టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో సీట్ల పంపకం తుది దశకు చేరుకుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత కే. జానారెడ్డి తెలిపారు. ఎంతో ఉత్కంఠ రేపుతున్న అభ్యర్థుల ఎంపిక పూరైందని.. రేపు సాయంత్రానికి అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ చర్చించిన తుది జాబితాలో పేరు లేని ఆపార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్యయ్య టిక్కెట్‌కు లైన్ క్లియర్ చేశామని తెలిపారు.