r krishnaia
-
బీసీబంధు కోసం 8న రాష్ట్రవ్యాప్త ధర్నాలు
ముషీరాబాద్ (హైదరాబాద్): బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతీ కుటుం బానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డి మాండ్ చేస్తూ ఈ నెల 8న అన్ని జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాలని, ధర్నాలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. -
ఉద్యోగుల వయోపరిమితి పెంపు సరికాదు
ముషీరాబాద్: ఉద్యోగాలు లేక రోజుకొకరు చొప్పున నిరుద్యోగులు చస్తుంటే రిటైర్మెంట్ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రంలోని 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. మంగళవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కనీసం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు తీసుకోలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 ఏళ్లు గడిచినా 30 వేల పోలీస్ ఉద్యోగాలు, మరో 15 వేల ఇతర ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందన్నారు. ఇంకా గ్రూప్–1లో 1500, గ్రూప్–2లో 4వేలు, గ్రూప్–4 సర్వీస్ 40 వేల క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలేదన్నారు. ఇంకోవైపు రిటైర్ అయిన వేలాదిమంది ఉన్నతాధికారుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాజకీయ అవినీతికి పునాదులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ వయోపరిమితిని పెంచితే కిందిస్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు రావాని, అంతేకాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, బకాయిలుగా పేరుకుపోయిన డీఏలులు చెల్లించాలన్నారు. కేవలం వయోపరిమితి పెంచి ఉద్యోగాలకై ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పొట్టకొడితే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. త్వరలో అన్ని ప్రజా సంఘాలు, యువజన , విద్యార్థి సంఘాలతో సమావేశమై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రిటైర్మెంట్ వయస్సు పెంచొద్దు.. ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచొద్దని తెలంగాణ స్టూడెంట్ యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ మంగళవారం కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం వల్ల నిరుద్యోగం బాగా పెరుగుతుందన్నారు. ఇప్పుడున్న రిటైర్మెంట్ వయస్సును కొనసాగిస్తూ అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనీ సీఎం కేసీఆర్‌కు నాగరాజు విజ్ఞప్తి చేశారు. -
బీసీల కోటాపై టీడీపీ ఆట
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగకుండా ప్రతిపక్ష టీడీపీ అడుగడుగునా అడ్డుపడుతోందనే వాదనకు బలం చేకూర్చేలా న్యాయ వివాదాలకు పురిగొల్పుతుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా విపక్షం కుట్రపూరితంగానే బీసీ రిజర్వేషన్లపై వివాదం రాజేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలకు ఆటంకాలు కల్పించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.5 వేల కోట్లకుపైగా నిధులను అడ్డుకునే దుర్బుద్ధి దీని వెనక దాగుందని పేర్కొంటున్నారు. అన్ని రాష్ట్రాలు తగ్గిస్తున్నా.. ధైర్యంగా ముందుకే జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఇచ్చే రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని 2010లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దేశంలో 24 రాష్ట్రాలు ఒక్కొక్కటిగా బీసీలకిచ్చే రిజర్వేషన్లను 16–25 శాతం వరకు తగ్గించుకున్నాయి. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. అయినప్పటికీ ఆ తర్వాత 2019 డిసెంబరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ధైర్యంగా ముందుకెళ్లి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్లో ఆమోదించి జీవో కూడా జారీ చేసింది. ఆ జీవో మేరకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు కూడా ఆమోదం తెలిపింది. అయితే టీడీపీ నేతలు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 59.85%రిజర్వేషన్ల జీవోతో ఎన్నికలు జరపడంపై స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచనతో తిరిగి దీనిపై హైకోర్టులో విచారణ జరగడంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తీర్పు వెలువడింది. 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు మొదట రాష్ట్ర హైకోర్టు ఆమోదం తెలిపిన తర్వాత టీడీపీ నేత సుప్రీంకోర్టులో కేసు వేయకుంటే బీసీలకు 34 శాతంతోనే ఎన్నికలు జరిగేవని పేర్కొంటున్నారు. ఎన్నికలు, నిధులను అడ్డుకోవడమే విపక్షం ధ్యేయం రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టుతో ముగిసినప్పటికీ నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు గ్రామ పంచాయతీలకు తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకాగా టీడీపీ హయాంలో నామినేటెడ్ పదవి పొందిన ఆ పార్టీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి సుప్రీంకోర్టు, హైకోర్టులలో వరుసగా కేసులు వేయడంతో వాయిదా పడుతూ వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడం, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.5,100 కోట్ల నిధులను అడ్డుకోవడమే టీడీపీ ధ్యేయమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్లో చట్టమే మార్గం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై వివాదాలకు రాజ్యాంగ బద్ధతే శాశ్వత పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. పార్లమెంట్లో చేసిన చట్టం కారణంగా తమిళనాడులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం గతంలోనే కేంద్రంపై ఒత్తిడి తేవడంతో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించి 9వ షెడ్యూల్లో చేర్చారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సీఎం జగన్ సూచన మేరకు వైఎస్సార్సీపీ ఎంపీలు గతేడాది మార్చిలో పార్లమెంట్లో బిల్లు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు సుప్రీంకు వెళితే ప్రయోజనమా? బీసీ రిజర్వేషన్లపై టీడీపీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలైన కర్ణాటకలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రముఖ బీసీ ఉద్యమ నాయకుడు సిద్ధరామయ్య హయాంలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. బీసీ నేతలైన బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం చౌహాన్ కూడా 2013–2014లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18 – 22 శాతం తగ్గించారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు వాదనలో పసలేదు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వాదనలో పసలేదు, ఉపయోగం లేదు. గత ప్రభుత్వాలు చాలాసార్లు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాయి. ప్రతి కేసులో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతం మించరాదని తీర్పు చెప్పింది. అలాంటప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు వెళితే ఆ తీర్పు పునరావృతం అవుతుంది. చంద్రబాబు చర్యలతో కాలయాపన తప్ప బీసీలకు ఒరిగేదేమీ ఉండదు’ – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో టీడీపీ పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప తదితరులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. -
గవర్నర్ తమిళిసైను కలిసిన కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య శనివారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో త్వరలో నియమించబోయే తొమ్మిది యూనివర్సిటీల వైస్ చాన్సిలర్ పోస్టుల్లో జనాభా ప్రకారం బీసీలకు 50 శాతం పోస్టులను కేటాయించాలని గవర్నర్‌ను కోరారు. యూనివర్సిటీ చాన్సిలర్ నియమాకంలో జోక్యం చేసుకొని జీసీలకు కోటా కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని.. సమర్ధులైన అధికారులకు ప్రాధాన్యం లేని పోస్టులు ఇచ్చి అన్యాయం చేస్తున్నారని తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని గుర్తు చేశారు. అయినప్పటికీ రిజర్వేషన్ల అమలులో జాప్యం జరుగుతోందని.. బీసీల ఆందోళన గురించి కేంద్ర ప్రభుత్వనికి సిఫార్సు చేయాలని కోరారు. ప్రభుత్వ పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారని, జనాభా ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 56 శాతం పెంచాలని బీసీలు కోరుకుంటే.. 22 శాతానికి తగ్గించడం ఎంతవరకు న్యాయమని ఆర్ కృష్ణయ్య ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో కూడా జోక్యం చేసుకొని బీసీల హక్కులకు భంగం కలుగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన మెడికల్ కౌన్సిలింగ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల అమలు విషయంలో అక్రమాలు జరిగాయని.. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో నెం. 550కి వ్యతిరేకంగా.. రిజర్వేషన్ల అమలు జరగకుండా అన్యాయం చేశారని దీనిపై విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. -
బీసీ బిల్లు పాసైతే మోదీ మరో అంబేడ్కర్
కాచిగూడ: పార్లమెంట్లో వైఎస్సార్ సీపీ ప్రవేశపెట్టిన బీసీ బిల్లు పాసైతే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అంబేడ్కర్ అవుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన బీసీ కులసంఘాల ప్రతినిధుల సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏ రాజకీయ పార్టీ చేయలేని పనిని వైఎస్సార్ సీపీ బీసీ బిల్లు పెట్టి బీసీల మన్ననలు పొందుతోందన్నారు. 30 ఏళ్ల తమ పోరాట ఫలితంగానే బీసీ బిల్లు పార్లమెంట్‌కు చేరిందని పేర్కొన్నారు. పార్లమెంట్లో 92 మంది బీసీ ఎంపీలున్నా ఏ ఒక్కరూ బీసీ బిల్లు పెట్టే ప్రయత్నం చేయలేదని, వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బీసీ బిల్లును పార్లమెంట్లో పెట్టి చరిత్ర సృష్టించారన్నారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్మోహన్రెడ్డి తన మాట నిలబెట్టుకుని అందరికీ ఆదర్శప్రాయులయ్యారని అభినందించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి బీసీలందరూ అండగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. బీసీ బిల్లును వ్యతిరేకించే పార్టీలకు, పార్లమెంట్ సభ్యులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బీసీ బిల్లు పాస్‌కాకపోతే దేశాన్ని రణరంగంగా మారుస్తామని, రాష్ట్రాలను దిగ్బంధం చేస్తామని, ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిల్లు పాస్ చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చొరవ తీసుకోవాలని కోరారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, లాలకోట వెంకటచారి, శ్రీనివాసులు, సంగమేశ్వర్, ఆర్.లక్ష్మణ్‌రావు, వేముల వెంకటేష్, మదన్మోహన్, రాజేందర్ ముదిరాజ్, గొరిగె మల్లేశం యాదవ్, నీల వెంకటేష్, ఉపేందర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, బి.భిక్షపతి, పృథ్వీగౌడ్, రమాదేవి, గణేష్, కోల శ్రీనివాస్, 112 బీసీ కుల సంఘాల ప్రతినిధులు, 28 బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘బీసీ రిజర్వేషన్ల తగ్గింపు దుర్మార్గం’
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 18 శాతానికి తగ్గించి అమలు చేయడం దుర్మార్గమని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. విద్యానగర్‌లోని బీసీ భవన్లో శుక్రవారం జరిగిన బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామ స్థాయిలలో బీసీల నాయకత్వం ఎదగకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జిల్లా పరిషత్ చైర్మన్లలో ఆరు చైర్మన్లు, 550 మండల పరిషత్ చైర్మన్లలో 94 చైర్మన్లు ఏ లెక్కన ఇస్తారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. రిజర్వేషన్ల తగ్గింపునకు వ్యతిరేకంగా అన్ని పార్టీల్లోని బీసీ నాయకులు రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మర్రి శశిధర్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం తగదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై హైకోర్టులో గతేడాది ఆగస్టులో తొలుత పిటిషన్ దాఖలు చేయగా దాన్ని విచారించిన హైకోర్టు ఆ పిటిషన్‌ను తెలంగాణ అసెంబ్లీ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ శశిధర్‌రెడ్డి తిరిగి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని, నియోజకవర్గాల పునర్విభజన చట్టంలోని సెక్షన్ 11ను, ప్రజాప్రాతినిథ్య చట్టాన్ని సవరించాల్సి ఉన్నా అవేవీ జరగకుండానే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు జారీచేసిందని నివేదించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. విచారణ అనంతరం శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్లో అభ్యర్థనలను మార్చజాలమని, ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో సాంకేతిక కారణాల దృష్ట్యా తమ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిందని పేర్కొన్నారు. ‘ఈడబ్ల్యూఎస్’ను సవాలు చేస్తూ ఆర్.కృష్ణయ్య పిటిషన్ అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ‘అగ్రకులాల్లోని పేదలను అభివృద్ధి పరచాలంటే ఆర్థిక పరమైన స్కీములు, పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి పరచాలి. అంటరానితనం, సాంఘిక వివక్షకు గురవుతున్న కులాలకు రిజర్వేషన్లు కల్పించడం, విద్యా, ఉద్యోగ, పాలన రంగంలో ప్రాతినిథ్యం లేని కులాలను గుర్తించి వారికి ప్రాతినిథ్యం కల్పించడం రిజర్వేషన్ల లక్ష్యం. ఉద్యోగాల్లో వారికి వారి జనాభా ప్రకారం ప్రాతినిథ్యం లేదని ఇస్తారా? వారు చదువుకోవడం లేదని ఇస్తారా? లేక సమాజంలో అగ్రకులాల వారికి సామాజిక గౌరవం లేదని ఇస్తారా? అనే కోణంలో చూడాలి. ఈ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్టే ఇచ్చి విచారణ జరపాలి’అని పిటిషన్లో అభ్యర్థించారు. -
‘బీసీ సంఘాలపై పోలీసుల నిర్బంధాన్ని అరికట్టాలి’
సాక్షి, హైదరాబాద్: బీసీ సంఘాలపై పోలీసుల అక్రమ నిర్బంధాన్ని అరికట్టాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు బీసీ సంఘాల నేతలతో కలసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు గురువారం సచివాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. టికెట్ల కేటాయింపులో రాజకీయ పార్టీలు బీసీలకు చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 17న రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చామన్నారు. దీనిపై బీసీ సంఘాల నేతలకు పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, బంద్‌ను ఉపసంహరించుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. జిల్లాల్లో ర్యాలీలకు అనుమతినివ్వకుండా వేధిస్తున్నారని ఆయనకు వివరించారు. శాంతియు తంగా ర్యాలీలు, ప్రదర్శనలు చేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. దీనిపై కమిషనర్ జోక్యం చేసుకుని పోలీసు యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో డిసెంబర్ 7 వరకు బెల్టుషాపులను మూసి వే యాలని, అక్రమ ధన ప్రవాహానికి అడ్డుకట్ట వే యాలని కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, నందగోపాల్, అంజి తదితరులు ఉన్నారు. -
‘రేపు బీసీ బహిరంగసభ దద్దరిల్లాలి’
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సమగ్రాభివృద్ధిని కోరుతూ ఈ నెల 4న సరూర్‌నగర్ స్టేడియంలో తలపెట్టిన బీసీ బహిరంగసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ సభకు 112 బీసీ కులసంఘాలు మద్దతు తెలిపాయని చెప్పారు. బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీసభప్లాన్, బీసీ అట్రాసిటీ యాక్ట్ లాంటి అంశాలపై సభలో చర్చించి తీర్మానాలు చేస్తామన్నారు. ఈ సమావేశ నిర్ణయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని తెలిపారు. -
మళ్లీ వస్తే ఎవరినీ బతకనివ్వరు
సాక్షి, హైదరాబాద్: నలుగురు సభ్యులున్న కుటుం బం 4 కోట్ల తెలంగాణ ప్రజలను హింసిస్తోందని, ఆ నలుగురి కబంధ హస్తాల్లో పడి ప్రజలు విలవిల్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే లక్ష్యం తో కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ‘వీ టూ’కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. అత్యంత అవినీతి, నియంతృత్వ సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఈ ముదనష్టపు ప్రభుత్వాన్ని బొందపెట్టాలని, లేకపోతే ఎవరినీ బతకనివ్వరన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే డబ్బు, మద్యంతో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. విద్యాసంస్థలపై కుట్రలా..? ప్రైవేటు సంస్థలు భయపడొద్దని, విద్యాసంస్థలను బెదిరిస్తే తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు. సేవ చేయాలని ముందుకొచ్చిన విద్యా సంస్థలకు మేలు చేయకపోగా, మూసివేసేలా అణచివేత చర్య లు చేపట్టారన్నారు. విద్యా సంస్థలు పౌల్ట్రీ షెడ్డుల్లో నడుస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా నిరాధార ఆరోపణలతో సీఎం కేసీఆర్ అవమానించారని గుర్తు చేశారు. సకాలంలో ఫీజులు ఇవ్వకుండా విద్యా సంస్థలను మూసేసేలా చేశారని మండిపడ్డారు. ఆంక్షలు లేకుండా ఫీజులు డిసెంబర్ 12న మహాకూటమి ప్రమాణ స్వీకారం చేస్తుందని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఆంక్షలు లేకుండా 100% ఫీజు ఇస్తామన్నారు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లోని 5 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బందికి రూ.5 లక్షల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు. సిబ్బందికి వసతిగృహం కోసం హౌజింగ్ స్కీంను ప్రవేశ పెడతామన్నారు. ఎలక్ట్రిసిటీ చార్జీలను కమర్షియల్ నుంచి డొమెస్టిక్‌కు తగ్గిస్తామని చెప్పారు. మున్సిపల్, ఆస్తి పన్నులను కమర్షియల్ నుంచి రెసిడెన్స్ కేటగిరీకి మార్చుతామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదని, అంతా సీఎం కనుసన్నల్లోనే ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ప్రతి 3 నెలలకోసారి సమావేశం ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలు ఉండబోవని చెప్పారు. 