nizamabad city
-
పసుపు బోర్డు.. ఎంపీ అర్వింద్‌పై కవిత సెటైర్లు
నిజామాబాద్ : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి చాటు బిడ్డంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేశారు. బీఆర్ఎస్ చేసిన కృషి వల్లే నిజామాబాద్‌లో పసుపు బోర్డ్ ప్రారంభమైందని కవిత అన్నారు.జనవరి 16న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లతో కలిసి నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించారు.పసుపు బోర్డ్ ప్రారంభ కార్యక్రమంపై ఎమ్మెల్సీ కవిత ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం. ప్రారంభ కార్యక్రమంపై మాకు అభ్యంతరం ఉంది. పసుపు బోర్డ్ ప్రారంభోత్సవం ఒక పార్టీ కార్యక్రమంలా ఉంది. మేం స్థానిక ప్రజా ప్రతినిధులం. మాకు ఆహ్వానాలు అందలేదు. 2014 నుంచి 2018 వరకూ పసుపు బోర్డు కోసం నేను పార్లమెంట్ వేదికగా పోరాటం చేశాను. పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు ఏర్పాటు కాకపోతే దిగుమతులు ఆపాలి. రూ. 15 వేల మద్దతు ధర పసుపు రైతులకు ఇవ్వాలి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెల్పూరులో ఉన్న 40 ఎకరాల స్పైసెస్ బోర్డు స్థలంలో పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.జక్రాన్ పల్లి వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్ ఎయిర్ పోర్ట్ తీసుకురావాలి. కంబోడియా మలేషియా లాంటి దేశాల నుంచి తక్కువ క్వాలిటీ ఉన్న పసుపు దిగుమతులు అవుతున్నాయి.. ఇంకా డబుల్ అయ్యింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను రెండు సార్లు కలిశాను. బోర్డుతో పాటు మద్దతు ధర ఉంటేనే రైతుకు న్యాయం జరుగుతుందని గతం నుంచి డిమాండ్ చేస్తున్నాను. ధర్మపురి అరవింద్ తండ్రి చాటు కొడుకుగా ఉండే వారు. అలాంటి వ్యక్తి తన వల్లే పసుపు బోర్డు వచ్చిందనడం హాస్యాస్పదం. స్పైసెస్ రీజినల్ కార్యాలయం తీసుకొచ్చి ఆనాడు తాను అంబాసిడర్ కారు అడిగితే ప్రధాని మోదీ బెంజ్ కారు ఇచ్చారని అన్నారు. మరి ఇప్పుడు ఏం అంటారు. పసుపు బోర్డు ఒక్కటే కాదు త్రిముఖ వ్యూహం ఉండాలి’ అని కవిత సూచించారు. -
కొత్త వంగడాలు, మార్కెట్ సేవలు అందుబాటులోకి : గంగారెడ్డి
-
నిజామాబాద్ మేయర్ భర్త చంద్రశేఖర్‌పై దాడి
-
అమ్మా.. నాన్నా అంత భారమయ్యానా..
తల్లిదండ్రుల నిర్లక్ష్యం అభంశుభం తెలియని బాలుడికి శాపంగా మారింది. అమ్మానాన్నల సంరక్షణలో ఆనందంగా గడవాల్సిన బాల్యం.. ఎవరూ లేని అనాథలా వెక్కిరించింది. కనిపెంచిన పేగుబంధమే.. వదిలించుకోవాలని చూసింది.. అన్నీతానై వ్యవహరించాల్సిన తండ్రి తనకేం సంబంధం లేదు.. అన్నట్లుగా వ్యవహరించాడు. ఫలితంగా మూడేళ్ల పాటు ట్రస్టులో ఆశ్రయం పొంది, రెండు రోజుల క్రితమే సొంతూరు చేరుకున్న ఓ బాలుడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దోమ: మండల కేంద్రానికి చెందిన బొక్క బాబు, యాదమ్మ దంపతులకు భరత్ అనే కు ఏడేళ్ల కుమారుడున్నాడు. అన్యోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలో అనుకోని కలహాలు చెలరేగాయి. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న యాదమ్మ కొడుకును నీవద్దే పెంచుకో.. అని భర్తకు సూచించింది. ఇందుకు బాబు అంగీకరించలేదు. చేసేదేమి లేక ఎనిమిదేళ్ల భరత్‌ను తీసుకుని బతుకుదెరువు కోసం బయలుదేరింది. హైదరాబాద్ చేరుకుని రెండేళ్ల పాటు కూలీనాలీ పనులు చేసుకుంటూ కొడుకును సాకింది. ఆతర్వాత విజయవాడకు చేరుకుంది. ఈ సమయంలో ఆ తల్లి హృదయం పాశానంగా మారింది. నాకే దిక్కు లేదు.. వీడిని ఎలా చూసుకోవాలి అనుకుందో ఏమో.. పదేళ్ల పసి బాలుడిని వదిలించుకోవాలని డిసైడైంది. విజయవాడ రైల్వే స్టేషన్లో కొడుకును వదిలేసి, తన దారిన తాను వెళ్లిపోయింది. అమ్మ జాడ తెలియక వెక్కివెక్కి ఏడుస్తున్న ఆ బాలుడు భయంభయంగా రైల్వే స్టేషన్‌లోని ఓ మూలన కూర్చుండిపోయాడు. ఏడ్చిఏడ్చి కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి.. అమ్మకు ఏమైందో..? ఎటు వెళ్లిపోయిందో తెలియని పరిస్థితి. ఏవైపు నుంచి వస్తుందోనని ఆత్రుతగా చూడటమే తప్ప.. అమ్మ రాలేదు.. ఏడుపు ఆగలేదు. ఇది గమనించిన ప్రయాణికులు స్టేషన్లో ఓ బాలుడు ఒంటరిగా ఏడుస్తున్నాడని విజయవాడ చైల్డ్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి.. మీది ఏ ఊరు, మీ అమ్మానాన్నల పేర్లు ఏంటి అని ప్రశ్నించినా.. బాలుడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చిన్నారిని తీసుకెళ్లిన చైల్డ్‌లైన్ సిబ్బంది విజయవాడలోని ఎస్కేవీ ట్రస్ట్‌లో చేర్పించారు. ఇది జరిగి మూడేళ్లు గడిచింది. ఈ మధ్యకాలంలో ట్రస్టు ప్రతినిధులు ఎన్నిసార్లు అడిగినా భరత్ మాత్రం తన ఊరు, తల్లిదండ్రుల వివరాలు చెప్పలేదు. వారం రోజుల క్రితం భరత్‌తో మాట్లాడిన ట్రస్టు సభ్యులకు.. వికారాబాద్ దగ్గర దోమ గ్రామమని చెప్పాడు. దీంతో పూర్తి వివరాలు తెలుసుకున్న ట్రస్టు ప్రతినిధులు శుక్రవారం బాలుడిని తీసుకుని దోమకు చేరుకున్నారు. కన్నకొడుకు తిరిగొచ్చినా.. ప్రస్తుతం భరత్ వయసు పదమూడేళ్లు.. ఐదేళ్ల తర్వాత కన్నకొడుకును చూసిన ఆ తండ్రిలో ఏమాత్రం చలనం కనిపించలేదు. భార్య, కొడుకు ఇంటినుంచి వెళ్లిపోయిన రోజునుంచి ఒక్కసారి కూడా వారిని వెతికే ప్రయత్నం చేయలేదు. కనీసం వారు బతికే ఉన్నారా..? లేదా..? అనే సమాచారం కూడా తెలియదు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లోనూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఇవన్నీ పక్కన పెట్టినా.. నా కొడుకు తిరిగొచ్చాడు.. అని బాలుడిని చేరదీయలేదు.. ముద్దాడలేదు. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు బాబుకు సర్దిచెప్పి.. భరత్‌ను అప్పగించారు. దీంతో తప్పదు అన్నట్లు కొడుకును దగ్గరకు తీసుకున్నాడు. తన దారిన వెళ్లిపోయిన తల్లి కుటుంబ కలహాలతో భర్తకు దూరమై, కొడుకును వదిలేసిన యాదమ్మ తనదారి తాను చూసుకుంది. ఆమె ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నట్లు తెలిసింది.ప్రశ్నార్థకంగా మారిన భవిష్యత్ అటు తల్లి దూరమై.. ఇటు తండ్రి ఆలనాపాలనా కరువైన భరత్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక నాయకులు, ఎస్కేవీ ట్రస్ట్ ప్రతినిధుల సహకారంతో బాలుడిని వికారాబాద్‌లోని గురుకుల పాఠశాలలో చేర్పించారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ముందుకు వచ్చి భరత్ బాధ్యతలు తీసుకోవాలని, లేదా ప్రభుత్వం తరఫున చేయూత అందేలా చూడాలని సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి, గ్రామస్తులు కోరారు. బాగా చదువుకుంటానా చిన్నప్పుడు అమ్మానాన్నా నన్ను బాగా చూసుకునేవారు. ఇప్పుడు వారికి నాపై ఎలాంటి ప్రేమ లేదు. ఇద్దరూ నన్ను దూరం పెట్టేందుకే ప్రయతి్నస్తున్నారు. అమ్మ నన్ను వదిలి వెళ్లిన రోజు గుర్తొస్తేనే భయమేస్తోంది. చైల్డ్‌లైన్ వారు వచ్చి వివరాలు అడిగినా భయంతో ఏమీ చెప్పలేకపోయా. ఇప్పుడు కొంత ధైర్యం వచ్చి నా వివరాలు తెలియజేశా. దీంతో నన్ను నాన్న దగ్గరకు తీసుకువచ్చారు. కానీ ఆయనేమో నన్ను ఆదరించడం లేదు. అందరూ వచ్చి వికారాబాద్‌లోని రెషిడెన్షియల్ పాఠశాలలో చేర్పించారు. ఇకనుంచి బాగా చదువుకునేందుకు ప్రయతి్నస్తా. – భరత్‌కుమార్ -
పెళ్లి విందులో మటన్ ముక్కల లొల్లి!
పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరఫు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో బుధవారం చోటుచేసుకుంది. నవీపేట: మండల కేంద్రంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన పెళ్లి విందులో ఇరు వర్గాలకు చెందిన కొందరు పరస్పర దాడులకు పాల్పడడంతో 19 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు. భోజనం చేస్తున్న సమయంలో ఒక వర్గానికి చెందిన వారికి సరిగ్గా వడ్డించడం లేదని మరో వర్గానికి చెందిన వ్యక్తులతో ఘర్షణకు దిగారు. ఘర్షణ ముదిరి కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులకు ఫంక్షన్ హాల్‌కు చేరుకుని శాంతింపజేశారు. పలువురిపై కేసు నమోదు చేశారు. -
ఏసీబీ వలలో మున్సిపల్ అధికారి.. కళ్ళు చెదిరిపోయేలా నోట్ల కట్టలు
సాక్షి, నిజామాబాద్: అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ గుబులు పుట్టిస్తోంది. తాజాగా నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్, రెవెన్యూ అధికారి దాసరి నరేందర్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో గుట్టలుగా ఉన్న నోట్ల కట్టల్ని గుర్తించారు. మొత్తం రూ. 6.70 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సోదాల్లో రూ.2కోట్ల 93లక్షల 81వేల నగదు, నరేందర్ బ్యాంకు ఖాతాల్లో రూ. కోటి 10 లక్షల నగదు, అరకిలో బంగారు ఆభరణాలు, 1కోటి 98 లక్షల విలువ చేసే ఆస్తుల్ని సీజ్ చేశారు. మొత్తం 6కోట్ల 7లక్షల విలువగల ఆస్తుల గుర్తించారు. ఆదాయం మించిన ఆస్తుల కేసులో నరేందర్‌పై కేసు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మున్సిపల్ అధికారి నరేందర్ బంధువుల ఇళ్ళలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. నరేందర్‌ను అరెస్ట్ చేసిన అధికారులు హైదారాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేందుకు తరలించారు.ACB Seizes Crores in Cash During Raid on Nizamabad Municipal SuperintendentIn a significant operation by the Anti-Corruption Bureau (ACB), a staggering amount of cash and assets were uncovered during a raid on the residence of Dasari Narendar, the Superintendent and in-charge… pic.twitter.com/oJa4hrfUv7— Sudhakar Udumula (@sudhakarudumula) August 9, 2024 -
నిజామాబాద్ : ఘనంగా ఖిల్లా శారదాంబ గద్దె ఊరేగింపు (ఫొటోలు)
-
ప్లాన్ ప్రకారమే ఎత్తుకెళ్లాడు.. తండ్రి రోదన..
-
అర్ధరాత్రి ఆసుపత్రిలో పిల్లాడిని ఎత్తుకెళ్లిన దుండగులు
-
మంది మాటలు వినే..! పిన్ని, అన్నల కొత్త డ్రామానా..?
-
పోలీసులకు సెల్ఫీ వీడియో పంపి నవ దంపతుల ఆత్మహత్య
-
పోరాడు, భయపడకు అని నేర్పింది నాన్నే: ఎంపీ అర్వింద్ భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయారు.కాగా, తన తండ్రి మరణంతో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సందర్భంగా అర్వింద్ తన తండ్రిని తలుచుకుంటూ బావోద్వేగానికి లోనయ్యారు.ఈ క్రమంలో అర్వింద్ సోషల్ మీడియా వేదికగా.. ‘అన్నా అంటే నేనున్నానని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే. పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి, ప్రజల కొరకే జీవించు అని చెప్పారు. నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. నాలోనే ఉంటావు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. -
మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్‌కు అస్వస్థత
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆయన కుమారుడు, బీజేపీ ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తన తండ్రి కోసం దేవుడుని ప్రార్థించాలని అభిమానులను కోరారు.కాగా, ఎంపీ అర్వింద్ ట్విటర్ వేదికగా ప్రకటన చేశారు. యూరినరీ ఇన్ఫెక్షన్ కారణంగా శ్రీనివాస్ అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి కోసం ప్రార్థించాలని అభిమానులను కోరారు. My father, Sri D. Srinivas Garu has been admitted to the ICU of a private hospital due to a urinary tract infection and sodium loss. Please keep him in your thoughts and prayers. pic.twitter.com/6xZtEaP6SN— Arvind Dharmapuri (Modi Ka Parivar) (@Arvindharmapuri) June 1, 2024 -
టెక్నీషియన్ కాదు..కీచకుడు స్కానింగ్ సెంటర్లో ఘోరాలు
-
మహిళల అశ్లీల వీడియోలు సీక్రెట్ గా రికార్డ్...
-
స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లోని ఓ స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ అకృత్యాలు వెలుగు చూశాయి. స్కానింగ్ వచ్చే మహిళలు న్యూడ్ ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. అనేక మంది ఆ కామాంధుని అకృత్యాలకు బలయ్యారు. ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు విషయం వెలుగులోకి వచ్చింది.స్కానింగ్ సెంటర్లో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు.. విచారణ ప్రారంభించారు.నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ యజమాని డాక్టర్ చంద్రశేఖర్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు.. ఆపరేటర్ ప్రశాంత్ స్పై కెమెరాతో ఫొటోస్ వీడియో తీసినట్లు తెలిసిందని బాధితుల ఫిర్యాదుతో ప్రశాంత్‌ను పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. ప్రశాంత్‌ను ఉద్యోగం నుంచి తొలగించామని కూడా చెప్పారు. ప్రశాంత్ అమ్మాయిలతో చాట్ చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డాక్టర్ చంద్రశేఖర్. -
లిఫ్ట్ లో ఇరుక్కుపోయి బ్యాంక్ సెక్యూరిటీ గార్డు
-
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి విలవిలలాడిన సెక్యూరిటీ గార్డు
నిజామాబాద్: కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లో దారుణం చోటుచేసుకుంది.. కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో బుధవారం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి రెండు కాళ్లు బయట బాడీ లోపల ఉండిపోవడంతో గంటకు పైగా ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడు. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ రెండు కాళ్ళు బయట..బాడీ లిఫ్ట్ లో ఇరుక్కుపోడంతో కాళ్లు చేతులు విరిగి కొన ఊపిరి ఉండడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
అంకాపూర్ జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు
-
నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆత్మహత్య
సాక్షి, నిజామాబాద్: సైబర్ మోసగాళ్ల వలలో పడి నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో కలకలం రేపింది. గాయత్రినగర్‌లో ఉండే కన్నయ్యకుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అయితే శనివారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కన్నయ్య కుమార్ గౌడ్ ఫోన్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన ఎన్నికలు అఫిడవిట్ సైతం సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు చెబుతున్నారు. రెండు రోజుల్లో గృహప్రవేశం పెట్టుకున్న కన్నయ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. చదవండి: వారసులకు ‘హోం’ సిక్ -
కేసీఆర్ నాపై ప్రేమ కురిపించారు: ప్రధాని మోదీ
-
మనోహరాబాద్ నుంచి సిద్ధిపేట వరకు కొత్త రైల్వే లైను
-
నిజామాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షో
-
కాసేపట్లో నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన
-
టైగర్ నాగేశ్వరరావులో రేణుదేశాయ్.. ఆ పాత్ర వెనక ఇంత కథ ఉందా?
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ దాదాపు 20 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతోంది. మాస్ మహారాజా మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావులో కీలక పాత్రలో నటిస్తోంది. 1970లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గుంటూరులోని స్టువర్టుపురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. వంశీకృష్ణనాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నటి రేణు దేశాయ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు ఆడియన్స్ నుంచి భారీ క్రేజ్ వస్తోంది. ఈ మూవీలో ఆమె హేమలత లవణం అనే పాత్రను పోషిస్తోంది. హేమలత లవణం ఎవరంటే? ఈ చిత్రంలో రేణు దేశాయ్ పోషిస్తున్న పాత్ర పట్ల ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆమె క్యారెక్టర్ వెనక ఉన్న అసలు సంగతేంటో తెలుసుకుందాం. అసలు ఆ పేరు ఎవరిదీ? అంత ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్‌ను రేణుదేశాయ్ పోషించడంతో అభిమానులు సైతం నెట్టంట ఆరా తీస్తున్నారు. ఈ చిత్రంలోని హేమలత లవణం ఎవరు? అసలు ఆమె ఎవరో వివరాలు తెలుసుకుందాం. హేమలత లవణం జీవితం హేమలత గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన తెలుగు కవి గుర్రం జాషువా, మరియమ్మ దంపతులకు 1932 ఫిబ్రవరి 26న జన్మించింది. ఆమె తన విద్యనంతా గుంటూరులో సాగింది. మద్రాసు క్వీన్స్ కళాశాలలో బీఏ చదివి బంగారు పతకాన్ని పొందింది. ఆ తర్వాత గోపరాజు రామచంద్రరావు కుమారుడు గోపరాజు లవణంతో ఆమెకు వివాహం జరిగింది. అయితే అప్పట్లో వర్ణ వివక్షను ఎదురించి చేసుకున్న ఆమె వివాహం అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఆమె వినోబా భావే భూదాన యాత్రలో చంబల్ లోయలో పర్యటించి బందిపోటు దొంగల్లో మానసికంగా పరివర్తన తెచ్చేందుకు కృషిచేసింది. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో ఆర్థిక సమతా మండలి అనే సేవా సంస్థను స్థాపించి వెనుకబడిన, దిగువ కులాల చైతన్యం కోసం పలు కార్యక్రమాలు చేపట్టింది. 1981లో కావలిలో నవవికాస్ అనే సంస్థను స్థాపించి అణగారినవర్గాలను ఆదుకుంది. (ఇది చదవండి: బెంగళూరులో విషాదం.. మహిళ ప్రాణాలు తీసిన నటుడు!) జోగిని వ్యవస్థపై పోరాటం అప్పట్లో మహిళల జోగిని వ్యవస్థపై పోరాటం చేసింది. జోగినులను, వారి పిల్లలను కాపాడేందుకు 'సంస్కార్' చెల్లి నిలయం అనే సంస్థలు ఏర్పాటు చేసింది. 'బాణామతి' లాంటి గుడ్డి నమ్మకాలతో మహిళల జీవితాలను ధ్వంసం చేస్తోన్న వాటికి వ్యతిరేకంగా పోరాడింది. రెండు వేలకు పైగా జోగినులను సంస్కరించడమేకాక.. ప్రభుత్వం చేత వారికి పొలాలు ఇప్పించింది. అంతే కాకుండా జోగినులకు వివాహాలు కూడా చేసింది. సంస్కార్ సంస్థను స్థాపించి.. నిజామాబాదు జిల్లాలోని జోగినీ వ్యవస్థ నిర్మూలనకు హేమలత లవణం చేసిన కృషి ఫలితంగానే.. అప్పటి ఎన్టీ రామారావు ప్రభుత్వం జోగినీ వ్యవస్థ నిర్మూలణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత వర్ణ, మతాంతర వివాహాలను ప్రోత్సహించింది. బాలికల కోసం నిజామాబాద్ జిల్లా గాంధారి గ్రామంలో ప్రత్యేక పాఠశాల నిర్మించింది. చైల్డ్ ఎట్ రిస్క్ పేరుతో వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన వారి పిల్లల కోసం సంస్కరణ కేంద్రం స్థాపించింది. ప్రస్తుతం తెరకెక్కుతోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రేణుదేశాయ్ ఆమె పాత్రనే పోషిస్తోంది. ఈ సినిమాలో జోగినిల సంక్షేమం కోసి కృషి చేసిన హేమలత లవణం చరిత్రనే తెరపై చూపించనున్నారు. కాగా.. రేణు దేశాయ్ నటిస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 3న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతమందిస్తున్నారు.