
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ధైర్యవంతుడని.. ఆయన, ఎసింప్టామెటిక్ కరోనా బారినుండి త్వరలోనే కోలుకుంటారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా, ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి ఈటల సూచనలు చేశారు. పట్టణప్రాంతాలతో పోలీస్తే కరోనా వ్యాప్తి గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉందని ఆయన అన్నారు. కాగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా కోసం ప్రత్యేకంగా బెడ్‌లు ఉన్నాయని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ప్రజలు ఇబ్బందులు పడొద్దని మంత్రి ఈటల పేర్కొన్నారు.
అదేవిధంగా, కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తెలంగాణ హోమంత్రి మహముద్ అలీ నాంపల్లిలోని యూసఫెస్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజల సంక్షేమం కోసమే నైట్ కర్ఫ్యూ విధించామని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముస్లీం సోదరులు రాత్రి 9 గంటల లోపు రంజాన్ ప్రార్థనలు ముగించుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని అన్నారు.