కలెక్టరేట్ వద్ద వీఆర్‌ఏలు ఆందోళన
పశ్చిమగోదావరి(ఏలూరు): తమను శ్రమ దోపిడీ చేస్తున్నారంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్‌ఏ)లు శుక్రవారం ఆందోళనకు దిగారు. తహశీల్దార్ కార్యాలయంలో డ్రైవర్‌గా, అటెండర్‌గా, ఇసుకరీచ్‌లలో, కాలువల దగ్గర కాపలాదారుడిగా నిబంధనలకు విరుద్ధంగా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని తెలిపారు. రిక్రూట్ మెంట్ ద్వారా వచ్చిన తాము పార్ట్ టైమ్ ఉద్యోగమని జాయిన్ అయ్యామని, గౌరవవేతనం కూడా ఆలస్యంగా చెల్లిస్తూ మా బతుకు భారమయ్యేలా చేస్తున్నారని ప్రభుత్వం మీద మండి పడ్డారు.
స్పష్టమైన పనివేళలు నిర్ణయించాలని లేదా పుల్‌టైమ్ ఉద్యోగులుగా గుర్తించి మాకూ పేస్కేల్ వర్తింపజేయాలని వీఆర్‌ఏలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం 2012, 2014లలో డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వీఆర్‌ఏలను పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా తీసుకుంది.