సాక్షి,హైదరాబాద్ : పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించారు.
ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..!
గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..!
వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్..!
డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన...దోకేబాజ్ బడ్జెట్..!
విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో
ఏమార్చిన డొల్ల బడ్జెట్..!
రైతులకు…— KTR (@KTRBRS) July 25, 2024
అయితే ఈ బడ్జెట్‌పై కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..!గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..! వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్ అని మండిపడ్డారు. డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన...దోకేబాజ్ బడ్జెట్..! విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్‌లో కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే..
రైతులకు కత్తిరింపులు. అన్నదాతలకు సున్నం..! ఆడబిడ్డలకు అన్యాయం.. మహాలక్ష్ములకు మహామోసం..! అవ్వాతాతలకు..దివ్యాంగులకు..నిరుపేదలకు...నిస్సహాయులకు మొండిచేయి..! పెన్షన్ల పెంపు మాటెత్తలేదు..! దళితులకు దగా..గిరిజనులకు మోసం. అంబేద్కర్ అభయహస్తం ఊసులేదు..శూన్యహస్తమే మిగిలింది..! బడుగు..బలహీన వర్గాలకు భరోసాలేదు..వృత్తి కులాలపై కత్తికట్టారు..!
మైనార్టీలకు ఇచ్చిన మాటలన్నీ..నీటి మూటలైనయ్..! నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..4 వేల భృతి జాడా పత్తా లేదు..! విద్యార్థులపై కూడా వివక్షే..5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేదు..! హైదరాబాద్ అభివృధిపై శ్రద్ధలేదు..మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవ్..! నేతన్నకు చేయూత లేదు..ఆటో అన్నలను అండదండ లేదు..ఆత్మహత్యపాలైన కుటుంబాలకు ఆదుకోవాలన్న మానవీయ కోణమేలేదు..! మొత్తంగా ..పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్..! అంటూ ట్వీట్‌లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment