
సాక్షి, హైదరాబాద్: ప్రాధాన్యతా›క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వెలుపలికి హైదరాబాద్ లోని కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు సం బంధించిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధంచేయాలని పరిశ్రమల శాఖను వాయు నాణ్యత పర్యవేక్షక కమిటీ ఆదేశించింది. ‘హైదరాబాద్‌లో వాయు కాలుష్యం తగ్గింపు’ప్రణాళికలపై శనివారం అటవీ, పర్యా వరణ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ అధ్యక్షతన వాయు నాణ్యత పర్యవేక్షక కమిటీ సమీక్ష జరిగింది. నగరంలో మెరుగైన వాయునాణ్యత సాధనకు ప్రభుత్వం నిర్దేశిత, నిర్ణీత కాలవ్యవధికు తగ్గట్టుగా ప్రణాళికలను కచ్చితంగా అమలుచేయాలని రజత్‌కుమార్ ఆదేశించారు. హైదరాబాద్‌లో ఎప్పటికప్పుడు 7 కేంద్రాల ద్వారా వాయునాణ్యత పర్యవేక్షణకు, జీహెచ్‌ఎంసీకి రోడ్లు ఊడ్చే యంత్రాలు, వాయు కాలుష్య కారకాల గుర్తింపున కు, వాయు నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం రూ. 11 కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు.
నగ రంలో వాహనాలకు బీఎస్–6 (భారత ప్రమాణాలు–6) అమలు, ట్రాఫిక్ ఫ్లోకు అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఏ రకం వాహనాలకు కేటాయించిన లైన్‌లో అవి వెళ్లేలా ‘లేన్ క్రమశిక్షణ’అమలు చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది. ప్రజలకు వాయు నాణ్యతపై అవగాహన కలిగించడానికి ‘ఎయిర్ క్వాలిటీ డేటా’ప్రచురించాలని టీపీసీబీకి సూచించింది. కాలుష్య కారక వాహనాలపై జరిమానాలు, విద్యాసంస్థల బస్సులు సీఎన్‌జీని ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో గాలి నాణ్యత శాటీస్ ఫాక్టరీ నుంచి మోడరేట్ రేంజ్‌లో ఉందని, దీనిని గుడ్ క్వాలిటీగా మార్చేందుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొం దించిందని రజత్‌కుమార్ అన్నారు. సమావేశంలో టీపీసీబీ సభ్యకార్యదర్శి నీతూ ప్రసాద్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.