హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయి లను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తిగా ఫీజులు చెల్లించాలన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ తదితర కోర్సుల్లో చదివే బీసీ విద్యార్థులకు మొత్తం ఫీజు బకాయిలను చెల్లించాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గతేడాదికి సంబంధించిన రూ.1,400 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జిల్లెపల్లి అంజి, ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవనాన్ని ముట్టడించారు. 3 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ ధర్నాలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ కోఆర్డినేటర్ ర్యాగ అరుణ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నాయకులు వెంకటేష్, ఆర్.నరేష్, రాంబాబు, పి.సతీష్, అశోక్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment