Travel To Konkan For Ganesh Festivities Will Be Toll Free: Maharashtra CM Shinde - Sakshi
Sakshi News home page

Ganesh Festival Toll Free: గణేశ్‌ భక్తులకు టోల్‌ మాఫీ

Published Sun, Aug 28 2022 3:28 PM | Last Updated on Sun, Aug 28 2022 4:16 PM

Travel to Konkan for Ganesh Festivities will be toll free: Maharashtra CM - Sakshi

సాక్షి, ముంబై: గణేష్‌ భక్తులకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శిందే వర్గం, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం తీపి కబురునందించింది. గణేషోత్సవాల కోసం స్వగ్రామాలకు రోడ్డు మార్గంమీదుగా వెళ్లే భక్తులకు టోల్‌ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది.  ఆగస్టు 27వ తేదీ నుంచి ఈ టోల్‌ ఫ్రీ అమల్లోకి వచ్చింది. దీనిపై ప్రజలు ఆనందం వ్య క్తం చేస్తున్నారు.

ప్రతి సంవత్సరం గణేశోత్స వాలలో పాల్గొనేందుకు ముంబై నుంచి కొంకణ్‌ దిశగా వెళ్లే వాహనాల సంఖ్య అధికంగా ఉంటుంది. దీన్ని దష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ముంబై – బెంగళూర్‌ రహదారి, ముంబై – గోవా రహదారులతోపాటు ఇతర పీడబ్ల్యూడీ రోడ్ల మీదుగా వెళ్లే వాహనాలకు ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 11వ తేదీ వరకు టోల్‌ మాఫీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ప్రకటించారు.

చదవండి: (Vishal: నటుడు విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్‌ హైకోర్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement