rajatkumar
-
మేడిగడ్డపై ‘నివేదిక’ అర్థరహితం!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’రూపొందించిన నివేదికలో వాస్తవ విరుద్ధమైన అంశాలు ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక కుంగిన ర్యాఫ్ట్ వద్ద తవ్వకాలు జరిపి పరిశీలన జరిపితేనే అసలు కారణాలు తెలుస్తాయని.. ఎన్డీఎస్ఏ వంటి చట్టబద్ధసంస్థ తొందరపాటుతో ఆరోపణలు చేయడం సమంజసం కాదని తప్పుపట్టారు. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందంటూ ఎన్డీఎస్ఏ సమర్పించిన నివేదికపై శనివారం ఆయన జలసౌధలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, ఇతర సీనియర్ ఇంజనీర్లు, నిపుణులతో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికలోని చాలా అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని తమ సమావేశంలో నిపుణులందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని రజత్‌కుమార్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. డిజైన్ల ప్రకారమే నిర్మాణం మేడిగడ్డ బ్యారేజీని ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌గా డిజైన్ చేసి, దానికి విరుద్ధంగా రిజిడ్ స్ట్రక్చర్‌గా నిర్మించారని ఎన్డీఎస్ఏ నివేదికలో పేర్కొనడం వాస్తవ విరుద్ధమని రజత్‌కుమార్ తెలిపారు. ర్యాఫ్ట్, సీకెంట్ పైల్స్ మధ్య జాయింట్ ఉందని.. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని చెప్పారు. ప్రాజెక్టు డిజైన్లు, వ్యయ అంచనాలు, ఆపరేషనల్ వివరాలను గతంలోనే సీడబ్ల్యూసీకి, డైరెక్టరేట్ ఆఫ్ కాస్టింగ్‌కి సమర్పించామన్నారు. వారు ఎన్నో వివరాలు అడిగాకే ఆమోదించారని.. తర్వాత సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వీటిని ఆమోదించిందని తెలిపారు. కమిటీ చైర్మన్, సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఇంజనీరింగ్ అద్భుతంగా కితాబునిచ్చారని గుర్తుచేశారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ 2023 జూన్‌లో డ్యామ్ సేఫ్టీ చట్టం–2021 పరిధిలోకి వచ్చిందని, కానీ అంతకుముందు సమయానికి సంబంధించి బ్యారేజీ నిర్వహణ నిబంధనలను పాటించలేదని నివేదికలో పేర్కొనడం అర్థ రహితమని విమర్శించారు. వానాకాలం ముగిసిన నేపథ్యంలో నవంబర్ నుంచి తనిఖీలు ప్రారంభిస్తామన్నారు. తనిఖీ చేయకుండానే ఆరోపణలు ఎలా? ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీ చేయకుండానే వాటికి సైతం ప్రమాదం పొంచి ఉందని నివేదికలో పేర్కొనడాన్ని రజత్‌కుమార్ తప్పుబట్టారు. ఏ ఆధారంతో ఈ ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. అన్నారం బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కదలడంతో పైపింగ్, బాయిలింగ్ (బ్యారేజీ గేట్లకు దిగువన సీపేజీ) జరిగాయని చెప్పారు. ఆప్రాన్ డిజైన్లను సరిదిద్దుతున్నాం మేడిగడ్డ బ్యారేజీ ఆప్రాన్ డిజైన్లలో ఎన్డీఎస్ఏ బృందం కొన్ని లోపాలున్నట్లు తెలిపిందని, తాము దీన్ని గతంలోనే గుర్తించి నిపుణుల కమిటీతో అధ్యయనం జరిపించామని రజత్‌కుమార్ తెలిపారు. 2021 వరదల్లోనే ఆప్రాన్ దెబ్బతిందని, డిజైన్లను సరిదిద్దాక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించామని వివరించారు. ఐఐటీ హైదరాబాద్ నేతృత్వంలోని నిపుణులు 10 డిజైన్లను సిఫారసు చేశారన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతాపరంగా లోపాల్లేవని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకొని నిదానంగా కారు నడిపినా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయని, ఇది కూడా అలానే జరిగిందని వ్యాఖ్యానించారు. అధికారులిచ్చిన డిజైన్ల ప్రకారమే మేడిగడ్డ నిర్మాణం స్పష్టం చేసిన ఎల్అండ్టీ సంస్థ సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల 23న 7వ బ్లాకు కుంగిపోవడంతో కొంతభాగానికి పగుళ్లు వచ్చాయని పేర్కొంది. నీటిపారుదల శాఖ అధికారులు అందజేసిన డిజైన్ అనుసరించి నాణ్యతను అనుసరిస్తూ బ్యారేజీని నిర్మించి 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని స్పష్టం చేసింది. నాటి నుంచి వరుసగా ఐదేళ్లపాటు బ్యారేజీ వరదలను తట్టుకుని నిలబడిందని పేర్కొంది. బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ పూర్తైన తర్వాత సత్వరంగా పునరుద్ధరణ పనులను చేపట్టి పూర్తి చేస్తామని తెలిపింది. ప్లానింగ్, డిజైన్, నాణ్యతాలోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఎల్అండ్టీ సంస్థ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ‘నివేదిక’పై సమగ్రంగా సమాధానం ఎన్డీఎస్ఏ బృందం 20రకాల డాక్యుమెంట్లను కోరగా.. గత నెల 29న 17 రకాల డాక్యుమెంట్లు, ఈ నెల 1న మిగతా 3 డాక్యుమెంట్లను అందజేశామని రజత్‌కుమార్ తెలిపారు. కానీ 11 డాక్యుమెంట్లే ఇచ్చినట్టు నివేదికలో పేర్కొనడం దారుణమన్నారు. మళ్లీ 20రకాల డాక్యుమెంట్లను రిప్లైతో కలిపి పంపిస్తామని చెప్పారు. ఈ మేరకు రజత్‌కుమార్ ఎన్డీఎస్ఏ నివేదికలోని అంశాలకు వివరణలతో శనివారం రాత్రి ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు లేఖ రాశారు. -
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాల్లేవు
సాక్షి, హైదరాబాద్: ఇసుకపై పునాదులు వేసి కట్టే బ్యారేజీల్లో సమస్యలు సహజమేనని, మేడిగడ్డ బ్యారేజీ డిజైన్, నిర్మాణంలో సమస్యల్లేవ ని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్ స్పష్టం చేశారు. బ్యారేజీ డిజైన్‌లో లోపాలుంటే ఎప్పుడో కొట్టుకుపోయేదన్నా రు. మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై ఆయన శుక్రవారం జలసౌధలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో ఫరక్కా, ధవళేశ్వరం బ్యారేజీల్లోనూ సమస్యలు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మోనోలిథిక్ డిజైన్‌తో బ్యారేజీ నిర్మించారని, గతేడాది భారీ వరదలను కూడా బ్యారే జీ తట్టుకుందని రజత్‌కుమార్ చెప్పారు. బ్యారేజీ మొత్తం ఎనిమిది బ్లాకులతో నిర్మిస్తే అందులో 7వ బ్లాకులోని పియర్ నంబర్ 16, 17, 18, 19, 20, 21లలో సమస్యలు ఉత్పన్నం అయ్యాయన్నారు. తొలుత కాఫర్ డ్యామ్ నిర్మించి ఎగువ ప్రాంతాల నుంచి వరదను మళ్లిస్తామని... ఆ తర్వాత చుట్టూ రింగ్ మెయిన్ నిర్మించి పియర్ల కుంగుబాటుకు గల కారణాలను గుర్తించాకే మరమ్మతు పనులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. బ్యారేజీ నిర్మాణం రివర్‌బెడ్‌పై జరగడం, ఇసుకపైనే పునాదులు ఉండటం వల్ల సమస్యలు వస్తాయన్నారు. పియర్ల కింద ఇసుక కదలడం వల్లే కుంగినట్లు చెప్పారు. మరమ్మతులకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అనుమతించాలని తెలిపారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరిన వివరాలను సమర్పించినట్లు చెప్పారు. సమావేశంలో ఈఎన్సీ (సాధారణ) మురళీధర్, ఈఎన్సీ (పరిపాలన) అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేంద్రరావు, ఈఎన్సీ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ (కరీంనగర్) శంకర్, నీటిపారుదల అదనపు కార్యదర్శి భీం ప్రసాద్, సీడీవో సీఈ మోహన్‌కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎల్అండ్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ ఏబీ పాండ్యా నేతృత్వంలో శనివారం బ్యారేజీని పరిశీలించనున్నట్లు రజత్‌కుమార్ చెప్పారు. -
‘సాగునీటి’ ప్రక్షాళన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ శరవేగంగా పూర్తి కావస్తుండటం.. అదే సమయంలో కాల్వలు, పంపులు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో సాగునీటి శాఖ సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా శాఖను పునర్విభజన చేయనుంది. భారీ, మధ్య, చిన్నతరహా, ఐడీసీ ఎత్తిపోతల పథకాల విభాగాలన్నీ ఒకే గొడుగు కిందకు తేనుంది. ప్రతి చీఫ్ ఇంజనీర్ (సీఈ) పరిధిలో సుమారు 8 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయిస్తూ పని విభజన చేయనుంది. సీఎం ఆదేశాలతో చకచకా కసరత్తు సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణకు నీటిపారుదల శాఖను పునర్విభజించాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న మాదిరి భారీ, మధ్యతరహా, చిన్నతరహా, ఐడీసీ విభాగాలు వేర్వేరుగా కాక ఒకే గొడుగు కిందకు తేవాలని సూచిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ జోన్లు ఏర్పాటుచేసి, ప్రతి జోన్‌కు ఒక సీఈని నియమించి, అతని పరిధిలోనే భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు, ఐడీసీ ఎత్తిపోతల పథకాలు ఉంచాలని చెబుతూ వస్తున్నారు. ఆ దిశగా శాఖ ప్రక్షాళన ఉండాలని ఇటీవల సమీక్ష సందర్భంగానూ సూచించారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ ఈఎన్సీ, సీఈలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీలు, సీఈల పరిధిలో ఏయే ప్రాజెక్టులుంచాలి, ఎంత ఆయకట్టు వారి పరిధిలో ఉండాలన్న దానిపై కసరత్తు పూర్తి చేశారు. ఎత్తిపోతల పథకాల్లో ఎలక్ట్రో, మెకానికల్, ప్రెషర్ మెయిన్స్, పంప్‌హౌస్‌ల నిర్వహణను చూసేందుకు గోదావరి, కృష్ణా బేసిన్ల వారీగా ఇద్దరు సీఈలను నియమించాలని నిర్ణయించారు. చెక్‌డ్యామ్‌లు, చెరువుల పనులు చూసేందుకు ప్రస్తుతం బేసిన్‌కు ఒకరు చొప్పున ఇద్దరు సీఈలు ఉండగా వారిని తొలగించనున్నారు. ప్రాజెక్టులు – పని విభజన ఇలా.. ప్రతి పూర్వ జిల్లాకు ఒక సీఈని నియమించి, వారికే భారీ, మధ్యతరహా, చెరువులు, ఐడీసీ పథకాలను కట్టబెట్టనున్నారు. ► ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఇద్దరు ఈఎన్సీలు ఉండగా, కరీంనగర్ డివిజన్లోని ఈఎన్సీ కింద మూడు బ్యారేజీలు, ఎల్లంపల్లితో పాటు దానికింద మిడ్‌మానేరు వరకు ఉన్న పనులన్నీ ఉండనున్నాయి. మరో ఈఎన్సీ పరిధిలో మిడ్‌మానేరు దిగువన ఉన్న ప్యాకేజీ పనులతో పాటు మెదక్ జిల్లాలోని సింగూరు, ఘణపూర్ ప్రాజెక్టులను తేనున్నారు. ► ఎస్సారెస్పీ పరిధిలో లోయర్ మానేరు వరకు ఒక సీఈని, ఆ తర్వాత ఉన్న ఆ యకట్టుతోపాటు, ఎస్సారెస్పీ–2 ఆయకట్టుకు మరో సీఈని నియమిస్తారు. ► ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం సీఈ లేనందున కొత్త సీఈని నియమిస్తారు. ఆయన పరిధిలో సీతారామ, సీతారామసాగర్, పాలేరు దిగువనున్న నాగార్జునసాగర్ ఆయకట్టు, భక్తరామదాసతో పాటు మధ్యతరహా ఎత్తిపోతల పథకాలు ఉంటాయి. ► పాలమూరు–రంగారెడ్డికి ఉన్న సీఈని యథావిధిగా కొనసాగిస్తారు. ► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ ఒక సీఈ, మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు మరో సీఈ పరిధిలో ఉండనున్నాయి. ► నల్లగొండ సీఈ పరిధిలో నాగార్జునసాగర్ ఆయకట్టు, డిండి, ఎస్ఎల్బీసీ, మధ్యతరహా ప్రాజెక్టులు ఉంటాయి. ► దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులకు వేర్వేరు సీఈలు ఉండగా, రెండింటికీ కలిపి ఒక సీఈని నియమిస్తారు. ► నిజామాబాద్ ప్రాజెక్టుల కింద కొత్తగా సీఈని నియమించనున్నారు. ► పరిపాలన ఈఎన్సీ పోస్టును రద్దుచేసే అవకాశాలున్నాయి. పరిపాలనతో పాటు ఈ ఈఎన్సీ చూసే కమిషనర్ ఆఫ్ టెండర్ (సీఓటీ) బాధ్యతలను ఇకపై ఇరిగేషన్ ఈఎన్సీ ఒక్కరే చూడనున్నారు. -
ఓఆర్ఆర్ ఆవలకు కాలుష్య పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: ప్రాధాన్యతా›క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపలికి హైదరాబాద్ లోని కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు సం బంధించిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధంచేయాలని పరిశ్రమల శాఖను వాయు నాణ్యత పర్యవేక్షక కమిటీ ఆదేశించింది. ‘హైదరాబాద్‌లో వాయు కాలుష్యం తగ్గింపు’ప్రణాళికలపై శనివారం అటవీ, పర్యా వరణ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ అధ్యక్షతన వాయు నాణ్యత పర్యవేక్షక కమిటీ సమీక్ష జరిగింది. నగరంలో మెరుగైన వాయునాణ్యత సాధనకు ప్రభుత్వం నిర్దేశిత, నిర్ణీత కాలవ్యవధికు తగ్గట్టుగా ప్రణాళికలను కచ్చితంగా అమలుచేయాలని రజత్‌కుమార్ ఆదేశించారు. హైదరాబాద్‌లో ఎప్పటికప్పుడు 7 కేంద్రాల ద్వారా వాయునాణ్యత పర్యవేక్షణకు, జీహెచ్ఎంసీకి రోడ్లు ఊడ్చే యంత్రాలు, వాయు కాలుష్య కారకాల గుర్తింపున కు, వాయు నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం రూ. 11 కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు. నగ రంలో వాహనాలకు బీఎస్–6 (భారత ప్రమాణాలు–6) అమలు, ట్రాఫిక్ ఫ్లోకు అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఏ రకం వాహనాలకు కేటాయించిన లైన్లో అవి వెళ్లేలా ‘లేన్ క్రమశిక్షణ’అమలు చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది. ప్రజలకు వాయు నాణ్యతపై అవగాహన కలిగించడానికి ‘ఎయిర్ క్వాలిటీ డేటా’ప్రచురించాలని టీపీసీబీకి సూచించింది. కాలుష్య కారక వాహనాలపై జరిమానాలు, విద్యాసంస్థల బస్సులు సీఎన్జీని ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో గాలి నాణ్యత శాటీస్ ఫాక్టరీ నుంచి మోడరేట్ రేంజ్లో ఉందని, దీనిని గుడ్ క్వాలిటీగా మార్చేందుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొం దించిందని రజత్‌కుమార్ అన్నారు. సమావేశంలో టీపీసీబీ సభ్యకార్యదర్శి నీతూ ప్రసాద్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
అప్పటికి ఎగువమానేరుకు గోదావరి జలాలు
సిరిసిల్ల: సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నిధుల కొరత లేదని, ప్రాధాన్యత ప్రకారం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్–9 ప్యాకేజీ పనులను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్–19 కారణంగా రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గినా.. ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. 9వ ప్యాకేజీ పనులను సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 12 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి అయ్యాయని, మరో 50 మీటర్లు పెండింగ్‌లో ఉందని అధికారులు వివరించారు. పంప్‌హౌస్ నిర్మాణం పూర్తిచేసి మధ్యమానేరు నుంచి ఎగువమానేరుకు నీటిని పంపింగ్ చేసేలా పనులు పూర్తి చేయాలన్నారు. రోజువారీగా పనుల ప్రగతి ఫొటోలను తనకు పంపించాలన్నారు. అక్టోబర్ 15 నాటికి ఎగువమానేరుకు గోదావరి జలాలు చేరాలని రజత్‌కుమార్ ఆదేశించారు. ఇది పూర్తి అయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించి పనులను వేగవంతం చేయాలని కోరారు. సొరంగంలో మూడు కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణించి పనుల ప్రగతిని సమీక్షించారు. ఆయన వెంట ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్‌రావు, ఈఎన్సీ హరిరామ్, ట్రెయినీ కలెక్టర్ రిజ్వాన్ షేక్‌బాషా, ఎస్ఈ ఆనంద్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. మల్లన్నసాగర్ పనుల పరిశీలన.. తొగుట (దుబ్బాక): సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ కాల్వ నిర్మాణ పనులను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా రంగనాయకసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు వెళ్తున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. రోజుకు ఎన్ని మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న దుబ్బాక నియోజకవర్గానికి సాగునీరు అందించే మల్లన్న సాగర్ కాల్వ పనులు పరిశీలించారు. కాల్వ పనుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతుందని, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌కు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన వెంట సీఎం సలహాదారు శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్ఈ ఆనందర్‌రావు తదితరులు ఉన్నారు. -
కలెక్టర్ ఆగ్రహం
అశ్వారావుపేటరూరల్: డీఆర్డీఓపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో వెనకబడ్డ పంచాయతీ వివరాలు అడగ్గా.. సరైన సమాధానం చెప్పకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ ద్వారా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించేందుకు శుక్రవారం కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆకస్మికంగా అశ్వారావుపేట మండలంలో పర్యటించారు. డీఆర్డీఓ జగత్‌కుమార్ రెడ్డి సూచన ప్రకారం మండలంలోని వేదాంతపురం గ్రామ పంచాయతీలో మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతి తెలుసుకునేందుకు గ్రామంలో పర్యటించారు. పంచాయతీకి ఎన్ని మరుగుదొడ్లు మంజూరయ్యాయని, ఎన్ని నిర్మించారని ప్రశ్నించారు. పంచాయతీకి 29 మరుగుదొడ్లు మంజూరు కాగా, వాటిలో 23 పూర్తి చేశామని, మరో 6 మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నాయని డీఆర్డీఓ జగత్‌కుమార్‌రెడ్డి వివరించారు. ఈ క్రమంలో కలెక్టర్ జోక్యం చేసుకుని ‘నిర్మాణాల్లో ప్రగతి ఉన్న చోటకు తనను దేనికి తీసుకొచ్చారు..? నిర్మాణాల్లో వెనుకబడిన చోటకు తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చి ప్రయోజనం ఏమిటీ..? నా టైమ్ వేస్ట్ చేశావ్..? మీ వల్ల ఒక రోజు డిలే అయిపోయంది కదా.? ఇదేనా మీ పనితీరు.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో వెనుకబడిన పంచాయతీకి తీసుకెళ్లమని అడగ్గా.. సరైన సమాధానం చెప్పలేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. గుమ్మడిపల్లి పంచాయతీ కార్యదర్శిపై మండిపాటు అనంతరం మండలంలోని గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ నిర్మాణాల్లో వెనుకబడినట్లు తెలుసుకొని ఆ పంచాయతీలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడుతుండగా గ్రామ కార్యదర్శి దొడ్డా ప్రసాద్ అక్కడికి వచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. దీనికితోడు మద్యం సేవించి ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన కలెక్టర్ శైనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తహసీల్దార్ రాఘవరెడ్డిని పిలిచి కార్యదర్శిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని పంపించారు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత కార్యదర్శిని సస్పెండ్ చేస్తానని కలెక్టర్ అన్నారు. గ్రామ పంచాయతీకి 231 మరుగుదొడ్లు మంజూరు కాగా, కేవలం 50 మాత్రమే పూర్తై, 181 మరుగుదొడ్లు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి గల కారణాలను గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన బిల్లులు రావడం లేదని, అందుకే చాలా మంది మంజూరైన నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదని స్థానికులు చెప్పారు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ..బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం ఉండదని, మీ గ్రామ పంచాయతీ ఖాతాలోనే రూ.10లక్షల నిధులు ఉన్నాయని, నిర్మాణాలను నిబంధనల ప్రకారం చేసుకుంటే మంజూరు అవుతాయన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో దేశంలోనే జిల్లా వెనుకబడిందని, వచ్చే జూలై 31 నాటికి మరుగుదొడ్ల నిర్మాణాలు వంద శాతం పూర్తి చేసుకొని ఓడీఎఫ్ ప్రకటించుకోవాలన్నారు. అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, లేని పక్షంలో చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వి.రాఘవరెడ్డి, ఎంపీడీఓ కె పాపారాణి, ఈవోపీఆర్డీ ఓంటేరు దేవరాజ్, సర్పంచ్‌లు శివశంకర ప్రసాద్, కొడిమి సీత, తాజా ఎంపీటీసీ సభ్యులు వల్లెపు తిరుపతిరావు, ఏపీఓ శ్రీను, ఈజీఎస్ జేఈ స్వామి ఉన్నారు. -
20న ఓట్ల లెక్కింపుపై శిక్షణ: రజత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 23న నిర్వహించనున్న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ ఈ నెల 20న నగరంలోని ఓ హోటల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపులో ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కారాలు, కచ్చితమైన ఫలితాల ప్రకటన తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. -
ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంది: సీఈవో
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలకు సం బంధించి ఎగ్జిట్ పోల్స్‌తోపాటు, ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడం, వ్యాప్తి చేయడంపై చట్టం ప్రకారం ఆంక్షలున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. అదేవిధంగా వాటి ని నిక్కచ్చిగా పాటించాలని బుధవారం విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951కు సంబంధించిన సెక్షన్ 126ఎ లోని సబ్ సెక్షన్(1), (2)ల కింద సంక్రమించిన అధికారాలను వినియోగించి ఎన్నికల కమిషన్ ఈనెల 11న (గురువారం) ఉదయం 7 నుంచి, మే 19న సాయంత్రం 6.30 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని ఆయన వివరించారు. ఈ మధ్య కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ లేదా సమాచారం వ్యాప్తి చేయకూడదని, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ప్రకటించకూడదని తెలిపారు. పోలింగ్ ముగింపునకు నిర్ణయించిన సమయానికి ముందున్న 48 గంటల వ్యవధిలో, ఎటువంటి ఒపీనియన్ పోల్స్ ఫలితాలు, లేదా మరే ఇతర పోల్ సర్వే లు, తదితర ఎన్నికల సమాచారం ప్రకటన, ప్రచురణ వంటివి నిషిద్ధమని స్పష్టం చేశారు. -
నేడు ఇందూరుకు సీఈవో
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించేందుకు శుక్రవారం అక్కడికి వెళ్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో సమావేశమై సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పారు. నిజామాబాద్ ఎన్నికలను సవాలుగా స్వీకరించి అన్ని జాగ్రత్తలతో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. నిజామాబాద్ స్థానానికి పోలింగ్ వేళల్లో మార్పు ఉండదని, అభ్యర్థులు ఎందరున్నా సమ యం సరిపోతుందని స్పష్టం చేశారు. అక్కడి పోలింగ్ కేంద్రాల్లో ‘ఎల్’ఆకృతిలో 12 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 1,788 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు. 27,185 బ్యాలెట్ యూనిట్లు, 3,530 కంట్రోల్ యూనిట్లు, 3,651 వీవీప్యాట్లను తరలించినట్లు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలతో పని చేయని యంత్రాలను మార్చడానికి రెట్టిం పు సంఖ్యలో కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈవీఎంల నిర్వహణకు 560 మంది ఇంజనీ ర్లు విధుల్లో చేరారన్నారు. ఇప్పటికే అక్కడ ఈవీఎంల ప్రథమ స్థాయి తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈవీఎంలలో అభ్యర్థు ల వివరాలు పొందుపరిచే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు 500 ఈవీఎంలతో బ్యాలెట్ పేపర్లను పొందుపరిచినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులు, రాజకీయ పార్టీల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. అనంతరం రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ఈవీఎంలను 7వ తేదీ రాత్రికి అసెంబ్లీ స్థానాలకు, అక్కడి నుంచి మూడో ర్యాం డమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు పంపుతామన్నారు. స్వతంత్ర అభ్యర్థులందరికీ వారు ఎంపిక చేసుకున్న గుర్తులను కేటాయించామన్నారు. ఓటర్లను గుర్తించే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రం బయటే ఉంటారన్నారు. పోలింగ్ కేంద్రం లోపల ఈవీఎంను నిర్వహించే అధికారులుంటారని చెప్పారు. వేగంగా ఏర్పాట్లు.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానా లకు ఎన్నికల ఏర్పాట్లు వేగం గా జరుగుతున్నాయని రజత్‌కుమార్ తెలిపారు. నిజామా బాద్ సహా అన్ని లోక్‌సభ స్థానాలకు ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు చేరినట్లు చెప్పారు. ఓట ర్ల జాబితాలో కొత్తగా 20 లక్షల మందికిపైగా ఓటర్లు చేరారని, వారి లో 80% మందికి ఇప్పటికే ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. హైద రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 35 శాతమే పంపిణీ జరిగిందని, 8లోగా 100% పూర్తి చేస్తామన్నారు. వెబ్ కాస్టింగ్ విధుల్లో పాల్గొనే విద్యార్థులు ఓటేసేందుకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో 370 పోస్టులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాయని, పలు పత్రికల్లో 233 పెయిడ్ వార్త లు వచ్చినట్లు గుర్తించామని, సంబంధీకులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. -
ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్తో ఓటేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఇకపై ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ)తో నియోజకవర్గంలోని ఏ పోలింగ్ కేంద్రం నుంచైనా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం పొందనున్నారు. ఓటు కలిగి ఉన్న నియోజకవర్గంలోనే ఎన్నికల విధులు నిర్వహించేవారికి ఈ సర్టిఫికెట్ జారీ చేస్తారు. వారు ఆ నియోజకవర్గంలోని ఏ పోలింగ్ కేంద్రంలోనైనా ఓటేసే అవకాశం పొందనున్నారు. ఏప్రిల్ 11న రాష్ట్రంలో జరగనున్న లోక్‌సభ సాధారణ ఎన్నికల నిర్వహణ విధుల్లో పాలుపంచుకోనున్న 2.8 లక్షల మంది అధికారులు, సిబ్బందిలో అధిక శాతం ఈడీసీ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే సదుపాయాన్ని పొందబోతున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. ఓటు ఉన్న నియోజకవర్గం కాకుండా వేరే ప్రాంతంలో పనిచేసే ఎన్నికల అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈడీసీ, పోస్టల్ బ్యాలెట్ల జారీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ‘పీబీ సాఫ్ట్’అనే సాఫ్ట్వేర్ రూపొందించామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న వారందరూ వారికి సంబంధించిన 12/12ఏ ఫారంను తప్పుల్లేకుండా నింపి, ఎన్నికల విధి నిర్వహణ వివరాలను జతపరిచి వారం రోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్‌ను కలవాలని సీఈవో సూచించారు. ఈ పత్రాల ఆధారంగా అందరూ శిక్షణ కార్యక్రమాలకు హజరు కావొచ్చని తెలిపారు. సహాయక సిబ్బందికి సైతం.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులుగా దాదాపు 1.8 లక్షల మందికి ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. వెబ్ కాస్టర్లు, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు, క్లీనర్లు ఇలా మరో లక్ష మందికి పైగా ఎన్నికల విధుల్లో ఉంటారు. వీరందరికి కూడా ఈడీసీ/ పోస్టల్ బ్యాలెట్ ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసే సదుపాయం కల్పించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. -
22న ‘మండలి’ ఓటర్లకు ప్రత్యేక సెలవు
సాక్షి, హైదరాబాద్: మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రులు/ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలతో పాటు వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గానికి ఈ నెల 22న ఎన్నికల్లో ఓటేయనున్న ఓటర్లకు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలి ఓటు హక్కు కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపారు. అదే విధంగా పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన ప్రైవేటు ఉద్యోగులు పోలింగ్ రోజు ఓటు వేసేందుకు వీలుగా విధి నిర్వహణలో ప్రత్యేక సడలింపులు కల్పించాలని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ఓటు వేసి ప్రైవేటు ఉద్యోగులు ఆలస్యంగా విధులకు వచ్చినా అనుమతించాలని, అవసరమైతే వారి షిఫ్టుల సమయాన్ని సర్దుబాటు చేయాలని కోరారు. మండలి ఎన్నికలు జరగనున్న 25 జిల్లాల్లో ఈ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. 21, 22న సెలవు ప్రకటించండి: సీఎస్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన కార్యాలయాలు, సంస్థల ఉద్యోగులకు పోలింగ్‌కు ముందు రోజు 21న, పోలింగ్ రోజు 22న స్థానిక సెలవును ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే కార్యాలయాలు, సంస్థల ఉద్యోగులకు కౌంటింగ్ నిర్వహించే 26న స్థానిక సెలవు ప్రకటించాలని కోరారు. దివ్యాంగులకు మినహాయింపు.. లోక్‌సభ ఎన్నికల విధుల నుంచి దివ్యాంగ ఉద్యోగులను నియమించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల సిబ్బంది నియామకం విషయంలో ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరింది. -
