
న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై వసూలు చేసే టోల్ చార్జీల్లో వినియోగ దారులపై భారం తగ్గించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. సహేతుకమైన రాయితీని అందించేందుకు రూపొందించిన విధానాన్ని త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు.
పార్లమెంట్ సమావేశాల్లో సందర్బంగా బుధవారం రాజ్యసభలో అడిగిన పలు ప్రశ్నలకు నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. జాతీయ రహదారిపై ఒకే సెక్షన్‌లో, ఒకే దిశలో 60 కిలోమీటర్ల లోపున టోల్‌ప్లాజా ఏర్పాటు చేయరాదన్న నిబంధనలకు అనుగుణంగానే చార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పారు. 2019–20లో దేశంలో టోల్ ప్లాజాల వద్ద వసూలైన మొత్తం రూ.27 వేల కోట్లు కాగా, 2023–24 నాటికి ఇది ఏకంగా 35 శాతం పెరిగి రూ.64 వేల కోట్లకు చేరిందని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment