సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న ఫోన్ ట్యాపింగ్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలంగాణ పోలీసులు ఇప్పటికే పలు కీలకమైన అంశాలతో కౌంటర్ దాఖలు చేశారు.
దీంతో పాటు తెలంగాణ పలు రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీల ఫోన్‌లు సైతం ట్యాపింగ్ చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు వచ్చాయి. వాటిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టనుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల్ని విచారించిన అధికారులు నిందితుల నుంచి కీలక విషయాలను రాబట్టారు. అందులో భాగంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని ఫోన్ ట్యాపింగ్ నిందితులు విచారణలో తెలిపారు.
అయితే ఈ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి.. ఇదే అంశంపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులను జారీ చేసింది. ఈ నోటీసులకు గత నెల 29న హైదరాబాద్ సీపీ బదులిస్తూ.. అఫిడవిట్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment