సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కొత్త చిహ్నాన్ని ఎప్పుడు, ఎవరూ ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా? అని నిలదీశారు. రాష్ట్రలో అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా అంటూ సీఎస్ శాంతి కుమారిని ప్రశ్నించారు.
ఈ మేరకు ఎక్స్‌లో స్పందిస్తూ.. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా? అసలు ఎం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా తెలంగాణ సీఎస్ గారు?. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్‌లతో ఈ వెకిలి పనులు ఏంటి?
కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.
ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా?
అసలు ఎం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా @TelanganaCS గారు?
తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన
కాకతీయ తోరణం, చార్మినార్ లతో ఈ వెకిలి పనులు ఏంటి ?
కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన… pic.twitter.com/Pywlv8Yvt0— KTR (@KTRBRS) August 27, 2024
అసలు ఎం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా
@TelanganaCS
గారు?
తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన
కాకతీయ తోరణం, చార్మినార్ లతో ఈ వెకిలి పనులు ఏంటి ?
కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది.
ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు?
ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను
Comments
Please login to add a commentAdd a comment