
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం చేస్తోందని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు.
‘కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ ఏం పొడుస్తున్నట్లు? విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా; నిమ్స్‌లో పేద పిల్లల హాహాకారాలు వినిపించడం లేదా? పది రోజులుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమై...పేదల పిల్లలు గోడుగోడునా ఏడుస్తుంటే. కనీసం సమీక్ష అయినా నిర్వహించారా?
విద్యాశాఖను అంటిపెట్టుకొని 11 నెలల్లో మీరు పీకిందేమిటి.. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులను అవస్థలకు గురి చేస్తిరి.. గురుకులాలకు తాళం పడేలా చేస్తిరి. ప్రాథమిక పాఠశాలలకు శీతాకాలంలోనే ఒంటిపూట పెడితిరి. కాంగ్రెస్ వచ్చింది. సకల జనులను కన్నీళ్లు పెట్టిస్తోంది. మార్పుకు ఓటేసిన ఫలితం.. తెలంగాణను వెంటాడుతోంది పాపం’ అంటూ కేటీఆర్ సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం...
విద్యార్థుల ప్రాణాలతో సర్కార్ చెలగాటం..
కేసీఆర్ పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?
వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ ఏం పొడుస్తున్నట్లు?
విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి… pic.twitter.com/LzPM7xzouS— KTR (@KTRBRS) November 7, 2024
Comments
Please login to add a commentAdd a comment