Toll Tax
-
రూ. 1.93 లక్షల కోట్లు.. ఐదేళ్ల టోల్ ట్యాక్స్
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల(Toll plazas) నుంచి ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో ఎంత టోల్ వసూలు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అక్షరాలా రూ.1.93 లక్షల కోట్లు ప్రభుత్వానికి టోల్ ట్యాక్స్ రూపంలో అందింది. దీనికి సంబంధించిన వివరాలను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) లోక్‌సభలో వెల్లడించింది.ప్రభుత్వం అందించిన డేటా ప్రకారం దేశంలోనే అత్యధిక టోల్ ట్యాక్స్‌ను గుజరాత్‌లోని ఎన్‌హెచ్-48లోని వడోదర-భరూచ్ సెక్షన్(Vadodara-Bharuch section)లో ఉన్న టోల్ ప్లాజా వసూలు చేసింది. గడచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2019-20 నుండి 2023-24 వరకు) రూ.2,043.81 కోట్ల టోల్ వసూలు చేసింది. టోల్ ఆదాయాల జాబితాలో రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్ టోల్ ప్లాజా రెండవ స్థానంలో నిలిచింది. ఇది ఎన్‌హెచ్-48లోని గుర్గావ్-కోట్‌పుట్లి-జైపూర్ విభాగంలో ఉంది. గత ఐదేళ్లలోఈ ప్లాజాలో రూ.1,884.46 కోట్ల విలువైన టోల్ వసూలు చేసినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్‌లోని జల్ధులగోరి టోల్ ప్లాజా ఉంది. 2019-20 నుండి 2023-24 వరకు ఐదు సంవత్సరాలలో ఇది రూ.1,538.91 కోట్ల టోల్ వసూలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బారజోధ టోల్ ప్లాజా గత ఐదు సంవత్సరాలలో రూ.1,480.75 కోట్ల టోల్ వసూలు చేసి జాబితాలో 4వ స్థానంలో ఉంది. టాప్ 10 ఆదాయాన్ని ఆర్జించే టోల్ ప్లాజాల జాబితాలో రెండు ప్లాజాలు గుజరాత్లో, రెండు రాజస్థాన్‌లో రెండు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. గత ఐదేళ్లలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే 10 టోల్ ప్లాజాలు రూ.13,988.51 కోట్ల విలువైన టోల్ వసూలు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 1,063 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 457 టోల్ ప్లాజాలను గత ఐదేళ్లలో ఏర్పాటు చేశారు.ఇది కూడా చదవండి: ఐపీఎస్ అధికారి మహంతికి హైకోర్టులో ఊరట -
టోల్ చార్జీలు తగ్గించేందుకు చర్యలు: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై వసూలు చేసే టోల్ చార్జీల్లో వినియోగ దారులపై భారం తగ్గించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. సహేతుకమైన రాయితీని అందించేందుకు రూపొందించిన విధానాన్ని త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు.పార్లమెంట్ సమావేశాల్లో సందర్బంగా బుధవారం రాజ్యసభలో అడిగిన పలు ప్రశ్నలకు నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. జాతీయ రహదారిపై ఒకే సెక్షన్లో, ఒకే దిశలో 60 కిలోమీటర్ల లోపున టోల్‌ప్లాజా ఏర్పాటు చేయరాదన్న నిబంధనలకు అనుగుణంగానే చార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పారు. 2019–20లో దేశంలో టోల్ ప్లాజాల వద్ద వసూలైన మొత్తం రూ.27 వేల కోట్లు కాగా, 2023–24 నాటికి ఇది ఏకంగా 35 శాతం పెరిగి రూ.64 వేల కోట్లకు చేరిందని మంత్రి వివరించారు. -
ప్రైవేట్ వాహనాలకు పాస్‌లు!: నితిన్ గడ్కరీ
జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్స్ వద్ద రద్దీని తగ్గించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రైవేట్ వాహనదారులకు నెలవారీ, వార్షిక టోల్ పాస్‌లను మంజూరు చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది వాహనదారులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. టోల్ వసూళ్లు అత్యధికంగా కమర్షియల్ వాహనాల నుంచి (74 శాతం) వస్తోంది. అయితే మిగిలిన 26 శాతం మాత్రమే ప్రైవేట్ వాహనాల నుంచి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2025 జనవరి 16న ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రతిపాదనలో ముఖ్య ముఖ్యాంశాలునెలవారీ & వార్షిక పాస్‌లు: జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేట్ కార్ల యజమానులు నెలవారీ లేదా సంవత్సరానికి పాస్‌లు తీసుకోవచ్చు. ఇది ఖర్చును కొంత తగ్గించడం మాత్రమే కాకుండా.. సమయాన్ని కూడా అదా చేస్తుంది.అవరోధం లేని టోల్ సేకరణ: పాస్ సిస్టమ్‌తో పాటు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. లేటెస్ట్ టెక్నాలజీతో టోల్‌ల చెల్లింపుకు ఇది సరైన మార్గం. ఈ శాటిలైట్ సిస్టం అమలులోకి వచ్చిన తరువాత ప్రత్యేకంగా టోల్ గేట్స్ అవకాశం ఉండదు.గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి హైవేల మీద టోల్ గేట్స్ లేకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. టోల్ గేట్స్ మొత్తం తొలగించి.. శాటిలైట్ విధానం ద్వారా టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వాహనదారులు హైవే మీద ఎక్కడా ఆగాల్సిన పనిలేదు.గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ద్వారా టోల్ కలెక్షన్ చాలా సులభం. ఈ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ నేషనల్ హైవే275 & హర్యానాలోని పానిపట్-హిసార్ నేషనల్ హైవే709 మధ్యలో శాటిలైట్ విధానం ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన ట్రైల్ కూడా విజయవంతంగా పూర్తయిందని గడ్కరీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఐస్‌క్రీమ్ బాలేదు.. రూ.1200 నాకిచ్చేయండి: స్విగ్గీపై ఎంపీ ఫైర్ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన శాటిలైట్ టోల్ కలెక్షన్ విజయవంతమవ్వడంతో.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఈ సిస్టమ్ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం గురించి వాహన వినియోగదారులలో అవగాహన కల్పించడానికి ఓ వర్క్‌షాప్ కూడా ఏర్పాటు చేసినట్లు గడ్కరీ పేర్కొన్నారు. మొత్తం మీద దేశంలో టోల్ గేట్స్ త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.శాటిలైట్ విధానం ద్వారా టోల్ కలెక్షన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ లెక్కగట్టి వ్యాలెట్ నుంచి అమౌట్ కట్ చేసుకుంటుంది. అయితే ఈ సిస్టమ్ కోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కల్గిన ఫాస్ట్‌ట్యాగ్‌ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రయాణించిన దూరానికి అయ్యే మొత్తాన్ని ఆటోమాటిక్‌గా చెల్లించడానికి సాధ్యమవుతుంది.. -
గ్రామీణ రోడ్లకు టోల్ టాక్స్ వసూలు చేయడం సంపద సృష్టినా..?
-
ఏపీ ప్రజలపై మరో భారం
-
టోల్ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!
జాతీయ రహదారిపై ప్రయాణం చేస్తున్నప్పుడు టోల్‌ప్లాజ్ రుసుం చెల్లిస్తుంటాం కదా. అయితే ఇకపై ఆ ఛార్జీ చెల్లించాల్సిన పనిలేదు. అవునండి..మీరు నిత్యం అదే రహదారి గుండా ప్రయాణిస్తూ, మీ ఇళ్లు స్థానికంగా టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అందుకు కొన్ని ధ్రువపత్రాలు సమర్పించి టోల్‌పాస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.ముందుగా టోల్ ప్లాజా వద్ద సిబ్బందితో మాట్లాడి మీ దగ్గరున్న అడ్రస్ ప్రూఫ్ సమర్పించాలి. ఆ సమయంలో మీ ఫాస్టాగ్ అకౌంట్‌తో అడ్రస్ప్రూఫ్ను లింక్ చేసి లోకల్ పాస్ జారీ చేస్తారు. అందుకోసం రూ.340 చెల్లించాల్సి ఉంటుంది. ఇది నెలపాటు పని చేస్తుంది. వచ్చేనెల తిరిగి ఈ పాస్‌ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కేవలం రూ.340 చెల్లించి నెలరోజులపాటు టోల్ ఛార్జీలు పేచేయకుండా ప్రయాణించవచ్చు. అయితే ఈ లోకల్పాస్ కేవలం సంబంధిత టోల్‌ప్లాజాలో మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినపుడు మాత్రం అక్కడి టోల్రేట్లకు తగినట్లుగా పూర్తి ఛార్జీలు ఫాస్టాగ్ ద్వారా చెల్లించాల్సిందే.ఇదీ చదవండి: ఇలా చేస్తే మీ అప్పు రికవరీ అవ్వాల్సిందే..!2021 ఆర్థిక సంవత్సరంలో ఫాస్టాగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.34,778 కోట్లు ఆదాయం సమకూరింది. 2022లో అది 46 శాతం పెరిగి రూ.50,855 కోట్లకు చేరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి పది నెలలకాలంలో రూ.50 వేలకోట్ల మార్కును దాటింది. -
గుడ్‌న్యూస్.. 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫీజు లేదు
ఫంక్షనల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఉన్న వాహనాలు హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో రోజుకు 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫీజు లేకుండా ప్రయాణించడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ మేరకు జాతీయ రహదారుల రుసుము (రేట్ల నిర్ణయం, వసూళ్లు) నిబంధనలు- 2008ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సవరించింది. కొత్త నిబంధనలు మంగళవారం నుండి అమలులోకి వచ్చినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్లో తెలిపింది.కొత్త నిబంధనల ప్రకారం.. జీఎన్ఎస్ఎస్ వాహనాలు 20 కిలోమీటర్లు దాటి ఎంత దూరం ప్రయాణిస్తాయో అంత దూరంపై మాత్రమే ఇప్పుడు రుసుము వసూలు చేస్తారు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆన్-బోర్డ్ యూనిట్ అమర్చిన వాహనాల కోసం ప్రత్యేకమైన లేన్‌ను కేటాయిస్తారు. ఇతర వాహనాలు ఈ లేన్‌లోకి ప్రవేశించినట్లయితే రెండు రెట్ల రుసుమును చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: టోల్ ఫీజు మినహాయింపు ఉంటుందా?ఎంపిక చేసిన జాతీయ రహదారులలో ఫాస్ట్‌ట్యాగ్‌తో పాటు జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని పైలట్ ప్రాతిపదికన అమలు చేయాలని నిర్ణయించినట్లు జూలైలో హైవే మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటకలోని ఎన్‌హెచ్-275లోని బెంగళూరు-మైసూర్ సెక్షన్, హర్యానాలోని ఎన్‌హెచ్-709లోని పానిపట్-హిసార్ సెక్షన్లో జీఎన్ఎస్ఎస్ ఆధారిత వినియోగదారు రుసుము వసూలు వ్యవస్థకు సంబంధించి పైలట్ అధ్యయనం జరిగిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. -
టోల్ ప్లాజాల ‘లైవ్ ట్రాక్’
టోల్ ప్లాజాల వద్ద నెలకొనే రద్దీని లైవ్‌గా ట్రాక్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా దేశంలోని సుమారు 100 టోల్ ప్లాజాలను గుర్తించింది. జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో ఆయా టోల్ గేట్ల వద్ద నెలకొనే ట్రాఫిక్‌ను ట్రాక్ చేస్తూ అందుకు అనువుగా హెచ్చరికలు, సలహాలు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.సెలవులు, వారాంతాలు, పండగలు..వంటి ప్రత్యేక రోజుల్లో టోల్ గేట్ల వద్ద భారీగా వాహనాలు నిలుస్తుండడం గమనిస్తాం. దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలుస్తుంటాయి. టోల్ గేట్ల నిర్వహణ సరళీకృతం చేయడంలో భాగంగా కేంద్రం ఫాస్టాక్ వంటి విధానాలు తీసుకొచ్చింది. అయినా చాలాచోట్ల వాహనాల రద్దీ తగ్గడంలేదు. అలాంటి సమయాల్లో వారికి సరైన మార్గదర్శకాలు, సలహాలు, సూచనలులేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితులను అదుపు చేయడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) టోల్ ప్లాజాలను లైవ్‌గా ట్రాక్ చేయాలని నిర్ణయించింది. అందుకోసం టోల్గేట్ టోల్ ఫ్రీ నంబర్ 1033కు వచ్చిన ఫిర్యాదుల ఆదారంగా దేశవ్యాప్తంగా దాదాపు 100 టోల్‌ప్లాజాలను ఎంచుకుంది.ఇదీ చదవండి: ప్రకృతి బీభత్సం.. ఆర్థిక నష్టం..!ప్రత్యేకంగా జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో ఈ టోల్గేట్లను ట్రాక్ చేయనున్నారు. టోల్ ప్లాజా వద్ద వాహనాల క్యూ నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్చరికలు, సూచనలు అందించనున్నారు. దాంతోపాటు ట్రాఫిక్‌కు అనుగుణంగా సిబ్బందికి లేన్ల పంపిణీపై సలహాలు ఇస్తారు. ఈ జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలోని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) అభివృద్ధి చేసింది. -
టోల్ ఫీజు మినహాయింపు ఇక లేదు..
టోల్ ఫీజు మినహాయింపునకు సంబంధించిన మూడేళ్ల నాటి పాత నిబంధనలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఉపసంహరించుకుంది. టోల్ బూత్‌ల వద్ద ఫీజు వసూలు ఎక్కువ సమయం పట్టి వాహనాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటే వాటిని టోల్ ట్యాక్స్ లేకుండానే అనుమతించాలని నిబంధన ఉండేది. దాన్ని ఎన్హెచ్ఏఐ తాజాగా తొలగించింది.ఎన్హెచ్ఏఐ 2021 మేలో జారీ చేసిన నిబంధన ప్రకారం ప్రతి టోల్ బూత్ వద్ద ఒక్కో వాహనం ముందుకు కదిలే సమయం 10 సెకన్ల కంటే తక్కువగా ఉండాలి. ఏ లేన్‌లోనైనా వాహనాల వరుస టోల్ బూత్ నుండి 100 మీటర్లకు మించకూడదు. టోల్ బూత్ నుండి 100 మీటర్ల దూరం దాటి వాహనాలు క్యూ పెరిగితే టోల్ వసూలు చేయకుండా వాటిని అనుమతించాలి. ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న టోల్ బూత్‌లు, భూసేకరణ పూర్తికాని టోల్ ప్లాజాల కోసం ఎన్హెచ్ఏఐ ఈ నిబంధనను రూపొందించింది.అయితే, ఇప్పుడు మూడేళ్ల తర్వాత, ఎన్హెచ్ఏఐ 2021 నాటి ఆ విధానాన్ని ఉపసంహరించుకుంది. ఈ నియమాన్ని అమలు చేయడంలో ఇబ్బందులు, ప్రజల నుండి వచ్చిన విమర్శల తర్వాత ఈ నిబంధనను తొలగించినట్లు నివేదిక పేర్కొంది. ఎన్హెచ్ఏఐ ఇప్పుడు లాంగ్ లైన్లను నిర్వహించడానికి లైవ్ ఫీడ్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది. టోల్ ప్లాజాల నిర్వహణకు సంబంధించి ఎన్హెచ్ఏఐ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయానికి వర్తించే నిబంధనలు తక్షణమే రద్దవుతాయి. ఎందుకంటే ఎన్‌హెచ్ ఫీజు రూల్స్ 2008లో అటువంటి మినహాయింపు ప్రస్తావన లేదు. -
టోల్ ఫీజు మినహాయింపు ఉంటుందా..? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ
-
టోల్ ఫీజు మినహాయింపు ఉంటుందా? కేంద్రం క్లారిటీ
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద క్యూ పొడవు లేదా వేచి ఉండే సమయాల ఆధారంగా ప్రస్తుత నిబంధనలు టోల్ ఫీజు మినహాయింపులను అందించవని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎంపీలు లేవనెత్తిన ఆందోళనలను ఉద్దేశించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో రెండు వేర్వేరు సమాధానాల్లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు.60 కిలోమీటర్ల లోపే ఉన్నప్పటికీ రెండు ప్లాజాల్లో టోల్ వసూలు చేస్తున్నారని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ "ఎన్‌హెచ్ ఫీజు నిబంధనలు, రాయితీ ఒప్పందం ప్రకారం 60 కి.మీ పరిధిలో ఉన్నప్పటికీ ఫీజు ప్లాజాలకు అనుమతి ఉంటుంది" అని గడ్కరీ స్పష్టం చేశారు. కాగా దీనికి సంబంధించి 2022 మార్చిలో గడ్కరీ మాట్లాడిన పాత వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. 60-కిమీ పరిధిలో ఒకే ఒక టోల్ ప్లాజా ఉంటుందని, అదనంగా ఉన్నవాటిని మూడు నెలల్లో మూసివేస్తామని అందులో ఆయన హామీ ఇచ్చారు.అయితే, లోక్‌సభలో ఆయన తాజాగా ఇచ్చిన సమాధానం దీనికి విరుద్ధంగా అలాంటి మినహాయింపు లేదని పేర్కొంది. ఎగ్జిక్యూటింగ్ అథారిటీ డాక్యుమెంట్ చేసిన దాని ప్రకారం, అవసరమైతే 60 కిలోమీటర్లలోపు అదనపు టోల్ ప్లాజాలకు నిబంధనలు అనుమతిస్తున్నట్లు గడ్కరీ వివరించారు.ఇక కొత్త టోల్ ప్లాజాల రూపకల్పనకు మార్గదర్శకాల్లో భాగంగా రద్దీ సమయాల్లో వాహనాల క్యూలు 100 మీటర్లు దాటితే బూమ్ బారియర్స్‌ను ఎత్తివేసే అంశంపై మరో ఎంపీ అడిగిన ప్రశ్నకూ గడ్కరీ స్పందించారు. “ఫీజు ప్లాజాల వద్ద నిర్ణీత దూరం లేదా సమయ పరిమితి దాటి వాహనాలను నిలిపివేసిన సందర్భంలో ఆ వాహనాలను యూజర్ ఫీజు నుంచి మినహాయించే నిబంధన లేదు” అని ఆయన స్పష్టం చేశారు. 2021 ఫిబ్రవరి 16 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి అమలును ఆయన గుర్తు చేశారు. ఇది టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించింది. -
హైవే ఎక్కితే టోల్!
సాక్షి, హైదరాబాద్: హైవే మీద కాస్త దూరమే ప్రయాణించినా ఇకపై సదరు వాహనం సంబంధిత ఖాతా నుంచి టోల్ రుసుము కట్ కానుంది. ప్రస్తుతం టోల్ ప్లాజాల్లోంచి వాహనం వెళ్తేనే టోల్ చెల్లించాల్సి వస్తోంది. టోల్ బూత్ వచ్చేలోపు రోడ్డు దిగిపోతే చెల్లించాల్సిన అవసరం ఉండటం లేదు. ఇకపై అలా కాకుండా హైవే ఎక్కితే చాలు రుసుము చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. వచ్చే సంవత్సరానికి ప్రాథమిక స్థాయిలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దశల వారీగా పూర్తిస్థాయిలో దీన్ని అమలు చేయనున్నారు. సెన్సార్లు, ఫాస్టాగ్‌లకు చెల్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫాస్టాగ్‌తో అనుసంధానమై టోల్ వసూలు చేస్తున్నారు. గతంలో మాన్యువల్‌గా వసూలు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న టోల్ ప్లాజాలనే వినియోగించుకుంటున్నారు. అక్కడి సిబ్బందికి నిర్ధారిత రుసుము చెల్లించి రశీదు పొందే పద్ధతి తొలగించి, సెన్సార్లు ఫాస్టాగ్ స్టిక్కర్‌ను రీడ్ చేయటం ద్వారా ఖాతా నుంచి డబ్బులు తీసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఫాస్టాగ్ ఖాతాను వాడకాన్ని బట్టి ఎప్పటికప్పుడు టాప్ అప్ చేసుకోవల్సి ఉంటుంది.కాగా దీనికి పూర్తి భిన్నంగా కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంతో అనుసంధానమయ్యే కొత్త టోల్ వ్యవస్థను తీసుకొస్తోంది. టోల్ బూత్ అవసరం లేకుండా ఇది పనిచేస్తుంది. వాహనాలు టోల్ రోడ్ల మీద తిరిగిన దూరాన్ని ఉపగ్రహ సాయంతో గుర్తించి, ఆ మేరకు టోల్‌ను లెక్కిస్తుంది. ఆ వ్యవస్థతో అనుసంధానించిన ఖాతా నుంచి అంతమేర టోల్ రుసుము డిడక్ట్ అవుతుంది. వాహనాల బారులు ఉండవు గతంలో మాన్యువల్‌గా టోల్ వసూలు చేసినప్పుడు రద్దీ అధికంగా ఉండే సమయంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాల్సి వచ్చేది. దీన్ని నివారించేందుకు కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని తెచి్చంది. వాహనం టోల్ బూత్‌లోకి ప్రవేశిస్తుండగానే సెన్సార్లు ఫాస్టాగ్‌ను రీడ్ చేసి టోల్‌ను డిడక్ట్ చేస్తాయి. ఈ పద్ధతిలో వాహనాల బారులు ఉండవని భావించారు.కానీ సెన్సార్లు సరిగా పనిచేయకపోవడం, ఇతరత్రా కారణాలతో రద్దీ సమయాల్లో ఇప్పటికీ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతూనే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంను కేంద్రం తెరపైకి తెస్తోంది. ఈ పద్ధతిలో వాహనం ప్రయాణిస్తున్న సమయంలోనే క్షణాల్లో టోల్ లెక్కించడం, డబ్బులు డిడక్ట్ కావడం జరుగుతుంది. దీంతోపాటు అసలు టోల్‌బూత్‌లే ఉండకపోవడంతో ఎక్కడా వాహనాలు వేచి చూడాల్సిన పరిస్థితి రాదు. ప్రభుత్వానికి 3 రెట్లు పెరగనున్న ఆదాయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై రూ.40 వేల కోట్ల మేర టోల్ వసూలవుతోంది. ఈ ఆదాయం పెరగనుంది. ఇప్పటివరకు టోల్ గేట్లు వచ్చేలోపే దారి మళ్లి వెళ్లే వాహనాల వల్ల ఆదాయం రావటం లేదు. కొత్త విధానంతో టోల్ రోడ్డుపై వాహనాలు స్వల్ప నిడివిలో ప్రయాణించినా టోల్ వసూలు చేసే అవకాశం ఉండటంతో టోల్ ఆదాయం కనీసం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. పైగా టోల్ బూత్‌ల నిర్వహణ భారం ఉండదు. ఇలా పనిచేస్తుంది.. టోల్ రోడ్లను శాటిలైట్లు గుర్తించేందుకు వీలుగా ఆయా మార్గాల్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆ రోడ్లపై ప్రత్యేక కెమెరాలు కూడా ఉంటాయి. ఇవి ఉపగ్రహంతో అనుసంధానమై పనిచేస్తాయి. ఇక వాహనాల్లో ఆన్‌బోర్డ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి జీపీఎస్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. ఇవన్నీ పరస్పరం సమన్వయం చేసుకుంటూ, వాహనం టోల్ రోడ్డు మీద ఎంత దూరం ప్రయాణించిందో కచి్చతంగా నిర్ధారిస్తాయి.వాహనదారు నిర్ధారించిన బ్యాంకు ఖాతాతో టోల్ వసూలు వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. ఏ ప్రాంతంలో టోల్ రోడ్డుపైకి వాహనం చేరింది, ఏ ప్రాంతంలో అది హైవే దిగిందీ అన్న విషయాన్ని క్షణాల్లో నమోదు చేసి టోల్‌ను నిర్ధారించి, సంబంధిత ఖాతా నుంచి వసూలు చేసుకుంటుంది. ఈ వ్యవస్థకు సంబంధించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది.మైసూరు–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే, హర్యానా లోని పానిపట్–హిస్సార్ జాతీయ రహదారులపై ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలిస్తోంది. మరో ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా దీన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. -
టోల్‌గేట్స్ గాయబ్.. వసూళ్లు మాత్రం ఆగవు
టోల్ గేట్స్ వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గిందడానికి ఫాస్ట్‌ట్యాగ్ విధానం తీసుకువచ్చారు. ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ విధానానికి స్వస్తి పలికి శాటిలైట్ విధానం తీసుకురావడానికి కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే పలు సందర్భాల్లో పేర్కొన్నారు.మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి హైవేల మీద టోల్ గేట్స్ లేకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. టోల్ గేట్స్ మొత్తం తొలగించి.. శాటిలైట్ విధానం ద్వారా టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వాహనదారులు హైవే మీద ఎక్కడా ఆగాల్సిన పనిలేదు.గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ద్వారా టోల్ కలెక్షన్ చాలా సులభం. ఈ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ నేషనల్ హైవే275 & హర్యానాలోని పానిపట్-హిసార్ నేషనల్ హైవే709 మధ్యలో శాటిలైట్ విధానం ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన ట్రైల్ కూడా విజయవంతంగా పూర్తయిందని గడ్కరీ పేర్కొన్నారు.ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన శాటిలైట్ టోల్ కలెక్షన్ విజయవంతమవ్వడంతో.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఈ సిస్టమ్ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం గురించి వాహన వినియోగదారులలో అవగాహన కల్పించడానికి ఓ వర్క్‌షాప్ కూడా ఏర్పాటు చేసినట్లు గడ్కరీ పేర్కొన్నారు. మొత్తం మీద దేశంలో టోల్ గేట్స్ త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.శాటిలైట్ విధానం ద్వారా టోల్ కలెక్షన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ లెక్కగట్టి వ్యాలెట్ నుంచి అమౌట్ కట్ చేసుకుంటుంది. అయితే ఈ సిస్టమ్ కోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కల్గిన ఫాస్ట్‌ట్యాగ్‌ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రయాణించిన దూరానికి అయ్యే మొత్తాన్ని ఆటోమాటిక్‌గా చెల్లించడానికి సాధ్యమవుతుంది. -
22ఏళ్ళ క్రితం నిర్మించారు.. ఇప్పటికీ అక్కడ టోల్ ట్యాక్స్ ఎక్కువే!
ఎక్స్‌ప్రెస్‌వే లేదా హైవేలలో ప్రయాణిస్తే టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిందే. అయితే దేశంలో ఎక్కడైనా టోల్ ట్యాక్స్ ఒకేలా ఉంటుంది. కానీ మన దేశంలోని ఓ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ప్రయాణించాలంటే కొంత ఎక్కువ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ ఎక్స్‌ప్రెస్‌వే ఏది? సాధారణ హైవే మీదకంటే ఇక్కడ ఎంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.దేశంలో అత్యంత ఖరీదైన ఎక్స్‌ప్రెస్‌వే ఏది అంటే చాలామంది చెప్పే సమాధానం 'ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే'. దీన్ని 22 సంవత్సరాల క్రితం నిర్మించారు. కాబట్టి దేశంలో అతి పురాతనమైన, మొదటి ఎక్స్‌ప్రెస్‌వేగా దీన్ని పరిగణిస్తారు. 2002లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నిర్మించారు. ఈ రహదారి మహారాష్ట్రలోని అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఒకటైన ముంబైని పూణేకి కలుపుతుంది.ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే అనేది దేశంలోనే మొదటి 6 లేన్ల రోడ్ కూడా. ఈ రోడ్డు నిర్మాణానికి అప్పట్లో రూ. 163000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీని పొడవు 94.5 కిలోమీటర్లు. ఇది నవీ ముంబైలోని కలంబోలి ప్రాంతం నుంచి ప్రారంభమై పూణేలోని కివాలే వద్ద ముగుస్తుంది. దీన్ని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించింది.ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన తరువాత ముంబై & పూణే మధ్య ప్రయాణించే సమయాన్ని మూడు గంటల నుంచి 1 గంటకు తగ్గించింది. అంటే ఈ రోడ్డుపై ప్రయాణించేవారు రెండు గంటల సమయాన్ని ఆదా చేయవచ్చు. కాబట్టి ఎక్కువమంది ఈ హైవే మీద ప్రయాణిస్తూ ఉంటారు. సహ్యాద్రి పర్వత శ్రేణిలో నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే సొరంగాలు, అండర్ పాస్‌లను కలిగి ఉంది.టోల్ ట్యాక్స్ప్రారంభంలో చెప్పుకున్నట్లుగానే ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే అత్యంత ఎక్కువ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఇక్కడ కిలోమీటరుకు రూ. 3.40 వసూలు చేస్తుంది. ఇతర ఎక్స్‌ప్రెస్‌వేల మీద ఈ ఛార్జ్ కేవలం రూ. 2.40 మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఛార్జ్ ఎంత ఎక్కువ వసూలు చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది.టోల్ ట్యాక్స్ ఎక్కువగా వసూళ్లు చేయడానికి కారణం!ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి భారీగా ఖర్చు చేశారు, అంతే కాకుండా ఇప్పుడు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. అయితే ప్రారంభంలో ప్రైవేట్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం కూడా ఈ ఛార్జెస్ పెరుగుదలకు కారణమనే తెలుస్తోంది. ట్రాఫిక్ వాల్యూమ్, ప్రభుత్వ పన్నులు మొదలైనవి కూడా టోల్ ఫీజు ఎక్కువగా వసూలు చేయడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. -
Mallikarjun Kharge: లీకేజీలు, ప్రమాదాలు, దాడులు... ఇదే మోదీ ‘పిక్చర్’!
న్యూఢిల్లీ: ‘‘పదేళ్ల తన పాలన కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని లోక్‌సభ ఎన్నికల ప్రచారం పొడవునా మోదీ పదేపదే చెప్పుకున్నారు. ఆయన సినిమా ఎలా ఉండనుందో ఈ నెల రోజుల పాలన చెప్పకనే చెప్పింది. పేపర్ లీకేజీలు, కశీ్మర్లో ఉగ్ర దాడులు, రైలు ప్రమాదాలు, దేశమంతటా టోల్ ట్యాక్సుల పెంపు, బ్రిడ్జిలు, విమానాశ్రయాల పై కప్పులు కూలడాలు, చివరికి మోదీ ఎంతో గొప్పగా చెప్పుకున్న అయోధ్య రామాలయంలో కూడా లీకేజీలు... ఇదే మోదీ చూపిస్తానని చెప్పిన సినిమా!’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని అంశాలవారీగా ఏకిపారేశారు. సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా మోదీ కేవలం ‘మన్ కీ బాత్’కు పరిమితమయ్యారంటూ చురకలు వేశారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలతో సమాజాన్ని విభజించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇటీవలి పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని ఖర్గే అన్నారు. మణిపూర్ హింసాకాండ వంటి దేశం ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదంటూ ఆక్షేపించారు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే క్రమంలో ఆరెస్సెస్‌పై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు చేశారు. ‘‘ఆరెస్సెస్ విధానం దేశానికి చాలా ప్రమాదకరం. వర్సిటీలతో పాటు అన్ని విద్యా సంస్థల్లో వీసీలు, ప్రొఫెసర్ల నియామకాలపై దాని ప్రభావం ఉంటోంది’’ అంటూ ఆక్షేపించారు. ఆ వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆరెస్సెస్ సభ్యుడు కావడమే నేరమన్నట్టుగా మీ మాటలున్నాయి. ఆ సంస్థలో ఎందరో మేధావులున్నారు. అది జాతి నిర్మాణానికి అవిశ్రాంతంగా పాటుపడుతోంది. అలాంటి సంస్థను నిందిస్తున్నారు మీరు’’ అన్నారు. మోదీపై, ఆరెస్సెస్‌పై ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.కూర్చుని మాట్లాడతా: ఖర్గే అలాగే కానీయండి: ధన్‌ఖడ్ విపక్ష సభ్యుల తీవ్ర విమర్శలు, అధికార పక్ష ప్రతి విమర్శలతో వేడెక్కిపోయిన రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే వ్యాఖ్యలు, చైర్మన్ స్పందన నవ్వులు పూయించాయి. గంటన్నర పాటు ప్రసంగించిన ఖర్గే, తనకు మోకాళ్ల నొప్పులున్నందున కూర్చుని మాట్లాడేందుకు అనుమతి కోరారు. ‘మీకెలా సౌకర్యంగా ఉంటే అలా చేయండి. ఇబ్బందేమీ లేదు’ అంటూ ధన్‌ఖడ్ బదులిచ్చారు. కానీ కూర్చుని చేసే ప్రసంగం నిలబడి చేసినంత ప్రభావవంతంగా ఉండదని ఖర్గే అనడంతో సభ్యులంతా గొల్లుమన్నారు. ఆ విషయంలో మీకు వీలైనంత సా యం చేస్తా లెమ్మని ధన్‌ఖడ్ బదులివ్వడంతో సోనియాతో సహా అంతా మరోసారి నవ్వుకున్నారు. మరో సందర్భంలో ‘‘నేను దక్షిణాదికి చెందిన వాడిని. కనుక ద్వివేది, త్రివేది, చతుర్వేది పదాలు నన్ను చాలా అయోమయపరుస్తాయి’’ అని ఖర్గే అనడంతో ‘కావాలంటే వాటిపై ఓ అరగంట పాటు ప్రత్యేక చర్చ చేపడదాం’ అని ధన్‌ఖడ్ బదులిచ్చారు. దాంతో సభంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది. -
Nitin Gadkari: రోడ్డు బాగాలేకపోతే టోల్ వసూలు చేయొద్దు
న్యూఢిల్లీ: రహదారి సరిగ్గా లేకపోతే వాహనదారుల నుంచి టోల్ రుసుము వసూలు చేయొద్దని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ రహదారుల నిర్వహణ సంస్థలను ఆదేశించారు. శాటిలైట్ ఆధారిత టోల్ రుసుముల వసూలుపై బుధవారం ఢిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించలేనప్పుడు టోల్ చార్జి వసూలు చేయొద్దని అన్నారు. గుంతలు, బురదతో నిండిన రోడ్లపై కూడా టోల్ వసూలు చేస్తే జనం నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,000 కిలోమీటర్ల మేర రహదారులపై ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
టోల్ అడిగినందుకు బుల్డోజర్తో విధ్వంసం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్లు దూకుడు కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలోని హపూర్ జిల్లాలో మంగళవారం(జూన్11)బుల్డోజర్ బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పిల్కువా ప్రాంతం ఛాజార్సి టోల్ బూత్ వద్ద ఉదయం 8.30 గంటలకు ఒక బుల్డోజర్ వచ్చి ఆగింది. టోల్ ప్లాజా సిబ్బంది బుల్డోజర్ డ్రైవర్‌ను టోల్ ఛార్జీలు చెల్లించాలని అడిగారు. దీంతో ఆగ్రహానికి గురైన బుల్డోజర్ డ్రైవర్ టోల్ ప్లాజాకు చెందిన రెండు బూత్‌లతో పాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడు. బుల్డోజర్ వి ధ్వంసాన్ని టోల్‌ప్లాజా సిబ్బంది వీడియో తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బుల్డోజర్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. బుల్డోజర్ను స్వాధీనం చేసుకున్నారు. -
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి ‘టోల్’ బాదుడు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ ఛార్జీలు నేటి అర్ధరాత్రి(జూన్ 3) నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఐఏ) వెల్లడించింది. టోల్ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు పెరగనున్నాయి.టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు ఎన్హెచ్ఐఏ తెలిపింది. ఛార్జీల పెంపు నిర్ణయం కొద్ది రోజుల క్రితమే తీసుకున్నప్పటికీ ఎన్నికల కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీల పెంపును అమలు చేయనున్నట్లు పేర్కొంది.ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని ఎన్ హెచ్ఐఏ నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ ఎన్ హెచ్ఐఏను ఎన్నికల సంఘం ఆదేశించింది. -
ఎన్హెచ్ఏఐ నిర్ణయానికి ‘నో’ చెప్పిన ఈసీ
సార్వత్రిక ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్ర ఎన్నికల సంఘం రిలీఫ్ కల్పించింది. టోల్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)ను ఆదేశించింది. కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారుల నుంచి పాత టోల్ ఛార్జీలే వసూలు చేయాలని టోల్ ఆపరేటర్లకు ఎన్హెచ్ఏఐ సూచించింది.ఏటా ఏప్రిల్ ఒకటో తేదీన ఎన్హెచ్ఏఐ టోల్ ఛార్జీలు పెంచుతుంది. సంస్థ నిర్ణయాల ప్రకారం..సరాసరి ఐదు శాతం టోల్ ఛార్జీలు పెరుగుతాయి. ఈమేరకు ముందుగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆదివారం రాత్రి నుంచి పెరిగిన టోల్ ఛార్జీలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. కానీ కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఛార్జీల పెంపు అంశాన్ని ఎన్నికల సంఘం వద్దకు తీసుకెళ్లింది. దాంతో ఆ వ్యవహారాన్ని పరిశీలించిన ఈసీ ఎన్నికల నేపథ్యంలో పెంపు నిర్ణయం వాయిదా వేయాలని ఎన్హెచ్ఏఐను ఆదేశించింది. దాంతో తాజాగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. పెరిగిన టోల్ ఛార్జీలు ఎప్పటి నుంచి అమలవుతాయో తెలియజేస్తామని చెప్పింది.ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి వాహనదారుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తం టోల్ ఛార్జీలను సదరు వాహనదారులకు వెనక్కు చెల్లిస్తామని ఎన్హెచ్ఏఐ వర్గాలు చెప్పాయి. ఈ నెల 26 నుంచి జూన్ ఒకటో తేదీ వరకూ ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడతాయి. -
ఎన్హెచ్ఏఐ నిర్ణయానికి ‘నో’ చెప్పిన ఈసీ
సార్వత్రిక ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్ర ఎన్నికల సంఘం రిలీఫ్ కల్పించింది. టోల్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)ను ఆదేశించింది. కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారుల నుంచి పాత టోల్ ఛార్జీలే వసూలు చేయాలని టోల్ ఆపరేటర్లకు ఎన్హెచ్ఏఐ సూచించింది. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీన ఎన్హెచ్ఏఐ టోల్ ఛార్జీలు పెంచుతుంది. సంస్థ నిర్ణయాల ప్రకారం..సరాసరి ఐదు శాతం టోల్ ఛార్జీలు పెరుగుతాయి. ఈమేరకు ముందుగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆదివారం రాత్రి నుంచి పెరిగిన టోల్ ఛార్జీలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. కానీ కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఛార్జీల పెంపు అంశాన్ని ఎన్నికల సంఘం వద్దకు తీసుకెళ్లింది. దాంతో ఆ వ్యవహారాన్ని పరిశీలించిన ఈసీ ఎన్నికల నేపథ్యంలో పెంపు నిర్ణయం వాయిదా వేయాలని ఎన్హెచ్ఏఐను ఆదేశించింది. దాంతో తాజాగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. పెరిగిన టోల్ ఛార్జీలు ఎప్పటి నుంచి అమలవుతాయో తెలియజేస్తామని చెప్పింది. అప్పటివరకు పాత ఛార్జీలే వర్తిస్తాయని పేర్కొంది. ఇదీ చదవండి: పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే.. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి వాహనదారుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తం టోల్ ఛార్జీలను సదరు వాహనదారులకు వెనక్కు చెల్లిస్తామని ఎన్హెచ్ఏఐ వర్గాలు చెప్పాయి. ఈ నెల 26 నుంచి జూన్ ఒకటో తేదీ వరకూ ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడతాయి. -
పెరిగిన టోల్ ధర.. ఏమిటీ టోల్ ట్యాక్స్? ఎందుకు చెల్లించాలి?
టోల్‌ట్యాక్స్ పెంచుతున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ఛార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుం పెరుగుతుంది. ఈసారి పెరిగిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. పెరిగిన ఛార్జీల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కార్లు, జీపులు, వ్యాన్లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, రానూపోనూ కలిపి రూ.10 అదనంగా చెల్లించాలి. తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు రూ.10, ఇరు వైపులా అయితే రూ.20, బస్సు, ట్రక్కులకు వరుసగా రూ.25, రూ.35, భారీ రవాణా వాహనాలకు రూ.35 నుంచి రూ.50 చొప్పున పెంచారు. 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు రుసుంలో 25 శాతం మినహాయింపు లభిస్తుంది. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చాక టోల్ ప్లాజాల వద్ద వసూళ్లు కూడా భారీగా పెరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు టోల్‌ట్యాక్స్ అంటే ఏమిటి..? దాన్ని ఎందుకు చెల్లించాలో ఈ కథనంలో తెలుసుకుందాం. రోడ్లను ఉపయోగించడానికి ప్రతి వాహనదారుడు ప్రభుత్వానికి రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. వాహనం కొనేపుడే వాహనం బరువు, తయారైన సంవత్సరం, సీటింగ్ కెపాసిటీ, ఇంజిన్ రకాలను బట్టి రోడ్ ట్యాక్స్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఇక ఈ ట్యాక్స్ చెల్లించాం కదా అని నేషనల్ హైవేపై వాహనంతో రౌండ్స్ కొట్టొచ్చని అనుకోవద్దు. ఎందుకంటే మళ్లీ ఆ రోడ్డుపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని టోల్ ట్యాక్స్ అంటారు. రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) పని చేస్తుంది. ఇది ప్రైవేటు కాంట్రాక్టు సంస్థల సహాయంతో వివిధ రాష్ట్రాల మధ్య హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తుంది. రోడ్డు వేయడానికి చేసిన ఖర్చును టోల్ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. ఈ ప్రక్రియ కొన్నేళ్లపాటు సాగుతుంది. రోడ్డు వేయడానికి ఖర్చు చేసిన మొత్తం వసూలైన తరువాత టోల్ ఫీజును 40 శాతానికి తగ్గించాలనే నిబంధన ఉంది. టోల్స్ మధ్య దూరం.. టోల్ ట్యాక్స్, టోల్ ఛార్జీలను కలిపి టోల్ అని సింపుల్‌గా పిలుస్తుంటారు. ఎక్స్‌ప్రెస్ వేస్, సొరంగ మార్గాలు, వంతెనలు, జాతీయ, రాష్ట్ర రహదారులపై రాకపోకలు సాగించే వాహనాల నుంచి ఈ టోల్ వసూలు చేస్తారు. ద్విచక్ర వాహనాలకు టోల్ నుంచి మినహాయింపు ఉంటుంది. మిగిలిన వాహనాల పరిమాణాన్ని బట్టి టోల్ వసూలు చేస్తారు. టోల్ చెల్లించే రహదారులను టోల్ రోడ్లని అంటారు. వీటి నిర్వహణ బాధ్యతను ఎన్హెచ్ఏఐ పర్యవేక్షిస్తుంటుంది. నిర్దేశిత ప్రదేశంలో టోల్ బూత్‌లు, ప్లాజాల పేరిట కౌంటర్లు ఏర్పాటు చేసి సంబంధిత మొత్తం చెల్లించిన తరువాతనే ఇక్కడ వాహనాలను రోడ్డుపైకి అనుమతిస్తారు. రెండు టోల్ బూత్‌ల మధ్య సాధారణంగా 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతకంటే తక్కువ దూరంలోనూ ఉండే అవకాశముంది. ఆ దూరాన్ని బట్టి ట్యాక్స్ వసూలు చేస్తారు. ఏటా ఏప్రిల్ 1న అవసరాన్ని బట్టి టోల్ ధరలను పెంచుతున్నారు. ప్రయాణం సాఫీగా సాగేలా.. నాణ్యమైన, గుంతలు లేని రహదారిని వినియోగించి ప్రయాణం సాఫీగా చేస్తున్నందుకు చెల్లించే రుసుమే టోల్. రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసం కూడా టోల్ నిధులను ఖర్చు చేస్తారు. ఏళ్ల తరబడి టోల్ వసూలు చేయడం వల్ల ఆ రోడ్డు వేయడానికి చేసిన ఖర్చు వసూలవుతుంది. ఈ మొత్తాన్ని ఎన్హెచ్ఏఐ తీసుకొని రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు చెల్లింపులు చేస్తుంది. టోల్గేట్ వసూలు చేసే దగ్గర టో వెహికల్, తాగునీరు, మరుగుదొడ్లు, అత్యవసర సేవలు, అగ్నిప్రమాద నియంత్రణ సౌకర్యాలుంటాయి. ఫాస్టాగ్‌తో తగ్గిన రద్దీ టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు. నగదు రహిత లావాదేవీలు చేసేందుకు ఫాస్టాగ్ ఉపయోగపడుతుంది. ఒక స్టిక్కర్లా కనిపించే ఫాస్టాగ్‌ను మొబైల్ నంబర్లా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫాస్టాగ్‌ను కొన్ని మొబైల్ యాప్‌లు, టోల్‌ప్లాజా కేంద్రాల వద్ద విక్రయిస్తారు. మనం టోల్గేట్ వద్దకు వెళ్లగానే అక్కడి స్కానర్లు ఫాస్టాగ్‌ను రీడ్ చేస్తాయి. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా నిర్దేశిత టోల్ మొత్తం అందులో నుంచి కట్ అవుతుంది. ఈ ఫాస్టాగ్‌ల కారణంగా టోల్గేట్ల వద్ద రద్దీ బాగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏవైనా కారణాల వల్ల టోల్ ప్లాజాల దగ్గర 100 మీటర్ల కన్నా ఎక్కువ క్యూ ఉన్నట్టైతే వాహనదారులు టోల్ ఫీజు చెల్లించకుండా ముందుకు వెళ్లిపోవచ్చు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ధరలు! వీరికి టోల్ ఉండదు.. టోల్ ప్లాజాల వద్ద రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, స్పీకర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, ఆర్మీ, పోలీసు ఉన్నత అధికారులు ప్రయాణించే అధికారిక వాహనాలకు మినహాయింపు ఉంటుంది. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, అంతిమయాత్ర వాహనాల నుంచి టోల్ తీసుకోరు. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఆర్టీవో ఆఫీసులో రిజిస్టర్ అయిన వాహనాలకు స్థానికులు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. -
ఔటర్‌పై టోల్ తీస్తున్నారు!
హైదరాబాద్‌కు చెందిన ఓ వాహనదారుడు మూడు రోజుల క్రితం గచ్చిబౌలి నుంచి ఔటర్ మీదుగా టీఎస్పీఏ (అప్పా) వరకు వెళ్లారు. నిబంధనల మేరకు ఈ రూట్లో ఒకసారి వెళితే రూ.20, వెళ్లివస్తే రూ.30 చెల్లించాలి. కానీ సదరు వాహనదారుడి ఖాతా నుంచి ఏకంగా రూ.80 కోత పడింది. దీనిపై సంస్థ ప్రతినిధులను నిలదీయగా ‘సారీ’ అంటూ చేతులు దులిపేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం మరో వాహనదారుడు గౌరెల్లి నుంచి ఘట్కేసర్ వరకు వెళ్లాడు. నిబంధనల మేరకు రూ.20 తీసుకున్నారు. కానీ తిరిగి అదేరోజు ఘట్కేసర్ నుంచి గౌరెల్లికి తిరిగి రాగా ఏకంగా రూ.115 వసూలు చేశారు. నిబంధనల మేరకు రిటర్న్ జర్నీకి రూ.10 చార్జీ చెల్లించాలి. ఒకవేళ నిర్ణీత సమయం మించితే వన్‌వే జర్నీ కింద రూ.20 తీసుకోవాలి. సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ ట్యాక్స్ దోపిడీ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా టోల్ చార్జీలను వసూలు చేస్తున్నట్లు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుట్టుగా వాహనదారుల ఖాతాల్లోంచి కొట్టేస్తున్నట్లు నిర్వహణ సంస్థకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గట్టిగా నిలదీసిన వాళ్లకు 25 రోజుల గడువులోపు తిరిగి చెల్లిస్తామంటున్నారు.. కానీ సకాలంలో ఖాతాలో జమ కావడంలేదని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. 158 కి.మీ. ఔటర్ మార్గంలో రోజూ వేలాది మంది వాహనదారులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. అధికంగా వసూలు చేసినట్లు గుర్తించిన వాహనదారులకు మాత్రమే తిరిగి చెల్లిస్తామని చెబుతున్నారు. కానీచాలామంది తమకు తెలియకుండానే మోసపోతున్నారు. హెచ్ఎండీఏ నియంత్రణ ఏమైనట్లు.. జాతీయ రహదారులపై విధించే టోల్ చార్జీల నిబంధనలే హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్‌కు వర్తిస్తాయి. ఔటర్‌పై ప్రస్తుతం 21 ఇంటర్‌ఛేంజ్‌ల నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రింగ్‌రోడ్డును ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు ప్రభుత్వం టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో 30 ఏళ్ల లీజుకిచి్చంది. ఐఆర్బీ అనుబంధ సంస్థ అయిన ఐఆర్బీ గోల్కొండ సంస్థ టోల్ చార్జీలను వసూలు చేస్తోంది. నిబంధనల మేరకు హెచ్ఎండీఏ అనుమతితోనే టోల్ చార్జీలను పెంచుకొనేందుకు ఐఆర్బీకి అవకాశం ఉన్నా సొంతంగా పెంచేందుకు అవకాశం లేదు. ఐఆర్బీ అడ్డగోలుగా టోల్ వసూలు చేస్తున్నప్పటికీ హెచ్ఎండీఏ చర్యలు తీసుకోకపోవడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారిస్తాం ఔటర్‌పై అధికంగా టోల్ వసూలు చేయడానికి వీల్లేదు. వాహనదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారిస్తాం. ఎక్కువ డబ్బులు తీసుకున్నట్లు రుజువైతే తిరిగి వాళ్ల ఖాతాల్లో జమ అవుతాయి. – బీఎల్ఎన్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్, హెచ్ఎండీఏ టోల్ దోపిడీ దారుణం టోల్ ట్యాక్స్ దోపిడీ దారుణంగా ఉంది. అవకతవకలను వాహనదారులు గుర్తించినప్పుడు మాత్రమే తిరిగి చెల్లిస్తామని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ చాలామంది తమకు తెలియకుండానే నష్టపోతున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. – కేతిరెడ్డి కరుణాకర్‌రెడ్డి దేశాయ్, వాహనదారుడు -
టోల్‌ప్లాజా తొలగింపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు
సాధారణంగా చాలామందికి నిర్ణీత గడువు తర్వాత టోల్‌ప్లాజాలను మారుస్తారు లేదా తొలగిస్తారనే అపోహ ఉంది. కానీ దానికి సంబంధించి కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ రహదారుల రుసుముల నిబంధనలు-2008 ప్రకారం.. నిర్దిష్ట గడువు పూర్తయిన తర్వాత మూలధన వ్యయాన్ని రికవరీ చేశాక టోల్ ప్లాజాలను తొలగించాలనే ఎలాంటి నిబంధనా లేదని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలోని జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన ఏ ఒక్క టోల్ ప్లాజాలోనూ ఇప్పటివరకు మూలధన వ్యయాన్ని పూర్తిగా రికవరీ చేయలేదని గురువారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణ బాధ్యతలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షిస్తాయి. రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్హెచ్ఏఐ పని చేస్తుంది. ఇది ప్రైవేటు కాంట్రాక్టు సంస్థల సహాయంతో వివిధ రాష్ట్రాల మధ్య హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తుంది. రోడ్డు వేయడానికి చేసిన ఖర్చును టోల్ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. ఈ ప్రక్రియ కొన్నేళ్లపాటు సాగుతుంది. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? మరోవైపు, జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను 2024 మార్చి నాటికి తీసుకురానునట్లు గడ్కరీ ఇటీవల ప్రకటించారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడంతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
మార్చి నాటికల్లా టోల్ ప్లాజాలుండవ్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ప్రస్తుత హైవే టోల్ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టనుంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ మొదలైనవి వీటిలో ఉండనున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాలు తెలిపారు. వాహనాలను ఆపకుండా ఆటోమేటిక్‌గా టోల్ వసూళ్లకు ఉపయోగపడే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్‌కు సంబంధించి తమ శాఖ రెండు పైలట్ ప్రాజెక్టులను నిర్వహించినట్లు వివరించారు. 2018–19లో టోల్ ప్లాజాల దగ్గర నిరీక్షించే సమయం సగటున 8 నిమిషాలుగా ఉండగా.. 2020–21లో ఫాస్ట్‌ట్యాగ్‌లను ప్రవేశపెట్టిన తర్వాత క్రమంగా 47 సెకన్లకు తగ్గింది. దీంతో చాలా ప్రాంతాల్లో నిరీక్షణ సమయం తగ్గినప్పటికీ జనాభా ఎక్కువ ఉన్న నగరాలకు దగ్గర్లో పీక్ అవర్స్‌లో ఇప్పటికీ కొంత ఎక్కువగా నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త సాంకేతికతల పరిశీలన ప్రాధాన్యం సంతరించుకుంది. -
13 రాష్ట్రాల్లో వీరిదే హవా..! ఆదాయం రూ. కోట్లలోనే..
Sahakar Group Limited (SGL): దేశంలో రోడ్డు వ్యవస్థ మునుపటి కంటే మెరుగుపడింది. హైవేలు, అండర్ పాస్, ఫ్లైఓవర్ వంటి మార్గాలు ఎక్కువయ్యాయి, తద్వారా ప్రయాణం కూడా ఇప్పుడు సులభతరం అయిపోయింది. అయితే ఇప్పుడు ఏ ప్రధాన రహదారి ఎక్కినా ఎక్కడికక్కడ టోల్ ప్లాజాలు ఎదురవుతూనే ఉంటాయి. టోల్ ప్లాజా దాటాలంటే కచ్చితంగా టోల్ పీజు చెలించాల్సి ఉంటుంది. మనదేశంలో ఎక్కువ టోల్ ప్లాజాలు కలిగిన సంస్థ ఏది? దాని ఆదాయం ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో అత్యధిక టోల్ ప్లాజాలు తమ అధీనంలో ఉంచుకున్న అగ్రగామి సంస్థ 'సహకార్ గ్రూప్ లిమిటెడ్' (SGL). దేశవ్యాప్తంగా సుమారు 13 రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకుంటున్న ఈ కంపెనీ 200 కంటే ఎక్కువ టోల్ ప్లాజాలను తమ పరిధిలో ఉంచుకుంది. 1996లో 'కిషోర్ అగర్వాల్' స్థాపించిన సహకార్ గ్రూప్ లిమిటెడ్, అతి తక్కువ కాలంలోనే మంచి పురోగతిని సాధించింది. 2011 - 12 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 30 కోట్లు కాగా.. 2022 - 23 నాటికి రూ. 2700 కోట్లు కంటే ఎక్కువ ఆదాయం పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే టోల్ ప్లాజా రంగంలో ఎంత అభివృద్ధి సాదించించనే విషయం ఇట్టే అర్థమైపోతుంది. సహకార్ గ్రూప్ లిమిటెడ్ కంపెనీ స్వంత కంప్యూటరైజ్డ్ సిస్టమ్‌లను, స్వంత యాజమాన్య కంప్యూటరైజ్డ్ టోల్ రెవెన్యూ ఆడిటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంతో సహా టోల్లను వసూలు చేయడానికి అప్పటికప్పుడు కొత్త విధానాలు అలవరిస్తోంది. 1996 సమయంలో ఈ సంస్థ కేవలం ముంబై చుట్టూ ఉన్న మున్సిపల్ కౌన్సిల్ల కోసం ఆక్ట్రాయ్ సేకరణతో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తరువాత మహారాష్ట్ర రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం దేశంలో ఎక్కువ టోల్ ప్లాజాలు కలిగిన సంస్థగా అవతరించింది. ఇదీ చదవండి: మరింత తగ్గిన బంగారం, వెండి - నేటి కొత్త ధరలు ఇవే.. సహకార్ గ్రూప్ లిమిటెడ్ సంస్థలో సుమారు 4000 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా టోల్ ప్లాజాల సంఖ్య కూడా తప్పకుండా పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
ఓఆర్ఆర్ లీజుపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్‌ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతలను 30 ఏళ్ల పాటు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిలిడ్ కంపెనీకి అప్పగింత, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కు చెందిన నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం.. తుది ఉత్తర్వుల మేరకు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. 30 ఏళ్ల పాటు ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతల టెండర్‌ను రూ.7,380 కోట్లకు ఓ కంపెనీకి అప్పగించడంలో పారదర్శకత లేదంపిల్ దాఖలైంది. ఈ టెండర్‌ను ఐఆర్బీ కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కనుగుల మహేశ్‌కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రాథమిక అంచనా రాయితీ విలువ (ఇనీషియల్ ఎస్టిమేటెడ్ కన్సెషన్ వాల్యూ) ఎంత అనేది వెల్లడించకుండా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, హెచ్ఎండీఏ కలసి ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకోవడం అక్రమమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అంచనా విలువను వెల్లడించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఒప్పందం వాస్తవ పరిస్థితిని పరిశీలించేలా కాగ్‌కు ఆదేశాలు ఇవ్వాలని, ఒకవేళ ఒప్పందం విలువ తక్కువగా ఉందని కాగ్ నిర్ధారిస్తే లీజును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిధుల బదిలీ చట్టవిరుద్ధమన్న పిటిషనర్ న్యాయవాది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవా ది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ప్రాథమిక అంచనా విలువను ప్రకటించకుండానే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిలిడ్, ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌కు ఓఆర్ఆర్ను 30 ఏళ్లు అప్పగించారని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వచ్చిన రూ.7,380 కోట్లను హెచ్ఎండీఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేలా ఏప్రిల్ 27న జీవో తీసుకొచ్చిందని.. ఈ జీవో హెచ్ఎండీఏ చట్టంలోని సెక్షన్ 40(1)(సీ)కి విరుద్ధమని వాదించారు. హెచ్ఎండీఏ పరిధిలోని అభివృద్ధి పనులకు మాత్రమే ఆఆదాయాన్ని వెచ్చించాల్సి ఉందని వెల్ల డించారు. ఇప్పటికే రూ.7 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు తెలిసిందని, వాటిని ఖర్చు చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. సర్కార్ వద్ద డబ్బు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కేసులో వాదనలు వినిపించడానికి సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. -
ఎన్‌హెచ్–363 నిర్మాణంలో అదే జాప్యం.. మరోవైపు టోల్ వసూలు..
మంచిర్యాల: జాతీయ రహదారి–363 పనులు నాలుగేళ్లు అవుతున్నా ఇంకా కొనసాగుతూ నే ఉన్నాయి. ఓ వైపు రోడ్డుపై ప్రయాణం చేస్తున్నందుకు టోల్ వసూలు.. మరోవైపు పూర్తి కాని చోట పనులు సాగుతున్నాయి. రెండేళ్లలో పూర్తి కావాల్సిన రోడ్డు నిర్మాణం కరోనా, తర్వాత కూడా గడువు పొడగిస్తూనే ఉన్నారు. గత ఏడాది ఆగస్టు వరకే పూర్తి కావాలి. కానీ ఈ ఏడాది ఆగస్టు గడుస్తున్నా అందుబాటులోకి రాలేదు. మరోసారి జనవరి వరకు పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్‌కు గడువు ఇచ్చారు. ఏళ్లుగా నిర్మాణంలోనే.. రాజీవ్ రాష్ట్రీయ రహదారిని శ్రీరాంపూర్ జీఎం ఆఫీ సు నుంచి మహారాష్ట్ర సరిహద్దు కుమురంభీం జిల్లా వాంకిడి మండలం గోయగాం వరకు జాతీయ రహదారిగా మార్చుతూ 2016లో కేంద్రం గెజిట్ ఉత్తర్వులు ఇచ్చింది. 2017లో పని ఉత్తర్వులు, 2018లో భూ సేకరణ, 2019లో బిడ్డింగ్ పూర్తయ్యాయి. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో రెండేళ్ల నిర్మాణం, 15ఏళ్ల నిర్వహణ చేపట్టాలి. రెండు భాగాలుగా మొత్తం 94.602కిలోమీటర్లు నిర్మించాలి. కాంట్రాక్టర్ రూ.1356.90 కోట్లకు బిడ్ వేయగా.. అదనపు పనులతో నిర్మాణ వ్యయం రూ.1948కోట్లకు చేరింది. జిల్లాలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం నుంచి తాండూర్ మండలం గోయగాం వరకు 42కిలోమీటర్లు నిర్మించాలి. గత ఏడాదిగా పది శాతం పనుల నిర్మాణమే చేస్తున్నారు. వాస్తవానికి ఈ పనులు 24 నెలల్లో అంటే 2022 ఆగస్టులోపే చేయాలి. నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోతే రోజుకు రూ.5లక్షల చొప్పున కాంట్రాక్టర్ పరిహారం వేయాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్ గడువు పెంచాలని కనీసం కోరకున్నా అధికారులే జనవరి వరకు పెంచేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం. రక్షణ చర్యలు కరువు.. నిర్మించిన రోడ్డుకు టోల్‌ప్లాజా నుంచి రోజు రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. ప్రయాణికులకు అవగాహ న, భద్రత చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల ప్ర మాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు. శ్రీరాంపూర్ బైపాస్ రోడ్డు, బెల్లంపల్లి బైపాస్ రో డ్డుపై రాత్రివేళ వెలుతురు సరిగా లేక భారీ వాహనా లు అదుపు తప్పుతున్నాయి. బోయపల్లి బోర్డు, క న్నాల, సోమగూడెం చర్చి సమీపంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్తగా రోడ్డు వేయడంతో అతివేగంతోనూ కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాల నియంత్రణకు ఎన్హెచ్ఏఐ అధి కారులు చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటివరకు అవేమీ చేపట్టడం లేదు. సిగ్నల్స్, మలుపులు, భద్ర త సూచికలు, రాత్రివేళ రేడియం స్టిక్కర్లు మెరిసేవి, అంబులెన్స్, ప్రథమ చికిత్స కిట్లు, టోల్‌ప్లాజా వద్ద జనరల్, మహిళలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి. ఇవేమీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. నెలలో రెండుసార్లు ఉన్నతాధికారులు స్థానిక డ్రైవ ర్లు, వాహనదారులకు సలహాలు, సూచనలు ఇవ్వా లి. ఇక వర్షాలు కురిస్తే సోమగూడెం, గాంధారి వనం సమీపంలో డ్రెయిన్స్ సరిగా లేక సమీపంలో వరద నీరు చేరుతోంది. వాహనదారుల భద్రత కోసం ప్ర త్యేక కన్సల్టెన్సీ పర్యవేక్షణకు నిధులు మంజూరవుతున్నా ఖర్చుకు అలసత్వం వహిస్తున్నారు. జాప్యంతో ఇబ్బందులు.. మందమర్రి పాత బస్టాండ్ వద్ద వంతెన నిర్మాణం జాప్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ జామ్‌తోపాటు ప్రమాదాలు జరగుతున్నాయి. కొత్తగా పిల్లర్లు వేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం మంచిదే కానీ, జా ప్యం కావడంతో ఇబ్బందులు పడుతున్నాం. త్వరగా పూర్తి చేయాలి. – కొట్టె కొమురయ్య, మందమర్రి వచ్చే జనవరిలో పూర్తి చేస్తాం.. మందమర్రి వద్ద రోడ్డు నిర్మాణం ఉన్న చోట ఉన్న పైపులు మార్చడంలో జాప్యం ఏర్పడింది. దీంతో అక్కడ నిర్మాణంలో జాప్యం జరిగింది. వచ్చే జనవరి వరకు పనులు పూర్తి చేసేందుకు గడువు ఉంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు వాహనదారులు నిబంధనలు పాటించాలి. రోడ్డు భద్రత చర్యలపై స్థానిక పోలీసు, ఆర్టీఏ అధికారులతో అవగాహన చేపడతాం. – కే.ఎన్.అజయ్మణికుమార్, పీడీ, ఎన్హెచ్ఏఐ, మంచిర్యాల -
ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగక్కర్లేదు
ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగక్కర్లేదు -
ఓఆర్ఆర్ను ఏ ప్రాతిపదికన అప్పగించారు?
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతలను 30 ఏళ్లపాటు ఏ ప్రాతిపదికన ప్రైవేట్ కంపెనీకి అప్పగించారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) డైరెక్టర్‌తోపాటు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్, ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. 30 ఏళ్లపాటు ఓఆర్ఆర్ నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతల టెండర్‌ను రూ.7,380 కోట్లకు ఓ కంపెనీకి అప్పగించడంలో పారదర్శకత లేదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ టెండర్‌ను ఐఆర్బీ కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కనుగుల మహేశ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రాథమిక అంచనా రాయితీ విలువ ఎంత అనేది వెల్లడించకుండా హెచ్ఎండీఏ, పురపాలక పరిపాలన–పట్టణాభివృద్ధి శాఖ కలసి ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థతో ఒప్పందం చేసుకోవడం అక్రమమని పిటిషన్లో పేర్కొన్నారు. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ను టోల్– ఆపరేట్– ట్రాన్స్ఫర్ (టీవోటీ) విధానంలో నిర్వహించడానికి ప్రభుత్వం మే 28న కుదుర్చుకున్న ఒప్పందం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన అంచనా విలువను వెల్లడించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఒప్పందం వాస్తవ పరిస్థితిని పరిశీలించేలా కాగ్‌కు ఆదేశాలు ఇవ్వాలని, ఒకవేళ ఒప్పందం విలువ తక్కువగా ఉందని కాగ్ నిర్ధారిస్తే లీజును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడే ఆదేశాలివ్వలేం.. ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇప్పటివరకు దీనికి సంబంధించిన జీవోలు విడుదల చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ప్రస్తుతం రోజువారీగా టోల్ ఫీజు రూ.88 లక్షల వరకు వసూలవుతోందని, ఈ లెక్కన 30 ఏళ్ల కాలానికి లెక్కిస్తే వేల కోట్ల రూపాయల ప్రజాధనం కంపెనీ పాలవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్లో ప్రజాప్రయోజనం ఏమీ లేదని, దురుద్దేశంతోనే దాఖలు చేశారని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుత దశలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని పిటిషనర్ తరఫు న్యాయవాదికి చెప్పింది. -
ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు
న్యూఢిల్లీ: ఫాస్ట్‌ట్యాగ్ సిస్టమ్ ద్వారా రోజువారీ టోల్ వసూళ్లు రూ.193.15 కోట్లకు చేరాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మంగళవారం తెలిపింది. ఏప్రిల్ 29న ఒక్క రోజులో 1.16 కోట్ల లావాదేవీల ద్వారా ఈ రికార్డు నమోదయినట్లు పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనాల నుంచి రెట్టింపు టోల్ ఫీజులు వసూలు చేస్తోంది. అప్పటి నుంచి ఒక్క రోజులో ఫాస్టాగ్ ద్వారా ఇంత భారీ మొత్తంలో వసూళ్లు జరగడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమం కింద టోల్ ప్లాజాల సంఖ్యను 770 నుంచి 1,228కి పెంచినట్లు ఎన్‌హెచ్‌ఏఈ తెలిపింది. ఇందులో 339 రాష్ట్ర టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.9కోట్ల ఫాస్టాగ్ కార్డులను జారీ చేసినట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది.టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఈ ఫాస్టాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే! -
వాహనదారులకు షాక్?.. పెరగనున్న టోల్ చార్జీలు.. ఎంతంటే?
వాహనదారలు నెత్తిన టోల్ బాదుడుకు రంగం సిద్ధమైంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ ఎన్హెచ్ఏఐ టోల్ ఛార్జీలను సమీక్షిస్తుంది. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 శాతం మేర పెరగనున్నట్లు తెలుస్తోంది. కొత్త రేట్ల లిస్టును ఎన్హెచ్ఏఐ ఈరోజు రాత్రి లేదా రేపు విడుదల చేయనుంది. 2008 నేషనల్ హైవేస్ ఫీజ్ ప్రకారం.. ప్రతి ఏడు కేంద్ర రవాణ శాఖ టోల్ ఛార్జీల పెంపుపై కొన్ని ప్రతిపాదనలు తెస్తుంది. ఆ ప్రతిపాదనలకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం కార్లు, తేలికపాటి వాహనాలపై ఒక్కో ట్రిప్పుకు ఐదు శాతం, భారీ వాహనాలకు టోల్ టాక్స్ అదనంగా 10 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం టోల్ టాక్స్ లను పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చదవండి: టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!
టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సాంప్రదాయ టోల్ వసూళ్ల విషయంలో కేంద్రం మార్పులు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టోల్ వసూళ్లపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఆరునెలల్లో దేశంలోని అన్నీ టోల్ ప్లాజాల వద్ద..జీపీఎస్ టోల్ కలెక్షన్ (GPS-based toll collection) సిస్టమ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు గడ్కరీ చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ (cii) నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. కొత్త టోల్ కలెక్షన్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీతో పాటు.. వాహనదారులు ప్రయాణించిన దూరాన్ని బట్టి ఖచ్చితమైన టోల్ ఛార్జీలను వసూలు చేసే అవకాశం కలగనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ జీపీఎస్- ఆధారిత వ్యవస్థ ప్రైలెట్ ప్రాజెక్ట్ పనిచేస్తోందని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల్ని ఆపివేయకుండా.. వాహనాల నెంబర్ ప్లేట్లపై నంబర్లను గుర్తించే టెక్నాలజీపై పనిచేస్తోన్నట్లు తెలిపారు. రూ.1.40 లక్షల కోట్లకు చేరనున్న ఆదాయం ఇక టోల్ ఫీజు వసూళ్ల ద్వారా నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా (nhai)కు ఏడాదికి రూ.40వేల కోట్ల ఆదాయం వస్తోందని, మరో 2-3 ఏళ్లలో రూ.1.40లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు అంచనా వేశారు. వేచి చూసే సమయం మరింత తగ్గుతుంది 2018-19లో టోల్ ప్లాజాల వద్ద వెహికల్స్ కనీసం 8 నిమిషాల పాటు ఆగాల్సి వచ్చేంది. 2020-21, 2021-22లో ప్రవేశపెట్టిన ఫాస్టాగ్‌తో వాహనాలు నిలిపే సమయం 47 సెకండ్లకు తగ్గిందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సీఐఐ సమావేశంలో వివరించారు. చదవండి👉 ‘హార్ట్ ఎటాక్’ను గుర్తించే యాపిల్ వాచ్ సిరీస్ 8పై భారీ డిస్కౌంట్లు! -
వాహనదారులకు షాక్.. పెరగనున్న టోల్ చార్జీలు!
హైవేలపై ప్రయాణించే వాహదారులకు టోల్ బాదుడు మరింత పెరగనుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హోచ్‌ఏఐ) ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ రేట్లను పెంచే అవకాశం ఉందని హిందీ దినపత్రిక హిందూస్థాన్ ప్రచురించింది. దీని ప్రకారం.. టోల్ రేట్లు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉంది. జాతీయ రహదారుల రుసుము నియమావళి-2008 ప్రకారం.. సాధారణంగా ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త టోల్ చార్జీ రేట్లు అమలులోకి వస్తాయి. అవసరాలను బట్టి నిర్దిష్ట టోల్ విషయమై విధాన నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు. ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. టోల్ ఫీజు పెంపు ప్రతిపాదనలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మార్చి నెల చివరి వారంలోపు పరిశీలించి ఆమోదించే అవకాశం ఉందని హిందూస్థాన్ నివేదిక పేర్కొంది. కార్లు, తేలికపాటి వాహనాలపై 5 శాతం, ఇతర భారీ వాహనాలపై 10 శాతం వరకు టోల్ చార్జీ పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులకు టోల్ ఫీజుపై రాయితీ ఇస్తూ నెలవారీ పాస్‌లు జారీ చేస్తుంటారు. ఆ పాస్ రుసుము కూడా 10 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Samsung Galaxy Z Fold 5: మడత అంటే ఇదీ.. పర్ఫెక్షన్ అంటే ఇదీ! -
ఫాస్టాగ్‌తో టోల్ కలెక్షన్ అదుర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదార్లలో ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూళ్లు గతేడాది రూ.50,855 కోట్లు నమోదయ్యాయి. 2021తో పోలిస్తే ఇది ఏకంగా 46 శాతం అధికం కావడం విశేషం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రకారం డిసెంబర్లో ఫాస్టాగ్ ద్వారా సగటున రోజుకు రూ.134.44 కోట్ల టోల్ ఫీజు వసూలైంది. గత నెల 24న గరిష్టంగా రూ.144.19 కోట్లు నమోదైంది. 2022లో ఫాస్టాగ్ లావాదేవీలు 48 శాతం అధికమై 324 కోట్లకు చేరుకున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 6.4 కోట్ల ఫాస్టాగ్స్ జారీ అయ్యాయి. ఫాస్టాగ్ ఆధారంగా ఫీజును స్వీకరించే టోల్ ప్లాజాల సంఖ్య 922 నుంచి గతేడాది 1,181కి చేరింది. -
మంచిర్యాల: టోల్‌ప్లాజా ఘటనపై ఎమ్మెల్యే చిన్నయ్య కీలక వ్యాఖ్యలు
సాక్షి, మంచిర్యాల: మందమర్రి టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేసినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. దాడి వార్తలను ఖండించారు. జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేస్తున్నారని, అంబులెన్స్‌ను సైతం వదలటం లేదన్నారు. ఈవిషయంపైనే మేనేజర్‌తో మాట్లాడేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ‘నేను దాడి చేసినట్లుగా టీవీలలో వార్తలు వస్తున్నాయి. జాతీయ రహదారి పనులు పూర్తి కాలేదు. సోమగూడేం ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయలేదు. కాని టోల్ ప్లాజాలో నూటయాభై టోల్ వసూలు చేస్తున్నారు. టోల్ ప్లాజా నుండి అంబులెన్స్ కూడ వదలడం లేదు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలపై మేనేజర్‌తో మాట్లాడానికి వెళ్లాను. మేనేజర్ నుంచి ఎటువంటి స్పందింన లేదు. అంతే కానీ నేను దాడి చేయలేదు. కనీసం టోల్ ప్లాజా ప్రారంభానికి కూడా నన్ను పిలువలేదు’ అని దాడి వార్తలను ఖండించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఇదీ చదవండి: వీడియో: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే చిన్నయ్య హల్చల్.. సిబ్బందిపై దాడి -
మంచిర్యాల: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్
-
మంచిర్యాల: నా వాహనాన్నే ఆపుతారా? టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి!
సాక్షి, మంచిర్యాల: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్ చేశారు. తన వాహనానికి రూట్ క్లియర్ చేయలేదంటూ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా దాడి చేయటం సరికాదంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. టోల్‌ప్లాజా వద్దకు వచ్చిన క్రమంలో తనకు రూట్ క్లియర్ చేయలేదంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దౌర్జన్యానికి దిగారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యేపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం కూడా చేస్తామని హెచ్చరించారు. ఇదీ చదవండి: అసైన్డ్ భూములపై కేసీఆర్ సర్కార్ స్పెషల్ ఫోకస్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు! -
వాహనదారులకు భారీ ఊరట?..ఫాస్టాగ్‌పై కోర్టులో పిటిషన్..అదే జరిగితే..
ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ ట్యాక్స్ చెల్లించాలనే నిబంధనను తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ రవీందర్ త్యాగి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై చీఫ్ జస్టీస్ సతీష్ చంద్ర శర్మ, జస్టీస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా...ఈ నిబంధన వివక్షపూరితంగా, ఏకపక్షంగా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని చీఫ్ జస్టీస్ సతీష్ చంద్ర శర్మ బెంచ్ వాదించింది. వాహనదారులు ఫాస్టాగ్ వినియోగించకుండా నగదు రూపంలో చెల్లించినట్లయితే..వారి వద్ద నుంచి రెట్టింపు రేటుతో టోల్ వసూలు చేస్తున్నారనే పిటిషన్‌పై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), కేంద్రం ప్రతిస్పందనను కోరింది. అధికారులు తమ ప్రత్యుత్తరాలను దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చిన హైకోర్టు..తదుపరి విచారణను ఏప్రిల్ 18న వాయిదా వేసింది. ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనదారుల నుంచి డబుల్ టోల్ ఛార్జీలు వసూలు చేసేలా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ ఆఫ్ ఇండియా(ఎంఓఆర్‌టీ అండ్ హెచ్), నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)తో కూడిన నేషనల్ హైవే ఫీజ్ అమాండ్మెంట్ రూల్స్ -2020 యాక్ట్‌ను రద్దు చేయాలని పిటిషన్ రవీందర్ త్యాగి కోరారు. చదవండి👉 పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’ ఈ నిబంధనలు, సర్క్యులర్ వల్ల టోల్ లేన్లను 100 శాతం ఫాస్ట్‌ట్యాగ్ లేన్లుగా మారుస్తున్నాయని, దీని ఫలితంగా ఫాస్ట్‌ట్యాగ్ లేని ప్రయాణికులు టోల్ మొత్తాన్ని రెట్టింపు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిటిషనర్, న్యాయవాది సైతం..టోల్ కంటే రెట్టింపు నగదు చెల్లించాల్సిన అవసరం ఉన్నందున తన కారులో ఫాస్ట్‌ట్యాగ్ పరికరాన్ని ఇన్స్టాల్ చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్యాగ్‌ను ఇన్స్టాల్ చేసే ముందు రెట్టింపు రేటుతో టోల్ ట్యాక్స్ చెల్లించానని చెప్పారు. ఢిల్లీ నుంచి హర్యానాలోని ఫరీదాబాద్ పర్యటనలో తాను చూసిన ప్రయాణికుల వేదనను ఆయన ప్రస్తావించారు. అంతేకాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (చట్టం ముందు సమానత్వం), 19 (వాక్ మరియు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ)లను ఉల్లంఘించడమేనని, డబుల్ టోల్ టాక్స్ వసూలు చేసే పద్ధతిని నిలిపివేయాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై కేంద్రం సానుకూలంగా స్పందింస్తే డబుల్ టోల్ ట్యాక్స్ రద్దు చేయడం లేదంటే.. ఫాస్టాగ్‌ను వినియోగించేలా మరింత సమయం ఇచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే డబుల్ టోల్ ఛార్జీల నుంచి వాహనదారులకు ఊరట లభించనుంది. డబుల్ టోల్ ఛార్జీలు టోల్ గేట్ల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉంచే సమయాన్ని తగ్గించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14, 2021న ఫాస్టాగ్ విషయంలో వాహనదారులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి అర్ధరాత్రి నుంచి వాహనదారులకు ఫాస్టాగ్ తప్పని సరిగా వినియోగించాలని, లేదంటే రెట్టింపు టోల్ పే చెల్లించాల్సిందే. వాహన దారులు తప్పని సరిగా ఫాస్టాగ్ విధానంలోకి మారాల్సిందేనని కేంద్ర రవాణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్ తీసుకోవాలని సూచించింది. చదవండి👉 టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!
టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సాంప్రదాయ టోల్ వసూళ్ల విషయంలో కేంద్రం మార్పులు చేయాలని భావిస్తోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలపై నంబర్ ప్లేట్లను గుర్తించేలా కెమెరా ఎయిడెడ్ టోల్ కలెక్షన్ సిస్టమ సాంకేతికతను ఉపయోగించనుంది. ఇందుకోసం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్పీఆర్) కెమెరాలను అమర్చనుంది. నిరీక్షణ తప్పనుంది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్టీహెచ్) శాఖ టోల్ ప్లాజాల వద్ద చెల్లింపుల కోసం వాహనాలు నిరీక్షించే సమయాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. మరి ఫాస్టాగ్ ప్రస్తుతం, దేశం అంతటా దాదాపు 97 శాతం టోల్ వసూలు ఫాస్టాగ్ ద్వారా జరుగుతున్నాయి. అయినప్పటికీ టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, వాహనాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంఓఆర్టీహెచ్ తెలిపింది. ఈ ఏఎన్పీఆర్ కెమెరాలను సెటప్ చేయడం వల్ల టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించవచ్చు’ అని సూచించింది. ఏఎన్పీఆర్ ఎలా పనిచేస్తుంది? కేంద్ర హైవే రవాణా శాఖ వివరాల ప్రకారం..దేశంలో జాతీయ ప్రధాన రహదారుల్లో ఉన్న టోల్ గెట్లను తొలగించి...వాటి స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీ ఏఎన్పీఆర్ కెమెరాల్ని ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ సాంకేతికత వాహనం నంబర్ ప్లేట్ మీద నెంబర్‌ను చదివి, సదరు వాహన యజమాని లింక్ ఫోన్ నెంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్‌కు చెల్లించాల్సిన అమౌంట్‌ను డిడక్ట్ చేస్తుంది. వాహనాల నంబర్ ప్లేట్ల ఫోటోను క్యాప్చర్ చేయడానికి సిస్టమ్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏఎన్పీఆర్ కెమెరాలతో సన్నద్ధం చేస్తుంది. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు కెమెరా వాహనదారుడి బ్యాంక్ ఖాతా నుండి టోల్ మొత్తాన్ని వసూలు చేసేలా సిస్టమ్‌కు సిగ్నల్ ఇస్తుంది. ఏఎన్పీఆర్ సమర్థవంతంగా పనిచేస్తుందా? ఏఎన్‌పీఆర్‌తో టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గిస్తామని కేంద్రం చెబుతున్నప్పటికీ..దీనిపై అనేక సందేహాలు వ్యక్త మవుతున్నాయి. ఈ పద్దతిలో 2019 తర్వాత కేటాయించిన నెంబర్ ప్లేట్లను మాత్రమే గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే, భారత ప్రభుత్వం 2019లో ప్రయాణీకుల వాహనాలకు ఓఈఎం (Original Manufacturer Number ) నెంబర్‌ను అమలు చేసింది. కెమెరాలు ఈ కంపెనీ అమర్చిన నంబర్ ప్లేట్లను మాత్రమే చదవగలవు. దీంతో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్పీఆర్ ) కెమెరాలు నంబర్ ప్లేట్ తొమ్మిది అంకెల రిజిస్ట్రేషన్ నంబర్‌ను మించి ఉన్నప్పుడు చదవడం సవాలుగా మారనుంది. దేశంలో చాలా మంది వాహన యజమానులు నంబర్ ప్లేట్‌పై పేర్లు రాస్తుంటారు. దీని వల్ల సదరు నెంబర్ ప్లేట్లను గుర్తించడం కష్టం నెంబరు ప్లేట్లు మురికిగా ఉంటే వాటిని గుర్తించలేం. అలాంటి వాహనాలకు టోల్ వసూలు చేయడం చాలా కష్టం. అలాగే, ఏఎన్పీఆర్ కింద టోల్ చెల్లించకుండా టోల్ ప్లాజాలను దాటేందుకు ప్రయత్నించే వాహన యజమానులకు జరిమానా విధించే నిబంధన లేదు. -
వాహనదారులకు బిగ్ రిలీఫ్.. టోల్ వసూళ్లపై కేంద్రం కీలక నిర్ణయం!
హైవేలపై టోల్ ఫీజు వసూలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ వసూళ్ల ప్రక్రియ మరింత సమర్ధంగా ఉండే విధంగా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో, వాహనదారులకు కొంత మేరకు ఉపశమనం కలుగనుంది. వివరాల ప్రకారం.. ఇక నుంచి హైవేలపై వాహనం పరిమాణం, వాహనం తిరిగిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేసే విధానం అమల్లోకి రానుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. వాహనం సైజు, రోడ్డుపై అది ప్రయాణించిన దూరం ఆధారంగా జాతీయ రహదారులపై టోల్ వసూలు చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగానే కొత్త టోల్ విధానానికి అనుగుణంగా వాహనం హైవేలపై ఎంత సమయం, ఎంత దూరం ప్రయాణించిందనే దాని ఆధారంగా టోల్ వసూలు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. టోల్‌ప్లాజా వసళ్ల విషయంలో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రతీ 60 కిలోమీటర్ల పరిధిలో ఉండే కలెక్షన్ పాయింట్స్ వద్ద టోల్ ట్యాక్స్ వసూలు చేయబోరని గడ్కరీ స్పష్టం చేశారు. కాగా, 60 కిలోమీటర్ల మధ్యలో ఉండే టోల్‌బూత్‌లను వచ్చే మూడు నెలల్లో మూసివేస్తామని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా స్పష్టం చేశారు. Pay as you go: Centre plans toll collection revamp based on vehicle’s size, distance travelled#vehicles #government #infrastructure https://t.co/vayGcK6Tu0 — ET NOW (@ETNOWlive) October 4, 2022 -
ద్వారకాతిరుమల కొండపై టోల్ మాయాజాలం!
ద్వారకాతిరుమల: చినవెంకన్న కొండపైకి వెళ్లే దేవస్థానం టోల్ గేట్ రుసుం కాంట్రాక్టర్ అవసరాలకు అనుగుణంగా మారిపోతోంది. దాంతో క్షేత్రానికి వివిధ వాహనాలపై వచ్చే భక్తులు అయోమయానికి గురవుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఉన్న అధిక ధరలు.. ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గిపోయాయి. ఈ మార్పు వెనుక అసలు నిజాలు తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ద్వారకాతిరుమల క్షేత్రంలో టోల్ రుసుం వసూల్లో అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. భక్తుల వాహనాల నుంచి టోల్ రుసుం వసూలు చేసుకునే హక్కుకు దేవస్థానం 2020 జనవరి 27న బహిరంగ వేలంపాట, సీల్డ్ టెండర్ నిర్వహించింది. బహిరంగ వేలంలో 9 మంది టెండర్‌దారులు పాల్గొనగా, సీల్డ్ టెండర్ ద్వారా వచ్చిన రూ. 1,30,56,777ల హెచ్చుపాటను అధికారులు ఆమోదించారు. అసలు షరతులు ఇవీ.. టెండర్ షరతుల ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్ లారీ, బస్సు, ఇతర భారీ వాహనాలకు రూ.150, మినీ బస్సు, 407 వ్యాన్ స్వరాజ్, మజ్దూర్‌కు రూ.100, ట్రాక్టరు ట్రక్కుతో రూ. 50, ట్రక్కు ఆటో, తుఫాన్, టాటా ఏస్‌కు రూ.50, ట్రాక్టరు ఇంజనుకు రూ.50, కారు, జీపు, వ్యాన్‌కు రూ.30, స్కూటర్, మోటారు సైకిల్‌కు రూ.10, పాసింజర్ ఆటోకు రూ.10 వసూలు చేసుకోవాల్సి ఉంది. సదరు కాంట్రాక్టర్ కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో టోల్గేట్ నిర్వహణను వెంటనే చేపట్టలేదు. టోల్ వసూలు బాధ్యతను వెంటనే చేపట్టకపోవడంతో 2021 అక్టోబర్ 14 వరకు దేవస్థానమే సొంతంగా టోల్ వసూలు చేసింది. మధ్యలో 2021 ఆగస్టు 14న కారు, జీపు, వ్యాను ధరను రూ. 30 నుంచి రూ. 50, ఆటో ధరను రూ. 10 నుంచి రూ. 25కు పెంచుతూ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానం దేవస్థానం వరకూ మాత్రమే వర్తిస్తుంది. మధ్యలో టోల్ రుసుం వసూలు బాధ్యతను 2021 అక్టోబర్ 15న మళ్లీ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అతను పాట సందర్భంగా ఇచ్చిన ధరలకే వసూలు చేయాలని అయితే ఈ ఏడాది కాలంగా పెంచిన ధరలను వసూలు చేస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టరుతో అప్పటి అధికారులు, కొందరు సిబ్బంది కుమ్మకై ధర్మకర్తల మండలి సమావేశంలో చేసిన తీర్మానాన్ని అనుకూలంగా మార్చుకుని, సొమ్ము చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా తగ్గిన టోల్ ధరలు టోల్ వ్యవహారం ముదరడంతో దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు దానిపై దృష్టి సారించారు. దాంతో సంబంధిత కాంట్రాక్టర్ పెంచిన ధరలను తగ్గించి, టెండర్ షరతుల్లోని టోల్ ధరలనే వసూలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాన టోల్ గేటు వద్ద ఉన్న ధరల పట్టికను మార్పు చేసిన సిబ్బంది, దొరసానిపాడు, శివాలయం రోడ్లలోని టోల్గేట్లు వద్ద ఉన్న ధరల పట్టికలను మాత్రం మార్చలేదు. అయితే సుమారు ఏడాది పాటు వసూలు చేసిన అధిక ధరల సంగతేంటి.? వాటిని కాంట్రాక్టరు నుంచి రికవరీ చేస్తారా.? అలాగే కాంట్రాక్టరుకు లబ్ది చేకూర్చేలా, శ్రీవారి ఆదాయానికి గండిపడేలా చేసిన సంబంధిత అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు చేపడతారా.? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టరుకి నోటీసులిచ్చాం దీనిపై ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు వివరణ ఇస్తూ తీర్మానాన్ని అడ్డంపెట్టుకుని కాంట్రాక్టర్ ఇప్పటి వరకు భక్తుల నుంచి అధిక ధరలను వసూలు చేసినట్టు గుర్తించామన్నారు. ఇలా వసూలు చేసిన అదనపు సొమ్ము రూ. 27 లక్షలను తిరిగి దేవస్థానానికి చెల్లించాలని సంబంధిత కాంట్రాక్టరుకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు ఈఓ తెలిపారు. ఈ వ్యవహారంలో సంబంధిత ఉద్యోగులపై సైతం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కుమ్మక్కయ్యారు బహిరంగ వేలం పాట, సీల్ టెండర్ నిర్వహించిన సమయంలో టోల్ వసూల ధరలు తక్కువగా ఉన్నాయి. అందుకే ఎక్కువ ధరకు పాడలేకపోయాం. ఇలా ధరలను పెంచి ఇస్తామని ముందే చెబితే ఎక్కువ ధరకు పాడేవాళ్లం. స్వామివారికి ఆదాయం కూడా మరింత పెరిగేది. కాంట్రాక్టరుతో అధికారులు కుమ్మకై ఇష్టానుసారం ధరలు పెంచి, భక్తుల జేబులకు చిల్లు పెట్టారు. ఇది చాలా దారుణం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. – జంగా వెంకట కృష్ణారెడ్డి, వ్యాపారి ,ద్వారకాతిరుమల, -
కేంద్రం సూచనలతో.. కంటోన్మెంట్లో టోల్‌ట్యాక్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్లో టోల్ ట్యాక్స్ త్వరలోనే ముగియనుంది. కేంద్రం సూచనలతో టోల్ ట్యాక్స్ రద్దుకు కంటోన్మెంట్ బోర్డు తీర్మానం చేసింది. టోల్‌ట్యాక్స్ రద్దుతో కంటోన్మెంట్ బోర్డు రూ.10 కోట్ల వార్షిక బడ్జెట్‌ను కోల్పోనుంది. అదే సమయంలో కంటోన్మెంట్ గుండా ప్రయాణం సాగించే కమర్షియల్ వాహనదారులకు భారీ ఊరట లభించనుంది. అయితే టోల్‌ట్యాక్స్ రద్దుతో తాము కోల్పోయే ఆదాయాన్ని ప్రత్యామ్నాయ మార్గంలో భర్తీ చేయాల్సిందిగా బోర్డు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. పెండింగ్ సర్వీసు చార్జీల విడుదల, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లకు తోడుగా టోల్‌ట్యాక్స్ నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరనున్నారు. బోర్డు అధ్యక్షుడు, బ్రిగేడియర్ సోమశంకర్ ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో సీఈఓ అజిత్ రెడ్డి, సివిలియన్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ సీఈఓ విజయ్ కుమార్ బాలన్ నాయర్లు పాల్గొన్నారు. ఆదాయ మార్గాలపై ఆసక్తికర చర్చ.. ఇప్పటికే ఆర్థిక లేమితో సతమతం అవుతున్న బోర్డు టోల్ట్యాక్స్ను సైతం రద్దు చేస్తే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బోర్డు సభ్యుడు రామకృష్ణ ప్రతిపాదించారు. ఆరేళ్ల క్రితమే ఆక్ట్రాయ్‌ను రద్దు చేయగా, సంబంధిత పరిహారాన్ని జీఎస్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గతంలోనే టోల్ట్యాక్స్ను రద్దుచేయడంతో సంబంధిత రాష్ట్రాలే నష్టపరిహారాన్ని చెల్లించాయని గుర్తు చేశారు. ఈ మేరకు ఏయే రాష్ట్రాలు కంటోన్మెంట్లకు నష్టపరిహారాన్ని ఇస్తున్నాయో వెల్లడించాలని ఎమ్మెల్యే సాయన్న కోరగా, అధ్యక్షుడు స్పష్టమైన సమాచారం తమ వద్ద లేదన్నారు. ఆర్మీ సర్వీసు చార్జీలను సక్రమంగా చెల్లిస్తే బోర్డు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సాయన్న ప్రతిపాదించారు. నష్టపరిహారం చెల్లిస్తేనే టోల్‌ట్యాక్స్ రద్దు చేస్తామంటూ నెల రోజుల క్రితం బోర్డు తీర్మానం చేసి పంపినప్పటికీ, కేంద్రం మరోసారి సూచించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనని అధ్యక్షుడు సోమశంకర్ అభిప్రాయపడ్డారు. సీఈఓ అజిత్ రెడ్డి సైతం ఇదే అభిప్రాయంతో ఏకీభవించగా, సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కూడా ఆమోదం తెలిపారు. టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేతకు అంగీకారం తెలుపుతూనే నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరదాం అని తీర్మానించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వసూళ్లకు అక్టోబర్ 31 వరకు గడువు ఉండటంతో, అప్పటి వరకు వసూళ్లు యధావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. టెండర్‌కు ఆమోదం టోల్‌ట్యాక్స్ వసూళ్ల నిలిపివేతకు బోర్డు తీర్మానం తీసుకున్న సమావేశంలోనే మరుసటి ఏడాది టెండర్లకు సంబంధించి, గతంలోనే జారీ చేసిన సర్క్యులర్ ఎజెండాకు బోర్డు ఆమోదం తెలపడం గమనార్హం. బోర్డు తాజా నిర్ణయంతో ఆ టెండర్ల ప్రక్రియపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వెల్లడించలేదు. -
అలర్ట్: సెప్టెంబర్1 నుంచి అమలులోకి వచ్చిన కీలక మార్పులు!
వినియోగదారులకు ముఖ్య గమనిక. సెప్టెంబర్ 1 నుంచి బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, టోల్ ట్యాక్స్, ఇన్స్యూరెన్స్, కొత్త ఇళ్ల కొనుగోళ్లు, ఐటీ రిటర్న్ వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా వ్యవహరిస్తే ఆర్ధికంగా తలెత్తే సమస్యల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం ఇవ్వాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన మార్పులేంటో తెలుసుకుందాం? ప్రీమియం ధర తగ్గింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) మార్చిన నిబంధనల ప్రకారం.. తగ్గిన ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కాబట్టి, పాలసీదారులు..వారి ఏజెంట్లకు 20శాతం కమిషన్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. గడువు తగ్గింది ఆగస్టు 1 తర్వాత ఐటీ రిటర్న్స్‌లు దాఖలు చేసిన వారు వెంటనే ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఎందుకంటే ఆ వెరిఫికేషన్ గడువును తగ్గించారు. ఇప్పటి వరకు ఈ గడువు 120 రోజులు ఉండగా.. ఇప్పుడు ఆ గడువును 30రోజులకు తగ్గించారు. కేవైసీ పూర్తి చేశారా? కస్టమర్లు ఆగస్ట్ 31 లోగా తమ కేవైసీలను పూర్తి చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోరింది. అయితే గడువులోపు కైవైసీ పూర్తి చేయాలి. లేదంటే బ్యాంక్ ఖాతాదారులు వారి అకౌంట్లలో లావాదేవీల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది వాళ్లు అనర్హులు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటల్ పెన్షన్ యోజన (ఏపీవై)లో చేరే వారిపై ఆంక్షలు విధించింది. అక్టోబర్ 1నుంచి ఆయాదాపు పన్ను చెల్లింపు దారులు ఈ స్కీమ్‌కు అనర్హులని ప్రకటించింది. అంతకంటే ముందు చేరిన వారు అర్హులని తెలిపింది. ఇళ్ల ధరలకు రెక్కలు తెలుగు రాష్ట్రాల్లో కాదు. సెప్టెంబర్ 1 నుంచి ఇళ్ల ధరలు మరింత ఖరీదుగా మారనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ గజియాబాద్ ల్యాండ్ సర్కిల్ ధరలు 2 నుంచి 3 శాతానికి పెరిగాయి. రానున్న రోజుల్లో యూపీకి చెందిన ఇతర నగరాల్లో సర్కిల్ రేట్లు పెరగనున్నాయి. టోల్ సర్ ఛార్జీల మోత దేశంలోనే అన్నీ జాతీయ రహదారుల్లో టోల్ రేట్లు పెరుగుతున్నాయి. ఆగస్ట్ 31 వరకు యమునా ఎక్స్‌ప్రెస్ హైవేలో ఉన్న టోల్ గేట్ సర్ ఛార్జీలు కిలో మీటర్‌కు 10పైసలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ సెప్టెంబర్ 1 నుంచి ఆ సర్ ఛార్జీలు 50పైసలు పెరిగాయి. -
గుడ్‌న్యూస్: గణేశ్ భక్తులకు టోల్ మాఫీ
సాక్షి, ముంబై: గణేష్ భక్తులకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శిందే వర్గం, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం తీపి కబురునందించింది. గణేషోత్సవాల కోసం స్వగ్రామాలకు రోడ్డు మార్గంమీదుగా వెళ్లే భక్తులకు టోల్ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 27వ తేదీ నుంచి ఈ టోల్ ఫ్రీ అమల్లోకి వచ్చింది. దీనిపై ప్రజలు ఆనందం వ్య క్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం గణేశోత్స వాలలో పాల్గొనేందుకు ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే వాహనాల సంఖ్య అధికంగా ఉంటుంది. దీన్ని దష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ముంబై – బెంగళూర్ రహదారి, ముంబై – గోవా రహదారులతోపాటు ఇతర పీడబ్ల్యూడీ రోడ్ల మీదుగా వెళ్లే వాహనాలకు ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు టోల్ మాఫీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ప్రకటించారు. చదవండి: (Vishal: నటుడు విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్) -
'ఫాస్టాగ్' కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!
వాహనదారులకు ముఖ్య గమనిక. కేంద్రం ఫాస్టాగ్ వ్యవస్థకు మంగళం పాడనుంది. అవును.. ఫాస్టాగ్ కథ మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగియబోతోంది. మరి టోల్ చార్జీల వసూలు ఎలాగంటారా? అందుకోసం కొత్త పద్ధతిని ఆచరించబోతున్నట్లు సూత్రప్రాయంగా తెలియజేసింది. ఇప్పుడున్న ఫాస్టాగ్ స్థానంలో.. జీపీఎస్ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ వసూలు చేయాలని సంబంధింత మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇప్పుటికే ఈ జీపీఎస్ టెక్నాలజీ ఆధారిత పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం, ఒక టోల్ ప్లాజా నుండి మరొక టోల్ ప్లాజాకు మొత్తం దూరానికి టోల్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. కానీ ఈ జీపీఎస్ టెక్నాలజీతో హైవేపై వెహికల్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో.. దాని ఆధారంగా టోల్ చెల్లించాల్సి వస్తుంది. కేంద్రమంత్రి ప్రకటన ఈ ఏడాది మార్చిలో జరిగిన లోక్‌సభ సమావేశాల్లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలోగా దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా బూత్‌లను ప్రభుత్వం తొలగించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు జీపీఎస్ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు చెప్పారు. కొత్త పద్దతిలో కదులుతున్న వెహికల్ జీపీఎస్ ఇమేజెస్ సాయంతో టోల్ ఛార్జీలను వసూలు చేసే సౌలభ్యం కలుగుతుందన్నారు. యూరప్ దేశాల్లో జీపీఎస్ ఆధారిత విధానం విజయవంతం కావడంతో మనదేశంలో దీనిని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర రవాణా శాఖ జీపీఎస్ టెక్నాలజీని పరీక్షించేందుకు మనదేశంలో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కాగా, కేంద్రం ఈ కొత్త విధానాన్ని అమలు చేసే ముందు ట్రాన్స్పోర్ట్ విధానాన్ని మార్చాల్సి ఉండగా.. పైలట్ ప్రాజెక్ట్‌లో దేశవ్యాప్తంగా 1.37 లక్షల వెహికల్స్‌పై ఈ జీపీఎం వ్యవస్థను ప్రయోగించనున్నారు. ఫాస్ట్‌ట్యాగ్‌లు రద్దీ సమాయాల్లో టోల్ గేట్ల వద్ద వాహనదారులు గంటల తరబడి ఎదురు చూసే అవసరాన్ని తగ్గించేందుకు కేంద్రం 2016లో ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ బూత్‌లలో రుసుము చెల్లించడాన్ని సులభతరం చేసింది. చదవండి👉 బుడ్డోడి చేతికి స్మార్ట్ వాచ్..ఫాస్టాగ్‌తో అకౌంట్లలో మనీని దొంగిలించవచ్చా? -
టోల్ చార్జీలు పెంపు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల్లో చార్జీలు పెరిగాయి. రాష్ట్రంలో ఉన్న 29 ప్లాజాల్లో హైదరాబాద్–బెంగళూరు హైవే మినహా మిగతా టోల్ ప్లాజాల రుసుములను ఎన్హెచ్ఏఐ సవరించింది. బెంగళూరు హైవేలో ఓ కాంట్రాక్టరుతో ఉన్న ఒప్పందం ప్రకారం కొత్త ధరలు సెప్టెంబర్‌లో విడుదల కానున్నాయి. మిగతా టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఆయా రోడ్ల నిడివి, వెడల్పు, వాటి మీద ప్రయాణించే వాహనాల సంఖ్య, టోల్ గేట్ల సామర్థ్యం, నిర్వహణ వ్యయం.. ఇలా పలు అంశాల ప్రాతిపదికగా టోల్ ధరలను సవరించారు. కార్లు, జీపులు లాంటి వాహనాలకు 5 నుంచి 8 శాతం, లైట్ కమర్షియల్ వాహనాలకు 10 నుంచి 15 శాతం, బస్సులు, ట్రక్కులకు 10 నుంచి 15 శాతం చార్జీలు పెరిగాయి. ఆయా కేటగిరీల్లో రూ. 5 నుంచి 50 వరకు ధరలు పెరిగాయి. టోల్ ధరలను ఏటా ఏప్రిల్ ఒకటిన సవరిస్తుంటారు. ఆర్టీసీ కూడా: తాజాగా ఆర్టీసీ కూడా టోల్ రుసుమును జనం జేబుపై వేసింది. అన్ని బస్సులకు కలిపి ఒకేసారి ఆర్టీసీ టోల్ రుసుములను చెల్లిస్తుంది. గత నాలుగేళ్లుగా టోల్ రుసుములను సంస్థ సవరించలేదు. గత ఏడాది కాలంలో ప్రయాణికుల నుంచి వసూలు చేసిన మొత్తం కంటే టోల్ నిర్వాహకులకు చెల్లించిన మొత్తం రూ.8 కోట్లు ఎక్కువని ఇటీవల గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం ఆర్టీసీ కూడా టికెట్ రేట్లలో టోల్ వాటాను పెంచింది. గతేడాది టోల్ చార్జి, ఏప్రిల్ ఒకటి నుంచి అమలయ్యే కొత్త రేట్లు (మొదటిది పాత, రెండోది కొత్త) ఇలా ఉన్నాయి. హైదరాబాద్విజయవాడ హైవే పై పంతంగి: కారు, జీపు వ్యాన్ ఇతర లైట్ వెహికిల్స్‌కు సింగిల్ ట్రిప్ ఛార్జి రూ.80 నుంచి రూ.90కి, రిటర్న్ జర్నీతో కలిపి ఛార్జి రూ.120 నుంచి రూ.135కు, నెల పాస్ ఛార్జి రూ.2690 నుంచి రూ.2965కు పెరిగాయి. లైట్ కమర్షియల్ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ ఛార్జి రూ.130 నుంచి రూ.140కి, రిటర్న్ జర్నీ రూ.190 నుంచి రూ.210కి, నెలపాస్ రూ.4255 నుంచి రూ.4685కు పెరిగాయి. బస్, ట్రక్కుల సింగిల్ ట్రిప్ రూ.265 నుంచి రూ.290కి, రిటర్న్ జర్నీ ఛార్జి రూ.395 నుంచి రూ.435కు, నెల పాస్ రూ.8795 నుంచి రూ.9685కు, ఓవర్‌సజ్డ్ వెహికిల్ సింగిల్ ట్రిప్ రూ.510 నుంచి రూ.560కి, రిటర్న్ జర్నీ రూ.765 నుంచి రూ.845కు, నెలపాస్ రూ.17010 నుంచి రూ.18740కి పెరిగాయి. కోర్లపహాడ్: కార్లు, జీపుల సింగిల్ ట్రిప్ రూ.110 నుంచి రూ.120కి, రిటర్న్ జర్నీ రూ.165రూ.180, నెలపాస్ రూ.3650రూ.4025, లైట్ కమర్షియల్ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ ఛార్జి రూ.175రూ.190, రిటర్న్ జర్నీ రూ.260రూ.285, నెలపాస్రూ.5795రూ.6385, బస్సు, ట్రక్కుల సింగిల్ ట్రిప్ రూ.360రూ.395, రిటర్న్ జర్నీ ఛార్జి రూ.540రూ.595, నెలపాస్ రూ.12020రూ.13240, ఓవర్సైజ్డ్ హెవీ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ రూ.695రూ.765, రిటర్న్ జర్నీ రూ.1045రూ.1150, నెలపాస్ రూ.23190రూ.25545కు పెరిగాయి. చిల్లకల్లు టోల్గేట్: జీపు కార్ల సింగిల్ ట్రిప్ రూ.90 రూ.100, రిటర్న్ జర్నీ ఛార్జి రూ.135రూ.150, నెలపాస్ రూ.3040రూ.3350, లైట్ కమర్షియల్ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ రూ.145రూ.160, రిటర్న్ జర్నీ రూ.215రూ.240, నెల పాస్ రూ.4805రూ.5290, బస్సు, ట్రక్కు సింగిల్ ట్రిప్ రూ.300రూ.330, రిటర్న్ జర్నీ రూ.445రూ.490, నెల పాస్ రూ.9930రూ.10940, ఓవర్సైజ్డ్ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ రూ.575రూ.635, రిటర్న్ జర్నీ రూ.865రూ.955, నెల పాస్ రూ.19215రూ.21170. ► ఎన్‌హెచ్ 163 పై ఉన్న కొమల్ల టోల్‌ప్లాజాలో కార్లు, జీపులకు సింగిల్ ట్రిప్ పాత ధర రూ.100 కొత్త ధర రూ.110, రిటర్న్ జర్నీకి రూ.145170, నెలపాస్‌కు రూ.32603745. ► లైట్ కమర్షియల్ వాహనాలకు సింగిల్ జర్నీ రూ.160180, రిటర్న జర్నీకి రూ.235270, నెల పాస్‌కు రూ.52653745, బస్సులు,ట్రక్కు సింగిల్ ట్రిప్‌కు రూ.330 రూ.380, రిటర్న జర్నీకి 495570, నెల పాస్‌కు రూ.1103012675, సెవన్ యాక్సల్ అంతకంటే హెవీ వెహికిల్్సకు సింగిల్ ట్రిప్ రూ.630725, రిటర్న్ జర్నీకి రూ.9451090, నెలపాస్‌కు 2105524195. ► ఎన్‌హెచ్ 163 పై ఉన్న గూడూరు ప్లాజాలో కార్లు, జీపుల సింగిల్ ట్రిప్‌కు రూ.100110, రిటర్న్ జర్నీకి రూ.150 రూ.165, నెల పాస్ రూ.3290రూ.3620, లైట్ కమర్షియల్ వెహికిల్స్‌కు సింగిల్ ట్రిప్ రూ.150 రూ.165, రిటర్న్ జర్కీకి రూ.225 250, బస్, ట్రక్కులకు సింగిల్ ట్రిప్ రూ.305రూ.340, రిటర్న్ జర్నీకి రూ.460రూ.505, నెల పాస్‌కు రూ.10225రూ.11265. ఓవర్సైజ్డ్ హెవీ వెహికిల్్స సింగిల్ ట్రిప్‌కు రూ.605రూ.665, రిటర్న్ జర్నీకి రూ.905 రూ.1000, నెల పాస్‌కు రూ.20160రూ.22210 ► ఆదిలాబాద్‌లోని ఎన్‌హెచ్7పై ఉన్న రోల్మామ్డా టోల్‌ప్లాజా ధరలల్లో మార్పు ఇలా: కార్లు జీపులు సింగిల్ ట్రిప్ రూ.90 రూ.100, రిటర్న్ జర్నీ రూ.135రూ.150, నెలపాస్ రూ.2980 రూ.3285, లైట్ కమర్షియల్ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ రూ.145రూ.160, రిటర్న్ జర్నీ రూ.215రూ.240, నెలపాస్ రూ.4815 రూ.5305, బస్, ట్రక్కు సింగిల్ ట్రిప్ రూ.330 రూ.335, రిటర్న్ జర్నీకి రూ.455రూ.500, నెలపాస్ రూ.10090 రూ.11110, ఓవర్సైజ్డ్ హెవీవెహికిల్ సింగిల్ ట్రిప్ రూ.580రూ.635, రిటర్న్ జర్నీ రూ.865రూ.955, నెలపాస్ రూ.19260రూ.21215 ► ఎన్‌హెచ్44పై ఆర్మూర్ఎల్లారెడ్డి సెక్షన్ పరిధిలోని ఇందల్వాయి టోల్ధరలు పాతకొత్త ఇలా.. కార్లు, జీపుల సింగిల్ ట్రిప్పుకు రూ.75రూ.80, రిటర్న్ జర్నీకి రూ.110రూ.125, నెలపాస్‌కు రూ.2470రూ.2720, లైట్ కమర్షియల్ వాహనాల సింగిల్ ట్రిప్పు రూ.120రూ.130, రిటర్న్ జర్నీ రూ.180 రూ.200, నెలపాస్ రూ.3990రూ.4395, బస్, ట్రక్కు సింగిల్ ట్రిప్పు రూ.250రూ.275, రిటర్న్ జర్నీ రూ.375రూ.415, నెలపాసు రూ.8365రూ.9215 -
వాహనదారులకు షాకింగ్ న్యూస్..! పెరగనున్న టోల్గేట్ ఛార్జీలు..!
ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్...! ఏప్రిల్ 1 నుంచి హైవే రోడ్లపై ప్రయాణం మరింత ఖరీదైనది మారనున్నట్లు సమాచారం. భారీగా పెరగనున్న టోల్ ఛార్జీలు..! నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను 65 శాతం పెంచనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి . హైవేలపై తిరిగే అన్ని రకాల వాహనాల టోల్ ఛార్జీలను ఎన్హెచ్ఏఐ సవరించినట్లుగా తెలుస్తోంది. ధరల పెంపుతో ఇప్పుడు వాణిజ్య వాహనాలు టోల్ ట్యాక్స్ కోసం అదనంగా రూ. 65 చెల్లించాల్సి ఉండనుంది. కాగా ప్రైవేట్ వాహనాల వన్-వే ప్రయాణం కోసం అదనంగా రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది. సవరించిన ధరలు మార్చి 31 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చదవండి: కాసుల వర్షం కురిపిస్తోన్న హైదరాబాద్ కంపెనీ..! ఒక లక్షకు రూ. 3 కోట్ల లాభం..! -
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక 60 కిలోమీటర్ల వరకు నో టోల్!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త తెలిపింది. జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల లోపు ఉన్న టోల్ కలెక్టింగ్ పాయింట్లను వచ్చే మూడు నెలల్లో మూసివేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభలో ప్రకటించారు. 2022-23 బడ్జెట్లో కేటాయించిన రోడ్లు, రహదారుల కేటాయింపుపై లోక్ సభలో జరిగిన చర్చకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ.. 60 కిలోమీటర్ల పరిధిలో ఒకే ఒక్క టోల్ గెట్ ఉంటుందని ప్రకటించారు. ఇంకా భవిష్యత్ నిర్మాణం జరగబోయే రోడ్ల గురించి ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ-అమృత్ సర్-కత్రా ఎక్స్ ప్రెస్ వేను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ-అమృత్ సర్ మార్గం ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుంది అని అన్నారు. అలాగే, కొత్తగా నిర్మిస్తున్న మార్గం వల్ల ఢిల్లీ నుంచి అమృత్ సర్ చేరుకోవడానికి 4 గంటల సమయం మాత్రమే పడుతుందని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న వల్ల శ్రీనగర్ నుంచి ముంబై చేరుకోవడానికి 20 గంటల సమయం పడుతుందని గడ్కరీ చెప్పారు. "కొత్తగా నిర్మిస్తున్న జమ్మూ-శ్రీనగర్ హైవేను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను" అని అన్నారు. అలాగే ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేలు కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి తెలిపారు. ఢిల్లీ-ముంబై దూరాన్ని 12 గంటల్లోపు కారులో చేరుకోవచ్చు. 2024 నాటికి శ్రీనగర్-లేహ్ హైవేపై సముద్ర మట్టానికి 11,650 అడుగుల ఎత్తులో ఉన్న జోజిలా పాస్ సొరంగాన్ని తెరవాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, రోడ్డు భద్రతపై మంత్రి మాట్లాడుతూ.. ఇప్పుడు అన్ని కార్లలో 6 ఎయిర్ బ్యాగులతో తప్పనిసరిగా ఉండాలని అన్నారు. (చదవండి: బంగారం కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ధరలు!) -
ఆర్టీసీ బస్సుకు టోల్గేట్ బ్రేక్
పెద్దకొడప్గల్(జుక్కల్): టోల్ ట్యాక్స్ చెల్లించనందున పల్లెలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు టోల్గేట్ వద్దనే ఆగిపోయింది. ఫలితంగా గ్రామీణులు ఇబ్బందులపాలయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం టోల్గేట్ వద్ద బాన్సువాడ నుంచి పెద్దకొడప్గల్, బేగంపూర్, కాస్లాబాద్, వడ్లం, గ్రామాలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సును టోల్గేట్ సిబ్బంది మంగళవారం ఉదయం నిలిపివేశారు. దీంతో బస్సు వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. ఆయా గ్రామస్తులు పలువురు ఆర్టీసీ అధికారులను సంప్రదించగా ప్రయాణికుల నుంచి టికెట్ చార్జీలు ట్రిప్పుకు రూ.200 నుంచి రూ.400 వసూలు అవుతుందని, టోల్ ట్యాక్స్ ట్రిప్పుకు రూ.480 ఉండటంతో నష్టం వస్తోందని తెలిపారు. రోజుకు మూడు ట్రిప్పులు బస్సును నడపలేకపోతున్నామన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజలు వెళ్లి టోల్గేట్ అధికారులతో మాట్లాడాలని, ట్యాక్స్ మినహాయింపు ఇస్తే బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ సాయన్న తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్యెల్యే హన్మంత్ సింధే దృష్టికి తీసుకువెళ్తామన్నారు. -
ఇంటి వద్దే కారు.. అయినా టోల్ కట్
సాక్షి, ద్వారకాతిరుమల: ఇంట్లోనే కారు ఉన్నా ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూలు చేసినట్లు ఫోన్‌కు మెస్సేజ్ రావడంతో ద్వారకాతిరుమలకు చెందిన ఓ కారు యజమాని తెల్లబోయాడు. వివరాలిలా ఉన్నాయి. ద్వారకాతిరుమలకు చెందిన ఒబిలిశెట్టి గంగరాజుకుమార్ సెల్‌ఫోన్‌కు సోమవారం ఉదయం 11.23 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది. దీనిని పరిశీలించగా, ఏపీ 37 సీఏ 4747 నంబర్ గల తన రెనాల్ట్ స్కాలా కారుకు ప్రకాశం జిల్లాలోని మేకలవారిపల్లి టోల్ ప్లాజా నుంచి ఫాస్టాగ్ ద్వారా రూ.40 లు టోల్ రుసుము కట్ అయ్యినట్లు అందులో ఉంది. అపార్ట్ మెంట్ లో తన ఇంటి వద్దే ఉన్న కారుకు అక్కడ టోల్ ఎలా కట్ చేశారో తెలియక అయోమయంలో పడ్డాడు. కనీసం కారు రోడ్డు మీదకు వెళ్లకుండా టోల్ రుసుము వసూలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. కారు యజమానికి ఫాస్టాగ్ ద్వారా డబ్బులు కట్ అయినట్లు వచ్చిన మెసేజ్, అపార్ట్మెంట్లో ఉన్న కారు -
పెరిగిన టోల్‌ప్లాజా ధరలు.. నేటి నుంచి అమల్లోకి!
సాక్షి, షాద్‌నగర్: ప్రయాణికులు, వాహనదారులపై మరింత భారం పడనుంది. టోల్ ప్లాజా ధరలు పెరగనుండటంతో జేబులు మరింత ఖాళీ కానున్నాయి. ఏటా టోల్ ప్లాజా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 44వ జాతీయ రహదారిపై షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజాలో పెంచిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఏటా పెంపు.. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తూరు నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వరకు ఉన్న జాతీయ రహదారిని సుమారు 58 కిలోమీటర్ల మేర రూ.600 కోట్ల వ్యయంతో విస్తరించారు. అవసరమైన చోట్ల బైపాస్‌లు నిర్మించారు. 2009లో పనులు పూర్తిచేసి కొత్తూరులో ప్రారంభించారు. షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ శివారులో నిర్మించిన టోల్ ప్లాజా రుసుంను ఏటా పెంచుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇప్పటికే అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు టోల్ చార్జీలు కూడ పెంచడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన చార్జీలు సెప్టెంబర్ 1నుంచి అమలులోకి వస్తాయని టోల్‌ప్లాజా నిర్వాహకులు ప్రకటనలు కూడా జారీ చేశారు. చదవండి: ఇక్కడ బస్టాప్ ఎక్కడుందబ్బా.. కనిపించట్లేదు! పెరగనున్న పాసుల రుసుము టోల్ ప్లాజాలో నెల వారీ పాసుల రుసుంను కూడా పెంచనున్నారు. కారు, ప్యాసింజర్ వ్యాను లేక జీపు రూ.1,960 నుంచి రూ.2,115లు, లైట్ కమర్షియల్ వాహనాలు, మినీ బస్సులు రూ.3,430 నుంచి రూ.3,700, ట్రక్కు, బస్సు రూ.6,860 నుంచి రూ.7,395, మల్టీయాక్సిల్ వాహనాలు రూ.11,025 నుంచి రూ.11,895లు పెంచనున్నారు. స్కూల్ బస్సుకు నెలవారీ పాసు రుసుము రూ.1,000 వసూలు చేయనున్నారు. ఈ సారి పెంచేశారు గతేడాది కారు, ప్యాసింజర్ వ్యాన్లతో పాటుగా, లైట్ కమర్షియల్ వాహనాలకు టోల్ రుసుం పెంచలేదు. కానీ ఈసారి మాత్రం కారు, ప్యాసింజర్ వ్యాన్, లైట్ కమర్షియల్ వాహనాలతో పాటు ట్రక్కు, బస్సు, మల్టీయాక్సిల్ వాహనాల (అనేక చక్రాల వాహనం) రుసుం పెంచనున్నారు. అయితే పెంచిన ధరలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోని రానున్నాయి. పెరగనున్న ఆదాయం షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా మీదుగా నిత్యం సుమారు పదివేల వాహనాలకుపైగా రాకపోకలు సాగిస్తాయి. కరోనా నేపథ్యంలో చాలా మంది తమ సొంత వాహనాలపై ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ టోల్ ప్లాజాలో నిత్యం సుమారు రూ.25 లక్షల రూపాయల వరకు రుసుం వసూలవుతుంది. చార్జీలు పెంచడంతో టోల్ ఆదాయం రోజుకు రూ.2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈమేర వాహనదారులపై భారం పడనుంది. వాహనం వెళ్లేందుకు రానుపోను (కొత్త చార్జీలు) కారు, జీపు ప్యాసింజర్ వ్యాన్ రూ.70 రూ.105 లైట్ కమర్షియల్, మినీ బస్ రూ.125 రూ.185 ట్రక్కు, బస్సు రూ.245 రూ.370 మల్టియాక్సిల్ వాహనాలు రూ.395 రూ.595 భారం మోపడం సరికాదు ఏటా టోల్ రుసుం పెంచి వాహనదారులపై భారం మోపడం సరికాదు. చార్జీల పెంపుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీలు, ట్రక్కులకు కిరాయిలే సరిగా రావడం లేదు. ఈ సమయంలో కిస్తులు కట్టడం కూడా గగనమవుతోంది. – సయ్యద్ సాధిక్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, షాద్‌నగర్ -
గూగుల్ మ్యాప్స్: ఓ గుడ్ న్యూస్-ఓ బ్యాడ్ న్యూస్
టెక్నాలజీలో గూగుల్ మ్యాప్స్ నిజంగానే ఓ గేమ్ ఛేంజర్. గమ్యస్థానం చేరుకునేందుకు సరైన మార్గం కోసం కోట్ల మంది గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఒక సెకనులో 70వేలమంది, గంటలకు 227 మిలియన్ల మంది.. ఒకరోజులో దాదాపు ఐదున్నర బిలియన్ల గూగుల్ యూజర్లు మ్యాప్స్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి యాప్ ఇప్పుడు రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్లు అందించింది. గూగుల్ మ్యాప్.. ఓ ఆసక్తికరమైన ఫీచర్‌ను తీసుకురాబోతోంది. రహదారులపై టోల్ ఛార్జ్ వివరాల్ని యూజర్లకు ముందుగానే తెలియజేయబోతోంది. తద్వారా వాహనదారుడు ముందుగానే తన రూట్‌ను ఎంచుకునే అవకాశం కలగనుంది. ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను వీలైనంత త్వరలోనే గూగుల్ మ్యాప్ అందుబాటులోకి రానుంది. కొందరు వాహనదారులకు కొత్త రూట్లో ప్రయాణించినప్పుడు రహదారి ఎలా ఉండబోతోంది? మధ్యలో ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయి? ఎంత వసూలు చేస్తారు? అనే వాటిపై ఒక ఐడియా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ల కోసం గూగుల్ మ్యాప్ ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. అయితే దీనిపై గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా.. గూగుల్ మ్యాప్ ప్రివ్యూ ప్రోగ్రాం ఓ సందేశాన్ని పంపింది. చాలా దేశాల్లో వాజే మ్యాపింగ్ యాప్(ఇది కూడా గూగుల్ కిందే పని చేస్తోంది) ఇలాంటి ఫీచర్‌గా వాహనదారులకు ఉపయోగపడుతోంది. ఇక గూగుల్ మ్యాప్ టోల్ ట్యాక్స్ ధరలను ఎలా తెలియజేస్తుందనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోయినా.. బహుశా టోల్ ఆపరేటర్లు ఫిక్స్ చేసే ధరల పట్టిక, రోడ్డు మార్గాలు తదితర వివరాల వెబ్సైట్ ఆధారంగా.. వాహనదారులకు తెలియజేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చెల్లిస్తేనే.. ముందుకు వెళ్లేది! గూగుల్ మ్యాప్‌లో బెస్ట్ ఫీచర్‌గా ‘టర్న్ బై టర్న్’ నావిగేషన్‌కు పేరుంది. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో, ఇరుకు గల్లీల్లో, సిటీల్లో చాలామంది ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇది ఉపయోగించాలంటే ఇప్పుడు ఎంతో కొంత చెల్లించాల్సిందే. అవును.. ప్రస్తుతం ఈ ఫీచర్.. గూగుల్ క్రౌడ్‌ఫండింగ్ ఫీచర్ కిందకు వెళ్లిపోయింది. జీపీఎస్ లొకేషన్-నేవిగేషన్ను యూజర్‌కు అందించడం భారంగా మారుతున్న నేపథ్యంలోనే గూగుల్ మ్యాప్.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచే ఈ ఫీచర్‌ను మొదలుపెట్టింది గూగుల్ మ్యాప్(అప్డేట్ చేసుకోవాల్సిందే!). అయితే మొత్తం గూగుల్ యాప్‌నే ‘పే అండ్ యూజ్’ కిందకు తీసుకురానుందా? అనే ప్రశ్నపై మాత్రం గూగుల్ మ్యాప్ మౌనం వహిస్తోంది. చదవండి: కంటిచూపుతోనే ఇక ఫోన్ ఆపరేటింగ్! -
టోల్ గేట్ల వద్ద పసుపు గీతలు.. భారీగా క్యూ ఉంటే నో టోల్ ఫీజు..!
సాక్షి, హైదరాబాద్: పసుపు గీతలు.. టోల్గేట్ల వద్ద వాహనదారుల కష్టాల పరిష్కారానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) తాజాగా ముందుకు తెచ్చిన ప్రతిపాదన. ఈ పసుపు గీతలు టోల్ గేట్ల వద్ద వాహనాలు క్యూ ఏర్పడకుండా చేస్తాయని సంస్థ చెబుతోంది. సాధారణ రోజుల్లో సమస్య లేకున్నా.. పండగలు, రద్దీ ఎక్కువగా ఉండే ఇతర రోజుల్లో టోల్ గేట్ల వద్ద పెద్దయెత్తున వాహనాలు బారులు తీరుతూ గేటు దాటడం విసుగుగా మారుతోంది. ఇటీవల పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన ఫాస్టాగ్ కూడా దీనికి పూర్తిస్థాయి పరిష్కారం చూపలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్హెచ్ఏఐ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచి్చంది. ఈ మేరకు మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు పంపింది. తెలంగాణ ఎన్హెచ్ఏఐ అధికారులు కూడా వీటిని అందుకున్నారు. కానీ దీని అమలు విషయంలో వారిలో కొంత అయోమయం నెలకొంది. ఫాస్టాగ్‌లో కోత పడదు జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద గేట్లను ఆనుకుని వంద మీటర్ల దూరంలో పసుపు రంగులో జీబ్రాలైన్స్ తరహా గీతలు ఏర్పాటు చేస్తారు. గేటు వద్ద ఆగే క్రమంలో ఈ వంద మీటర్ల దూరంలో ఉండే పసుపు రంగు గీతలకు మించి వాహనాలు బారులు తీరితే ఈ కొత్త విధానం అమలవుతుంది. అలాంటి సమయంలో పసుపు గీతలు ఉండే వంద మీటర్ల లోపు ఉన్న వాహనాలన్నింటినీ ఒకేసారి గేటు ఎత్తి ముందుకు వదులుతారు. అది కూడా ఎలాంటి టోల్ రుసుము వసూలు చేయకుండానే. అంటే ఫాస్టాగ్ మొత్తంలో ఎలాంటి కోతా పడదన్న మాట. అలా ఎప్పుడు పసుపు గీతలకు మించి క్యూలు ఏర్పడినా వదిలేయడం వల్ల భారీ క్యూలు ఏర్పడవనేది ఎన్హెచ్ఏఐ ఉద్దేశం. అలా అయితే టోల్ గేటు ఎందుకు? ఈ విషయమై స్థానిక అధికారుల్లో పూర్తిస్థాయి స్పష్టత లేదు. పసుపు రంగు గీత దాటి వాహనాలు క్యూగా ఏర్పడితే.. ముందున్న వాటిని గేటు ఎత్తి పంపించేస్తారు..సరే. కానీ అవి వెళ్లిన వెంటనే మళ్లీ వెనక క్యూ ఏర్పడితే వాటినీ అలాగే పంపాలి. అలా రద్దీ ఉన్న సమయంలో వంద మీటర్ల మేర వాహనాల వరస ఏర్పడటం సాధారణమేనని అధికారులు అంటున్నారు. అలా పంపుతూ అన్ని వాహనాలూ వదిలేస్తే ఇక టోల్ గేటు ఎందుకనేది అధికారుల ప్రశ్న. దీంతో దీనిపై ఢిల్లీ అధికారుల నుంచి స్పష్టత తీసుకున్నాక ఈ విధానం అమలులోకి తేవాలని భావిస్తున్నారు. -
ఈ వాహనాలకు టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు..!
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు నాలుగు లక్షలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఆక్సిజన్ కొరతతో రోజు వందల మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. వివిధ ప్రాంతాలనుంచి ఆస్పత్రులకు వాయు, రోడ్డు, రైలు మార్గాలగుండా ఆక్సిజన్‌ను రవాణా చేస్తున్నారు. తాజాగా ఆక్సిజన్‌ను రవాణా చేసే ట్యాంకర్లపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఎఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల మీదుగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను మోసే ట్యాంకర్లు, కంటైనర్లకు టోల్ ఫీజును మినహాస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్హెచ్ఎఐ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను తీసుకెళ్లే ట్యాంకర్లు, కంటైనర్లను అంబులెన్స్ వంటి ఇతర అత్యవసర వాహనాలతో సమానంగా చూడాలని ప్రకటించారు. కాగా ఈ వాహనాలను టోల్ ఫీజు నుంచి రెండు నెలలపాటు మినహాయింపును ఇచ్చింది. తదుపరి ఆదేశాల వచ్చేంత వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని ఎన్హెచ్ఎఐ పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్‌కు గణనీయంగా డిమాండ్ ఏర్పడటంతో ఎన్హెచ్ఎఐ ఈ నిర్ణయం తీసుకుంది. Toll Fee for Tankers Carrying Liquid Medical Oxygen exempted on National Highways. Click here for more details: https://t.co/GmiogH1l8D — NHAI (@NHAI_Official) May 8, 2021 చదవండి: Break The Chain: లాక్‌డౌన్‌పై ఉత్కంఠ! -
వాహనదారులకు కేంద్రం తీపికబురు
మీకు కారు కానీ ఏదైనా భారీ వాహనం కలిగి ఉన్నారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు అందించింది. ఉచితంగానే ఫాస్టాగ్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2021 మార్చి 1 వరకు దేశవ్యాప్తంగా ఉన్న 770 టోల్ ప్లాజాలలో (స్టేట్ ప్లాజాతో సహా) ఉచితంగానే ఫాస్టాగ్ పొందవచ్చు అని ఎన్హెచ్ఏఐ తెలిపింది. దీనితో వాహనదారులకు రూ.100 ఆదా కానుంది. జాతీయ రహదారులపై నడిచే వాహనాల యూజర్ల ఫాస్టాగ్ వినియోగించడాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం, ఫాస్టాగ్ ను 87 శాతం మంది వినియోగదారులు వాడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ఫాస్టాగ్ వినియోగం 7 శాతం పెరిగింది. ఇక దేశంలో 100 టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ వినియోగించే వారి సంఖ్య 90శాతం చేరుకుంది. ఒక్కరోజులోనే ఫాస్టాగ్ ద్వారా 63 లక్షల లావాదేవీలతో రూ.100 కోట్ల టోల్ వసూలు చేశారు. టోల్ ప్లాజా దగ్గర ఏదైనా సాంకేతిక లోపం ఉంటే ఫాస్టాగ్‌లలో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఒక్క పైసా కూడా చెల్లించకుండా వినియోగదారులు టోల్ ప్లాజాలు దాటవచ్చు అని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. గత రెండు రోజుల్లో 2.5 లక్షలకు పైగా ట్యాగ్ల అమ్మకాలు జరిగాయని ఎన్హెచ్ఏఐ పేర్కొంది. ప్రతి వాహనదారుడి దగ్గర ఫాస్టాగ్ తప్పక ఉండాల్సిందే. లేదంటే భారీ జరిమానా పడుతుంది. చదవండి: వాట్సాప్‌కు దీటుగా స్వదేశీ సందేశ్ యాప్ -
ఇక వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి
న్యూఢిల్లీ: కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 15వ తేది నుంచి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. ఇక నుంచి ఫాస్ట్ టాగ్ లేకుండా టోల్ ఫీజు చెల్లించాలనుకుంటే మాత్రం రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ గడువు తేది దగ్గర పడుతుండటంతో ఈ కొత్త విధానంపై కేంద్రం ప్రజలకు అవగాహనా కల్పించడం కోసం కేంద్రం ప్రకటనలు ఇస్తుంది. అయితే కొత్త ఫాస్టాగ్ విధానంపై చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.(చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్!) ఇప్పుడు అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేయబడింది. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా టోల్ ఫీజ్ ఆటోమేటిక్ చెల్లించవచ్చు. ఈ ఫాస్టాగ్ పొదుపు ఖాతా లేదా డిజిటల్ వాలెట్‌తో అనుసంధానించబడుతుంది. దీనిని మీ ఫోర్ వీలర్ వాహనం విండ్‌స్క్రీన్‌పై అమర్చిన ఒక బార్ కోడ్ స్టిక్కర్. దీని ద్వారా టోల్ చెల్లించడానికి మీరు వాహనం ఆపవలసిన అవసరం లేదు. టోల్‌ను దాటేటప్పుడు సమయం, ఇంధనం ఆదా చేయడం, ట్రాఫిక్‌ను తగ్గించడం కోసం ఈ ఫాస్టాగ్ విధానాన్ని తప్పని సరి చేసింది. ఫాస్టాగ్ ఎక్కడ పొందవచ్చు? ఫాస్టాగ్ లను ఏదైనా బ్యాంకు లేదా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీనికోసం ఐసిఐసిఐ, ఎస్బిఐ, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. ఇదే కాకుండా, టోల్ ప్లాజా, ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే "మై ఫాస్టాగ్ యాప్"ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ ఫామ్ లు గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం వంటి యాప్‌లు కూడా ఫాస్టాగ్ ను అందిస్తున్నాయి.(చదవండి: జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం) ఈ ఫాస్టాగ్ లో వాహనం రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన ఒక బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ ను వాహనం ముందు అద్దం లేదా సైడ్ మిర్రర్ పై స్టిక్కర్ లా అతికిస్తారు. కాగా, ఇది జారీ చేసిన తేదీ నుండి ఐదేళ్ల కాలం పాటు చెల్లుతుంది. దీన్ని కొనుగోలు చేసిన తర్వాత మీరు "మై ఫాస్ట్ ట్యాగ్" మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లో మీ వివరాలు, ఫాస్టాగ్ వివరాలు సమర్పించిన తర్వాత ఆక్టివేట్ చేసుకోవచ్చు. ఆర్సి లేకుండా ఫాస్టాగ్ తీసుకోవచ్చా? ఆర్సి లేకుండా ఫాస్టాగ్ తీసుకోలేము. ఆర్సి అనగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఫాస్టాగ్ తిసుకోవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉండాలి. ఫాస్ట్ ట్యాగ్ బదిలీ చేయవచ్చా? మీ వాహనం యొక్క ఫాస్టాగ్ మరెవరికీ బదిలీ చేయకూడదు. మీరు వాహనాన్ని విక్రయిస్తుంటే మీ వాహనం యొక్క ఫాస్టాగ్ ఖాతాను నిలిపివేయాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ను ఎలా రీఛార్జ్ చేసుకోవాలి? ఫాస్టాగ్ డిజిటల్ వాలెట్ ను క్రెడిట్, డెబిట్ కార్డులు లేదా యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలతో రీచార్జ్ చేసుకోవచ్చు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్‌పే వంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లా ద్వారా కూడా ఫాస్టాగ్ వాలెట్ ను రీచార్జి చేసుకోవచ్చు. ఫాస్టాగ్ చెల్లింపుల నుంచి ఎవరికి మినహాయింపు? న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, ఎమర్జెన్సీ సర్వీస్ వర్కర్స్ ఫాస్టాగ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. వీరికి ఫాస్టాగ్ చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది. -
నేషనల్ హైవే అధికారులు ఆదేశాలు జారీ
యాదాద్రి భువనగిరి, బీబీనగర్ : కరోనా వైరస్ నిరోదక చర్యల్లో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా గుండా మంగళవారం రాత్రినుంచి వాహనాలను ఉచితంగా వదులుతున్నారు. రుసుం తీసుకోవద్దంటూ నేషన్ హైవే అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక టోల్ అధికారులు పేర్కొన్నారు. దీంతో మంగళవారం నుంచి వా హనాలనుంచి రుసుం తీసుకోకుండా వదులు తున్నట్లు అధికారులు తెలిపారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు అన్ని టోల్‌ప్లాజాల గుండా వాహనాలను ఉచితంగా వదిలేలా నేషనల్ హైవే అధికారులు నేడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాహనాలు తగ్గుముఖం పట్టడం, ఫ్రీగా వదులుతుండడంతో టోల్ సిబ్బందిని ఇళ్లకు పంపించారు. కేవలం ఇరువైపులా రెండు బూత్‌లను మాత్రమే తెరిచి ఉంచగా మిగితా కౌంటర్లను మూసివేశారు. 23వ తేదీన 10,650 వాహనాలు వెళ్లగా, 24న 3,880, 25న 1,650వరకు వాహనాలు గూడూరు టోల్ గుండా వెళ్లాయి. వాహనాల రాకపోకల సంఖ్య తగ్గిపోతుండడంతో టోల్ రుసుంను మినహాయిస్తున్నట్లు తెలుస్తోంది. -
జమ్మూకశ్మీర్‌లో టోల్ ట్యాక్స్ రద్దు
జమ్మూ: జమ్మూ కశ్మీర్లో టోల్ రుసుమును రద్దు చేశారు. జమ్మూ– పఠాన్‌కోట్ రహదారిలోని లఖన్‌పూర్ పోస్ట్ సహా జమ్మూ కశ్మీర్‌లోని మొత్తం టోల్ పోస్ట్‌ల వద్ద రుసుముల వసూలును జనవరి 1వ తేదీ నుంచి నిలిపివేస్తున్నామని అభివృద్ధి, పర్యవేక్షణ విభాగాల ప్రిన్స్‌పల్ సెక్రటరీ రోహిత్ కన్సల్ మంగళవారం ప్రకటించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు సహా అన్ని టోల్ పోస్ట్‌ల్లో ట్యాక్స్ వసూలు చేయబోమన్నారు. దీనివల్ల ఖజానాకు ఏటా రూ. 1500 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇంటర్నెట్ సర్వీసుల పునరుద్ధరణ నాలుగున్నర నెలల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సర్వీసుల్ని పునరుద్ధరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో మంగళవారం అర్థరాత్రి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దుకు ఒక్క రోజు ముందు ఆగస్టు 4 నుంచి ఈ ప్రాంతంలో ఇంటర్నెట్, మొబైల్, ల్యాండ్‌లైన్ సేవలను యంత్రాంగం నిలిపివేసింది. మొబైల్ వినియోగదారులందరికీ ఎస్ఎంఎస్లు పంపే సదుపాయాన్ని పునరుద్ధరించినట్టుగా అ«ధికారులు తెలిపారు. 160 మంది ఉగ్రవాదులు హతం జమ్మూకశ్మీర్‌లో 2019లో 160 మంది ఉగ్రవాదులు బలగాల చేతుల్లో హతం కాగా 102 మందిని అరెస్టు చేశామని డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. లోయలో ఇప్పటికీ 250 మంది ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారని మంగళవారం వెల్లడించారు. -
భీమ్ యూపీఐతో ఫాస్టాగ్ రీచార్జ్
న్యూఢిల్లీ: నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్ఈటీసీ) ఫాస్టాగ్‌లను భీమ్ యూపీఐ ద్వారా కూడా రీచార్జ్ చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. దీనితో ఫాస్టాగ్ రీచార్జ్ ప్రక్రియ మరింత సులభతరం కాగలదని సంస్థ సీవోవో ప్రవీణ రాయ్ తెలిపారు. టోల్ చెల్లింపునకు సంబంధించి వాహనదారుల సమయం వృధా కాకుండా చూసేలా ‘ఫాస్టాగ్’ అమల్లోకి రావడం తెలిసిందే. ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ అకౌంటుకు అనుసంధానించే ఫాస్టాగ్ ట్యాగ్‌లను వాహనం విండ్‌స్క్రీన్‌పై అతికిస్తారు. టోల్‌ప్లాజాల్లో ఏర్పాటు చేసిన రీడర్లు వీటిని స్కాన్ చేశాక.. వాహనదారు ఖాతా నుంచి నిర్దేశిత టోల్ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. దీనివల్ల టోల్ ప్లాజాల్లో వాహనాల రద్దీ తగ్గడంతో పాటు వాహనదారుల సమయం కూడా ఆదా అవుతుంది. -
నేటి నుంచే ఫాస్టాగ్
-
‘ఫాస్ట్’గానే ప్రజల్లోకి..
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై టోల్గేట్ల వద్ద నగదు రహిత చెల్లింపుల్లో భాగంగా ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు వ్యవస్థపై వాహనదారుల్లో అవగాహన వేగంగా పెరుగుతోంది. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ వ్యవస్థలో భాగంగా వాహనాల ముందు అద్దానికి అమర్చే ఫాస్టాగ్‌ల విక్రయం ఒక్కసారిగా జోరందుకుంది. సరిగ్గా వారం క్రితం తెలంగాణలో కేవలం 3,500 ట్యాగ్లే అమ్మకం కాగా, ప్రస్తుతం వాటి సంఖ్య పదిన్నర వేలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఈ వారంలోనే ఎక్కువ ట్యాగ్లు అమ్ముడుపోవటం తో చాలా ప్రాంతాల్లో వాటికి కొరత ఏర్పడింది. కొన్నిచోట్ల ట్యాగ్లు అందుబాటులో లేవన్న సమాధానం వస్తుండటంతో వాహనదారులు బ్యాంకులు, టోల్‌ప్లాజాల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలో కూడా ఈ వారంలోనే ఏకంగా 7 వేల ట్యాగ్లు అమ్ముడు కావటంతో ఇక్కడా కొరత ఏర్పడే పరిస్థితి వచ్చేది. కానీ, నేషనల్ హైవే అథారిటీ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ ఒకేసారి పెద్ద మొత్తంలో ట్యాగ్‌లకు ఇండెంట్ పెట్టి తెప్పించారు. వాటి అమ్మకాలు పెరిగే సమయంలో అద నంగా 15వేల ట్యాగ్లు అందుబాటులోకి వచ్చా యి. దీంతో రాష్ట్రంలో వాటికి కొరత లేకుండా పోయింది. ప్రస్తుతం జాతీయ రహదారులపై 17 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల్లో ప్రతిచోటా.. ఒక్కోవైపు 5 చొప్పున 10 కౌంటర్లు ఏర్పాటుచేసి అమ్ముతున్నారు. బ్యాంకుల్లో నేరుగా విక్రయం, ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవటంతో పోలిస్తే.. టోల్‌ప్లాజాల్లోనే ఎక్కువగా అమ్మకం అవుతున్నాయి. అన్ని టోల్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు యంత్రపరికరాల ఏర్పాటు దాదాపు పూర్తయింది. 4టోల్ కేంద్రాల్లో పనులు తుదిదశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ‘సగమే వసూలు’ నిబంధనకు తూట్లు.. వాహనం టోల్‌ప్లాజా దాటేప్పుడు తిరుగు ప్రయాణానికీ ఒకేసారి టోల్ చెల్లించేవారుంటారు. వాహనం 24 గంటల్లోపు తిరిగొస్తే, రెండోసారి సగం రుసుమే చెల్లించాలి. ఈ నిబంధనపై అవగాహన లేక టోకెన్ పద్ధతి చెల్లింపు విధానంలో.. మొత్తం రుసుము చెల్లిస్తున్నారు. అవగాహన ఉన్నవారు ప్రశ్నించి మరీ సగమే చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఫాస్టాగ్ విధానం పూర్తిగా ఆటోమేటిక్ చెల్లింపు వ్యవస్థే అయినందున ఆ సమస్య ఉత్పన్నం కాకూడదు. అయితే కొన్ని సంస్థలు, బ్యాంకులిచ్చే ట్యాగ్‌ల్లో లోపాల వల్ల పూర్తి మొత్తం కట్ అవుతోందంటూ లారీ యజమానుల సంఘం ఫిర్యాదు చేసింది. అలాంటి పరిస్థితి లేకుండా చూస్తామని, ఎక్కడైనా లోపం జరిగితే ఆ మొత్తాన్ని వాహనదారుడికి తిరిగి చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. నెల రోజులుగా ప్రయోగాత్మకంగా కొన్ని లేన్లకే ఇది పరిమితమై ఉన్నందున, పూర్తిస్థాయి వ్యవస్థ ఏర్పాటైతే ఇలాంటి లోపాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. పొగమంచుతో ఇబ్బందేనా..? చలికాలంలో ఉదయం, సాయంత్రం వేళ పొగమంచు కురుస్తుంటుంది. దాని తీవ్రత ఎక్కువగా ఉంటే ఫాస్టాగ్‌ల నుంచి టోల్ మినహాయింపు ప్రక్రియ మందగించే పరిస్థితి ఉండనుంది. దీనికి సంబంధించి ఎన్హెచ్ఏఐ అధికారులకు కొన్ని ఫిర్యాదులం దాయి. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, సెన్సార్లకు అడ్డుగా వచ్చి ట్యాగ్‌ను వేగంగా రీడ్ చేయలేదని తెలుస్తోంది. దీని వల్ల రుసుమును మినహాయించుకోవటంలో జాప్యం జరిగే పరిస్థితి ఉంటుందని సమాచారం. అయితే రాష్ట్రంలో ఆ సమస్య ఉత్పన్నం కాదని ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ పేర్కొంటున్నారు. ఉత్తర భారతదేశంలో పొగమంచు దట్టంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో సమస్య ఉత్పన్నమయ్యేందుకు అవకాశం ఉండొచ్చన్నారు. -
ఫాస్ట్‌ట్యాగ్ అమలుతో ఇక నేరుగా వెళ్లొచ్చు!
సాక్షి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జాతీయ రహదారి దాదాపు 185 కిలోమీటర్ల మేర ఉంది. జిల్లాలో టోల్‌ప్లాజా నుంచి ప్రతి రోజు 7వేల కార్లు, 4వేల లారీలు, 2వేల బస్సులు, 5వేల భారీ వాహనాలు, 3వేల ఇతర వరకు వెళ్తుంటాయి. హైదరాబాద్ నుంచి కర్నూల్, కడప, అనంతపూర్, బెంగుళూర్ ప్రాంతాలకు వెళ్లే వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కారణంగా జాతీయ రహదారిపై తరచూ ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. ఏదైన పండగలు, పలు సందర్భాల్లో రోడ్లపై ఉన్న టోల్ ప్లాజ్ల దగ్గర గంటల తరబడి వాహనాలు నిలిచిపోతుంటాయి. అత్యవసరంగా ఆస్పత్రులకు వెళ్లే వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని టోల్ గేట్ల దగ్గర కొత్త విధానానికి శ్రీకారం చూట్టారు. నేరుగా వాహనం వెళ్లిపోయేలా వెసులుబాటు కల్పించారు. డిసెంబర్ 1నుంచి అమలు ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని వచ్చేనెల 1వ తేదీనుంచి అమల్లోకి తెస్తున్నారు. దీనివల్ల టోల్‌ప్లాజా వద్ద వాహనదారులు ఇక ఆగాల్సిన అవసరం లేదు. పెరిగిన వాహనాల రద్దీ, ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి ఫాస్ట్ ట్యాగ్ సేవలు అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణం చేసే వాహనదారులు ముందే సిమ్ట్యాగ్ తీసుకొని వాటిలో ముందే నగదు వేసుకొని వాహనం ముందు భాగంలో స్టిక్కర్లు అతికించుకోవాలి. ఆ స్టికర్లను టోల్‌ప్లాజా దగ్గర ఉన్న స్కానర్లు వాటిని స్కాన్ చేసిన క్షణంలో ఖాతా నుంచి నగదు సంబంధిత టోల్‌ప్లాజా ఖాతాలోకి వెళ్తుంది. డిసెంబర్ 1 నుంచి ఒక బ్లాక్‌లో దీనిని ప్రయోగత్మకంగా పరిశీలన చేయనున్నారు. సమయం ఆదా.. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో అడ్డాకుల, బాలానగర్ దగ్గర రెండు టోల్‌ప్లాజాలు ఉన్నా యి. దీంట్లో ఒక వాహనం టోల్‌ప్లాజాను దాటడానికి కనీసం పది నిమిషాలు పడుతోంది. ఇక పండుగ, రద్దీ సమయాల్లో అయితే ఆర గంట నుంచి గంటకుపైగా అక్కడే రోడ్డుపై నిరీక్షించాల్సి వస్తోంది. అదేవిధంగా టోల్ రుసుము నగదు రూపంలో చెల్లిస్తుండటంతో సింగిల్‌కు ఒక విధానం డబుల్‌కు మరో విధానం ఉండటం వల్ల సరిపడ చిల్లర లేక మరింత అలస్యం అవుతుంది. ఈ సమస్యను నివారించేందుకు ఎన్హెచ్ఏఐ అధికారులు చర్యలు చేపట్టారు. డిసెంబర్ 1నుంచి ఆన్లైన్ చెల్లింపులకు శ్రీకారం చూడుతున్నారు. అప్పటి నుంచి పూ ర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని టోల్‌ప్లాజా యాజమాన్యాలకు కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆరు బ్యాంకుల్లో అవకాశం ఫాస్ట్‌ట్యాగ్ సిమ్‌కార్డును తీసుకోవడానికి ఆరు ప్రధాన బ్యాంకుల్లో అవకాశం కల్పించారు. జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా నిర్వహకులు ఒక్కొక్కరు ఒక్కోక్క విధానాలు అమలు చేస్తున్నారు. దీంతో వారికి అనుబంధంగా ఉన్న ఆరు బ్యాంకుల్లో ఏదో ఒక దాంట్లో నుంచి ఫాస్ట్‌ట్యాగ్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ముందుగానే కొంత నగదు వేయాల్సి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత జాతీయ రహదారిపై ప్రయాణం చేసే సమయంలో ఆ ఖాతా నుంచి కొంత నగదు కట్ అవుతున్న క్రమంలో మళ్లి వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మొదట కొంత ఇబ్బంది ఉన్న తర్వాత సులువు కానుంది. టోల్‌ప్లాజా దగ్గర చిల్లర కోసం ఇతర కారణాల వల్ల గంటల కొద్ది ట్రాఫిక్‌లో ఇరుకుపోయే కంటే ఇది చాలా సువులుగా ఉంటుంది. ఈ పద్ధతి వల్ల వచ్చిన ప్రతి వాహనం సెకెండ్లలో టోల్‌గేట్‌ను దాటివెళ్తోంది. దీంతో సమస్యలు ఉత్పన్నం కావు. ఆన్లైన్ చెల్లింపులు ఇలా.. ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్‌ను వాహనం ముందు భా గంలో అద్దంపై అతికించాలి. గేటు వద్దకు వా హనం రాగానే ఈటీసీ కెమెరాలు స్కాన్ చేస్తా యి. దీంతో గేటు ఆటోమెటిక్‌గా ఓపెన్ అవుతా యి. అడ్డాకుల, రాయికల్ టోల్‌ప్లాజా దగ్గర డి సెంబర్ 1నుంచి అమల్లోకి తెస్తారు. ఫాస్ట్‌ట్యాగ్ అమల్లో భాగంగా జాతీయ రహదారుల సంస్థ మై ఫాస్ట్ ట్యాగ్, ఫాస్ట్‌ట్యాగ్ పా ర్టనర్ యాప్‌లను అందుబాటులోకి తీ సుకొచ్చింది. వాహనదారులు తమ బ్యాంకు ఖాతాలో ఈ యాప్‌ను అనుసంధానం చేసుకొని నిర్ణీత సొమ్మును చెల్లించాలి. ఆ వివరాలు ఎంపిక చేసిన బ్యాంకుల్లో లేదా టోల్‌ప్లాజా ఇస్తే ఫాస్ట్‌ట్యాగ్‌తో కూడిన ఒక ఫ్రీపెయిడ్ స్టిక్కర్ ఇస్తారు. ఇకపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తవు ఫాస్ట్‌ట్యాగ్ విధానంతో టోల్‌ప్లాజా దగ్గర ట్రాఫిక్ జాం కాదు. దీంతో పాటు నగదు రహిత సేవలు కూడా అమల్లోకి వస్తాయి. ఇంధనం, సమయం, పొల్యూషన్ చాలా వరకు ఆదా చేయవచ్చు. ఈ విధానం తీసుకురావడం వల్ల వాహనదారులకు ఎంతో మేలు జరుగుతుంది. – శ్రీనివాస్‌రెడ్డి, ఎంవీఐ, మహబూబ్‌నగర్ -
సామాన్యుల నుంచే ‘టోల్’ తీస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: రహదారులపై టోల్ ట్యాక్స్ వసూళ్ల నుంచి మినహాయింపు పొందిన వీఐపీలు, వీవీఐపీల వివరాలు అందజేయాలని ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేసిన పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజు వసూలు చేయొద్దంటూ సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది డి.విద్యాసాగర్, ఇతరులు దాఖలు చేసిన పిల్‌ను శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. వీవీఐపీల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడం లేదని, సామాన్యుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని పిటిషనర్ న్యాయవాది శశికిరణ్ పేర్కొన్నారు. ఎవరెవరికి మినహాయింపు ఇచ్చారో పూర్తి వివరాలు సమర్పించాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది. విచారణను ధర్మాసనం నాలుగు వారాలు వాయిదా వేసింది. -
డిసెంబర్1 నుంచి అన్నీ ‘ఫాస్టాగ్’ లేన్లే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న టోల్‌ప్లాజాల్లోని అన్ని లేన్లనూ డిసెంబర్ 1 నుంచి ‘ఫాస్టాగ్’ లేన్లుగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత నుంచి ‘ఫాస్టాగ్’ లేని వాహనాలు ఏవైనా ఫాస్టాగ్ లేన్లలోకి వచ్చి, నగదు లేదా ఇతర పద్ధతుల్లో టోల్ ఫీజు చెల్లిస్తే సాధారణం కన్నా వంద శాతం అదనంగా టోల్ ఫీజు వసూలు చేస్తామని తెలిపింది. డిసెంబర్ 1 తర్వాత కూడా అన్ని టోల్ ప్లాజాల దగ్గరా ఒక్క హైబ్రిడ్ లేన్ మాత్రం ఉంటుందనీ, భారీ వాహనాలు, లేదా సాధారణం కన్నా వేరైన ఆకారంలో ఉన్న వాహనాలను పంపడానికి అవి ఉపయోగపడతాయనీ, ఆ ఒక్క లైన్లో మాత్రమే ఫాస్టాగ్‌తోపాటు ఇతర పద్ధతుల్లో టోల్ ఫీజు చెల్లించినా సాధారణ రుసుమే వసూలు చేస్తామని రోడ్డు రవాణా, రహదారుల శాఖ వెల్లడించింది. వాహనదారులు టోల్ ఫీజుల కోసం కొంత మొత్తాన్ని ముందుగానే తమ ఫాస్టాగ్ ఖాతాల్లో జమచేసుకోవాల్సి ఉంటుంది. టోల్ గేట్ వద్దకు వాహనం రాగానే, ఫాస్టాగ్ ఆధారంగా ఖాతా నుంచి టోల్ ఫీజు చెల్లింపు దానంతట అదే పూర్తవుతుంది. ఈ పద్ధతిలో వాహనాలు టోల్ గేట్ల వద్ద చాలా స్వల్ప కాలం పాటు మాత్రమే ఆగుతాయి కాబట్టి టోల్ గేట్ల వద్ద ఎక్కువ రద్దీ ఉండదు. నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ లేని వాహనాలు ఫాస్టాగ్ లేన్లలోకి రాకూడదు. కానీ ప్రస్తుతం ఈ నిబంధన అమలవ్వక, ఫాస్టాగ్ లేన్లలోనూ వాహనదారులు నగదు లేదా ఇతర పద్ధతుల్లో టోల్ ఫీజు చెల్లిస్తుండటంతో ఫాస్టాగ్ ఉన్న వాహనాలకూ ప్రయాణం ఆలస్యమవుతోంది. -
మంచి రోడ్లు కావాలంటే టోల్ ఫీజు కట్టాల్సిందే
న్యూఢిల్లీ: నాణ్యమైన రోడ్లు కావాలనుకుంటే టోల్ ఫీజు చెల్లించక తప్పదని రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం లోక్‌సభలో అన్నారు. రోడ్ల నిర్వహణకు అవసరమైన నిధులు ప్రభుత్వం వద్ద లేవన్నారు. గత అయిదేళ్లలో 40 వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. టోల్ వద్ద వసూలు చేసే డబ్బు పల్లెల్లో, పర్వత ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడానికి ఉపయోగపడతాయన్నారు. రోడ్ల విస్తరణకు భూసేకరణ దగ్గరే అసలైన సమస్య ఎదురవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అధిగమించడానికి కొత్త ప్రణాళికలు రచించాలన్నారు. పశ్చిమ బెంగాల్, బిహార్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు. వేగంగా రోడ్లను నిర్మించడం ద్వారా మోదీ ప్రభుత్వం రూ. 3 లక్షల కోట్ల విలువైన ఎన్పీఏలను ఆదా చేసిందన్నారు. ఢిల్లీ నుంచి ముంబైకి 12 గంటల్లో చేరుకునేలా రహదారి నిర్మించనున్నామన్నారు. రహదారి పొడవునా పచ్చదనాన్ని పెంచుతామన్నారు. రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్రలోని పలు గిరిజన, వెనుకబడిన ప్రాంతాల మీదుగా ఈ దారిని నిర్మిస్తామన్నారు. భూసేకరణలో ఈ మార్గం ద్వారా రూ. 16 వేల కోట్లను ఆదా చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలలు, రాష్ట్ర బస్సు సర్వీసులకు టోల్ ఫీజు మినహాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దేశానికి 25 లక్షల మంది డ్రైవర్ల అవసరం ఉందని, త్వరలో ప్రతి రాష్ట్రంలో ఓ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి యూరో 6 ఉద్గార నిబంధనలు అమల్లోకి వస్తాయని, దీంతో కాలుష్యం తగ్గుతుందన్నారు. -
కోతి ఎంత పని చేసింది.. వీడియో వైరల్
సాక్షి, కాన్పూర్ : కాన్పూర్‌లోని ఒక టోల్ బూత్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. టోల్‌బూత్‌లోకి చొరబడిన ఒక కోతి అక్కడున్నగల్లా పెట్టెలోని డబ్బులను చాలా ఒడుపుగా లాక్కుపోయింది. ఏప్రిల్ 25న కాన్పూర్ డిహత్ ప్రాంతంలోని బారా టోల్ ప్లాజాలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో వీడియో వైరల్ అవుతోంది. సీసీటీవీ ఫుటేజిలోని వీడియో ప్రకారం.. టోల్ బూత్ వద్ద ఒక తెల్ల కారు ఆగింది. ఒక కోతి దాని నుండి దూకి.. విండోంలోంచి బూత్‌లోకి ప్రవేశించింది. అక్కడున్న ఉద్యోగి భుజం మీద నుంచి దర్జాగా నేరుగా క్యాష్ బ్యాక్స్‌లో ఉన్న నగదును లాక్కుని ఉడాయించింది. ఏం జరుగుతోందో అక్కడున్న అపరేటర్కి అర్థమయ్యేలోపే క్షణాల్లో ఇదంతా జరిగిపోయింది. దీనిపై టోల్ మేనేజ్మెంట్ సీనియర్ అధికారి మనోజ్ శర్మ మాట్లాడుతూ.. కోతి ఎత్తుకెళ్లిన సొమ్ము మొత్తం 5 వేల రూపాయలని చెప్పారు. ఈ విషయంలో కోతికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వుంటారని అభిప్రాయపడ్డారు. గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందన్నారు. తాజా ఘటనపై ఫిర్యాదు నమోదు చేశామని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని శర్మ చెప్పారు. మరోవైపు ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని కారు డ్రైవర్ వాదిస్తున్నారు. -
కోతి ఎంత పనిచేసింది.. వీడియో వైరల్..
-
రద్దీ పెరిగితే.. ‘టోల్’ ఫ్రీ
సాక్షి, హైదరాబాద్: నిత్యం లక్షన్నరకుపైగా వాహనాల రాకపోకలు సాగించే ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) మార్గంలో ట్రాఫిక్ వెతలు లేని సాఫీ ప్రయాణంపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) దృష్టి సారించింది. ఇప్పటికే ఫాస్ట్‌టాగ్ సేవలను అమలు చేస్తున్న అధికారులు మరో కొత్త విధానాన్ని ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయనున్నారు. ఒక లేన్‌పై ఏ సమయంలోనైనా 20కి మించి వాహనాలుంటే టోల్ రుసుము తీసుకోకుండానే క్లియర్ చేయాలని శుక్రవారం నుంచి టోల్ రుసుము వసూలు బాధ్యతలు చేపట్టనున్న ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్‌ను ఆదేశించింది. దీంతోపాటు నానక్‌రామ్‌గూడ, శంషాబాద్ టోల్ ప్లాజాలోని లేన్ల సంఖ్యను పెంచి వాహనదారుల ప్రయాణాలకు ఇబ్బంది కలగకుండా ఉండే చర్యలను చేపట్టింది. అలాగే టోల్‌ప్లాజాల పరిసరాల పరిశుభ్రత, భద్రతా చర్యలపై దృష్టి సారించింది. రోజుకు లక్షన్నర వాహనాల రాకపోకలు... హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలతోపాటు విజయవాడ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లావాసులు నగరంలోకి వచ్చేందుకు ఓఆర్ఆర్ మార్గాన్ని వినియోగించుకుంటున్నారని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఓఆర్ఆర్ అందుబాటులోకి రావడంతో వాహన చోదకుల ప్రయాణం మరింత సులభమైందని అంటున్నారు. ఎనిమిది లేన్ల ఓఆర్ఆర్లో 19 యాక్సెస్ పాయింట్లు ఉన్నాయి. రెండు లేన్లతో సర్వీసు రోడ్లను కూడా అభివృద్ధి చేశారు. అయితే ఓఆర్ఆర్ మార్గంలో ముఖ్యంగా నానక్‌రామ్‌గూడ, శంషాబాద్ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు ఎక్కువగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆ టోల్‌ప్లాజాలో లేన్ల సంఖ్యను పెంచాలని ఓఆర్ఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పాత సంస్థ ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ వాహనదారులకు జారీ చేసిన నెలవారీ పాసులను సమర్పించి కొత్త ఏజెన్సీ ఈగల్ ఇన్ఫ్రా ద్వారా జారీ చేసే పాసులను తీసుకోవాలని వాహనదారులకు సూచిస్తున్నారు. ఈజీ జర్నీ కోసం ఫాస్ట్‌టాగ్ సేవలు వినియోగించుకునేలా వాహనదారుల్లో అవగాహన కలిగిస్తామని ఓఆర్ఆర్ సీజీఎం ఇమామ్ తెలిపారు. -
పోలీసుల తనిఖీల్లో రూ.కోటి స్వాధీనం
పశ్చిమగోదావరి, టంగుటూరు: టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద జరిపిన వాహనాల తనిఖీల్లో షిఫ్ట్ కారు నుంచి కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డీఎస్పీ రాథేష్ మురళి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి వాహనాల తనిఖీల్లో పట్టుపడిన నగదు గురించి విలేకరుల సమావేశంలో వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూర్ కు చెందిన జయదేవ్ జ్యూయలరీలో పనిచేస్తున్న ఆనందరావు, రాజేష్‌లు తమ యజమాని ఆదేశాల ప్రకారం మొదట విజయవాడలో భరత్ అనే వ్యక్తి వద్ద కోటి రూపాయల నగదు తీసుకుని చెన్నై వెళ్లి అక్కడ బంగారం కోనుగోలు చేయాల్సి ఉంది. అయితే మార్గంమధ్యలో షాపు యజమాని ఫోన్ చేసి భరత్ వద్ద తీసుకున్న నగదును నెల్లూరు లోని భాస్కర్ అనే వ్యక్తికి ఇవ్వమని ఆదేశించాడు. ఈలోగా భాస్కర్ కూడా షాపు సిబ్బందికి ఫోన్ చేసి నెల్లూరు లో సింహపురి హోటల్ వద్దకు రాగానే తనకు సమాచారం అందించాలని తాను అక్కడికి వచ్చి డబ్బు తీసుకుంటానని తెలిపాడు. అయితే అజ్ఞాతవ్యక్తి ఫోన్ చేసి కారులో రవాణా చేయకూడనిది ఏదో చేస్తున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వెంటనే టంగుటూరు ఎస్ఐ సీహెచ్ హజరత్తయ్యను అప్రమత్తం చేసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆ తనిఖీలో కోటి రూపాయలు నగదు దొరికిందని డీఎస్పీ తెలిపారు. ఆ కారు డిక్కీలో సీక్రెట్ గా ఏర్పాటు చేసిన లాకర్లో ఈ డబ్బును తరలిస్తున్నారని తమ సిబ్బంది ఈ కారును క్షుణ్ణంగా పరిశీలించడంతో లాకర్‌ను గుర్తించారని వివరించారు. ఈ నగదు ఇన్‌కంటాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ ప్రభాకర్, జరుగుమల్లి ఎస్ఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ శ్రీను, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
పెరుగుతున్న ప్రయాణ కష్టాలు
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజల ముఖ్య పండుగ సంక్రాంతికి గత రెండ్రోజుల నుంచి ప్రయాణ కష్టాలు రెట్టింపవుతున్నాయి. రద్దీకి తగ్గట్లు ఆర్టీసీ, రైల్వే శాఖలు బస్సులు, రైళ్లు నడపకపోవడంతో సొంతూళ్లకు వెళ్లే వారిలో పండుగ ఉత్సాహం నీరుగారిపోతోంది. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు నిల్చొని పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికుల వెతలు సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు ఏ మూలకూ సరిపోవడం లేదు. 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తూ విజయవాడ సిటీలో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లను సుదూర ప్రాంతాలైన రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నంలకు తిప్పుతున్నారు. వీటిలో సూపర్ లగ్జరీ బస్సుల్లో వసూలు చేసే చార్జీలను వసూలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికోమారు వచ్చే పండుగకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు ఇవేనా? అంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. రెగ్యులర్ సర్వీసుల్ని నిలిపేసి ఆదాయం కోసం ప్రత్యేక బస్సులను తిప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బస్టాండ్లలో రిజర్వేషన్ కౌంటర్ల ముందు భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ఆదివారం ఏలూరు, ఒంగోలు, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు నానాపాట్లు పడాల్సి వచ్చింది. వృద్ధులు, పిల్లలతో కలిసి సొంతూరికి వెళ్లే వారికి సీటు కోసం కష్టాలు తప్పలేదు. రద్దీకి తగ్గట్లు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడం లేదు. 15 నుంచి 20 కిలోమీటర్లు తిరిగే బస్సులను 200 కిలోమీటర్ల ప్రయాణానికి వినియోగిస్తూ రూ.200 నుంచి రూ.250 వరకు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు కేవలం దూర ప్రాంత సర్వీసులపై దృష్టి కేంద్రీకరించారే తప్ప సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల్ని పట్టించుకోకపోవడంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతమయ్యాయి. రైళ్లలో నిల్చొనేందుకు జాగా లేకపోవడంతో ప్రయాణం నరకంగా మారిందని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. ఈ ప్రయాణ కష్టాలు ఈనెల 21 వరకు తప్పేలా లేవని ఆర్టీసీ వర్గాలు చెప్పడం గమనార్హం. రహదార్లపై తగ్గని రద్దీ హైదరాబాద్–విజయవాడ, విజయవాడ–చెన్నై జాతీయ రహదార్లపై ఆదివారం రద్దీ తగ్గలేదు. టోల్గేట్ల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. టోల్ రుసుం రద్దు చేశామని ప్రభుత్వం ప్రకటించినా.. తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వాహనదారులతో నిర్వాహకులు చెబుతున్నారు. కనీసం అదనపు కౌంటర్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. జన్ సాధారణ్ రైళ్లను ప్రకటించిన రైల్వే శాఖ పండుగ రద్దీ దృష్ట్యా ఏడు జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. సాధారణ రైలు చార్జీలతో ఈ రైళ్లలోని ఏ బోగీలో అయినా కూర్చుని ప్రయాణించవచ్చు. ఈ రైళ్లలో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రూ.130, విజయవాడ నుంచి హైదరాబాద్ కు రూ.135, కాకినాడ నుంచి తిరుపతికి రూ.175, విజయనగరం, విజయవాడ మధ్య ప్రయాణానికి రూ.145 టికెట్ ధరను నిర్ణయించినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. దండుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు సంక్రాంతి రద్దీ ప్రైవేటు ఆపరేటర్లకు వరంగా మారింది. విజయవాడ నుంచి ఏలూరుకు సాధారణ రోజుల్లో కారులో వెళితే రూ.70 వసూలు చేస్తారు. ఇప్పుడు రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. అదేమంటే ఇష్టమైతే రండి..లేకుంటే పొండి.. అని ప్రైవేటు ఆపరేటర్లు చెబుతున్నారని, చేసేదేమీ లేక అడిగినంత ఇవ్వాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. -
ఓఆర్ఆర్పై టోల్ వసూలు ఉండదు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న ‘ప్రగతి నివేదన సభ’కు పోటెత్తనున్న వాహనాలకు టోల్ వసూళ్ల ప్రక్రియతో ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ గండం పొంచి ఉందని ‘టోల్’ఫికర్ శీర్షికతో బుధవారం ప్రచురిత కథనంపై కదలిక వచ్చింది. సెప్టెంబర్ 2న ఉదయం 9 నుంచి అర్ధరాత్రి 12 వరకు ఓఆర్ఆర్పై టోల్ వసూలు చేయమని హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆ రోజు టోల్ వసూలు చేయకపోవడం వల్ల జరిగే ఆర్థిక నష్టాన్ని టీఆర్ఎస్ చెల్లించాలని పేర్కొన్నారు. లక్షలాది వాహనాలు వస్తుండటంతో సెప్టెంబర్ 2న టోల్ వసూలు చేయవద్దని టీఆర్ఎస్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన దరఖాస్తును పరిశీలించిన కమిషనర్ షరతులతో కూడిన అనుమతులిచ్చారు. కొంగర కలాన్, రావిర్యాల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం గ్రామాలకు వెళ్లేందుకు ఓఆర్ఆర్పై మార్గాల మధ్య మరిన్ని ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని దరఖాస్తులో పేర్కొన్న అంశంపై సమాధానమిస్తూ తాత్కాలిక ఎగ్జిట్ ప్రాంతాలను ముందుగా హెచ్ఎండీఏ అధికారులు పరిశీలించి నియమిత సంఖ్యలోనే అనుమతించాలని ఆదేశించారు. ట్రాక్టర్లు, ట్రాలీలు, నెమ్మదిగా వెళ్లే ఇతర వాహనాలను ఓఆర్ఆర్పై అనుమతించబోమని, అవి సర్వీసు రోడ్డు మీదుగానే వెళ్లాలని నిబంధన విధించారు. -
మళ్లీ ‘టోలు’తీత!
సాక్షి, అమరావతి: వాహనదారుల ‘టోలు’ తీసేందుకు మరోసారి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ ఆరంభం నుంచే టోల్ ఛార్జీలు పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. టోల్ ఛార్జీల పెంపు ప్రభావం రవాణా రంగంపైనే కాకుండా ప్రజా రవాణా వ్యవస్థపైనా తీవ్రంగా పడనుంది. టోల్ ఫీజులు భరించలేనంతగా ఉన్నాయని లారీ యజమానుల సంఘం ఇటీవలే వారం రోజుల పాటు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 30 టోల్ గేట్లు ప్రస్తుతం కార్లు, బస్సులు, ట్రక్కులు, మల్టీ యాక్సిల్ వాహనాలకు వసూలు చేస్తున్న ఫీజులకు అదనంగా పది శాతం వరకు టోల్ రుసుము పెంచనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో 30 వరకు టోల్ గేట్లున్నాయి. ఒక్కో చోట ఒక్కో రకంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అధికార పార్టీ నేతల అండతో అనధికారికంగా దోపిడీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా కీసర, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు వద్ద టోల్గేట్లలో నిర్దేశిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేయడంపై లారీ యజమానులు నిరసనలకు దిగారు. అనంతపురం జిల్లా పరిధిలోని టోల్గేట్లలో అధికార పార్టీ నేతల అండతో వాహనదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇష్టానుసారంగా ఫీజుల పెంపు టోల్గేట్ కాంట్రాక్టుదారులు ఇష్టానుసారంగా ఫీజులు పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ సహకరిస్తోందని రవాణా రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. టోల్ నిర్వాహకుల లాబీయింగ్‌తో తరచూ ఫీజులు పెంచడం పరిపాటిగా మారిందని, ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు టోల్ ఫీజులు సవరించారని లారీ యజమానుల సంఘం పేర్కొంది. అధ్వానంగా రహదారుల నిర్వహణ అధ్వాన్నంగా ఉన్న జాతీయ రహదారుల్లో వాహనదారుల నుంచి టోల్ ఫీజులు వసూలు చేయకూడదు. అయితే జాతీయ రహదారుల అథారిటీ మాత్రం విజయవాడ – విశాఖపట్టణం ఎన్‌హెచ్–16 దారుణంగా ఉన్నా వాహనదారుల నుంచి ముక్కు పిండి టోల్ వసూలు చేస్తోంది. విజయవాడ–గుంటూరు జాతీయ రహదారిని ఆరు వరుసలుగా మార్చినా నిర్వహణ సరిగా లేదు. వర్షం కురిస్తే రోడ్డుపైనే నీరు నిలుస్తూ ఇబ్బందికరంగా మారింది. నేషనల్ పర్మిట్ల మాదిరిగా ఇవ్వాలని వినతి.. దేశవ్యాప్తంగా టోల్గేట్ల ద్వారా ఏటా రూ.16 వేల కోట్ల ఆదాయం సమకూరుతున్నట్లు ఎన్హెచ్ఏఐ చెబుతోంది. అయితే లారీలకు నేషనల్ పర్మిట్ల మాదిరిగా దేశవ్యాప్తంగా టోల్ నుంచి మినహాయిస్తే రూ.24 వేల కోట్లు ముందుగానే చెల్లిస్తామని, జాతీయ లారీ యజమానుల సంఘం ప్రతిపాదించినా ఇంతవరకూ సానుకూల స్పందన రాలేదు. -
ఇక టోలు తీస్తారు
సాక్షి ప్రతినిధి, చెన్నై: జాతీయ రహదారుల్లోని టోల్గేట్ల మీదుగా పయనించే అన్నిరకాల వాహనాలకు రుసుమును వసూలు చేసే ప్రక్రియ ఎంతోకాలంగా సాగుతోంది. ఏ కేటగిరి వాహనాలకు ఎంత వసూలు చేయాలో జాతీయరహదారుల శాఖే నిర్ణయిస్తోంది. టోల్గేట్లో చార్జీల వసూళ్లకు ప్రభుత్వం టెండర్లు పిలిచి ఎంపిక చేస్తుంది. ఈ కారణంగా ఒక్కో టోల్గేట్లో ఒక్కో చార్జీని వసూలు చేస్తున్నారు. టోల్గేట్ చార్జీల వసూళ్లలో పేరొందిన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటిగా నిలిచి ఉంది. ఈ దశలో రాష్ట్రంలోని దక్షిణ, పశ్చిమ జిల్లాల వైపు వెళ్లే జాతీయ రహదారుల్లోని 14 టోల్గేట్ల చార్జీలను పదిశాతం పెంచాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వస్తాయని అధికారులు చెప్పారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కేంద్రం త్వరలో విడుదల చేస్తుందని అన్నారు. సేలం–ఉళుందూరుపేట–మేట్టుపట్టి– దిండివనం–నల్లూరు, చెన్నై–తిరుచ్చిరాపల్లి–దిండుగల్లు, నత్తకరై,–వీరచోళపురం–విక్కిరవాండి–తడ (ఆంధ్రప్రదేశ్)–పొన్నంబళ్పట్టిలలోని 14 టోల్గేట్లలో పెరిగిన చార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపారు. కార్లకు పదిశాతం, బస్సులు, లారీలకు 4 నుంచి 6 శాతం వరకు పెరుగుతుందని చెప్పారు. వసూళ్లేగానీ వసతులేవీ: టోల్గేట్ల ద్వారా ముక్కుపిండి వసూళ్లు చేయడమేగానీ, అందుకు తగినట్లుగా వసతులులేవని టోల్‌గేటు చార్జీల పెంపుపై వాహన యజమానులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. వారు మాట్లాడుతూ, రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్, పెట్రోలు ధరలతో ఎంతో బాధపడుతున్నాం, ఇపుడు టోల్గేట్ చార్జీలు కూడా పెంచడం వల్ల మోయలేని భారం పడుతుందని అన్నారు. ఈ ఏడాది మార్చిలో చెన్నై, చెన్నై శివార్లలోని 6 టోల్గేట్లు సహా మొత్తం 20 టోల్గేట్ల చార్జీలను పెంచారని తెలిపారు. రెండేళ్లలో తమిళనాడులో టోల్గేట్ చార్జీలు 21 శాతం పెరిగాయని ఆయన అన్నారు. టోల్గేట్ ద్వారా వచ్చే వసూళ్లతో రహదారుల మరమ్మతులు, పర్యవేక్షణకు వినియోగిస్తామని అధికారులు చెబుతుంటారు, అయితే వాస్తవానికి అనేక రహదారులు పర్యవేక్షణ లోపంతో వాహనదారులను బాధిస్తున్నాయి. అధికా రులే హామీ ఇచ్చినట్లుగా రహదారుల్లోఅక్కడక్కడ టెలిఫోన్, తాగునీటి వసతి, ఫుడ్‌కోర్టులు లేవు. ముఖ్యంగా పారిశుధ్యమైన టాయిలెట్లు లేనికారణంగా బాహ్యప్రదేశంలోనే కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన దుస్థితిని వాహనదారులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. -
ఔటర్‌పై ‘స్మార్ట్’ రైడ్..!
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రయాణం మరింత స్మార్ట్ కానుంది. టోల్ వసూళ్లలో పారదర్శకత, ప్రయాణం సులభతరం చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సరికొత్త టెక్నాలజీతో ముందుకొస్తోంది. టోల్ ప్లాజాల వద్ద డబ్బులిచ్చే పద్ధతికి స్వస్తి పలికి ఏటీఎం కార్డును పోలి ఉండే ట్రాన్సిట్, టచ్ అండ్ గో కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం నుంచి 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్లోని 19 ఇంటర్‌చేంజ్‌ల వద్ద ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రారంభించింది. టోల్ గేట్ సిబ్బందికి కార్డుల విధానంపై అవగాహన రాగానే మరో 3 రోజుల్లో అమలులోకి తీసుకురానుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జారీ చేయనున్న ఈ కార్డులతో వాహనదారుల సమయం ఆదా కానుంది. కార్డుల కొనుగోలు, రీచార్జ్ కోసం ప్లాజా కార్యాలయాల వద్ద పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్)లను ఏర్పాటు చేశారు. నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేయనున్న ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ ద్వారా నిత్యం ఈ సేవలను పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం ఓఆర్ఆర్ చుట్టూ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్ కార్డుతో.. ప్రస్తుతం ఔటర్‌పైకి వాహనం ఎక్కే ముందు కంప్యూటర్లో వివరాలు నమోదు చేసి ఓ స్లిప్‌ను వాహనదారుడికి ఇస్తున్నారు. దిగే చోట (ఎగ్జిట్ పాయింట్) ఉన్న కౌంటర్లో ఆ స్లిప్ ఇస్తే ప్రయాణ దూరాన్ని లెక్కించి ఎంత చెల్లించాలో చెబుతున్నారు. దీంతో చార్జీల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఈ ఇబ్బందుల దృష్ట్యా టోల్ మేనేజ్మెంట్ సిస్టం (టీఎంఎస్)ను హెచ్ఎండీఏ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ప్రయోగాత్మకంగా స్మార్ట్ కార్డు విధానం ప్రవేశ పెట్టారు. ఈ విధానంలో ఔటర్‌పైకి వాహనం ఎక్కగానే క్షణం ఆలస్యం చేయకుండా స్మార్ట్ కార్డును సిబ్బంది ఇస్తారు. దిగే దగ్గర ఆ కార్డు ఇస్తే స్కాన్ చేసి ఎంత చెల్లించాలో సిబ్బంది చెబుతారు. బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ప్రత్యేక విధానంలో లోటుపాట్లను అధ్యయనం చేసి తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. రోజువచ్చే వాహనదారులకు కాకుండా అప్పుడప్పుడూ వచ్చేవారికి ఈ కార్డు ఎక్కువగా ఉపయోగపడుతుందని అంటున్నారు. టచ్ చేసి వెళ్లడమే... ఓఆర్ఆర్పై 19 టోల్‌ప్లాజాలు దాటుకొని వెళ్లాలంటే వాహనదారులకు చాలా సమయం పడుతోంది. ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువైనపుడు డబ్బులు తీసుకొని రశీదు ఇవ్వడమూ సిబ్బందికి భారమవుతోంది. కొంతమంది సిబ్బంది తమకు తెలిసిన వారి నుంచి డబ్బులు తీసుకోకుండా అవినీతికి పాల్పడుతున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వసూళ్లలో పారదర్శకత, సులభతర ప్రయాణం కోసం ‘టచ్ అండ్ గో’కార్డును పరిచయం చేస్తున్నారు. కారు, లారీలు.. ఇలా ఏ వాహనదారుడికైనా ప్రత్యేక రంగు, ఆ వాహనం గుర్తుతో కార్డులివ్వనున్నారు. ప్లాజాల వద్ద ఉండే స్క్రీన్కు ఆ కార్డు చూపించి వెళ్లాలి. ఆ సమయంలో కార్డులోని సొమ్మును ఆటోమేటిక్‌గా చెల్లించినట్లవుతుంది. ఓఆర్ఆర్పై 157 మాన్యువుల్, టంచ్ అండ్ గో లేన్స్ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు రూ.200లకు అందుబాటులోకి తీసుకురానున్న ఈ కార్డులో ప్లాజాలో వద్ద ఏర్పాటు చేసే పీవోసీలో రీచార్జ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో మొబైల్ రీచార్జ్ సేవలు కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఒక వాహనం కోసం తీసుకున్న కార్డు మరో వాహనానికి పనిచేయకుండా చూడాలని అధికారులు భావిస్తున్నారు. ‘యాంటీనా’తోనే క్లియరెన్స్... జాతీయ రహదారుల్లో ఉపయోగించే ఆర్ఎఫ్ఐడీ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) కార్డులు కూడా ఓఆర్ఆర్పై పని చేసేలా చర్యలు చేపట్టారు. ఈ కార్డులున్న వాహనాలను 23 లేన్లలోనే అనుమతించనున్నారు. ఈ లేన్‌లోకి వెళ్లే ముందు వాహనాన్ని అక్కడ ఏర్పాటు చేసిన తొలి యాంటీనా.. కార్డు సరైనదా కాదా స్క్రీన్ చేస్తుంది. లారీ కోసం రీచార్జ్ చేసుకుని కారుకు వాడాలనుకుంటే తిరస్కరిస్తుంది. అంతా ఓకే అనుకున్నాక తొలి గేట్ తెరుచుకుంటుంది. తర్వాత కారు ఎక్కడ ఏ టైంలో ఓఆర్ఆర్ ఎక్కిందని రికార్డు చేసుకుంటుంది. ఎగ్జిట్ టోల్ బూత్ నుంచి నిష్క్రమించగానే కార్డు నుంచి డబ్బులను ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఈ కార్డులను కూడా టోల్ ప్లాజాలో వద్ద ఏర్పాటు చేసే పీవోఎస్‌లో రీచార్జ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
టోపీ ఎందుకు పెట్టుకున్నారు?
ప్రస్తుతం పరమత ద్వేషానికి సంబంధించిన అంశాలకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటం మంచిది. దేశ ఔన్నత్యాన్ని పెంచే అనేక అంశాలను కథలుగా ప్రచారంలోకి తీసుకువెళ్లడం వల్ల పరమత సహనం అలవడుతుందని తన అనుభవాన్ని మేఘన అత్వానీ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఆ పోస్టింగ్‌ను వినూ మాథ్యూ ఫేస్బుక్లో గత వారం తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్ వైరల్ అవుతోంది. ఫేస్బుక్ పోస్టింగ్... ‘ముస్లిములు తల మీద టోపీ ఎందుకు పెట్టుకున్నారు?’ అని కుమార్తె అడిగిన ప్రశ్నకు ఆ తల్లి చెప్పిన చక్కని సమాధానం...నేను ఢిల్లీలో ఊబర్ పూల్‌లో ప్రయాణిస్తున్నాను. ఆ క్యాబ్‌లో అందరి కంటె ముందుగా నేనే ఎక్కాను. నా తరవాత ఒక యువతి తన చిన్న కుమార్తెతో క్యాబ్ ఎక్కారు. మరో కిలో మీటరు ప్రయాణించాక ఒక ముస్లిం యువకుడు క్యాబ్‌లో డ్రైవర్ పక్క సీటులో కూర్చున్నాడు. తల మీద సంప్రదాయ టోపీ ధరించాడు ఆ యువకుడు. అది చూసి ‘‘అమ్మా, ఈ అంకుల్ టోపీ ఎందుకు పెట్టుకున్నారు? బయట కూడా ఎండ లేదు కదా!’’ అని అడిగింది. అప్పటివరకు క్యాబ్‌లో ఎఫ్ ఎం రేడియో సన్నగా వినిపిస్తోంది. ఆ ముస్లిం యువకుడు డ్రైవర్‌తో పిచ్చాపాటీ మాట్లాడుతున్నాడు. నేను పుస్తక పఠనంలో మునిగిపోయాను. ఈ ప్రశ్న వినగానే ఒక్కసారిగా నా కళ్లు పుస్తకం నుంచి బయటకు వచ్చాయి. ముస్లిం యువకుడితో డ్రైవర్‌తో మాటలు ఆపేసి, రేడియో వాల్యూమ్ తగ్గించాడు. ఆ పాపకు నేను ఏదో సమాధానం చెప్పబోయాను. అప్పటికే సమాధానంతో సిద్ధంగా ఉన్న ఆ పాప తల్లి ‘‘నేను గుడికి వెళ్లినప్పుడు, మనింటికి పెద్దలు వచ్చినప్పుడు, తాతయ్య వాళ్ల కాళ్లకు నమస్కారం చేసేటప్పుడు తల మీద ముసుగు వేసుకుంటాను కదా! ఇతరుల పట్ల మనం చూపించే గౌరవానికి ప్రతీక’’ అని చెప్పింది తల్లి. ఆ మాటలు బాగానే అనిపించాయి. అంతలోనే మరో సందేహం కలిగి, ‘‘ఈ అంకుల్ ఎవరి పట్ల మర్యాద చూపిస్తున్నాడు. ఇక్కడ గుడి లేదు, అంకుల్ ఎవరి కాళ్లకి నమస్కారం పెట్టట్లేదు, పెద్దలు ఎవ్వరూ లేరు కదా’’ అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు కూడా తల్లి ఎంతో నెమ్మదిగా, ‘‘పెద్దలు కనపడగానే నమస్కారం చేయాలని నేను నీకు నేర్పించాను కదా, అదేవిధంగా అందరి పట్ల గౌరవంగా ఉండమని వాళ్ల పేరెంట్స్ నేర్పించారు అంకుల్‌కి. అంకుల్‌తో పాటు మనమందరం ఉన్నాం కదా’’ అంది తల్లి.ఇంతటి సంస్కారవంతమైన సమాధానం ఎవ్వరూ ఊహించలేదు. ఆ ముస్లిం యువకుడు కూడా ఇటువంటి సమాధానం వస్తుందని అనుకుని ఉండడు. క్యాబ్ ముందుగా నేను ఎక్కడం వల్ల నా డ్రాపింగ్ ముందే వచ్చింది. ఆ తల్లి చెప్పిన సమాధానం గురించి ఆలోచిస్తూ క్యాబ్ దిగేశాను. తోటి వారి గురించి ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆలోచించాలి. ప్రతి ఇంట్లోను పిల్లలకు తల్లిదండ్రుల ఈ విధంగా బోధించాలి. ఈ తరం పిల్లలకు ఇటువంటివి అలవడాలి అనుకున్నాను. (మేఘనా అత్వానీకి కృతజ్ఞతలతో) – రోహిణి ఆ షేర్ క్యాబ్‌లో తల్లికూతుళ్లు, మేఘన, ఒక ముస్లిం యువకుడు ప్రయాణిస్తున్నారు. ఆ యువకుడు తల మీద ధరించిన తెల్ల టోపీని చూసిన ఆ చిన్నారి తల్లితో, ‘‘సాయంత్రం వేళ ఈ అంకుల్ టోపీ ఎందుకు పెట్టుకున్నారు? ఎండగా కూడా లేదు కదా!’’ అని అడిగింది. ఆ చిన్నారి అమాయకంగా అడిగిన ప్రశ్నకు తల్లి చెప్పిన సమాధానం విన్నాక ఎంతో ఇన్‌స్పయిరింగ్‌గా, మానవత్వానికి ప్రతీకగా అనిపించింది. – వినూ మాథ్యూస్ ఒక్కో నీటి బిందువు కలిస్తేనే సముద్రం అయినట్లు, పరమత సహనం అలవర్చుకోవాలనే విత్తనాన్ని పిల్లలలో నాటితే, ఒకరి పట్ల ఒకరు గౌరవంగా ఉండాలనే ఆలోచన చిగుళ్లు వేసి మహావృక్షం అవుతుంది. పరమత సహనం అలవడుతుంది. దేశంలో పెద్ద పెద్ద మార్పులకు కారణం అవుతాయి. – మేఘన అత్వానీ -
టోల్‌ప్లాజా వద్ద తెలుగు తమ్ముళ్లు వీరంగం
-
తెలుగు తమ్ముళ్ల వీరంగం
కంచికచర్ల(కృష్ణా జిల్లా) : కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. పోలవరం యాత్రకు వెళ్తున్న బస్సులను టోల్ ప్లాజా సిబ్బంది ఆపడంతో తెలుగు దేశం కార్యకర్తలకు కోపం వచ్చింది. అధికార పార్టీకి చెందిన బస్సులనే ఆపుతారా అంటూ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేసి బండబూతులు తిట్టారు. టోల్‌బూతు అద్దాలు ధ్వంసం చేశారు. సిబ్బంది భయపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి కేసూ లేకుండా సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మ్యూజిక్ డైరెక్టర్ టు హీరో!
‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, ప్రేమమ్, నిన్ను కోరి’ వంటి చిత్రాలకు పాటలు అందించి, తెలుగు శ్రోతలను ఆకట్టుకున్నారు మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్. మలయాళంలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన ఆయన తమిళ, హిందీ సినిమాలకూ మ్యూజిక్ అందిస్తుంటారు. ఇప్పుడు ఆయన నటనపై దృష్టి సారించారు. హరికృష్ణన్ దర్శకత్వంలో గోపీసుందర్ లీడ్ రోల్ చేస్తున్న సినిమా ‘టోల్ గేట్’. ‘టాలెంటెడ్ అండ్ మై గుడ్ ఫ్రెండ్ గోపీ సుందర్ యాక్ట్ చేస్తున్న మొదటి సినిమాని అనౌన్స్ చేయడం ఆనందంగా ఉంది. మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన గోపీ యాక్టింగ్‌తోనూ ఆడియన్స్‌ను మ్యాజిక్ చేస్తాడని నమ్ముతున్నాను’’ అంటూ గోపీ సుందర్ ఫస్ట్ లుక్‌ను హీరో దుల్కర్ రిలీజ్ చేశారు. ‘మిస్టర్ ఫ్రాడ్’, ‘సలాలా మొబైల్స్’ చిత్రాల్లో గెస్ట్ రోల్ చేసిన గోపీ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న తొలి చిత్రం ‘టోల్ గేట్’. -
కాజా టోల్గేట్ వద్ద సల్ఫర్ ట్యాంకర్ బోల్తా
-
‘వాటిది’ ఒకటే తీరు..!
అగనంపూడి(గాజువాక): సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. ఆర్టీఐ ద్వారా అడిగిన వివరాలను చెప్పాల్సిన బాధ్యత సంస్థలు, అధికారులపై ఉన్నా.. అందుకు నిరాకరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఐ కమిషనర్‌ను నాలుగేళ్ల నుంచి నియమించకపోవడంతో వివరాలు నిరాకరించిన సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకొనే హక్కు ఎవరికీ లేకపోవడంతో సంస్థలు, సంబంధిత అధికారులు పెడచెవిన పెడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ, వాటికి మద్దతు తెలిపే సమాచార వ్యవస్థలు విశేషమై ప్రచారాన్ని చేపట్టాయి. 2జీ స్కామ్, బొగ్గు స్కామ్‌లు వంటివి ఈ చట్టం ద్వారానే బయటపడ్డాయి. అలాంటి చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం తెరదీసిందని సమాచార హక్కు చట్టం ఉద్యమకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాసంఘాల ఆందోళన.. మహా విశాఖ పరిధిలో టోల్ గేట్ కొనసాగించడం చట్ట విరుద్ధమని, వ్యయం కంటే నాలుగు రెట్లు అధికంగా ప్రజల జేబుల నుంచి ఫీజు రూపంలో లాక్కున్న నేపథ్యంలో టోల్‌గేటును తొలగించాలని ప్రజా సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. తరచూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్హెచ్ఏఐ సంస్థకు చేరిందెంత, ఆర్ అండ్ బీ వసూలు చేసిందెంత.. ఆర్టీసీ ప్రయాణికుల నుంచి గుంజిందెంత తదితర మొత్తం వివరాలను ఆర్టీఐ ద్వారా రాబట్టే ప్రయత్నం చేసిన ఆర్టీఐ ఉద్యమకర్త పట్టా రామ అప్పారావుకు ఆ వివరాలు తమ పరిధిలో లేవంటూ ఆ సంస్థల నుంచి సమాధానాలే అందాయి. వివరాల్లోకి వెళ్తే.. వెంకోజీపాలెం నుంచి అనకాపల్లి రహదారి విస్తరణకు 1996లో జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) రూ.63.54 కోట్ల ఐడీబీఐ నుంచి రుణం తీసుకుంది. రోడ్డు విస్తరణకైన వ్యయాన్ని రాబట్టడానికి అగనంపూడిలో టోల్‌ప్లాజా ఏర్పాటు చేసి వసూళ్లకు దిగింది. 2012 నాటికి రూ.202 కోట్లు టోల్‌ఫీజు రూపంలో ఆదాయం రాబట్టినా నేటికీ అది కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎంత ఆదాయం వచ్చింది.. బ్యాంక్‌కు చెల్లించిన ఈఎంఐలు, అప్పు ఎప్పటితో తీరిపోయింది వంటి వివరాల కోసం పట్టా రామ అప్పారావు ఎన్హెచ్ఏఐ, ఆర్ అండ్ బీ సంస్థలను ఆర్టీఐ ద్వారా రాబట్టాలని చూసినా వాటిని ఇచ్చేందుకు రకరకాల సాకులతో సంస్థలు తప్పించుకుంటున్నాయి. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రయాణికుల నెత్తిన టోల్ పిడుగు.. టోల్‌ఫీజును బూచీగా చూపించి ఆర్టీసీ బస్ టికెట్లపై టోల్‌భారం ప్రయాణికుల నెత్తిన బాదుతోంది. ఇది 16 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. సిటీ బస్సు మొదలు కొని అన్ని రకాల ఆర్టీసీ బస్సులపై ఈ భారం పడుతోంది. బస్పులో అన్ని సీట్లు నిండితే కనీసం రూ.240 వరకూ వసూలవుతుంటుంది. రెండు వైపులా రూ.560 వరకూ ఉంటుంది. సొంత వాహనదారుల కంటే రోజూ ప్రయాణించే డైలీ పాసింజర్ ఎక్కువ మొత్తంలో ఆర్టీసీకి చెల్లిస్తున్నారు. సంస్థ టోల్‌ఫీజు రూపంలో వసూలు చేసిన మొత్తం ఎంత, టోల్‌ప్లాజాకు చెల్లించిన మొత్తం ఎంతో వివరాలు కావాలని ఆర్టీఐ ద్వారా ప్రశ్నించగా ఆర్టీసీ అధికారులదీ కూడా అదే తీరు. ఇలా సంస్థలు వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నా చట్టం చేతులు ముడుసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కల్పించిందని రామ అప్పారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు ప్రయాణించే ఆర్టీసీ బస్సులకు అతి సామాన్యులు చెల్లించే డబ్బులే అధికంగా ఉన్నాయని, టోల్ బాదుడు వీరిపైనే అధికంగా ఉంది. ఆర్టీఐ కమిషనర్నునియమించడానికి భయం రాష్ట్ర ప్రభుత్వంలో పారదర్శకత లోపిస్తోంది. లొసుగులు బయట పడతాయనే భయంతోనే ప్రభుత్వం నేటికీ కూడా ఆర్టీఐ కమిషన్‌ర్‌ను నియమించలేదు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు కూడా సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. రాష్ట్ర కమిషనర్‌ను నియమించకపోవడం వల్లే అధికారులు, సంస్థలు వివరాలు అందుబాటులో లేవని తప్పించుకుంటున్నారు. – పట్టా రామ అప్పారావు,ఆర్టీఐ ఉద్యమకర్త, అగనంపూడి -
కోట్లలో టోల్.. భద్రత నిల్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: రాష్ట్రంలో రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. మే 24–జూన్ 24 మధ్య కేవలం నాలుగు వారాల్లోనే రాష్ట్రంలో 138 మంది రోడ్లకు బలయ్యారు. తాజాగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ సమీపంలో మూసీ నదిలో ట్రాక్టర్ పడి 15 మంది కూలీలు మృతి చెందారు. గతనెల 26న రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాదంలో 11 మంది చనిపోగా, 20 మంది గాయపడ్డారు. అంతకు ముందు రోజు అంటే మే 25న నిజామాబాద్ జిల్లాలో నాగ్‌పూర్–బెంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే నెల 29న వరంగల్–కరీంనగర్ రహదారిపై ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో 8 మంది ప్రాణాలు చనిపోగా, 15 మంది గాయాలపాలయ్యారు. సురక్షితమని చెప్పుకునే వోల్వో బస్సులు కూడా ఇటీవల ప్రమాదాల బారిన పడుతున్నాయి. గడచిన ఆరు నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో వివిధ మార్గాల్లో ప్రయాణించే 13 వోల్వో బస్సులు ప్రమాదానికి గురై నలుగురు చనిపోయారు. రహదారులను ఆధునీకరిస్తున్నా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయన్న కారణాలను విశ్లేషిస్తే దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. డ్రైవర్లకు నైపుణ్యం ఏదీ? రాష్ట్రంలో వాహనాల సంఖ్య ఏటా రెండింతలు పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా నైపుణ్యం గల డ్రైవర్లు లభించడం లేదు. ట్రాక్టర్, లారీ, బస్సు, కారు.. ఇలా ఏదైనా సరే నడపొస్తే చాలు చేతికి స్టీరింగ్ ఇచ్చేస్తున్నారు. లైసెన్స్ ఉందా లేదా అన్న విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. బండి నడపొస్తే చాలు ట్రాక్టర్, కారు డ్రైవర్‌గా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ట్రాఫిక్ నిబంధనల గురించి కనీస అవగాహన లేకుండా నడుపుతుండటమే ప్రమాదాలకు కారణమని రోడ్డు భద్రతా చైర్మన్‌గా పనిచేసిన ఎ.కె.మహంతి గతంలో ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు. ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకోవాలో అందులో సూచించారు. జాతీయ రహదారుల డిజైన్‌లో లోపాలను ఎత్తిచూపడంతోపాటు ఎక్కడెక్కడ వాటిని సవరించాలో కూడా సిఫారసు చేశారు. కానీ ప్రభుత్వాలు మారుతున్నా ఆ నివేదికను ఎవరూ పట్టించుకోవడం లేదు. నిధుల లేమి.. సిబ్బంది కొరత రోడ్డు భద్రత విభాగానికి నిధుల కేటాయింపు బాగా తగ్గించారు. ఈ విభాగంలో తగిన సిబ్బంది లేరు. కొత్తగా ఎవరినీ నియమించడం లేదు. రోడ్డు భద్రతా సంస్థకు ఇదివరకు చైర్మన్లుగా పని చేసినవారు ప్రమాదాల నివారణకు చేసిన సూచనలు, సిఫారసులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎ.కె.మహంతి చైర్మన్‌గా ఉన్న సమయంల రూపొందించిన నివేదికను ఇలాగే బుట్టదాఖలు చేశారు. ఇక ట్రాఫిక్ నిబంధనలపై కనీస అవగాహన లేని వారు తేలిగ్గా లైసెన్స్‌లు పొందుతున్నా రవాణా శాఖ చర్యలు తీసుకోవడం లేదు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్లకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలన్న అంశాన్ని గాలికొదిలేసింది. హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లను కూడా రహదారుల్లో కలిపేస్తుండటంతో పాదచారులు రోడ్లపైనే నడవాల్సి వస్తోంది. ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రాజధానిలో కొత్తకొత్త వాహనాలు రోడ్డెక్కుతుండటం, పరిమితికి మించిన వేగంతో వెళ్తుండడంతో ప్రతినిత్యం సగటున 20 మంది గాయాలపాలవుతున్నారు. కోట్లలో టోల్.. భద్రత నిల్ ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్వహణను చేపడుతూ ఉండటంతో టోల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి 40–50 కి.మీ.కు కనీసం రూ.65 నుంచి గరిష్టంగా రూ.140 దాకా వాహనాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. ఇలా కోట్లలో సొమ్ము రాబడుతున్నా జాతీయ, రాష్ట్ర రహదారుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. రోడ్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. కొన్నిచోట్ల రాష్ట్ర రహదారులు.. జిల్లా రహదారుల కంటే ఘోరంగా మారాయి. టోల్ వసూలుకు ఇస్తున్న ప్రాధాన్యం రోడ్డు భద్రతా చర్యలకు ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిలో ప్రయాణిస్తే అడుగడుగునా ప్రమాదకరమైన మలుపులే ఉన్నాయి. నాలుగు రోడ్లుగా నిర్మించే సమయంలో హైదరాబాద్– విజయవాడ రహదారిలో ప్రమాదకరమైన మలుపులు ఉన్నా పట్టించుకోలేదు. సూర్యాపేట జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి, నకిరేకల్ మండలం ఇనుపాముల వద్ద ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. ఈ రెండుచోట్ల ఏడాది కాలంలోనే ప్రమాదాల్లో దాదాపు వంద మందికి పైగా మృత్యువాత పడ్డారు. -
స్పర్శ దర్శనం.. మహాభారం
సాక్షి, శ్రీశైలం : వారణాసి(కాశీ), శ్రీశైలం మహాక్షేత్రంలో మాత్రమే మల్లికార్జునస్వామిని స్పర్శించి దర్శించుకునే భాగ్యం ఉంటుంది. భోళాశంకరుడైన శ్రీశైల శ్రీమల్లికార్జునస్వామికి శిరస్సు తాకించి కేవలం పిడికెడు విభూది, పాలు, నీళ్లు, పత్రి సమర్పిస్తే చాలు తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ భాగ్యాన్ని కూడా శ్రీశైలానికి వచ్చే సాధారణ భక్తులు నోచుకోలేక పోతున్నారు. మల్లన్న ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో సాధారణ భక్తులు మల్లన్న స్పర్శ దర్శనం శని, ఆది, సోమవారాలలో చేసుకోవడానికి వీలు లేకుండా అప్పటి ఈఓ భరత్‌గుప్త ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట పాటూ మాత్రమే స్పర్శదర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆదాయమే లక్ష్యంగా టికెట్ల పెంపుదల.. మల్లన్న ఆదాయాన్ని గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో అధికారులు ఇష్టారీతిగా సేవాటిక్కెట్లను పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వరకు గర్భాలయ అభిషేకం రూ.1000, ముందస్తు అభిషేకం రూ.1500గా ఉండేది. ఆ తర్వాత మల్లన్న గర్భాలయంలో అభిషేకానికి రూ.5000గా నిర్ణయించారు. సామూహిక అభిషేక టికెట్‌ను రూ.1500కు పెంచేశారు. అలాగే అమ్మవారి ఆలయ శ్రీచక్రం ముందు కుంకుమార్చన టికెట్టు ధర రూ.300, అడ్వాన్స్ టికెట్లు రూ.500 ఉండేది. వాటిని కూడా ఏకంగా రూ.1000కు పెంచేశారు. ఆలయ ప్రాంగణంలో జరిగే రుద్ర, చండీహోమం టికెట్ ధరలు రూ.750గా ఉండేవి. వాటిని ఏకంగా రెట్టింపు చేసి రూ.1500కు పెంచేశారు. కొన్నేళ్ల క్రితం వరకు భక్తుల రద్దీకి అనుగుణంగా మల్లన్న స్పర్శదర్శన భాగ్యం కల్పించే వారు. ఇప్పుడు రూ.500 వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ తీసుకున్న వారికి మాత్రమే గర్భాలయంలోకి అనుమతించి స్పర్శ దర్శనం చేయిస్తున్నారు. ఆ టిక్కెట్ల్లను కూడా పరిమితి సంఖ్యలోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ సదుపాయం కూడా కేవలం ఉదయం 6.30 గంటలకు, మధ్యాహ్నం 12.30కు, సాయంత్రం 6.30 గంటలకు మాత్రమే పరిమితం చేశారు. అలాగే దేవుడు దర్శనానికి క్షేత్రానికి వచ్చే భక్తులు జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సేవా టికెట్లతో పాటు టోల్ గేట్ నుంచి టెంకాయల వరకు అధిక రేట్లు ఉండటంతో భక్తులు మండి పడుతున్నారు. కొత్త ఈఓ పాలనలో భక్తుల కష్టాలు తొలిగేనా.. ఇటీవల శ్రీశైలం ఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీరామచంద్రమూర్తి సాధారణ భక్తుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రద్దీ లేని రోజుల్లోనైనా మల్లన్న స్పర్శదర్శన భాగ్యం అందరికీ కల్పించాలని, రూ.5000 అభిషేకం టికెట్టు తీసుకున్న దంపతులతో పాటూ వారి వెంట ఉన్న పిలలు, వృద్ధులకు అవకాశం ఇవ్వా లని భక్తులు కోరు తున్నారు. 10 ఏళ్లలోపు పిల్లలను అభిషేక సమయంలో తల్లిదండ్రులతో పాటూ అనుమతించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శని, ఆది, సోమవారాలు, ప్రముఖ పర్వదినాలను మినహాయించి మిగిలిన రోజుల్లో స్పర్శ దర్శ నంపై ఈఓ దృష్టి సారించాలని కోరుతున్నారు. రద్దీ రోజుల్లో వసతి గదుల కొరతతో ఇబ్బం దులు పడుతున్నారు. తక్కువ ధరతో గదులను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. కొబ్బరి కాయ రూ. 20 భక్తులు స్వామిఅమ్మవార్లకు సమర్పించే కొబ్బరకాయల ధరలను కూడా శ్రీశైలదేవస్థానం వారు ఇటీవలే రెండు మార్లు పెంచేశారు. కొంతకాలం వరకు రూ.10గా ఉన్న ధర, రూ. 15, ప్రస్తుతం రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు కుటుంబసమేతంగా వచ్చినా ఒక్క కొబ్బరికాయ మాత్రమే సమర్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మందులు కొనాల్సిందే.. శ్రీశైలదేవస్థానం ఎన్నో ఏళ్లుగా భక్తులు, స్థానికుల సౌకర్యం కోసం ఉచిత వైద్యశాలను ఏర్పాటు చేసింది. కొంతకాలం క్రితం వరకు అందులో ఉచిత వైద్యంతో పాటూ మందులు కూడా దాతల సహకారంతో ఉచితంగానే అందజేసేవారు. ప్రస్తుతం మందులు లేక పోవడంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. టోల్ బాదుడు.. శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించడానికి నిత్యం వేల సంఖ్యలో వివిధ వాహనాల ద్వారా చేరుకుంటున్నారు. అయితే టోల్ గేట్ టిక్కెట్ ధరలు కూడా భారీగా ఉన్నాయి. కారు, జీపు మొదలైన వాటికి రూ.100, టెంపో, ట్రాక్టర్, బస్ మొదలైన వాటికి రూ. 200, లోడ్ బండ్లకు రూ.500 వరకు టోల్గేట్ రుసుము చెల్లించాల్సి వస్తోంది. ఈ టోల్గేట్ ద్వారా దేవస్థానానికి నెలకు రూ.50 లక్షలకుపై గా ఆదాయం సమకూరుతున్నా వాహనదారులకు పార్కింగ్, తదితర విషయాల్లో దేవస్థానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. -
ఒకసారి ఈ వంతెనపై వెళితే రూ 250..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాంద్రా-వెర్సోవా సీ లింక్‌పై ప్రయాణించే వాహనాల నుంచి రూ 250 టోల్ రుసుంగా వసూలు చేస్తారు. 2023లో ఈ సీ లింక్ అందుబాటులోకి రానుంది. ఈ మొత్తంతో ముంబయిలో మూడు లీటర్లుపైగా పెట్రోల్ లభిస్తుందని ముంబయి వాసులు పెదవివిరుస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గత ఏడాది డిసెంబర్లో మహారాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర క్యాబినెట్ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ఎనిమది సంవత్సరాల తర్వాత పాలనా అనుమతులు లభించడం గమనార్హం. 17 కిమీ పొడవైన ఈ సీ లింక్‌పై కిలోమీర్కు రూ 19.80 చొప్పున టోల్ వసూలు చేస్తారు. 17.17 కిమీ పొడవైన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ 7502 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2020 నాటికి తొలిదశలో భాగంగా అందుబాటులోకి వచ్చే బాంద్రా వెర్సోవా సీలింక్ ద్వారా 14 ట్రాఫిక్ సిగ్నల్స్‌ను తప్పించుకోవచ్చని, 45,500 వాహనాలు ఈ రూట్లో ప్రయాణించవచ్చని భావిస్తున్నారు. 2045 నాటికి 1,20,500 వాహనాలు ఈ రూట్లో రాకపోకలు సాగుతాయని అంచనా వేస్తున్నారు. -
రాజస్తాన్‌లో ప్రైవేట్ వాహనాలకు ‘టోల్’ లేదు
జైపూర్: జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ పెరగ్గా రాజస్తాన్ ప్రభుత్వం మాత్రం వాహనదారులకు ఊరట కల్పించింది. రాష్ట్ర రహదారులపై తిరిగే ప్రైవేట్ వాహనాలకు టోల్‌ను తొలగించింది. ఈ మినహాయింపు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యూనస్ ఖాన్ తెలిపారు. జిల్లా రోడ్లతోపాటు 15,534 కిలోమీటర్ల పొడవైన 56 రాష్ట్ర రహదారులపై నిత్యం 1.25 లక్షల ప్రైవేట్ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, వీటిపై 143 పాయింట్లలో టోల్ ట్యాక్స్ వసూళ్లు జరుగుతుంటాయని వివరించారు. పన్ను మినహాయింపు ఫలితంగా ప్రజలకు రూ.250 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. -
హైవేపై బాదుడే..
సాక్షి, న్యూఢిల్లీ : టోల్ రేట్లను జాతీయ హైవేల అథారిటీ (ఎన్హెచ్ఏఐ) ఏడు శాతం మేర సవరించడంతో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై రాకపోకలు ఆదివారం నుంచి పెనుభారం కానున్నాయి. టోల్ రేట్ల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా పలు వస్తువుల ధరల్లో ఆదివారం నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్లో పలు పన్నులు, లెవీల్లో మార్పులకు అనుగుణంగా ఆయా వస్తువులు, ధరలు ప్రభావితమవుతాయి. మరోవైపు రూ లక్షకు మించిన షేర్ల అమ్మకాలపై దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును కేంద్రం తిరిగి ప్రవేశపెట్టింది. భారమవనున్న వస్తువులను చూస్తే..దిగుమతి చేసుకునే మొబైల్ హ్యాండ్సెట్లు, పెర్ఫ్యూమ్లు, సౌందర్య సాధనాలు, వాచీలు, కళ్లజోళ్లు, జెమ్‌స్టోన్స్, డైమండ్స్, చెప్పులు, సిల్క్ వస్ర్తాలు, జ్యూస్‌లు, ఆలివ్ ఆయిల్, వేరుశనగ నూనె, దిగుమతయ్యే బంగారు ఆభరణాల ధరలకు రెక్కలురానున్నాయి. . ఇక ముడి జీడిపప్పు, సోలార్ సెల్స్, ప్యానెల్స్, మాడ్యూల్స్, ఇతర ముడిపదార్థాల ధరలు కొంతమేర దిగిరానున్నాయి. -
టోల్ ధరలు పెంచిన ఎన్హెచ్ఏఐ
-
రేపటినుంచి ‘టోల్’ బాదుడు!
సాక్షి, న్యూఢిల్లీ:జాతీయ రహదారులపై ప్రయాణించే వాహన చోదకులకు ఇక మరో టోల్ బాదుడు తప్పదు. మార్చి31 అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్న కొత్త టోల్‌చార్జీలు నేపథ్యంలో జాతీయ రహదారులపై డ్రైవింగ్ మరింత భారం కానుంది. జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) టోల్ రేట్లును 5నుంచి 7శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మెజారీటి టోల్ ప్లాజాలపై అన్ని రకాల వాహనాలపై టోల్ చార్జీలు 5శాతం పెరగనున్నాయి. మంత్లీ ప్లాన్‌లో (నెలకు 50 ట్రిప్పులు) ధరలను కూడా నేషనల్ హైవే అథారిటీ పెంచింది. ఫలితంగా నిత్యావసర ధరలు కూడా ఈ మేరకు భగ్గుమనడం ఖాయం. జాతీయ రహదారిపై టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేసిన తర్వాత ఏటా ఏప్రిల్ నెలలో చార్జీలను పెంచుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెంచిన టోల్ చార్జీ అమలు కానుంది. నేషనల్ హైవే 2 ప్రాజెక్ట్ డైరెక్టర్ మొహమ్మద్ సఫీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మొత్తం 372 టోల్ ప్లాజాలున్నాయని చెప్పారు. టోల్‌రేట్లు కూర్పు ప్రతి ఆర్థికసంవత్సరం ప్రారంభం కావడానికి ముందే జరుగుతుందని వివరించారు. ముఖ్యంగా టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారంగా రేట్లు సవరణ ఉంటుందనీ, అయితే ఆయా ప్రాంతాలనుబట్టి రేట్లు మారతాయన్నారు. మరోవైపు ఇప్పటికే జాతీయ రహదారులపై టోల్‌చార్జీలు అధికంగా ఉన్నా,మళ్లీ రేట్లు పెంచడం అసమంజసమనే ఆందోళన సర్వత్రా వ్యకమవుతోంది. ఈ పెంపుపై ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒకవైపు ఇ-వే బిల్లు, పెరిగిన డీజిల్ ధరలకు తోడు టోల్ చార్జీలపెంపు కారణంగా, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని పేర్కొన్నాయి. -
బీజేపీ ఎమ్మెల్యే గుండాగిరీ; కేసు లేదు
జైపూర్: తన అనుచరుల వాహనాలను అనుమతించలేదన్న సాకుతో ఓ టోల్గేట్ ఉద్యోగిపై బీజేపీ ఎమ్మెల్యే గుండాగిరీకి దిగాడు. ఇష్టారీతిగా తిట్టి, చెయ్యిచేసుకున్నాడు. అయినాసరే, ఆయనపై కేసు నమోదుకాలేదు. సదరు టోల్గేట్ సంస్థా ఉద్యోగికి అండగా నిలవలేదు! వైరల్ వీడియో: రాజస్థాన్‌లోని బాన్స్వారా జిల్లా ఉదయ్‌పూర్ రోడ్డుపై ఉన్న టోల్‌ప్లాజాలో శనివారం చోటుచేసుకుందీ ఘటన. బీజేపీ ఎమ్మెల్యే జీత్‌మల్ కాంత్.. టోల్ ప్లాజా ఉద్యోగిని కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గరీహ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యవ వహిస్తోన్న ఆయన.. తన అనుచరుల వాహనాలకు ట్యాక్స్ వసూలు చేస్తున్నారనే ఆగ్రహంతో ఇలా దాడికి దిగారు. కాగా, ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నా, ఫిర్యాదు అందలేదు కాబట్టి కేసు నమోదు చేయలేదని పోలీసులు అంటున్నారు. దెబ్బలుతిన్న టోల్గేట్ ఉద్యోగి.. ఎమ్మెల్యేపై కేసు పెట్టడానికి ముందుకురాలేదని తెలిపారు. తన వైరల్ వీడియోపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే జీత్‌మల్ నిరాకరించారు. -
బీజేపీ ఎమ్మెల్యే గుండాగిరీ; కేసు లేదు
-
టు లెట్ ఉంటే చోరీ పక్కా
నేరేడ్మెట్: టు లెట్ బోర్డు ఉన్న ఇళ్లనే టార్గెట్చేస్తూ చోరీలు చేస్తున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 14 తులాల నగలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ వెల్లడించారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పరిధిలోని సుబ్బమ్మ కాలనీ(బాలాజీనగర్)కు చెందిన మందల మధుగౌడ్ అలియాస్ మధు(32), మందల రేణుకా(24) 2011 సంవత్సరంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మధుగౌడ్ కొంత కాలం కూలి పనులు చేశాడు. 2016 నుంచి దమ్మాయిగూడలోని ఓ మద్యం దుకాణంలో పని చేస్తున్నాడు. భార్యభార్యల్దిదరూ కల్లుతాగేందుకు తరుచూ ఓల్డ్ సఫిల్‌గూడలోని కల్లు కంపౌండ్‌కు వెళుతుంటారు. తన సంపాదనతో ఇంటి అవసరాలకు సరిపోవకపోవడంతో టు–లెట్ బోర్డు ఉన్న ఇళ్లలో అద్దె కావాలంటూ వెళ్లి చోరీలు చేయాలని పథకం వేశారు. తమ ముగ్గురు కొడుకుల(ముగ్గురిది ఐదేళ్లలోపు వయసు)ను వెంట తీసుకొని జనవరి 29న కల్లుతాగి దంపతులు నేరేడ్మెట్ ఠాణా పరిధిలో బల్రామ్నగర్లోని బీ.నాగలక్ష్మి ఇంటికి టు –లెట్ బోర్డు చూసి ఇంట్లోకి వెళ్లారు.ఆ సమయంలో ఇంట్లోని వారు నిద్రపోతున్నారు. భర్త ఇంటి బయట కాపాలాగా ఉండగా..భార్య లోపలికి వెళ్లి బీరువాలో ఉన్న బంగారు, సెల్ఫోన్లను చోరీచేసి దంపతులు ఉడాయించారు. మరుసటి రోజు జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఈసీఐఎల్ సౌత్ కమలానగర్ బాలమురుగన్ ఇంట్లో స్నానం చేస్తుండగా భార్య ఇంట్లోకి వెళ్లి సెల్‌ఫోన్‌తోపాటు రూ.400 చోరీకి పాల్పడింది. శనివారం ఉదయం వారు బంగారు నగలు, సెల్‌ఫోన్ విక్రయించేందుకు వినాయకనగర్ ప్రాంతంలో తిరుగుతుండగా అనుమానం వచ్చిన క్రైం పార్టీ పోలీసులు ఠాణాకు తీసుకువచ్చి విచారించగా చోరీల విషయం వెల్లడైంది. వారినుంచి14తులాల బంగారు ఆభరణాలతోపాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని,రిమాండ్‌కు తరలించినట్టు డీసీపీ వివరించారు. ఏసీపీ కృష్ణమూర్తి, సీఐలు జగదీష్‌చందర్, అంజిరెడ్డి,ఎస్ఐ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. -
వీఐపీగా గుర్తించరా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆమె అనుచరులు రెచ్చిపోయారు. జిల్లాలోని రేణికుంట టోల్గేట్లో మంగళవారం చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ వీరంగం సృష్టించారు. టోల్గేట్లో వద్ద ఎమ్మెల్యే అనుచరుల వాహనాలను టోల్ సిబ్బంది ఆపారు. దీంతో తమ అనుచరుల వాహనాలు ఎందుకు ఆపారని.. వీఐపీగా గుర్తించరా అని సదరు ఎమ్మెల్యే చిందులు వేశారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని టోల్ సిబ్బంది చెప్పినా శోభ వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడికి యత్నించారు. ఎమ్మెల్యే అనుసరించిన తీరును టోల్ సిబ్బంది ఫోన్లో చిత్రీకరిస్తుండగా వారిని కొట్టి ఫోన్‌ను లాక్కెళ్లారు. ఈ ఘటనపై టోల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. -
భక్తుల ప్రాణాలతో చెలగాటం
మానవ తప్పిదాల కారణంగా పెరిగిపోతోన్న మరణాలను నివారించేందుకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. అధికార పార్టీ నేతల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను సైతం బలితీసుకుంటున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా వస్తున్నాయి. కొల్లేరు అభయారణ్యంలో నిర్మించిన వంతెనపై అధికార పార్టీ నేతలు అనధికార టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రమాదకరమని తెలిసినా కార్లు, ఆటోలు వంటి వాహనాలనూ పంపిస్తున్నారు. కైకలూరు : కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేయడానికి పూర్వం గ్రామస్తులు కొల్లేటి అభయారణ్యంలోని సర్కారు కాల్వపై కర్రల వంతెన నిర్మించుకున్నారు. మూడేళ్ల కిందట టీడీపీ నాయకులు ఇనుప వంతెన నిర్మించారు. ఆ సమయంలో అటవీశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా లెక్కచేయకుండా నిర్మాణం పూర్తి చేశారు. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పెద్దింట్లమ్మ తల్లి దేవస్థానం కొల్లేటికోటలో ఉంది. అమ్మవారిని చేరుకోడానికి వంతెన దాటి వెళ్లాలి. నిత్యం వందలాది మంది భక్తులు, ఆదివారమైతే 2000 మందికిపైగా, జాతర సమయంలో రోజుకు 20 వేల మంది, మొత్తం మీద ఏడాదికి 4 లక్షల మంది భక్తులు ఈ వంతెన దాటి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తుల అవసరాన్ని ఆసరగా చేసుకొని అనధికార వసూళ్లకు తెరదీశారు. వంతెన వద్ద అనధికార టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారు. కేవలం పాదాచారులు, ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు మాత్రమే వంతెనపై అవకాశం ఉంటుంది. కానీ అక్రమ సంపాదనలో ఆరితేరిన ఓ నాయకుడు ప్రస్తుతం వంతెనపై నుంచి ఏకంగా ఆటోలు, కార్లకు అడ్డగోలుగా అనుమతులిచ్చేశాడు. ఈ చర్యతో ఇప్పుడు ఆ వంతెన ప్రమాదకర స్థితికి చేరుకుంది. భక్తులు భయపడుతూ వంతెన దాటుతున్నారు. ప్రమాదకరస్థాయిలో వాహనాలు వెళ్లడంతో పొరపాటున వంతెన కూలిపోతే ఊహించని విధంగా ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఇంత దారుణం కళ్ల ముందు కన్పిస్తున్నా ప్రభుత్వ అధికారులకు కనీసం చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమనిభక్తులు అంటున్నారు. అందినకాడికి దోచుకోవడమే.... అనధికార పాటదారుడు పందిరిపల్లిగూడెం గ్రామానికి డబ్బులు చెల్లిస్తాడు. ఇక ప్రయాణికుల నుంచి రోజూ అందినకాడికి దోచేయడం ఇక్కడ కామన్‌గా మారింది. ఏ ప్రభుత్వ శాఖకు చెందిన అధికారి కూడా ఇటువైపు కన్నెత్తి చూడరు. అటవీ, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు తదితర శాఖలేవీ తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదనట్లు వ్యవహరిస్తున్నాయి. ఏడాదికి రూ.కోటి ఆదాయం.. ఏటా సర్కారు కాల్వ వంతెన నుంచి రూ.కోటి ఆదాయం వస్తుంది. పందిరిపల్లిగూడెం గ్రామానికి చెందిన కొండలు అనే వ్యక్తి రూ.40 లక్షలకు ఏడాది పాట దక్కించుకున్నాడు. డబ్బును పందిరిపల్లిగూడెం పెద్దలకు చెల్లించాడు. వంతెనపై కారు వెళితే రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నాడు. ఆటోకు రూ.100, వాహనానికి రూ.20, మనిషికి రూ.5 ఇలా పబ్లిక్‌గా వసూలు పర్వం సాగిస్తున్నాడు. ఎవరైనా భక్తులు ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతున్నారు. పోలీసులు దగ్గరున్నప్పటికీ ఏం చేయలేకపోతున్నారు. -
నేను టోల్ ఫీజు కట్టను.. అంతే...
-
నేను టోల్ ఫీజు కట్టను.. అంతే...
సాక్షి, మధుర: పార్టీలో సీనియర్ నేత.. పైగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ప్రతినిధి. నిబంధనలు అతిక్రమించటంతో మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించింది. అంతే సహనం కోల్పోయిన ఆయన తన ఆధిపత్యం ప్రదర్శించుకునేందుకు అరిచేశారు. ఉత్తర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర నాథ్ పాండే చేసిన నిర్వాకం ఇది... చందౌలి నియోజకవర్గం ఎంపీ అయిన మహేంద్ర నాథ్‌కు ఈ మధ్యే యూపీ బాధ్యతలను అప్పజెప్పింది అధిష్ఠానం. తాజాగా దీన్‌దయాల్ ధామ్‌లో నిర్వహించిన దీనదయాల్ ఉపాధ్యాయ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే తన అనుచురలతో భారీ కాన్వాయ్‌లో విచ్చేసిన ఆయన మార్గం మధ్యలో ఫిరోజాబాద్ వద్ద టోల్ గేట్ ఫీజు చెల్లించకుండానే వచ్చేశారు. దీంతో విషయం తెలుసుకున్న మీడియా కార్యక్రమం అనంతరం ఈ వ్యవహారంపై మహేంద్రను ప్రశ్నించింది. అయితే ఊహించని ప్రశ్నకు బిత్తరపోయిన ఆయన ‘నేనొక ఎంపీని. టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం నాకు లేదు. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా?’ అంటూ వ్యాఖ్యానించారు. వెంటనే మీడియా ప్రతినిధులు.. మీరు పార్లమెంటేరియన్ కావొచ్చుగానీ, మీతో ప్రయాణించిన మిగతా వాళ్లు కాదుగా అనటంతో ఎంపీకి పట్టరాని కోపం వచ్చేసింది. ప్రస్తుతం తాను దీన్‌దయాళ్ ధామ్ వద్ద ఉన్నానని.. కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్నలు ఏవైనా ఉంటే అడగండంటూ కాస్త అసహనంగానే ఆయన మాట్లాడారు. కానీ, తమకు ఆ ప్రశ్నకే సమాధానం కావాలని మీడియా పట్టుబట్టడంతో... అది తప్ప మరేదైనా అడగండి అంటూ మహేంద్ర కోరారు. గతంలో అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బారాబంకీ వద్ద ఫీజు చెల్లించకుండానే 175 కార్లతో టోల్ గేట్ దాటి వెళ్లిపోగా, అఖిలేష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. -
సహనమే సాఫల్య సోపానం
సహనం ఓ సుగుణం, అది జీవిత సౌశీల్యం, సహనం జీవిత ప్రధాన అవసరం. సహనమును కోల్పోయే పరిస్థితులు, ఆస్కారములు మన జీవితంలో అడుగడుగునా తారసపడుతుంటాయి. సహనం కోల్పోతే, మనకు కలిగే నష్టాలు, అనర్థాలు మనం ఈ జీవితంలో కోలుకోలేని, పూడ్చుకోలేని పరిణామాలకు దారితీస్తాయి. సహనం ఆరోగ్యవంతమైన మానసిక సమతుల్యతా స్థితికి నిదర్శనం. సహనం పరిస్థితులను జయించి తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. సహనమన్నది జీవిత ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి బలమైన సూత్ర సాధనం. సహనం కోల్పోతే ఏ రంగంలోని వారమైనా జీవిత లక్ష్యాన్ని, ఆశయాన్ని సాధింపజాలరు. సహనం ఓ అభ్యాసం, ఈ జీవిత పరిస్థితులు మనకు నేర్పే పాఠం. జీవితంలో కొన్ని అధిక్యతలు, అర్హతలు సాధించటానికి ఓ సోపానం. సహనాన్ని దైవసన్నిధిలో, దైవధ్యానంలో మనం అలవర్చుకొంటాము, అకళింపజేసుకుంటాము. అయితే సహనానికి మారు పేరు భూ దేవి. మన భక్తికి, మనం చేసే పూజలకు, మనం చేసే కృషికి, ప్రయత్నానికి సత్ ఫలితాన్ని ఎదురుచూడటానికి కూడా సహనం అవసరం. సహనం ఓ అశక్తత కాదు, బలహీనత కాదు, చేవలేని తనం అసలే కాదు. కాదు. సోమరితనం అంతకన్నా కాదు, జీవిత బలం. అసహనం మన జీవితాలను, కుటుంబాలను, మన విలువల్ని, మనం సంపాదించుకున్న గౌరవ ప్రతిష్టలను, అప్రతిష్టపాలు చేస్తుంది. మన కుటుంబ సంబంధాలు, వైవాహిక సంబంధాలు, స్నేహసంబంధాలు, రక్త సంబంధాలు తదితర మానవ సంబంధాలన్ని ఆరోగ్యకరంగా, బలంగా ఉండాలంటే సహనమే ప్రధానం. సహనంతోనే సంసార జీవితం ఒడుదుడుకుల మధ్య సైతం సాఫీగా సాగుతుంది. సహనం లేని చోట ప్రేమ పగగా మారుతుంది. సహనంతో సాధించలేనిది ఏది లేదు. ఒక్కమాట! ఈ జీవితంలోని విజయానికే కాదు, ఈ జీవితానంతరపు నిత్య జీవిత సాధన వరకు సహనమే సోపానం. -
ఇక ‘ప్రైవేటు ఓఆర్ఆర్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరా బాద్‌కు మణిహారం నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు.. దీనిని బడా ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. దీంతో పాటు టోల్ రూపంలో మంచి ఆదాయం ఉన్న జాతీయ రహదారులను కూడా ప్రైవేటు పరం చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. వీటిని 20 నుంచి 30 ఏళ్ల కాలానికి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు. వాటిపై వచ్చే ఆదా యాన్ని ఆయా సంస్థలే తీసుకుంటాయి. దీనికి ప్రతిగా వాటి నిర్వహణ వ్యయాన్ని పూర్తిగా భరిస్తాయి. ఎన్నేళ్ల కాలానికి వాటిని అప్పగిస్తే, అన్నేళ్ల కాలానికి వచ్చే ఆదాయంలో నిర్ధారిత (ఒప్పందం మేరకు) ఆదాయాన్ని ముందుగా నే ఆ సంస్థలు ప్రభుత్వానికి చెల్లిస్తాయి. వాటిని ప్రభుత్వం తిరిగి రోడ్ల విస్తరణకు ఖ ర్చు చేస్తుంది. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఆలోచనలో భాగంగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యా ప్తంగా 75 జాతీయ రహ దారులను ఈ రూపంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఏర్పాట్లు ప్రారంభం కాగా, రాష్ట్రంలో దానిని ఔటర్తో మొదలు పెట్టబోతున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో ఓఆర్ఆర్ గ్రోథ్ కారిడార్ బోర్డు అనుమతి మంజూరు చేసింది. 20 ఏళ్ల కాలానికి 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఔటర్ రింగ్ రోడ్డును అప్పగిస్తే దాదాపు రూ.2,500 కోట్ల వరకు ముందస్తు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఏంటీ టీఓటీ.. ఇప్పటి వరకు మనం బీఓటీ(బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) వ్యవహారాన్ని చూశాం. తాజాగా కేంద్రం టీఓటీ(టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) ఆలోచనను తెరపైకి తెచ్చింది. జాతీయ రహదారులపై టోల్ రూపంలో భారీగా ఆదా యం వస్తోంది. అది కాలక్రమంలో పెరుగు తూనే ఉంటుంది. దీంతో ఆ ఆదాయం ఆశ చూపి రోడ్ల నిర్వహణను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు అప్పగించటమే దీని ఉద్దేశం. వెరసి రోడ్ల నిర్వహణ భారాన్ని ప్రభుత్వం పూర్తిగా వదిలించుకుం టుంది. ప్రైవేటు సంస్థలు టోల్‌ను సమ ర్థవంతంగా నిర్వహిం చి ఆదాయాన్ని పెంచుకుంటాయి. వెరసి రెండు వైపులా ఇది లాభసాటి కావటంతో ఈ ఆలోచ నకు మంచి స్పందన వస్తోంది. ఇటీవలే కేంద్ర మంత్రివర్గం దీనికి పచ్చజెండా ఊపటంతో భారత జాతీయ రోడ్ల నిర్వహణ సంస్థ(ఎన్హెచ్ఏఐ) దీనికి పదును పెట్టింది. లాభసాటిగా ఉన్న 75 జాతీయ రహదారులను గుర్తించింది. ఇందులో తెలంగాణ రోడ్లు లేవు. ఇది మెరుగ్గా ఉంటుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేటు సంస్థలకు అప్పగించి ముందస్తు ఆదాయాన్ని సొంతం చేసుకుని అభివృద్ధి పనులకు వినియోగించాలని నిర్ణయించింది. 20 నుంచి 30 ఏళ్ల కాలానికి దీన్ని ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారు. గ్లోబల్ టెండర్లలో ఎక్కువ మొత్తం బిడ్ దాఖలు చేసిన సంస్థను ఇందుకు ఎంపిక చేస్తారు. ఓఆర్ఆర్పై టోల్ రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆ సంస్థ దక్కించుకుంటుంది. భవిష్యత్తులో దానిపై ఏర్పాటు చేసే ఇతరత్రా మార్గాల్లో వచ్చే ఆదాయం కూడా ఆ సంస్థే పొందుతుంది. దీనికి ప్రతిగా మొత్తం ఓఆర్ఆర్ నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ఈ ఒప్పందం ఎంత కాలం అమలులో ఉంటుందో అంతకాలానికి వచ్చే ఆదాయంలో ఒప్పందం మేరకు నిర్ధారిత మొత్తాన్ని ముందుగానే ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఓఆర్ఆర్ భవిష్యత్తు ఆదాయం, వ్యయాలను కచ్చితంగా అంచనా వేసేందుకు నైపుణ్యం ఉన్నవారిని సలహాదారుగా నియమించుకోనున్నారు. ఆ తర్వాత గ్లోబల్ టెండర్లు పిలిచి అత్యధిక బిడ్ దాఖలు చేసిన సంస్థను గుర్తిస్తారు. విదేశీ రోడ్లకు దీటుగా.. అభివృద్ధి చెందిన దేశాల్లో అన్ని ప్రధాన రోడ్లు ఎక్స్‌ప్రెస్ వేలుగా ఉంటున్నాయి. మన దేశంలో జాతీయ రోడ్లు కూడా నాసికరంగానే నిర్మితమ వుతున్నాయి. వీటికి కూడా విదేశీ తరహా హంగులు ఉండాలంటే ప్రైవేటుకు అప్పగించి నిర్వహించటమే మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పనుల్లో జాప్యం అవినీతి, నాణ్యతా లోపంలాంటి వాటికి అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఇదీ ‘ఔటర్’స్వరూపం విస్తీర్ణం– కి.మీ. 158 (కిలోమీటరున్నర పని పెండింగ్‌లో ఉంది) టోల్ ప్లాజాల సంఖ్య 19 (టోల్ లేన్లు 180) ప్రస్తుతం సాలీనా టోల్ ఆదాయం రూ.196 కోట్లు నిర్వహణ వ్యయం ప్రతి నెలా (కరెంటు బిల్లులు, అంబులెన్సులు, పెట్రోలింగ్, గ్రీనరీ, మెటల్ బార్ల ఏర్పాటు తదితరాలు కలిపి) 2 రోడ్డు పొరల నిర్మాణం (ప్రతి ఆరేళ్లకు ఒకసారి. ప్రస్తుత రేట్ల ప్రకారం వార్షిక వ్యయం) 250 కోట్లు -
నాలుగింతలు మోత
⇒ ఈసీఆర్‌లో అమలు ⇒ స్థానిక వాహనాలకు నెలసరి చార్జి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న చెన్నై–పుదుచ్చేరి ఈస్ట్ కోస్ట్ రోడ్డులో టోల్ చార్జీల మోత మోగనుంది. శనివారం నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. స్థానిక వాహనాలకు నెలసరి అద్దెగా చార్జీలను నిర్ణయించడం విశేషం. చెన్నైకి సమీపంలో ఒకటి, మహాబలిపురం తదుపరి మరొకటి చొప్పున రెండు టోల్ గేట్లను ఈ మార్గంలో ఏర్పాటుచేశారు. అటు వైపు దూసుకెళ్లే వాహనాలకు ఇది వరకు ఉన్న చార్జీ కన్నా, నాలుగింతలు పెంచి దినసరి మోత మోగించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే, ఈ పరిసరాల్లో నిత్యం స్థానికుల వాహనాలు రోడ్డెక్కుతుంటాయి. కార్లలో పయనం సాగించే వాళ్లు మరీ ఎక్కువే. స్థానికంగా ఉన్న వాళ్లను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా నెలసరి చార్జీ అమల్లోకి తీసుకు రావడం విశేషం. ఆమేరకు ఆటో, జీపు కార్లు వంటి లైట్ వెహికల్స్‌కు ఓ చార్జీ, ట్రక్స్, ప్రభుత్వ వాహనాలు, జేసీబీ వంటి వారికి, బస్సులకు ప్రత్యేకంగా వేర్వేరు చార్జీలను నిర్ణయించడం గమనార్హం. అయితే, నెలసరి టోల్ చార్జీ కార్డును పొందాలనుకున్న వాళ్లు తాము ఈసీఆర్ రోడ్డు పరిసరాల్లో నివాసం ఉంటున్నట్టుగా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించక తప్పదు. ఈ చార్జీలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. సాక్షి, చెన్నై : కోవళం, ముట్టుకాడు, మహాబలి పురం సమీపాల్లో భారీ వంతెనలు నిర్మించి ఈ మార్గాల్లో రెండుచోట్ల టోల్ ప్లాజాలు ఏర్పాటుచేశారు. రాజధాని నగరం చెన్నై నుంచి సముద్రతీరం వెంబడి పుదుచ్చేరి వరకు 135 కి.మీ దూరం ఈస్ట్ కోస్ట్ రోడ్డులో పయనం ఆహ్లాదకరంగా ఉంటుంది. చెన్నై నగరం విస్తరిస్తుండటంతో ఈసీఆర్‌లో నిర్మాణాలు ఎక్కువే. బహుళ అంతస్తుల భవనాలు కోకొల్ల లు. అనేక విదేశీ, స్వదేశీ సంస్థలు, ఐటీ కంపెనీలు కూడా ఇక్కడ ఎక్కువే. నిర్మాణపరంగా, అభివృద్ధిపరంగా శర వేగంగా ఈ పరిసరాలు దూసుకెళ్తున్నాయి. కోవళం, మహాబలిపురం, ముట్టుకాడు వంటి పర్యాటక కేంద్రాలు, థీమ్ పార్క్‌లు, రిసార్ట్స్‌లు కూడా ఈపరిసరాల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈసీఆర్ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుని రూ.272 కోట్లతో అభివృద్ధి పరిచింది. చెన్నై నుంచి మహాబలిపురం వరకు ఫోర్‌వేగా, అక్కడి నుంచి పుదుచ్చేరి వరకు టూవేగా రోడ్డును తీర్చిదిద్దింది. కోవళం, ముట్టుకాడు, మహాబలిపురం సమీపాల్లో భారీ వంతెనలు కూడా నిర్మించింది. ఈ మార్గంలో రెండుచోట్ల టోల్ ప్లాజాను ఏర్పాటుచేశారు. ఆమేరకు ఇక, టోల్ మోతను అటు వైపుగా సాగే వారికి మోగించేందుకు సిద్ధం అయ్యారు.పూర్తిస్థాయిలో చార్జీల వివరాలు అందాల్సి ఉన్నా, రూ. 200 నుంచి రూ. 250 వరకు రెండు టోల్ గేట్లను దాటేందుకు ఓ వాహనానికి మోత మోగుతున్నట్టు సమాచారం. నెలసరి చార్జీలు మాత్రం మరీ తక్కువగానే నిర్ణయించి ఉన్నారని, అయితే, దినసరి చార్జీలు మరీ ఎక్కువగా ఉందంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజు స్థానికుల రూపంలో ఆయా టోల్ ప్లాజా సిబ్బందికి తంటాలు తప్పలేదు. -
మమ్మల్నే ఫీజు అడుగుతారా?
-
మమ్మల్నే ఫీజు అడుగుతారా?
- టోల్‌ప్లాజాపై ఎంపీ నిమ్మల తనయుల వీరంగం - అనుచరులతో కలసి కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం హిందూపురం అర్బన్/ చిలమత్తూరు/ బాగేపల్లి (కర్ణాటక): తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అంబరీష్, శిరీష్ సోమవారం ఆంధ్ర– కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్‌ప్లాజాలో వీరంగం సృష్టించారు. టోల్గేట్ వద్ద అంబరీష్ అనుచరుల కారును ఆపి గేట్ ఫీజు అడిగారన్న కోపంతో విధ్వంసానికి దిగారు. అనుచరులతో కలిసి టోల్‌ప్లాజాపై దాడి చేసి.. కంప్యూటర్లు, అద్దాలు పగులగొట్టారు. సోమవారం ఉదయం పది గంటలకు ఎంపీ పెద్ద కుమారుడు అంబరీష్ ఇన్నోవా కారు (ఏపీ02 బీడీ 1234)లో, అతని స్నేహితులు ఫోర్డ్ కారు (ఏపీ02 ఈబీ 6777)లో కర్ణాటకలోని బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. టోల్‌ప్లాజా సిబ్బందికి ఎంపీ పాస్ జిరాక్సు కాపీ చూపించారు. దాన్ని పరిశీలించిన సిబ్బంది.. ‘ఇది వ్యాలిడిటీ అయిపోయింది. ఈ పాస్ కేవలం పార్లమెంట్ సభ్యులకు మాత్రమే ఉంటుంది. కుటుంబ సభ్యులందరికీ అనుమతి లేదు. అయినా ఎంపీ కుమారుడివి కావడంతో ఈసారి అనుమతిస్తున్నామ’ని చెప్పా రు. అయితే.. తన స్నేహితుల ఫోర్డ్ కారుకు కూడా అనుమతివ్వాలని అంబరీష్ పటు ్టబట్టాడు. ఇందుకు సిబ్బంది నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడు. ‘ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తోందా? తమాషా చేస్తున్నారా?’ అంటూ తీవ్ర స్థాయిలో బెదిరించాడు. టోల్‌ప్లాజా సిబ్బంది వారించినా అతను వినలేదు. వారిపై శివాలెత్తుతూనే.. గోరంట్లలోని తన తమ్ముడు నిమ్మల శిరీష్, ఇతర అనుచరులకు ఫోన్ చేసి రప్పించాడు. కొంతసేపటికి కారులో శిరీష్‌తో పాటు ఏడుగురు అక్కడికి చేరుకుని టోల్‌ప్లాజాపై దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. రెండు కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తమతో పెట్టుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించి బెంగళూరు వైపు వెళ్లిపోయారు. దీంతో బాగేపల్లి పోలీసులు నిమ్మల అంబరీష్, నిమ్మల శిరీష్, పాపన్న, నరేష్, లక్ష్మీపతి, మునికుమార్, శ్రీకృష్ణపై 149, 143, 147, 323, 324, 504, 427, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారు బాగేపల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. -
హిందూపురం ఎంపీ వర్గీయుల దౌర్జన్యం
-
టోల్ ప్లాజా వద్ద టీడీపీ ఎంపీ కుమారుడి దౌర్జన్యం
అనంతపురం: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టోల్గేట్ వద్ద సిబ్బంది టోల్ ఫీజు అడిగిన పాపానికి నానా బీభత్సం సృష్టించారు. బాగేపల్లి టోల్గేట్ వద్ద ఎంపీ నిమ్మల కిష్టప్ప వర్గీయులను సిబ్బంది టోల్ ఫీజు అడిగారు. దీంతో ఆగ్రహించిన వారు టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడటంతో పాటు.. అద్దాలు, కంప్యూటర్, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. స్వయంగా ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు అంబరీష్ ఈ దాడికి నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది. ఎంపీలకు మినహాయింపు ఉంటుంది కానీ.. వారి తనయులకు టోల్ ఫీజు విషయంలో మినహాయింపు ఉండదని సిబ్బంది చెప్పడమే కిష్టప్ప వర్గీయుల ఆగ్రహానికి కారణమైనట్లుగా తెలుస్తోంది. -
కలకలం.. కలవరం..
- పెళ్లిబృందం లారీని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్ - 22 మందికి గాయాలు - సురక్షితంగా బయటపడిన వరుడు - త్రుటిలో తప్పిన పెనుముప్పు - ఈతకోట టోల్గేట్ వద్ద ఘటన రావులపాలెం : వివాహ వేడుక వేళ జరిగిన ఓ ప్రమాదం.. వధూవరుల కుటుంబాల్లో కలవరం రేపింది. పెళ్లిబృందంతో వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ట్యాంకర్ డ్రైవర్‌తోపాటు లారీలో ఉన్న 22 మంది గాయపడ్డారు. రావులపాలెం మండలం ఈతకోట వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని ప్రత్తిపాడుకు చెందిన మర్రి సత్యనారాయణ వివాహం శనివారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వధువు ఇంటివద్ద జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లికొడుకు సత్యనారాయణతోపాటు ప్రత్తిపాడు, గోకవరం ప్రాంతాలకు చెందిన అతడి తరఫు బంధువులు సుమారు 80 మంది ఒక లారీలో శుక్రవారం సాయంత్రం పాలకొల్లు బయలుదేరారు. రాత్రి 8 గంటల సమయంలో ఈతకోట టోల్గేట్ వద్దకు వచ్చేసరికి స్పీడ్ బ్రేకర్లు ఉండటంతో లారీ వేగాన్ని డ్రైవర్ తగ్గించాడు. అదే సమయంలో వెనుకగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అది గమనించకుండా వేగంగా దూసుకువచ్చి పెళ్లిబృందం లారీని ఢీకొట్టాడు. దీంతో పెళ్లిబృందం లారీ అదుపు తప్పి డివైడర్ మీదుగా కుడివైపు రోడ్డులోకి దూసుకుపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో లారీలో ఉన్నవారంతా ఒకరిపై ఒకరు పడిపోయి, గాయపడ్డారు. దీంతో భయాందోళనలకు గురైన మహిళలు, పిల్లలు ఆర్తనాదాలు చేశారు. ట్యాంకర్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ సిద్ధి ప్రసాద్‌యాదవ్ అందులో చిక్కుకు పోయాడు. సమాచారం అందుకున్న రావులపాలెం సీఐ బి.పెద్దిరాజు, ఎస్సై పీవీ త్రినాథ్‌లు సిబ్బందితో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకర్ డ్రైవర్‌ను బయటకు తీశారు. క్షతగాత్రుల రోదనలు ఒక్కసారిగా మిన్నంటాయి. క్షతగాత్రులను హైవే, 108 అంబులెన్సులలో తొలుత కొత్తపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన చెరుకూరి యాకోబు, మేకల మహాలక్ష్మి, కల్లూరి మహేష్, మర్రి రమణలను మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్యాంకర్ డ్రైవర్ సిద్ధి ప్రసాద్‌యాదవ్, మర్రి ముత్యాలరావు, మర్రి త్రిమూర్తులు, చెరుకూరి రాజు, అచ్చిబాబులను కూడా రాజమహేంద్రవరం తరలించారు. మర్రి సత్తిబాబు, కల్లూరి విజయ్, మర్రి కృపావతి తదితరులు కొత్తపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వరుడు సత్యనారాయణ సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో వివాహానికి ఆటంకం కలగకుండా అతడితోపాటు కుటుంబ సభ్యులను ప్రత్యేక వాహనంలో పోలీసులు పాలకొల్లు పంపారు. నిర్లక్ష్యమే కారణం! ఈ ప్రమాదానికి టోల్గేట్ అధికారులు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. టోల్గేట్ వద్ద ఇరువైపులా స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేసినా వాటికి రేడియం స్టికర్లు కానీ రంగు కానీ వేయలేదు. దీంతో రాత్రి వేళల్లో అవి కనిపించడంలేదు. అలాగే టోల్గేట్ వద్ద లైటింగ్ కూడా అంతంతమాత్రంగా ఉంటోంది. గతంలో కూడా ఈ కారణంగా ఇక్కడ పలు ప్రమాదాలు జరిగాయి. 2015 డిసెంబర్లో టోల్గేట్ ప్రారంభమైన కొత్తలో పొగమంచులో స్పీడ్ బ్రేకర్లు కనిపించక ఒక హైటెక్ బస్సును ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కూడా పలువురు గాయపడ్డారు. టోల్గేట్ నిర్వాహకులపై విమర్శలు వస్తున్నా ఎలాంటి చర్యలూ కానరావడం లేదు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా లారీలో భారీగా జనాన్ని పెళ్లికి తరలించడాన్ని పోలీసు, రవాణా అధికారులు పట్టించుకోకపోడం ప్రమాదానికి మరో కారణంగా భావిస్తున్నారు. -
యూపీలో బీజేపీ ఎమ్మెల్యే దౌర్జన్యం
-
ఇన్ఫ్రా రంగం ప్రతికూలం–ఇండ్ రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రేటింగ్ ఎజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రిసర్చ్ (ఇండ్–రా) 2017–18లో మౌలిక రంగం ప్రతికూలంగా ఉంటుందని తెలిపింది. టోల్ రోడ్లు, బొగ్గు ఆధారిత విద్యుత్, పవన విద్యుత్ విభాగాలకు ఎదురుగాలి తప్పదని ఇండ్–రా ఇన్ఫ్రా, ప్రాజెక్ట్ ఫైనాన్స్ సీనియర్ డైరెక్టర్ వెంకట్రామన్ రాజారామన్ తెలిపారు. ఇన్ఫ్రా రంగం క్రెడిట్ ఔట్లుక్ నివేదికను విడుదల చేసిన సందర్భంగా మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. నివేదిక ప్రకారం.. ప్రభుత్వ విధానాలు, ప్రయాణికుల వృద్ధి కారణంగా విమానయాన రంగానికి వచ్చే ఆర్థిక సంవత్సరం సానుకూలంగా ఉంటుంది. సోలార్, పోర్టులు, ట్రాన్స్మిషన్ రంగాలు స్థిరంగా ఉంటాయి. -
సఖీ.. ఎంత లక్కీ!
భార్యను ఆటపట్టించకపోతే తను భర్తెలా అవుతాడు? భర్తను ఆటాడించకపోతే ఆమె మిసెస్ బంగారం ఎలా అవుతుంది? రోజూ పొగడ్తలు వింటే బోరు కొట్టదూ! కాఫీలో చక్కెర తక్కువైందనో సినిమా చూసి చాలాకాలం అయిందనో ఒకర్నొకరు విసుర్లాడుకోకపోతే ప్రేమ పూసేదెలా? విరగ కాసేదెలా? అవును. చిన్నచిన్నగా సఖ్యతను పెంచుకుంటుంటే.. పెద్దపెద్ద అభిప్రాయాలలోనూ ఏకభావన వస్తుంది. సఖీ... చిన్నచిన్న సంతోషాలు ఎంచుకో. సఖ్యత పెంచుకో. పొంచివున్న నక్కల నుంచి నిన్ను నువ్వు రక్షించుకో. ‘సఖీ.. ఎంత లక్కీ!’ అనిపించుకో. ఆఫీస్‌కి బయల్దేరడానికి బ్యాగ్ తీసుకొని గది బయటకు వచ్చిన మధుమతికి ఒక్క క్షణం ఏం జరిగిందో అర్ధం కాలేదు. టిఫిన్ ప్లేట్ వచ్చి గోడకు కొట్టుకొని, గింగిరాలు తిరిగి తన కాళ్ల మీద పడింది. ప్లేట్లో ఉన్న ఇడ్లీ ముక్కలు చిందరవందరగా ఫ్లోర్ అంతా పడ్డాయి. బిత్తరపోయి భర్త సురేశ్ వైపు చూసింది. ‘‘దగ్గరుండి వడ్డించాలనే స్పృహ కూడా లేదు. వీడి మొహానికి ఇదే ఎక్కువ అనేగా నీ ఉద్దేశం..’ తిట్టుకుంటూనే బయటకు వెళ్లిపోయాడు. సహనం నశిస్తోంది ‘‘మధూ... ఏంటలా ఉన్నావ్!’’ భుజం మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా బృంద. ఆఫీసులో సహోద్యోగి బృంద. కళ్ల నీళ్లు తుడుచుకుంటున్న మధుమతిని చూస్తూ.. ‘‘మళ్లీ ఇంట్లో గొడవా!’’ అంది. ‘అవును’ అన్నట్టు తలూపింది మధుమతి. ఇద్దరూ టీ బ్రేక్కని సెక్షన్ నుంచి బయటకు వెళ్లారు. ‘‘సురేశ్‌ని భరించేటంత సహనం ఇక లేదే. బయటకు వచ్చేద్దామనుకుంటున్నాను’’ అంది మధుమతి. ‘‘తొందరపడకు. సాయంత్రం కలుద్దాం’’ అంటూ మధు భుజమ్మీద చెయ్యి వేసి అనునయంగా చెప్పి, తన సెక్షన్వైపు వెళ్లిపోయింది బృంద. సహోద్యోగులే అయినా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేటంత చనువు ఉంది ఇద్దరి మధ్య. మధుమతి నిట్టూర్చుతూ తన సీట్లో కూలబడింది. విసుగ్గా అనిపిస్తోంది మధుమతి భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరికీ పెళ్లై రెండేళ్లు. పెద్దలు నిశ్చయించినదే! పెళ్లయిన రెండోరోజే తన పట్ల నిరసన చూపడం మొదలుపెట్టాడు సురేశ్. బట్టలు నీటుగా సర్దలేదని, వంట చేయడం రాదని.. తగువు పెట్టుకున్నాడు. టీ త్వరగా తేలేదని ఓ రోజు, నీళ్లు ఒలకబోసావని ఒకరోజు.. అయినదానికీ కానిదానికి గొడవే. పెళ్లయిన రెండు నెలలకి గ్రోత్ లేదని చేస్తున్న ఉద్యోగం మానేశాడు. ఇల్లు గడవాలనే ఆలోచనతో తనే ఉద్యోగంలో చేరింది. ఈ రెండేళ్లలో సరదాగా సినిమాకో, హోటల్‌కో వెళ్లడం రెండు, మూడుసార్లకి మించి లేదు. తనే నోరు తెరిచి అడిగితే డబ్బులు ఎందుకు దండగ అంటూ రివర్స్ ఉపన్యాసాలు మొదలుపెట్టాడు. ఆఫీసులో ఉన్నంత సేపు బాగానే ఉంటుంది. ఇంటికి వెళ్లాలంటేనే భయంగా ఉంటుంది. ఆలస్యానికి ప్రతిరోజూ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకు భరిస్తుందో అర్థం కావడం లేదు. ప్రతీ చిన్నదానికి విసుగ్గా అనిపిస్తుంది. ఆ విసుగు ఈ మధ్య ఇంకా పెరిగింది. దానికి కారణం.. క్రాంతేనా?! సురేశ్‌కి, క్రాంతికీ ఎంత తేడా! మధుమతి ఉద్యోగం చేస్తున్న కంపెనీలోనే క్రాంతి పని చేస్తున్నాడు. అతను ఆ ఆఫీసులో చేరి ఆర్నెల్లవుతోంది. బ్యాచిలర్. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలివిడిగా ఉండే క్రాంతి అంటే అక్కడున్న అందరికీ ఇష్టం. అయితే అతడి ధ్యాసంతా.. ఎప్పుడూ ముభావంగా ఉండే మధుమతిపై ఉండేది. కొద్ది రోజుల్లోనే ఆమె విషయాలన్నీ రాబట్టాడు. సంతోషంగా ఎందుకు ఉండాలో చెబుతూ, ఎప్పుడు ఏ సాయమడిగినా ‘జీ హుజూర్’ అంటూ క్షణాల్లో చేసి పెట్టేవాడు. దీంతో మధుమతికి క్రాంతి మీద ఆసక్తి కలగడం మొదలైంది. ఎప్పుడూ తప్పులు ఎత్తిచూపే భర్త, ఎప్పుడూ సంతోషంగా ఉంచే క్రాంతి.. ఇద్దరినీ బేరీజు వేసుకోవడం మొదలుపెట్టింది మధుమతి. ఊహించని పరిణామం! సరేశ్ ఉదయం చేసిన రాద్ధాంతానికి మధుమతి మనసు చివుక్కుమంది. ‘తనను అపురూపంగా చూసే క్రాంతితో కలిసి బతికితే...’ అనిపించింది ఒక్క క్షణం. అంతే, ఈ ఆలోచనతో మధుమతిలో అలజడి మొదలైంది. తన పుట్టిన రోజు అని ఆఫీసు టైమ్ అవగానే కలుద్దామని చెప్పి వెళ్లాడు క్రాంతి. కాదని చెప్పలేకపోయింది. సాయంకాలం పార్క్‌కి తీసుకెళ్లాడు క్రాంతి. ‘నీ రాకతో ఈ వాతావరణం ఎంత ఆహ్లాదంగా మారిపోయిందో చూడు’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ మాటలకు మురిసిపోయింది మధుమతి. ఉన్నట్టుండి క్రాంతి మధుమతి చెయ్యి తీసుకొని తన గుండెల మీద పెట్టుకున్నాడు. తనను చుట్టేసి ‘నువ్వు లేనిదే నేను లేను’ అన్నాడు. ఊహించని ఆ పరిణామానికి ఉలిక్కిపడింది. క్రాంతిని తప్పించుకొని ఇంటి దారిపట్టింది. ఆ రోజు నుంచి తిండికీ, నిద్రకు దూరమైంది. జీవితం... అయోమయం స్నేహితురాలి సలహాతో రిగ్రెషన్ థెరపీకి వెళ్లింది మధుమతి. తన అంతర్మథనానికి పరిష్కారం కోరుతూ కౌన్సెలర్ ముందు కూర్చుంది.‘‘నా కొలీగ్ని ఇష్టపడుతున్నానా? నా భర్తను కాదనుకొని అతనితో వెళ్లిపోతే? నా జీవితం అంతా అయోమ యంగా ఉంది.. ’’ కళ్ల నీళ్లు ఆపే ప్రయత్నంలో మాటలనూ ఆపేసింది. కాసేపు ఆగి ‘‘నా ప్రశ్నకు సమాధానం ఎక్కడుంది?! ’’ అంది మధుమతి. ఆమె మాటలకు..‘‘మీలోనే ఉంది. తెలుసుకోండి..’’ అన్నారు కౌన్సెలర్. మధుమతికి రిగ్రెషన్ థెరపీ మొదలయ్యింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పదిహేను నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. ఈ ధాన్యప్రక్రియలో మధుమతికి అస్పష్టతలు స్పష్టం అవడం మొదలైంది. ఆందోళనలు ఆలోచనలవైపుగా మరలుతున్నాయి. పెళ్లి నాటి రోజులు, కాలేజీ రోజులు, అమ్మనాన్న గారాబం, బాల్యం.. అన్నింటినీ దర్శించుకుంటూ సమన్వయ పరుచుకుంటూ సినిమా రీలును వెనక్కి తిప్పినట్టుగా కాలాన్ని రివైండ్ చేస్తూ తన జీవితాన్ని దర్శిస్తోంది. అమ్మ గర్భంలో ఉన్న స్థితి నుంచి గత జన్మలోకి ప్రయాణించింది. ఆ ప్రయాణంలో సురేశ్ రూపం లీలగా కాసేపటికి స్పష్టంగా కనిపించసాగింది. నెమ్మదించిన ఆమె మనోగతాన్ని ప్రశ్నిస్తూ కౌన్సెలర్..‘‘మధుమతీ, మీ మనోఫలకం మీద ఇప్పుడు ఏం కనిపిస్తోంది?’’ అని అడిగారు. గతజన్మ గురువు.. ఈ జన్మ భర్త! మధుమతి చెప్పడం మొదలుపెట్టింది... ‘‘నాకు సురేశ్ కనిపిస్తున్నాడు. అతను నాకు గైడ్‌గా ఉన్నాడు. నేను అతని విద్యార్థిగా ఉన్నాను. అతను చెప్పిన విషయాలేవీ నేను పట్టించుకోవడం లేదు. ప్రతి చిన్న విషయానికీ అతనితో వాదిస్తున్నాను. గొడవ చేస్తున్నాను. సహనంగా ఉండి, విషయాన్ని అర్థం చేసుకోమని అతను పదే పదే చెప్పినా నేను వినిపించుకోవడం లేదు. మళ్లీ మళ్లీ పొరపాట్లు చేస్తూనే ఉన్నాను. ఆకర్షణను ప్రేమగా భావించి క్రాంతితో వెళ్లిపోయాను. ఆ విధంగా నా డిగ్రీ పూర్తి కాలేదు. క్రాంతితో జీవితాన్ని ఆనందించలేక, ఎదుగుదల లేక బతికినన్నాళ్లూ మానసిక క్షోభను అనుభవించాను. నా గైడ్ చెప్పింది వినడానికే ఈ జన్మలో సురేశ్‌ని భర్తగా ఆహ్వానించాను. అందుకే అతని నుంచి దూరం కాలేకపోతున్నాను. క్రాంతిపై ఉన్న ఆకర్షణ నా జీవితాన్ని అసంపూర్ణం చేస్తోందని తెలుసుకోలేకపోతున్నాను’’ చెప్పింది మధుమతి. ‘‘గతం నుంచి ప్రస్తుతంలోకి రండి. ఈ జన్మలో ఈ రెండేళ్ల మీ జీవితాన్ని దర్శించండి. పొరపాట్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి...’’ అన్నారు కౌన్సెలర్. వర్తమానంలోనూ అదే భావన మధుమతి తన వైవాహిక జీవితాన్ని దర్శిస్తూ చెప్పడం మొదలుపెట్టింది. ‘‘ఆనందం లేదంటూనే సురేశ్తోనే ఉంటున్నాను. అతని ప్రవర్తననూ భరిస్తున్నాను. కాదు కాదు నా ప్రవర్తననే సురేశ్ భరిస్తూ వచ్చాడు. నేనే అతనితో సఖ్యతగా మెలగాలని, వైవాహిక జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలనే జ్ఞానాన్ని కోల్పోయాను. గతాన్ని ఈ జన్మకూ మోసుకొచ్చాను. ఎంత కంఫర్ట్‌గా ఉండాలని ప్రయత్నించినా సురేశ్ నాకు గైడ్ అనే భావనలోనే ఉన్నాను. అందుకే ఇన్నాళ్లూ అతన్ని భర్తగా అంగీకరించలేకపోయాను. దీని వల్లే అతనికి మానసికంగా, శారీకంగా దగ్గర కాలేకపోయాను. అతని పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాను. జీవితాన్ని అసంపూర్ణంగా మోస్తూ వస్తున్నాను..’’ అంటూ, ‘‘ఎరుకతో జీవితాన్ని సరిదిద్దుకోవాలని ఉంది’’ అని చెప్పింది మధుమతి. గతాన్ని విగతం చేస్తే వర్తమానం ఎంత అందంగా ఉంటుందో థెరపీలో తెలుసుకుంది. గైడ్‌గా తన సహనాన్ని పరీక్షించడానికే భర్తగా వచ్చిన సురేశ్‌తో సఖ్యతగా ఉండటానికి, అతడిని మార్చుకోవడానికే అంగీకరించింది. సఖ్యతతో దగ్గరైన మనసులు ‘‘మధూ... ’’ భర్త అరుపులకు కంగారుపడుతూ వచ్చింది మధుమతి. ‘‘ఈ కాఫీ ఏంటి? ఇంత చల్లగా...’’ విసుగ్గా అంటున్న సురేశ్‌కి అంతే ఘాటుగా సమాధానమిద్దానుకుంది. అంతలో నిభాయించుకొని అతనికి దగ్గరగా వచ్చి కాఫీని చూసింది. పైన మీగడ తెట్టు కట్టుకుపోయి చల్లగా ఉన్న కాఫీని చూసి ‘అయ్యో, సారీ.. సారీ.. ’’ అంటూ వెళ్లి వేడి వేడి కాఫీ తీసుకొచ్చి సురేశ్ చేతికి అందిస్తూ చిరునవ్వు నవ్వింది. ‘నీ నవ్వు బాగుంటుందోయ్!’ కాఫీ అందుకుంటూ సురేశ్ మెచ్చుకోలుగా చూశాడు. ఆ మెచ్చుకోలును చిరునవ్వుకు ఆనందపు హంగుగా అద్దుకుంది మధుమతి. చిన్న చిన్న విషయాల్లో సఖ్యత ఎలాంటి ఇల్లు రెంట్‌కు తీసుకుంటున్నాం. లేదా ఎలాంటి ఇల్లు కొంటున్నాం. ఎలాంటి వాహనం కొనబోతున్నాం. పిల్లలను ఎలాంటి స్కూల్లో చదివించాలి... ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాల్లో భార్యాభర్త మధ్య సఖ్యత కుదరకపోవచ్చు. ఎందుకంటే అక్కడ సఖ్యత కన్నా అభిప్రాయం ముఖ్యం అవుతుంది. కానీ, చిన్న చిన్న విషయాలలో సఖ్యత కుదిరే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే, ‘నీకు ఆరెంజ్ కలర్ చీర భలేగా ఉంటుంది రా!’, ‘మీకు బ్లూ కలర్ షర్ట్ సూటవుతుందండి,’ ‘రాత్రిపూట ఒక గ్లాసు పాలు తాగితే నిద్ర బాగా వస్తుందండి’, ‘పొద్దునే వాకింగ్‌కి వస్తావా! భలే సరదాగా ఉంటుంది’ ... ఇలాంటి చిన్న చిన్న విషయాలల్లో సఖ్యత కుదుర్చుకుంటే బంధం బలపడుతుంది. పాఠాన్ని గుర్తిస్తే సఖ్యత చాలావరకు జంటలు పరిస్థితులు ఎలా ఉన్నా కలిసి ఉండాలనే కోరుకుంటారు. ఆ బంధం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠమేదో ఉన్నదని గుర్తిస్తే చాలు సఖ్యత పెరిగేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు. బంధంలో సమస్యలు సహజం. అవి తగ్గుముఖం పట్టేలా ఏం చేయవచ్చో అందుకు తగిన ప్రయత్నాలవైపు దృష్టిపెట్టాలి. భవిష్యత్తులో తమ బంధం ఎంత అందంగా మార్చుకోవచ్చో తెలుసుకుంటే ఇద్దరిలోనూ ఆశించిన మార్పులు వస్తాయి. జీవనప్రయాణం అర్థం అయితే బంధాన్ని పటిష్టం చేసుకుంటారు. గతాన్ని అర్థం చేసుకొని విగతం చేసుకుంటే వర్తమానం అందంగా రూపుకడుతుంది. – డాక్టర్ హరికుమార్, జనరల్ సర్జన్, ఫ్యూచర్‌లైఫ్ థెరపిస్ట్, హైదరాబాద్ గమనిక : ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ అంతర్జాతీయంగా ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియకు విస్తృతమైన ఆమోదం లభించకపోయినా.. థెరపీ ప్రయోజనాలపై ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఇవి కొన్ని. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
టచ్ అండ్ గో!
ఓఆర్ఆర్పై ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్ కార్డులతో చెల్లింపులు... ఆటోమేటిక్ ఎగ్జిట్ వాహనదారులకు సమయం ఆదా.. భారీ క్యూలకు ఇక చెక్ సిటీబ్యూరో: అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ వసూళ్లను సమర్థంగా నిర్వహించడంతో పాటు వాహనదారులకు సౌలభ్యంగా ఉండేందుకు హెచ్ఎండీఏ సరికొత్త టెక్నాలజీతో ముందుకొస్తోంది. ఇప్పటివరకు టోల్‌ప్లాజాల వద్ద డబ్బులిచ్చే పద్ధతికి స్వస్తి పలికి ఆ స్థానంలో ఏటీఎం కార్డు మాదిరిగానే ఉండే ‘టచ్ అండ్ గో’ కార్డు, ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ఈటీసీ) కార్డులను వాహనదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. కార్లు, లారీలతో పాటు ఓఆర్ఆర్పై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ఈ కార్డులను కొనుగోలు చేసేందుకు టోల్ ప్లాజా కార్యాలయాల వద్ద పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రయాణించిన దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేసే టోల్ సిస్టమ్ త్వరలోనే కనుమరుగుకానుంది. దేశంలోనే తొలిసారిగా డెడికేటెడ్ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ (డీఎస్ఆర్సీ) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జారీ చేయనున్న ఈ కార్డుల వినియోగం ద్వారా వాహనదారుల జర్నీ సమయం చాలా ఆదా కానుంది. టచ్ చేసి వెళ్లడమే... 156.8 కిలోమీటర్లున్న ఓఆర్ఆర్పై 19 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటన్నింటిని దాటుకొని వెళ్లాలంటే వాహనదారులకు చాలా సమయం పడుతోంది. టోల్‌ప్లాజాల వద్ద ఒక్కోసారి వాహనాల రద్దీ ఎక్కువై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో వారి సమయం చాలా వృథా కావడంతో పాటు వాహనదారుల నుంచి డబ్బులు తీసుకొని రశీదు ఇచ్చి పంపడం కూడా సిబ్బందికి భారంగా మారుతోంది. టోల్ వసూళ్లలో పారదర్శకత తీసుకరావడంతో పాటు వాహనదారుల ప్రయాణం సౌలభ్యంగా ఉండేందుకోసం ‘టచ్ అండ్ గో’ కార్డును పరిచయం చేస్తున్నారు. ఈ కార్డును తీసుకున్న వాహనదారుడు 157 మాన్యువుల్, టంచ్ అండ్ గో లేన్స్‌లో వెళ్లవచ్చు. తమ కార్డును టోల్‌ప్లాజా వద్ద ఉండే స్క్రీన్కు చూపించి ముందుకెళ్లాలి. అలా చూపడం వల్ల ఆ కార్డులో ఉండే నగదును ఆ సిస్టమ్ ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది. దాదాపు రూ.200లకే అందుబాటులోకి తీసుకురానున్న ఈ కార్డులో టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటుచేసే పీవోసీలో రీచార్జ్ చేసుకునే వీలును కలిపించారు. భవిష్యత్‌లో మొబైల్ రీచార్జ్ సేవలు కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ‘యాంటీనా’ ద్వారా క్లియరెన్స్ టచ్ అండ్ గో మాదిరిగానే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ఈటీసీ) కార్డు కూడా పనిచేస్తుంది. ఓఆర్ఆర్లో ఈటీసీ కార్డును వినియోగించే వాహనాలను 23 లేన్లలో మాత్రమే అనుమతించనున్నారు. ఈ లేన్‌లోకి ఎంట్రీ అయ్యే ముందు వాహనాన్ని అక్కడ ఏర్పాటుచేసిన తొలి యాంటీనా... కార్డు వ్యాలిడ్ కాదా అవునా.. అని గుర్తిస్తుంది. అంతా ఓకే అనుకున్నాక తొలి గేట్ దానంతట అదే తెరుచుకుంటుంది. ఆ తర్వాత కారు ఎక్కడ ఏ టైంలో ఓఆర్ఆర్ ఎక్కిందో రికార్డు చేసుకుంటుంది. అది ఓఆర్ఆర్ ఎగ్జిట్ టోల్‌బూత్ నుంచి నిష్క్రమించగానే ఆ కార్డు నుంచి డబ్బులను ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఈటీసీ టెక్నాలజీని జపాన్ నుంచి వినియోగించుకుంటున్నారు. ఈటీసీ కార్డుకు దాదాపు రూ.2,000 వరకు చెల్లించాల్సి ఉంటుందని హెచ్ఎండీఏ అధికారులు అంటున్నారు. ఈ కార్డులను కూడా టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటుచేసే పీవోసీలో రీచార్జ్ చేసుకునే వీలును కలిపించారు. నానక్‌రామ్‌గూడలో ఏర్పాటుచేయనున్న ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ ద్వారా ఈ సేవలను అనునిత్యం అధికారులు పర్యవేక్షించనున్నారు. -
కొత్త కోడి.. గమ్మత్తు కోడి
భోగి వెలుగులు పదీపదిన్నరకైనా నోట్లోకి టూత్‌బ్రెష్ వచ్చేయడం పెద్ద ప్రారంభోత్సవం. స్నానం ముగించడం మహోత్సవం. బయటికొచ్చి మనుషులకు కనిపించడం బ్రహ్మోత్సవం. ఉదయాన్నే చల్లగా బస్సు దిగి ఉంటారు. మరీ ఉదయాన్నే దిగి ఉంటే, భోగి మంటల్ని దాటుకుని వెచ్చగా ఇంట్లోకి వెళ్లిపోయి ఉంటారు. మళ్లీ పడుకోడానికి! అంత త్వరగా తెల్లారిపోతే ఎలా? హైదరాబాద్ మెట్రో బాడీ తట్టుకుంటుందా! కనీసం పది వరకైనా పడుకోవాలి. పదిన్నరకు లేచినా లైఫ్‌లో అదో పెద్ద అచీవ్మెంట్. నోట్లోకి టూత్‌బ్రెష్ వచ్చేయడం పెద్ద ప్రారంభోత్సవం. స్నానం ముగించడం మహోత్సవం. బయటికొచ్చి మనుషులకు కనిపించడం బ్రహ్మోత్సవం. ఎప్పుడైనా చూడండి.. మనిషి కన్నా ఊరే ముందు నిద్రలేస్తుంది. కోడి నిద్రలేపుతుంది అనుకుంటాం. కోడిని కూడా ఊరే నిద్రలేపుతుంది. పొలం వెళ్లడానికి, పాలు పొయ్యడానికి ఊళ్లో ఒక్కరు ముందు లేచినా.. ఊరే ముందు లేచినట్టు! ఒళ్లు అలిసి పొలంవాళ్లు, పాలవాళ్లు లేవడం కొద్దిగా అలస్యం అయినా సరే, ఊరే ముందు నిద్రలేచినట్లు. వాళ్లకంటే ముందు వాళ్ల ఇంటి ఇల్లాలు లేచి ఉంటుంది కాబట్టి! ఒంట్లో ఆమెకు ఎలా ఉన్నా, ఇంటికోసం లేచి కూర్చుంటుంది. అందుకే కోడి.. ఊరితో పెట్టుకున్నా ఇల్లాలితో పెట్టుకోదు. పనిలేని వాళ్లు కోడితో గేమ్స్ ఆడుతున్నారని చెప్పి, పని తెమలని ఇల్లాళ్లతో కోడి గేమ్స్ ఆడదు. వాళ్ల దగ్గర ఒళ్లు దగ్గర పెట్టుకుంటుంది. ‘లేడీస్ ఫస్ట్’ అని రెస్పెక్ట్ ఇస్తుంది. వాకిట్లో బరాబరామని చీపురు చప్పుడు విన్నాకే, కోడి కొక్కొరొకోమంటుంది. కావాలంటే ఉదయాన్నే లేచి చూడండి. ముందు లేవడం, ముగ్గులెయ్యడం.. ఊళ్లకు, ఇల్లాళ్లకు అచీవ్మెంట్కాదు. అదొక మామూలు పని. మనిషన్నవాళ్లు చెయ్యవలసిన పని. ఏ టైమ్‌కి చెయ్యాల్సిన పనిని ఆ టైమ్‌కి చెయ్యని మనిషిని ఊరిప్పుడు కోపంగా చూస్తోందో లేదో.. ఊళ్లో ఉన్న కోడి మాత్రం విడ్డూరంగా చూస్తుంది. రాత్రే కదా హైదరాబాద్‌లో బయల్దేరాం. మనలో కొందరింకా బస్సులోనే ఉండి ఉంటారు. వాళ్లు ఊళ్లో దిగ్గానే కోడి మెడ తిప్పి చూస్తుంది.. వీడెవడో కొత్త కోడిలా ఉన్నాడని.. ఎత్తు కోడిలా ఉన్నాడని.. గమ్మత్తు కోడిలా ఉన్నాడని చూస్తుంది! చేత్తో సూట్‌కేస్ పట్టుకుని, భుజాల వెనక్కి బ్యాగు వేలాడేసుని ఊళ్లోకి దిగిన ఆ కోడి.. అల్లుడు కోడా, కొడుకు కోడా, అన్న కోడా, తమ్ముడి కోడా, బావ కోడా, మరిది కోడా అని చూస్తుంది. వాళ్ల పక్కనే ఇంకేదైనా కోడి కనిపిస్తే అది అతిథి కోడా, అతి చేయబోతున్న కోడా అని ఒకట్రెండుసార్లు తలతిప్పి చూస్తుంది. కోడి తలతిప్పి చూసిందంటే.. ఆయనెవరో లీడర్లా అది మనల్ని ప్రశ్నిస్తోందనే! కోడికి తన టైమింగ్స్ తప్ప హైదరాబాద్‌లో ఉన్న ఎంజీబీస్ టైమింగ్‌లు, జేబీఎస్ టైమింగులు తెలీవు. దారి మధ్యలో ఉండే టోల్గేట్లు, రైల్వేగేట్ల గురించి తెలీదు. ‘ఏబ్బాయ్ ఇప్పుడు తెల్లారిందా?’ అన్నట్టు చూస్తుంది. ‘ఒకరోజు ముందుకు రాలేకపోయా’ అన్నట్టు చూస్తుంది. ‘ముందొస్తే నువ్వూ భోగిమంటలకు కూర్చునేవాడివిగా.. చిన్న ఎండుపుల్లైనా వేసేవాడివి..’ అన్నట్టు చూస్తుంది. ఊరు అలా చూడదు. కన్నతల్లి కదా.. కోడిలానో, లీడర్లానో ప్రశ్నించదు. వచ్చిందే చాలనుకుంటుంది. సంక్రాంతి వచ్చేసిందనుకుంటుంది. కోడికి ఒకటే రూపం. ఊరికి మలుపుకో రూపం. పెద్ద కాల్వ ఒక రూపం. ప్రాథమిక పాఠశాల ఒక రూపం. దొరువు ఒక రూపం. దొరువు గట్టు మీద ఊడలమర్రి ఒక రూపం. అమ్మ పిలుపు ఒక రూపం. నాన్న జ్ఞాపకాలు ఒక రూపం. పెద్దకాలువ వీపు నిమిరిందీ, పాఠశాల పలక దిద్దిందీ, ఊడలమర్రి చీకట్లో దెయ్యమయి ఊగిందీ, ‘ఒరే ఎక్కడ్రా’ అని అమ్మ గాభరాగా ఊరంతా వెతుకులాడిందీ, సెకండ్ క్లాసొచ్చి తలవంపులు తెచ్చినందుకు ‘వాడీ ఇంట్లో ఉండటానికి వీల్లేదు’ అని నాన్న అనలేకపోయిందీ.. తడిమే జ్ఞాపకాలే కానీ, తడుముకునేలా చేసే ప్రశ్నలు కాదు. ‘ఎన్నేళ్లయిందిరా నిన్నుచూ సి’ అని ఊరు ఊరంతా అమ్మై చూసే ఒక్క చూపుకు జలజలా రాలే కన్నీళ్లు.. ఎన్ని భోగిమంటలకు మనం ఊరొచ్చి వెళితే ఆ భగభగల్లో ప్రక్షాళన అవుతాయో సీఎం కేసీఆర్ చెప్పలేడు, మాదాపూర్‌లోని హైటెక్ సీటీ చెప్పలేదు. చలి మూడు నెలలు ఉండిపోతుంది. సంక్రాంతికో, శివరాత్రికో వెళ్లిపోతుంది. ఊరు దాటొచ్చిన బతుకులోని ముక్కుదిబ్బడ కూడా.. ఉండాలి, పోవాలి తప్ప.. ఉండిపోకూడదు. ఊళ్లో బతుకు లేదనుకున్నప్పుడు ఉద్యోగం మనల్ని ఒళ్లోకి తీసుకున్న మాట నిజం. ఉద్యోగమే బతుకైపోతున్నప్పుడు.. ఒక్కసారైనా వచ్చిపొమ్మని ఊరు మన కోసమే.. కేవలం మన కోసమే భోగినీ, సంక్రాంతినీ చేసుకుంటున్నదీ నిజం. మాధవ్ శింగరాజు -
టోల్‌ప్లాజాలో దారుణం.. వీడియో
గురుగ్రామ్: ఢిల్లీ శివారులోని గురుగ్రామ్ టోల్ ప్లాజా వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. భారీ ట్రాఫిక్ మూలంగా ఎక్కువ సమయం టోల్ ప్లాజా వద్ద వెయిట్ చేయాల్సిరావడంతో.. కొందరు దుండుగులు అక్కడి సిబ్బందిపై దాడి చేశాడు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ.. టోల్ ప్లాజాను ధ్వంసం చేశారు. దుండగులు సిబ్బందిపై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీ ఫొటేజి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
గ్రామాల్లో ఆరోగ్య సేవలకు 10588
న్యూఢిల్లీ: గ్రామీణులు తమ ప్రాంతంలో మాతాశిశువులకు ఉన్న ఆరోగ్య సౌకర్యాల గురించి విచారించుకోడానికి, ఫిర్యాదులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబరును ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు 10588 అనే నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే 90 సెకన్లలో కాల్ సెంటర్ నుంచి ఫోన్ వస్తుంది. అక్కడి సిబ్బంది వినియోగదారుల సందేహాలను నివృత్తి చేస్తారు. కాల్ సెంటర్‌ను తెలుగు సహా ఏడు భాషల్లో నిర్వహించనున్నారు. -
కాల్ డ్రాప్స్‌కి టోల్‌ఫ్రీ.. ‘1955’!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కాల్ డ్రాప్స్‌కు ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కాల్ డ్రాప్స్‌కు ‘1955’ నంబర్ కేటాయించినట్లు అధికారిక సమాచారం. ఈ నంబర్ ద్వారా టెలికం సబ్స్క్రైబర్ల కాల్ డ్రాప్స్పైఫీడ్బ్యాక్ ఇవ్వొచ్చు. ‘1955’ నంబర్ కేటాయింపు అన్ని టెల్కోలకు తప్పనిసరి. ఈ నంబర్ ఎస్టీడీ, లోకల్ కాలింగ్‌కు అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ రంగ ఎంటీఎన్ఎల్ ఈ నంబర్ అమలు, నిర్వహణ బాధ్యతలనుచూసుకోనుంది. దీని నుంచి టెల్కోలు ఎలాంటి ఫీజులను వసూలు చేయకూడదు. ఇక టెలికం మంత్రి మనోజ్ సిన్హా ఈ నంబర్‌ను ప్రారంభిస్తారని సమాచారం. -
‘టోలు’ తీసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రోడ్డెక్కితే చాలు ‘టోలు’ తీసేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమైంది. రాష్ట్ర రహదారులపై టోల్ వసూళ్లను దశల వారీగా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ రోడ్డువిస్తరణ కోసం పీపీపీ (ప్రభుత్వ-ప్రై వేటు భాగస్వామ్యం) ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. మొత్తం 32 రహదారులను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు రూ.8,182 కోట్లతో ప్రణాళికలు తయారు చేసింది. ఇందులో పీపీపీ ప్రాజెక్టుల కింద గుంటూరు-బాపట్ల, విజయనగరం-పాలకొండ రహదారులకుగాను రూ.1,462 కోట్లతో ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో గురువారం ఈ రెండు రహదారులకు పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంబాబ్ జీవో జారీ చేశారు. టోల్ ప్లస్ యాన్యుటీ విధానంలో ఈ రెండు రహదారులకు అనుమతులిచ్చారు. గుంటూరు-బాపట్ల నాలుగు లేన్ల రహదారికి రూ.849 కోట్లు, విజయనగరం-పాలకొండ రెండు/నాలుగు లేన్ల రహదారికి రూ.613 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. గుంటూరు-బాపట్ల రహదారికి మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.571 కోట్లు కాగా, భూ సేకరణకు రూ.207 కోట్లు, పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలకు రూ.46 కోట్లు, బదలాయింపు కార్యక్రమాలకు రూ.25 కోట్లు కేటాయించారు. విజయనగరం-బాపట్ల రహదారికి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.434 కోట్లు.. ఇందులో సివిల్ కనస్ట్రక్షన్ ఖర్చు రూ.347.87 కోట్లు కాగా, భూమి సూకరణకు రూ.126 కోట్లు, బదలాయింపు కార్యక్రమాలకు రూ.17.39 కోట్లు, కిలోమీటరుకు సివిల్ వర్కు వ్యయం రూ.4.73 కోట్లు చొప్పున కేటాయించారు. -
15 వరకు పాత నోట్లతో చెల్లింపులు
న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద పోలీసులను మోహరించాలని రాష్ట్రాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. పాత నోట్ల రద్దు నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని పేర్కొంది. పాత 500 రూపాయలతో టోల్ గేట్ల వద్ద డిసెంబర్ 15 వరకు టోల్ ట్యాక్స్ చెల్లించవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు జరిపేందుకు అవకాశాలున్నాయని వెల్లడించింది. -
టోల్ తిప్పలు షురూ
- వాహనదారులకు మళ్లీ ‘చిల్లర’ కష్టాలు - రూ.2 వేల నోటు తీసుకోని టోల్‌ప్లాజా నిర్వాహకులు.. పలుచోట్ల వాగ్వాదం - రహదారులపై భారీగా నిలిచిపోరుున వాహనాలు - స్వైపింగ్ మిషన్ల ఏర్పాటుతో అక్కడక్కడ కాస్త ఊరట సాక్షి నెట్వర్క్: రహదారులపై టోల్ తిప్పలు మళ్లీ మొదలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి టోల్ వసూలు ప్రారంభమవడంతో చిల్లర కొరతతో అటు వాహనదారులు, ఇటు టోల్‌ప్లాజా నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల నిర్వాహకులు స్వైపింగ్ యంత్రాలతో రుసుము వసూలు చేసినా.. కార్డులు, సరిపడ చిల్లర లేనివాళ్లు నానా తిప్పలు పడ్డారు. పలుచోట్ల వాహనదారులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. అనేకచోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ వసూలును మరికొన్ని రోజులు నిలిపి వేయాలని, రూ.500, రూ.100, రూ.50 నోట్లను అవసరమైన మేర విడుదల చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. దారులపై బారులు పెద్ద అంబర్‌పేట ఔటర్‌రింగ్ రోడ్డుపై ఉన్న టోల్‌గేటు వద్ద రూ.2 వేల నోటుకు చిల్లర ఇచ్చేందుకు టోల్ సిబ్బంది నిరాకరించడంతో పలువురు వాహనదారులు వాగ్వాదానికి దిగారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నానక్‌రాంగూడ వద్ద వందలాది వాహనాలు నిలిచిపోయారుు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న రారుుకల్ టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వారుు మండలంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా నిర్వాహకులు స్వైపింగ్ మిషన్లు సిద్ధంగా ఉంచినా రాత్రి వరకు పని చేయలేదు. కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని జాతీయ రహదారిపై ఉన్న టోల్గేట్ వద్ద ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొందరు వాహనదారులు పాత రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవాలని టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ శివారులోని టోల్‌ప్లాజాల వద్ద కూడా స్వైప్ మిషన్లను అందుబాటులోకి తెచ్చారు. కొందరు కొత్త రూ.2 వేల నోటు ఇవ్వడంతో నిర్వాహకులు చిల్లర లేదన్నారు. దీంతో వాహనదారులు వారితో వాగ్వాదానికి దిగారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని ముత్తంగి ఔటర్ రింగ్‌రోడ్డు టోల్‌ప్లాజా వద్ద ఐదు బూత్‌లకు గాను ఒకే స్వైపింగ్ యంత్రం అందుబాటులో ఉంచడంతో వాహనాలు భారీగా నిలిచిపోయారుు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద చిల్లర కొరతతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయారుు. -
టోల్గేట్ వద్ద స్వైపింగ్ మెషిన్లు
ఉంగుటూరు : పెద్ద నోట్ల రద్దుతో సుమారు 20 రోజులపాటు విశ్రాంతి తీసుకున్న టోల్గేట్లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభిం చాయి. దారి సుంకం (టోల్ ఫీ) వసూళ్లను మొదలుపెట్టారు. వీటివద్ద పాతనోట్లు తీసుకోవడం లేదు. ఉంగుటూరు మండలం నాచుగుంట టోల్‌ప్లాజా వద్ల 6 స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేశారు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను అంగీకరిస్తున్నారు. వాహన చోదకుల్లో ఎక్కువ మంది వీటిని ఉపయోగించి నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీంతో టోల్గేట్ల వద్ద చిల్లర సమస్య తీరింది. -
టోల్గేట్ల వద్ద నోట్ల సంక్షోభం..
♦ వాహనదారులతో టోల్గేట్ సిబ్బంది వాగ్వాదం ♦ కిలోమీటర్ల మేర జాతీయ రహదారులపై బారులు తీరిన వాహనాలు అమరావతి: ఉచిత టోల్‌ఫీజు గడువు ముగిసింది. టోల్గేట్ల వద్ద చిల్లర కష్టాలు మొదలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని టోల్గేట్ల వద్ద ఫీజులు వసూలు ప్రారంభించారు. అర్ధరాత్రి వేళ పెద్ద నోట్లకు చిల్లర లేక వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. శనివారం తెల్లవారు జాము నుంచి టోల్గేట్ల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. డిసెంబరు 15వరకు రూ.500 నోటు తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. టోల్గేట్ సిబ్బంది తీసుకునేందుకు నిరాకరించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు స్వైపింగ్ మిషన్లు పనిచేయలేదు. టోల్‌ఫీజు రూ.200 దాటితేనే స్వైపింగ్‌కు అనుమతిస్తామని టోల్గేట్ల వద్ద సిబ్బంది స్పష్టం చేయడంతో కాజ, ఏలూరు సమీపంలో పొట్టిపాడు టోల్గేట్ల వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రూ.500 నోటును పాస్ టాగ్ తీసుకుంటే మాత్రమే అనుమతిస్తామని టోల్గేట్ల వద్ద సిబ్బంది బోర్డులు పెట్టారు. వాహనదారుడు రూ.2 వేల నోటు ఇస్తే తమ వద్ద చిల్లర లేదని, పాత రూ.500 నోట్లు తీసుకోవాలని సిబ్బంది చెప్పడంతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. పాత నోట్లు పెట్రోలు బంకుల్లో ఎక్కడా తీసుకోవడం లేదని, చివరకు టోల్‌ప్లాజాల్లో కూడా నిరాకరిస్తుంటే మేమెలా తీసుకుంటామని వాహనదారులు ప్రశ్నించారు. టోల్ చెల్లింపుల్లో గందరగోళంతో జాతీయ రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ-గుంటూరు, విజయవాడ-హైదరాబాద్, అద్దంకి-నార్కట్‌పల్లి, గన్నవరం-ఏలూరు మధ్యలో ఉన్న టోల్గేట్లలో బుధవారం సాయంత్రం వరకు భారీ ట్రాఫిక్ కొనసాగింది. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో కీసర టోల్గేట్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి నుంచే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పరిధిలో 40 టోల్గేట్లు ఉన్నాయి. గత నెల 9 నుంచి అన్ని టోల్‌ప్లాజాల్లోనూ వసూళ్లు నిలిపేశారు. డిసెంబరు 2 అర్ధరాత్రి వరకు టోల్‌ఫీజు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే గత 25 రోజుల్నుంచీ నోట్ల కష్టాలు కొనసాగుతూనే ఉండటం, రూ.100 నోట్లు ఎక్కడా లభ్యత లేకపోవడంతో టోల్ ఫీజు చెల్లించేందుకు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. -
ఇక పాత నోట్లకు పెట్రోల్ నో
-
నేటి అర్ధరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ వసూలు
-
ఇక పాత నోట్లకు పెట్రోల్ నో
నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకులు, విమానాశ్రయాల్లో రూ. 500 నోట్లు చెల్లవు ► మిగతా అనుమతించిన సేవలకు వాడుకోవచ్చన్న కేంద్రం ► నేటి అర్ధరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ వసూలు ► రూ. 200 మించితేనే పాత 500 నోటుకు అనుమతి న్యూఢిల్లీ: డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో, విమానాశ్రయాల్లో టికెట్ల కొనుగోలుకు పాత రూ. 500 నోట్లు అనుమతించమని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. డిసెంబర్ 15 వరకూ పాత నోట్లు వాడుకోవచ్చని గతవారం ప్రభుత్వం పేర్కొన్నా... కొన్ని చోట్ల ఈ సౌకర్యం దుర్వినియోగం అవుతోందన్న వార్తల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 2 అర్ధరాత్రి తర్వాత జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ప్రారంభిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అన్ని టోల్ ప్లాజాల వద్ద స్వైపింగ్ మిషన్లు(పీవోఎస్)లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే డెబిట్, క్రెడిట్ కార్డులతో టోల్ చెల్లించవచ్చని, టోల్ రూ. 200 కంటే ఎక్కువుంటే పాత రూ. 500 నోటును అనుమతిస్తారు. డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్‌స(ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్) కొనుగోలు చేసి టోల్ చెల్లించవచ్చని, నగదు చెల్లింపులు చేసేవారు... ఆలస్యం కాకుండా చిల్లర దగ్గర పెట్టుకోవాలని సూచించింది. టోల్ ప్లాజాల వద్ద డిసెంబర్ 15 అర్ధరాత్రి వరకూ పాత 500 నోట్లు తీసుకుంటారని, పాస్టాగ్స కొనుగోలుకు, 200 కంటే టోల్ ఎక్కువుంటేనే పాత 500 నోట్లను స్వీకరిస్తారని తెలిపింది. ఫాస్టాగ్‌స వాడితే టోల్ ఫీజు నుంచి 10 శాతం డిస్కౌంట్ ఇస్తారని, ఈ వాలెట్ల ద్వారా కూడా పన్ను చెల్లించవచ్చని పేర్కొంది. ఆయిల్, గ్యాస్ కంపెనీలు డిజిటల్ చెల్లింపులకు విసృ్తత ఏర్పాట్లు చేశాయని, అందుకే పెట్రోల్ బంకుల్ని జాబితా నుంచి తొలగించినట్లు తెలిపింది. ఎల్పీజీ సిలిండర్లకు మాత్రం పాత 500 నోట్లు తీసుకుంటారని కేంద్రం స్పష్టం చేసింది. 90 శాతం ఏటీఎంల్లో మార్పులు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 2 లక్షలకుపైగా ఏటీఎంల్లో 90 శాతం ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్చామని ఏటీఎం తయారీ సంస్థ ఎన్సీఆర్ కార్పొరేషన్స ఎండీ తెలిపారు. నవంబర్ 30 లోపు అన్ని ఏటీఎంల్లో మార్పులు పూర్తయ్యేలా ఆర్బీఐ నియమించిన టాస్క్‌ఫోర్స్‌కు గడువునిచ్చారని, 1.80 లక్షల ఏటీఎంల్లో కొత్త 2 వేలు, 5 వందల నోట్లు వచ్చేలా మార్పులు పూర్తయ్యాయని చెప్పారు. నోట్ల రద్దుపై సోషల్ మీడియాలో ప్రచురితమవుతున్న వార్తల విషయంలో బ్యాంకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్లో పొందుపరిచిన సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. జీతం కోసం క్యూలో అష్టకష్టాలు ఉద్యోగులు, కార్మికులు జీతాల కోసం గురువారం బ్యాంకుల ముందు భారీ క్యూలతో తీవ్ర అవస్థలు పడ్డారు. అలాగే నగదుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని బ్యాంకులు చెప్పినా వాస్తవంగా ఆ పరిస్థితులు కన్పించలేదు. వారానికి రూ. 24 వేలు విత్‌డ్రా పరిమితి ఉన్నా ఒక వ్యక్తికి కేవలం రూ. 5 వేలు మాత్రమే విత్‌డ్రాకు అనుమతించారు. మరికొన్ని చోట్ల రూ. 10 వేలు, రూ. 12 వేల చొప్పున విత్‌డ్రా సౌకర్యం కల్పించారు. ఇక దేశవ్యాప్తంగా అత్యధిక శాతం ఏటీఎంలు నగదు లేక మూతబడ్డాయి. దాదాపు 90 % ఏటీఎంల్లో కొత్త నోట్లకు అనుగుణంగా మార్పులు చేసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిచ్చాయి. పనిచేసిన ఏటీఎంల్లో ఎక్కువ శాతం రూ. 2 వేల నోట్లే వచ్చాయి. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉండదు: జైట్లీ నోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందన్న భయాల్ని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ బిల్లు ప్రస్తుత విధానాల్ని పూర్తిగా మార్చేస్తాయని ఆయన పేర్కొన్నారు. జీడీపీ పరిమాణం గణనీయ స్థాయిలో పెరుగుతుందని భువనేశ్వర్‌లో నిర్వహించిన మేకిన్ ఒడిశా సదస్సు సందర్భంగా చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో ఆర్థిక పరిస్థితి సమీక్షించేందుకు ఆర్బీఐ గవర్నర్, ఇతర ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల్ని పిలవాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిర్ణయించింది. జనవరిలో ఈ భేటీ ఉంటుందని కమిటీ ఛైర్మన్ థామస్ చెప్పారు. బెంగళూరులో రూ. 6 కోట్ల స్వాధీనం బెంగళూరులో ఐటీ అధికారులు ప్రజాపనుల శాఖ ఉన్నతాధికారి జయచంద్ర ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించి రూ. 6 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.2వేలు, రూ.500 కొత్త నోట్ల కట్టలే ఎక్కువగా ఉన్నాయని, వాటి విలువ రూ.4.7 కోట్లు ఉండొచ్చని తెలిసింది. జయచంద్ర స్నేహితుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున మొదలైన సోదాలు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగాయి. దాదాపు 14 కిలోల బంగారు, వెండి నగలు, వస్తువులతో పాటు దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. -
రేపటి నుంచి టోల్ ట్యాక్స్ పునరుద్ధరణ
-
రేపు అర్ధరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ పునరుద్ధరణ
-
టోల్ ట్యాక్స్ రద్దు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ : రూ.500, 1000 నోట్లు రద్దుతో తలెత్తిన సమస్యలు ఇంకా కొనసాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ రద్దు గడువును పొడిగించింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ 2 వరకు ట్యాక్స్ రద్దును పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. టోల్‌ప్లాజాల వద్ద డిసెంబర్ 15 వరకు పాత రూ.500 నోట్లను అంగీకరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. నవంబర్ 8వ తేదీ నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత టోల్‌ప్లాజాల వద్ద రెండు రోజుల పాటు పాత నోట్లను అంగీకరించారు. అనంతర పరిణామాలతో 24 వరకు టోల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ రద్దును తాజాగా మరో వారం రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులకు ఊరట లభించింది. -
కొత్త కారు కొంటారా.. టోల్ కోసం ఆగక్కర్లేదు!
కారులో దూర ప్రయాణం చేయాలంటే అంతా బాగానే ఉంటుంది గానీ, టోల్గేట్ల వద్ద భారీగా నిలిచిపోయే వాహనాలను చూస్తేనే నీరసం వస్తుంది. ఒక్కో వాహనం కదిలేవరకు ఆగి.. చివరగా మన వంతు వచ్చాక అప్పుడు వెళ్లి, చిల్లర ఎంతుందో చూసుకుని కట్టాలి. అప్పుడు మాత్రమే అక్కడ గేటు తెరుచుకుని, మనం ముందుకు వెళ్లడానికి వీలవుతుంది. ఇలాంటి కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతున్నాయి. మీరు కొత్తగా కారు కొనేటట్లయితే అలాంటి కార్లను టోల్ గేట్ల వద్ద ఆపాల్సిన అవసరం లేదు. ఎంచక్కా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవడమే. అలాగని మనం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని అనుకోవద్దు. ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే మొత్తం చెల్లింపు అంతా అయిపోతుంది. అందుకోసం కొత్తగా వస్తున్న కార్లకు డిజిటల్ ఐడెంటిటీ ట్యాగ్ తప్పనిసరిగా అమర్చాలని కేంద్ర ప్రభుత్వం వాహన తయారీ సంస్థలను ఆదేశించింది. చాలా దేశాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఈ విధానాన్ని మన దేశంలో కూడా అమలు చేయాలని చెప్పింది. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వీలైనంత వరకు నగదు రహితంగా చెల్లింపులు ఉండాలని, డిజిటల్ మార్గం అయితేనే మంచిదని చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండటంతో పాటు.. టోల్ ప్లాజాల వద్ద భారీ క్యూలైన్లను నివారించేందుకు వీలుగా ఈ టెక్నాలజీని అమలుచేయాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ వాహన కంపెనీలకు సూచించింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) ట్యాగ్‌లను అమర్చడం ద్వారా కార్లు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా చూసుకోవచ్చని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు. ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు అమర్చిన కార్లు వస్తుంటే.. టోల్ ప్లాజాల వద్ద ఉండే రీడర్లు వాటిని ముందుగానే గుర్తిస్తాయి. అప్పుడు ప్రీపెయిడ్ విధానంలో ఆ కారు యజమాని ముందుగా జమచేసిన మొత్తం లోంచి ఆ టోల్‌గేటుకు ఎంత కట్టాలో ఆ మొత్తం కట్ అవుతుంది. దాంతో.. ఇక కారు ఆగాల్సిన అవసరం లేకుండానే గేటు తెరుచుకుంటుంది. మనం ప్రయాణించే దూరాలను బట్టి ఎప్పటికప్పుడు ఆ మొత్తాన్ని రీచార్జి చేసుకుంటే సరిపోతుంది. -
ఆర్టీసీ ప్రయాణికులపై తొలగని ‘టోల్’ భారం
అమరావతి: కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా టోల్ పన్ను రద్దైనా ఆర్టీసీ మాత్రం ప్రయాణీకుల జేబుకు చిల్లులు పెడుతోంది. గత పది రోజులుగా టోల్ రుసుంను ఆర్టీసీ టిక్కెట్లతో కలిపి వసూలు చేస్తోంది. రోజుకు ప్రయాణీకుల నుంచి రూ.2 కోట్ల మేర ఒక్క టోల్ గేట్ రుసుం పేరిట ఆర్టీసీ గుంజుతోంది. నెలకు సరిపడా టోకెన్లను ముందుగానే టోల్గేట్లకు చెల్లించామని, ప్రయాణీకులకు ఎలా తగ్గిస్తామని ఆర్టీసీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 టోల్‌ప్లాజాల్లో నిత్యం 13 వేల ఆర్టీసీ బస్సులు దాటుతున్నాయి. వేలాది ట్రిప్పులు నడుస్తున్నాయి. 65 లక్షల మందిని ఆర్టీసీ నిత్యం వారి గమ్యస్థానాలకు చేర్చుతుంది. రూ.12 నుంచి రూ.13 కోట్ల వరకు టిక్కెట్ల రూపంలో ఆదాయం ఆర్టీసీకి సమకూరుతుంది. ఇందులో ఒక్క టోల్ ఫీజు రూపేణా రోజుకు రూ.40-50 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గత తొమ్మిది రోజుల నుంచి టోల్ ఫీజు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్టీసీ మాత్రం ప్రయాణీకుల నుంచి రూ.3.50 కోట్ల వరకు రాబట్టినట్లు చెబుతున్నారు. కాగా, పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆర్టీసీపైనా పడింది. చిల్లర లేక చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. దీంతో రూ.8 కోట్ల వరకు ఆర్టీసీకి నష్టం ఏర్పడింది. ఇందులో టోల్‌గేటు రుసుం తొలగించి టిక్కెట్ల ధరలను ఆ మేరకు తగ్గిస్తే ఈ నష్టం రూ.12 కోట్ల వరకు ఉండేదని యాజమాన్యం ఊరట చెందుతుండటం గమనార్హం. -
ఈ నెల 18 వరకు టోల్ ఫీజులు రద్దు
-
టోల్ ఎత్తివేత.. ఏటీఎంల కోసం టాస్క్‌ఫోర్స్!
పెద్దనోట్లను రద్దు వల్ల దేశంలో తీవ్ర గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలను కేంద్రం తీసుకుంటోంది. ఇప్పటికే బ్యాంకులు, ఏటీఎంలలో నగదు ఉపసంహరణ పరిమితులను సడలించడం, రూ. 500, 2000 నోట్లను ఏటీఎంలలో అందుబాటులోకి తీసుకురావడం వంటి నిర్ణయాలు తీసుకున్న కేంద్రం వాహనదారులకు ఊరట కలిగిచేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులన్నింటిపై మరో నాలుగురోజులపాటు టోల్ రుసుమును రద్దుచేస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి వరకు జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏటీఎంల కోసం టాస్క్‌ఫోర్స్! పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలోని దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలు సేవలు అందించేందుకు వీలుగా భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసింది. ఏటీఎంలలో కొత్తనోట్లు అందుబాటులోకి వచ్చేలా చేయడం, ఇందుకోసం ఏటీఎం సాఫ్‌వేర్లలో మార్పులు చేసి, రీయాక్టివేషన్ చేయడం ఈ టాస్క్‌ఫోర్స్ ప్రధాన కర్తవ్యం. దేశవ్యాప్తంగా ఏటీఎంలు అందుబాటులోకి వస్తే ప్రజల కష్టాలు ఘననీయంగా తగ్గే అవకాశముంది. -
‘అక్రమంగా టోల్‌టాక్స్ వసూలు’
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద యదేచ్ఛగా టోల్ టాక్స్ వసూలు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్న తరుణంలో వాహనదారుల అవస్థలు గుర్తించిన కేంద్రప్రభుత్వం ఈ నెల 14 వరకు టోల్‌టాక్స్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా పన్నులు వసూలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్ అక్కడికి చేరుకొని టోల్‌టాక్స్ వసూలును అడ్డుకొని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. -
శుక్రవారం వరకూ టోల్ ట్యాక్స్ రద్దు
న్యూఢిల్లీ: రూ.500, 1000 నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వరకూ దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద టోల్ ట్యాక్స్‌ను రద్దు చేసింది. ఈ నెల 11వ తేదీ అర్థరాత్రి వరకూ టోల్ ట్యాక్స్ రద్దు అమల్లో ఉంటుంది. మరోవైపు అయిదు వందలు, వెయ్యి నోట్లను స్వీకరించాలంటూ కేంద్రం టోల్ ప్లాజాదారులకు ఆదేశాలు ఇచ్చింది. కాగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలను 'చిల్లర' కష్టాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు అపురూపంగా చూసుకున్న 500, 1000 రూపాయల నోట్లు చేదైపోయి.. జేబులో ఉన్న 10 రూపాయల నోట్లకే డిమాండ్ పెరిగింది. పెట్రోల్ బంక్‌లు, టోల్గేట్ల వద్ద వాహనదారులు వద్దన్నా పెద్దనోట్లే ఇస్తుండటంతో వాటి నిర్వాహకులకు 'చిల్లర కష్టాలు' చుక్కలు చూపిస్తున్నాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా గురుగ్రామ్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వాహనదారులు తమ వద్ద చిల్లర లేదంటూ 500, 1000 రూపాయల నోట్లే ఇస్తుండటంతో ఆ టోల్ ప్లాజా వద్ద పెద్ద ట్రాఫిక్ జాం ఏర్పడే పరిస్థితి ఎదురైంది. దీంతో టోల్ ప్లాజా నిర్వాహకులు గంట పాటు మీరేం టోల్ చార్జి కట్టక్కర్లేదంటూ వాహనాలను పంపించేసి అక్కడ ఉన్న ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
టోల్ కట్టక్కర్లేదోచ్!
గరుగ్రామ్: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలను 'చిల్లర' కష్టాలు చుట్టుముట్టాయి. ఇంతకు ముందు అపురూపంగా చూసుకున్న 500, 1000 రూపాయల నోట్లు చేదైపోయి.. జేబులో ఉన్న 10 రూపాయల నోట్లకే డిమాండ్ పెరిగింది. పెట్రోల్ బంక్‌లు, టోల్గేట్ల వద్ద వాహనదారులు వద్దన్నా పెద్దనోట్లే ఇస్తుండటంతో వాటి నిర్వాహకులకు 'చిల్లర కష్టాలు' చుక్కలు చూపిస్తున్నాయి. గురుగ్రామ్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వాహనదారులు తమ వద్ద చిల్లర లేదంటూ 500, 1000 రూపాయల నోట్లే ఇస్తుండటంతో ఆ టోల్ ప్లాజా వద్ద పెద్ద ట్రాఫిక్ జాం ఏర్పడే పరిస్థితి ఎదురైంది. దీంతో టోల్ ప్లాజా నిర్వాహకులు గంట పాటు మీరేం టోల్ చార్జి కట్టక్కర్లేదంటూ వాహనాలను పంపించేసి అక్కడ ఉన్న ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
టోల్గేట్ వద్ద నోట్ల రగడ
మంగళగిరి: టోల్గేట్ సిబ్బంది రూ. 500, రూ. 1000 నోట్లు తీసుకోకపోవడంతో.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఖాజా టోల్‌ప్లాజా వద్ద బుధవారం ఉదయం నుంచి ‘పెద్ద’ నోట్లు తీసుకోవడం లేదు. దీంతో లారీ డ్రైవర్లు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన చిల్లర ఇవ్వాలని టోల్గేట్ సిబ్బంది చెప్తుండటంతో.. డ్రైవర్లు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పెట్రోల్ బంకుల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. -
తుపాను బాధితుల కోసం టోల్‌ఫ్రీ
అనంతపురం అగ్రికల్చర్ : అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో తుపానులో అనంతపురం జిల్లా వాసులు ఎవరైనా చిక్కుకుని ఉంటే టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్ కోన శశిధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18004256401 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. -
దేవస్థానం టోల్గేట్ ఆదాయం రూ.92.64 లక్షలు
అన్నవరం: దేవస్థానం టోల్గేట్లో చిన్నకార్లు, టూరిస్ట్బస్సులు, లారీల నుంచి టోల్ వసూలు చేయడానికి నిర్వహించిన వేలంపాట నెలకు రూ.7.72 లక్షలకు ఖరారైంది. దీంతో ఆ టోల్గేట్ ద్వారా దేవస్థానానికి ఏడాదికి రూ. 92.64 లక్షలు ఆదాయం సమకూరనుందని దేవస్థానం ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు మంగళవారం సాయంత్రం సాక్షికి తెలిపారు. గత ఏడాది ఇదే టోల్ వసూలు చేయడానికి నిర్వహించిన వేలం పాట నెలకు రూ.6.14 లక్షలు మాత్రమే. దీంతో ఈ ఏడాది అదనంగా సుమారు రూ.19 లక్షలు ఆదాయం పెరిగిందని తెలిపారు. -
నేత్రదానంలో జిల్లా ముందుండాలి
–నేత్రదాన సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయిస్తా – డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూలు : చరిత్రలో నిలిచేలా నేత్రదానంలో కర్నూలు జిల్లా ముందుండాలని ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఆకాంక్షించారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఉద్యమంలా చేపట్టిన నేత్రదాన కార్యక్రమాలకు తాను అండగా ఉంటానన్నారు. నేత్రదాన సమాచారం కోసం ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయిస్తానని కేఈ హామీ ఇచ్చారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కర్నూలు శివారులోని దూపాడు వద్దనున్న కె.వి.సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఉదయం మెగా నేత్రదాన స్వచ్ఛంద అంగీకార పత్రాల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా ఉపముఖ్యమంత్రి హాజరై మాట్లాడారు. గతంలో కళ్లు లేనివారికి దేవుడే దిక్కు అనేవారని, ఇప్పుడు వారికి ఎస్పీ గారి ఉద్యమం జీవితంపై భరోసా ఇస్తుందన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలకు మీడియా కూడా విస్తత ప్రచార ం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ దత్తత గ్రామం కప్పట్రాళ్లలో చేపట్టిన ప్రతి అభివద్ధి కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి హాజరై ప్రోత్సహించారని గుర్తు చేశారు. నేత్రదానం చేసేందుకు ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికీ జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్డీ రవిప్రకాష్, రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి శ్రీనివాసులు, కె.వి.సుబ్బారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి, చైర్మన్ అశోకవర్ధన్‌రెడ్డి, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, హరినాథరెడ్డి, హుసేన్ పీరా, బాబా ఫకద్దీన్, ఎ.జి.కష్ణమూర్తి, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, ఈశ్వర్‌రెడ్డి, కొల్లి శ్రీనివాసరావు, వెంకటాద్రి, సుప్రజతో పాటు పలువురు పోలీసు అధికారులు, విద్యార్థులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు కార్యక్రమంలో పాల్గొని నేత్రదాన అంగీకార పత్రాలను సమర్పించారు. జిల్లా పోలీసులు సేకరించిన 1.52 లక్షల నేత్రదాన అంగీకార పత్రాలను డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి అందజేశారు. వాటన్నింటినీ కేవీ సుబ్బారెడ్డి కళాశాల విద్యార్థుల ద్వారా ఆన్లైన్లో రెడ్‌క్రాస్ వెబ్సైట్లో నమోదు చేయించారు. -
దారికాచిన మృత్యువు
ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం.. 8 మంది యువకుల దుర్మరణం - పెళ్లి విందుకు వెళ్తుండగా అర్ధరాత్రి మేడ్చల్ టోల్గేట్ వద్ద ఘటన - టవేరాను వెనుక నుంచి ఢీకొన్న డీసీఎం - ముందున్న లారీ-డీసీఎం మధ్య నుజ్జునుజ్జయిన టవేరా - డోర్ తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డ ఓ యువకుడు - మృతులంతా మెదక్ జిల్లా సదాశివపేటకు చెందినవారే మేడ్చల్/సదాశివపేట/హైదరాబాద్: వారందరూ స్నేహితులు.. ఎంతో ఉత్సాహంగా పెళ్లి విందుకు బయల్దేరారు.. కొద్దిసేపట్లో విందులో సంతోషంగా గడపాల్సిన వారిని రోడ్డుపైనే మృత్యువు కబళిం చింది! వీరు ప్రయాణిస్తున్న టవేరా వాహనం లారీ, డీసీఎం మధ్య నలిగి నుజ్జునుజ్జయింది. ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు!! మంగళవారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం సుతారిగూడ ఔటర్‌రింగ్‌రోడ్డు టోల్‌ప్లాజా వద్ద ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి వచ్చిన వాహనదారుడి నిర్లక్ష్యానికి యువకుల నిండు జీవితాలు బలయ్యారుు. ఘోరం ఎలా జరిగింది? ఆదివారం మెదక్ జిల్లా మునిపల్లి మండలం భూసారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ముస్తఫా కూతురుతో మేడ్చల్‌కు చెందిన అమీనుద్దీన్కు వివాహం జరిగింది. మంగళవారం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలోని కొంపల్లిలో వివాహ విందు ఏర్పాటు చేశారు. దీనికి హాజరయ్యేందుకు పెళ్లి కూతురు అన్న ఇర్ఫాన్ (21), అతడి స్నేహితులు మహ్మద్ అఖిల్(21), మహ్మద్ నిషార్(22), మహ్మద్ ఫెరోజ్(22), మహ్మద్ ఇంగ్రోజ్(25), సమీర్( 21), అక్బర్(22), మహ్మద్ అబ్బాస్(22) టాటా టవేరా వాహనంలో సదాశివపేట నుంచి మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో బయల్దేరారు. రాత్రి 11 గంటల సమయంలో మేడ్చల్ టోల్గేట్ వద్దకు చేరుకున్నారు. డబ్బులు చెల్లించేందుకు డ్రైవర్ సకారాత్(38) టవేరా వాహనాన్ని నిలిపాడు. వీరి వాహనం ముందు టోల్ రుసుం చెల్లించేందుకు ఓ లారీ (వీవీఆర్ ట్రాన్ ్సపోర్ట్) ఆగి ఉంది. ఇంతలో వెనుక నుంచి ఓ డీసీఎం మృత్యువులా దూసుకొచ్చి అతి వేగంతో టవేరాను ఢీకొంది. ముందున్న లారీ, డీసీఎం మధ్యలో ఇరుక్కుని టవేరా నుజ్జునుజ్జరుుం ది. దీంతో అందులోని డ్రైవర్ సకారత్ సహా 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. డ్రైవర్ పక్కనే కూర్చున్న అబ్బాస్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వెనుక నుంచి వాహనాన్ని డీసీఎం ఢీకొట్టగా ముందున్న డోర్ తెరుచుకుంది. దీంతో అబ్బాస్ అందులోంచి ఎగిరి బయట పడ్డాడు. ప్రస్తు తం ఈయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని టవేరాలోంచి మృతదేహాలను క్రేన్ సాయంతో అతికష్టం మీద బయటకు తీశారు. ప్రమాద సమయంలో వర్షం కూడా రావడంతో మృతదేహాలను బయటికి తీస్తుండగా రక్తం ఏరులై పారింది. మృతులంతా వేర్వేరు కుటుంబాలకు చెందినవారు. వీరంతా ‘ఫేమస్ క్రికెట్ టీమ్’ సభ్యులు. ముగ్గురు బీటెక్ చదువుతున్నారు. అయ్యో... అంతా ఎదిగొచ్చినవారే..! ఎదిగొచ్చిన కొడుకులు మృత్యుపాలవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. యువకుల మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. వారి కుటుంబీకులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ఆవరణలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రిలో మంత్రి హరీశ్‌రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదంలో మరణించిన మహ్మద్ అఖిల్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. తండ్రి అబ్బాస్ అహ్మద్ లారీ డ్రైవర్. ఈయనకు నలుగురు కుమారులున్నారు. వారిలో చివరివాడైన అఖిల్.. సోదరుడు నడుపుతున్న పాన్ దుకాణంలో పనిచేస్తున్నాడు. డ్రైవర్ సకారత్ తన సొంత టవేరా వాహనం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈయనకు భార్య మేరజ్, ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. మహమ్మద్ నిషాద్ నిజాం కాలేజీలో ఎంటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈయన తండ్రి హైమద్ సిద్దాపూర్ గౌని వద్ద హార్డ్‌వేర్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఫెరోజ్ తండ్రి షబ్బీర్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఫెరోజ్ రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇంగ్రోజ్ తండ్రి అన్వర్ లారీ యజమాని. ఇంగ్రోజ్ ఇంటర్ వరకు చదివి పనిలో తండ్రికి సాయంగా ఉంటున్నాడు. సమీర్ పదో తరగతి వరకు చదువుకొని తండ్రి సలీమ్‌తో కలసి హౌస్ వైరింగ్ పనులు చేస్తున్నాడు. ఇర్ఫాన్ హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నాడు. మహ్మద్ అక్బర్ పదో తరగతి చదివాడు. ప్లంబింగ్ పనులు చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈయన తండ్రి సదాశివపేటలో తోపుడు బండిపై అరటిపండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. సీఎం దిగ్భ్రాంతి.. రూ.5 లక్షల పరిహారం ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. టోల్గేట్ నిర్వాహకులపై కేసు ఎలాంటి విద్యుత్ లైట్లు, హెచ్చరిక బోర్డులు లేకుండా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూ యువకుల మృతికి కారకులైన టోల్గేట్ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ అన్నారు. టవేరాను వెనుక నుంచి ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఘటనా స్థలానికి వెళ్లి ఆయన ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన డీసీఎం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
‘టోల్’ చెల్లింపులకు ఊరట!
అడ్డాకుల: జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులకు టోల్‌చార్జీల చెల్లింపుల నుంచి కొంతఊరట లభించనుంది. టోల్గేట్ వద్ద వాహనాల నుంచి వసూలు చేసే చార్జీలను స్వల్పంగా తగ్గిస్తూ రోడ్డు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనాల రకాలను బట్టి టోల్గేట్ చార్జీలను రూ.1నుంచి రూ.2 తగ్గించారు. రోజువారీ రాకపోకలతో పాటు నెలవారి పాస్‌ల చార్జీలను కొంతమేర తగ్గించారు. వాహనరకాలను బట్టి రూ.8 నుంచి రూ.43 వరకు తగ్గింది. కొత్తచార్జీలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు ఐదుసార్లు చార్జీలను పెంచగా వరుసగా రెండోసారి స్వల్పంగా తగ్గించారు. తద్వారా రోజుకు 10నుంచి 15వేల వాహనదారులకు కొంత ఊరట కలగనుంది. వచ్చే ఏడాది 31 అర్ధరాత్రి వరకు ఈ చార్జీలు అమల్లో ఉంటాయి. జడ్చర్ల నుంచి కొత్తకోట వరకు జాతీయ రహదారి నిర్వహణకు ఎల్అండ్టీ, ఐడీపీఎల్, వెస్ట్రన్ ఆంధ్రా టోల్వేస్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2009లో అడ్డాకుల మండలం శాఖాపూర్ వద్ద టోల్‌గేట్‌ను ప్రారంభించగా ఏటా ఆగస్టు 31అర్ధరాత్రి తర్వాత సవరించిన కొత్తచార్జీలను వసూలు చేస్తున్నారు. బస్సుల్లో తగ్గని ‘టోల్’చార్జీలు రెండోసారి టోల్‌చార్జీలు తగ్గిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల నుంచి వసూలు చేసే టోల్గేట్ టికెట్ ధరలను ఆర్టీసీ సంస్థ తగ్గిస్తుందా? లేదా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. గతేడాది చార్జీలు తగ్గినప్పుడు బస్సుల్లో ప్రయాణించేవారికి ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. మరి ఈసారి కూడా నెలవారి పాస్‌లను రూ.8 నుంచి రూ.43 వరకు తగ్గించారు. అయితే రోజువారీగా రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులకు అధికారులు నెలవారీ పాస్‌లు తీసుకుంటారు. ఈ చార్జీలు తగ్గినందున బస్చార్జీల్లో మార్పులు ఉంటాయా? లేదా? అన్నది వేచిచూడాలి. సవరించిన చార్జీలు(రోజువారీగా రానుపోను రూ.ల్లో) వాహన రకం పాతచార్జీ కొత్తచార్జీ కారు, జీపు, వ్యాను 56–84 56–84 డీసీఎం,మినీబస్సు 98–147 97–146 లారీ, బస్సు 196–294 195–292 భారీ వాహనాలు 315–472 313–470 సవరించిన నెలవారీ పాస్చార్జీలు(రూ.ల్లో) వాహన రకం – నెలకు పాతచార్జీ – కొత్త చార్జీ కారు, జీపు, వ్యాను 1679 –1671 డీసీఎం, మినీబస్సు 2938 –2925 లారీ, బస్సు 5876 –5850 భారీ వాహనాలు 9444 –9401 అరకొర సౌకర్యాలు.. నిత్యం ప్రమాదాలు – 2009 నుంచీ 44వ జాతీయ రహదారిపై శాఖాపూర్ వద్ద టోల్‌చార్జీలు వసూలు చేస్తున్నా వాహనదారులకు ఇంకా సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. – రోడ్డు నిర్మాణం ప్రారంభించిన నాటినుంచి చాలాచోట్ల సర్వీస్రోడ్లను పూర్తిచేయలేదు. – రోడ్డు డివైడర్ ఎత్తు కూడా కొంత తగ్గడంతో వాహనాలు సులువుగా పక్కరోడ్డు మీదకు దూసుకెళ్లి తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. – కల్వర్టుల వద్ద సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి. – హైవేపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలపడం..స్టేజీలకు దూరంగా నిర్మించిన బస్షెల్టర్లు ప్రయాణికులకు ఎంతమాత్రం ఉపయోగపడడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
అక్కడ భారతీయులకు ఇల్లు అద్దెకివ్వరు
సింగపూర్: సింగపూర్‌లో ప్రాపర్టీ సర్చ్ వెబ్ పోర్టల్ సహ వ్యవస్థాపకుడు డేరియస్ చీయుంగ్ గతేడాది సింగపూర్ సిటీలో అద్దె ఇంటి కోసం పడరాని పాట్లు పడ్డారు. అద్దె ఇళ్లు అందుబాటులో లేకకాదు. భారతీయురాలిని భార్యగా కలిగి ఉన్నందుకు ఆయనకు ఎవరూ అద్దెకు ఇళ్లు ఇవ్వలేదు. భారతీయులకే కాదు, చైనీయులకు కూడా తాము ఇళ్లు అద్దెకు ఇవ్వమంటూ అద్దె ఇళ్లు వెతికిపెట్టే పోర్టల్స్‌లో కూడా నోటీసులు ఉంటున్నాయి. ‘గమ్‌ట్రీ.ఎస్జీ, ప్రాపర్టీగురు’ వెబ్సైట్లలో ఇలాంటి హెచ్చరికలు మనకు కనిపిస్తాయి. ప్రపంచ వాణిజ్య కేంద్రంగా, బహుళ సంస్కృతుల సమ్మిలిత కేంద్రంగా ప్రసిద్ధి చెందిన సింగపూర్‌లో భారతీయుల పట్ల ఇలాంటి వివక్ష చూపించడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇతర జాతుల పట్ల వివక్ష చూపితే కఠిన చర్యలు తీసుకునే చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, ప్రతి ఏటా జూలై 21వ తేదీన జాతుల సామరస్య దినోత్సవం నిర్వహిస్తున్నప్పటికీ దేశంలో భారతీయులకు, ముఖ్యంగా భారత యువతులను భార్యగా చేసుకున్న వారికి అసలు ఇళ్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే భారతీయులు ఇళ్లను శుభ్రంగా ఉంచుకోరని, అద్దెకు ఇళ్లు ఇస్తే పాడు చేస్తారని, ఖాళీ చేసేటప్పుడు ఇంట్లో చెత్తా చెదారాన్ని వదిలేయడమే కాకుండా ఇంటి అద్దె, కరెంట్, వాటర్ బిల్లులను ఎగవేసి పోతారని స్థానిక ప్రాపర్టీ యజమానుల దురభిప్రాయం. అద్దెకున్న ఓ భారతీయ కుటుంబం ఇంటిని దెయ్యాల కొంపలాగా చేసి ఖాళీచేసిన ఉదంతం గురించి ఎప్పుడో ఓ స్థానిక పత్రికలో వచ్చిన కథనం ఒకటి స్థానికంగా ఎక్కువ ప్రచారం అవడంతో అప్పటి నుంచి భారతీయులకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ప్రాపర్టీ యజమానులు అంగీకరించడం లేదని డేరియస్ చీయుంగ్ తెలిపారు. చైనా కుటుంబాల గురించి కూడా ఇలాంటి కథనాలే ప్రచారంలో ఉన్నాయి. ఈ కథనాలు నిజంగా జరిగాయా, అందరు అలాగే ఉంటారా? అన్న విషయాన్ని ఆలోచించకుండానే స్థానికులు భారతీయులు, చైనీయుల పట్ల వివక్ష చూపుతున్నారు. మొత్తం 55 లక్షల జనాభా కలిగిన సింగపూర్‌లో 9.1 శాతం మంది భారతీయులు ఉన్నారు. 55 లక్షల్లో 39 లక్షల మంది స్థానిక శాశ్వత నివాసితులుకాగా, మిగతా వారు విదేశీయులు. భారతీయులు, చైనీయుల అద్దె ఇల్లు కష్టాలను తొలగించేందుకు, తనకెదురైనా అనుభవం మరొకరికి ఎదురుకాకూడదనే సదుద్దేశంతో డేరియస్ చీయుంగ్ ‘99.కామ్’ అనే వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. ‘అన్ని జాతులకు స్వాగతం. జాతి, సంస్కృతులతో సంబంధం లేకుండా అన్ని దేశస్థుల వారికి అద్దె ఇళ్లు చూపిస్తాం. ఇప్పిస్తాం’ అంటూ ఆ వెబ్సైట్ ప్రచారం చేస్తోంది. అద్దె ఇంటి కోసం తాను పడ్డ కష్టాల నుంచే ఈ వెబ్ పోర్టల్ ఆలోచన వచ్చిందని డేరియస్ తెలిపారు. సింగపూర్‌లో 8 శాతం ఇళ్లు ఎప్పుడు అద్దెకు ఖాళీగా ఉంటాయి. -
కోడికీ మేకకు టోల్ ఫీజు
కైకలూరు : కొల్లేరు సుందరతీరంలో శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారు కొలువై ఉంది. సర్కారు కాల్వపైనుంచే ఇనుప వంతెన దాటి కొల్లేటికోటలో అమ్మ సన్నిదికి చేరాలి. ఆదివారాలు, జాతర సమయంలో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పందిరిపల్లిగూడెం గ్రామస్తులు కాలువ దాటడానికి సర్కారు కాల్వపై మూడేళ్ల కిందట ఇనుప వంతెన కట్టుకున్నారు. దీనిపై వెళ్లాలంటే టోల్‌ఫీజు కట్టాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. గ్రామానికి చెందిన నేపాల కొండయ్య అనే వ్యక్తి ఏడాదికి రూ.25 లక్షలను గ్రామపెద్దలకు చెల్లించి ఈ వంతెన ‘టోల్ ఫీజు‘ కాంట్రాక్టును దక్కించుకున్నారు. అంతకుముందు బాగానే ఉన్నా ఈ ఏడాది ఆరంభం నుంచి రేట్ల మోత మోగిపోతోంది. మహానేత మరణంతో ఆగిన వారధి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఈ వారధి నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించగా, ఆయన అకాలమరణంతో నిర్మాణం ఆగిపోయింది. ఎన్నికల సమయంలో కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వారధి నిర్మిస్తామన్నారు. నేడో రేపో శంకుస్థాపన చేస్తున్నామని కామినేని రెండున్నరేళ్లలో మూడుసార్లు ప్రకటించినా అవన్నీ నీటిమీది రాతలే. దేనికెంత రేటంటే ఆటోకు రానుపోను రూ.50గా పెద్దలు నిర్ణయించారు. కానీ ‘కాంట్రాక్టరు‘ మాత్రం సొంత రేట్లు అమలుచేస్తున్నాడు. ఆటోకు రూ.100 వసూలు చేయడంతో పాటు ఆటోలో ప్రయాణికులు ఒక్కొక్కరి నుంచి అదనంగా రూ.5 వసూలు చేస్తున్నారు. మోటరు సైకిల్‌కు రానుపోను రూ.10 నిర్ణయిస్తే వసూళ్లు మాత్రం రూ.20 నుంచి ఒక్కోసారి రూ.40కి చేరుతోంది. వంతెనపై ఆవు, గెదే తీసుకువెళితే ఒక్కోదానికి రూ.50 చెల్లించాలి. కోడికి, మేకకు రూ.5 చొప్పున కట్టాలి. చేపల వాహనానికి రూ.300. నాలుగు చక్రాల వాహనాలకు అనుమతి లేదన్న ప్రకటన అంతా ఉత్తిదే. సుమారు 150 మీటర్ల పొడవుండే ఈ వంతెన జనం, వాహనాల బరువును తట్టుకోలేక ప్రమాదం జరిగితే దానికి బాధ్యులెవరనేదానికి జవాబు లేదు. -
మరో 30యేళ్ల పాటు టోల్ ట్యాక్స్ బాదుడు?
న్యూఢిల్లీ: దేశంలో టోల్‌టాక్స్‌ల పేరుతో సాగుతున్న వసూళ్ల పరంపర మరో ముప్పై సంవత్సరాలు కొనసాగునుందట. నేషనల్ హైవేలపై వసూలు చేసే టోల్ ట్యాక్స్ ను మరో 30 ఏళ్ల పాటు వసూలు చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా రిపోర్టుచేసింది. ప్రధానంగా భారత్ మాలా పథకంలో భాగంగా చేపట్టనున్న ప్రాజెక్టులకవసరమైన నిధుల కోసం రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రతిపాదించనుంది. ప్రజా నిధులతో సుమారు 75 జాతీయ రహదారులు ప్రాజెక్టుల నిర్మాణం కోసం యత్నిస్తున్న మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రతిపాదనకు త్వరలోనే కేంద్ర క్యాబినేట్ ఆమోదం కూడా లభించనుంది. 25 నుంచి30 సం.రాలపాటు ప్రయివేటు నిర్వాహకులకు ఈ టోల్ ట్యాక్స్ వసూలు చేసే బాధ్యతలను అప్పగించనుంది. దీనికి ఆమోద ముద్ర పడితే సుమారు ఎనభైవేల కోట్ల రూపాయల ఆదాయాన్నిఆర్జించవచ్చని మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టీవోటీ) మోడల్ కింద కొన్న ప్రాజెక్టులను ఇప్పటికే గుర్తించింది. గత రెండేళ్లుగా అమల్లో ఉన్నదీనిద్వారా ప్రభుత్వానికి రూ.2700కోట్ల వార్షికఆదాయం సమకూరుతోంది.పటిష్టమైన రహదారులు నిర్వహణ మరింత సమర్థవంతంగా భరోసా, తక్షణ వనరుల కల్పన కోసం ప్రభుత్వం ఈ యోచన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పినట్టుగా జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. మరోవైపు దాదాపు50వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం కోసం ఏడులక్షల కోట్లను వెచ్చించనున్నట్టు ప్రభుత్వం గతనెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టోల్‌టాక్స్ వసూళ్లతో దేశంలో వాహనంతో రోడ్డుమీదికి రావాలంటే గుండె దడ పుడుతోందన్న విమర్శలు చెలరేగాయి. ప్రయాణానికి వాహనానికి అవసరమైన ఇంధనానికయ్యే ఖర్చు కన్నా, టోల్‌టాక్స్‌ల భారం తడిసిమోపెడు అవుతోంది. దేశవ్యాప్తంగా టోల్ మాఫియా దోపిడీ ఎక్కువైందని ప్రజల నుంచి మొదలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులదాకా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. -
కార్లకు, చిన్న వాహనాలకు టోల్ టాక్స్ రద్దు!
అహ్మదాబాద్ : కార్లు, చిన్న చిన్న వాహనదారులకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక. ఆగస్టు 15 నుంచి ఈ వాహనదారులు టోల్ టాక్స్ ను చెల్లించాల్సినవసరం లేదట. అయితే ఈ కానుక ఏ రాష్ట్రంలో అనుకుంటున్నారా..! ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఈ కానుకను ఎంజాయ్ చేయొచ్చట. వచ్చే ఏడాది గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. వాల్సాడ్ జిల్లాలో 67వ వాన్ మహోత్సవ ఫంక్షన్ సందర్భంగా ఆమ్రా వాన్ ఆవిష్కరణోత్సవ స్పీచ్ లో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. ఆగస్టు 15 నుంచి కార్లు, చిన్న వాహనాలను టోల్ టాక్స్ చెల్లింపు పరిధి నుంచి మినహాయిస్తున్నామని వెల్లడించారు. కమర్షియల్,పెద్ద వాహనాలకు టోల్ టాక్స్ అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. మధ్యతరగతికి చెందిన సోదరీ, సోదరులు ఇక నుంచి పనిచేయడానికి వారి కార్లలో బయటికి వెళ్లొచ్చని ప్రకటించారు. ఈ మినహాయింపు ఖర్చును గుజరాత్ రాష్ట్రం భరిస్తుందని పేర్కొన్నారు. అయితే జాతీయ రహదారులపై ఉన్న టోల్ బూత్స్ కు ఈ నిర్ణయం వర్తించదని, అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రావని వెల్లడించారు. -
వన్యప్రాణులనుంచీ రక్షణకు టోల్ ఫ్రీ నెంబర్..
కర్ణాటకః అడవి జంతువులు తమ పంటపొలాలను నాశనం చేస్తున్నాయని, తమ ఖరీదైన పశువులను పులి చంపేసిందని, చెరకు పంటను ఏనుగుల గుంపు తొక్కేసిందంటూ ఆందోళన చెందే మారుమూల గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు వైల్డ్ సేవా కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు ప్రభుత్వ పరిహారం వెంటనే అందేట్లుగా గ్రామసస్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో కొందరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సమస్యలను వెంటనే తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. లబ్ధిదారులకోసం 'వైల్డ్ సేవ' ను కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో అందుబాటులోకి తెచ్చారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో అవగాహన కల్పించేందుకు స్థానికులు కొందరికి 'ఫీల్డ్ ఏజెంట్ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తాము నష్టపోయామంటూ రైతులు దరఖాస్తులు చేసుకొని కార్యాలయాలచుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా.. లబ్ధిదారులకు వెంటనే పరిహారం అందేలా 'వైల్డ్ సేవ' కార్యక్రమం చేపట్టారు. నష్టపోయిన రైతులకు కేవలం నాలుగు రోజుల్లోనే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వైల్డ్ లైఫ్ కంజర్వేషన్ సొసైటీ (డబ్ల్యూసీఎస్) ఆధ్వర్యంలో ఓ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ అటవీ శాఖతో కలసి కర్ణాటక, తమిళనాడుల్లోని సుమారు 284 గ్రామాల్లో వన్యప్రాణులనుంచి జనజీవనాన్ని రక్షించడంతోపాటు... వైల్డ్ సేవ కార్యక్రమంతో అంతరించిపోతున్న అడవి జంతువులను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జనాభా కలిగిన అటవీ ప్రాంతాలమీత దృష్టి సారించి.. అక్కడి ప్రజలకు, వన్యప్రాణులకు నష్టం కలగకుండా ప్రయత్సిస్తున్నారు. సుమారు 20 వేల రూపాయల ఖరీదు చేసే అవును పులి చంపేయడంతో పరిహారంకోసం దరఖాస్తు చేసుకున్నఓ రైతు.. వైల్డ్ సర్వీస్ తో 9 వేల రూపాయలు పొందాడు. అయితే పరిహారం తక్కువ వచ్చినా.. తనకు సంతృప్తిగానే ఉందన్న అతడు... గతంలో పరిహారంకోసం అధికారులచుట్టూ, కార్యాలయాలచుట్టూ తిరగడంతోపాటు పరిహారం పొందేందుకు డబ్బు ఎదురు చెల్లించాల్సి వచ్చేదని తెలిపాడు. అదీకాక ముందుగా పంటదాడులు, చనిపోయిన పశువుల ఫొటోలు తీసుకొని, గంటలకొద్దీ ప్రయాణం చేసి అటవీశాఖ కార్యాలయాలకు వెళ్ళాల్సి వచ్చేదని, సమయానికి అధికారులు లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్తున్నాడు. 'వైల్డ్ సేవ' కార్యక్రమం ప్రారంభమైన తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన ఏజెంట్ల ద్వారా సేవలు అందించడంతో వెంటనే పరిహారం పొందగల్గుతున్నట్లు స్థానిక రైతులు చెప్తున్నారు. అంతేకాదు 'వైల్డ్ సేవ' ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ తో తమకు జంతువులనుంచీ రక్షణతోపాటు, సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలను అడవిజంతువులు నాశనం చేశాయనో, పశువులను చంపేశాయనో గ్రామస్థులు, రైతులనుంచీ తమకు రోజుకు ఒక్క ఫోన్ కాల్ అయినా వస్తుంటుందని, ఒక్కో ఏజెంట్ కు సుమారు 20 కిలోమీటర్ల పరిథిలో ఉన్న 70 గ్రామాలనుంచీ ఫోన్లు వస్తాయని, వచ్చిన ఎనిమిది గంటల్లోపు అక్కడికి వెళ్ళి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తామని ఫీల్డ్ ఏజెంట్లు చెప్తున్నారు. ఏడుగురు ఫీల్డ్ ఏజెంట్లతో గత సంవత్సరం ప్రారంభించిన వైల్డ్ సేవా కార్యక్రమంలో భాగంగా పంటలు, ఆస్తుల నష్టం కేసుల్లో ఇప్పటిదాకా సుమారు 3,261 పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' తెలిపింది. దీంతోపాటు.. 148 వరకూ పులులు, అడవికుక్కలద్వారా నష్టపోయిన పశుసంపద, తీవ్ర గాయాలైన 11 మంది, ఇద్దరు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కేసులను పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' నివేదించింది. -
అమరనాథ్ యాత్రలో గుండెపోటు మరణాలు!!
శ్రీనగర్ః అమరనాథ్ యాత్రలో గుండెపోటు మరణాలు రాను రాను పెరుగుతున్నాయి. గుండెపోటుతో షెర్ ఇ కాశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్ కె ఐ ఎమ్ ఎస్) లో చేరిన ఓ యాత్రికుడు చికిత్స పొందుతూ ఈ రోజు మరణించడంతో యాత్రలో గుండెపోటు మరణాలు 18 కి చేరాయి. ప్రముఖ ఆధ్యాత్మిక అమరనాథ్ యాత్రలో.. యాత్రికులు ఒక్కొక్కరుగా గుండెపోటుకు గురై.. మృత్యు వాత పడుతుండటం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమర్ నాథ్ యాత్రకు వెళ్ళిన పంజాబ్ కు చెందిన 18 ఏళ్ళ సందీప్ సింగ్.. జూలై 15 న బల్టాల్ శిబిరం వద్దకు వచ్చేసరికి తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అతడిని చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ టెరిటరీ కేర్ హాస్పిటల్ స్కిమ్స్ కు తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం సందీప్ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. యాత్రికులు ప్రయాణ సమయంలో గుండెపోటుకు గురౌతున్నారని, తీవ్ర గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ప్రస్తుతం మరణించిన సందీప్ మృత్యువాత పడ్డ యాత్రికుల్లో 14వ వాడని అధికారులు తెలిపారు. అలాగే ఓ యాత్రికుడు, స్థానిక డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో చనిపోగా... ఓ సీఆర్పీఎఫ్ జవాన్, సెవేదార్ బల్టాల్ శిబిరంలో యాత్రికులకోసం ఏర్పాటు చేసిన వంటగదిలో తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. -
టోల్ ట్యాక్స్ అడిగితే కాల్చి పారేస్తా!
జైపూర్: టోల్ గేట్ వద్ద పనిచేయడానికి ఉద్యోగులు, అధికారులు కాస్త ఆందోళన చెందుతున్నారు. తాజా సంఘటనలు చూస్తే నిజమే అనిపించక మానదు. ఇటీవలే గుర్గావ్ లో టోల్ గేట్ దగ్గర టోల్ ట్యాక్స్ కట్టకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఓ బస్సు డ్రైవర్ ఏకంగా వ్యక్తినే ఢీకొట్టడానికి వెనుకాడలేదన్న విషయం తెలిసిందే. గుర్గావ్లోని ఖేర్కీధౌలా టోల్‌ప్లాజా దగ్గర టోల్ టాక్స్ రూ.60 కట్టడానికి ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ నిరాకరించాడు. అడ్డు వచ్చిన టోల్ మేనేజర్‌ను ఢీకొట్టాలని ప్రయత్నించగా అతడు వెంటనే పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ విషయాన్ని మరవకముందే అలాంటి ఘటనే చోటుచేసుకుంది. టోల్ ప్లాజా సూపర్ వైజర్ అజ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సర్వార్ రోడ్ దారిలో వెళ్తున్న ఓ వాహనం టోల్ ప్లాజా దగ్గరకు రాగానే సూపర్ వైజర్ అంకిత్ మీనా టోల్ ట్యాక్స్ చెల్లించాలని అడుగుతుండగా ధన్ సింగ్ అనే వ్యక్తి తన డ్రైవర్ తో కలిసి గన్ చూపించి కాల్చుతానంటూ ఆయనను బెదిరించారు. ఈ విషయంపై అంకిత్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు గతంలో టోల్ ప్లాజాలో పనిచేసిన మరో వ్యక్తి ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీసీటీవీ లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. -
హైదరాబాద్ - విజయవాడ హైవేపై ట్రాఫిక్ రద్దీ
హైదరాబాద్ : సంక్రాంతి పండగ పురస్కరించుకుని హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు స్వస్థలాలకు చేరుకునేందుకు వాహనాల్లో బయలుదేరారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి వాహనాల రాకపోకలతో మరింత రద్దీ పెరిగింది. అయితే నల్గొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పన్ను చెల్లించేందుకు వాహనాలు నిలపడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలు బారులు తీరాయి. దాంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
తగ్గిన తుఫ్రాన్ టోల్గేట్ ఛార్జీలు
హైదరాబాద్ : మెదక్ జిల్లా తుఫ్రాన్ (మనోహరాబాద్) టోల్గేట్ వద్ద వసూలు చేస్తున్న ఛార్జీలను తగ్గిస్తూ నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టోల్గేట్ వద్ద వాహనాల నుంచి ఇకపై ఒకసారి వెళ్లడానికి రూ. 70 వసూలు చేస్తారని ... అలాగే వాహనానికి రాను పోను ఛార్జీ అయితే రూ. 105 వసూలు చేస్తారని ఎన్హెచ్ఏఐ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ టోల్గేట్ వద్ద ఇప్పటి వరకు కారు, జీపు, వ్యాను, ఇతర లైట్ మోటర్ వాహనాలు ఒకసారి వెళ్లడానికి రూ. 125... అలాగే రానుపోనుకూ రూ. 180 వసూలు చేస్తున్నారు. దీంతో తక్కువ దూరం ప్రయాణించే స్థానికులకు చాలా వ్యయం అవుతుంది. దీంతో ఈ అంశాన్ని స్థానిక టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో ఈ అంశంపై కేసీఆర్... నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో చర్చించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉన్నతాధికారులు ఛార్జీలు తగ్గిస్తూ... ఉత్తర్వులు జారీ చేశారు. -
'ఆయనను దేశద్రోహి అనలేదు'
బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్‌ను 'దేశద్రోహి' అని తాను అనలేదని, అయినప్పటికీ తాను ఆ మాట అన్నట్టు పలు పత్రికలు ప్రచురించాయని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ శనివారం వివరణ ఇచ్చారు. 'పార్లమెంటు స్థాయీ సంఘం సమావేశంలో నేను ఏం చెప్పానన్నది రహస్యం. స్థాయీ సంఘంలో చేసే వ్యాఖ్యలు బయటకు వెల్లడించడం చట్టవిరుద్ధమవుతుంది. ఆమిర్‌ను ఉద్దేశించి నేను 'దేశద్రోహి' అన్న పదాన్ని ఉపయోగించలేదు. నా జీవితం మొత్తంలో ఆయన గురించి అలాంటి మాట అనలేను. అయినా పరువును దెబ్బతీసేందుకు అలాంటి వ్యాఖ్యలను ప్రతికలు ప్రచురించాయి. అసత్యాలను ప్రచురించినందుకు వాటికి నోటీసులు ఇస్తాను' అని మనోజ్ తివారి పేర్కొన్నారు. ఆమిర్‌ఖాన్‌ను 'ఇన్క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించడాన్ని తప్పుబడుతూ పర్యాటకంపై పార్లమెంటు స్థాయీ సంఘం శుక్రవారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఆమిర్‌ను ఉద్దేశించి బీజేపీ ఎంపీ మనోజ్ తివారి అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు ఆయనపై మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చిన మనోజ్ తివారి ఆమిర్ 'ఇన్క్రెడిబుల్ ఇండియా'కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండరాదని మాత్రమే తాను పేర్కొన్నానని చెప్పారు. అసహనం వివాదం నేపథ్యంలో భారత్ సురక్షిత దేశం కాదని పేర్కొన్న ఆయన దేశ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం సరికాదని తెలిపారు. -
టోల్గేట్ @ యశ్వంతాపూర్
వరంగల్-హైదరాబాద్ హైవేపై టోల్ ఫీజు రోడ్డు పూర్తయితే రెండు చోట్ల చెల్లింపులు 28 బ్రిడ్జిలు, నాలుగు బైపాస్‌లు రూ.1905 కోట్ల నిధులతో విస్తరణ 2018 జూన్ నాటికి పనులు పూర్తి వరంగల్ : వరంగల్-హైదరాబాద్ రోడ్డు త్వరలో నాలుగు వరుసల రహదారిగా మారనుంది. 99 కిలో మీటర్ల పొడవైన ఈ జాతీయ రహదారి విస్తరణ పనులు 30 నెలల్లోనే పూర్తికానున్నాయి. వాహనాల రద్దీతో ప్రస్తుతం ఈ రోడ్డుపై ప్రయూణం ఇబ్బందిగా మారింది. విస్తరణ పూర్తయితే హైదరాబాద్‌కు సులభంగా తక్కువ సమయంలో నే చేరుకునే అవకాశం ఉంటుంది. అరుుతే, రూ.1905 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పను లు పూర్తి కాగానే వాహనదారులకు సుఖమెన ప్రయాణంతోపాటు టోల్ ఫీజు రూపంలో జేబులు ఖాళీ కానున్నా యి. హైదరాబాద్ వెళ్లే మార్గంలో ప్రస్తుతం బీబీనగర్ వద్ద టోల్‌గేటు ఉంది. వాహనదారులు ప్రస్తుతం అక్కడ ఒక్కచోటే టోల్‌ఫీజు చెల్లిస్తున్నారు. తాజాగా చేపట్టిన రోడ్డు విస్తరణ పూర్తయితే మరో టోల్ గేటు ఏర్పాటు చేస్తారు. అప్పుడు రెండు చోట్ల టోల్‌ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా టోల్ ఫీజు ప్రతి ఏటా పది శాతం వరకు పెరుగుతుందని రోడ్లు, భవనాల శాఖ అధికారులు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి నుంచి వరంగల్ జి ల్లా హసన్‌పర్తి మండలం ఆరెపల్లి వరకు 99 కిలోమీటర్ల రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికలో హైదరాబాద్ రహదారిలో 89వ కిలోమీటరు వద్ద టోల్గేట్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. జనగామ మండలం యశ్వంతాపూర్ వద్ద ప్రస్తుతం 89వ కిలోమీట రు మైలు రాయి ఉంది. ఆరెపల్లి నుంచి లెక్కిస్తే మాత్రం ప్రదేశం మారే అవకాశం ఉంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్-వరంగల్ రోడ్డు విస్తరణ పనులు ఎట్టకేలకు మొదలవుతున్నాయి. 2018 జూన్ వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌గడ్కరీ, సీఎం కె.చంద్రశేఖరరావు ఈనెల 4న రోడ్డు పనులను ప్రారంభిం చారు. హైదరాబాద్ ప్రయాణం వేగంగా పూర్తయ్యేందుకు అనువుగా గ్రేటర్ వరంగల్ నగరం(బైపాస్) వెలుపలి నుంచి రహదారిని నిర్మిస్తున్నారు. జనగామ, ఆలేరు, వంగపల్లిలోనూ ఇదే రకంగా బైపాస్ నిర్మిస్తారు. -
మహిళలు దేశాధిపతులైతే..శాంతియుత ప్రపంచం!
చెన్నై: అసమ్మతి గళాలను కూడా గౌరవించాల్సిన అవసరముందని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా పేర్కొన్నారు. అన్నిమత విశ్వాసాలనే కాదు.. ఏ మతవిశ్వాసం లేనివారిని కూడా గౌరవించడమే లౌకికవాదమని ఆయన అన్నారు. దేశంలో పరమత అసహనం పెరిగిపోయిందంటూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. 'మీతో ఏకీభవించనివారిని నిర్మూలించాలనుకోవడం సరికాదు' అని చెప్పారు. 'ప్రపంచ శాంతికి మానవ దృక్కోణం' అనే అంశంపై మద్రాస్ ఐఐటీలో దలైలామా మంగళవారం ఉపన్యసించారు. గడిచిన శతాబ్దమంతా హింసతో నిండిపోయిందని, ప్రస్తుతం కూడా అది కొనసాగడం మూర్ఖత్వమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రపంచంలోని ఏడు వందల కోట్ల జనాభాలో వందకోట్లమంది వరకు మత అవిశ్వాసులు ఉన్నారు. వారిని కూడా గౌరవించాల్సిన అవసరముంది. ఎందుకంటే మత విశ్వాసం అనేది ఒకరి వ్యక్తిగత విషయం' అని చెప్పారు. మతసామరస్యంలో యావత్ ప్రపంచానికి భారత్ ఆదర్శప్రాయమని కొనియాడారు. తదుపరి దలైలామ మహిళ అయ్యే అవకాశముందా? అన్న ప్రశ్నకు తప్పకుండా అవ్వొచ్చు అని బదులిచ్చారు. 'నేను గతంలో చాలాసార్లు చెప్పాను. ఆమె అందంగా ఉండాలి. ఎందుకంటే ముఖం కూడా కొంత మార్పును తీసుకురాగలదు! కాదంటారా?' అని నవ్వుతూ చెప్పారు. మహిళలు దేశాధిపతులైతే ప్రపంచం మరింత శాంతియుతంగా ఉంటుందని దలైలామా అభిప్రాయపడ్డారు. -
మృత్యు విలయం
కాబుల్/ఇస్లామాబాద్: హిందూఖుష్ పర్వత శ్రేణులు కేంద్రంగా సంభవించిన భూకంపం అటు అఫ్ఘానిస్థాన్ నే కాక పాకిస్థాన్ లోనూ ఘోర విషాదానికి కారణమైంది. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ఇరుదేశాల్లో మృత్యువాతపడిన వారి సంఖ్య 180కి పెంరిగింది. ఇందులో ఎక్కువ మరణాలు పాకిస్థాన్ లో చోటుచేసుకున్నవే కావడం గమనార్హం. చిన్నా, పెద్దా ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. దాదాపు 5 వేల మందికిపైగా గాయపడి ఉండొచ్చని అంచనా. వాయివ్య పాకిస్థాన్ లోని ఖైబర్, బుజర్ ప్రాంతాల్లో భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ రెండు ప్రావిన్స్ లలోనే దాదాపు 147 మంది ప్రాణాలు కోల్పోయారు. రావల్పిండిలోనూ పలు భవనాలకు బీటలు ఏర్పడ్డాయి. టకార్ ప్రావిన్స్ లోని స్కూల్ లో తొక్కిసలాటలో మరణించిన 12 మంది విద్యార్థినులు సహా అఫ్ఘానిస్థాన్ లో 51 మంది మృత్యువాతపడ్డారు. 7.5 తీవ్రతతో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఆ వెంటనే మరో నాలుగు నిమిషాలకు 4.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. మొదటి కంపానికే వేలాది భవనాలు నేలమట్టం కాగా, రెండో భూకంపం.. ఆ శిథిలాలు మరింత కూరుకుపోయేందుకు కారణమయింది. దీంతో శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని కాపాడటం కష్టంగా మారింది. హిందూఖుష్ పర్వత శ్రేణుల్లో తరచూ భూమి కంపిస్తుండటం సహజమే అయినప్పటికీ సోమవారం నాటి భూకంపం మాత్రం అత్యంత భారీ (రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతగా) భూకంపమని యూఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది. 2005లో కశ్మీర్ లోయ కేంద్రంగా (7.6 తీవ్రతతో) సంభవించిన భూకంపం.. భారత్, అఫ్ఘానిస్థాన, పాకిస్థాన్ దేశాల్లోని 80 వేల మందిని బలితీసుకున్న సంగంతి తెలిసిందే. -
‘సహనం’పైనా అసత్యాలేనా?
భారతీయులు దురాక్రమణకు గురవుతూ వచ్చారే కానీ, వారెన్నడూ ఇతర దేశాలపై దండెత్తలేదు అనే భావాన్నీ, తమను జయించిన వారి పట్ల కూడా సహన భావం ప్రదర్శిస్తున్న ఏకైక జాతి భారతీయులే అనే భావాన్నీ చారిత్రక వాస్తవాలు పూర్వపక్షం చేస్తున్నాయి. కానీ చాలా మంది భారతీయులు చివరికి కేంద్ర కేబినెట్లోని మంత్రులు కూడా మరీ చిన్న పిల్లల స్థాయి అమాయకత్వంతో కూడిన ఇలాంటి కల్పిత భావనలను నేటికీ విశ్వసిస్తుండటమే ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. మన జాతి గురించీ, మన గురించీ చాలామంది భారతీయుల్లో పాతుకుపోయి ఉన్న రెండు బలమైన విశ్వాసాలపై నేను రాయాలనుకున్నాను. ఇవే అభిప్రాయాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా కొద్ది రోజుల క్రితం ఒక కార్యక్రమంలో పునరుద్ఘాటించారు. ఆయనిలా చెప్పారు. ‘‘ప్రస్తుతం దేశంలో ఒక కొత్త ధోరణిని చూస్తున్నాం. దేశంలో సహనభావం తగ్గిపోతోందని వారంటున్నారు. కానీ ప్రపంచంలోనే సహనాన్ని పాటిస్తున్న ఏకైక దేశం ఇండియా. నూరు శాతం కాకున్నా 99 శాతం వరకు సహనాన్ని మనం పాటిస్తున్నాం’’ అంటూనే వెంకయ్య మరిన్ని మాటల్ని జోడించారు. ‘‘మీరు చరిత్రకేసి చూసినట్లయితే, ఇండియా అనేక దేశాల దురాక్రమణకు గురవుతూ వచ్చింది కానీ, ఒక్కటంటే ఒక్క దేశం పైన అయినా భారత్ దండెత్తిన, దురాక్రమించిన ఘటన లేనే లేదు. భారతీయులకు అలాంటి వైఖరి లేదు కూడా. అన్ని మతాలనూ మనం గౌరవిస్తున్నాం. అదే భారత్ గొప్పతనం. భారతీయుల రక్తంలోనే సహనభావం ఇంకిపోయి ఉంది.’’ భారతీయులు అనేకమంది పై రెండు విశ్వాసాలను కలిగి ఉన్నారు. మొదటిదాన్ని చూస్తే ఇండియా ఎప్పటికీ దురాక్రమణకు గురవుతూనే వచ్చింది కానీ భారతీయులు ఎన్నడూ ఏ దేశాన్నీ దురాక్రమించలేదు. ఇక రెండో భావన ఏమిటంటే, భారతీయులు అంటే పై సందర్భంలో హిందువులు విశిష్టమైనవారు. ఎందుకంటే మనకు సహనభావం ఉంది కనుక. మన మధ్యే జీవిస్తూ ఉన్న మన విజేత పట్ల కూడా మనం సహనభావం ప్రదర్శిస్తున్నాం కనుక. పైన ప్రస్తావించిన వాటిలో రెండో విశ్వాసాన్ని మనం మొదట చూద్దాం. మనకు జరిగిన అనుభవాలనే అనేక ఇతర దేశాలు కూడా పొంది ఉన్నాయి. ఉత్తర భారతదేశాన్ని ముస్లింలు జయించిన శతాబ్దంలోనే అంటే 1066వ సంవత్సరంలో ఇంగ్లండ్‌ను ఫ్రెంచ్ వాళ్లు జయించారు. ఇండియాలా కాకుండా, ఇంగ్లండు భూస్వామ్య కులీనవర్గం, ఉన్నత వర్గాల్లోని అధికశాతం విదేశీ మూలాలు కలిగిన వారే. క్వీన్ ఎలిజిబెత్ సైతం శాక్సె-కోబర్గ్ గోథా రాజవంశానికి చెందినవారు. పేరు సూచిస్తున్నట్లుగా ఆమె ఇంగ్లిష్ వ్యక్తి కాదు. జర్మన్ మూలానికి చెందింది. జర్మన్ వ్యతిరేక మనోభావాలు పెచ్చరిల్లిన కారణంగా ప్రపంచ యుద్ధ కాలంలోనే ఆమెకున్న జర్మనీ పేరు పక్కకు వెళ్లి విండ్సార్ అనే బ్రిటిష్ పేరు వచ్చి చేరింది. అయితే ఇంగ్లండ్ కులీనవర్గాలు తమ విదేశీ మూలాలను ఎంతో ఆత్మగౌరవంతో అట్టిపెట్టుకున్నారు. తమ విదేశీ మూలాన్ని వారెన్నడూ తప్పుగా భావించలేదు. ఆ తర్వాత 200 సంవత్సరాలకు కుబ్లయ్ ఖాన్ పాలనలో మంగోలులు చైనాను జయించి తమ భూభాగంలో కలిపేసుకున్నారు. మంగోల్ యువాన్ రాజవంశాన్ని చైనా ప్రజలు గొప్పగా తలుచుకుంటారు. ఇక ఉత్తర ఆఫ్రికా అయితే క్రీస్తు పూర్వం 450 (హెరొడోటస్ చరిత్రపై తొలి పుస్తకం రాసిన కాలం) లేదా అంతకు మునుపటి కాలం నుంచే వివిధ జాతుల కలయిక నుంచి రూపొందింది. ఇక టర్కీని మధ్య ఆసియా టర్కులు జయించారు. గ్రీకులతోపాటు వివిధ జాతుల ప్రజలు ఇక్కడ నివసించేవారు. టర్కీని అనటోలియా అని పిలిచేవారు. గ్రీకు భాషలో అనటోల్ అంటే తూర్పు అని అర్థం. దీని కారణంగా సైప్రస్ అర్ధ టర్కిష్ గానూ అర్ధ గ్రీకుగాను ఉంటోంది. మన భారత, పాకిస్తాన్ దేశాలకు మల్లే ఈ రెండు దేశాల ప్రజలు కూడా ఇరుగుపొరుగునే జీవిస్తున్నారు పైగా వారిలో ఎవరికీ అపరాధ భావన లేదు. హంగరీ పేరు హున్స్ నుంచి వచ్చింది. వీరు మధ్యాసియాకు చెందిన గిరిజన తెగ ప్రజలు. వీరు హంగరీని జయించి యూరోపియన్లతో కలిసిపోయారు. హంగేరియన్ అనేది ఇండో యూరోపియన్ భాష కాదు. గ్రీకులు శతాబ్దాలపాటు ఈజిప్ట్‌ను పాలించడమే కాకుండా వారితో కలసి జీవించారు. (ఈజిఫ్టు చివరి రాణి క్లియోపాత్రా వాస్తవానికి గ్రీకు మాట్లాడేది.) ఇవి చరిత్రకు సంబంధించి నా జ్ఞాపకాలలోంచి నేను ఇచ్చిన కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కాబట్టి మనకు సహనభావం ఉంది లేదా మనల్ని జయించిన విజేతలతో కూడా కలసి జీవించాము కాబట్టి మనది అసాధారణ జాతి లేదా విశిష్టమైన జాతి అని వెంకయ్య నాయుడు చెప్పిన మాట శుద్ధ తప్పు. ఇక రెండో విషయాన్ని, అంటే భారతీయులు ఎన్నడూ మరో దేశాన్ని ఆక్రమించలేదు అనే కల్పిత గాథను చూద్దాం. దీనికి సంబంధించి మనం చరిత్రలో ఎంతో వెనక్కు వెళ్లాల్సిన అవసరం లేదు. భారతీయ చక్రవర్తి రంజిత్ సింగ్ సేనానులు అతడి పాలనా కాలపు చివరి రోజుల్లో కాబూల్‌ను ఆక్రమించారు. అయితే రంజిత్ సింగ్ తనను తాను ఇండియన్‌గా కాకుండా పంజాబీలాగే భావించుకునేవాడు. ఎందుకంటే ఇండియా జాతీయ రాజ్యంగా మారకముందే ఇది జరిగింది. కాని ఇదేమంత పెద్ద విషయం కాదు. అశోక చక్రవర్తి కాందహార్‌లో సుప్రసిద్ధ స్తూపాన్ని నిర్మించాడు. ఇది ఆయన గౌరవార్థం అక్కడ నిర్మించి ఉంటారంటే నాకు సందేహమే. అశోకుడు కాందహార్‌పై దాడి చేసి ఉంటాడు లేక అఫ్ఘానిస్తాన్ లొంగిరాకపోతే దాడి చేస్తానని బెదిరించి ఉండవచ్చు కూడా. అఫ్ఘానిస్తాన్ కూడా ఇండియాలో భాగమేనని కొంతమంది చెప్పవచ్చు. దీనికి నేను చెప్పేది ఒకటే. మహమ్మద్ గజనీ నుంచి ఇబ్రహీం లోడీ, షేర్ ఖాన్ సూర్ల వరకు ఉత్తర భారతదేశంలో అఫ్ఘాన్ విజయాల చరిత్రను చూసినట్లయితే ఇండియాయే అఫ్ఘానిస్తాన్‌లో భాగమని కూడా చెప్పవచ్చు మరి. నేను చెప్పే ముఖ్య విషయం ఏమిటంటే, హిందువులు శాంతికాముకులు, ఉదార స్వభావులు అని చెప్పే భావన ఆధునికమైన దేకావచ్చు. మన రక్తాన్ని మనమే చిందించడం మనకెప్పుడూ ఒక సమస్య కాలేదు. ఉదాహరణకు మరాఠాలు గుజరాత్‌ను జయించారు. వారు ఇప్పటికీ బరోడాపై పట్టు కలిగి ఉన్నారు. ఇది శాంతియుతమైన లేక ప్రజాస్వామికమైన ఆక్రమణ అయితే కాదు. అశోకుడు కళింగ దేశాన్ని నేలమట్టం చేశాడు. వేలాది ఒరియా ప్రజలను ఊచకోత కోశాడు. ఏ ఒక్కరూ ఈ అభిప్రాయంతో విభేదించరనుకుంటాను. చైనా, బర్మా, ఆస్ట్రేలియా వంటి దేశాలపై దాడి చేయకుండా అతడిని అడ్డుకున్నది సహనభావం కాదు, ఆ దేశాలకు వెళ్లడానికి అశోకుడికి వీసా లేకపోవడం అసలే కాదు. అవి మనకు సహజ సిద్ధమైన సరిహద్దులు. విదేశాన్ని లేక ఉపఖండేతర భూభాగాన్ని జయించడానికి ఉత్తర భారత రాజవంశాలకు భౌగోళిక పరమైన అవకాశం చాలా తక్కువగా ఉండేది. ఇక దక్షిణాదికి వస్తే ఇతర ఉదాహరణలు ఉన్నాయి. ఉత్తర భారతదేశం ముస్లింల ఆక్రమణకు, ఇంగ్లండ్ దేశం ఫ్రాన్స్ ఆక్రమణకు గురవుతున్న కాలంలోనే, చోళరాజుల పాలనలో తమిళ జాతీయులు ఆగ్నేయాసియా ప్రాంతం పై దండెత్తి ఆక్రమించారు. ఎందుకంటే నావికా బల సామర్థ్యం ఉన్న అతి కొద్ది భారతీయ రాజరికాల్లో చోళులూ ఒకరు. ఇంతవరకు ఇక్కడ ప్రస్తావించిన విషయాలు చరిత్రలో తేలినవే. నేను ఒక్కటీ కొత్తగా చెప్పింది లేదు. కానీ చరిత్ర చెప్పే ఈ చేదు వాస్తవాలను పక్కన బెట్టి చాలా మంది భారతీయులు చివరికి కేంద్ర కేబినెట్లోని మంత్రులు కూడా మరీ చిన్న పిల్లల అమాయకత్వంతో కూడిన ఇలాంటి కల్పితగాథలను నేటికీ విశ్వసిస్తుండటమే ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com) - ఆకార్ పటేల్ -
నేటి నుంచి రవాణాబంద్
జిల్లా వ్యాప్తంగా సమ్మెలో 1.72 లక్షల లారీలు మూతపడనున్న పెట్రోలు బంక్‌లు మద్దతుగా నిలిచిన ఆయిల్ ట్యాంకర్లు విజయవాడ వ్యాట్, టోల్ ఫీజులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన ట్రాన్స్‌పోర్టు నిరవధిక బంద్ జిల్లాలో గురువారం నుంచి జరగనుంది. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ సమ్మెను జయప్రదం చేయడానికి జిల్లాలోని ట్రాన్స్పోర్టర్లు సమాయత్తమవుతున్నారు. లారీ ఓనర్లు, ట్రక్కుల యజమానులు, పెట్రోలు డీలర్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 1.72 లక్షల లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోనున్నాయి. 220 పెట్రోలు బంక్‌లు మూతపడనున్నాయి. ఆయిల్ ట్యాంకర్లను కూడా నిలిపివేస్తారు. డీజిల్, పెట్రోల్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి ఆరో తేదీన లీటరుపై అదనంగా పెంచిన రూ.4 వ్యాట్‌ను రద్దు చేయాలని, టోల్ ట్యాక్స్‌లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్పోర్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. రాష్ట్రంలో రూ.4 వ్యాట్ వల్ల లారీల యజమానులు సరిహద్దు రాష్ట్రాలకు వెళ్లి డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. వ్యాట్ వల్ల ఇటు లారీ ఓనర్లు, పెట్రోలు డీలర్లు, ప్రజలపై కూడా భారం పడుతోంది. ఆయిల్ ట్యాంకర్ల కిరాయిలపై కూడా కేంద్రప్రభుత్వం వ్యాట్ వసూలు చేయడాన్ని ట్రాన్స్పోర్టర్లు వ్యతిరేకిస్తున్నారు. పెట్రోలు బంకుల వద్ద కోలాహలం నిరవధిక సమ్మె కారణంగా బుధవారం సాయంత్రం నుంచి పెట్రోలు బంకుల్లో రద్దీపెరిగింది. వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. నగరంలోని బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డులో కొన్ని బంకుల వద్ద కార్లు క్యూ కట్టాయి. వాహనదారులు బంకులకు వెళ్లి ట్యాంకులను ఫుల్ చేయించుకుంటున్నారు. జిల్లాలో 220 పెట్రోలు బంకులు ఉన్నాయి. రోజుకు 11 లక్షల లీటర్ల పెట్రోలు, 20 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. జిల్లాలో మొత్తం ఆరున్నర లక్షల వాహనాలు ఉన్నాయి. వాహనదారులు సమ్మె ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందోననే ఆందోళనతో మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, నూజివీడు, నందిగామ, తిరువూరు తదితర ప్రాంతాల్లోని పెట్రోలు బంకులు వాహనాలతో కిటకిటలాడాయి. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో బంకుల సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెకు పూర్తి సంఘీబావం ప్రకటిస్తున్నట్లు ఏటీఏ అధ్యక్షుడు బాబ్జి తెలిపారు. ఆటోనగర్‌లోని ఏటీఏ కార్యాలయంలో బుధవారం అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించారు. సమ్మె జయప్రదం చేయాలి ట్రాన్స్‌పోర్టు సమ్మెను జయప్రదం చేయాలి. ఎనిమిది నెలలుగా వ్యాట్ భారం తగ్గించాలని పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దీనివల్ల ప్రజలపై కూడా భారం పడుతోంది. ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టం వస్తోంది. వెంటనే ప్రభుత్వం వ్యాట్ ఎత్తివేయాలి. -పెట్రోలు, డీజిల్ డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
కానిస్టేబుల్ వీరంగం
వెంకటగిరి (నెల్లూరు ) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. జిల్లాలోని వెంకటగిరి టోల్గేట్ వద్ద ఓ పోలీస్ కానిస్టేబుల్ ఓ వ్యక్తితో చిన్న విషయమై వాగ్వివాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా బాధితుడు అయిన కోటి అనే వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదాడు. దీంతో సదరు కానిస్టేబుల్ అయిన సురేష్‌ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ బాధితుడి బంధువులు పోలీస్‌స్టేషన్ ఎదుటు ఆందోళనకు దిగారు.