కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న మాట నిజమే: ఈటల | Etela Rajender Sensational Comments On KCR, Says BRS President KCR Wanted To Join NDA - Sakshi
Sakshi News home page

చీటింగ్‌లో కేసీఆర్ నెంబర్ వన్.. ఆ కుట్రలన్నీ నాకు తెలుసు: ఈటల ధ్వజం

Published Wed, Oct 4 2023 3:09 PM | Last Updated on Wed, Oct 4 2023 3:38 PM

Etela Rajender Slams KCR Says BRS President Wanted To Join NDA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్‌ ఎన్డీయేలో చేరాలనుకున్న మాటల వాస్తమేనని అన్నారు. విశ్వాసానికి మారుపేరు ప్రధాని మోదీ అయితే.. విశ్వాస ఘాతుకానికి మారుపేరు సీఎం కేసీఆర్‌ అని విమర్శించారు. కవితను గెలిపిస్తే వంద రోజుల్లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న కేసీఆర్‌.. ఈనాటికి కూడా ఫ్యాక్టరీ ఓపెన్‌ కాలేదని మండపడ్డారు

2016 వరకు ఒక్కపైసా ఖర్చు చేయలే
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టలేదని.. అయినా తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా ప్రధాని మోదీ ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేశారని ఈటల ప్రశంసించారు. 2005లో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో సిద్దిపేట–సికింద్రాబాద్ రైల్వే లైన్‌ కోసం అప్పటి రైల్వేశాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ రూ. 350 కోట్ల రూపాయలు పెట్టారని, అయితే  2016 వరకు ఒక్కపైసా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు.

గృహలక్ష్మీ పథకం పైసలు ఇచ్చే టైం ఉందా?
ప్రధాని మోదీ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే సిద్ధిపేట- సికింద్రాబాద్‌ రైల్వే లైన్‌ పూర్తి చేసిందన్నారు ఈటల రాజేందర్‌. బాధ్యత కలిగిన మంత్రి హరీష్‌ రావు..ప్రధాని ప్లెక్సీ చించేశారని, టీవీని పగలగొట్టి కుసంస్కారానికి ఒడిగట్టారని మండిపడ్డారు. గృహలక్ష్మీ పథకం కింద మూడు లక్షల రూపాయలు ఇచ్చే టైం ఉందా అని ప్రశ్నించారు. కండువా కప్పుకుంటే.. బీసీ బంధు ఇస్తామని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మాటలు విని మోసపోతే గోస పడతారని అన్నారు.
చదవండి: బీఆర్ఎస్ పార్టీలో చీలికలు ఖాయం: బండి సంజయ్‌

హుజురాబాద్‌లో 6‌‌00 కోట్ల ఎలా ఖర్చు పెట్టారు?
‘ప్రధానిని టూరిస్ట్.. చీటర్ అని అంటున్నారు. దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్‌కు కర్రుకాల్చి వాత పెట్టారు. రూ, 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్ని కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు. దళితుడిని సీఎం చేస్తామని ఎందుకు చేయలేదు. చీటింగ్‌లో కేసీఆర్ నెంబర్ వన్. కరప్షన్ ఫ్రీ స్టేట్ అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రూ. 900 కోట్ల రూపాయల వైట్ మనీ ఎలా వచ్చింది. హుజురాబాద్‌లో 6‌‌00 కోట్ల ఎలా ఖర్చు పెట్టారు.?

ఇరువైళ్లుగా కేసీఆర్ చేతిలోనే!
ప్రధాని సమాచారం లేకుండా మాట్లాడతారా ?  దేశంలో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత డబ్బులు పంపించారో తెలియదా?. ఎన్నికల ఖర్చులు చూసుకుంటాను.. తనకు మద్దతు ఇవ్వాలని కొన్ని రాజకీయ పక్షాలను కోరిన మాట వాస్తవం కాదా?. దళితుడికి ఎస్సీ వెల్ఫెర్ , బీసీకి బీసీ వెల్ఫెర్ మంత్రి పదవులు ఇచ్చి సరిపెడతారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇరువైళ్లుగా కేసీఆర్ చేతిలోనే ఉంది. భవిష్యత్‌లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు. 

ఎన్ని కుట్రలు చేశారో నాకు తెలుసు
ముఖం బాగాలేక అద్దం పగలకొట్టుకున్నట్లు ఉంది కేసీఆర్ తీరు. గురువింద గింజ నలుపు ఎరగనట్లు ఉంది సీఎం తీరు. గిరిగీసి బరిలో కొట్లడటానికి బీజేపీ సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అపసవ్యంగా నడుస్తుందనే నరేంద్రమోదీ కేసీఆర్‌ను దూరం పెట్టారు.  2018 లో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ ఎందుకు వెళ్లాలో చెప్పాలి. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఓడించడానికి ఎన్ని కుట్రలు చేశారో నాకు తెలుసు’ అని ఈటల వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement