సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో విపక్షాలకు అన్యాయం జరిగిందని, అందుకే నిరసన తెలియజేసేందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశ వ్యాప్తంగా చర్చ జరిగేందుకే నీతి ఆయోగ్ బహిష్కరించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ బడ్జెట్‌లో హైదరాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. జీహెఎంసీ, వాటర్ బోర్డు, మెట్రోలకు ప్రభుత్వం ఆర్థిక ఊతం ఇచ్చిందన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు ఏం తెచ్చారని ప్రశ్నించారు. టూరిజం మంత్రిగా ఉన్నా కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమి లేదని విమర్శించారు.
కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి..
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఉపయోగం లేదని, పైసా ఇవ్వకుండా ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం మూర్ఖత్వమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
‘కేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్‌కు ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. అయినా సహకారం లేదు. గంగా ప్రక్షాళనకు బడ్జెట్ కేటాయింపులు చేసిన కేంద్రం, మూసీ అభివృద్ధికి ఎందుకు ఇవ్వరు.. కారణం లేకుండా కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెళ్లలేదు.
గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా?
తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టకపోవడం వల్ల భారీ నష్టం జరిగింది. గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా. మేడిగడ్డ దగ్గర నీరు పంప్ చేసే అవకాశం లేదని ఎన్డీఎస్‌ఏ చెప్పింది. కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నారు. ఆయన హుకుంలకు, అల్టిమేటంకు బయపడేది లేదు.
Comments
Please login to add a commentAdd a comment