1350 కిలోమీటర్ల రహదారికి గ్రీన్ సిగ్నల్ | 1350 KM national high ways in Telangana state | Sakshi
Sakshi News home page

1350 కిలోమీటర్ల రహదారికి గ్రీన్ సిగ్నల్

Published Tue, Oct 27 2015 3:52 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

1350 KM national high ways in Telangana state

తెలంగాణలో కొత్తగా 1350 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్  మంగళవారం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో జాతీయ రహదారుల అభివృద్ది, విస్తరణ, నిర్వహణకు సంబంధించి కేసీఆర్ ఆయనతో చర్చించారు.


రాష్ట్రంలో కొత్త రహదారుల నిర్మాణంతో పాటు.. ఏటూరు నాగారం నుంచి కైంటాల వరకూ జాతీయ రహదారిని అభివృద్ది చేంసేందుకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో వైపు రాష్ట్రంలో డ్రై పోర్టు నిర్మాణంపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేసీఆర్ గడ్కరిని తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రాష్ట్రానికి వస్తానని సీఎం కు హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement