Direct Recruitment
-
నాయబ్.. సీనియారిటీ గాయబ్!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో భాగంగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న నాయబ్ (డిప్యూటీ) తహసీల్దార్లకు అన్యాయం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. ఉద్యోగాల్లో నేరుగా భర్తీ అయిన (డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఈ నాయబ్ తహసీల్దార్ల సీనియారిటీని పరిగణనలోకి తీసుకునే విషయంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయ వర్గాలు గందరగోళంగా వ్యవహరిస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. వాస్తవానికి, రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్లుగా పనిచేస్తున్న వారిలో 70 శాతం మంది పదోన్నతిపై వచ్చినవారు కాగా, 30 శాతం మంది నేరుగా భర్తీ అయినవారు ఉంటారు. ఇందులో పదోన్నతుల ద్వారా నాయబ్ తహసీల్దార్లుగా పనిచేస్తున్న వారి సీనియారిటీ సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జోనల్ స్థాయి అయిన ఈ పోస్టుకు సీనియారిటీ జాబితాలు తయారు చేసేందుకు కొత్త జోనల్ విధానంలో కాకుండా పాత జోన్ పరిధిలోకి వచ్చే అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి సీనియారిటీని లెక్కగడుతున్నారని డైరెక్ట్ రిక్రూటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి ఫిర్యాదు కూడా చేశారు. కానీ, సీసీఎల్ఏ వర్గాలు మాత్రం తాము అనుకున్న పద్ధతిలోనే వెళుతున్నాయని రెవెన్యూ సంఘాల నేతలంటున్నారు. అలా చేయడం ద్వారా పాత జోన్లవారీగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలు, ఇతర ముఖ్య పట్టణాల ప్రాంతాల్లోకి ప్రమోటీ నాయబ్ తహసీల్దార్లు వెళితే, మారుమూల ప్రాంతాలు, చిన్న జిల్లాలకు డైరెక్ట్ రిక్రూటీలు వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. కొత్త జోన్ల ప్రకారం సీనియారిటీ జాబితా తయారు చేస్తే కొన్ని జిల్లాల్లో అయినా డైరెక్ట్ రిక్రూటీలు మంచి ప్రాంతాల్లో పోస్టింగులు పొందే అవకాశం ఉంటుందని, లేదంటే సర్వీసు పూర్తిగా మారుమూల ప్రాంతాలకే పరిమితం అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే సీనియర్ అసిస్టెంట్లు, తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీ జాబితాలను సీసీఎల్ఏ సిద్ధం చేస్తుండగా, సీనియర్ అసిస్టెంట్ కంటే కింది కేడర్ జాబితాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలు తయారు చేస్తున్నారు. అయితే, ఏ స్థాయిలోనూ వీరి సీనియారిటీ జాబితాలను ప్రదర్శించడం లేదని, కనీసం ఏదైనా అభ్యంతరం తెలిపేందుకు, సూచన చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోతోందని రెవెన్యూ సంఘాలంటున్నాయి. ఇదే విషయమై ఉన్నతాధికారులను అడిగితే ఇప్పుడు వారి అభ్యంతరాలు, సూచనలు తీసుకోవాలంటే ప్రభుత్వం తమకిచ్చిన గడువు సరిపోదని, వీలున్నంత పారదర్శకంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వివిధ స్థాయిల్లో సీనియారిటీ జాబితాలు సిద్ధం చేస్తున్నామని చెపుతున్నారు. వీఆర్వో.. నోఆప్షన్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో)గా పనిచేస్తున్న 5,500 మంది ఉద్యోగుల ఆప్షన్లను ప్రభుత్వం స్వీకరించడం లేదు. ఇప్పటికే ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి 14 నెలలు దాటినా ఇంతవరకు వారి జాబ్‌చార్టును ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి వారి నుంచి ఆప్షన్ల స్వీకరణను నిలిపివేసినట్టు తెలుస్తోంది. అన్ని శాఖల్లో విభజన పూర్తయిన తర్వాత ఏర్పడే ఖాళీలు, ఆయా శాఖల్లోని అవసరాల ఆధారంగా వీఆర్వోలను సర్దుబాటు చేసి ఆ తర్వాత లోకల్ కేడర్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, తమ నుంచి ఆప్షన్లు స్వీకరించకపోవడం, స్కేల్ ఉద్యోగులందరితో సమానంగా తమను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం సరైంది కాదని, దీనిపై తాము కోర్టుకు వెళతామని వీఆర్వోల సంఘాలు చెపుతున్నాయి. -
‘మెజిస్ట్రేట్లు జిల్లా జడ్జీలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హులు కారు’
న్యూఢిల్లీ: మెజిస్ట్రేట్లు, సివిల్ జడ్జీలు తదితర న్యాయ వ్యవస్థలోని దిగువ విభాగానికి చెందిన వారు జిల్లా జడ్జీల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హులు కారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న కాలంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలుగా విధుల్లో చేరిన జ్యూడీషియల్ అధికారులు.. మళ్లీ తమ పాత హోదాకు తిరిగివెళ్లాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్లు, సివిల్ న్యాయమూర్తులు మెరిట్‌తో, సీనియారిటీతో పదోన్నతుల ద్వారా కానీ, లిమిటెడ్ కాంపిటీటివ్ పరీక్ష ద్వారా కానీ జిల్లా జడ్జీలుగా నియామకం కావచ్చని పేర్కొంది. సాధారణంగా ఏడేళ్ల పాటు వరుసగా న్యాయవాద వృత్తిలో కొనసాగినవారు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలు అయ్యేందుకు అర్హులవుతారు. జ్యూడీషియల్ అధికారులుగా విధుల్లో చేరకముందు, ఏడేళ్ల వరుస సర్వీసు ఉన్నప్పటికీ.. వారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలు అయ్యేందుకు అర్హులు కాబోరని ధర్మాసనం స్పష్టం చేసింది. జిల్లా జడ్జీల నియామకానికి సంబంధించిన ఆర్టికల్ 233కి ధర్మాసనం వివరణ ఇచ్చింది. -
ఆ ధర్నాలతో మాకు సంబంధం లేదు
పెదపూడి (అనపర్తి): సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాకు, 20వ తేదీన చలో విజయవాడలో భాగంగా నిర్వహించే ధర్నాకు ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అసోసియేషన్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆ అసోసియేషన్ రాష్ట్ర కనీ్వనర్ కె.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తమకు అపారమైన నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని నవరత్నాల ఉద్యోగుల మేనిఫెస్టోలో ప్రకటించారన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి తమకు ఇచ్చిన హామీ నెరవేరుస్తారనే నమ్మకం ఉందన్నారు. తమ అసోసియేషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ధర్నాలు చేయడం లేదని, ఆ ధర్నాలకు దూరంగా ఉందని ఆయన తెలిపారు. -
గ్రూప్–1,3,4 పోస్టులను భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సుమారు 45 వేల గ్రూప్–1, 3, 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాల ని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఇచ్చే పోస్టులను ఆయా శాఖల ఉన్నతాధికారులతో భర్తీ చేయటం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల లో ఒకే వార్డెన్ రెండు మూడు హాస్టళ్లకు ఇంచార్జిగా ఉంటున్నారని, దీంతో వాటి నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని పేర్కొన్నారు. -
జూనియర్ సివిల్ జడ్జిలకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో పనిచేస్తున్న పలువురు జూనియర్ సివిల్ జడ్జిలకు సీనియర్ సివిల్ జడ్జిలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో 29 మంది జూనియర్ సివిల్ జడ్జిలు ఉన్నారు. 23 జూనియర్ సివిల్ జడ్జిల పోస్టులకు ఉమ్మడి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 19 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 4 పోస్టులను రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 28 తరువాత హైకోర్టు వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. -
ప్రత్యక్ష నియామకాలే!
విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై సర్కారు యోచన ►వెయిటేజీ మార్కులు 20 నుంచి 40కి పెంచేందుకు చర్యలు ►విధివిధానాల రూపకల్పన బాధ్యత ట్రేడ్ యూనియన్లకు ►ఇదే అదునుగా కొన్ని సంఘాల నేతల వసూళ్ల దందా సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు న్యాయపర చిక్కులు తలెత్తనున్నాయా? వారిని నేరుగా క్రమబద్ధీకరించేందుకు అవకాశం లేదా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి రాష్ట్ర ప్రభు త్వవర్గాలు. నేరుగా క్రమబద్ధీకరిం చేందుకు అవకాశం లేనందున.. ప్రత్యక్ష నియామకాల (డైరెక్ట్ రిక్రూట్మెంట్) ప్రకటన ద్వారా వారికి ఉద్యోగావకాశం కల్పించడం ఒక్కటే మార్గమ ని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరిని దశల వారీగా క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ గత నెలలో అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణ విధివిధా నాలను రూపొందించి వచ్చే ఏడాది మార్చి లోగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. సీఎం నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో సుమారు 21 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల్లో ఆశలు రేకెత్తాయి. అయితే ఆ ఉద్యోగుల క్రమబద్ధీ కరణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అడ్డుగా మారనున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రత్యక్ష నియామకాల ప్రక్రియ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తు న్నట్లు సమాచారం. ప్రత్యక్ష నియామక ప్రక్రి య ద్వారా పోస్టుల భర్తీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 20 వెయిటేజీ మార్కు లను ఇచ్చేందుకు కోర్టు తీర్పులు అనుమతి స్తున్నాయి. వెయిటేజీ మార్కులను 20 నుంచి 40కు పెంచాలని, దీంతో పోస్టులన్నీ ఔట్ సోర్సింగ్ అభ్యర్థులకే దక్కుతాయని ప్రభు త్వం వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నట్లు తెలి సింది. ఈ మేరకు వేయిటేజీ మార్కుల పెంపు నకు సంబంధిం చిన నిబంధనలను సవరించే అవకాశాలపై పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యక్ష నియామకాల ప్రకటన ద్వారా నిరుద్యోగులందరి నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని, అదనపు వెయిటేజీ మార్కు లతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మాత్రమే భర్తీ చేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు సుప్రీం మార్గదర్శకాల ప్రకారం మరో విధానాన్ని అనుసరిస్తే 50 శాతం పోస్టు లను తాత్కాలిక ఉద్యోగులతో భర్తీ చేసేందుకు వీలుందని, మిగిలిన 50 శాతం పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ 21 వేల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం 42 వేల పోస్టులను భర్తీ చేయాల్సి రానుండడంతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేసే అవకాశం లేదు. సంఘాల వసూళ్ల దందా.. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విధివిధానాల తయారీ బాధ్యతను ట్రాన్స్‌కో యాజ మాన్యం ట్రేడ్ యూనియన్లకు అప్పగిం చింది. విధివిధానాలు రూపొందించు కుని రావాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్స్ ఫెడరేషన్(టఫ్)కు లేఖ ఇచ్చింది. దీన్నే అవకాశంగా భావించిన కొన్ని సంఘాలు క్రమబద్ధీకరణ పేరుతో ఔట్ సోర్సింగ్ కార్మికుల నుంచి వసూళ్ల దందాకు తెరలేపాయి. తమ యూనియన్లలో సభ్యత్వం ఉంటేనే క్రమబద్ధీకరణకు అవకాశముందని పేర్కొంటూ కార్మికుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారు. సభ్యత్వ రుసుం పేరుతో కొన్ని యూనియన్లు ఒక్కో కార్మికుడి నుంచి రూ.350 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలోని 21 వేల మందికి పైగా ఔట్సోర్సింగ్ కార్మికులు ఉండడంతో మొత్తం వసూళ్లు రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటాయని ఓ కార్మిక నేత అభిప్రాయపడ్డారు. -
టీచర్లకూ గ్రేడింగ్
పనితీరు సూచికల ఆధారంగానే పదోన్నతులు డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా హెచ్ఎం, ఎంఈవో పోస్టులు అమలుకు చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశించిన కేంద్రం ఆ దిశగా రాష్ట్రంలోనూ చర్యలకు విద్యాశాఖ కసరత్తు వచ్చే విద్యా సంవత్సరంలో పక్కాగా అమలు సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు కూడా పనితీరు సూచికలు (పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఉపాధ్యాయుల బోధన తీరు ఎలా ఉంది? విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తున్నారా? తదితర అంశాలపై ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేయనున్నారు. అంతేకాదు విద్యార్థులు ఏం నేర్చుకున్నారన్న దాన్ని పరీక్షించేందుకు లెర్నింగ్ ఇండికేటర్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులకు పని తీరు సూచికలు ఇవ్వాలని ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో విద్యాశాఖ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. విద్యా బోధనపై దృష్టి పెట్టని టీచర్లు పాఠశాలల్లో విద్యా బోధన ఎలా సాగుతుందన్న అంశంపై గతంలో విద్యాశాఖ రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అంతర్గత సర్వే నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం బోధన సరిగ్గా జరగడం లేదన్న నిర్ణయానికి వచ్చింది. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా ఉపాధ్యాయులు పుస్తకాల్లోని ముందుమాట చదివి బోధన చేపట్టాల్సి ఉంటుంది. కాని వాటిని చదివి అర్థం చేసుకొని పాఠాలు బోధిస్తున్న వారు 20 శాతం మంది మాత్రమే ఉన్నట్లు అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో పనితీరు సూచికలు ప్రవేశ పెట్టాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చింది. ప్రతిభ, జవాబుదారీతనం ఆధారంగా పదోన్నతుల్లో ప్రాధాన్యం టీచర్ల ప్రతిభా ప్రదర్శన, జవాబుదారీతనం ఆధారంగా పదోన్నతులు, బదిలీల్లో ప్రాధాన్యం కల్పించాలని భావిస్తోంది. దీనికోసం అవసరమైన నియమావళి రూపకల్పనపై దృష్టి పెట్టింది. అంతేకాదు ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో పోస్టులను డెరైక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ విధానం కర్ణాటకలో అమల్లో ఉంది. ప్రధానోపాధ్యాయులకు పాఠశాల నిర్వహణ, నాయకత్వంలో సర్టిఫికెట్ కోర్సును ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. కొత్తగా టీచర్లుగా నియమితులైన వారు పాఠశాలల్లో విధుల్లో చేరడానికంటే ముందే ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో వారికి ఆరు నెలల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వాలని భావిస్తోంది. పనితీరు అంచనాలో పరిగణనలోకి తీసుకునే ప్రధాన అంశాలు - తరగతి గదిలో పాఠ్యాంశాల బోధనకు ముందు ఏం చేయాలి. ఏం చేస్తున్నారు? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. - పిల్లల ప్రగతి వివరాలను తెలుసుకొని తగిన చర్యలు చేపట్టేందుకు ఆన్లైన్ మానిటరింగ్ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దానిద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి తక్షణ చర్యలు చేపడతారు. - టీచర్లకు సబ్జెక్టుపై, సోపానాల ప్రకారం బోధించడంపై శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. - ప్రతి నెలా సబ్జెక్టుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వృత్తి పరమైన నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేస్తారు. -
కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ఆందోళన
పశ్చిమగోదావరి(ఏలూరు): తమను శ్రమ దోపిడీ చేస్తున్నారంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్ఏ)లు శుక్రవారం ఆందోళనకు దిగారు. తహశీల్దార్ కార్యాలయంలో డ్రైవర్‌గా, అటెండర్‌గా, ఇసుకరీచ్‌లలో, కాలువల దగ్గర కాపలాదారుడిగా నిబంధనలకు విరుద్ధంగా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని తెలిపారు. రిక్రూట్ మెంట్ ద్వారా వచ్చిన తాము పార్ట్ టైమ్ ఉద్యోగమని జాయిన్ అయ్యామని, గౌరవవేతనం కూడా ఆలస్యంగా చెల్లిస్తూ మా బతుకు భారమయ్యేలా చేస్తున్నారని ప్రభుత్వం మీద మండి పడ్డారు. స్పష్టమైన పనివేళలు నిర్ణయించాలని లేదా పుల్టైమ్ ఉద్యోగులుగా గుర్తించి మాకూ పేస్కేల్ వర్తింపజేయాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం 2012, 2014లలో డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వీఆర్ఏలను పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా తీసుకుంది.