
టీఆర్‌ఎస్ నేత, తాజా మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
నిజామాబాద్: దేశంలో లౌకిక పార్టీ ఏదన్నా ఉందంటే అది టీఆర్‌ఎస్ మాత్రమేనని డిప్యూటీ సీఎం, టీఆర్‌ఎస్ నేత మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మహమూద్ అలీ విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ కోసం 29 పార్టీల మద్ధతు కూడగట్టిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో మైనార్టీ సంక్షేమాన్ని విస్మరించారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ కష్టాలు తప్పవని చెప్పిన అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాటలు తప్పు అని నిరూపించామని అన్నారు.
తెలంగాణాను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌దేనని నొక్కి వక్కాణించి చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలవదని అన్నారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపు కోసం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, దీనిపై టీఆర్‌ఎస్ ఎంపీలు 12 రోజుల పాటు పార్లమెంటులో పోరాటం కూడా చేశారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment