
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సుమారు 45 వేల గ్రూప్–1, 3, 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాల ని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా కింద ఇచ్చే పోస్టులను ఆయా శాఖల ఉన్నతాధికారులతో భర్తీ చేయటం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల లో ఒకే వార్డెన్ రెండు మూడు హాస్టళ్లకు ఇంచార్జిగా ఉంటున్నారని, దీంతో వాటి నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment