
హైదరాబాద్: తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామం టూ ఊదరగొట్టిన సీఎం కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడి 4 ఏళ్లు కావస్తున్నా ఉద్యోగాల మాటెత్తడం లేదని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. గురువారం ఇక్కడ జరిగిన నిరుద్యో గుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం, మంత్రులను ఉద్యోగాల గురించి అడిగితే 6 నెలల్లో భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులను మభ్యపెడుతు న్నారే తప్ప నోటిఫికేషన్లు ఇవ్వడంలేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలన్న డిమాండ్ తో ఈ నెల 23న నల్లగొండ జిల్లాలో నిరుద్యోగ గర్జన నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, లాల్ కృష్ణ, శ్రీనివాస్‌గౌడ్, మధు, రాంబాబు, సతీష్ చందర్, జయంత్ తదితరులు పాల్గొన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా బీఆర్ కృష్ణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీఆర్ కృష్ణను నియమిస్తూ ఆర్.కృష్ణయ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో బీసీలకు 25 శాతం రిజర్వేషన్ల కోసం 1980లోనే ఆయన పోరాడి విజయం సాధించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment