓవర్ స్పీడ్ కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాలు: 15,383 - ఓవర్ స్పీడ్ వల్ల మరణించినవారి సంఖ్య: 5,530 - డ్రంకన్‌డ్రైవ్ వల్ల మృత్యువాత పడినవారి సంఖ్య: 43 - రాంగ్ రూట్లో వచ్చి మరణించినవారి సంఖ్య: 155 - హైవేలపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య: 2,760 నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై కఠినచర్యలు వాహనదారులు సామాజిక బాధ్యతగా తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే తీవ్ర చర్యలుంటాయి. ప్రాణాల విలువ తెలియజేసేందుకే జరిమానాలు పెంచాం. జరిమానాల పెంపుతోనైనా కొంత మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. భారీ జరిమానాలతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. జరిమానాలతో 40 శాతం ఉల్లంఘనలు సగానికి పైగా తగ్గుతాయని భావిస్తున్నాం. జరిమానాలతో ఆదాయం పెంచుకుందామనేది మా అభిమతం కాదు. - పేర్ని వెంకట్రామయ్య (నాని), రవాణా శాఖ మంత్రి ఎన్ఫోర్సుమెంట్ కార్యకలాపాలు పెంచుతాం వాహనదారులకు క్రమశిక్షణ నేర్పేందుకే ప్రభుత్వం జరిమానాలు పెంచింది. చెల్లుబాటయ్యే లైసెన్సు ఉన్నవారు కూడా రోడ్డు ప్రమాదాలకు కారకులవడం బాధాకరం. డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చేందుకు కూడా.. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో పరీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇకపై ఎన్ఫోర్సుమెంట్ కార్యకలాపాలు పెరుగుతాయి. - పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్ గత ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు జిల్లా ఓవర్ స్పీడ్ లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేసినవి అనంతపురం 320 327 చిత్తూరు 8 269 తూర్పుగోదావరి 30 289 గుంటూరు 1 459 కృష్ణా 1 101 కర్నూలు 147 330 నెల్లూరు 1,926 603 ప్రకాశం 2 146 శ్రీకాకుళం 0 8 విశాఖపట్నం 3,446 302 విజయనగరం 0 42 పశ్చిమగోదావరి 7 722 వైఎస్సార్ కడప 0 231 మొత్తం 5,888 3,829 రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవించిన మరణాలు.. సంవత్సరం మరణాలు 2016 8,541 2017 8,060 2018 7,556 2019 7,984 2020 (సెప్టెంబర్ వరకు) 4,752 -
నిబంధనలు తూచ్ అంటున్న పోలీసులు
సాక్షి, నెల్లూరు(క్రైమ్): ‘వాహనాలు నడిపే వ్యక్తులు హెల్మెట్ ధరించాలి. అందరూ విధిగా నిబంధనల మేరకు వాహనాలకు నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలి. ట్రాఫిక్ రూల్స్‌ను ఎవరూ ఉల్లంఘించినా ఉపేక్షించం’ చెబుతున్న పోలీసులు పౌరులకు భారీగా జరిమానా విధిస్తున్నారు. కానీ ఆ రూల్స్‌ను మాత్రం పోలీసులే బ్రేక్ చేస్తున్నారు. నిబంధనలు ఎదుటి వారికే కానీ.. తమకు కాదంటున్నారు. సాక్షాత్ జిల్లా పోలీసు బాస్ హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలు తమకు ఒకలా? పోలీసు సిబ్బందికి మరోలా ఉంటాయా అంటూ జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారు. మృతుల్లో అధిక శాతం మంది ద్విచక్ర వాహన చోదకులే. ప్రమాదంలో తలకు తీవ్రగాయమై మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. మితిమీరిన వేగం, నిబంధనల ఉల్లంఘన, హెల్మెట్ ధరించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా గుర్తించి వాటిని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గతేడాది డిసెంబర్ నుంచి జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పోలీసు సిబ్బంది నిత్యం రహదారులపై మాటేసి ఉల్లంఘనల పేరిట వాహన చోదకులపై ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 1,35,212 కేసులు నమోదు చేసి సుమారు రూ.2 కోట్ల మేర జరిమానాలు విధించారు. మరికొందరు పోలీసు సిబ్బంది నిర్దేశిత లక్ష్యాలను అధిగమించేందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హెల్మెట్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్స్ ఉంటే పొల్యూషన్ లేదని, అన్నీ ఉంటే మితిమీరిన వేగం అని, ఏదో ఒకటి సాకుగా చూపిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. పలువురు వాహన చోదకులు ఇదేమిటని ప్రశ్నిస్తే వారిపై అదనంగా మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా నంబరు ప్లేట్లు సరిగా లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ కేసులు నమోదు చేసే ఖాకీలు మాత్రం యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. నిబంధనలు ఎదుటి వారికే కాని తమకు కాదన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఎస్పీ హెచ్చరికలు బేఖాతర్ నిబంధనల అమలు సొంత ఇంటి నుంచే జరిగి అందరికీ మార్గదర్శకులుగా నిలవా లని ఎస్పీ భావించారు. అందులో భాగంగా గతేడాది డిసెంబర్ మొదటి వారంలో జిల్లాలో పనిచేస్తూ ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్న సిబ్బంది అందరూ విధిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయరాదని ఆదేశించారు. వీటిని పాటించని వారికి ఆబ్సెంట్ వేస్తామని హెచ్చరించారు. సిబ్బంది అందరూ విధిగా హెల్మెట్ ధరిస్తున్నారో లేదో పరీక్షించి ప్రతి రోజు నివేదిక అందజేయాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. కొద్ది రోజులు సిబ్బంది ఎస్పీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు. కాలక్రమేణా హెచ్చరికలను బేఖాతరు చూస్తూ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. అధికారులు సైతం పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద జిల్లా పోలీసుల తీరు చట్టాలు, నిబంధనలకు తాము అతీతులమని తమ చేష్టల ద్వారా నిరూపిస్తున్నారు. -
రోడ్లపై మృత్యుగంటలు!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు టెర్రర్ రోజురోజుకూ తీవ్రమవుతోంది.రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ప్రమాదాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆరునెలల్లో జరిగిన ప్రమాదాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా మృతుల్లో అధికశాతం యువత ఉండటం మరింత ఆందోళనకరంగా మారింది. రోడ్డుపై వాహనాల్లో దూసుకుపోతున్న యువత ట్రాఫిక్ ప్రమాణాలు పాటించకపోవడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడం ప్రమాదాలకు ప్రాథమిక కారణాలుగా నిలుస్తున్నాయి. ఏటా తెలంగాణలో 6 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా 2019లో జనవరి నుంచి జూన్ మాసాంతానికి రోడ్డు ప్రమాదాల గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆరునెలల్లో ఏకంగా 10 వేల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మూడువేల మందికిపైగా దుర్మరణం పాలయ్యారు. ఇప్పటిదాకా 11 వేల మంది గాయపడ్డారు. వీరిలో చాలామంది శాశ్వత అంగవైకల్యానికి గురికావడంతో పలు కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. ఈ గణాంకాల ప్రకారం రోజుకు సగటున 50కిపైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 18 మంది మరణిస్తుండగా, 66 మంది గాయపడుతున్నారు. ఈసారి గతేడాదిని దాటుతాయా? 2018 చివరినాటికి 6,603 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. వీటిలో రిమ్మనగూడ, మానకొండూరు, కొండగట్టు వద్ద జరిగిన ప్రమాదాల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ మూడు ప్రమాదాల్లో మృతులు, క్షతగాత్రులు అంతా ఆర్టీసీ ప్రయాణికులే కావడం గమనార్హం. ఈసారి అర్ధ వార్షిక గణాంకాలు చూస్తుంటే.. సరిగ్గా గతేడాది గణాంకాల కంటే కాస్త అధికంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాబోయే ఆరునెలల్లో ప్రమాదాలు అదుపులోకి రాకపోతే.. గతేడాది కంటే అధికంగా మరణాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. జాతీయ రహదారులపైనే అధికం జిల్లాలవారీగా రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే జాతీయ రహదారులున్న ప్రాంతాల్లోనే అవి అధికంగా చోటు చేసుకుంటున్నాయి. సైబరాబాద్ పరిధిలో 386 మంది మరణించగా, రాచకొండ పరిధిలో 368 మంది మరణించారు. సంగారెడ్డి జిల్లాలో 231, వరంగల్ 172, నల్లగొండ 166, సిద్ధిపేట 151 రామగుండం 140, సూర్యాపేటలో 130 మరణాలు సంభవించాయి. కొత్తగూడెంలో తక్కువగా 33, వనపర్తి 38, రాజన్నసిరిసిల్ల 40, జోగులాంబ 50, మహబూబాబాద్‌లో 57 మరణాలు సంభవించాయి. ప్రమాదాలకు అడ్డుకట్ట ఎప్పుడు? అధికవేగం, నిబంధనల ఉల్లంఘనలు రోడ్డు ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. హైవేలున్న ప్రాంతాల్లోనే అధిక ప్రమాదాలు జరిగా యి. రోడ్డుపై వాహనాలు నిలిపి ఉంచడం, సిగ్నల్ జంప్, ప్రమాదకర మలుపుల వద్ద జరుగుతున్న ప్రమాదాల తీవ్రతను పెంచుతున్నాయి. నగర పరిధిలో బాటసారులు రోడ్డుదాటుతూ మృత్యువాతపడుతున్నారు. సరైన ఫుట్‌పాత్‌ల నిర్మాణం, జీబ్రా క్రాసింగ్‌ల నిర్వహణ సరిగా లేకపోవడం కూడా ఇం దుకు కారణం. హైవేలపై పెరిగిన వేగం, బ్లాక్‌స్పాట్ (తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలు)పై కొత్తవారికి అవగాహన లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న రోడ్ సేఫ్టీ బిల్లుల వీటికి పరిష్కారం దొరకవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
మొక్క.. పర్యావరణం పక్కా
ఆదిలాబాద్‌రూరల్: దినదినం ఆడవులు అంతరించిపోతున్న దృష్ట్యా వాతావరణం కాలుష్యంగా మారడంతో పాటు ప్రస్తుతం ఉన్న అటవీ శాతాన్ని పెంచడంలో భాగంగా జాతీయ రహదారి 44కు ఇరువైపులా మొక్కలను నాటుతున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని జైనథ్ మండలం మాండగడ నుంచి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతం నిర్మల్ జిల్లా వరకు సుమారు 84 కిలోమీటర్ల పొడవు మేరకు వీటిని నాటనున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ రహదారి 44కు ఇరువైపులా మూడు వరుసల్లో 2 నుంచి 3 మీటర్ల ఎత్తులో గల నీడను ఇచ్చే మొక్కలతో పాటు వివిధ రకాల పూల మొక్కలను నాటుతున్నారు. నాటిన మొక్కలను పశువులు తినకుండా వాటి చుట్టూ ట్రీ గార్డ్ ఏర్పాటు చేసి వాటిని రక్షించనున్నారు. నాటిన మొక్కలు చనిపోకుండా ప్రతీ రోజు ట్యాంకర్ ద్వారా నీళ్లను పోస్తున్నారు. చల్లని వాతావరణం జాతీయ రహదారి 44కు ఇరువైపులా మూడు వరుసల్లో నాటుతున్న మొక్కలతో జాతీయ రహదారి గుండా ప్రయాణించే ప్రయాణికులకు చల్లని వాతావరణం అందనుంది. అలాగే వాహనాల నుంచి వెలుబడే పొగతో వాతావరణం కాలుష్యం కాకుండా అరికట్టేందుకు వీలు ఉంటుంది. నీడ నిచ్చే మొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలను నాటనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఒకే రకమైన పూల మొక్కలను కాకుండా కొన్ని కిలో మీటర్ల దూరంలో వివిధ రకాల పూల మొక్కలను నాటనున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గాలి, దుమారం వచ్చినప్పుడు నాటిన మొక్క కింద పడిపోకుండా దానికి సపోర్టుగా మధ్యలో ఒక కర్రను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో చెట్టుకు రూ.300 ఖర్చు అడవుల జిల్లా ఆదిలాబాద్‌గా పిలువబడే జిల్లాలో మరింత చెట్లను పెంచుతున్నారు. జాతీయ రహదారి నంబర్ 44కు ఇరువైపులా మూడు వరుసల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, ఇంద్రవెళ్లి, ఇచ్చోడ, నేరడిగొండ రేంజ్ పరిధిలో నాటుతున్న నీడనిచ్చే, పూలనిచ్చే ఒక్కో మొక్కకు రూ. 300 ఖర్చు చేస్తున్నారు. 84 కిలోమీటర్ల పొడవులో 22వేల మొక్కలను నాటనున్నారు. మొక్కలు పెద్దవి అయ్యేంత వరకు ఆ మొక్కలకు ప్రతి రోజు నీళ్లు పోయడంతో పాటు ఎరువులను సైతం పోయనున్నారు. ఇరువైపులా నాటుతున్న మొక్కలతో ఆ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం అందనుంది. -
ఏపీలో హైవేల దిగ్భందానికి జగన్ మద్ధతు
-
ప్రత్యేక హోదా కోరుతూ రేపు హైవేల దిగ్బంధం
-
రాష్ట్రమంతా ఆకుపచ్చని పండుగ
- జాతీయ రహదారులకు ఇరువైపులా హరితహారం - 8న హైదరాబాద్-కోదాడ వరకు మొక్కలు నాటే ఉత్సవం - 165 కిలోమీటర్ల పొడవునా 85 వేల మంది భాగస్వామ్యం - నల్లగొండ జిల్లాలో హరితహారాన్ని ప్రారంభించనున్న సీఎం సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణలోని అన్ని జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు పెంచాలని నిర్ణయించింది. ఈ మహోద్యమంలో ప్రజలందరూ కలసి వచ్చేలా కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 8న నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం పెద కాపర్తి వద్ద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ జిల్లాలు, శాఖల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై తెలంగాణ సరిహద్దు వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా పూల చెట్లు, నీడనిచ్చే చెట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ రహదారి పొడవునా ఒకేసారి 85 వేల మంది హరితహారంలో భాగస్వాములు కానున్నారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరున్న అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి నల్లగొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు మొక్కలు నాటనున్నారు. స్వయం సహాయక బృందాల సభ్యులు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ తరలివచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం రహదారిని 14 సెగ్మెంట్లుగా విభజించారు. ఒక్కో సెగ్మెంట్‌కు ఒక్కో అధికారిని ఇన్చార్జిగా నియమించారు. హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, పది మండలాలు, 50 గ్రామాలున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 14 సెగ్మెంట్లలో మొక్కల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోనున్నారు. ఒకే రకం పూల చెట్లు కాకుండా పది కిలోమీటర్లకు ఒర రకం, ఒక రంగు చొప్పున చెట్లను పెంచనున్నారు. తెలంగాణ నుంచి వెళ్లే అన్ని జాతీయ రహదారులకు ఇరువైపులా ఇలాగే మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో బయల్దేరిన ప్రయాణికులు తెలంగాణ సరిహద్దు దాటే వరకు అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో చల్లని గాలుల మధ్య ప్రయాణం సాగించేలా పూలచెట్ల పెంపకం జరగనుంది. ఔషధ మొక్కల పంపిణీకి ఏర్పాట్లు పండ్లు, పూల మొక్కలతోపాటు ఔషధ మొక్కలనూ భారీ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ముఖ్యమంత్రి ఆదేశం మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11న హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు, నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా, హైటెక్ సిటీ, చార్మినార్, ఉప్పల్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు పెట్టి ఔషధ మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
1350 కిలోమీటర్ల రహదారికి గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో కొత్తగా 1350 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మంగళవారం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో జాతీయ రహదారుల అభివృద్ది, విస్తరణ, నిర్వహణకు సంబంధించి కేసీఆర్ ఆయనతో చర్చించారు. రాష్ట్రంలో కొత్త రహదారుల నిర్మాణంతో పాటు.. ఏటూరు నాగారం నుంచి కైంటాల వరకూ జాతీయ రహదారిని అభివృద్ది చేంసేందుకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో వైపు రాష్ట్రంలో డ్రై పోర్టు నిర్మాణంపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేసీఆర్ గడ్కరిని తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రాష్ట్రానికి వస్తానని సీఎం కు హామీ ఇచ్చారు. -
తెలంగాణలో రోడ్లకు మహార్దశ!
-
రహదారులకు మహర్దశ
- రాష్ట్రానికి 3 వేల కోట్ల కేంద్ర నిధులు - బడ్జెట్ కేటాయింపులతో రోడ్ల విస్తరణ - గతంలోకన్నా అదనంగా వెయ్యి కోట్లు - తొలి ప్రాధాన్యతగా 6 రహదారుల అభివృద్ధి సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పెద్దగా వరాలేవీ లేనప్పటికీ జాతీయ రహదారుల అభివృద్ధికి మాత్రం సానుకూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టంలో కొత్త రహదారుల నిర్మాణం, పాత వాటి విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి దాదాపు రూ. 3 వేల కోట్లు అందనున్నట్టు రోడ్లు, భవనాల శాఖఅంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రూ. వెయ్యి కోట్ల నిధులు అదనంగా రానున్నాయి. దీంతో రాష్ర్టంలోని రహదారులకు మహర్దశ పట్టనుంది. ముఖ్యంగా వెయ్యి కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారుల అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆరు మార్గాలను జాతీయ రహదారులుగా అభివృద్ధి పరచాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరింది. ఇందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. తాజాగా వచ్చే కేంద్ర నిధులతో వాటికే ప్రాధాన్యమిచ్చి, తొలివిడతగా పనులు చేపట్టే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. నిజానికి 22 పనులకు సంబంధించి ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి. చైనా తరహాలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కృతనిశ్చయంతో ఉండటంతో తాజా బడ్జెట్లో నిధుల కే టాయింపులు పెరిగాయి. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న లక్ష కిలోమీటర్ల రహదారులను పూర్తి చేయడంతోపాటు కొత్తగా మరో లక్ష కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో రోడ్లకు రూ. 42 వేల కోట్ల మేర కేటాయించారు. ఇది గతం కంటే దాదాపు రూ. 14 వేల కోట్లు అధికం. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకంలో 4 శాతాన్ని రోడ్డు సెస్‌కు బదలాయించాలనే ఆలోచనతో కేంద్రం ఉన్నందున నిధులకు లోటు ఉండ కపోవచ్చు. దీంతో నిధుల కేటాయింపుల్లో జాప్యం జరగబోదని జాతీయ రహదారుల విభాగం సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సెంట్రల్ రోడ్డు ఫండ్, ఎన్‌హెచ్‌డీపీ, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల కేటాయింపుల కింద తెలంగాణకు హీనపక్షంగా రూ. వెయ్యి కోట్ల మేర అధికంగా నిధులు వచ్చే అవకాశముందని చెప్పారు. ఈ రహదారులకే తొలి ప్రాధాన్యం.. 1. హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-ఎల్లారెడ్డి-బాన్స్వాడ-బోధన్,బాసర-భైంసా- జాతీయ రహదారి 61 (పాత జాతీయ రహదారి 222)తో అనుసంధానం 2. హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు (మొయినాబాద్-చేవెళ్ల-మన్నెగూడ-కొడంగల్ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు) 3. కోదాడ-మిర్యాలగూడ-దేవరకొండ- కల్వకుర్తి-జడ్చర్ల 4. నిర్మల్ నుంచి జగిత్యాల వయా ఖానాపూర్-మల్లాపూర్-రాయికల్ నుంచి ఎన్‌హెచ్ 61, ఎన్‌హెచ్ 63లతో అనుసంధానం 5. అశ్వారావుపేట-ఖమ్మం-సూర్యాపేట 6. కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం