Nehru outer ring road
-
ఓఆర్ఆర్ ఆవలకు కాలుష్య పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: ప్రాధాన్యతా›క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపలికి హైదరాబాద్ లోని కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు సం బంధించిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధంచేయాలని పరిశ్రమల శాఖను వాయు నాణ్యత పర్యవేక్షక కమిటీ ఆదేశించింది. ‘హైదరాబాద్‌లో వాయు కాలుష్యం తగ్గింపు’ప్రణాళికలపై శనివారం అటవీ, పర్యా వరణ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ అధ్యక్షతన వాయు నాణ్యత పర్యవేక్షక కమిటీ సమీక్ష జరిగింది. నగరంలో మెరుగైన వాయునాణ్యత సాధనకు ప్రభుత్వం నిర్దేశిత, నిర్ణీత కాలవ్యవధికు తగ్గట్టుగా ప్రణాళికలను కచ్చితంగా అమలుచేయాలని రజత్‌కుమార్ ఆదేశించారు. హైదరాబాద్‌లో ఎప్పటికప్పుడు 7 కేంద్రాల ద్వారా వాయునాణ్యత పర్యవేక్షణకు, జీహెచ్ఎంసీకి రోడ్లు ఊడ్చే యంత్రాలు, వాయు కాలుష్య కారకాల గుర్తింపున కు, వాయు నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం రూ. 11 కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు. నగ రంలో వాహనాలకు బీఎస్–6 (భారత ప్రమాణాలు–6) అమలు, ట్రాఫిక్ ఫ్లోకు అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఏ రకం వాహనాలకు కేటాయించిన లైన్లో అవి వెళ్లేలా ‘లేన్ క్రమశిక్షణ’అమలు చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది. ప్రజలకు వాయు నాణ్యతపై అవగాహన కలిగించడానికి ‘ఎయిర్ క్వాలిటీ డేటా’ప్రచురించాలని టీపీసీబీకి సూచించింది. కాలుష్య కారక వాహనాలపై జరిమానాలు, విద్యాసంస్థల బస్సులు సీఎన్జీని ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో గాలి నాణ్యత శాటీస్ ఫాక్టరీ నుంచి మోడరేట్ రేంజ్లో ఉందని, దీనిని గుడ్ క్వాలిటీగా మార్చేందుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొం దించిందని రజత్‌కుమార్ అన్నారు. సమావేశంలో టీపీసీబీ సభ్యకార్యదర్శి నీతూ ప్రసాద్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
ఇక ‘ప్రైవేటు ఓఆర్ఆర్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరా బాద్‌కు మణిహారం నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు.. దీనిని బడా ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. దీంతో పాటు టోల్ రూపంలో మంచి ఆదాయం ఉన్న జాతీయ రహదారులను కూడా ప్రైవేటు పరం చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. వీటిని 20 నుంచి 30 ఏళ్ల కాలానికి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు. వాటిపై వచ్చే ఆదా యాన్ని ఆయా సంస్థలే తీసుకుంటాయి. దీనికి ప్రతిగా వాటి నిర్వహణ వ్యయాన్ని పూర్తిగా భరిస్తాయి. ఎన్నేళ్ల కాలానికి వాటిని అప్పగిస్తే, అన్నేళ్ల కాలానికి వచ్చే ఆదాయంలో నిర్ధారిత (ఒప్పందం మేరకు) ఆదాయాన్ని ముందుగా నే ఆ సంస్థలు ప్రభుత్వానికి చెల్లిస్తాయి. వాటిని ప్రభుత్వం తిరిగి రోడ్ల విస్తరణకు ఖ ర్చు చేస్తుంది. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఆలోచనలో భాగంగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యా ప్తంగా 75 జాతీయ రహ దారులను ఈ రూపంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఏర్పాట్లు ప్రారంభం కాగా, రాష్ట్రంలో దానిని ఔటర్తో మొదలు పెట్టబోతున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో ఓఆర్ఆర్ గ్రోథ్ కారిడార్ బోర్డు అనుమతి మంజూరు చేసింది. 20 ఏళ్ల కాలానికి 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఔటర్ రింగ్ రోడ్డును అప్పగిస్తే దాదాపు రూ.2,500 కోట్ల వరకు ముందస్తు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఏంటీ టీఓటీ.. ఇప్పటి వరకు మనం బీఓటీ(బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) వ్యవహారాన్ని చూశాం. తాజాగా కేంద్రం టీఓటీ(టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) ఆలోచనను తెరపైకి తెచ్చింది. జాతీయ రహదారులపై టోల్ రూపంలో భారీగా ఆదా యం వస్తోంది. అది కాలక్రమంలో పెరుగు తూనే ఉంటుంది. దీంతో ఆ ఆదాయం ఆశ చూపి రోడ్ల నిర్వహణను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు అప్పగించటమే దీని ఉద్దేశం. వెరసి రోడ్ల నిర్వహణ భారాన్ని ప్రభుత్వం పూర్తిగా వదిలించుకుం టుంది. ప్రైవేటు సంస్థలు టోల్‌ను సమ ర్థవంతంగా నిర్వహిం చి ఆదాయాన్ని పెంచుకుంటాయి. వెరసి రెండు వైపులా ఇది లాభసాటి కావటంతో ఈ ఆలోచ నకు మంచి స్పందన వస్తోంది. ఇటీవలే కేంద్ర మంత్రివర్గం దీనికి పచ్చజెండా ఊపటంతో భారత జాతీయ రోడ్ల నిర్వహణ సంస్థ(ఎన్హెచ్ఏఐ) దీనికి పదును పెట్టింది. లాభసాటిగా ఉన్న 75 జాతీయ రహదారులను గుర్తించింది. ఇందులో తెలంగాణ రోడ్లు లేవు. ఇది మెరుగ్గా ఉంటుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేటు సంస్థలకు అప్పగించి ముందస్తు ఆదాయాన్ని సొంతం చేసుకుని అభివృద్ధి పనులకు వినియోగించాలని నిర్ణయించింది. 20 నుంచి 30 ఏళ్ల కాలానికి దీన్ని ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారు. గ్లోబల్ టెండర్లలో ఎక్కువ మొత్తం బిడ్ దాఖలు చేసిన సంస్థను ఇందుకు ఎంపిక చేస్తారు. ఓఆర్ఆర్పై టోల్ రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆ సంస్థ దక్కించుకుంటుంది. భవిష్యత్తులో దానిపై ఏర్పాటు చేసే ఇతరత్రా మార్గాల్లో వచ్చే ఆదాయం కూడా ఆ సంస్థే పొందుతుంది. దీనికి ప్రతిగా మొత్తం ఓఆర్ఆర్ నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ఈ ఒప్పందం ఎంత కాలం అమలులో ఉంటుందో అంతకాలానికి వచ్చే ఆదాయంలో ఒప్పందం మేరకు నిర్ధారిత మొత్తాన్ని ముందుగానే ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఓఆర్ఆర్ భవిష్యత్తు ఆదాయం, వ్యయాలను కచ్చితంగా అంచనా వేసేందుకు నైపుణ్యం ఉన్నవారిని సలహాదారుగా నియమించుకోనున్నారు. ఆ తర్వాత గ్లోబల్ టెండర్లు పిలిచి అత్యధిక బిడ్ దాఖలు చేసిన సంస్థను గుర్తిస్తారు. విదేశీ రోడ్లకు దీటుగా.. అభివృద్ధి చెందిన దేశాల్లో అన్ని ప్రధాన రోడ్లు ఎక్స్‌ప్రెస్ వేలుగా ఉంటున్నాయి. మన దేశంలో జాతీయ రోడ్లు కూడా నాసికరంగానే నిర్మితమ వుతున్నాయి. వీటికి కూడా విదేశీ తరహా హంగులు ఉండాలంటే ప్రైవేటుకు అప్పగించి నిర్వహించటమే మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పనుల్లో జాప్యం అవినీతి, నాణ్యతా లోపంలాంటి వాటికి అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఇదీ ‘ఔటర్’స్వరూపం విస్తీర్ణం– కి.మీ. 158 (కిలోమీటరున్నర పని పెండింగ్‌లో ఉంది) టోల్ ప్లాజాల సంఖ్య 19 (టోల్ లేన్లు 180) ప్రస్తుతం సాలీనా టోల్ ఆదాయం రూ.196 కోట్లు నిర్వహణ వ్యయం ప్రతి నెలా (కరెంటు బిల్లులు, అంబులెన్సులు, పెట్రోలింగ్, గ్రీనరీ, మెటల్ బార్ల ఏర్పాటు తదితరాలు కలిపి) 2 రోడ్డు పొరల నిర్మాణం (ప్రతి ఆరేళ్లకు ఒకసారి. ప్రస్తుత రేట్ల ప్రకారం వార్షిక వ్యయం) 250 కోట్లు -
ఔటర్‌పై ఎల్ఈడీ వెలుగులు
సిటీబ్యూరో: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్ఎండీఏ చర్యలు చేపడుతోంది. పగలు కంటే.. రాత్రివేళల్లోనే అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఓఆర్ఆర్పై శంషాబాద్-గచ్చిబౌలి మధ్యనే ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు ప్రమాదాలు రాత్రి వేళ జరిగినవే. ఈఘటనలో ముగ్గురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. వెలుతురు సరిగా లేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమని హెచ్ఎండీఏ గుర్తించింది. ఈ క్రమంలో శంషాబాద్-గచ్చిబౌలి దారిలో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని హెచ్ఎండీఏ కమిషనర్ టి. చిరంజీవులు తెలిపారు. 24 కిలోమీటర్ల మేర రూ. 56 కోట్ల వ్యయంతో బల్బులు ఏర్పాటు చేసేందుకు ఫిలిప్స్ కంపెనీ కాంట్రాక్ట్ దక్కించుకుందని చెప్పారు. వచ్చే మూడు నెలల్లో వీటిని పూర్తి స్థాయిలో అమరుస్తారని తెలిపారు. వాస్తవంగా గంటకు గరిష్టంగా 120 కి.మీ వేగంతో వాహ నాలు రాకపోకలు సాగించేలా ఓఆర్ఆర్ని డిజైన్ చేశారు. అయితే, అంతకు మించిన వేగంతో వాహనాల రాకపోకలు సాగిస్తుండడం ప్రమాదాలకు హేతువు అవుతోంది. ఈ క్రమంలో వాహనాల వేగానికి కళ్లెం వేయడానికీ కసరత్తు చేస్తున్నారు. హెచ్ఎండీఏ, పోలీసు శాఖ సంయుక్తంగా వేగ నియంత్రణ చేపట్టే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. -
‘ఔటర్’పై అధునాతన ‘టోల్’ వ్యవస్థ
20 జంక్షన్లలో టీఎంఎస్ ఏర్పాటు రూ.75 కోట్లతో 18 నెలల్లో పూర్తి నేడు ఫైనాన్షియల్ బిడ్లు తెరవనున్న అధికారులు సాక్షి, హైదరాబాద్ : నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆటోమేటిక్ టోల్ వ్యవస్థ ‘టోల్ మేనేజ్మెంట్ సిస్టం (టీఎంఎస్)’ మరో ఒకటిన్నర సంవత్సరాల్లో అందుబాటులోకి రానుంది. రూ. 75 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఏర్పాట్లు చేస్తోంది. టీఎంఎస్ టెండర్‌పై కోర్టు వివాదం ఇటీవలే సమసిపోవడంతో శుక్రవారం ఫైనాన్షియల్ బిడ్లను తెరవనున్నారు. ఇది గ్లోబల్ టెండర్ అయినందున ఎన్నికల కోడ్ దీనికి వర్తించదని, అయినా.. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొన్నాకే అధికారికంగా ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అన్ని విధాలా అర్హత సాధించిన సంస్థకు పనులను అప్పగించి 18 నెలల్లో పూర్తిచేసే లక్ష్యంతో ఓఆర్ఆర్ పీడీ శామ్యూల్ ఆనందర్ కుమార్ చర్యలు చేపట్టారు.హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డుపై 20 జంక్షన్లలో టోల్ సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మొత్తం 180 లేన్లలో 23 వరకు ఎలక్ట్రానిక్స్ టోల్ కలెక్షన్ లేన్స్ ఉంటాయి. మిగతా 157 లేన్లలో మాన్యువల్, టచ్ అండ్ గో వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు. ఫైనాన్షియల్ బిడ్‌లో అర్హత సాధించిన ఏజెన్సీ (ఎల్-1)కి టెండర్ ఖారారు చేస్తారు. ఆ సంస్థ గడువులోగా ఔటర్‌పై అత్యాధునిక టోల్ గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. టీఎంఎస్ డిజైన్, విడిభాగాలు అమర్చుడం, సమర్ధ నిర్వహణ, నాణ్యత ప్రమాణాల పరిరక్షణ బాధ్యతలను ఆ సంస్థే చేపట్టాల్సి ఉంటుంది. ప్రధానంగా టోల్ బూత్‌లు, బూమ్ బారియర్స్, కంప్యూటర్ సర్వర్లు, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఆటోమేటిక్ వెహికల్ క్లాసిఫయర్ కం కౌంటర్, టోల్ ఆడిట్, సమాచార వ్యవస్థ, జనరేటర్లు, విద్యుత్ వంటి ఏర్పాట్లను కూడా ఆ సంస్థే చేయాలి. హమ్మయ్య ... ఎట్టకేలకు ఔటర్ రింగ్ రోడ్డుపై టీఎంఎస్ ఏర్పాటుకు మూడేళ్ల కిందటే హెచ్‌జీసీఎల్ శ్రీకారం చుట్టింది. అప్పట్లో ఈ ప్రాజెక్టు కోసం 6 విదేశీ సంస్థలు పోటీ పడ్డాయి. హెచ్‌జీసీఎల్ చేసిన షార్ట్ లిస్ట్‌లో ఐఆర్డిఐ- ఐఆర్డిఎస్ఏ కన్సార్షియా (కెనడా), హిటాచీ (జపాన్), టెల్వెంట్ ఎల్ అడ్ టి (స్పెయిన్), ఎల్‌ఎస్‌ఐఎస్-ఆర్ఐటి కన్సార్షియం (కొరియా), ఇఫ్‌కాన్ ఏజీ (ఆస్టియా), తోషిబా- ఇటోచు కన్సార్షియం తోషిబా కార్పొరేషన్ (జపాన్)లు ఎంపికయ్యాయి. సాంకేతిక అర్హతల పరిశీలనలో (టెక్నికల్ ఎవాల్యుయేషన్‌లో) ఎల్‌ఎస్‌ఐఎస్-ఆర్ఐటి కన్సార్షియం, హిటాచీ సంస్థలు అర్హత సాధించాయి. అయితే, టెక్నికల్ ఎవాల్యుయేషన్ సరిగా చేయలేదని, మళ్లీ పరిశీలించాలంటూ ఇఫ్‌కాన్ సంస్థ కోర్టుకెళ్లి సింగిల్ బెంచిలో గెలిచింది. దీనిపై హెచ్ఎండీఏ అప్పీల్‌కు వెళ్లినా ఫలితం లేకపోయింది. మళ్లీ సాంకేతిక అర్హతలను పరిశీలించాలని కోర్టు ఆదేశించింది. దీంతో టెక్నికల్ కమిటీ గతంలో తిరస్కరించిన సంస్థలను కూడా పరిగణనలోకి తీసుకొంది. దీనిపై ఎల్‌ఎస్‌ఐఎస్ సంస్థ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ కోర్టు నుంచి స్టే తెచ్చింది. హైకోర్టు ఈ నెల 10 ఎల్‌ఎస్‌ఐఎస్ సంస్థ వాదనను తోసిపుచ్చుతూ కేసు కొట్టేసింది. దీంతో టీఎంఎస్ టెండర్ ఫైనాన్షియల్ బిడ్ తెరిచేందుకు మార్గం సుగమమైంది. -
‘ఔటర్’పై మళ్లీ టోల్ బాదుడు
చార్జీలు అమాంతం పెంపు మే నెల నుంచి అమలు కొత్త ఏజెన్సీ కోసం టెండర్ల ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్ల చుట్టూ ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రయాణం ఇకపై మరింత భారం కానుంది. టోల్ ట్యాక్స్ (దారి సుంకం) చార్జీలను పెంచుతూ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నిర్ణయం తీసుకొంది. పెంచిన ధరలను మే నెల నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త రేట్ల ప్రకారం వాహనాన్ని బట్టి రూ. 10 నుంచి రూ. 60 వరకు అదనపు వడ్డింపు ఉండనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 119.45 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డుపై 17 చోట్ల టోల్‌ట్యాక్స్ వసూలు చే స్తున్నారు. వాహనాన్ని బట్టి ఒక జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్ వరకు ప్రయాణానికి రూ.10 నుంచి రూ. 70 వరకు చార్జీ వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు... కారులో పటాన్చెరు నుంచి పెద్దఅంబర్‌పేట వరకు ఔటర్‌పై ప్రయాణిస్తే పెరగనున్న ధరల ప్రకారం రూ.80 వరకు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ దూరానికి రూ.70లు టోల్‌ట్యాక్స్ ఉంది. అలాగే ప్రస్తుతం మినీ బస్సులకైతే రూ. 110, బస్సు లేదా 2యాక్సిల్ ట్రక్‌లకు రూ.230లు, 3 యాక్సిల్, కమర్షియల్ వాహనాలకు రూ.260 చొప్పున చార్జీ ఉంది. వీటిపై కూడా పెరిగిన ధరల మేరకు అదనపు భారం పడనుంది. టోల్ వసూలు కోసం టెండర్ల ఆహ్వానం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నగరం చుట్టూ 158 కి.మీ. మేర ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం తలపెట్టగా... ఇప్పటికే 124 కి.మీ. రోడ్డు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. పెద్దఅంబర్‌పేట నుంచి శంషాబాద్ మీదుగా శామీర్‌పేట వరకు నార్సింగి (నానక్‌రామ్‌గూడ- గచ్చిబౌలి లింక్‌ను కలిపి), పటాన్చెరు, దుండిగల్, మేడ్చెల్ వరకు 119.45 కి.మీ మేర ఔటర్‌పై టోల్‌ట్యాక్స్ వసూలు బాధ్యతను పీకే హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థతో కుదుర్చుకొన్న ఒప్పందం గడువు ఈ నెల 31తో ముగుస్తోంది. దీంతో హెచ్ఎండీఏ కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతితో ఔటర్‌పై మ్యాన్యువల్‌గా టోల్ వసూలుకు టెండర్లను ఆహ్వానిస్తూ బుధవారం ప్రకటన జారీ చేసింది. ఔటర్‌పై అత్యాధునిక టోల్ వ్యవస్థ ఏర్పాటు కావడానికి 18 నెలలు సమయం పట్టనుండడంతో... అప్పటివరకు ఈ మార్గంలో టోల్ వసూలు చేసేందుకు హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. నెలకు రూ. 2.94కోట్లు కనీస మొత్తంగా చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దరఖాస్తు చేసుకొనేందుకు ఏప్రిల్ 26 ఆఖరు తేదీగా నిర్ణయించింది. అదే రోజు తార్నాకలోని ఓఆర్ఆర్ కార్యాలయంలో టెక్నికల్ బిడ్స్ తెరచి అర్హత గల సంస్థలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్స్ తెరచి అర్హత కలిగిన సంస్థకు టోల్ వసూలు కాంట్రాక్టును అప్పగిస్తారు.