జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్స్ వద్ద రద్దీని తగ్గించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రైవేట్ వాహనదారులకు నెలవారీ, వార్షిక టోల్ పాస్‌లను మంజూరు చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది వాహనదారులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. టోల్ వసూళ్లు అత్యధికంగా కమర్షియల్ వాహనాల నుంచి (74 శాతం) వస్తోంది. అయితే మిగిలిన 26 శాతం మాత్రమే ప్రైవేట్ వాహనాల నుంచి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2025 జనవరి 16న ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతిపాదనలో ముఖ్య ముఖ్యాంశాలు
నెలవారీ & వార్షిక పాస్‌లు: జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేట్ కార్ల యజమానులు నెలవారీ లేదా సంవత్సరానికి పాస్‌లు తీసుకోవచ్చు. ఇది ఖర్చును కొంత తగ్గించడం మాత్రమే కాకుండా.. సమయాన్ని కూడా అదా చేస్తుంది.
అవరోధం లేని టోల్ సేకరణ: పాస్ సిస్టమ్‌తో పాటు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్‌ఎస్‌ఎస్) ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. లేటెస్ట్ టెక్నాలజీతో టోల్‌ల చెల్లింపుకు ఇది సరైన మార్గం. ఈ శాటిలైట్ సిస్టం అమలులోకి వచ్చిన తరువాత ప్రత్యేకంగా టోల్ గేట్స్ అవకాశం ఉండదు.
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్
మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి హైవేల మీద టోల్ గేట్స్ లేకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. టోల్ గేట్స్ మొత్తం తొలగించి.. శాటిలైట్ విధానం ద్వారా టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వాహనదారులు హైవే మీద ఎక్కడా ఆగాల్సిన పనిలేదు.
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ద్వారా టోల్ కలెక్షన్ చాలా సులభం. ఈ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ నేషనల్ హైవే275 & హర్యానాలోని పానిపట్-హిసార్ నేషనల్ హైవే709 మధ్యలో శాటిలైట్ విధానం ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన ట్రైల్ కూడా విజయవంతంగా పూర్తయిందని గడ్కరీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఐస్‌క్రీమ్ బాలేదు.. రూ.1200 నాకిచ్చేయండి: స్విగ్గీపై ఎంపీ ఫైర్
ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన శాటిలైట్ టోల్ కలెక్షన్ విజయవంతమవ్వడంతో.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఈ సిస్టమ్ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం గురించి వాహన వినియోగదారులలో అవగాహన కల్పించడానికి ఓ వర్క్‌షాప్ కూడా ఏర్పాటు చేసినట్లు గడ్కరీ పేర్కొన్నారు. మొత్తం మీద దేశంలో టోల్ గేట్స్ త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
శాటిలైట్ విధానం ద్వారా టోల్ కలెక్షన్
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ లెక్కగట్టి వ్యాలెట్ నుంచి అమౌట్ కట్ చేసుకుంటుంది. అయితే ఈ సిస్టమ్ కోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కల్గిన ఫాస్ట్‌ట్యాగ్‌ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రయాణించిన దూరానికి అయ్యే మొత్తాన్ని ఆటోమాటిక్‌గా చెల్లించడానికి సాధ్యమవుతుంది..
Comments
Please login to add a commentAdd a comment