సాక్షి, హైదరాబాద్: బీసీ సంఘాలపై పోలీసుల అక్రమ నిర్బంధాన్ని అరికట్టాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు బీసీ సంఘాల నేతలతో కలసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు గురువారం సచివాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. టికెట్ల కేటాయింపులో రాజకీయ పార్టీలు బీసీలకు చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 17న రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చామన్నారు. దీనిపై బీసీ సంఘాల నేతలకు పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, బంద్‌ను ఉపసంహరించుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.
జిల్లాల్లో ర్యాలీలకు అనుమతినివ్వకుండా వేధిస్తున్నారని ఆయనకు వివరించారు. శాంతియు తంగా ర్యాలీలు, ప్రదర్శనలు చేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. దీనిపై కమిషనర్ జోక్యం చేసుకుని పోలీసు యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో డిసెంబర్ 7 వరకు బెల్టుషాపులను మూసి వే యాలని, అక్రమ ధన ప్రవాహానికి అడ్డుకట్ట వే యాలని కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, నందగోపాల్, అంజి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment