ఉభయ రాష్ట్రాల్లో పనిచేస్తున్న పలువురు జూనియర్ సివిల్ జడ్జిలకు సీనియర్ సివిల్ జడ్జిలుగా పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో పనిచేస్తున్న పలువురు జూనియర్ సివిల్ జడ్జిలకు సీనియర్ సివిల్ జడ్జిలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో 29 మంది జూనియర్ సివిల్ జడ్జిలు ఉన్నారు. 23 జూనియర్ సివిల్ జడ్జిల పోస్టులకు ఉమ్మడి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందులో 19 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, 4 పోస్టులను రిక్రూట్‌మెంట్ బై ట్రాన్స్‌ఫర్ ద్వారా భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 28 తరువాత హైకోర్టు వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.