ఆడ శిశువు అని వదిలివెళ్లారు! | girl child left at hospital | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 9 2017 12:17 PM | Last Updated on Sat, Dec 9 2017 12:17 PM

girl child left at hospital

నిజామాబాద్: ఆడ శిశువు పుట్టిందని వదిలించుకున్నారు. ఎక్కడో ప్రసవిస్తే తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్పత్రి గడపలో వదిలివెళ్లారు. ఈ సంఘటన నిజామాబాద్‌ నగరంలో వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రవేశ మార్గం వద్ద శనివారం ఉదయం వదిలి వెళ్లారు. అయితే ఆస్పత్రి సిబ్బంది, రోగులు ఆ శిశువును గమనించి ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. ఈ శిశువు వేరే ఆస్పత్రిలో జన్మించినట్లు ప్రభుత్వాస్పత్రి అధికారులు గుర్తించారు. శిశువును ఎవరు వదిలివెళ్లారనే దానిపై ఆరా తీస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement