mahamood ali
-
కానిస్టేబుల్ చెంపచెల్లుమనిపించిన హోంమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయిన హోంమత్రి.. తన వ్యక్తిగత సహాయకుడు, గన్‌మెన్ అయిన కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేటల డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. నేడు మంత్రి తలసాని జన్మదినం సందర్భంగా మంత్రి మహమూద్ అలీ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో బోకే ఎక్కడ అంటూ తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. అయితే బోకే గురించి తెలియదని సిబ్బంది చెప్పడంతో సహనం కోల్పోయిన హోంమంత్రి మహమూద్ అలీ కానిస్టేబుల్‌ను చెంప దెబ్బ కొట్టారు. దీంతో షాక్ అయిన సదరు గన్‌మెన్ మంత్రిని అలాగే చూస్తుండిపోయారు. ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ క్రమంలో మంత్రి తలసాని.. మహమూద్ అలీకి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. తరువాత వెనకాల ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహమూద్ అలీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోంమంత్రి అయినంత మాత్రాన సిబ్బందిపై ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Telangana Home Minister Mahamood Ali raises his hand on security for not bringing a bouquet to greet Minister Talasani Srinivas Yadav on his birthday pic.twitter.com/PDUFNcdUnP — Naveena (@TheNaveena) October 6, 2023 -
బీజేపీ శాపం.. కాంగ్రెస్ పాపం..కేసీఆర్ దీపం: హరీశ్
గజ్వేల్: ’’తెలంగాణకు రూపాయి ఇయ్య.. ఏం చేసుకుంటావో చేసుకో అన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఇయ్యాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి గురువు, ఉచిత కరెంట్ వద్దన్న చంద్రబాబు రేవంత్‌రెడ్డికి గురువు. దీపం లాంటి కేసీఆర్ ఉండగా.. తెలంగాణ ద్రోహుల చుట్టూ తిరుగుతున్న శాపం లాంటి బీజేపీ, పాపం లాంటి కాంగ్రెస్ మనకెందుకు..?’’ అని మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో హోంమంత్రి మహ మూద్ అలీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగం ఉసురుపోసుకున్న బీజేపీ, మూడు గంటలే కరెంటు చాలంటున్న కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. అసెంబ్లీలో తెలంగాణకు నిధులివ్వరా? అని అప్పట్లో తాను ప్రశ్నిస్తే ఒక్క రూపాయి ఇయ్య...ఏం చేస్తారో చేసుకోండి అన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని కిషన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోయి మరిచి ముఖ్య అతిథిగా ఆహ్వానించారని మండిపడ్డారు. కిరణ్, బాబు కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడతారా? తెలంగాణను రాచి రంపాన పెట్టి, ఈ ప్రాంతానికి కరెంట్, నీళ్లు ఇయ్యకపోగా.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నేడు రేవంత్‌రెడ్డికి గురువు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన కిరణ్, చంద్రబాబు కాళ్ల దగ్గర ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా..? ఇది సిగ్గుచేటు అంటూ వ్యా ఖ్యానించారు. చంద్రబాటు ఇటీవల తెలంగాణపై ప్రేమ చూపినట్లు మాట్లాడు తున్నారని, అదీ ఏపీ సీఎం జగన్‌పై కోపంతో మాత్రమేనని, నిజంగా ఆయనకు తెలంగాణపై ప్రేమ లేదని, ముమ్మాటికీ ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి అని పునరుద్ఘాటించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్: బాలిక అత్యాచార ఘటనపై స్పందించిన హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: బాలిక అత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. కచ్చితంగా నిందితులపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పోలీసులకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. కేటీఆర్ ట్వీట్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో అత్యాచార ఘటన వార్తలు చూసి షాక్ గురయ్యానన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హోదాతో సంబంధం లేకుండా నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని అన్నారు. నిస్పక్షపాత విచారణ జరిపించాలన్నారు. ఇద్దరు అరెస్ట్ కాగా జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌కు వెళ్లిన 17 ఏళ్ల బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు చేశారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: బాలిక అత్యాచారం కేసు.. పోలీసుల అదుపులో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు -
సైదాబాద్ ఘటన: రూ. 20 లక్షలు చెక్కును తిరస్కరించిన బాధిత కుటుంబం
హైదరాబాద్: సైదాబాద్ బాలిక ఘటన పట్ల రోజురోజుకు ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. చిన్నారిని హత్య చేసిన దుర్మార్గుడి కోసం పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. కాగా, బాధిత కుటుంబానికి తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్ముద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్‌లు గురువారం రూ. 20 లక్షల చెక్కును ఇచ్చారు. అయితే, మంత్రులు ఇచ్చిన చెక్కును బాధిత కుటుంబం తిరస్కరించింది. ‘మాకు చెక్ వద్దు.. ఆ దుర్మార్గుడిని ఉరితీయాలని’ వేడుకున్నారు. మంత్రులు ఇచ్చిన చెక్కును మీడియా ముఖంగా తిరిగి ఇచ్చేస్తామని బాలిక తండ్రి తెలిపారు. దీనిపై చిన్నారి తండ్రి.. తాము చెక్ తీసుకోలేదు.. బల్లపై పేట్టేసి వెళ్లారని తెలిపారు. ఆ చెక్కు మాకోద్దు.. దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: చిన్నారి కేసులో కీలక మలుపు: పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు -
‘రాజు’ కోసం వేట: తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్
-
‘రాజు’ కోసం వేట: తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసులు నిందితుడు రాజు కోసం జల్లెడ పడుతున్నారు. అతడి కోసం భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అన్ని పోలీస్స్టేషన్లకు రాజు ఫొటో పంపించారు. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసు పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. విపక్షాలు విమర్శలు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. ఘటన జరిగిన వారమైనా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే.. సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ సమీక్ష చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డితో సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి హత్యాచార ఘటనపై సీఎం కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. నిందితుడిని వీలైనంత తొందరగా పట్టుకోండి అని ఆదేశించారు. చట్టపరంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు. చదవండి: నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ ఈ కేసులో డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు రాజు ఫొటోను డిసిప్లే చేయాలని ఆదేశించారు. కమిషనర్లు, ఎస్పీలు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని చెప్పారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక జంట నగరాల పరిధిలో గల్లీగల్లీని గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం వేట కొనసాగుతోంది. సీసీ కెమెరా ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్‌లో బస్సు ఎక్కినట్లు గుర్తించారు. బస్సులో వెళ్లిన రాజు ఎక్కడ దిగారో తెలుసుకుంటున్నారు. వేల సీసీ కెమెరాల ఫుటేజ్‌ను చూస్తున్నారు. టవల్‌తో పాటు టోపీని రాజు మోత్కూరు మార్గంలో పడేసినట్లు గుర్తించారు. ఒక కవర్లో తువ్వాలు, టోపీ, కల్లు సీసా, రూ.700 నగదు ఉన్నట్లు తేలింది. రాజుకు మద్యం అలవాటు ఉండడంతో అన్నీ వైన్‌షాపుల దగ్గర పోలీసులు మఫ్టీలో నిఘా ఉంచారు. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా?: రేవంత్‌రెడ్డి ఇక వీరితో పాటు నగరంతో పాటు సరిహద్దు జిల్లాల్లో రాజు కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు నిందితుడు రాజు ఫొటోలను బస్సులు, ఆటోలకు వాల్ పోస్టర్లు అంటించారు. మరికొన్ని చోట్ల నిందితుడి ఫొటో చూపిస్తూ మీకు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. రాజు ఆనవాళ్లు లభ్యం అయితే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. కొన్నిచోట్ల వాహనదారులను ఆపివేసి తనిఖీలు చేస్తున్నారు కూడా. -
బ్లాక్‌మార్కెట్‌పై సీఎం సీరియస్: హోంమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలా.. వద్దా అనే విషయంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో కరోనా సెకండ్ వేవ్, నైట్ కర్ఫ్యూ, ఔషధాల బ్లాక్‌మార్కెట్, రంజాన్ ప్రార్థనలు తదితర విషయాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా మొదటివేవ్లో పోలీసుశాఖ సమర్థంగా పనిచేసిందని, ప్రస్తుతం సెకండ్‌వేవ్‌లోనూ మరింత మెరుగ్గా పనిచేస్తోందని కితాబిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు, వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, రెమిడెసివిర్ తదితర ఇంజెక్షన్లతో సహా ఇతర అత్యవసర మందులన్నీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టంచేశారు. కొందరు ప్రజలు భయంతోనో లేదా ముందుజాగ్రత్తతోనే ఆక్సిజన్ సిలిండర్లు కొని ఇంట్లో పెట్టుకుంటున్నారని.. దీంతో సిలిండర్ల కొరత ఏర్పడే ప్రమాదముందని, అనవసరంగా కొన్న మందులు కూడా పాడైపోతాయని చెప్పారు. అదే సమయంలో కొందరు ఆక్సిజన్, రెమిడెసివిర్, ఇతర అత్యవసర మందులను నల్ల బజారులో విక్రయిస్తున్నారని, వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రాణాలు కాపాడే ఔషధాలను నల్లబజారులో విక్రయిస్తుండటంపై సీఎం సీరియస్‌గా ఉన్నారని మహమూద్ అలీ చెప్పారు. ప్రజలంతా తప్పకుండా భౌతికదూరం పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, రాచకొండ కమిషనర్ మహేశ్ భాగవత్ పాల్గొన్నారు. కాగా, సమీక్ష సమావేశం అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. ఈనెల 30వ తేదీతో నైట్ కర్ఫ్యూ ముగుస్తుంది కదా? లాక్డౌన్ పెడతారా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. రాష్ట్రంలోని పరిస్థితులపై త్వరలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. వాస్తవానికి సీఎంకు లాక్డౌన్ పెట్టడం ఇష్టం లేదని చెప్పారు. కాగా, రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ఇలాగే జాగ్రత్తలు పాటిస్తే మరో 3–4 వారాల్లో వైరస్ అదుపులోకి వస్తుందని.. అలాంటప్పుడు లాక్డౌన్ పెట్టాలనే ఆలోచనే ఉండదని పేర్కొన్నారు. -
‘సీఎం కేసీఆర్ ధైర్యవంతుడు.. త్వరలోనే కోలుకుంటారు’
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ధైర్యవంతుడని.. ఆయన, ఎసింప్టామెటిక్ కరోనా బారినుండి త్వరలోనే కోలుకుంటారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా, ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి ఈటల సూచనలు చేశారు. పట్టణప్రాంతాలతో పోలీస్తే కరోనా వ్యాప్తి గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉందని ఆయన అన్నారు. కాగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా కోసం ప్రత్యేకంగా బెడ్లు ఉన్నాయని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ప్రజలు ఇబ్బందులు పడొద్దని మంత్రి ఈటల పేర్కొన్నారు. అదేవిధంగా, కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తెలంగాణ హోమంత్రి మహముద్ అలీ నాంపల్లిలోని యూసఫెస్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజల సంక్షేమం కోసమే నైట్ కర్ఫ్యూ విధించామని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముస్లీం సోదరులు రాత్రి 9 గంటల లోపు రంజాన్ ప్రార్థనలు ముగించుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని అన్నారు. -
పచ్చదనం ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రకృతిలో పచ్చదనం ప్రాముఖ్యత, ఆవశ్యకత తెలిసిన వ్యక్తి మన సీఎం కేసీఆర్ అని, ఆరేళ్ల క్రితమే ఆయన రాష్ట్రంలో హరిత హారానికి నాంది పలికారని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. హరిత తెలంగాణగా మార్చాలనుకుంటున్న సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా ఆయన పుట్టినరోజున కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో ఎంపీ సంతోష్‌కుమార్ ప్రయాణికులకు ఔషధ మొక్కలు పంపిణీ చేశారు. కొచ్చి నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చిన శ్రీనివాస్, సుమలత దంపతులకు ఆయన మొదటి మొక్కను అందజేయగా.. పంజాబ్, ముంబై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మొక్కలను అందజేసి వాటిని బుధవారం నాటాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ సంతోష్ మాట్లాడు తూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నిర్వహిస్తున్న హరితహారం కూడా మంచి సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మూడేళ్లుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎన్నో మొక్కలు నాటినట్లు గెయిల్ (జీహెచ్ఐఏఎల్) సీఈఓ ప్రదీప్‌ఫణికర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎంకే సింగ్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణకు దేవుడిచ్చిన వరం కేసీఆర్: హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్‌ను దేవుడు బహు మతిగా ఇచ్చారని హోం మంత్రి మహమూద్ అలీ కొనియాడారు. అన్ని వర్గాల వారికి లబ్ధి కలిగేలా పథకాలు అమలు చేయడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం కేసీఆర్ సేవామండలి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జరిగిన సీఎం జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో నేరాల తగ్గుదలకు హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని చేపట్టనున్న కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహోన్నత మేధావి కేసీఆర్: నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి మాటను ఆయుధంగా చేసి సమాజాన్ని మలుపు తిప్పి అహింసతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత మేధావి సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను సాధించి, రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలిపే ప్రయత్నంలో కేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ మరింత విజయవంతం కావాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. -
