కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత జానారెడ్డితో బీసీ సంఘం నేత, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మహా కూటమికి బీసీ సంఘాల మద్దతుపై ఇరువురు నేతలు చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.