సర్కారీ వాహనాల వాడకంపై నిషేధం
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నేతలు అనధికార కార్యక్రమాల కోసం ప్రభుత్వ వాహనాలను వినియోగించొద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ కోరారు. పత్రికలు, టీవీ చానళ్లలో ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల వెబ్సైట్ల నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల ఫొటోల ను తొలగించాలని ఐటీ శాఖను కోరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు రోజువారీగా తీసుకుంటున్న చర్యల వివరాలను మంగళవారం ఇక్కడ వెల్లడించారు. 48 గంటల్లోగా 4,098 చోట్ల గోడలపై రాతలు, 29,526 పోస్టర్లు, 975 కటౌట్లు, 11,485 బ్యానర్లు, 3,498 జెండాలు, 7,308 ఇతర సామగ్రిని తొలగించామని వెల్లడించారు. లెక్కలు తెలపని రూ.90.50 లక్షల నగదును నగర పోలీసులు జప్తు చేశారని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం 1950 కాల్ సెంటర్ నిరంతరం పని చేస్తోందని తెలిపారు. 62 మందిపై అనర్హత వేటు ! ఎన్నికల్లో పోటీ చేయకుండా రాష్ట్రానికి చెందిన 62 మంది అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణీత కాలం మేరకు నిషేధాన్ని విధించింది. గతంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఈ వ్యక్తులు నిబంధనల మేరకు ఎన్నికల సంఘానికి ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించడంలో విఫలమయ్యారు. దీంతో వీరిలో కొందరిపై 2020, మరి కొందరిపై 2021, ఇంకొందరిపై 2022 వరకు నిషే దం విధించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ 62 మంది పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశించింది. -
ఓట్ల గల్లంతుపై చర్యలు చేపట్టండి: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: ఓట్ల గల్లంతుపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించాలని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండా రు దత్తాత్రేయ అన్నా రు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి సచివాలయంలో సీఈవో రజత్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం దత్రాత్తేయ మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఒక్క సికింద్రాబాద్‌లోనే 4 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, హైదరాబాద్ మొత్తం ఇలాగే జరిగిందని ఆరోపించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు సరిగా పనిచేయకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. దీనిపై కమిషనర్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. విజయ్ సంకల్ప దివాస్ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. -
మండలి ఓటర్లలో మహిళల వెనుకబాటు
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో స్త్రీ, పురుష ఓటర్ల సంఖ్యలో అసాధారణ వ్యత్యాసం నెలకొంది. త్వరలో ఎన్నికలు జరగనున్న రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాలకు సంబంధించిన కొత్త ఓటర్ల జాబితాల గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ శుక్రవారం ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2018 నవంబర్ 1 అర్హత తేదీగా కొత్త ఓటర్ల జాబితాను రూ పొందించారు. కొత్త ఓటర్ల జాబితా ప్రకారం.. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 1,30,957 మం ది పురుష ఓటర్లుండగా, మహిళా ఓటర్లు 59,099 మంది మాత్రమే ఉన్నారు. ఇక మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15,407 మంది పురుష ఓటర్లుండగా, మహిళా ఓటర్లు 7,068 మంది మాత్రమే ఉన్నారు. వరంగల్–ఖమ్మం–నల్ల గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 13,476 మంది పురుష ఓటర్లుండగా, మహిళా ఓటర్లు 7,106 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండటంవల్లే భారీ వ్యత్యాసం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. -
లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తెలిపారు. శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, అదే స్పూర్తితో పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్ల సన్నద్ధతపై భారత ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ ఆరోరా సోమవారం ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా సీఎస్ జోషి చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులకు వసతుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ పనితీరుతో అవార్డు పొందిందని వివరించారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 22న ప్రచురిస్తామని సీఈసీకి చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల అధికారులతో వచ్చే నెల 5న సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు. సరిహద్దు రాష్ట్రాలతో ప్రత్యేక కార్యాచరణ అసెంబ్లీ ఎన్నికలను ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా, ప్రశాంతంగా నిర్వహించామని డీజీపీ మహేందర్‌రెడ్డి సీఈసీకి చెప్పారు. పంచాయతీ ఎన్నికలు రెండు దశలు పూర్తయ్యాయని, ఈ నెల 30న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలను సైతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నక్సల్స్ ప్రభావంపై ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగంతో కలసి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తామని వివరించారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల ఏర్పాటు చేస్తామన్నారు. గత ఎన్నికల కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, సమాచార మార్పిడి చర్యలు తీసుకుంటామని వివ రించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు పొరుగు రాష్ట్రాల నుంచి 19 వేల మంది, కేంద్రం నుంచి 276 కంపెనీల పోలీసు సిబ్బందిని కేటాయించారని.. లోక్‌సభ ఎన్నికలకూ అదే స్థాయిలో కేటాయించాలని డీజీపీ కోరారు. గత ఎన్నికల సందర్భంగా రూ.97 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, కేసులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో నూ మద్యం, డబ్బు ప్రభావాన్ని నిరోధించడానికి ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. 16 లక్షల అభ్యంతరాలు: రజత్‌కుమార్ ఎన్నికల సంఘం రాష్ట్ర విభాగంలో అవసరమైన సిబ్బంది, ఆర్వోలు, ఏఆర్వోలు ఉన్నారని సీఈఓ రజత్‌కుమార్ సీఈసీకి తెలిపారు. ఎన్నికల అంశాలపై ఫిర్యాదు కోసం అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ (1950) ప్రారంభించామన్నారు. సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయిందని వెల్లడించారు. ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని 16 లక్షల అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. పంచాయతీ ఎన్నికలున్నందున ఈ గడువును ఫిబ్రవరి 4 వరకు పొడిగించామన్నారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించడానికి త్వరలోనే రాష్ట్రాల్లో పర్యటిస్తామని సీఈసీ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శులు సోమేశ్‌కుమార్, రాజీవ్ త్రివేది, అడిషనల్ డీజీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు 350 కోట్లు అవసరం తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు రూ.350 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. శాంతి భద్రతల విషయంలో కొన్ని సూచనలు చేశాం. రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్ర ఎన్నికల అధికారులకు వివరించాం. ఎన్నికల నిర్వహణకు రూ.350 కోట్లు అవుతుంది. ఎన్నికల నిర్వహణలో ఉండే 2.5 లక్షల మందికి అలవెన్సులు ఇవ్వాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఓటరు నమోదు అభ్యంతరాలపై టోల్ ఫ్రీ నంబరుకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. వారి నుంచి అన్ని వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. ఇప్పటివరకు ఐదుగురు పోలింగ్ పిటిషన్లు వేశారు. పోలింగ్ నిర్వహణపై 28 మందిని శిక్షణకు పంపిస్తున్నాం. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మంచిగా ఉంది. అవసరం మేరకు పోలీస్ బలగాలను వినియోగించుకుంటాం..’అని సీఈఓ చెప్పారు. -
ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఓటేయాలి
సాక్షి, హైదరాబాద్: ఓటు భవిష్యత్తును నిర్ణయించే ఆయుధమని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని గవర్నర్ నరసింహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి ఆయనతోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్, ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 90 శాతానికి ఓటింగ్ పెరగాలని ఆకాం క్షించారు. ‘ఓటు అనేది చాలా శక్తిమంతమైనది. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనాలి. సెలవున్నా పోలింగ్‌లో పాల్గొనకపోవడం ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటింది. యథా రాజా తథా ప్రజాలాగా కాకుండా.. యథా ప్రజా తథా రాజా అన్న చందంగా మారాలి. యువత తప్పక ఓటింగ్‌లో పాల్గొనాలి..’అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించారని రజత్‌కుమార్‌ను గవర్నర్ ప్రశంసించారు. దివ్యాంగులు, వృద్ధులు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అభినందించారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓటింగ్ పెరిగేలా ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఓటును నమోదు చేసుకోవాలి: సీఈఓ అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించామని.. పోలింగ్ శాతం పెంచామని సీఈఓ రజత్‌కుమార్ చెప్పారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని.. రిపోలింగ్ జరపాల్సిన పరిస్థితి రాలేదని తెలిపారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 4 వరకు ఓటును నమోదు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ఏకంగా 90 శాతం ఓట్లు పోలవుతుంటే.. జీహెచ్ఎంసీలో కనీసం 50 శాతం కూడా పోలవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాల్లో అన్ని సౌకర్యాలున్నప్పటికీ జనాలు ఓటు వేయడానికి ముందుకు రాకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా గవర్నర్.. అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఆబ్కారీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, అదనపు సీఈఓ బుద్ధ ప్రకాశ్, జాయింట్ సీఈఓ అమ్రపాలికి అవార్డులను ప్రదానం చేశారు. -
‘సీఈవో ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఈనెల 25న ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తున్నామని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయని స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ స్వయంగా అంగీకరించి క్షమాపణలు చెప్పారని, కానీ పార్లమెంటు ఎన్నికల నాటికి కూడా అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. దీంతో జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని రజత్‌కుమార్ ఇచ్చిన ఆహ్వానాన్ని తాము తిరస్కరిస్తున్నామని ఆయన చెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ నేతలు జి.నిరంజన్, బి.కమలాకర్, ఎం.ఆర్.జి.వినోద్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా గురువారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఎంబీటీ నేతలను ఆహ్వానించామని, ధర్నాలో ఎన్నికల సంఘం వ్యవహారశైలి పట్ల తమ వైఖరిని స్పష్టంగా చెప్తామని ఆయన వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకాగాంధీ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన మర్రి ఆమె రాకతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. -
సీఈఓ రజత్‌కుమార్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఎన్నికల సంఘం పనితీరు మార్చటానికి రాజకీయాలకు అతీతంగా ప్రజాసంఘాలు ఉద్యమించాలని కోరారు. దీనికోసం ప్రజా ఉద్యమాలు వచ్చే అవకాశముందన్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై పలు అనుమానాలున్నాయనీ, ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వ్యవహారంపైనా సందేహాలున్నాయన్నారు. సీఈఓ రజత్‌కుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆయన ప్రస్తుత ఆస్తులపై సీబీసీఐడీతో పూర్తిస్థాయి విచారణ చేయాలన్నారు. ఓట్ల తొలగింపునకు బాధ్యత ఎవరు వహిస్తారో చెప్పాలని, సీఈఓ రజత్‌కుమార్‌పై రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. శనివారం టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి వై.యోగేశ్వర్రెడ్డితో కలసి కోదండరాం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బట్టలు మార్చినంత సులువుగా రాజకీయ నేతలు పార్టీలు మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. గతంలో నేతలు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిం దన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల విషయంలో స్పీకర్ సమానంగా వ్యవహరించాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీజేఎస్ తరపున పలువురు పోటీ చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాభివృద్ధికి కట్టుబడిన వారికే టీజేఎస్ మద్దతు ఇస్తుందన్నారు. సర్పంచులకు శిక్షణ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం మంచి పరిణామమన్నారు. గ్రామ పంచాయతీలకు అవసరమైనన్ని నిధులు , ప్రత్యేకంగా విధులు కూడా ఇవ్వాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో పంచాయతీలను ఏకగ్రీవం చేయటం మంచిది కాదని, వీటిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలన్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గించడం సరికాదు.. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడం సరికాదనీ, దీనిపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. తక్కువ చదువులు చదివిన నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం వెతకాలని చెప్పారు. ప్రైవేట్ రంగంలో స్థానికులకే అవకాశాలు ఇవ్వాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలవైపు తాము వెళ్లడం లేదన్నారు. తెలంగాణలో చేయాల్సింది చాలా ఉందని, అయితే ఏపీ ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ ఆవశ్యకత వివరిస్తూ.. గతంలో అనంతపురం నుంచి విశాఖ వరకు తిరిగామని, చీరాల చేనేత సమస్యలపై పోరాటం చేశామన్నారు. విశాఖ కాలుష్యం, ఏజెన్సీలో రేషన్ పంపిణీ వ్యవస్థపైనా గతంలో తాము పోరాటాలు చేశామన్నారు. విలీనంఅవాస్తవం తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందని వస్తున్న ఊహాగానాలను కోదండరాం కొట్టిపారేశారు.ఆ వార్తలు అవాస్తవాలని వాటిని ఖండిస్తున్నట్లు చెప్పారు.రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నిస్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోలేదనీ, పార్టీ కార్యవర్గమంతా చర్చించుకున్న తర్వాత వెల్ల్లడిస్తామన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనుభవాల నుంచి ‘కూటమి’లోని పార్టీలు పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. కూటమి భవిష్యత్తుపై ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. టీజేఎస్ భవిష్యత్తు ఇతర పార్టీలపై ఆధారపడి ఉండదన్నారు. కూటమి వల్లే ఓటమి చెందామని కొందరు కాంగ్రెస్ నేతల చేస్తున్న వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమన్నారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంపై తాను స్పందించనన్నారు. -
‘ఉత్తమ్ ఇంటిపై దాడి అమానుషం’
సాక్షి, హైదరాబాద్: ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ వాహనాలు, అంబులెన్స్‌లు, టీ–న్యూస్ వాహనాల్లో డబ్బులు, మద్యం తరలిస్తున్నారని కాంగ్రెస్, టీడీపీ ఆరోపించాయి. రెండు పార్టీల నేతలు గురువారం సీఈఓ రజత్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి అరెస్టు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా పోలీసుల్లో మార్పురాలేదని టీటీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ అన్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఇంటిపై పోలీసులు దాడి చెయ్యడం దారుణమన్నారు. మొన్న రేవంత్ ఇంటిపై, గురువారం ఉత్తమ్ ఇంటిపై పోలీ సుల దాడులు అమానుషమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. -
‘బీసీ సంఘాలపై పోలీసుల నిర్బంధాన్ని అరికట్టాలి’
సాక్షి, హైదరాబాద్: బీసీ సంఘాలపై పోలీసుల అక్రమ నిర్బంధాన్ని అరికట్టాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు బీసీ సంఘాల నేతలతో కలసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు గురువారం సచివాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. టికెట్ల కేటాయింపులో రాజకీయ పార్టీలు బీసీలకు చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 17న రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చామన్నారు. దీనిపై బీసీ సంఘాల నేతలకు పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, బంద్‌ను ఉపసంహరించుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. జిల్లాల్లో ర్యాలీలకు అనుమతినివ్వకుండా వేధిస్తున్నారని ఆయనకు వివరించారు. శాంతియు తంగా ర్యాలీలు, ప్రదర్శనలు చేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. దీనిపై కమిషనర్ జోక్యం చేసుకుని పోలీసు యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో డిసెంబర్ 7 వరకు బెల్టుషాపులను మూసి వే యాలని, అక్రమ ధన ప్రవాహానికి అడ్డుకట్ట వే యాలని కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, నందగోపాల్, అంజి తదితరులు ఉన్నారు. -
ఎన్నికల విధులకు పారితోషికం పెంచండి: టీఎన్జీవో
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పారితోషికం పెంచాలని టీఎన్జీవో నేతలు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయలో ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్ నేతృత్వంలోని బృందం కలసి ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతోనే దేశంలో పరిపూర్ణ ప్రజాస్వామ్యం సాధ్యమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియ అని... ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా జాబితాను రూపొందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యమే అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ఎన్నికలను ప్రశాంతంగా, పక్షపాత రహితంగా నిర్వహించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో భారీగా ఓటర్లను తొలగించారని వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తానన్నారు. అటవీ శాఖ ముఖ్యకార్యదర్శిగా బిజీగా ఉండటంతో బాధ్యతలు చేపట్టేందుకు ఆలస్యమైందని వివరించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఇప్పటివరకు నామినేషన్ దాఖలు కాలేదన్నారు. -
కొత్త సారథులు
⇒ సమర్థతకు పెద్దపీట.. ⇒విధేయులకు కీలక పోస్టులు ⇒జాయింట్ కలెక్టర్లకు స్థానచలనం ⇒కలెక్టర్‌గా రఘునందన్‌రావు ⇒జేసీ-1గా రజత్‌కుమార్ ⇒జేసీ-2గా హరిచందన ⇒సబ్ కలెక్టర్‌గా వర్షిణి సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లా టీమ్ మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కు యంత్రాంగం కొలువుదీరింది. సారథుల కూర్పులో సమర్థతను ప్రామాణికంగా తీసుకున్న సర్కారు.. విధేయులకు పెద్దపీట వేసింది. అధికారయంత్రాంగాన్ని ప్రక్షాళన చేసిన ప్రభుత్వం.. కొత్త సారథులను నియమించింది. కలెక్టర్ సహా జాయింట్ కలెక్టర్లు, సబ్‌కలెక్టర్‌ను బదిలీ చేస్తూ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సీఎండీగా బదిలీ అయిన కలెక్టర్ స్థానే ఎం.రఘునందన్‌రావు(2002)ను నియమించింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రఘునందన్ ఇటీవల తెలంగాణ కేడర్‌కు బదిలీ అయ్యారు. సొంత జిల్లా మెదక్ కావడం, మొదట్నుంచి సీఎం కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం జిల్లా కలెక్టర్ పోస్టింగ్‌లో రఘునందన్‌కు కలిసొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వివాదరహిత, ముక్కుసూటి అధికారిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఇద్దరు జేసీలకు స్థాన చలనం ఐఏఎస్ అధికారుల విభజన అనంతరం యంత్రాంగంలో సమూల మార్పులు జరుగుతాయనే ‘సాక్షి’ కథనం అక్షరసత్యమైంది. పక్షం రోజుల క్రితమే కలెక్టర్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా జాయింట్ కలెక్టర్లు ఎం.చంపాలాల్, ఎం.వీ.రెడ్డికి స్థానచలనం కలిగింది. ఏడాదిన్నర క్రితం ఒకే రోజు జేసీలుగా బాధ్యతలు స్వీకరించిన ఈ ఇద్దరికి కొత్తగా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వీరిరువురి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కేటాయించిన యువ ఐఏఎస్‌లను భర్తీ చేసింది. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓగా పనిచేసిన రజత్‌కుమార్ సైనీ(2007)ని జేసీ-1 నియమించింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రజత్ ఎక్కువకాలం పశ్చిమబెంగాల్లో సేవలందించారు. జేసీ-2గా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేసిన దాసరి హరిచందన(2010)ను నియమించారు. ఆమె సీనియర్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్ కూతురు. సబ్ కలెక్టర్‌గా వర్షిణి వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా వీఎస్ అలగు వర్షిణి(2012) నియమితులయ్యారు. తమిళనాడు రాష్ట్రం పొల్లచ్చికి చెందిన వర్షిణి తొలుత దంత వైద్యురాలిగా సేవలందించారు. ఆ తర్వాత ఇండియన్ పోస్టల్ సర్వీస్ (ఐపీఎస్)కు ఎంపికయ్యారు. మూడో ప్రయత్నంలో ఐఏఎస్ కు ఎంపికైన ఆమె ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇటీవల అధికారుల కేటాయింపుల్లో వర్షిణిని తెలంగాణ కేడర్‌కు మార్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తున్న హరినారాయణ్‌ను ఏపీకి బదిలీ చేస్తూ సోమవారం రిలీవ్ చేసింది. నలుగురూ ఏపీ నుంచే.. కొత్తగా పదవులు చేపడుతున్న నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీ నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. రాష్ట్ర విభజన నేపథ్యంలో వీరిని తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో అక్కడి నుంచి బదిలీపై వచ్చిన వీరికి మన ప్రభుత్వం తాజాగా పోస్టింగ్లిచ్చింది. రఘునందన్‌రావు మెదక్ జిల్లా వాసి.. జిల్లా కలెక్టర్‌గా నియమితులైన రఘునందన్‌రావు సొంత జిల్లా మెదక్. అమెరికాలోని యూనివర్సిటీ నుంచి ఎంఏలో మాస్టర్ డిగ్రీ పొందారు. గ్రూప్1 సర్వీసు నుంచి 2002లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన ఆయన.. గతంలో ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజినల్ అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగుడెం ఆర్డీఓగా, ఆదే జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడిగా పనిచేశారు. అనంతరం ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, సెర్ప్ అదనపు సీఈఓగా పనిచేసి కృష్ణాజిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన ఆయన.. తాజాగా జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు. రజత్‌ది ఉత్తరప్రదేశ్.. జాయింట్ కలెక్టర్-1గా నియమితులైన రజత్‌కుమార్ సైనీ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. 2007లో ఐఏఎస్‌కు ఎంపికైన ఆయన పశ్చిమబెంగాల్లో పనిచేశారు. అసిస్టెంట్ కలెక్టర్‌గా ముర్శిదాబాద్‌లో పనిచేశారు. అనంతరం సిలిగురిలో ఎస్‌డీఓగా, డార్జిలింగ్, మిడ్నిపూర్ జిల్లాలో కూడా పనిచేశారు. ఆ తర్వాత 2013లో ప్రకాశం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఆంద్రప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. తాజాగా జేసీ-1గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. హరిచందనది.. హైదరాబాద్ ఎంవీ రెడ్డి సోమవారం జిల్లా నుంచి రిలీవ్ కాగా, కొత్త జేసీ-2గా హరిచందన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన హరిచందన 2010లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం విజయవాడ సబ్ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి వద్ద కార్యనిర్వాహక సహాయకురాలిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సొంత రాష్ట్రానికి బదిలీ కాగా, రాష్ట్ర ప్రభుత్వం జిల్లా జేసీ-2గా నియమించింది. లండన్‌లో మాస్టర్ డిగ్రీ.. హరిచందన హైదరాబాద్‌లోని సెయింట్‌ఆన్స్ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏంఏ చదివారు. ఆ తర్వాత లండన్ విశ్వవిద్యాలయంలో రాజనీతి విభాగంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. సంక్షేమ పథకాలకే తొలి ప్రాధాన్యం.. ‘ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పక్కాగా లబ్ధిదారులకు చేరవేయడమే తొలి ప్రాధాన్యం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆహారభద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తా. మొత్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతం చేస్తా. జిల్లాలో 17 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలి సింది. వారి మృతికి కారణాలు తెలుసుకునేం దుకు ప్రయత్నిస్తా. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తా.’ -
ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడ నిర్మిస్తే బాగుంటుంది!
వివిధ శాఖల అధికారులతో సెయిల్ నిపుణుల సమాలోచనలు నేటి నుంచి ఖమ్మం, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) లిమిటెడ్ బృందం అధ్యయనం ప్రారంభించింది. ఇందులో భాగంగా సెయిల్ అధికారి అశోక్ కుమార్ ఝా నేతృత్వంలోని సాంకేతిక బృందం పరిశ్రమలశాఖ కమిషనర్ రజత్‌కుమార్‌తో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ అధికారులతో పాటు మైనింగ్, విద్యుత్, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం, వైఎస్సార్ జిల్లాల్లో ఏయే ప్రాంతాల్లో బొగ్గు నిల్వలు ఉన్నాయి? ఎంత మేర ఉన్నాయి? అక్కడ ఉన్న భూమి వివరాలతోపాటు విద్యుత్ డిమాండ్, సరఫరా అంశాలను ఈ సందర్భంగా అధికారులతో సెయిల్ బృందం చర్చించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ఆరు నెలల్లోగా సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలని సెయిల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టం-2014లో కేంద్రం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా సెయిల్ బృందం రాష్ట్రంలో పర్యటిస్తోందని పరిశ్రమలశాఖ అధికారులు తెలిపారు. నేడు, రేపు ఖమ్మంలో పర్యటన సెయిల్ సాంకేతిక బృందం ఖమ్మం, వైఎస్సార్ జిల్లాల్లో వరుసగా పర్యటించనుంది. ముందుగా ఈ నెల 21, 22 తేదీల్లో ఖమ్మం జిల్లాలో పర్యటించనుంది. అనంతరం 23, 24 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటించనుందని తెలిసింది. సుమారు 15 వేల కోట్ల పెట్టుబడితో ఏడాదికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ఉక్కు కర్మాగారం నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను ఈ బృందం అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.