కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన జూనియర్‌ సివిల్‌ జడ్జి | Nizamabad Junior Civil Judge Enrolls Daughter in Government School | Sakshi
Sakshi News home page

కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన జూనియర్‌ సివిల్‌ జడ్జి

Published Thu, Jun 16 2022 4:45 PM | Last Updated on Thu, Jun 16 2022 4:45 PM

Nizamabad Junior Civil Judge Enrolls Daughter in Government School - Sakshi

కొంత మంది ఆదర్శాలు వల్లిస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఆదర్శాలను ఆచరించి చూపిస్తుంటారు. ఈ కోవకే చెందుతారు నిజామాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి. తమ గారాలపట్టిని సర్కారుబడిలో చేర్చి శభాష్‌ అనిపించుకున్నారు.

ఖలీల్‌వాడి : నిజామాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌ కుమార్‌ జాదవ్, ప్రియాంక జాదవ్‌ దంపతులు తమ అయిదేళ్ల కుమార్తె అంబికా జాదవ్‌ను చంద్రశేఖర్‌ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో బుధవారం చేర్పించి ఆదర్శంగా నిలిచారు. 

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంగోపాల్‌ రెడ్డి  మాట్లాడుతూ ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నవారు ప్రభుత్వ పాఠశాలల్లో తమ సంతానాన్ని చేర్పిస్తే స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. (క్లిక్‌: నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement