bc organigations
-
జానారెడ్డితో ఆర్. కృష్ణయ్య కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత జానారెడ్డితో బీసీ సంఘం నేత, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మహా కూటమికి బీసీ సంఘాల మద్దతుపై ఇరువురు నేతలు చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇదివరకే బీసీ సంఘం ప్రతినిధులు తమను కలిసి పలు విజ్ఞప్తులు చేశారని.. బీసీల న్యాయమైన డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని తెలిపారు. తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేరుస్తామని జానారెడ్డి పేర్కొన్నారు. కూటమి సీట్ల సర్దుబాటుపై వారంలో స్పష్టత వస్తుందని, త్వరలో తెలంగాణలో జరుగునున్న రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కేసీఆర్ కాఫీ కోట్టారని.. తమ ప్రకటనలకు బడ్జెట్ సరిపోదన్న కేసీఆర్ ఇప్పుడేం సమాధానం చెప్తురని ప్రశ్నించారు. బీసీలకు 90 శాతం సబ్సిడీ.. జానారెడ్డితో భేటీలో భాగంగా బీసీలకు మెజార్టీ సీట్లు ఇవ్వాలని కోరినట్లు బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్, 90శాతం సబ్సిడీతో బీసీలకు రుణాలు వంటి అంశాలపై వారితో చర్చించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్యోగ నోటిషికేషన్లు ఇవ్వాలని.. బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చాలని కాంగ్రెస్ పార్టీని కోరినట్లు ఆయన వెల్లడించారు. -
ఆర్. కృష్ణయ్యతో జానారెడ్డి కీలక భేటీ
-
ర్యాంకు ప్రకారమే రీయింబర్స్మెంట్?
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల (బీసీ) విద్యార్థులకు ఈ ఏడాది కూడా ర్యాంకు ఆధారంగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీసీలందరికీ పూర్తి ఫీజు ఇవ్వాలని బీసీ సబ్‌కమిటీ సిఫార్సు చేసి ఆరు నెలలైనా ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజును సర్కారు చెల్లిస్తుండగా.. బీసీల్లో 10 వేలలోపు ర్యాంకు సాధించిన వారికే పూర్తి ఫీజు ఇస్తోంది. అంతకన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి గరిష్టంగా రూ.35 వేలు అందిస్తుండటంతో మిగతా ఫీజును విద్యార్థులు వ్యక్తిగతంగా భరించాల్సి వస్తోంది. దీంతో మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ రాగా.. గతేడాది బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులివ్వాలని తీర్మానించింది. సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఆర్నెల్లు్ల గడిచినా పూర్తి ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అవే నిబంధనలు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని కేబినెట్ సబ్ కమిటీ గతేడాది డిసెంబర్లో ప్రకటించింది. కానీ ఇప్పటికీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం 2017–18 విద్యా సంవత్సరం బకాయిలు చెల్లిస్తున్నారు. ఇందులో 10 వేల ర్యాంకు సీలింగ్‌ను అనుసరిస్తూ.. ఆ లోపు ర్యాంకు ఉన్న విద్యార్థులకే పూర్తి ఫీజు ఇస్తున్నారు. అంతకన్నా ఎక్కువ ర్యాంకున్న వారికి స్లాబుల ప్రకారం చెల్లిస్తున్నారు. మరోవైపు పోస్టుమెట్రిక్ విద్యార్థుల రీయింబర్స్మెంట్ నిబంధనల్లో మార్పుల్లేవని, గత నిబంధనలే కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. బీసీల్లోని హిందువులకే కోత రీయింబర్స్మెంట్ పథకంలో బీసీ విద్యార్థులకు ర్యాంకు నిబంధన అమలు చేస్తున్నా కొన్ని కులాలకే పరిమితమైంది. బీసీ–బీ కేటగిరీలోని దూదేకుల, నూర్‌బాషా, పింజారి, లద్దాఫ్.. బీసీ–సీ కేటగిరీలోని కన్వర్టెడ్ క్రిస్టియన్, మైనారిటీ కులాలు, బీసీ–ఈ కేటగిరీ కులాలకు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లిస్తోంది. బీసీల్లోని హిందూ కులాలకే ర్యాంకు నిబంధన ఉండటంతో మతాల ఆధారంగా విద్యా పథకాలు వర్తింపజేయడం సరికాదని బీసీ సంక్షేమ, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
బీసీ బిల్లు కోసం దశలవారీ ఉద్యమం
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి బీసీ, కులసంఘాల విస్తృతస్థాయి సమావేశం డిమాండ్ ఈ నెల మూడోవారంలో ఇందిరాపార్కు వద్ద మహాభేరి హైదరాబాద్: బీసీ బిల్లు కోసం బీసీ, కుల సంఘాలు ఏకమయ్యాయి. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, రాష్ట్రంలో బీసీ కులాల ఫెడరేషన్లకు నిధులు కేటాయించాలని, దశలవారీగా ఉద్యమించాలని నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం ఇక్కడ జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, బీసీ, కుల సంఘాలు పాల్గొన్నాయి. బీసీల్లోని కులానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేయాలని, ర్యాంకులతో నిమిత్తం లేకుండా బీసీ విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలని, అత్యంత వెనుకబడిన, సంచారజాతులకు రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మాదిరిగా బీసీలకు పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా పార్లమెంట్లో బీసీ బిల్లు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.50 వేల కోట్ల కేటాయింపు, జాతీయ బీసీ కమిషన్‌కు చట్టబద్ధత తదితర డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తె చ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ అఖిలపక్ష బృందాన్ని, బీసీ సంఘాల ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, సీపీఐ నేత టి.వెంకట్రాములు, టీటీడీపీ నేత బుచ్చిలింగం, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, గంగపుత్ర సంఘం నేత ఏఎల్ మల్లయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం నేత గణేష్చారితోపాటు 70 కుల సంఘాలు, 30 బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. డిమాండ ్ల సాధనకు ఈ నెల మూడోవారంలో ఇందిరాపార్కు వద్ద బీసీల మహాభేరి నిర్వహించాలని, వచ్చే నెలలో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాలను ముట్టడించాలని తీర్మానించారు. పోరాడే సమయం: కృష్ణయ్య బీసీలుగా వాటాల కోసం పోరాడే సమయం ఆసన్నమైందని ఆర్.కృష్ణయ్య అన్నారు. డిమాండ్ల సాధనకు దశలవారీగా ఉద్యమించాలని, అంతిమంగా రాష్ర్టబంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీసీ ఫెడరేషన్లవారీగా కాకుండా 80 శాతం సబ్సిడీతో వ్యక్తిగత రుణాలివ్వాలని, బీసీలకు 500 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.