వచ్చే ఏడాది 20 వేల పోస్టుల భర్తీ
సాక్షి, కంటోన్మెంట్: తెలంగాణ పోలీసు శాఖలో వచ్చే ఏడాది 20 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నార్త్‌జోన్ పరిధిలోని కార్ఖానా పోలీసుస్టేషన్ నూతన భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గడిచిన ఆరేళ్లలో 27 వేల మంది పోలీసు పోస్టులు భర్తీ చేశామన్నారు. మహిళల భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తూ షీటీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటి సంఖ్యను పెంచుతున్నామని హోం మంత్రి వెల్లడించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బోయిన్‌పల్లిలో ఆగిపోయిన నూతన పోలీసుస్టేషన్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్రంలో నేరాల నిరోధానికే ప్రాధాన్యమిస్తున్నామని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్, నగర కమిషనర్ అంజనీకుమార్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఓలేటి దామోదర్, కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు. -
అక్రమ కట్టడాలు వాళ్ల హయాంలోనివే
సాక్షి, హైదరాబాద్ : చరిత్రలో ఎన్నడూ చూడని భారీ వరదలు వచ్చాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన సమీక్షలో ప్రసంగించిన ఆయన అక్రమ కట్టడాల వల్లే వరదలు వచ్చాయని విమర్శలు చేస్తోన్న ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఇప్పడు ఆరోపణలు చేస్తోన్న నేతల హయాంలోనే అక్రమ కట్టడాలు నిర్మించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కట్టిన భవనాలన్నీ చట్టానికి లోబడి రూల్స్ ప్రకారమే కట్టిన కట్టడాలని తెలిపారు. వరద ముంపు ప్రజలకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు గ్రేటర్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. వరదల్లో నష్టపోయిన ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారిని ఆదుకుంటుందన్నారు. (ఇల్లు కోల్పోయిన వారికి రూ.లక్ష సాయం : కేసీఆర్) 1908 తర్వాత మళ్లీ అలాంటి వరదలు హైదరాబాద్‌ను ముంచెత్తాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ప్రజల్లోనూ ఉంటున్నారని తెలిపారు. 80మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని కేటీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ముఖ్యమంత్రి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. మరో మూడు, నాలుగు రోజుల పాటు వర్షసూచన ఉందని, ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. వరదల్లో ఉన్న ప్రజల కోసం మంత్రులతో సహా కార్పొరేటర్లు 24 గంటలు పనిచేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 550 కోట్లు నష్ట పరిహారం ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. (బాధితులకు ఆర్థిక సాయం) -
టీఆర్ఎస్ నేతల బాహాబాహి
సాక్షి, హైదరాబాద్ : రాంకోఠిలోని రూబీ గార్డెన్స్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం ఆదివారం రసాభాసగా మారింది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలోనే టీఆర్ఎస్ నాయకులు బాహాబాహికి దిగడం చర్చనీయాంశంగా మారింది. అసలు విషయంలోకి వెళితే.. రూబీ గార్డెన్స్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ, గోషామహల్ నియోజకవర్గ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే సమావేశం సందర్భంగా తనను వేదికపైకి ఎందుకు పిలవలేదంటూ సమావేశానికి హాజరైన ఉద్యమకారుడు ఆర్వి మహేందర్ కుమార్ నిలదీశాడు. దాంతో పక్కనే ఉన్న మరో వ్యక్తి అడ్డుచెప్పబోతే ఒకరిని ఒకరు తోసుకుంటూ హోంమంత్రి సమక్షంలోనే కొట్టుకున్నారు. దీంతో సమావేశం నిలిపివేసిన హోంమంత్రి మహమూద్ అలీ గొడవపడుతున్న నాయకుల దగ్గరకు వెళ్లి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. -
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మంత్రుల సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : నగరంలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు సమీక్షా సమావేశం నిర్వహించారు. మాసాబ్ ట్యాంక్‌లోని తలసాని ఛాంబర్లో నిర్వహించిన ఈ సమావేశానికి కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగితన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
కరోనా నుంచి కోలుకున్న మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకొని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఆయన అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే స్వల్ప అస్వస్థతతో ఉండటంతో కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్త చర్యగా మహమూద్ అలీని ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కోలుకొని ఇంటికి వెళ్లారు. అందరి ప్రార్థనలతో తాను త్వరగా కోలుకున్నానంటూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటికే ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే నమోదవుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో పనిచేసే 20 మందికి వైరస్ సోకింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విస్తృతంగా శానిటైజేషన్ పనులు ముమ్మరం చేశారు. అయితే ప్రగతి భవన్ ఉద్యోగులకు కరోనా అంశంపై ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక దేశంలో కరోనా ఉదృతి రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 20,903 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,25,439కి చేరింది. (20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి ) -
అవగాహనతోనే వేధింపులకు చెక్
సాక్షి, హైదరాబాద్ : మహిళల భద్రత–రక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, అప్పుడే వేధింపుల నివారణ సాధ్యమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ‘దిశ’ఘటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం హోంమంత్రి కార్యాలయంలో పలువురు మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపారు. మహిళల భద్రతకు అనుసరించాల్సిన వ్యూహాలు, వారిపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం చర్చించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ– షీటీమ్స్ స్వాతి లక్రా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే.. మహిళలు అదృశ్యమైన కేసుల్లో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే కేసులు నమోదు చేయాలి. పోలీస్స్టేషన్ల పరిధులతో సంబంధం లేకుండా ముందు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలి. షీటీమ్స్ మరింత బలోపేతానికి హాక్ ఐ వినియోగాన్ని పెంచేలా ప్రోత్సహించాలి. హెల్ప్లైన్లు, పోలీసు యాప్స్ వినియోగం పెరిగే లా మహిళల్లో అవగాహన కల్పించాలి. డయల్ 100, 181, 1098, 112 హెల్ప్‌లైన్ నెంబర్లను విద్యాసంస్థల్లో ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే, మెట్రో, పార్కులు, ఆటో, క్యాబ్‌ల్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ ప్రదర్శించాలి. బాలబాలికలు, ఉద్యోగులకు వేధింపులు లింగసమానత్వంపై అవగాహన తీసుకువచ్చేందుకు ఈ–లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి తేవాలి. సినిమాహాళ్లు, టీవీల్లో లఘుచిత్రాలు, స్లైడ్లు ప్రదర్శించాలి. షీటీమ్స్‌తో కలిసి విద్యాసంస్థల్లో అమ్మాయిలపై వేధింపులపై అవగాహన కల్పించే సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ. గ్రామం నుంచి జిల్లా స్థాయివరకు అంగన్వాడీ, ఆశా, సెర్ఫ్ తదితర సంఘాలను మహిళా భద్రతపై ప్రచారానికి వినియోగించాలి. పిల్లలు నడుచుకుంటున్న విధానంపై తల్లిదండ్రులతో స్కూలు ఉపాధ్యాయులు చర్చించాలి. -
ప్రియాంక చేసిన పొరపాటు వల్లే: హోం మంత్రి
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి ఉదంతంపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ప్రియాంకారెడ్డి హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. తన సోదరికి ఫోన్ చేసే బదులు బాధితురాలు 100 నంబరుకు కాల్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందని... ప్రియాంకారెడ్డి చేసిన చిన్న పొరపాటు వల్లే ఇంతటి ఘోరం జరిగిందని వ్యాఖ్యానించారు. ప్రియాంకారెడ్డి కుటుంబసభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. ప్రియాంకారెడ్డికి జరిగిన అన్యాయం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ‘షాద్‌నగర్‌లో జరిగిన ఘటన విచారకరం. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హన్మకొండలో కూడా చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకున్నాం. ప్రియాంక కేసును కూడా స్వల్పకాలంలో ఛేదించారు. నలుగురిని అరెస్టు చేశారు. లోతుగా విచారణ జరిపించి నిందితులకు శిక్ష వేయిస్తాం. ఇక్కడి పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారు. అయితే ఉన్నత విద్యనభ్యసించి కూడా ప్రియాంక ఇలాంటి పొరపాటు చేయడం విచారించదగ్గ విషయం. రాత్రి సమయంలో తన సోదరికి ఫోన్ చేసే బదులు 100కి ఫోన్ చేయాల్సింది. పోలీసులు 3 నిమిషాల్లో అక్కడికి చేరుకునే వారు. పరిస్థితి చేయిదాటి పోకుండా ఉండేది’ అని మహమూద్ అలీ పేర్కొన్నారు. కాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్డు బ్రిడ్జి కింద తగలబడిన స్థితిలో ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. నలుగురు నిందితులు పథకం ప్రకారం ప్రియాంకారెడ్డి స్కూటీ పంక్చర్ అతికిస్తామంటూ ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. లారీని అడ్డుపెట్టి అత్యాచారానికి పాల్పడి..అనంతరం హతమార్చారు. ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించారు. అత్యంత హేయమైన చర్యలకు పాల్పడిని నలుగురిని పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. నిందితులది మహబూబ్‌నగర్ జిల్లాగా గుర్తించారు. అయితే తమ ఫిర్యాదుకు వెంటనే స్పందించి ఉంటే.. ప్రియాంక ప్రాణాలతో ఉండేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా దేశ రాజధానిలో నిర్భయ ఘటనను తలపిస్తున్న ప్రియాంకరెడ్డి ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. దర్యాప్తు నివేదిక అందజేయాల్సిందిగా రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బృందాన్ని రాష్ట్రానికి పంపనుంది. నా కొడుకు అలాంటివాడు కాదు: పాషా తల్లి ప్రియాంకను రాత్రంతా చిత్రహింసలు పెట్టి.. ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు #WATCH Telangana Home Min on alleged rape&murder case of a woman veterinary doctor: We're saddened by the incident,crime happens but police is alert&controlling it. Unfortunate that despite being educated she called her sister¬ '100',had she called 100 she could've been saved. pic.twitter.com/N17THk4T48 — ANI (@ANI) November 29, 2019 -
గణేష్ ఉత్సవాలపై మంత్రి తలసాని సమీక్ష
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల నేపథ్యంలో మంత్రి తలసాని అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగరంలో వినాయక ఉత్సవాల నిర్వహణపై ప్రజా పతినిధులతో చర్చలు జరిపామని తెలిపారు. గణేష్ ఉత్సవ సమితితో పాటు అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాని,హైదరాబాద్‌లో 54 వేల వినాయక ప్రతిమలను పూజలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తారని అన్నారు. గణేష్ ఉత్సవాలను చూడటానికి దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తారని, అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం తరపున హుస్సేన్ సాగర్‌లో గంగ హారతి ఇస్తామని, హారతి ఎప్పుడనే అంశంపై పురోహితులను చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వ్యాఖ్యనించారు. నిమజ్జనం కోసం 26 చోట్ల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సోమవారం ఖైరతాబాద్ గణేష్ పనులను పరిశీలిస్తామని తెలిపారు. సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సర్వ మతాలను గౌరవించే నగరమని, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నిమజ్జనానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించామని అన్నారు. బందోబస్తు విషయంలో రాజీ పడేది లేదన్నారు. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. గతంలో ముంబైలో గణేష్ ఉత్సవాలు గొప్పగా జరిగేవని, అయితే, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. పండుగ విజయవంతంగా జరిగేలా ప్రజలు,భక్తులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. రానున్న గణేష్ ఉత్సవాల పై అన్ని శాఖలతో సమావేశం నిర్వహించామని, మునుపెన్నడూ లేని విధంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని పండుగలను ఆదరిస్తూ చాలా గొప్పగా జరుపుతున్నారని కొనియాడారు. -
లాంఛనంగా అమెజాన్ క్యాంపస్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ నెలకొల్పిన అతి పెద్ద క్యాంపస్ భవనాన్నిబుధవారం తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్, అమెజాన్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ అండ్ ఫెసిలిటీస్ డైరెక్టర్ జాన్ స్కోట్లర్ పాల్గొన్నారు. ఈ-కామర్స్ రంగంలో అతిపెద్ద సంస్థ అమెజాన్ ప్రపంచంలోనే తన అతిపెద్ద కార్యాలయాన్ని నగరంలోని నానక్ రామ్ గూడలో ఏర్పాటు చేసింది. కార్యాలయాన్ని ప్రారంభించి హోంమంత్రి మాట్లాడుతూ.. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్ తెలంగాణలోనే అతిపెద్ద బిల్డింగ్ కావడం విశేషమని, ఇది మనకు గర్వకారణమని అన్నారు. అమెజాన్ ఇండియా మేనేజర్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. 9.5 ఎకరాల్లో విస్తరించిన అమెజాన్ క్యాంపస్‌లో సుమారు 15వేల మంది పనిచేయనున్నారని వివరించారు. -
కేసీఆర్ పీఎం బనేగా
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నేటివరకు దేశంలోని మైనార్టీలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమి లేదు.. అందరు టైంపాస్ చేసి వెళ్లిపోయారు.. సీఎం కేసీఆర్ ఒక్కరే మైనార్టీల సంక్షేమం గురించి ఆలోచించారు.. వారికి పెద్ద పీట వేసి పెద్దన్నలా భరోసా ఇచ్చారు.. రాష్ట్రంలో 16 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంటే దేశంలో ఫెడరల్‌ఫ్రంట్ అధికారంలోకి వస్తుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ పీఎం అవుతారు.. అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు పాలమూరులోని మదీనా మజీద్ ప్రాంతంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలను నేరుగా కలుస్తూ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఙప్తి చేశారు. టీఆర్ఎస్ గెలుపుతోనే మైనార్టీలకు మేలు జరుగుతుందని, కుల, మత రాజకీయాలు చేస్తున్న పార్టీలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. దేశానికి వఫాదార్ కావాలి ప్రస్తుత ప్రధాని లాంటి చౌకీదార్.. రాహుల్ గాంధీ లాంటి టేకేదార్ లాంటి వ్యక్తులు దేశానికి అవసరం లేదని, సీఎం కేసీఆర్ లాంటి వఫాదార్, జిమ్మేదార్ వ్యక్తి అవసరమని మహమూద్ అలీ అన్నారు. ప్రదాని జిల్లాకు వచ్చి స్థానిక సమస్యల గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రిని విమర్శించి వెళ్లిపోయారని ఆరోపించారు. మంత్రి వెంట ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. సోలా ఎంపీ.. పీఎం పక్కా నారాయణపేట: ‘తెలంగాణ స్టేట్ మే సోలా ఎంపీ టీఆర్ఎస్ ఆద్మి జీతేగా.. సీఎం కేసీఆర్ పీఎం బనేగా.. అంటూ హోంమంత్రి మహమూద్ అలీ జోస్యం చెప్పారు. సోమవారం రాత్రి 9 గంటలకు నారాయణపేటలోని మసూమ్అలీ దర్గా వద్ద స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల ప్రచార సభకు హోంమంత్రి హాజరై మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ముస్లిం మైనార్టీలకు ఎప్పుడు డిప్యూటీ సీఎం పదవీగాని, క్యాబినేట్లో ఉన్నత మంత్రి పదవులు ఇచ్చిన దాఖాలాలు లేవని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాముఖ్యత ఇచ్చారని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో అల్లర్లు తగ్గిపోయాయన్నారు. -
5 స్థానాలు.. ఆరుగురు పోటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామనేషన్ల పర్వం ముగిసింది. మొత్తం ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. అధికార టీఆర్ఎస్ నుంచి మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లేశం బరిలోకి దిగగా.. టీఆర్ఎస్ మద్దతుతో మిత్రపక్షం ఎంఐఎం నుంచి మీర్జా రియజ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇక, ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి గుడూరు నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఈ నెల 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తన సంఖ్యాబలం ఆధారంగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను అలవోకగా గెలుచుకునే అవకాశం ఉంది. టీడీపీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే అవకాశముంది. అయితే, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండటంతో క్రాస్ ఓటింగ్ ద్వారా మొత్తం ఐదు స్థానాలు తామే గెలుచుకుంటామని టీఆర్ఎస్ ధీమాతో ఉంది. -
రాచకొండ @ నేరేడ్మెట్
సాక్షి, సిటీబ్యూరో: రాచకొండ పోలీసు కమిషనరేట్ తాత్కాలిక కార్యాలయం నేరేడ్మెట్ కేంద్రంగా అందుబాటులోకి వచ్చింది. ఆదివారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యాలయం ఏర్పాటుతో ఇటు బాధితులు, అటు పోలీసుల వ్యయ ప్రయాసలకు ఫుల్స్టాప్ పడినట్లయింది. ప్రభుత్వం 2016 జూన్ 23న సైబరాబాద్ నుంచి రాచకొండను వేరుచేసి కొత్త కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది. నాటి నుంచి ఈ కమిషనరేట్ కార్యకలాపాలు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచే కొనసాగాయి. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో సుమారు 5091.48 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నందున ఇన్నాళ్లు ఇటు బాధితులు, అటు పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యాదాద్రి జిల్లా పోలీస్ అధికారులైతే ఏదైనా సమావేశం ఉంటే దాదాపు 90 కిలోమీటర్ల ప్రయాణం చేసి సైబరాబాద్‌కు రావాల్సి వచ్చేది. ఇక శివారున ఉన్న ఎల్బీనగర్, మల్కాజ్గిరి జోన్ పోలీసులదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో నేరేడ్మెట్లో రూ.5.10 కోట్ల వ్యయంతో తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ 28 వేల చదరపు అడుగుల్లో ఆధునాతన సౌకర్యాలతో తాత్కాలిక కమిషనరేట్ కార్యాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు తప్పినా.. మేడిపల్లిలో 53 ఎకరాల్లో శాశ్వత కమిషనరేట్ కార్యాలయం వస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని రాచకొండ పోలీస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యథాతథంగా ‘ప్రజాదర్బార్’ దూర ప్రాంతాల నుంచి వచ్చే బాధితులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించిన ‘ప్రజాదర్బార్’ యధాతథంగా కొనసాగుతుంది. నేరేడ్మెట్లో తాత్కాలిక పోలీసు కమిషనరేట్ కార్యాలయం అందుబాటులోకి వచ్చినా ప్రజల సౌలభ్యం కోసం నాగోల్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ప్రతి మంగళవారం ప్రజా దర్బార్ కొనసాగించాలని కమిషనర్ నిర్ణయించారు. మూడు జిల్లాల్లో సుమారు 42 లక్షల జనాభా ఉన్న ఈ కమిషనరేట్‌లో 42 శాంతిభద్రతల ఠాణాలు, రెండు మహిళా పోలీసు స్టేషన్లు, ఆరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, మూడు సెంట్రల్ క్రైమ్ స్టేషన్లు, స్పెషల్ ఆపరేషన్ టీమ్‌లు, ఒక సైబర్ క్రైమ్ సెల్ పనిచేస్తున్నాయి. ప్రస్తుత కార్యాలయం రాకతో పాలనా సౌలభ్యంతో పాటు పూర్తిస్థాయిలో నేర నియంత్రణపై చురుకైన నిఘాకు అస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సకల సౌకర్యాలతో ఏర్పాట్లు.. ఆధునిక శైలిలో నిర్మించిన కమిషనరేట్ కార్యాలయంలో రిసెప్షన్ మర్యాద పూర్వక స్వాగతం పలికేలా హంగులద్దారు. అలాగే విజిటర్స్ లాంజ్, మెయిన్ అండ్ మినీ కాన్ఫరెన్స్ హాల్, పోలీస్ కమిషనర్, జాయింట్ కమిషనర్, డీసీపీల చాంబర్లు, కమాండ్ కంట్రోల్ రూమ్, సీసీఆర్బీ హాల్, జాబ్ వెరిఫికేషన్ హాల్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. -
‘దేశంలో లౌకిక పార్టీ ఏదన్నా ఉందంటే అది..’
నిజామాబాద్: దేశంలో లౌకిక పార్టీ ఏదన్నా ఉందంటే అది టీఆర్ఎస్ మాత్రమేనని డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ నేత మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మహమూద్ అలీ విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ కోసం 29 పార్టీల మద్ధతు కూడగట్టిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో మైనార్టీ సంక్షేమాన్ని విస్మరించారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ కష్టాలు తప్పవని చెప్పిన అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాటలు తప్పు అని నిరూపించామని అన్నారు. తెలంగాణాను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌దేనని నొక్కి వక్కాణించి చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలవదని అన్నారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపు కోసం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు 12 రోజుల పాటు పార్లమెంటులో పోరాటం కూడా చేశారని గుర్తు చేశారు. -
మహమూద్ అలీకి అస్వస్థత!
-
ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీకి అస్వస్థత!
హైదరాబాద్: ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీకి గురువారం స్వల్ప గుండెనొప్పి రావడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు రెండురోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచాల్సిందిగా కుటుంబసభ్యులకు సూచించారు. ఆయనను ఐసీయూలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. -
డిప్యూటీ సీఎం దంపతులకు స్వైన్ ఫ్లూ
తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న మహమ్మారి హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఒక్క తెలంగాణలోనే 100మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు తెలుస్తోంది. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సైతం స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నారు. మహమూద్ అలీ దంపతులిద్దరికీ స్వైన్‌ఫ్లూ సోకినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, కర్నూలు, నెల్లూరు, తిరుపతిలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు ఈ వ్యాధి వల్ల మృతిచెందిరు. మరో 12 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యాధి ఇంతగా విజృంభిస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం.. సరైన అవగాహన, నివారణ చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.