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని ఉద్ఘాటించారు. ఫీజు, మెస్ చార్జీలను పెంచి పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫీజు రూ.1,700 అంటే అది విద్యా వ్యవస్థను అవమానపరచడమేనన్నారు. అందరూ మరో 45 రోజులు కష్టబడి పనిచేస్తే నియంత పాలన అంతమవుతుందన్నారు. రాజకీయాల్లోని అవలక్షణాలన్నీ కేసీఆర్‌లోనే స్వపరిపాలన అంటే కేసీఆర్ కుటుంబ పాలన అయిపోయిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లోని అవలక్షణాలన్నీ ఆయనలోనే ఉన్నాయని విమర్శించారు. ఆయన వల్ల నాలుగేళ్లలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు. కేసీఆర్ తెలంగాణకు చీడ పురుగులా తయారయ్యారని మండిపడ్డారు. అందుకే ఆయనను గద్దె దింపేందుకు మహాకూటమి ఏర్పాటైందని పేర్కొన్నారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో టీఆర్ఎస్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. అలాంటి పార్టీని మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని కోరారు. తెలంగాణ ప్రజలు చదువుకుంటే ఓట్లు వేయరని టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందుకే ఫీజులపై ఆంక్షలు పెట్టారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. తమ పిల్లలను చదివించుకోవాలని తల్లిదండ్రులు అనుకుం టే.. కేసీఆర్ మాత్రం పిల్లలు బర్లకాడికి, గొర్లకాడికి, పందుల కాడికి, చేపల కాడికి పోవాలన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అలాంటి పాలన మళ్లీ రాకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రభుత్వ విధానాల వల్ల కనుమరుగయ్యాయని జేఏసీ చైర్మన్ జి.రమణారెడ్డి పేర్కొన్నారు. తమ సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అందుకే టీఆర్ఎస్ను ఓడించేందుకు, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన మహా కూటమిని గెలిపించాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ గౌరి సతీశ్, టీపీసీసీ అధికార ప్రతినిధి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జానారెడ్డితో ఆర్. కృష్ణయ్య కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత జానారెడ్డితో బీసీ సంఘం నేత, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మహా కూటమికి బీసీ సంఘాల మద్దతుపై ఇరువురు నేతలు చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇదివరకే బీసీ సంఘం ప్రతినిధులు తమను కలిసి పలు విజ్ఞప్తులు చేశారని.. బీసీల న్యాయమైన డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని తెలిపారు. తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేరుస్తామని జానారెడ్డి పేర్కొన్నారు. కూటమి సీట్ల సర్దుబాటుపై వారంలో స్పష్టత వస్తుందని, త్వరలో తెలంగాణలో జరుగునున్న రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కేసీఆర్ కాఫీ కోట్టారని.. తమ ప్రకటనలకు బడ్జెట్ సరిపోదన్న కేసీఆర్ ఇప్పుడేం సమాధానం చెప్తురని ప్రశ్నించారు. బీసీలకు 90 శాతం సబ్సిడీ.. జానారెడ్డితో భేటీలో భాగంగా బీసీలకు మెజార్టీ సీట్లు ఇవ్వాలని కోరినట్లు బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్, 90శాతం సబ్సిడీతో బీసీలకు రుణాలు వంటి అంశాలపై వారితో చర్చించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్యోగ నోటిషికేషన్లు ఇవ్వాలని.. బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చాలని కాంగ్రెస్ పార్టీని కోరినట్లు ఆయన వెల్లడించారు. -
ఆర్. కృష్ణయ్యతో జానారెడ్డి కీలక భేటీ
-
ఆగస్టులో నూతన రాజకీయ పార్టీ
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్) : బీసీ ఉద్యమనేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బీసీలకు నూతన రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ నౌడు వెంకటరమణ తెలిపారు. త్వరలో ఆర్. కృష్ణయ్య పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారన్నారు. పార్టీ పతాకం, విధివిధానాలు ప్రకటిస్తారన్నారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు బీసీలకు 100 సీట్లు కేటాయిస్తామని హామీలు ఇస్తున్నాయే తప్ప అమలు చేయడం లేదన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. బీసీలకు రాజ్యాధికారం వచ్చినపుడే అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వారిని చైతన్య పరిచేందుకు పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పర్యటిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో 13జిల్లాలకు జేఏసీ అధ్యక్షులను నియమిస్తామన్నారు. రాష్ట్రంలోని ముఖ్యపట్టణాల్లో బీసీల రాజకీయపార్టీ ఆవిర్భావంపై మేధోమథన సదస్సులు నిర్వహిస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, మేధావులు, ప్రముఖుల సూచనలు , సలహాలు తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళతామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పాలేటి రామారావు, సంఘం ఉపాధ్యక్షుడు అరవ వెంకటసత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మారేష్, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ నూకాలమ్మ, ఉపాధ్యక్షురాలు సీతారత్నం, పరిటాల రాము, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. -
గ్రూప్–1,3,4 పోస్టులను భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సుమారు 45 వేల గ్రూప్–1, 3, 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాల ని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఇచ్చే పోస్టులను ఆయా శాఖల ఉన్నతాధికారులతో భర్తీ చేయటం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల లో ఒకే వార్డెన్ రెండు మూడు హాస్టళ్లకు ఇంచార్జిగా ఉంటున్నారని, దీంతో వాటి నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని పేర్కొన్నారు. -
బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించండి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీసీలకు సామాజిక రక్షణ, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, సామాజిక పథకాలు చేరవేసే బీసీ కమిషన్ బిల్లును నిరుడు పార్లమెంటులో ప్రవేశపెట్టి, ప్రతిపక్షాల అభ్యంతరాలతో సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. ఆ కమిటీ బిల్లును మళ్లీ పార్లమెంటుకు పంపిందన్నారు. సమావేశాలు ముగియడానికి రెండు రోజులే ఉన్నందున పార్లమెంటులో ఆ బిల్లును ప్రవేశపెట్టాలని కృష్ణయ్య లేఖలో పేర్కొన్నారు. -
బీసీ జాబితాలో చేర్చండి
సాక్షి, హైదరాబాద్: బీసీ జాబితా నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలగించిన 26 కులాలను వెంటనే ఆ జాబితాలో చేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మంగళవారం లేఖ రాశారు. ఇటీవల జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఈ డిమాండ్‌ను ఏకగీవ్రంగా తీర్మానించారని లేఖలో ఆయన గుర్తు చేశారు. జాబితా నుంచి తొలగించిన కులాల వారికి ఫీజులు, ఉపకార వేతనాలు రాకపోవడంతో ఉన్నత విద్యను చదవలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కూడా వారికి అర్హత లేకుండా పోయిందన్నారు. జాబితా నుంచి కులాలను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. బీసీ కమిషన్ ద్వారా మాత్రమే జాబితాలో ఏ కులాన్ని అయినా చేర్చడం, తొలగించడం చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఉందని పేర్కొన్నారు. -
బీసీలకు 10 వేల కోట్లు కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: రానున్న బడ్జెట్లో బీసీలకు రూ.10 వేల కోట్ల కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ కుల వృత్తుల ఫెడరేషన్లకు జనాభా ప్రాతిపదికన నిధులివ్వాలని కోరారు. గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలసి 16 డిమాండ్లపై వినతి పత్రం సమర్పించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. -
బీసీల హక్కుల కోసం పోరాడాలి: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: బీసీలు తమ హక్కుల కోసం నిరంతర పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీలు గొర్రెలు, బర్రెలు, చేపలకు ఆశపడకుండా రాజ్యాధికారానికై అడుగులు వేయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. రాజ్యాధికారం ద్వారానే బీసీలకు ఆత్మగౌరవం దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, బీసీలు ఐక్యంగా ఉంటేనే జాతికి మేలు జరుగుతుందన్నారు. కులవృత్తులను, కులాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడుతూ.. బీసీలు రాజకీయ, ఆర్థిక రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులపై ఒత్తిడి తెచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. -
23న నిరుద్యోగ గర్జన
హైదరాబాద్: తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామం టూ ఊదరగొట్టిన సీఎం కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడి 4 ఏళ్లు కావస్తున్నా ఉద్యోగాల మాటెత్తడం లేదని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. గురువారం ఇక్కడ జరిగిన నిరుద్యో గుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం, మంత్రులను ఉద్యోగాల గురించి అడిగితే 6 నెలల్లో భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులను మభ్యపెడుతు న్నారే తప్ప నోటిఫికేషన్లు ఇవ్వడంలేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలన్న డిమాండ్ తో ఈ నెల 23న నల్లగొండ జిల్లాలో నిరుద్యోగ గర్జన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, లాల్ కృష్ణ, శ్రీనివాస్‌గౌడ్, మధు, రాంబాబు, సతీష్ చందర్, జయంత్ తదితరులు పాల్గొన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా బీఆర్ కృష్ణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీఆర్ కృష్ణను నియమిస్తూ ఆర్.కృష్ణయ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో బీసీలకు 25 శాతం రిజర్వేషన్ల కోసం 1980లోనే ఆయన పోరాడి విజయం సాధించారన్నారు. -
బీసీలకు రాజ్యాంగ హక్కులు కల్పించండి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మంగళవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ బృందం వినతి పత్రం సమర్పించింది. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని తెలిపింది. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని పేర్కొంది. ఆర్టికల్ 340 ప్రకారం చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్రపతిని కోరింది. వినతి పత్రంలోని అంశాలు.. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలి. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమిలేయర్‌ను తొలగించాలి. బీసీల జనాభా ప్రకారం కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 56 శాతానికి పెంచాలి. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించాలి. బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలి. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ/ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్రంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజుల రీయింబర్స్మెంట్ విధానాన్ని సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 14 లక్షల పోస్టులను భర్తీ చేయాలి. కేంద్ర స్థాయిలో రూ.60 వేల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలి. బీసీ కార్పొరేషన్ కింద ఏటా రూ.50 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు 80 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడం లేదు. మెరిట్లో వచ్చిన వారిని ఓపెన్ కంపిటీషన్లో భర్తీ చేయాలి. ఈ సమావేశంలో నందగోపాల్, భూపేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు రాజ్యాంగ హక్కులు కల్పించండి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మంగళవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ బృందం వినతి పత్రం సమర్పించింది. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని తెలిపింది. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని పేర్కొంది. ఆర్టికల్ 340 ప్రకారం చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్రపతిని కోరింది. వినతి పత్రంలోని అంశాలు.. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలి. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమిలేయర్‌ను తొలగించాలి. బీసీల జనాభా ప్రకారం కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 56 శాతానికి పెంచాలి. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించాలి. బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలి. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ/ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్రంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజుల రీయింబర్స్మెంట్ విధానాన్ని సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 14 లక్షల పోస్టులను భర్తీ చేయాలి. కేంద్ర స్థాయిలో రూ.60 వేల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలి. బీసీ కార్పొరేషన్ కింద ఏటా రూ.50 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు 80 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడం లేదు. మెరిట్లో వచ్చిన వారిని ఓపెన్ కంపిటీషన్లో భర్తీ చేయాలి. ఈ సమావేశంలో నందగోపాల్, భూపేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
జనవరి 5న బీసీ ఉద్యోగుల మహాసభలు
హైదరాబాద్: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ జనవరి 5న బీసీ ఉద్యోగుల మహాసభలు నిర్వహించ నున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం ఇక్కడ బీసీ భవన్ లో జరిగిన తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లా డారు. చట్టపరమైన, రాజ్యాంగపరమైన, న్యాయపరమైన అవరోధాలు ఏమీ లేకున్నా గత పాలకులు బీసీ ఉద్యో గులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్ట లేదని విమర్శించారు. 54 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో బీసీ ఉద్యోగులు కేవలం 4 లక్షల 62 వేల మందే ఉన్నారని అన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి 50 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. 56 శాతం జనాభా ఉన్న బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటులో 14 శాతం ప్రాతినిధ్యం కూడా లేదన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ లేరని, 2,600 బీసీ కులాల్లో 2,550 కులాలు ఇప్పటివరకు పార్లమెంటులో అడుగు పెట్టలేదన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి
హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయి లను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తిగా ఫీజులు చెల్లించాలన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ తదితర కోర్సుల్లో చదివే బీసీ విద్యార్థులకు మొత్తం ఫీజు బకాయిలను చెల్లించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతేడాదికి సంబంధించిన రూ.1,400 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జిల్లెపల్లి అంజి, ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవనాన్ని ముట్టడించారు. 3 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ ధర్నాలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ కోఆర్డినేటర్ ర్యాగ అరుణ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నాయకులు వెంకటేష్, ఆర్.నరేష్, రాంబాబు, పి.సతీష్, అశోక్, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
10 ఎకరాల స్థలం.. రూ.10 కోట్ల బడ్జెట్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇతర కులాలకు స్థలం, నిధులు కేటాయించిన విధంగా బీసీల్లోని 70 కుల సంఘాలకు హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలం, రూ.10 కోట్ల బడ్జెట్ కేటా యించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో శుక్రవారం పలు కుల సంఘాల రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, లేకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ విషయమై త్వరలో ప్రధానమంత్రిని కలవనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, సమన్వయకర్త నీల వెంకటేష్, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల వెంకటేష్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోశిక యాదగిరి, గౌడ జేఏసీ కన్వీనర్ అంబలి నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓయూలో ఘనంగా పూలే వర్థంతి
హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు పూలే 124వ వర్థంతి శుక్రవారం ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షడు ఆర్.కృష్ణయ్య, తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఓయూ ఆర్ట్ కళాశాల నుంచి ఎన్సీసీ గేట్ వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ రన్లో భారీ సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.