ఇక ‘ప్రైవేటు ఓఆర్‌ఆర్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరా బాద్‌కు మణిహారం నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు.. దీనిని బడా ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. దీంతో పాటు టోల్ రూపంలో మంచి ఆదాయం ఉన్న జాతీయ రహదారులను కూడా ప్రైవేటు పరం చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. వీటిని 20 నుంచి 30 ఏళ్ల కాలానికి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు. వాటిపై వచ్చే ఆదా యాన్ని ఆయా సంస్థలే తీసుకుంటాయి. దీనికి ప్రతిగా వాటి నిర్వహణ వ్యయాన్ని పూర్తిగా భరిస్తాయి. ఎన్నేళ్ల కాలానికి వాటిని అప్పగిస్తే, అన్నేళ్ల కాలానికి వచ్చే ఆదాయంలో నిర్ధారిత (ఒప్పందం మేరకు) ఆదాయాన్ని ముందుగా నే ఆ సంస్థలు ప్రభుత్వానికి చెల్లిస్తాయి. వాటిని ప్రభుత్వం తిరిగి రోడ్ల విస్తరణకు ఖ ర్చు చేస్తుంది. టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (టీఓటీ) పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఆలోచనలో భాగంగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యా
ప్తంగా 75 జాతీయ రహ దారులను ఈ రూపంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఏర్పాట్లు ప్రారంభం కాగా, రాష్ట్రంలో దానిని ఔటర్‌తో మొదలు పెట్టబోతున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో ఓఆర్‌ఆర్ గ్రోథ్ కారిడార్ బోర్డు అనుమతి మంజూరు చేసింది. 20 ఏళ్ల కాలానికి 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఔటర్ రింగ్ రోడ్డును అప్పగిస్తే దాదాపు రూ.2,500 కోట్ల వరకు ముందస్తు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఏంటీ టీఓటీ..
ఇప్పటి వరకు మనం బీఓటీ(బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్) వ్యవహారాన్ని చూశాం. తాజాగా కేంద్రం టీఓటీ(టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్) ఆలోచనను తెరపైకి తెచ్చింది. జాతీయ రహదారులపై టోల్ రూపంలో భారీగా ఆదా యం వస్తోంది. అది కాలక్రమంలో పెరుగు తూనే ఉంటుంది. దీంతో ఆ ఆదాయం ఆశ చూపి రోడ్ల నిర్వహణను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు అప్పగించటమే దీని ఉద్దేశం. వెరసి రోడ్ల నిర్వహణ భారాన్ని ప్రభుత్వం పూర్తిగా వదిలించుకుం టుంది. ప్రైవేటు సంస్థలు టోల్‌ను సమ ర్థవంతంగా నిర్వహిం చి ఆదాయాన్ని పెంచుకుంటాయి. వెరసి రెండు వైపులా ఇది లాభసాటి కావటంతో ఈ ఆలోచ నకు మంచి స్పందన వస్తోంది. ఇటీవలే కేంద్ర మంత్రివర్గం దీనికి పచ్చజెండా ఊపటంతో భారత జాతీయ రోడ్ల నిర్వహణ సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) దీనికి పదును పెట్టింది. లాభసాటిగా ఉన్న 75 జాతీయ రహదారులను గుర్తించింది. ఇందులో తెలంగాణ రోడ్లు లేవు.
ఇది మెరుగ్గా ఉంటుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేటు సంస్థలకు అప్పగించి ముందస్తు ఆదాయాన్ని సొంతం చేసుకుని అభివృద్ధి పనులకు వినియోగించాలని నిర్ణయించింది. 20 నుంచి 30 ఏళ్ల కాలానికి దీన్ని ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారు. గ్లోబల్ టెండర్లలో ఎక్కువ మొత్తం బిడ్ దాఖలు చేసిన సంస్థను ఇందుకు ఎంపిక చేస్తారు. ఓఆర్‌ఆర్‌పై టోల్ రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆ సంస్థ దక్కించుకుంటుంది. భవిష్యత్తులో దానిపై ఏర్పాటు చేసే ఇతరత్రా మార్గాల్లో వచ్చే ఆదాయం కూడా ఆ సంస్థే పొందుతుంది. దీనికి ప్రతిగా మొత్తం ఓఆర్‌ఆర్ నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ఈ ఒప్పందం ఎంత కాలం అమలులో ఉంటుందో అంతకాలానికి వచ్చే ఆదాయంలో ఒప్పందం మేరకు నిర్ధారిత మొత్తాన్ని ముందుగానే ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఓఆర్‌ఆర్ భవిష్యత్తు ఆదాయం, వ్యయాలను కచ్చితంగా అంచనా వేసేందుకు నైపుణ్యం ఉన్నవారిని సలహాదారుగా నియమించుకోనున్నారు. ఆ తర్వాత గ్లోబల్ టెండర్లు పిలిచి అత్యధిక బిడ్ దాఖలు చేసిన సంస్థను గుర్తిస్తారు.
విదేశీ రోడ్లకు దీటుగా..
అభివృద్ధి చెందిన దేశాల్లో అన్ని ప్రధాన రోడ్లు ఎక్స్‌ప్రెస్ వేలుగా ఉంటున్నాయి. మన దేశంలో జాతీయ రోడ్లు కూడా నాసికరంగానే నిర్మితమ వుతున్నాయి. వీటికి కూడా విదేశీ తరహా హంగులు ఉండాలంటే ప్రైవేటుకు అప్పగించి నిర్వహించటమే మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పనుల్లో జాప్యం అవినీతి, నాణ్యతా లోపంలాంటి వాటికి అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన.
ఇదీ ‘ఔటర్’స్వరూపం
విస్తీర్ణం– కి.మీ. 158 (కిలోమీటరున్నర పని పెండింగ్‌లో ఉంది)
టోల్ ప్లాజాల సంఖ్య 19 (టోల్ లేన్లు 180)
ప్రస్తుతం సాలీనా టోల్ ఆదాయం రూ.196 కోట్లు
నిర్వహణ వ్యయం ప్రతి నెలా (కరెంటు బిల్లులు, అంబులెన్సులు, పెట్రోలింగ్, గ్రీనరీ, మెటల్ బార్ల ఏర్పాటు తదితరాలు కలిపి) 2
రోడ్డు పొరల నిర్మాణం (ప్రతి ఆరేళ్లకు ఒకసారి. ప్రస్తుత రేట్ల ప్రకారం వార్షిక వ్యయం) 250 కోట్లు