సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి నివాసంలో బీజేపీ ముఖ్య నేతల భేటీ ముగిసింది.
ఈ సమావేశంలో విజయశాంతి, కొండా సురేఖ, నర్సయ్య గౌడ్, విఠల్ పాల్గొన్నారు. ఈ క్రమంలో బీజేపీలో పరిణామాల(మార్పులు, చేర్పులపై) చర్చించినట్టు సమాచారం. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టార్గెట్‌గా సమావేశం జరిగినట్టు తెలుస్తోంది.
ఇక, భేటీ అనంతరం జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళతాం. జరిగిన అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళతాం. కేసీఆర్ కొన్ని లీక్‌లు ఇస్తూ మా పార్టీ కేడర్‌లో అయోమయం సృష్టిస్తున్నారు. కేసీఆర్ దుష్ర్పచారాన్ని తిప్పికొడతాం. కేసీఆర్ కుట్రలను పట్టించుకోవద్దని పార్టీ కేడర్‌కు చెబుతున్నాం. హైకమాండ్‌లో చర్చ జరిగిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయి.
లీక్స్‌పై పార్టీ కేడర్‌కు మెసేజ్ పంపేందుకే భేటీ అయ్యాం. మాది జాతీయ పార్టీ. మాకు ఓ విధానం ఉంటుంది. తెలంగాణ బీజేపీలో ఎలాంటి అసంతృప్తి లేదు. పార్టీ బలోపేతంపై చర్చించాం. కాంగ్రెస్ పార్టీతో బీఆర్‌ఎస్ పొత్తుపెట్టుకోవడం ఖాయం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: కోమటిరెడ్డితో జూపల్లి భేటీ.. వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment